sunder pichai
-
‘దిగిపోవాల్సిందే’.. సుందర్ పిచాయ్‌కు ‘జెమినీ’ గండం!
గూగుల్ (Google) తన బార్డ్ చాట్‌బాట్‌ని ఇటీవల జెమినీ (Gemini)గా పేరు మార్చింది. అట్టహాసంగా దీన్ని ప్రారంభించినప్పటికీ వరుస వైఫల్యాలు, వివాదాలతో ఈ సెర్చ్ ఇంజిన్ దిగ్గజంలో గందరగోళం చెలరేగింది. ఈ వ్యవహారం ఇప్పుడు కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ మెడకు చుట్టుకున్నట్లు కనిపిస్తోంది. జెమిని వివాదం నేపథ్యంలో ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ తొలగింపును ఎదుర్కోవాల్సి ఉంటుందని లేదా త్వరలో పదవీ విరమణ చేయవచ్చని అంచనా వేస్తున్నట్లు ప్రముఖ ఇన్వెస్టర్, హెలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు సమీర్ అరోరా తెలిపారు. ఏఐ చాట్‌బాట్ జెమిని చుట్టూ తిరుగుతున్న వివాదాలపై ఒక యూజర్ తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు అరోరా మైక్రో-బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “నా అంచనా ప్రకారం ఆయన్ను (సుందర్ పిచాయ్) తొలగించాలి లేదా ఆయనే రాజీనామా చేయాలి. ఏఐ విషయంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. బాధ్యతలను ఇతరులకు అప్పగించాలి" అన్నారు. ఏంటీ జెమినీ? గూగుల్ ఇటీవల తన చాట్‌బాట్ బార్డ్‌ను జెమినీగా రీబ్రాండ్ చేసింది. గ్లోబల్ యూజర్ల కోసం ఈ కృత్రిమ మేధస్సు (AI) సాధనాన్ని అధికారికంగా ప్రారంభించింది. 230 కంటే ఎక్కువ దేశాలు, భూభాగాలలో విస్తరించి ఉన్న 40 భాషలలో యూజర్లు ఇప్పుడు జెమిని ప్రో 1.0 మోడల్‌తో ఇంటరాక్ట్ అవ్వొచ్చని టెక్ దిగ్గజం పేర్కొంది. వివాదాలు ప్రారంభించిన వారంలోపే జెమినీ ఏఐకి లింక్ చేసిన గూగుల్ కొత్త ఏఐ ఇమేజ్-జనరేటర్ చుట్టూ వివాదాలు తలెత్తాయి. ఏపీ నివేదిక ప్రకారం.. ఈ ఏఐ టూల్ వైఫల్యాన్ని అంగీకరిస్తూ ఫిబ్రవరి 23న గూగుల్ క్షమాపణ చెప్పింది. ఈ ఆందోళనలను పరిష్కరించడానికి చాట్‌బాట్ ఇమేజ్ జనరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ సెర్చ్ ఇంజన్, ఇతర వ్యాపారాలను పర్యవేక్షిస్తున్న సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రాఘవన్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో యూజర్లకు క్షమాపణలు తెలిపారు. ఇక భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించిన ఒక ప్రశ్నకు జెమినీ ఇచ్చిన సమాధానాల్లో పక్షపాతం ఉందన్న ఆరోపణలపై ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్‌కు నోటీసు జారీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. My guess is he will be fired or resign- as he should. After being in the lead on AI he has completely failed on this and let others take over. — Samir Arora (@Iamsamirarora) February 25, 2024 -
ఆ సీఈవో వేతనం రోజూ రూ.5 కోట్లు..!
కార్పొరేట్ సంస్థల్లో చిన్న ఉద్యోగి నుంచి మొదలుకుని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వరకు అందరూ కీలకమే. కానీ వారి బాధ్యతలను అనుసరించి వారికి చెల్లించే వేతనాల్లో తేడా ఉంటుంది. ప్రతి కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ (సీఈఓ)ల అత్యంత కీలకం.. కంపెనీ అభివృద్ధి సాధించే వ్యూహ రచనలోనూ, ఆదాయం పెంపులోనూ, సిబ్బంది పనితీరు మెరుగు పర్చడంతోపాటు సాధక బాధకాలు తీర్చడంలోనూ సీఈఓలే కీలకం. ఇక ఐటీ, టెక్ సంస్థల సీఈఓలైతే వేరే చెప్పనక్కర్లేదు. సంస్థ పురోగతి సాధించడంలో ఎంతో ముఖ్య భూమిక పోషించే వారి వేతనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అమెరికాలో 2023 సంవత్సరానికిగాను అత్యధిక వేతనాలు అందుకున్న సీఈఓల్లో సుందర్ పిచాయ్, బ్యారీ మైక్ కార్తీ, టిమ్ కుక్ తదితరులు ఉన్నారు. గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓ సుందర్ పిచాయ్ వేతనం అక్షరాల 226 మిలియన్ డాలర్లు(రూ.1800 కోట్లు). దాంతో ఆయన రోజూ రూ.5 కోట్లు వేతనం పొందుతున్నారు. అమెరికాలోని కార్పొరేట్ సంస్థల సీఈఓల వేతనంతో పోలిస్తే సుందర్ పిచాయ్ వేతనం అత్యధికం. అతిపెద్ద కార్ల రెంటల్ కంపెనీల్లో హెర్ట్జ్ ఒకటి. దాని సీఈఓ స్టీఫెన్ స్కెర్ వేతనం 182 మిలియన్ డాలర్లు(రూ.1500 కోట్లు). అమెరికన్ ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ కంపెనీ పెలోటాన్ ఇంటర్ యాక్టివ్ సంస్థ సీఈఓగా బ్యారీ మైక్ కార్తీ ఉన్నారు. ఆయన వార్షిక వేతనం 168 మిలియన్ డాలర్లు(రూ.1400 కోట్లు). ఇదీ చదవండి: ‘ఎవరు చనిపోయినా అవి మాత్రం ఆగవు’ అమెరికాలో లైవ్ నేషన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సీఈఓగా మిచెల్ రాపినో పని చేస్తున్నారు. ఆయన వార్షిక వేతనం 139 మిలియన్ డాలర్లు(రూ.1100 కోట్లు). గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పినారెస్ట్ ఒకటి. దీనికి విలియం రెడీ సీఈఓగా పని చేస్తున్నారు. ఆయన వార్షిక వేతనం 123 మిలియన్ డాలర్లు(రూ.1000 కోట్లు). ప్రపంచంలోకెల్లా అతిపెద్ద టెక్ దిగ్గజం ఆపిల్. దీనికి సీఈఓగా పని చేస్తున్న టిమ్ కుక్ వార్షిక వేతనం 99 మిలియన్ డాలర్లు(రూ.825 కోట్లు). -
సుందర్ పిచాయ్‌పై గూగుల్ మాజీ ఉద్యోగి ఘాటు వ్యాఖ్యలు
గూగుల్ మాజీ ఉద్యోగి ఒకరు అల్పాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌పై ఘాటు విమర్శలు చేయడం చర్చకు తెరతీసింది.. దార్శనిక నాయకత్వం లేకపోవడమే కంపెనీ క్షీణతకు దారి తీసిందని విమర్శించారు. విజనరీ లేని లీడర్షిప్, నైతిక ప్రమాణాలు దిగజారిపోయాయంటూ అంటూ సుందర్ పిచాయ్‌పై అసంతప్తి వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్‌లు సిబ్బంది మధ్య పారదర్శకతను గూగుల్ నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఒకపుడు సంస్థ కోసం, వినియోగదారుల ప్రయోజనాలకు తీసుకునే నిర్ణయాల కాస్త ఇపుడు ఎవరు నిర్ణయం తీసుకుంటున్నారో వారి ప్రయోజనాలుగా మారిపోయాయంటూ ధ్వజమెత్తారు. గూగుల్ పాతికేళ్ల ప్రస్థానంలో 18 ఏళ్లు పనిచేసిన తాను ఈ నెలలో కంపనీకి రాజీనామా చేసినట్టు ఇయాన్ హిక్సన్ ప్రకటించారు. ఈ సందర్భంగా తన బ్లాగ్‌పోస్ట్‌లో సుందర్ పిచాయ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సంస్థలో భారీగా ఉద్యోగులు తొలగింపు, నైతిక ప్రమాణాలు, కల్చర్ లాంటి అంశాలను తన పోస్ట్‌లో ప్రస్తావించారు. విజనరీ లేని పిచాయ్ నాయకత్వంలో గూగుల్ సంస్కృతి క్షీణించి పోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంపెనీలో చేరిన తొలి రోజులు బావుండేవని, ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతుడినని పేర్కొన్నారు. సంస్థలో కీలక ఎగ్జిక్యూటివ్‌లు సిబ్బందితో నిజాయితీగా, పారదర్శకంగా ఉండేవారు. ప్రతిష్టాత్మక ప్రయోగాలకు ప్రోత్సాహమిచ్చేవాంటూ రాసుకొచ్చారు. తొలి తొమ్మిదేళ్లు Googleలో HTMLలోనూ, చివరి తొమ్మిదేళ్లు గూగుల్‌లో యాప్‌లను అభివృద్ధి చేసే ప్లాట్‌ఫారమ్ ఫ్లట్టర్లో పని చేశానంటూ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కానీ ఇపుడు గూగుల్‌లో కంపెనీ విజన్ ఏమిటో వివరించే చెప్పగలిగే వాళ్లెవరైనా ఉన్నారా అనే సందేహాన్ని కూడా ఆయన వెలిబుచ్చారు. నైతికత అంతంత మాత్రంగానే ఉందన్నారు. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని థెరపిస్ట్‌లతో మాట్లాడితే, వారు తమ Google క్లయిట్లందరూ అసంతృప్తిగా ఉన్నారనే విషయం అర్థమవుందని రాసుకొచ్చారు. ఈ సమస్యంతా పిచాయ్ విజనరీ లేని లీడర్షిప్ కారణంగానే ఉత్పన్నమైందనీ, అసలు ఆయనకు ప్రారంభ గూగుల్ ప్రమాణాలను పాటించడంపై ఏ మాత్రం ఆసక్తి లేదంటూ ధ్వజమెత్తారు. ఇది అసమర్థమైన మిడిల్ మేనేజ్మెంట్ వ్యాప్తికి దారితీసిందన్నారు. ఈ సందర్భంగా ఫ్లట్టర్, డార్ట్, ఫైర్‌బేస్ వంటి ప్రాజెక్టులను కవర్ చేసే విభాగాన్ని నిర్వహిస్తున్న జీనైన్ బ్యాంక్స్‌పై మండిపడ్డారు. అయినా కంపెనీ వృద్ధిపై ఆశాభావాన్ని వ్యక్తం చేసిన హిక్సన్, నాయకత్వ స్థాయిలో కొంత 'షేక్-అప్' అవసరమని సూచించారు. దీర్ఘకాలిక, స్పష్టమైన వైఖరితో ఉన్న వారికి అధికారాన్ని అప్పగిస్తే, కంపెనీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుదని వ్యాఖ్యానించారు. అయితే హిక్సన్ వ్యాఖ్యలపై గూగుల్ ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయ లేదు. -
మనసున్న సీఈవో! ఉద్యోగుల కోసం ఏం చేశాడో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఓవైపు లేఆఫ్‌లు.. మరోవైపు తక్కువ జీతాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా కంపెనీల్లో జీతాల పెంపు లేక ఎంప్లాయీస్ అవస్థలు పడుతున్న తరుణంలో ఓ కంపెనీ సీఈవో తీసుకున్న నిర్ణయం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసుకుందాం.. సతీష్ మల్హోత్రా (Satish Malhotra).. అమెరికన్ స్పెషాలిటీ రిటైల్ చైన్ కంపెనీ ‘ది కంటైనర్ స్టోర్’కు సీఈవో (CEO). తమ కంపెనీలోని ఇతర ఉద్యోగులకు వేతనాల పెంపునకు, ఖర్చులను తగ్గించడంలో సహాయపడటానికి తన జీతాన్ని స్వచ్ఛందంగా 10 శాతం తగ్గించుకున్నారు. సతీష్ 2021 ఫిబ్రవరి నుంచి కంపెనీ సీఈవోగా ఉన్నారు. గతంలో ఆయన ప్రపంచ ప్రఖ్యాత కాస్మెటిక్స్ చైన్ సెఫోరాలో 20 ఏళ్లు పనిచేశారు. ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం.. ఆరు నెలల కాలానికి మల్హోత్రా వార్షిక జీతం 925,000 డాలర్ల (రూ. 7.68 కోట్లు) నుంచి 8,32,500 డాలర్లకు (రూ. 6.9 కోట్లు) తగ్గుతుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. కాగా గత సంవత్సరం మల్హోత్రా 2.57 మిలియన్ డాలర్ల (రూ. 21.35 కోట్లు) వేతన పరిహారాన్ని అందుకున్నారు. అయితే ఉద్యోగులకు సగటు పెంపుదల ఎంత ఉంటుందనేది కంపెనీ స్పష్టం చేయలేదు. కంటైనర్ స్టోర్ దాని ఇటీవలి త్రైమాసిక ఫలితాలలో 10.1 మిలియన్ డాలర్ల సర్దుబాటు చేసిన నికర నష్టాన్ని నివేదించింది. గూగుల్, యాపిల్ సీఈవోల సరసన.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ (Apple CEO Tim Cook), గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai)తో పాటు ఈ ఏడాది భారీగా వేతనాలు తగ్గించుకున్న సీఈవోల జాబితాలో సతీష్ మల్హోత్రా కూడా చేరారు. ఈ ఏడాది జనవరిలో 12,000 తొలగింపులను ప్రకటించిన 10 రోజుల తర్వాత తనతో సహా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి కంటే పైస్థాయి ఎగ్జిక్యూటివ్‌లందరూ తమ వార్షిక బోనస్‌ను గణనీయంగా తగ్గించుకుంటున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఇక యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2023 సంవత్సరానికి తన వేతన పరిహారాన్ని 50 శాతం తగ్గించుకున్నారు. -
గూగుల్ గుడ్‌న్యూస్.. భారత్‌లో గ్లోబల్ ఆపరేషన్స్ సెంటర్
అమెరికా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ శుభవార్త చెప్పింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం భారత్‌లోని గుజరాత్లో గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. మోదీ విజన్ గొప్పది మోదీ ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా ఫ్లాగ్షిప్ క్యాంపెయిన్‌ను, దీనిపై ప్రధాని మోదీ దార్శనికతను సుందర్ పిచాయ్ ప్రశంసించారు. ‘యూఎస్‌లో చరిత్రాత్మక పర్యటన సందర్భంగా ప్రధాని మోదీని కలవడం గౌరవంగా ఉంది. భారత్ డిజిటలైజేషన్ ఫండ్‌లో గూగుల్ 10 బిలియన్ డాలర్లు ( సుమారు రూ. 82 వేల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రధాని మోదీతో పంచుకున్నాం. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో మా గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తున్నాం’ అని పిచాయ్ చెప్పినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది. గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. ఇది గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లో ఉంది. ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా విజన్ రానున్న భవిష్యత్‌కు బ్లూప్రింట్‌గా తాను భావిస్తున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు. కాగా సుందర్ పిచాయ్‌తోపాటు రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, యాపిల్ సీఈవో టిమ్ కుక్ తదితరులు భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్‌లను కలిసిన వ్యాపారవేత్తలలో ఉన్నారు. ఇదీ చదవండి: వైట్‌హౌస్‌లో మెరిసిన అంబానీ దంపతులు.. -
లేఆఫ్స్ ఆందోళనల మధ్య: గూగుల్ సీఈవో షాకింగ్ వేతనం
న్యూఢిల్లీ: గ్లోబల్‌గా లేఆఫ్స్ కొనసాగుతున్న వేళ గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ పారితోషికం చర్చనీయాంశంగా మారింది. టెక్ దిగ్గజం గూగుల్‌లో ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలోనే ఆయన ఏకంగా 226 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,854 కోట్లు) పారితోషికం తీసుకున్నారన్న వార్త సంచలనంగా మారింది. (అక్షయ తృతీయ 2023: టన్నుల కొద్దీ విక్రయాలు, ఏడాదిలో షాకింగ్ ధరలు) ఆల్ఫాబెట్ శుక్రవారం రెగ్యులేటరీకి వెల్లడించిన ప్రకారం సుందర్ అందుకున్న పారితోషికంలో 218 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డ్స్ కూడా ఉన్నట్టు తెలిపింది. దీని ప్రకారం గతేడాది సుందర్ పారితోషికం గూగుల్ సగటు ఉద్యోగి వేతనం కంటే దాదాపు 800 రెట్లు పెరిగింది. కాగా జనవరిలో ప్రపంచవ్యాప్తంగా 12వేల ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థికంగా పరిస్థితుల నేపథ్యంలో తొలగింపులు తప్పవని గూగుల్ అప్పట్లో ప్రకటించింది. ఇది కంపెనీ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 6 శాతానికి సమానం. అలాగే ఈ నెల మొదట్లో లండన్‌లోని గూగుల్ ఉద్యోగులు లేఆఫ్స్‌కు నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. -
గూగుల్‌లో మరో రౌండ్ తొలగింపులు తప్పవా? సుందర్ పిచాయ్ కీలక సంకేతాలు
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగాలపై వేటు వేయనుందా అంటే అవుననే సంకేతాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. జనవరిలో మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఆరు శాతం లేదా 12వేల మంది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన గూగుల్ ఇపుడు రెండో రౌండ్‌కు సిద్ధమవుతోంది. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండో రౌండ్ తొలగింపులు ఉండవచ్చని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సూచనప్రాయంగా తెలిపారు. త్వరలో మరిన్ని తొలగింపులు జరగ వచ్చని పిచాయ్ వ్యాఖ్యానించడంతో గూగుల్ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. (ఇదీ చదవండి: MG Comet EV: ఎంజీ స్మార్ట్ కాంపాక్ట్ కామెట్ ప్రొడక్షన్ షురూ, లాంచింగ్ సూన్!) కంపెనీలో త్వరలో మరిన్ని తొలగింపులు ఉండవచ్చని ఇంటర్వ్యూలో పిచాయ్ వెల్లడించినట్టు తెలుస్తోంది. అయితే ఏ ఏ విభాగాలు, ఏంతమంది ప్రభావితమవుతా రనేది ప్రస్తావించలేదు. కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్ బార్డ్, జీమెయిల్, గూగుల్ డాక్స్‌పై కీలక ప్రాజెక్టులు కొనాసగుతున్నాయనీ, వీటిలో ఇంకా చాలా పనిచేయాల్సి ఉందని చెప్పారు. దీనికనుగుణంగానే తమ సిబ్బందిని అధిక ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టుల్లోకి తరలిస్తున్నామని పేర్కొన్నారు. కంపెనీ సామర్థ్యాన్ని 20 శాతం ఎలా పెంచనున్నారనే ప్రశ్నకు సమాధానమిస్తూ, కంపెనీలో జరుగు తున్న ప్రతీ అంశాన్ని పరిశీలిస్తున్నామనీ, అభివృద్ధి జరిగినా మరిన్ని పనులు చేయాల్సి ఉందని ఉద్ఘాటించారు. ఖర్చులను సమీక్షించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీంతో మరోసారి తొలగింపులు అంచనాలు టెక్ వర్గాల్లో నెలకొన్నాయి. -
సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు
న్యూఢిల్లీ: ప్రపంచ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల ఊచకోత తీవ్ర కలవరం పుట్టిస్తోంది. ముఖ్యంగా ట్విటర్, మెటా, గూగుల్ తదితర దిగ్గజ కంపెనీలు కూడా భారీగా లేఆఫ్స్ ప్రకటించడం ప్రస్తుత సంకక్షోభం పరిస్థితికి అద్దుపడుతోంది. ఈ ఆర్థిక సంక్షోభం ఉద్యోగాల తీసివేత నేపథ్యంలో గూగుల్ ఉ ద్యోగులు సీఈవోకు సుందర్ పిచాయ్‌కి బహిర లేఖ లేశారు. కొన్ని కీలక డిమాండ్లతో రాసిన ఈ లెటర్ హాట్ టాపిక్‌గా నిలిచింది. గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఇంక్.లో దాదాపు 1,400 మంది ఉద్యోగులు ఈ బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చేలా లేఆఫ్ ప్రక్రియలో మెరుగైన విధానాల్ని పాటించాల కోరుతూ పిటిషన్‌పై వీరంతా సంతకం చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలక డిమాండ్లను చేయడం గమనార్హం. అయితే ఈ లేఖపై ఆల్ఫాబెట్ ప్రతినిధి ఇంకా స్పందించలేదు. గూగుల్ సీఈవోకు ఉద్యోగులకు రాసిన లేఖలో ముఖ్యంగా కొత్త నియామకాలను స్తంభింప జేయడం, తొలగింపులకు ముందు స్వచ్ఛంద తొలగింపులను కోరడం, ఉద్యోగ ఖాళీల భర్తీకి తొలగించిన ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని, మెటర్నిటీ, బేబీ బాండింగ్ వంటి సెలవుల్లో ఉన్న వారిని అర్థాంతరంగా తొలగించకుండా, వారి షెడ్యూల్డ్ సెలవులను పూర్తి చేయడానికి అనుమతించడం వంటి అనేక డిమాండ్లను ఇందులో ఉద్యోగులు చేశారు. దీనికి తోడు ఉక్రెయిన్, రష్యా వంటి యుద్ధ సంక్షోభ ప్రాంతాలకు చెందిన తోటి ఉద్యోగులను తొలగించవద్దని కూడా విజ్ఞప్తి చేశారు. అలా చేయటంతో అక్కడి ఉద్యోగులు వీసా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. సంక్షోభ ప్రాంతాలకు చెందిన ఉద్యోగులకు అదనపు సహాయాన్ని కంపెనీ అందించా లన్నారు. లింగ, జాతి, కుల, వయస్సు, మతం, వైకల్యాలు లాంటి వివక్షలు లేకుండా ఉద్యోగుల పట్ల వ్యవహరించాలని ఉద్యోగులు తమ లేఖలో సుందర్ పిచాయ్ ని కోరారు. కంపెనీ 12వేల ఉద్యోగాలను తీసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ లేఖ చర్చకు దారి తీసింది. -
సుందర్ పిచాయ్.. మాకు న్యాయం చేయండి
తమకు న్యాయం చేయాలని కోరుతూ గూగుల్ తొలగించిన ఉద్యోగులు ఏకంగా సీఈవో సుందర్ పిచాయ్కే బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖపై దాదాపు 1,400 మంది ఉద్యోగులు సంతకాలు చేయడం గమనార్హం. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ లేఆఫ్ ప్రక్రియలో భాగంగా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం.. ఇక ఇదే మూడో అతిపెద్ద బ్యాంక్! పలు డిమాండ్లు: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు రాసిన ఈ బహిరంగ లేఖలో ఉద్యోగులు పలు డిమాండ్లు చేశారు. కొత్త నియామకాలను స్తంభింపజేయడం, నిర్బంధంగా తొలగించడం కాకుండా ఉద్యోగులు స్వచ్ఛందంగా తప్పుకునేలా కోరడం, కొత్త నియామకాల్లో తొలగించిన ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వడం, నిర్ణీత వ్యవధి వరకూ ఉద్యోగులను తొలగించకుండా కొనసాగించడం వంటి డిమాండ్లను సీఈవో ముందు ఉంచారు. సంక్షోభాలతో సతమతమవుతున్న ఉక్రెయిన్ వంటి దేశాలకు చెందిన ఉద్యోగులను ఉద్వాసన నుంచి మినహాయించాలని కోరారు. అలాగే ఉద్యోగ తొలగింపు వల్ల వీసా లింక్డ్ రెసిడెన్సీని కోల్పోయే ప్రమాదం ఉన్నవారిని ఆదుకోవాలని అభ్యర్థించారు. ఇదీ చదవండి: ఇంత తిన్నావేంటి గురూ.. పిజ్జాల కోసం డామినోస్ మాజీ సీఈవో ఖర్చు ఎంతో తెలుసా? అయితే ఈ బహిరంగ లేఖపై ఆల్ఫాబెట్ ప్రతినిధి స్పందించలేదు. గత జనవరిలో సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగాల కోతలను ప్రకటించినప్పుడు ముందెన్నడూ లేని కష్టతరమైన ఆర్థిక పరిస్థతిని ఎదుర్కొంటున్నామని, దీనికి తాను పూర్తి బాధ్యత తీసుకుంటున్నానని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో పేర్కొన్నారు. లేఖ వెనుక యూనియన్లు: ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్, యునైటెడ్ టెక్ అండ్ అలైడ్ వర్కర్స్, యూఎన్ఐ గ్లోబల్‌తో సహా పలు యూనియన్లు ఈ బహిరంగ లేఖ వెనుక ఉన్నాయి. కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో పిచాయ్‌కి భౌతికంగా లేఖను అందించడానికి కొన్ని రోజుల ముందే ఈ లేఖను సర్క్యులేట్ చేయాలని ప్రణాళిక వేసుకున్నట్లు తెలిసింది. -
గూగుల్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఈసారి ఆ భాగ్యం కొందరికే!
అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దిగ్గజ టెక్ కంపెనీలు లేఆఫ్‌లను అమలు చేస్తూ వందలకొద్దీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గూగుల్ కూడా ఇటీవలి కాలంలో అనేకమంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ప్రమోషన్ల విషయంలోనూ గూగుల్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో కంటే ఈ ఏడాది తక్కువ ప్రమోషన్లు ఉంటాయని ఉద్యోగులకు గూగుల్ సమాచారం అందించినట్లు సీఎన్‌బీసీ కథనం పేర్కొంది. ప్రమోషన్లు కొందరికే... ప్రమోషన్ల ప్రక్రియ గతంలో మాదిరిగానే మేనేజర్ల నేతృత్వంలో ఉండనుంది. అయితే నియామాలు పెద్దగా చేపట్టకపోవడంతో ఈ ఏడాది ప్రమోషన్లు కూడా తక్కువ సంఖ్యలోనే ఉంటాయని పేర్కొంది. అది కూడా ఎల్ 6, ఆపై స్థాయిలోనే ప్రమోషన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. గూగుల్ తీసుకొచ్చిన కొత్త పనితీరు సమీక్ష వ్యవస్థ ప్రకారం సీనియర్లు, నాయకత్వ స్థాయిలో తగినంతమంది ఉద్యోగులు ఉండాలి. అందుకు అనుగుణంగా ఈ ప్రమోషన్లు ఉంటాయని యాజమాన్యం ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో స్పష్టం చేసినట్లు సమాచారం. కంపెనీలో మధ్య స్థాయిలో పనిచేసే ఉద్యోగులే కీలకం.. ప్రమోషన్లపై వారిలో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం కంపెనీ గత ఏడాదే ఒక అంతర్గత సర్వేను కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రమోషన్ల కోసం మార్చి 6 నుంచి 8 తేదీల మధ్య స్వయంగా నామినేట్ చేసుకోవచ్చని గూగుల్ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్ లో పేర్కొంది. ఆర్థిక సంక్షోభం కారణంగా గూగుల్ భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. ఈ క్రమంలో జనవరిలో ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. అయితే తొలగించిన ఉద్యోగులకు స్థానిక చట్టాలకు అనుగుణంగా పరిహారాలను అందిస్తున్నట్లు అప్పట్లో ఆయన వెల్లడించారు. -
గూగుల్ బార్డ్ అంటే సెర్చ్ మాత్రమే కాదు.. అంతకు మించి..
గూగుల్ బార్డ్ ఏఐ అంటే కేవలం సెర్చ్ మాత్రమే కాదని, అంతకు మించి అని గూగుల్ స్పష్టం చేసింది. చాట్ జీపీటీకి పోటీగా బార్డ్‌ను గత నెలలో గూగుల్ ఆవిష్కరించింది. బార్డ్ ప్రకటన తర్వాత గూగుల్‌లోని ఉద్యోగులు కంపెనీతో పాటు సీఈవో సుందర్ పిచాయ్‌ను ఎగతాళి చేశారు. సీఎన్‌బీసీ నుంచి వెలువడిన ఆడియో ప్రకారం.. ఇటీవల కంపెనీలో ఆల్ హాండ్స్ మీటింగ్ జరగింది. ఈ సందర్భంగా బార్డ్‌కు సంబంధించిన సమస్యలపై కంపెనీ అంతర్గత ఫోరమ్ డోరీ నుంచి వచ్చిన ప్రశ్నలకు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు సమాధానాలు ఇచ్చారు. చదవండి: ఈ-మెయిల్ యాప్‌ను బ్లాక్ చేసిన యాపిల్.. కారణం ఇదే.. బార్డ్ ప్రోడక్ట్ లీడ్ జాక్ క్రావ్జిక్ మాట్లాడుతూ ఈ బార్డ్ ఏఐ కేవలం సెర్చ్ కోసం మాత్రమే కాదని స్పష్టం చేశారు. ఇది సెర్చ్‌కు ఏఐని జోడించిన ఒక ప్రయోగం అన్నారు. దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఇది మనకు ఓ సహచరుడిగా ఉంటూ మన సృజనాత్మకతను, ఉత్సాహాన్ని పెంపొందిస్తుందని వివరించారు. అయితే దీన్ని కేవలం సెర్చ్ లాగా ఉపయోగించకుండా యూజర్లను ఆపలేమని కూడా ఆయన స్పష్టం చేశారు. చదవండి: మైక్రోసాఫ్ట్ కిచిడీ రెడీ! బిల్ గేట్స్‌కు స్మృతి ఇరానీ వంట పాఠాలు కేవలం సెర్చ్ కోసమే దీన్ని ఉపయోగించాలనుకునే వారికి గూగుల్ ఇప్పటికీ సేవలందిస్తోందన్నారు. ఇలా బార్డ్‌ను సెర్చ్ కోసం వినియోగించేవారి కోసం ‘సెర్చ్ ఇట్’ అనే కొత్త ఫంక్షన్‌ని కూడా ఇందులో అంతర్గతంగా రూపొందించినట్లు చెప్పారు. బార్డ్ అనేది సాధారణ సెర్చ్ కంటే చాలా విభిన్నమైనదని సెర్చ్ ఇంజినీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఎలిజబెత్ రీడ్ పేర్కొన్నారు. చదవండి: బంగారు నగలపై కేంద్రం కొత్త రూల్.. ఇకపై ఇది తప్పనిసరి! -
Google: ఉద్యోగులకే కాదు.. రోబోలకూ లేఆఫ్!
వ్యయ నియంత్రణ పేరుతో వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న టెక్ దిగ్గజం గూగుల్.. లేఆఫ్‌లు కేవలం ఉద్యోగులకే కాదు.. రోబోలకు కూడా వర్తింపజేసింది. కేఫిటేరియాలలో పనిచేస్తున్న రోబోలకు ఉద్వాసన పలికింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ రోబోల అభివృద్ధి, శిక్షణ కోసం ఎవ్రీడే రోబోట్స్ పేరిట ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిలిపివేసిందని ‘వైర్డ్’ కథనం పేర్కొంది. ఆ ప్రాజెక్ట్‌లో భాగంగా గూగుల్ కార్యాలయాల్లోని కేఫిటేరియాలో టేబుళ్లు శుభ్రం చేయడంతో పాటు వివిధ పనులు చేయడానికి రోబోలను వినియోగించేవారు. ఎవ్రీడే రోబోట్స్ ప్రాజెక్‌లో 200 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా చక్రాలపై నడిచే వన్ ఆర్మ్డ్ రోబోలను 100కు పైగా అభివృద్ధి చేస్తున్నారు. వీటని కేఫిటేరియాలో టేబుళ్లు శుభ్రం చేయడం, చెత్తను సేకరించి వేరు చేయడం, తలుపు తెరవడం వంటి పనులు చేసేందుకు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. కరోనా సమయంలో వీటితో కాన్ఫరెన్స్ రూములు కూడా శుభ్రం చేయించినట్లు ‘వైర్డ్’ కథనంలో వివరించింది. (ఇదీ చదవండి: ఇక రావు అనుకున్న రూ.90 లక్షలు.. అద్భుతం చేసిన చాట్‌జీపీటీ!) రోబోలతో చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ వాటి నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక్కోదాని నిర్వహణకు లక్షలాది రూపాయలు ఖర్చవుతుందని రోబోటిక్స్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యయ నియంత్రణ పరిస్థితుల్లో అంత ఖర్చును భరించడానికి ఆల్ఫాబెట్ సిద్ధంగా లేదు. అందుకే ఎవ్రీడే రోబోట్స్ ప్రాజెక్ట్ లాభదాయకం కాదన్న భావనతో దాన్ని నిలిపేసింది. ఆ ప్రాజెక్ట్‌లో పనిచేసే సిబ్బందిని ఇతర రీసెర్చ్ ప్రాజెక్ట్‌లలోకి బదిలీ చేసింది. -
Google Layoffs: ఆగని కోతలు.. ఈ సారి ఎంత మందినో..?
టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు ఆగడం లేదు. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో వరుస లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. తాజాగా మరికొందరిని వదిలించుకుంది. గూగుల్ ఇండియా వివిధ విభాగాల్లో మొత్తం 453 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. తొలగించిన ఉద్యోగులకు గురువారం అర్ధరాత్రి మెయిల్స్ వెళ్లినట్లు తెలిసింది. బిజినెస్‌లైన్ నివేదిక ప్రకారం.. గూగుల్ ఇండియా కంట్రీ హెడ్, వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా ఈ మెయిల్స్ పంపారు. గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ ప్రపంచవ్యాప్తంగా 12,000 మందిని లేదా మొత్తం ఉద్యోగుల్లో 6 శాతం మందిని తొలగించనున్నట్లు గత నెలలో ప్రకటించింది. అయితే ప్రస్తుతం తొలగించిన 453 ఉద్యోగాలు గతంలో ప్రకటించిన 12,000 ఉద్యోగాల కోతల్లో భాగామేనా లేక కొత్త రౌండ్ లేఆఫ్‌లు ఉన్నాయా అన్నది ధ్రువీకరించలేదు. ఉద్యోగులకు పంపిన మెయిల్స్‌లో సీఈఓ సుందర్ పిచాయ్ నుంచి కూడా కొన్ని ఇన్పుట్లు ఉన్నట్లు తెలిసింది. తొలగింపులకు దారితీసిన నిర్ణయాలకు తాను పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఆయన అంగీకరించారు. జనవరిలో పంపిన నోట్లో యూఎస్ వెలుపల తొలగించిన గూగుల్ ఉద్యోగులకు స్థానిక నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా రావాల్సినవన్నీ అందుతాయని ఆయన పేర్కొన్నారు. గూగుల్లోనే ఇతర టెక్ కంపెనీల్లోనూ లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. అమెజాన్ తన వర్క్‌ఫోర్స్ నుంచి 18 వేల మందిని తొలగించాలని యోచిస్తోంది. ఇది తొలుత 10 వేల మందికే పరిమితం అనుకున్నా తర్వాత ఈ అంచనా మరింత పెరిగింది. మెటా కూడా 13 వేల మంది ఉద్యోగులను తొలగించింది. (ఇదీ చదవండి: లేఆఫ్‌ల ట్రెండ్.. మెటా అనూహ్య నిర్ణయం.. జుకర్‌బర్గ్ సెక్యూరిటీకి ఏకంగా 115 కోట్ల ఖర్చు!) -
గూగుల్ సీఈవో సంచలన నిర్ణయం! విమర్శలకు దిగొచ్చారా?
సాక్షి, ముంబై: వేలాది ఉద్యోగుల తొలగింపు తర్వాత ఐటీ మేజర్ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో తాజాగా తన జీతాన్ని కూడా భారీగా తగ్గించుకున్నారట. ఉద్యోగులతో టౌన్ హాల్ సమావేశంలో, పిచాయ్ సీనియర్ ఉద్యోగుల వేతన కోత విషయాన్ని ప్రకటించినట్టు సమాచారం. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నుంచి పైనున్న పలువురి టాప్ ఉద్యోగుల జీతాల్లో భారీగానే కోత పడనుంది. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే బోనస్‌ను తగ్గించడంతోపాటు ఇకపై సీనియర్ ఉద్యోగులందరికీ పని తీరు ఆధారంగానే వార్షిక బోనస్ ఉంటుందని సుందర్ పిచాయ్ ప్రకటించారు. టాప్ ఎగ్జిక్యూటివ్‌లతోపాటు సీఈవోగా తన వేతనంలో కోత విధించుకున్నట్టు తెలుస్తోంది. అయితే వారి వారి జీతాలు ఎంత శాతం తగ్తుతాయి, ఈ కోతలు ఎంతకాలం ఉంటాయనే విషయాలపై స్పష్టతలేదు. (ఆయనకు లేదా బాధ్యత? ముందు గూగుల్ సీఈవోను తొలగించండి:పెల్లుబుకిన ఆగ్రహం) ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం భయం గుప్పిట్లో ఉంది. ఈ నేపథ్యంలో గూగుల్ సహా దాదాపు అన్ని టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ప్రధానంగా గూగుల్ సంస్థలో ఉద్యోగాల కోతపై సోషల్ మీడియాలో సుందర్ పిచాయ్‌పై విమర్శలు గుప్పించారు. వేలాది ఉద్యోగులను తొలగించే బదులు, సీఈవోగా ఆయన జీతంలో కోత విధించు కోవచ్చుగా కదా ప్రశ్నలు వచ్చాయి. అలాగే ఇటీవల యాపిల్ సీఈవో టిమ్ కుక్ 40 శాతం వేతన కోత ప్రకటించిన విషయాన్ని ఉదహరించారు. కాగా IIFL హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం, పిచాయ్ నికర సంపద విలువ 20 శాతం తగ్గి రూ. 5,300 కోట్లుగా ఉంది. -
ఆయనకు లేదా బాధ్యత? ముందు గూగుల్ సీఈవోను తొలగించండి: పెల్లుబుకిన ఆగ్రహం
న్యూఢిల్లీ: దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత టెకీలను షాక్‌కు గురిచేస్తుండగా, అటు సోషల్ మీడియాలో బిజినెస్ వర్గాల్లో కూడా తీవ్ర నిరసన వ్యక్త మవుతోంది. ఇప్పటికే దీనిపై కొంతమంది కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 12 వేలమందిని తొలగించడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. దీనికి తోడు యువర్‌డోస్ట్ ఇంజినీరింగ్ డైరెక్టర్ విశాల్ సింగ్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. 12వేల మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్ చర్య బయట ఉన్న బాధిత సిబ్బంది మరియు టెక్కీలను దిగ్భ్రాంతికి గురి చేసింది. దీనిపై సోషల్ మీడియాలో స్పందించిన విశాల్ సింగ్ కంపెనీ తాజా పరిస్థితికి సీఈవోగా సుందర్ పిచాయ్ బాధ్యత వహించాలన్నారు. అలాగే కంపెనీ బోర్డు ముందు సీఈవోను తొలగించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యకు ప్రగాఢంగా చింతిస్తున్నానని, కంపెనీ ఈ స్థితికి దారితీసిన నిర్ణయాలకు పూర్తి బాధ్యత వహిస్తానని, ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో రాసిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గూగుల్‌లో ఎందుకు కొనసాగాలి అని ప్రశ్నించారు. వాస్తవానికి ముందుగా ఆయనే రిజైన్ చేయాలన్నారు. తప్పుడు నిర్ణయాలకు వారే బాధ్యత వహించాలి. కంపెనీ వైఫ్యల్యానికి ఆయనే మూల్యం చెల్లించాలి. సింపుల్‌గా కఠిన నిర్ణయాలకు చింతిస్తున్నాం అని తప్పించుకుంటే సరిపోదు..చివరికి రాజకీయ నాయకులు కూడా ఒక్కోసారి దిగి రాక తప్పదు..రాజీనామా చేయాల్సిందే కదాఅంటూ లింక్డ్ఇన్లో రాశాడు. ఇదే నియమం మైక్రోసాఫ్ట్‌లో సత్య నాదెళ్లకు కూడా వర్తిస్తుందంటూ మండిపడ్డారు. మరోవైపు గత త్రైమాసికంలోనే 17 బిలియన్ డాలర్ల లాభాలను ఆర్జించిన కంపెనీకి ఇది ఆమోదయోగ్యం కాదని ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ (AWU) కంపెనీ నిర్ణయాన్ని విమర్శించింది. దీనిపై టెక్ ఉద్యోగులు సమిష్టిగా పోరాడాలని పిలుపు నిచ్చింది. -
మరో బాంబు, వేలమందికి షాకివ్వనున్న టెక్ దిగ్గజం
సాక్షి,ముంబై: గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వేలాదిమంది ఉద్యోగులకు షాకిస్తోంది. ఆల్ఫాబెట్ ప్రపంచవ్యాప్తంగా 12,000 ఉద్యోగాలను తగ్గించనుంది ఈ మేరకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ శుక్రవారం ఉద్యోగులకు ఒక ఇమెయిల్‌లో సమాచారం అందించారు. ప్రత్యర్థి మైక్రోసాఫ్ట్ 10వేల మంది కార్మికులను తొలగిస్తామని చెప్పిన కొన్ని రోజుల తర్వాత తాజా పరిణామం వెలుగులోకి వచ్చింది. టెక్ దిగ్గజ సంస్థల్లో గత కొన్నాళ్లుగా సాగుతున్న ఉద్యోగాల తొలంపులు ఐటీ ఉద్యోగుల్లో కలకలం రేపుతున్నాయి. (స్విగ్గీ ఉద్యోగాల ఊచకోత: 380 మందిపై వేటు) ప్రపంచవ్యాప్తంగా తన సిబ్బందిలో 6 శాతం మేర తగ్గించుకోనుంది. ఖర్చుల నియంత్రణ, ముదురుతున్న ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనే క్రమంలో ఆల్ఫాబెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వర్క్‌ఫోర్స్‌ను సుమారు 12వేల మందిని తొలగిస్తున్నామనే బాధాకరమైన నిర్ణయాన్ని వెల్లడించడం కష్టంగా ఉంది. ఇష్టంతో కష్టపడి పనిచేసే అద్భుతమైన ప్రతిభావంతులకు వీడ్కోలు పలుకుతున్నందుకు చాలా విచారిస్తున్నాను. ఇప్పటికే ప్రభావితమైన ఉద్యోగులకు ప్రత్యేక ఇమెయిల్‌ను పంపాం అని పిచాయ్ తన ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కంపెనీ చరిత్రలోఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగులను తొలగించడం గతంలో ఎన్నడూ లేదని టెక్ వర్గాలు భాస్తున్నాయి. కాగా గత ఏడాదితో పోలిస్తే కంపెనీ లాభం 27 శాతం క్షీణించి 13.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. -
వ్యవసాయానికి ‘ఏఐ’..భారత్‌లో గూగుల్ ప్రాజెక్ట్ హైలెట్స్ ఇవే!
భారత్‌లో పర్యటిస్తున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్..కేంద్రమంత్రి ఎస్.జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్ రంగంలో భారత్ దూసుకుపోతున్న తీరు, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల గురించి చర్చించారు. మారుతున్న డిజిటల్ అవసరాల కోసం ఏఐతో కలిసి కృషిచేస్తున్నట్లు ప్రకటించిన గూగుల్.. భవిష్యత్‌లో టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయం నుంచి యూపీఐ పేమెంట్స్ వరకు ఎలాంటి మార్పులు చేయబోతున్నామో స్పష్టం చేశారు. ►ఈ సందర్భంగా.. ఏఐ ద్వారా వ్యవసాయ భూముల డిజిటైజేషన్ కు మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కొత్త ప్రాజెక్టులను ప్రకటించింది ►భారతీయులకు ఇంటర్నెట్ మరింత సహాయకారిగా ఉండటానికి అన్ని జిల్లాల్లో భారతదేశ భాషావైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రయత్నాన్ని ప్రారంభించింది ►భారతదేశపు మొట్టమొదటి బాధ్యతాయుతమైన ఏఐ కేంద్రాన్ని ఏర్పాటుచేయడంలో సహాయపడటానికి ఐఐటీ మద్రాస్‌కు 1 మిలియన్ అమెరికన్ డాలర్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది ►ప్రారంభ దశ, మహిళల నేతృత్వంలోని స్టార్టప్ లకు గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ మద్దతును ప్రకటించింది ►ద్విభాషా వినియోగదారుల అవసరాలు, కెమెరా, వాయిస్‌తో కొత్త శోధన సామర్థ్యాలపై దృష్టి సారించే సెర్చ్ కోసం అనేక కొత్త ఇండియా-ఫస్ట్, ఇండియా-ఫోకస్డ్ ఆవిష్కరణలను ప్రకటించింది ►ఆండ్రాయిడ్ పై గూగుల్ యాప్ ద్వారా నేరుగా ఫైళ్లలో డిజిలాకర్ ఇంటిగ్రేషన్ ను ప్రకటించింది. ఇది కీలక డిజిటల్ డాక్యుమెంట్లను ప్రైవేటుగా, సురక్షితంగా, సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి అనుమతిస్తుంది ► గూగుల్ పే ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో జరిగే మోసాలను గుర్తించే కొత్త మోడల్ ను ప్రారంభించింది -
భారత్ ఎప్పుడూ నాతోనే ఉంటుంది: సుందర్ పిచాయ్
శాన్ ఫ్రాన్సిస్కో: గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్.. భారత అత్యున్నత పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. శుక్రవారం కాలిఫోర్నియా నగరం శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధు ఈ గౌరవం పిచాయ్‌కు అందించారు. మధురైలో పుట్టిన సుందర్ పిచాయ్‌కు.. భారత ప్రభుత్వం 2022 ఏడాదికిగానూ పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల నడుమ పిచాయ్ ఈ పురస్కారం అందుకున్నారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా టీవీ నాగేంద్ర ప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశం నాలో ఒక భాగం. ఎప్పుడూ నాతోనే ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్లినా దానిని నా వెంట తీసుకువెళతాను అని ఈ సందర్భంగా పిచాయ్ పేర్కొన్నారు. భారత మూడో అత్యున్నత పురస్కార గౌరవం అందుకున్నందుకు గర్వంగా, సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు గాఢంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారాయన. ఈ సందర్భంగా తన మూలాల్ని, తన తల్లిదండ్రుల త్యాగాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారాయన. Delighted to hand over Padma Bhushan to CEO @Google & Alphabet @sundarpichai in San Francisco. Sundar’s inspirational journey from #Madurai to Mountain View, strengthening 🇮🇳🇺🇸economic & tech. ties, reaffirms Indian talent’s contribution to global innovation pic.twitter.com/cDRL1aXiW6 — Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) December 2, 2022 -
'మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా'..ఉద్యోగులకు సుందర్ పిచాయ్ వార్నింగ్!
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగుల పనితీరు విషయంలో అసంతృప్తిగా ఉన్నారా? పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్నా..వారిలో కొంత మంది మాత్రమే పనిచేస్తున్నారని హెచ్చరించారా? టెక్ దిగ్గజం గూగుల్ జులై 26న క్యూ2 వార్షిక ఫలితాల్ని వెల్లడించింది. ఆ ఫలితాల్లో గూగుల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆదాయాలు, రాబడుల పరంగా 'అంచనాల కంటే బలహీనంగా ఉంది' గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది త్రైమాసికంలో గూగుల్ 13 శాతం తక్కువ వృద్ధిని నమోదు చేసింది.ఈ ఫలితాలపై పిచాయ్ ఇంటర్నల్ మీటింగ్ నిర్వహించారు. మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా గూగుల్ ఎక్జిక్యూటివ్లతో నిర్వహించిన మీటింగ్‌లో ఉద్యోగులు ప్రొడక్ట్‌లను మెరుగు పరుస్తూ కస్టమర్లకు సహాయ పడడం,ఉద్యోగులు వర్క్ ప్రొడక్టివిటీ పెంచేలా దృష్టి సారించాలని సుందర్ పిచాయ్ వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగుల సంఖ్యను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేసిన ఆయన..వారిలో ప్రొడక్టివిటీ తగ్గిందనే అసంతృప్తిలో ఉన్నారు. సంస్థలో (గూగుల్‌లో) ఎక్కువ మంది ఉద్యోగులున్నారు. కానీ వాళ్లు సమర్ధవంతంగా పనిచేయడం లేదని, పనిపై దృష్టి కేంద్రీకరించడం లేదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. సుందర్ పిచాయ్ హింట్ ఇచ్చారా ఇటీవల మరో నివేదిక ప్రకారం.. గూగుల్ ఖర్చును తగ్గించేందుకు ఉద్యోగుల అవసరంపై సమీక్షలు జరిపి..రాబోయే 3నెలల్లో స్కిల్స్ ఉన్న ఉద్యోగుల్ని నియమించడంతో పాటు, సామర్థ్యం, ఉత్పాదకత, నైపుణ్యం లేని తొలగించాలని భావిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ నివేదికల్ని ఊటంకిస్తూ..కొత్తగా ఉద్యోగుల్ని నియమించుకోవడం లేదని గూగుల్ ఇచ్చిన స్టేట్మెంట్ను ఉదహరిస్తున్నాయి. కాగా,ఆర్ధిక మాంద్యం భయంతో అనేక పెద్ద టెక్ కంపెనీలు వందలాది మంది ఉద్యోగులను తొలగించాయి. నియామకాన్ని నిలిపి వేశాయి. ఇప్పుడు అదే బాటులో గూగుల్ పయనిస్తుందంటూ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా! కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు! -
‘ఇన్‌కాగ్నిటో మోడ్’లో బ్రౌజింగ్ సేఫ్ కాదు!
Google Incognito Browsing Mode Alleges Tracking Users: టెక్నాలజీ అప్డేట్ అవుతున్నా కొద్దీ.. టెక్ దిగ్గజాల లోటుపాట్లు అన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలో జనాలు ఎక్కువగా ఉపయోగించే గూగుల్‌కి సంబంధించి సంచలన ఆరోపణలపై కోర్టు విచారణ కొనసాగుతుండగా.. తాజా వాదనల సందర్భంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేరు ప్రస్తావనకు రావడం విశేషం. సెర్చింజన్ గూగుల్ క్రోమ్‌లో ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్ మోడ్ తెలుసు కదా!. సెర్చ్ హిస్టరీ ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో.. వ్యక్తిగతంగా సెర్చ్ చేసుకునేందుకు గూగుల్ యూజర్లకు కల్పించిన వెసులుబాటు ఇది. అయితే ఇందులోని సమాచారాన్ని సైతం గూగుల్ రహస్యంగా సేకరిస్తోందని, యూజర్ భద్రతకు గ్యారంటీ లేదని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కిందటి ఏడాది కాలిఫోర్నియా కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుండగా.. గురువారం ఆరోపణలకు సంబంధించిన కీలక ఆధారాలను పిటిషనర్లు సమర్పించినట్లు తెలుస్తోంది. ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్ అనేది సురక్షితం కాదని, గూగుల్‌కు అన్నీ తెలిసి కూడా ఈ విషయాన్ని దాచిపెడుతోందన్నది తాజా ఆరోపణ. సుందర్ పిచాయ్ పేరు.. 2019లో గూగుల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ లొర్రాయిన్ ట్వోహిల్ నేతృత్వంలో ఓ ప్రాజెక్టు జరిగింది. ఆ ప్రాజెక్టు సమయంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇన్‌కాగ్నిటో మోడ్ బ్రౌజింగ్ మీద అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇన్‌కాగ్నిటో మోడ్ అనే ‘ప్రైవేట్’ బ్రౌజింగ్ వ్యవస్థలో బోలెడన్ని సమస్యలున్నాయని, తనకు ఆ ఫీచర్ అవసరం లేదని అనిపిస్తోందని సుందర్ ఆ ప్రాజెక్టు సందర్భంగా అభిప్రాయపడినట్లు సమాచారం. యూజర్‌ను ట్రాక్ చేసే ఈ వ్యవస్థ వల్ల వ్యక్తిగత డేటా లీక్ అయ్యే అవకాశమూ లేకపోలేదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అంతపెద్ద సమస్య తెలిసి కూడా ఆయన సీక్రెట్ బ్రౌజింగ్ మోడ్‌ను ప్రమోట్ చేశారనేది ఆరోపణ. ఈ మేరకు గూగుల్ కంపెనీకి సంబంధించిన కీలక పత్రాలను పిటిషనర్లు కోర్టుకు సమర్పించారు. మరోవైపు ఈ పిటిషన్‌పై గూగుల్ ప్రతినిధి జోస్ కాస్టానెడా స్పందించారు. సెకండ్, థర్డ్‌హ్యాండ్ అకౌంట్లకు సంబంధించిన తప్పుడు ఈమెయిల్స్ ద్వారా సేకరించిన సమాచారంతో గూగుల్‌ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. యూజర్ల వ్యక్తిగత భద్రత విషయంలో నిఘా ద్వారా ఉల్లంఘనలకు పాల్పడుతోందని గూగుల్ మీద ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తుండగా.. గూగుల్ మాత్రం ఇన్‌కాగ్నిటో మోడ్ ద్వారా యూజర్లకు వచ్చే ముప్పేమీ లేదని స్పష్టం చేస్తోంది. క్లిక్ చేయండి: గూగుల్ క్రోమ్‌లో వెతుకుతున్నారా? అయితే ఈ పని చేయండి! చదవండి: ఈ పిల్ల వయసు ఎప్పటికీ 22!! -
కరోనా సంక్షోభం: గూగుల్ మరోసారి భారీ సాయం
సాక్షి,న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భారతదేశానికి మద్దతుగా టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ భారీ సాయాన్ని ప్రకటించింది. రూ.113 కోట్లు (15.5మిలియన్ల డాలర్లు ) అందిస్తామని గూగుల్ సంస్థ గూగుల్.ఆర్గ్ గురువారం ప్రకటించింది. ముఖ్యంగా హెల్త్ వర్కర్లకు అదనపు శిక్షణ, గ్రామీణ ప్రాంతాల్లోఆరోగ్య సౌకర్యాల మెరుగు, సుమారు 80 ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం కోసం ఈ నిధులను వినియోగించనున్నట్టు తెలిపింది. (Vaccine: గేమ్ ఛేంజర్, కార్బెవాక్స్ వచ్చేస్తోంది!) గివ్ఇండియా, పాత్ సంస్థలకు ఈ నిధులను అందించనుంది. ఈ రెండు సంస్థలు ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తాయి. అలాగే ప్రాజెక్ట్ నిర్వహణ సహాయాన్ని అందిస్తాయి. సంబంధిత టార్గెట్ ఏరియాలను గుర్తించి, వాటిని సాంకేతిక సహాయాన్ని అందించడంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు,ఇతర అధికారులతో పని చేస్తుంది. అలాగే అపోలో మెడీ స్కిల్స్ ఇనీషియేటివ్‌తో కలిసి, 20వేల మంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తల శిక్షణా కోసం పెట్టుబడులు పెడుతుంది. గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలకు, ఆరోగ్య వ్యవస్థలకు సహాయం చేయడమే లక్ష్యమని గూగుల్ ఆర్గ్ వెల్లడించింది. దీంతోపాటు ఆశా, ఎఎన్ఎం వర్కర్ల శిక్షణా నిమిత్తం ఏకంగా రూ. 3.6 కోట్లు (5 లక్షల డాలర్లు) గ్రాంట్‌ను అందివ్వనుంది. తద్వారా 15 రాష్ట్రాలలో లక్షా 80వేల ఆశా వర్కర్లకు, 40వేల ఎఎన్ఎంలకు అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లను ఏర్పాటు చేయనుంది. (Edible oil: వినియోగదారులకు భారీ ఊరట) కరోనా సంక్షోభంలో విలవిల్లాడిన బాధితులకు సానుభూతి ప్రకటించిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ కష్ట కాలంలో భారతీయులకు సాయం చేసేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం. ముఖ్యంగా ఆక్సిజన్ ప్లాంట్లనిర్మాణం, గ్రామీణ భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల శిక్షణపై దృష్టిపెట్టామని ట్వీట్ చేశారు. అలాగే కరోనా విలయం సమయంలో ప్రభుత్వాలతో వ్యక్తులుగా, సమూహాలుగా ఇంతకుముందెన్నడూ లేని విధంగా దేశంలో అనేకంది స్పందించారనీ, ఈ క్రమంలో టెక్నాలజీ కూడా కీలక పాత్ర పోషించిదనీ కంట్రీ హెడ్, వైస్ ప్రెసిడెట్ సంజయ్ గుప్తా వ్యాఖ్యానించారు. కాగా ప్రజారోగ్య సమాచార ప్రచార కార్యక్రమాలు, అత్యవసర సహాయక చర్య కోసం గూగుల్ ఏప్రిల్‌లో రూ .135 కోట్లు సాయం అందించిన సంగతి తెలిసిందే. Our hearts go out to those in India impacted by the ongoing COVID-19 crisis, and we continue to look for ways to help. Today @Googleorg will provide an additional $15.5 million to build oxygen generation plants and train healthcare workers in rural India. https://t.co/OzoKFe1n1c — Sundar Pichai (@sundarpichai) June 17, 2021 -
కోవిడ్ సంక్షోభం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సాయం
సాక్షి,న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ భారత సంతతికి టెక్ దిగ్గజాలు స్పందించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు తనకుచాలా బాధకలిగించామంటూ సత్య నాదెళ్ల సోమవారం ట్వీట్ చేశారు. రోజులకు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలోముఖ్యంగా తీవ్ర ఆక్సిజన్ కొరత నేపథ్యంలో దేశానికి సహాయం అందించనుట్టు ప్రకటించారు. సహాయ ఉపశమన ప్రయత్నాలు, సాంకేతిక పరిజ్ఞానం,ఇతర వనరుల ద్వారా నిరంతర మద్దతుతో పాటు కీలకమైన ఆక్సిజన్ సాంద్రత పరికరాల కొనుగోలుకు కంపెనీ మద్దతు ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. అలాగే ఈ సందర్బంగా భారత్‌కు సాయం అందించేందుకు ముందుకొచ్చిన అమెరికా ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా స్పందించారు. భారతదేశంలో తీవ్రయవుతున్నకోవిడ్ సంక్షోభం చూసి తల్లడిల్లిపోతున్నట్టు చెప్పారు. గూగుల్ సంస్థ, ఉద్యోగులు కలిసి భారత ప్రభుత్వానికి రూ.135 కోట్ల నిధులను, వైద్యసామాగ్రి కోసం యునిసెఫ్, హై-రిస్క్ కమ్యూనిటీలకు మద్దతు ఇవ్వడంతోపాటు, క్లిష్టమైన సమాచారాన్ని అందించేందుకు సహాయ పడేలా నిధులను అందిస్తున్నామని సుందర్ పిచాయ్ వెల్లడించారు. కాగా గత 24 గంటల్లో దేశంలో రికార్డుస్తాయిలో 3.52 లక్షలకు పైగా కొత్త కోవిడ్-19 కేసులు కాగా 2812 మరణాలు నమోదైనాయి. మొత్తం 2,19,272 బాధితులు ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా పరిస్థితులు, ఆక్సిజన్, నిత్యావసర మందుల సరఫరా కొరత నేపథ్యంలో బ్రిటన్, అమెరికా, సౌదీ అరేబియా, సింగపూర్ లాంటి దేశాలు ఇప్పటికే తమ సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగపూర్ నుండి 500 బైపాప్‌లు, 250 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, ఇతర వైద్య సామాగ్రితో ఎయిర్ ఇండియా విమానం ఆదివారం రాత్రి ముంబైలో ల్యాండ్ అయింది. I am heartbroken by the current situation in India. I’m grateful the U.S. government is mobilizing to help. Microsoft will continue to use its voice, resources, and technology to aid relief efforts, and support the purchase of critical oxygen concentration devices. — Satya Nadella (@satyanadella) April 26, 2021 -
టీమిండియా గెలుపు : దిగ్గజాల స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. భారత క్రికెట్ జట్టు విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. అద్భుతమైన శక్తి, వారి అభిరుచి మ్యాచ్ అంతా కనిపించిందని, ఈ గెలుపు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. జట్టుకు అభినందనలు! మీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు అని మోదీ తెలిపారు. (చెలరేగిన పంత్.. భారత్ సంచలన విజయం) చరిత్రను రికార్డులను తిరగరాసిన టీమిండియా బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ సంచలన విజయంపై పలువురు ప్రముఖులు, ఇతర దిగ్గజాలు సోషల్ మీడియా ద్వారా ఎనలేని ఆనందాన్ని ప్రకటించారు. ముఖ్యంగా క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ స్పందిస్తూ గొప్ప సిరీస్ విజయాలలో ఇదొకటి అని ట్వీట్ చేశారు. ప్రతి సెషన్‌కి క్రొత్త హీరోను వస్తున్నాడు. ప్రతీసారి విజయం సాధించాం. చాలా స్థిరంగా ధీటుగా నిలబడ్డాం. నిర్లక్క్ష్యంగా కాదు.. నిర్భయంగా, నమ్మకంగా ఆడుతూ క్రికెట్ సరిహద్దులను చెరిపేసాం. గాయాల్ని, ఇతర అనిశ్చితులను విశ్వాసంతో ఎదుర్కొన్నామని సచిన్ ట్వీట్ చేశారు. బీసీసీఐతోపాటు మాజీ, ప్రస్తుత భారత క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు సంబరాలు చేసుకుంటున్నారు. విరాట్ కోహ్లి, వీవీఎస్ లక్క్ష్మణ్, శిఖర్ ధావన్, ఇశాంత్ శర్మ తదితరులు ట్విటర్ ద్వారా తమ ఆనందాన్ని ప్రకటించారు. అంతేకాదు టెక్ దిగ్గజం సుందర్ పిచాయ్ కూడా టీమిండియా గెలుపుపై సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. గొప్ప టెస్ట్ సిరీస్‌లో ఒకటి ఎప్పుడూ గెలుస్తుంది. విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు అని తెలిపారు. కాగా ఆస్ట్రేలియా గెలుపునకు కేరాఫ్‌గా భావించే బ్రిస్బేన్‌లోని గబ్బాలో భారత్ విజయ బావుటా ఎగురవేసింది. దాదాపు మూడు దశాబ్దాల తరువాత కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకున్నసంగతి తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని వరుసగా రెండోసారి నిలబెట్టుకుంది. We are all overjoyed at the success of the Indian Cricket Team in Australia. Their remarkable energy and passion was visible throughout. So was their stellar intent, remarkable grit and determination. Congratulations to the team! Best wishes for your future endeavours. — Narendra Modi (@narendramodi) January 19, 2021 EVERY SESSION WE DISCOVERED A NEW HERO. Every time we got hit, we stayed put & stood taller. We pushed boundaries of belief to play fearless but not careless cricket. Injuries & uncertainties were countered with poise & confidence. One of the greatest series wins! Congrats India. pic.twitter.com/ZtCChUURLV — Sachin Tendulkar (@sachin_rt) January 19, 2021 Historic series win for Team India! Youngsters delivered when it mattered, with Gilll and Pant in the forefront. Hats off to Ravi Shastri and the support staff for their part in this turnaround! So so proud of this bunch, this is one for the ages👏👏👏 #AUSvsIND — VVS Laxman (@VVSLaxman281) January 19, 2021 The champions & the greatest chase!🙌#TeamIndia has proved it again by team efforts, great character, courage & max determination! Despite the bruises, the team made it possible for our country. That’s why we play for the country’s flag to go high every time we perfom🇮🇳#INDvAUS — Ishant Sharma (@ImIshant) January 19, 2021 -
కాపిటల్ హిల్ ఘటన : టెక్ దిగ్గజాల స్పందన
వాషింగ్టన్: అమెరికా తాజా అల్లర్లపై అమెరికాకుచెందిన ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పందించారు. కాపిటల్ హిల్‌లో హింసను ప్రజాస్వామ్య విరుద్ధ ఘటనగా అభివర్ణించారు. బుధవారం జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ సుందర్ పిచాయ్ తనఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించారు. కంపెనీ తన ఉద్యోగులతో టచ్‌లో ఉందని, ఏదైనా అదనపు ముందు జాగ్రత్త చర్యలు అవసరమైతే ఉద్యోగులను అప్డేట్ చేస్తామని సీఈఓ తెలిపారు. అటు క్యాపిటల్ భవనంపై దాడిని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా తీవ్రంగా ఖండించారు. ఇది విచారకరమైన, సిగ్గుపడాల్సిన రోజు అని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ పరిపాలనకు సంబంధించిన పరివర్తనను పూర్తి చేయాలి అంటూ టిమ్ కుక్ ట్వీట్ చేశారు.(ట్రంప్ మద్దతుదారుల వీరంగం.. కాల్పులు) స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం, మన విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం ప్రజాస్వామ్య పనితీరుకు పునాది అని పేర్కొన్న పిచాయ్ దేశ చరిత్రలోనే ఈ హింసను ఖండిస్తున్నామని, ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోకారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలను జోబైడెన్ తీసుకునే కార్యక్రమాన్ని సక్రమంగా పూర్తి చేయాలని కోరారు. కాగా అధ్యక్ష రేసులో జో బైడెన్ విజయానికి నిరసనగా "మార్చి ఫర్ ట్రంప్" పేరుతో ర్యాలీ నిర్వహించిన ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై విరుచుకుపడ్డారు. వీరు సృష్టించిన బీభత్సం, అల్లర్లతో అమెరికాలోని వాషింగ్టన్ అట్టుడికింది. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. ఈ విషాదంపై యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. Today marks a sad and shameful chapter in our nation’s history. Those responsible for this insurrection should be held to account, and we must complete the transition to President-elect Biden’s administration. It’s especially when they are challenged that our ideals matter most. — Tim Cook (@tim_cook) January 7, 2021 -
సుందర్ పిచాయ్: ఇన్స్టాగ్రామ్ వర్సెస్ రియాల్టీ
న్యూఢిల్లీ : సాఫ్ట్వేర్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్టు చేశారు. ఇన్స్టాగ్రామ్ వర్సెస్ రియాల్టీ అంటూ సుందర్ మంగళవారం తన ఇన్స్టాగ్రామ్ లో రెండు విభిన్న ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో నిజ జీవితంలో జరిగే విషయాలు, సోషల్ మీడియాలో పోస్టు చేసిన వాటి మధ్య బేధం ఎలా ఉంటుందో తెలుపుతూ పేర్కొన్నారు. ఈ ఫోటో చూస్తుంటే ఓ వీడియో కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు తీసినట్లు తెలుస్తోంది. మొదటి ఫోటోలో జూమ్ షాట్లో స్టిల్ కోసం నవ్వుతూ కెమెరా వైపు చూస్తూ నిలుచున్నారు. రెండో దాంట్లో ఫుల్ షాట్లో కెమెరా వెనకల తన ఫోన్‌ను పరిశీలిస్తూ ఉన్నాడు. ఈ ఫోటో ద్వారా కెమెరా ముందు కనిపించే వ్యక్తికి అసలైన వ్యక్తికి మధ్య వ్యత్యాసం ఉంటుంది అనే కోణంలో ఈ రెండు ఫోటోలను షేర్ చేసినట్లు తెలుస్తోంది. (భారత్‌కు గూగుల్ దన్ను!) View this post on Instagram IG vs. reality...comfy shoes + checking on @fcbarcelona scores between takes:) A post shared by Sundar Pichai (@sundarpichai) on Jul 14, 2020 at 1:00pm PDT అయితే సుందర్ కంటే ముందు కూడా చాలా మంది ఇలాంటి ఫోటోలను షేర్ చేసినప్పటికీ ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే 2.5 లక్షల మంది లైక్ చేయగా.. 1500 మంది కామెంట్ చేశారు. ‘మీరు మా టీమ్‌లో ఉన్నందుకు గర్వంగా ఉంది’ అని ఎఫ్‌సీ బార్సిలోనా పేర్కొంది. కాగా సుందర్ పిచాయ్ నేతృత్వంలోని ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ వచ్చే ఐదారేళ్లల్లో భారతదేశంలో రూ.75వేల కోట్ల (10 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఈ పెట్టుబడులను డిజిటైజేషన్ ఫండ్ పేరుతో పెట్టనున్నట్లు గూగుల్ వెల్లడించింది. (యూట్యూబ్‌తో సుందర్ పిచాయ్ అనుబంధం) -
భారత్‌లో గూగుల్ భారీ పెట్టుబడులు
సాక్షి, న్యూఢిల్లీ : సెర్చింజన్ దిగ్గజం గూగుల్ భారత్‌లో భారీ పెట్టుబడి ప్రణాళికలను వెల్లడించింది. రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో భారత్‌లో 75,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తామని గూగుల్ సోమవారం ప్రకటించింది. గూగుల్ వెచ్చించే భారత డిజిటలీకరణ నిధిని తాను సగర్వంగా ప్రకటిస్తున్నానని గూగుల్, అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ గూగుల్ ఫర్ ఇండియా వర్చువల్ ఈవెంట్లో పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని ఈక్విటీ పెట్టుబడులు, భాగస్వామ్యాలు, నిర్వహణ వంటి వివిధ రూపాల్లో సమకూరుస్తామని స్పష్టం చేశారు. భారత్ భవితవ్యం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై తమకున్న నిదర్శనానికి ఈ భారీ పెట్టుబడులే నిదర్శనమని అన్నారు. భారత డిజిటలీకరణలో కీలకమైన నాలుగు రంగాల్లో ఈ పెట్టుబడులు దృష్టిసారిస్తాయని చెప్పారు. ప్రతి భారతీయుడకి తన సొంత భాషలో సమాచారాన్ని చేరవేయడం, భారత్ అవసరాలకు అనువైన ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయడం, పరిశ్రమలు డిజిటల్ బాట పట్టేలా సహకరించడం, సామాజిక ప్రయోజనాలకు వైద్య, విద్యం, సేద్యం వంటి రంగాల్లో ఆటోమేషన్ ఇంటెలిజెన్స్ అమలు వంటి కీలక రంగాల్లో పెట్టుబడులను వెచ్చిస్తామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన డిజిటల్ ఇండియా విజన్‌ను సుందర్ పిచాయ్ ప్రశంసిస్తూ ఆన్లైన్ వేదికలో భారత్ గొప్ప పురోగతి సాధించిందని ప్రస్తుతించారు. డిజిటల్ కనెక్టివిటీకి లోతైన పునాదులు నిర్మించడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు. తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడం, డేటా ధరల తగ్గింపు, అంతర్జాతీయ స్ధాయి మౌలిక వసతులతో నూతన అవకాశాలకు అవకాశం ఏర్పడిందని అన్నారు. 2004లో గూగుల్ హైదరాబాద్, బెంగళూర్ నగరాల్లో కార్యాలయాలను ప్రారంభించిన సందర్భంలో భారతీయ యూజర్లకు మెరుగైన సెర్చ్ సేవలను అందించడంపైనే ఫోకస్ చేశామని చెప్పారు. చదవండి : గూగుల్, అమెజాన్‌లకు చెక్ -
వీసాలపై ట్రంప్ నిర్ణయం.. పిచాయ్ స్పందన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాను తాత్కాలికంగా రద్దు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్లకు సహాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. దీనిపై గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్.. అసంతృప్తిని వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన.. ‘ట్రంప్ తీసుకున్న నిర్ణయం తనను నిరుత్సాహాపరిచింది. అమెరికా ఆర్థిక ప్రగతిలో ఇమ్మిగ్రేషన్ విధానం ఎంతో తోడ్పడింది. ఆ కారణంగానే అమెరికా టెక్నాలజీ రంగంలో గ్లోబల్ లీడర్‌గా మారింది. ఈ రోజు గూగుల్ కంపెనీ ఇలా ఉందంటే, అది ఇమ్మిగ్రాంట్ల వల్లే’ అని పిచాయ్ తెలిపారు. విదేశీ టెకీలకు వీసాలు జారీ చేయబోమని ట్రంప్ చేసిన ప్రకటన నిరుత్సాహాపరిచినా.. తాము మాత్రం ఇమ్మిగ్రాంట్స్‌కు మద్దతుగా ఉంటామని, అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తూనే ఉంటామని పిచాయ్ తన ట్విట్లో తెలిపారు. (వీసాలపై ట్రంప్ కీలక నిర్ణయం) ట్రంప్ నిర్ణయాన్ని పిచాయ్ మాత్రమే కాక మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ కూడా వ్యతిరేకించాయి.మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ ట్రంప్ చర్యను విమర్శిస్తూ.. ‘అమెరికాకు ఇప్పుడు వలసదారులు మరింత అవసరం. ప్రస్తుతం మన దేశాన్ని ప్రపంచ ప్రతిభ నుంచి విడదీయడానికి లేదా ఆందోళనను సృష్టించే సమయం కాదు. వలసదారులు మా కంపెనీలో కీలక పాత్ర పోషిస్తారు. వారు మన దేశం క్లిష్టమైన మౌలిక సదుపాయాలకు మద్దతు ఇస్తారు. మనకు చాలా అవసరమైన సమయంలో వలసదారులు ఈ దేశానికి ఎంతో సహకరించారు’ అని ఆయన అన్నారు. బ్రాడ్ స్మిత్ ట్వీట్‌ను మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల కూడా రీట్వీట్ చేశారు. (వెనక్కి రావాల్సిందేనా!) ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ప్రకటనపై ట్విట్టర్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు వరుస ట్వీట్లతో ట్రంప్ చర్యలను విమర్శించింది. ‘ఈ చర్య అమెరికా ఆర్థిక ఆస్తిని, దాని వైవిధ్యాన్ని బలహీనపరుస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు మన శ్రమశక్తిలో చేరడానికి, పన్నులు చెల్లించడానికి.. ప్రపంచ వేదికపై మన పోటీతత్వానికి తోడ్పడటానికి ఇక్కడకు వస్తారు. వారిని ఇబ్బంది పెట్టే ఆలోచనలు మంచివి కావు’ అని ట్వీట్ చేసింది. కొంతకాలం క్రితం వరకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో భాగమైన ఆలిస్ జి వెల్స్ కూడా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ‘హెచ్1-బీ వీసా ప్రోగ్రాం ద్వారా ఉత్తమమైన, ప్రతిభావంతులను దేశంలోకి ఆహ్వానించి.. వారి కృషితో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. విదేశీ ప్రతిభను ఆకర్షించడం అమెరికా బలం. బలహీనత కాదు’ అని ఆయన ట్విట్ చేశారు. -
గూగుల్ కీలక పదవిలో మరో భారత సంతతి వ్యక్తి
న్యూయార్క్ : సెర్చి ఇంజన్ దిగ్గజం గూగుల్‌లో భారత సంతతికి చెందిన మరో వ్యక్తి కీలక పదవిలో నియమితులయ్యారు. గూగుల్ సెర్చ్ హెడ్‌గా భారత సంతతికి చెందిన ప్రభాకర్ రాఘవన్ నియమితులయ్యారు. బెన్ గోమ్ స్ధానంలో ఈ పదవిని చేపట్టే రాఘవన్ నూతన బాధ్యతల్లో నేరుగా సీఈఓ సుందర్ పిచాయ్‌కు రిపోర్ట్ చేస్తారు. ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేసిన ప్రభాకర్ బెర్క్లీ యూనివర్సిటీ నుంచి ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ పొందారు. 2012లో గూగుల్‌లో చేరిన రాఘవన్ 2018లో గూగుల్ అడ్వర్టైజింగ్, కామర్స్ బిజినెస్ హెడ్‌గా ఎదిగారు. సెర్చి డిస్ప్లే పర్యవేక్షణ, వీడియా అడ్వర్టైజింగ్ అనలిటిక్స్, షాపింగ్, పేమెంట్స్ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించారు. రాఘవన్ అంతకుముందు గూగుల్ క్లౌడ్ సేవలు, గూగుల్ యాప్స్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. ఇక ఐబీఎం, యాహూల్లోనూ ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. జీమెయిల్, గూగుల్ డ్రైవ్ నెలకు 100 కోట్ల యాక్టివ్ యూజర్ల మైలురాయిని అధిగమించడంలో రాఘవన్ పాత్ర కీలకం. జీ సూట్లో స్మార్ట్ రిప్లై, స్మార్ట్ కంపోజ్, డ్రైవ్ క్విక్ యాక్సెస్ వంటి ఫీచర్లను ఆయన ప్రవేశపెట్టారు. కొత్త బాధ్యతల్లో రాఘవన్ ప్రభాకర్ అనుభవం ఎంతో ఉపకరిస్తుందని.. అలాఘరిథంలు, ర్యాంకింగ్‌ల విషయంలో రెండు దశాబ్ధాలకు పైగా అనుభవం ఆయన సొంతమని, గూగుల్ కంటే ముందే గూగుల్ సెర్చ్‌తో రాఘవన్‌కు అనుబంధం ఉందని గూగుల్, అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ సభ్యుడిగా ఈ రంగంలో గొప్ప ఇంజనీరింగ్ మేథస్సుల్లో ఆయన ఒకరని ప్రస్తుతించారు. చదవండి : ‘నాన్న ఏడాది జీతం అందుకే ఖర్చయింది’ -
‘నాన్న ఏడాది జీతం అందుకే ఖర్చయింది’
వాషింగ్టన్ : స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివేందుకు 27 ఏళ్ల కిందట తాను అమెరికా వెళ్లే క్రమంలో తన విమాన టికెట్ కోసం తన తండ్రి ఆయన ఏడాది జీతంతో సమానమైన మొత్తం వెచ్చించారని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గుర్తుచేసుకున్నారు. తన జీవితంలో తొలి విమాన ప్రయాణం అదేనని చెప్పుకొచ్చారు. కాలిఫోర్నియా వచ్చిన తర్వాత అక్కడి పరిస్థితులు తాను ఊహించిన విధంగా లేవని అన్నారు. అమెరికా అత్యంత ఖరీదైన ప్రాంతమని అప్పట్లో ఇంటికి ఫోన్ చేయాలంటే నిమిషానికి రెండు డాలర్లు ఖర్చయ్యేవని, బ్యాగ్ కొనాలంటే భారత్‌లో తన తండ్రి నెల జీతం అంత మొత్తం వెచ్చించాల్సి ఉండేదని తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న సుందర్ పిచాయ్ పట్టభద్రుల్లో ఉత్తేజం నింపేలా ప్రసంగించారు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆశను కోల్పోరాదని చెప్పారు. సాంకేతిక అంశాలు మిమ్మల్ని అసహనానికి గురిచేయవచ్చు..కానీ మీలో ఉండే ఆశను నీరుగార్చకుండా ఉంటే అది తదుపరి సాంకేతిక విప్లవాన్ని సృష్టిస్తుందని, అది తమ కలలో కూడా ఊహించని ఆవిష్కరణలకు దారితీయవచ్చని అన్నారు. సహనంతో ముందుకు సాగితే ప్రపంచం కోరుకునే పురోగతికి అది బాటలు పరుస్తుందని చెప్పారు. చెన్నైలో పెరిగిన పిచాయ్ ఐఐటీ గ్రాడ్యుయేట్ కాగా, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందగా, వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ అభ్యసించారు. 2004లో గూగుల్‌లో అడుగుపెట్టిన పిచాయ్ గూగుల్ టూల్‌బార్‌ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆపై ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఇంటర్నెట్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌ను అభివృద్ధి చేశారు. చదవండి : గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చ్ ఇదే.. -
జాతి వివక్ష : సుందర్ పిచాయ్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ/వాషింగ్టన్: భారత సంతతికి చెందిన టెక్ దిగ్గజం, ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (47) మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాత్యహంకారంపై పోరాడటానికి ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ 37 మిలియన్ డాలర్లు ఇస్తుందని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా అమెరికాలో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగిన నేపథ్యంలో పిచాయ్ ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే ఈ ఘటనను ఖండించిన పిచాయ్ తాజాగా జాతి వివక్ష వ్యతిరేక పోరాటానికి అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు. అంతేకాదు ప్రాణాలు కోల్పోయిన నల్ల జాతీయుల పట్ల గౌరవ సూచనగా 8 నిమిషాల 46 సెకన్ల పాటు మౌనం పాటించాలని గూగుల్ , ఆల్ఫాబెట్ ఉద్యోగులను కోరారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు ఒక ఈ-మెయిల్ సందేశం పంపారు. (జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన) అలాగే జాతి సమానత్వం కోసం పనిచేసే సంస్థలకు కంపెనీ 12 మిలియన్ డాలర్లు, జాతి వివక్ష సమాచారాన్ని అందించే సంస్థలకు యాడ్ గ్రాంట్లలో 25 మిలియన్ డాలర్లు నిధులను గూగుల్ ఇస్తుందని పిచాయ్ చెప్పారు. మొదటి గ్రాంటుగా ఒక మిలియన్ డాలర్లు చొప్పున సెంటర్ ఫర్ పోలీసింగ్ ఈక్విటీ, ఈక్వల్ జస్టిస్ ఇనిషియేటివ్ సంస్థలకు అందిస్తామని చెప్పారు. అలాగే తమ ప్రోగ్రామ్ ద్వారా వారికి కావాల్సిన సాంకేతిక సహాయాన్ని అందిస్తామని ప్రకటించారు. గత ఐదేళ్లలో 32 మిలియన్ల డాలర్లు ఇందుకు విరాళంగా ఇచ్చామని పిచాయ్ చెప్పారు. "నల్లజాతి సమాజం బాధపడుతోంది. మనలో చాలామంది మనం నమ్మేవాటి కోసం నిలబడటానికి మార్గాలు వెతుకుతున్నాం. అలా సంఘీభావం చూపే, ఇష్టపడే వ్యక్తులను మనం చేరుకోవాలి'' అని పిచాయ్ వ్యాఖ్యానించారు. కొంతమంది నల్లజాతి నాయకుల బృందంతో మాట్లాడానని, ఈ పోరాటంలో గూగుల్ తరపున ఎలా సహకరించగలం అనే దానిపై చర్చించామనీ, దీనిపై మరింత కృషి చేస్తున్నామని ఉద్యోగులకు అందించిన సమాచారంలో సుందర్ పిచాయ్ వెల్లడించారు. (మరోసారి పెద్ద మనసు చాటుకున్న సుందర్ పిచాయ్) చదవండి : జార్జ్‌ది నరహత్యే ! -
జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన
వాషింగ్టన్ : ఆఫ్రికన్-అమెరికన్ పౌరుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై టెక్ దిగ్గజాలు, గూగుల్, మైక్రోసాఫ్ట్ తమ విచారాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేశాయి. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జాతి వివక్షను, జాత్యంహకారాన్ని ఖండించారు. నల్లజాతి సమాజానికి తమ సంఘీభావం తెలిపిన సత్య నాదెళ్ల సమాజంలో ద్వేషానికి, జాత్యహంకారానికి చోటు లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే దీనిపై సానుభూతి, పరస్పర అవగాహన మొదలైనప్పటికీ, ఇంకా చేయాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. (జార్జ్‌ది నరహత్యే !) ఇప్పటికే జార్జ్ ప్లాయిడ్ మృతిపట్ల సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ సానుభూతిని ప్రకటించింది. ఈ సంఘటన పట్ల భాధ, కోపం, విచారం, భయంతో ఉన్న వారెవ్వరూ ఏకాకులు కాదు.. జాతి సమానత్వానికి మద్దతుగా నిలబడతామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి గూగుల్ , యూట్యూబ్ హోమ్‌పేజీ స్క్రీన్ షాట్ ను ఆయన ట్విటర్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. (దేశీయ ఉగ్రవాద చర్యలు: రంగంలోకి సైన్యం) There is no place for hate and racism in our society. Empathy and shared understanding are a start, but we must do more. I stand with the Black and African American community and we are committed to building on this work in our company and in our communities. https://t.co/WaEuhRqBho — Satya Nadella (@satyanadella) June 1, 2020 Today on US Google & YouTube homepages we share our support for racial equality in solidarity with the Black community and in memory of George Floyd, Breonna Taylor, Ahmaud Arbery & others who don’t have a voice. For those feeling grief, anger, sadness & fear, you are not alone. pic.twitter.com/JbPCG3wfQW — Sundar Pichai (@sundarpichai) May 31, 2020 -
ప్రపంచంలోనే టాప్ సుందర్ పిచాయ్
సాక్షి, న్యూడిల్లీ: అల్ఫాబెట్, గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సుందర్ పిచాయ్ (47) మరోసారి రికార్డుల కెక్కారు. ప్రపంచంలోనే అత్యధిక జీతం తీసుకుంటున్న టాప్ అధికారిగా నిలిచారు. సుందర్ పిచాయ్‌కు గత ఏడాది 281 మిలియన డాలర్ల ( రూ. 21,44,53,58,000) వేతనం లభించిందని, దీంతో ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే ఎగ్జిక్యూటివ్లల ఒకరుగా నిలిచారని గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది అల్ఫా బెట్ ఉద్యోగుల సగటు వేతనానికి 1,085 రెట్లు అని కంపెనీ తెలిపింది. ప్యాకేజీలో ఎక్కువ భాగం స్టాక్ అవార్డులు, వీటిలో కొన్ని ఎస్ అండ్ పీ 100 సూచికలోని ఇతర కంపెనీలతో పోలిస్తే ఆల్ఫాబెట్ స్టాక్ రిటర్న్ ఆధారంగా చెల్లించనున్నామని తెలిపింది. 2015 సంవత్సరం నుంచి గూగుల్ కంపెనీకి సీఈవోగా ఉన్న సుందర్ పిచాయ్ గత ఏడాది చివర్లో ఆల్ఫాబెట్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ సంస్థ నుండి వైదొలగడంతో అల్ఫాబెట్‌కు సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. సంవత్సరానికి వేతనం దాదాపుగా 2 మిలియన్ డాలర్లకు పెరిగింది. భారతీయ సంతతికి చెందిన టెక్ దిగ్గజం గతంలో కూడా భారీ ప్యాకేజీలను సొంతం చేసుకున్నారు. సుందర్ 2016 లో 200 మిలియన్ డాలర్లను స్టాక్ అవార్డు రూపంలో పొందారు. 2018లో మొత్తం వేతనం 1.9 మిలియన్ డాలర్లు. చెన్నై అతి సాధారణమైన కుటుంబం నుంచి వెళ్లి అత్యధిక జీతంతో పాటు గొప్ప పేరుని సంపాదించుకున్న సుందర్ పిచాయ్ ప్రపంచం టెక్ దిగ్గజంగా నిలిచిన సంగతి తెలిసిందే. (మరోసారి పెద్ద మనసు చాటుకున్న సుందర్ పిచాయ్) -
ట్రంప్ టీంలో మన దిగ్గజాలు
వాషింగ్టన్ : కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. వివిధ రంగాలకు అమెరికా అధ్యక్షుడు వివిధ పరిశ్రమలు, విభాగాలకు చెందిన 200 మందికి పైగా అగ్రశ్రేణి లీడర్లు, డజనుకు పైగా ఇతర నిపుణులతో వేర్వేరు గ్రూపులను ఏర్పాటు చేశారు. వీరంతా అమెరికన్ ఆర్థిక వ్యవస్థను ఎలా పునరుద్ధరించాలనే దానిపై సిఫారసులను అందించనున్నారు. వీరిలో భారత సంతతికి చెందిన ఐటీ, కార్పొరేట్ దిగ్గజాలు చోటు చేసుకోవడం విశేషం. కరోనా పై పోరులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ టీంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్లతో సహా ఆరుగురు భారతీయ-అమెరికన్ కార్పొరేట్ దిగ్గజాలను ట్రంప్ ఎంపిక చేశారు. తెలివైన, ఉత్తమమైన ఈ నిపుణులు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ప్రణాళికలను, సూచనలు సలహాలు ఇవ్వబోతున్నారని ట్రంప్ ప్రకటించారు. ఆపిల్ సీఈవో టిమ్ కుక్, ఒరాకిల్ లారీ ఎల్లిసన్, ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ , టెస్లా సీఈవో ఎలోన్ మస్క్, ఫియట్ క్రిస్లర్ మైక్ మ్యాన్లీ, ఫోర్డ్ కు చెందిన బిల్ ఫోర్డ్ , జనరల్ మేరీ బార్రా లాంటి దిగ్గజాలు కూడా ట్రంప్ సలహా బృందంలో ఉన్నారు. ఆరోగ్యం, సంపద సృష్టి ప్రాథమిక లక్ష్యంగా ఈ ద్వైపాక్షిక సమూహాలు వైట్ హౌస్ తో కలిసి పనిచేస్తాయని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.(కరోనా : అమెజాన్‌లో 75 వేల ఉద్యోగాలు) సుందర్ పిచాయ్, నాదెళ్లతో పాటు ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, మైక్రాన్ సీఈఓ సంజయ్ మెహ్రోత్ర ఉన్నారు. వీరంతా సమాచార సాంకేతిక రంగం ఎదుర్కొంటున్నసమస్యలపై పరిష్కారాపై పనిచేస్తారు. అలాగే ఉత్పత్తి రంగం పునరుత్తేజ సూచనలిచ్చే బృందానికి పెర్నాడ్ రికార్డ్ బివరేజ్ కంపెనీ సీఈఓ ఆన్ ముఖర్జీని ఎంపిక చేశారు. మాస్టర్ కార్డ్‌కు చెందిన అజయ్ బంగా ఆర్థిక రంగ పునరుద్ధరణ బృందంలో ఉన్నారు. వీటితోపాటు వ్యవసాయ, బ్యాంకింగ్, నిర్మాణ, కార్మిక, రక్షణ, ఇంధన, ఆర్థిక సేవలు, ఆరోగ్యం, పర్యాటక, తయారీ, రియల్ ఎస్టేట్, రిటైల్, టెక్, టెలికమ్యూనికేషన్, రవాణా, క్రీడలు ఇలా వివిధ టీంలను ట్రంప్ ఏర్పాటు చేశారు. సంబంధిత రంగాలకు సంబంధించి ఈ బృందం సలహాలను అందివ్వనుంది.(విండ్ షీల్డ్స్‌తో ‘మహీంద్ర’ పీపీఈలు) (హెచ్-1 బీ వీసాదారులకు భారీ ఊరట) -
కరోనాపై పోరు : గూగుల్ భారీ సాయం
కాలిఫోర్నియా: ప్రపంచ వ్యాప్తంగా మహారక్కసిలా విరుచుకుపడుతున్న కరోనాపై యుద్ధానికి తమ వంతుగా కార్పొరేట్ దిగ్గజాలు కదిలి వస్తున్నాయి. ఈ క్రమంలో కోవిడ్-19పై పోరుకు సెర్జింజన్ దిగ్గజం గూగుల్ ముందుకొచ్చింది. చిన్న,మధ్య తరహా వ్యాపారులను (ఎస్‌ఎంబీస్) ఆదుకునేందుకు, 800 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5,990 కోట్లు) సహాయాన్ని ప్రకటించింది. చిన్న వ్యాపారాలతోపాటు మహమ్మారి కరోనాపై చేస్తున్న ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు, ఆరోగ్య కార్యకర్తలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. అలాగే వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలా నిరోధించాలనే దానిపై సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థకు(డబ్ల్యూహెచ్ఓ), ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా ప్రభుత్వ సంస్థలకు 250 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,872 కోట్లు) యాడ్ గ్రాంట్స్‌ను గూగుల్ అందిస్తుందని ఆయన తెలిపారు. వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ), ఇతర వైద్య పరికరాల ఉత్పత్తిని పెంచడానికి ఆర్థిక సహాయం అందిస్తామని కంపెనీ తెలిపింది. అయితే ఎంత మొత్తం అనేది వెల్లడించలేదు. అవసరమైన పరికరాల తయారీ దారులకు, ఫెడరల్ ప్రభుత్వం సహాయం చేయడానికి గూగుల్ తన ఉద్యోగులను గుర్తిస్తామని గూగుల్ పేర్కొంది. రాబోయే కొన్ని వారాల్లో 2 నుంచి మూడు మిలియన్ల ఫేస్‌మాస్క్‌లను ఉత్పత్తి చేసేందుకు మాజిడ్ గ్లోవ్స్ అండ్ సేఫ్టీతో కలిసి గూగుల్ పనిచేస్తోంది. అలాగే కమ్యూనిటీ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, ఎన్జీవోలకు ప్రకటన గ్రాంట్లలో 20 మిలియన్ డాలర్లు ఇవ్వనుండగా, గూగుల్ యాడ్స్ క్రెడిట్స్‌లో 340 మిలియన్ డాలర్లు మేర అర్హత ఉన్న ఖాతాలకు గూగుల్ స్వయంచాలకంగా క్రెడిట్‌ను అందుబాటులో ఉంచనుంది. చిరువ్యాపారులను ఆదుకునే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్జీవోలు, ఫైనాన్షియల్ సంస్థలకు 200 మిలియన్ డాలర్ల నిధిని ప్రకటించింది. ఈ పెట్టుబడుల నిధిని సమకూర్చడం ద్వారా నగదు లభ్యత అందించనున్నామని, తద్వారా వ్యాపారాలకు, ఇతర ప్రభుత్వేతర సంస్థల ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు లభిస్తుందన్నారు. కరోనా వైరస్ మహమ్మారిపై అధ్యయనం చేసేందుకు విద్యాసంస్థలు, పరిశోధకులకు గూగుల్ క్లౌడ్‌లో 20 మిలియన్ డాలర్లను అందించనుంది. తద్వారా టీకాలు రూపకల్పన, చికిత్సలను అధ్యయనం చేయడానికి లేదా డేటాను ట్రాక్ చేయడానికి ఉపయోగించుకోవచ్చని పిచాయ్ వివరించారు. -
సుందర్ పిచాయ్ వార్షిక వేతనం ఎంతో తెలుసా
అల్ఫాబెట్ కొత్త సీఈవో సుందర్ పిచాయ్ మరో అద్భుతమైన ఘనతను దక్కించుకున్నారు. అత్యంత శక్తిమంతమైన సాంకేతిక దిగ్గజాల్లో ఒకరుగా నిలిచిన పిచాయ్ ఇపుడు అతిపెద్ద స్టాక్ అవార్డును పొందనున్నారు. రాబోయే మూడేళ్ళలో పనితీరు-ఆధారిత స్టాక్ అవార్డు రూపంలో 240 మిలియన్ డాలర్లు (సుమారు రూ.17వందల కోట్ల) అందుకుంటారు. అలాగే 2020 నుండి పిచాయ్ అందుకోనున్న (టేక్ హోం) వార్షిక వేతనం 20 లక్షల డాలర్లు. ఈ మేరకు అల్ఫాబెట్ శుక్రవారం అందించిన రెగ్యులేటరీ ఫైలింగులో తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న కార్పొరేట్ సీఈవోలలో సుందర్ పిచాయ్ ఒకరు. గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్ అందుకున్న వార్షిక వేతనం 1300 కోట్ల రూపాయలు. 2015లో గూగుల్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పుడు, పిచాయ్ వార్షిక వేతనం 652,500 డాలర్లు. మరుసటి సంవత్సరం అతని ఆదాయాలు ఆకాశాన్నంటింది. ముఖ్యంగా 199 మిలియన్ల డాలర్ల భారీ స్టాక్ అవార్డును గూగుల్ సంస్థ అందించింది. కాగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు అద్భుత అవకాశం దక్కిన విషయం తెలిసిందే. గూగుల్ మాతృసంస్థ , ఆల్ఫాబెట్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్లు సంస్థను స్థాపించిన 21 ఏళ్ల తరువాత రిటైర్మెంట్ తీసుకుంటున్న కారణంగా అల్ఫాబెట్‌కు సీఈవోగా పిచాయ్ ఎంపికయ్యారు. దీంతో సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కార్పోరేట్‌గా దిగ్గజంగా అవతరించారు. ఈక్విలార్ ప్రకారం అమెరికాలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన మిడియాన్ సీఈఓ మూలవేతనం 1.2 మిలియన్ల డాలర్లు. -
గూగూల్ సీఈవో సుందర్ పిచాయ్‌కి మరో అవార్డు
-
అప్పట్లో నేలపై పడుకునేవాడ్ని : సుందర్ పిచాయ్
న్యూయార్క్ : ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ బాల్యంలో తనకెదురైన అనుభవాలను పంచుకున్నారు. చెన్నైలో తన చిన్ననాట గడిపిన రోజులను న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తాము నిరాడంబర జీవితం గడిపేవారమని, సాదాసీదా ఇంటిలో కొంత భాగం అద్దెకు ఇచ్చి మరో భాగంలో తాము సరిపెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. లివింగ్ రూమ్‌లో నేలపైనే తాము నిద్రించేవారమని, తాను పెద్దయ్యే క్రమంలో తీవ్ర కరువు వెంటాడిందని వెల్లడించారు. అప్పట్లో తమకు ఫ్రిజ్ లేదని, ఎన్నో రోజుల తర్వాత తాము ఫ్రిజ్‌ను కొనడంతో సంబరపడిపోయామని చెప్పారు. తాను బాల్యంలో విపరీతంగా పుస్తకాలు చదివేవాడినని, స్నేహితులతో సరదాగా వీధుల్లో క్రికెట్ ఆడేవాడినని అప్పటి రోజుల్లో తాము ఎలాంటి చీకూచింతా లేకుండా జీవితాన్ని ఆస్వాదించామని అన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా అవేమీ తమకు అవరోధాలుగా కన్పించలేదని చెప్పుకొచ్చారు. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసే ముందు పిచాయ్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివారు. అప్పట్లో ల్యాబ్స్, కంప్యూటర్స్ అందుబాటులో ఉండేవి కావని, కానీ ఇంటర్నెట్ ద్వారా భారీ మార్పులు చోటుచేసుకుంటాయని తనకు అంతగా అవగతం కాలేదని అన్నారు. పిచాయ్ పెన్సిల్వేనియా వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ డిగ్రీ పొందారు. 2004లో గూగుల్‌లో క్రోమ్ బ్రౌజర్‌ను అభివృద్ధి చేసే బృందంలో ఒకరిగా పిచాయ్ చేరిన పిచాయ్ పదేళ్ల తర్వాత కంపెనీ ఉత్పత్తులు, సెర్చ్, యాడ్స్, అండ్రాయిడ్‌లతో కూడిన ప్రోడక్ట్స్, ప్లాట్‌ఫామ్స్‌కు ఇన్చార్జ్గా ఎదిగారు. 2015లో సీఈవోగా అత్యున్నత పదవిని చేపట్టిన సుందర్ పిచాయ్ గత ఏడాది గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ బోర్డులో స్ధానం పొందారు. -
లైంగిక వేధింపులు : 48 మంది ఉద్యోగులపై గూగుల్ వేటు
న్యూయార్క్ : లైంగిక వేధింపుల ఆరోపణలపై గత రెండేళ్లలో 48 మంది ఉద్యోగులపై వేటు వేసినట్టు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు భారీ చెల్లింపులతో ఇంటర్నెట్ దిగ్గజం కాపాడిందని న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించిన క్రమంలో ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో సుందర్ పిచాయ్ ఈ మేరకు వివరణ ఇచ్చారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై తొలగించిన 48 మందిలో 13 మంది సీనియర్ మేనేజర్లు కావడం గమనార్హం. ఈ ఉద్యోగులకు ఎలాంటి ఎగ్జిట్ ప్యాకేజ్ ఇవ్వలేదని పిచాయ్ పేర్కొన్నారు. సంస్ధలో లైంగిక వేధింపులు ఎదుర్కొనే బాధితులు అంతర్గత వేదికల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఈమెయిల్ పేర్కొంది. గూగుల్‌ను మెరుగైన పనిప్రదేశంగా మలిచేందుకు కృషి సాగిస్తామని, అసభ్యకరంగా వ్యవహరించే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఈమెయిల్ స్పష్టం చేసింది. -
అల్ఫాబెట్ బోర్డులోకి సుందర్ పిచాయ్
వాషింగ్టన్: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తాజాగా కంపెనీ మాతృసంస్థ అల్ఫాబెట్ బోర్డులో డైరెక్టరుగా చోటు దక్కించుకున్నారు. గూగుల్ సీఈవోగా సుందర్ అద్భుతమైన పనితీరు కనపరుస్తున్నారని, వృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని అల్ఫాబెట్ సీఈవో ల్యారీ పేజ్ వెల్లడించారు. అల్ఫాబెట్ బోర్డులోకి ఆయన్ను స్వాగతిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నైకి చెందిన సుందర్ పిచాయ్.. 2004లో గూగుల్‌లో చేరారు. కంపెనీ సహ వ్యవస్థాపకులు పేజ్, సెర్గీ బ్రిన్‌లతో కలిసి సుదీర్ఘకాలం పనిచేసిన అనంతరం 2015 ఆగస్టులో గూగుల్ సీఈవోగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది గూగుల్‌కి పేరెంట్ హోల్డింగ్ కంపెనీగా ఆల్ఫాబెట్ ఏర్పాటైంది. సుందర్ సారథ్యంలో గూగుల్ ప్రధానమైన ప్రకటనలు, యూట్యూబ్ వ్యాపారాల విభాగాల నుంచి ఆదాయాలను గణనీయంగా మెరుగుపర్చుకుంది. క్లౌడ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్ వంటి విభాగాల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. -
నిన్న జుకర్ బర్గ్, నేడు సుందర్ పిచాయ్
నిన్న ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్... తాజాగా గూగుల్ సీఈవో భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ ముస్లింలకు బాసటగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం, మైనార్టీ వర్గాలకు తాము మద్దతుగా ఉంటామని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. అమెరికాలోకి రాకుండా ముస్లింలను బ్యాన్ చేయాలని రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో గూగుల్ సీఈవో పై విధంగా స్పందించారు. ఆ వ్యాఖ్యలు సరికాదని, అసహనంపై వస్తున్న వార్తలు బాధాకరమని సుందర్ పిచాయ్ 'మీడియం'లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సుందర్ పిచాయ్...తాను భారత్ నుంచి అమెరికా వచ్చిన రోజులను గుర్తు చేస్తున్నారు.22 ఏళ్ల క్రితం భారత్ నుంచి యూఎస్ వచ్చానని, తనను అవకాశాల భూమి అమెరికా అక్కున చేర్చుకుందని తెలిపారు. ఇక్కడకు వచ్చిన తనలాంటి వారికి కేవలం అవకాశాలు మాత్రమే కాకుండా విశాలమైన హృదయంతో, సహనంతో అమెరికా తనలో ఒక భాగం చేసుకుందని తెలిపారు. అమెరికాను కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్గా పిచాయ్ పేర్కొన్నారు. ఏదైనా ఒక దేశం లేదా సంస్థ అభివృద్ధి పథంలో పయనించాలంటే అక్కడ భిన్న నేపథ్యాలకు చెందిన వ్యక్తులు, సంస్కృతులు ఉన్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. -
విలువల రాపిడితోనే ఈ వజ్రకాంతి
సమకాలీనం: అపరిమిత జనాభా, అరకొర వనరులున్న దేశం అయినందున బయటి అవకాశాల్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం దశాబ్దాల కిందటే ఏర్పడింది. ఇది గ్రహించిన ఈ దేశ యువత, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వాకిళ్లు తెరచిన విశ్వవీధుల్లోకి పరుగులు తీసింది. బాగా చదువుకోవడం, నైపుణ్యంతో రాణించడం ద్వారా ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి విజయవంతం కావచ్చని ధ్రువపడ్డ నమూనాని అందిపుచ్చుకుంది. వారి ఉత్సాహానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడయింది. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల పగ్గాలు ఒకటొకటిగా భారతీయ మేధోనా యకుల చేతుల్లోకి రావడం ఇప్పుడు అంతటా ఓ ముచ్చటయింది. ముఖ్యంగా మొన్న సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్), నిన్న సుందర్ పిచయ్ (గూగుల్) సీఈవోలయ్యాక ఈ చర్చ పెరిగింది. డజన్ వరకు ప్రథమశ్రేణి వివిధ గ్లోబల్ సంస్థలకు భారతీయులు ఈ రోజున సీఈఓలుగా ఉన్నారు. ఇక కింద, వివిధ స్థాయిల్లోకి ఎదిగి-ఒదిగిన వారిది పెద్ద లెక్కే ఉంది. ఇదేలా సాధ్యమైంది...? అన్నపుడు, సాక్షి జర్నలిజం విద్యార్థులు తమకు తోచిన కారణాలు చెబుతూ వచ్చారు. కొందరు ఇది కష్టపడే తత్వం వల్ల అని, నిబద్ధత కారణంగా అని, అంకితభావమని, ఎదగాలనే తపన ఉండడమని, భిన్నంగా-వినూత్నంగా ఆలోచించడం వల్లేనని, మధ్య తర గతి నేపథ్యం కావడంతో అని... ఇలా డజన్‌కు పైగా వేర్వేరు కారణాలు చెప్పారు. ఎక్కడో ఓ మూల నుంచి సన్నని స్వరం 'తల్లిదండ్రుల వల్ల' అన్న మాట వినిపించింది. నిజమే! భారత సమాజంలో తమ పిల్లల ఎదు గుదలకు తల్లిదండ్రులు చేసే కృషి, జరిపే త్యాగాలు అసమానమైనవి. అందరూ తమ పిల్లల్ని వివిధ కంపెనీలకు సీఈవోల్ని చేయలేక పోవచ్చు. కానీ, తామున్న పరిస్థితి కన్నా మెరుగైన స్థితిలో పిల్లలుండాలనే తపన లేని తల్లిదండ్రులు మన దేశంలో ఉండరేమో! కేవలం ఆలోచనా పరమైన తపన మాత్రమే కాక అందుకోసం అత్యధికులు చిత్తశుద్ధితో కృషి చేస్తారు. ఆరుగాలం శ్రమిస్తారు. ఈ క్రమంలో... తమకున్నా, లేకున్నా పిల్లల్ని వృద్ధిలోకి తేవాలనే బలమైన భావన వారిని ముందుకు నడుపుతుంది. చిన్న చిన్న సౌఖ్యాలు, ముచ్చట్లు, అవసరాలు.... అన్నీ వదులుకొని కూడా పిల్లల్ని పెంచే తల్లిదండ్రులకీ దేశంలో కొదవలేదు. 'అంతా పిల్లల కోసం కరిగేస్తే... మరి, రేపేంటి?' అన్న చిన్న సందేహం, ఆలోచనక్కూడా తావివ్వకుండా, సర్వస్వం వారి చదువుల కోసం, ఉన్నతి కోసం హారతి కర్పూరంలా కరిగించే తల్లిదండ్రులెందరో! ఇది అంతో ఇంతో ఉన్న వాళ్ల పరిస్థితి. ఇక ఏమీ లేని నిరుపేదలు, దిన కూలీలు, పెద్దగా రాబడిలేని అల్పాదాయ వర్గాల వారు కూడా తమ స్తోమతకు మించి డబ్బును పిల్లల కోసం వెచ్చిస్తారు. ఖర్చు అనివార్యమైనపుడు కూడా వెనుకాడరు. కష్ట మైతే తమ అవసరాల విషయంలో రాజీపడతారు, లేకపోయినా సరేనని సరిపెట్టుకుంటారు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంతటి తల్లిదండ్రుల త్యాగాలు ఉండవేమో అనిపిస్తుంది. ఒక వైపు విలువల సమాజం, మరో వైపు తల్లిదండ్రుల ప్రోత్సాహం భారత యువతరాన్ని ఎదుగుదల వైపు పరుగులు తీయిస్తోంది. ఇది ఇవాళ్టిది కాదు... పిల్లలే తమ సర్వస్వం అనే తల్లిదండ్రుల భావన ఇవాళ్టిది కాదు. భార తీయ జీవన విధానంలోనే ఉంది. మహాభారతంలో మంచి పేరున్న పాండురాజు, కుంతి మాత్రమే కాదు, స్వార్థపరులని కాసింత చెడ్డపేరున్న ధృతరాష్ట్ర-గాంధారీలు కూడా తమ పిల్లల ఉన్నతి కోసం తపించిన వారే! వీర శివాజీని మరాఠా యోధునిగా తీర్చిదిద్దిన జిజియాబాయి, గాంధీజీని జాతిపితగా మలచిన పుత్లీబాయి... ఇలా ఎందరెందరో! పితృవాక్య పాలన అని శ్రీరాముడు అడవులకెళితే తట్టుకోలేక చనిపోయిన తండ్రి దశరథుని పుత్రప్రేమ కంటే, జనవాక్యపాలన అని తనను రాముడే అడవు లకంపినా.... కుశ, లవుల్ని కని-పెంచి, విద్యాబుద్ధులతో తీర్చిదిద్దిన సీత పుత్ర వాత్సల్యమే గొప్పది. అది మన వారసత్వ సంపదయింది. పిల్లల చదువుల కోసం, ఇవాళ్టికీ వేలాది మంది తల్లులు స్వచ్ఛంద సాంసారిక వియోగాన్ని భరిస్తున్న సీతలు. ఉపాధి, జరుగుబాటు కోసం భర్తలెక్కడో ఊళ్లల్లో వ్యవసాయమో, పట్టణాల్లో వ్యాపారమో చేస్తుంటే... నగరాలు, మహా నగరాల్లో అద్దె ఇళ్లల్లో ఉంటూ పిల్లల్ని చదివిస్తుంటారు తల్లులు. అహర్నిశలు వారి బాగోగుల ఆలోచనలే! అక్కడ తండ్రులదీ అదే బలవం తపు ఒంటరి బతుకు. కష్టపడుతూ పిల్లల చదువుల కోసం డబ్బులు పం పిస్తూ ఉంటారు. అది హైదరాబాద్‌లో విద్యానగర్, అమీర్‌పేట, కూకట్ పల్లి కావచ్చు; గుంటూరు, విజయవాడలలో వేరేవేవో బస్తీలు కావచ్చు, ఇంకే ఇతర జిల్లా కేంద్రాలో, ముఖ్య పట్టణాలో కూడా కావచ్చు, విషయ మొకటే! అంటే, పిల్లల చదువుకోసమే... సొంత ఇంటిని-ఊరునీ వీడి, అష్టకష్టాలు పడీ, ఆస్తులు అమ్ముకునీ, తీర్చలేని ప్రయివేటు అప్పులు చేసీ, బ్యాంకుల్లో విద్యారుణాలు పొందీ పీకల్లోతుగా రుణగ్రస్తులవుతుం టారు. వాటిని తీర్చేక్రమంలో... సరళ జీవితాల్ని సంక్లిష్టం చేసుకునే కుటుంబాలెన్నో! భారత యువతకు సలామ్! అపరిమిత జనాభా, అరకొర వనరులున్న దేశం అయినందున బయటి అవకాశాల్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం దశాబ్దాల కిందటే ఏర్ప డింది. ఇది గ్రహించిన ఈ దేశ యువత, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వాకిళ్లు తెరచిన విశ్వవీధుల్లోకి పరుగులు తీసింది. బాగా చదువుకోవడం, నైపు ణ్యంతో రాణించడం ద్వారా ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి విజయ వంతం కావచ్చని ధ్రువపడ్డ నమూనాని అందిపుచ్చుకుంది. వారి ఉత్సా హానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడయింది. ఇంకేం! ప్రపంచం, ముఖ్యంగా ఐటీ ప్రపంచం మనవాళ్ల పాదాక్రాంతమైంది. అజీం ప్రేమ్‌జీ, నారాయణమూర్తి, శివనాడార్, రామలింగరాజు, నందన్ నీలేకనీ వంటి తొలితరం నేతలు వేసిన బీజాలు మంచి భూమికనేర్పాటు చేశాయి. ఈ దేశానికి చెందిన ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ముఖ్య విద్యా సంస్థల కృషి తల్లిదండ్రుల త్యాగాలకు తోడయి ఆడా మగ తేడా లేకుండా యువత సాఫ్ట్వేర్ గుర్రమెక్కింది. ఐటీ ప్రపంచ పథాన ఇప్పుడు దౌడు జోరందు కుంది. బ్రెయిన్ డ్రెయిన్ అని మొదట్లో కొందరు ఆందోళన చెందినా, అది సరైన ఆలోచన కాదని తేలిపోయింది. పోటీ యుగంలో... వీలయినన్ని అవకాశాల్ని అందిపుచ్చుకోవడం, సమస్త ప్రపంచాన్ని దున్నేయడం. వీలైతే వెనక్కివచ్చి స్వదేశాన్నీ శక్తిమంతం చేయడంలో చేదోడు వాదోడు గానిలవడం, ఇదే ఇప్పుడు జరగాల్సింది. తొలితరం విదేశాలకి వెళ్లి విజ యవంతమైన కొంతమంది ఈ పని చేస్తున్నారు. ఇక్కడి పరిపాలన, రాజకీయ వాతావరణంలో కూడా మార్పు రావాలి. ప్రపంచానికి నేర్పిన విలు వల్ని మన వాళ్లే మరచిపోతున్నారు. మన పార్లమెంటు ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, 'విలువలతో కూడిన జీవన శైలి... భారతదేశం ప్రపంచానికిచ్చిన గొప్ప కానుక'ని కితా బిచ్చారు. ఆ విలువల జీవనశైలి, తల్లిదండ్రుల త్యాగాలు, సుదీర్ఘంగా సాగే కృతజ్ఞతా భావమే మన యువతరాన్ని విశ్వవేదికపై నాయకత్వ స్థానాల్లోకి తీసుకువస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్య సమా చార కమిషనర్‌గా పనిచేసి రిటైరయిన సి.డి.అర్హ డెబ్బై ఏళ్ల వయసులో ఇప్పుడు 'ఇండస్'అనే ఓ పెద్ద విద్యాపీఠం ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు. ఆయన కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నత చదువులతో విశ్వ నిపుణులుగా ఎదిగి అత్యున్నత హోదాల్లో ఉన్నారు. ఆరున్నర దశాబ్దాల కింద, అర్హ తండ్రి రెవెన్యూ ఉద్యోగిగా తనకొచ్చే నెల జీతం 75 రూపా యల్లో 55 రూపాయల నెలసరి ఫీజు కట్టి సెయింట్ జేవియర్ అనే గొప్ప పాఠశాలలో కొడుకును చదివించారు. మిగతా కుటుంబ పోషణకు నెలకు 20 రూపాయలే వెచ్చించారు. ఇలాంటి ఏ తల్లిదండ్రుల త్యాగాలూ వృథా పోకూడదు. తీసుకున్న చోట... తిరిగి ఇచ్చేయాలి! పిల్లలెంత ఎత్తు ఎదిగినా కన్నవారిని నిర్లక్ష్యం చేయకూడదు. కొంత డబ్బు వెచ్చించి ‘వృద్ధాశ్రమాల్లో వేశాం కదా! ఇంకేంటి’ అనేపాటి కృతజ్ఞత చాలదు. వారి త్యాగాల క్రమంలో మరుగున పడ్డ నెరవేరని కలల సాకారా నికి సహకరించాలి. మాతృదేశాన్నీ విస్మరించొద్దు. ఏపీజే అబ్దుల్‌కలాం తన స్వీయకథ 'వింగ్స్ ఆఫ్ ఫైర్'లో తన తల్లి సంస్కారాన్ని స్మరిస్తూ రాసుకున్న కథలు ఒక్క కలాం కథలు మాత్రమే కావు. కుటుంబం పేదరి కం అనుభవిస్తుంటుంది. తల్లి రాత్రివేళ రొట్టెలు కాల్చి చదువుకునే పిల్ల లకు పెడుతుంది. తండ్రికి మాడిపోయిన రొట్టె దొరుకుతుంది. చిన్న పిల్లాడైన కలాం ఈ సన్నివేశాన్నంతా చూస్తుంటాడు. కుటుంబ సంబంధాల మధ్య, సభ్యుల మధ్య కోపతాపాలూ, సహజ భావావేశాలను ప్రేమ ఎలా అధిగమిస్తుందో జాగ్రత్తగా గమనిస్తుంటాడు. మాడిపోయిన రొట్టెను కంచంలో పెట్టుకున్న నాన్నను అడుగుతాడు. 'మాకందరికీ మం చి రొట్టెలు వేసి, చివర్లో నీకు మాడిపోయిన రొట్టెను పెట్టినందుకు నీకు అమ్మపై కోపంగా లేదా?'అని. అందుకా తండ్రి ప్రేమతో 'పొద్దుట్నుం చీ ఆమె పని చేస్తూనే ఉంది. పైగా మాడిపోయిందేదో నాకు పెట్టింది. కానీ ఆమె ఇంకా తినలేదు చూశావా?'అంటాడు. దాంతో మళ్లీ తల్లి దగ్గరకు వెళ్లి 'అమ్మా నువ్వు ఇంకా తినలేదు. మాకు మాత్రమే పెట్టావు. నువ్వూ తినమ్మా'అంటాడు కలాం. దానికా తల్లి చిర్నవ్వుతో. 'నాన్నా... నువ్వు 'చదువుకునే' పిల్లాడివి. నీకు చదువుకునేందుకు శక్తి కావాలి. నీకు చదువు కునేందుకు మేధస్సు పెరగాలి. అందుకే నీకీ రొట్టెలు. తిని బాగా చదు వుకో' అని స్పందిస్తుంది. అంతే... ఈ కష్టాలన్నీ ఎరిగిన కలాం బాగా చదువుకున్నాడు. ఆ తర్వాత తన తల్లి గురించి మాట్లాడుతూ భావో ద్వేగంతో రాసుకున్న మాటలు అందరినీ కదిలిస్తాయి. 'ఆరోజున నాకు నువ్వు పెట్టిన రొట్టెలతో పెరిగిన మెదడు మేధస్సూ, తనువు తేజస్సూ ఇవ్వాళ్ల నాతోనే ఉన్నాయి. కానీ నాకోసం నువ్వు చేసిన త్యాగం నాకు గుర్తుంది. ఇవ్వాళ నీకు పాదాభివందనం చేద్దామంటే నువ్వు లేవు. అలాగే నేను కూడా లేని స్థితి ఒకటి వస్తుంది. నువ్వు ఈ లోకాన్ని వీడిపోయిన రోజున ఏ దివ్య శరీరాన్ని ధరించావో, నేనూ ఈ లోకాన్ని వీడిన రోజున అదే దివ్య శరీరాన్ని ధరిస్తా. నువ్వు చేరిన లోకాలకే నేనూ చేరుతా. నా రొట్టెల కృతజ్ఞత తీర్చేందుకు నువ్వే రూపంలో ఉన్నావో, అదే రూపంలో నేనూ నీ దగ్గరకు చేరి నీ పాదాలను... నువ్వు పెట్టిన రొట్టె తిన్న ఈ చేతులతో స్పర్శిస్తా' అని రాసుకున్నాడు. కలాం ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగినందున్నే ఈ చరిత్రను మనం తెలుసుకోగలిగాం. కానీ ఇలాంటి దివ్యానుభవాలు చవిచూసే కుటుంబాలు మన సమాజంలో, మనకు తెలియకుండా.... ప్రతి ఐదింటిలో కనీసం మూడైనా ఉంటాయేమో! తీసుకున్న చోటే ఎంతోకొంత తిరిగి ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. ఆర్. దిలీప్ రెడ్డి సాక్షి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com -
మోదీని త్వరలో కలుస్తా గూగుల్ చీఫ్ సుందర్..
న్యూయార్క్ : టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సీఈవోగా నియమితులైన సుందర్ పిచాయ్ త్వరలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశం లభించగలదని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్వీటర్ ద్వారా తనను అభినందించిన మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ట్వీటర్లో మోదీ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ.. ‘శుభాకాంక్షలకు ధన్యవాదాలు. త్వరలోనే మిమ్మల్ని కలిసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా’ అంటూ సుందర్ పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ వచ్చే నెల సిలికాన్ వేలీలో పర్యటించనున్న సందర్భంగా పలువురు టెక్నాలజీ దిగ్గజాలను కలవనున్నారు. ఇందులో భాగంగా సుందర్ కూడా ఆయనతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గూగుల్ సీఈవోగా పదోన్నతి పొందిన సుందర్‌ను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మొదలుకుని యాపిల్ సీఈవో టిమ్ కుక్ దాకా అభినందించిన సంగతి తెలిసిందే. -
మెరిసిన ‘మేడిన్ ఇండియా’
‘నీ పేరు గూగుల్ అయినట్టూ, అన్నీ తెలిసినట్టూ మాట్లాడుతున్నావే...’ కుర్రకారులో చమత్కారంగా దొర్లే సంభాషణల్లో ఇదొకటి. నిజమే... ఇరవైయ్యేళ్ల క్రితం గూగుల్ ఆవిర్భవించి ఉండకపోతే మనకు చాలా విషయాలు తెలిసేవి కాదని, మన అవగాహనకు ఎన్నో పరిమితులుండేవని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది విశ్వసిస్తున్నారు. అందులోని నిజానిజాల సంగతలా ఉంచి చాలా స్వల్ప కాలంలోనే అంతటి విశ్వసనీయతను సాధించడం అసాధారణం...అపూర్వం. సృజనాత్మకత లోనూ, ఉన్నత సాంకేతికతలోనూ అనునిత్యం ఆధిక్యతను సాధించాలన్న తపనే ఆ రంగంలో గూగుల్ సంస్థను అత్యున్నత శిఖరాగ్రంపై నిలబెట్టింది. అదిప్పుడు 1,600 కోట్ల డాలర్ల లాభాలతో ప్రపంచంలో ఉన్నతశ్రేణి టెక్నాలజీ కంపెనీగా వెలుగులీనుతోంది. అలాంటి సంస్థకు ఒక భారతీయుడూ, అందునా దక్షిణాదివాడూ అయిన సుందర్ పిచాయ్ సీఈఓ కాబోతున్నాడంటే సహజంగానే అందరూ గర్వపడతారు. ఇప్పటికే మరో రెండు పెద్ద సంస్థలకు భారతీయులు సారథ్యం వహిస్తున్నారు. నిరుడు మైక్రోసాఫ్ట్ సీఈఓగా తెలుగు తేజం సత్య నాదెళ్ల సారథ్యాన్ని స్వీకరించారు. అలాగే హ్యాండ్సెట్ల వ్యాపారంలో ఉన్న ప్రముఖ సంస్థ నోకియాకు రాజీవ్ సూరి సీఈఓగా ఎంపికయ్యారు. ఈ మూడు కార్పొరేట్ సంస్థలూ నిరుడు ఆర్జించిన మొత్తాలను పరిగణనలోకి తీసుకుంటే అది ప్రపంచంలోని 140 దేశాల జీడీపీల కంటే ఎక్కువని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. నిరుడు ఈ మూడు సంస్థల ఆదాయాల మొత్తం 15,960 కోట్ల డాలర్లు! సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌ల ఎంపికతో సిలికాన్ వ్యాలీ ఏలుబడి భారతీయుల చేతుల్లోకి వచ్చినట్టయింది. భిన్న ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో ఎదిగిన యువత మెరుగైన చదువులకూ, ఉద్యోగాలకూ ఖండాంతరాలకు వెళ్లి తమ ప్రతిభాపాటవాలతో ఎదుగుతున్న వైనం ఎందరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. పరిధి చిన్నది కావొచ్చు, ఎన్నో పరిమితులుండవచ్చు...కానీ ఏదైనా బాధ్యతను అప్పగించినప్పుడు దాన్ని అధికారంగా, ఇంకా చెప్పాలంటే పెత్తనంగా భ్రమించి ప్రవర్తించేవారు చాలాచోట్ల కనిపిస్తారు. సహోద్యోగుల్లో స్ఫూర్తిని నింపి, ఉత్సాహం కలిగించి, కొత్త ఆలోచనలకు వారిని ప్రోత్సహించి, సృజనాత్మక ఆవిష్కరణలకు దోహదకారులుగా నిలవడం, నిజమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడం అరుదుగా చూస్తాం. నిరుడు మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల అయినా, గూగుల్ సీఈఓ కాబోతున్న సుందర్ పిచాయ్ అయినా ఇలా అంకితభావంతో పనిచేయడంవల్లే ఎదగ గలిగారని వారి సన్నిహితులు చెబుతున్న మాటల్లో నిజం ఉంది. మెకిన్సీ కంపెనీలో కొంతకాలం పనిచేసి గూగుల్ ఆవిర్భవించినప్పుడు చేరిన సుందర్ పిచాయ్ గూగుల్‌కు పేరు తెచ్చిన వెబ్ బ్రౌజర్ క్రోమ్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోసహా పలు సాఫ్ట్వేర్ ప్రొడక్ట్‌లను రూపొందించడంలో, వాటిని జనావళికి చేరేయడంలో కీలక పాత్ర పోషించారు. గూగుల్ ప్రొడక్ట్‌లను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వందకోట్లకు పైగా జనం నిత్యమూ ఉపయోగిస్తున్నారంటేనే వాటి ప్రయోజనం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. ఇలా కోట్లాదిమంది వినియోగంలో ఉన్న సాంకేతికతను అభివృద్ధి చేయడం దిశగా నిరంతరం ఆలోచిస్తూ పోతే తప్ప ఆ పనిలో నిమగ్నమై ఉండే సంస్థ మనుగడ సాధించలేదు. అపరిమితమైన పోటీ పెరిగిన వర్తమాన వాతావరణంలో ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా అట్టడుగుకు దిగజారే ప్రమాదం ఉంటుంది. గూగుల్‌కు చాలా ముందే వచ్చిన సంస్థలు అందుకు ఉదాహరణ. కేవలం ఇంటర్నెట్ దిగ్గజంగా ఉండటంతో సరిపెట్టుకోక, ఆ రంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలకు తెరతీస్తూ, ప్రపంచంలో ఏమూల ప్రతిభ కనబడినా సొంతం చేసుకుని, దాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు గూగుల్ కృషి చేస్తోంది. సాఫ్ట్వేర్ రంగంలో సైతం తనదైన ముద్రను చూపడంలో ముందుంది. ఏ వయసువారైనా, సాంకేతికత వినియోగంలో అంతగా ప్రవేశం లేకపోయినా ఎవరైనా సులభంగా వినియోగించేలా అప్లికేషన్లు రూపొందించడం గూగుల్ సాధించిన విజయం. ఐడియా చెబితే కోటి రూపాయలిస్తామని పోటీ పెట్టడం మొదలుకొని ఈ రెండు దశాబ్దాల్లోనూ గూగుల్ చేసిన పనులు చాలా ఉన్నాయి. గ్లోబల్ ఇంపాక్ట్ పేరుతో స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించడమైనా...‘గూగుల్ ఉమన్ ఇన్ ఇంజనీరింగ్’ పేరిట అవార్డు నెలకొల్పడమైనా...మృత భాషలకు ప్రాణం పోసి అవి వర్థిల్లేందుకు భాషా నిపుణులనూ, పండితులనూ ఒకచోట చేర్చినా...గూగుల్ సైన్స్ ఫెయిర్ పేరుతో బాలబాలికల్లో సృజనాత్మకతను ప్రోత్సహించినా...గూగుల్‌ది విలక్షణ మార్గం. అవిచ్ఛిన్నంగా సాగే ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్న ముఖ్యుల్లో సుందర్ ఒకరు. వాస్తవానికి నిరుడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సారథయ్యే ముందు ఆ పదవికి ఎంపిక కావొచ్చునని వినిపించిన పేర్లలో సుందర్ పిచాయ్ పేరూ ఉందంటే ఆయన నాయకత్వ పటిమపై మార్కెట్లో ఉన్న విశ్వాసం ఎటువంటిదో అర్థమవుతుంది. ఇన్నాళ్లూ తానే ఒక భారీ సంస్థగా, టెక్ దిగ్గజంగా పేరు ప్రఖ్యాతులు గడించిన గూగుల్... ఇకపై కొత్తగా ఏర్పడబోతున్న ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ ‘అల్ఫాబెట్’ లోని పలు సంస్థల్లో ఒకటిగా ఒదిగి చిన్నబోతున్న తరుణంలో మనవాడు సీఈఓ అయ్యాడన్న అసంతృప్తి కొంతమందిలో ఉంది. కానీ సంస్థ పునర్వ్యవస్థీకరణ సమయంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో సుందర్ నియామకం కూడా ఒకటని గూగుల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ల్యారీ పేజ్ చెబుతున్నారు. ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలకు ఎందరో సృజనశీలురను, సత్తా ఉన్నవారిని అందించగలుగుతున్న మన దేశం అభివృద్ధికి ఇంకా ఆమడ దూరంలోనే ఉంటున్నది. సామాజిక వివక్ష, ఆర్ధిక అసమానతలవంటివి మాయమై...అందరికీ సమానావకాశాలు లభించినప్పుడే ఈ స్థితి మారుతుంది. అప్పుడు సుందర్ బహువచనమవుతుంది.