కార్పొరేట్ సంస్థల్లో చిన్న ఉద్యోగి నుంచి మొదలుకుని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వరకు అందరూ కీలకమే. కానీ వారి బాధ్యతలను అనుసరించి వారికి చెల్లించే వేతనాల్లో తేడా ఉంటుంది. ప్రతి కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ (సీఈఓ)ల అత్యంత కీలకం.. కంపెనీ అభివృద్ధి సాధించే వ్యూహ రచనలోనూ, ఆదాయం పెంపులోనూ, సిబ్బంది పనితీరు మెరుగు పర్చడంతోపాటు సాధక బాధకాలు తీర్చడంలోనూ సీఈఓలే కీలకం. ఇక ఐటీ, టెక్ సంస్థల సీఈఓలైతే వేరే చెప్పనక్కర్లేదు. సంస్థ పురోగతి సాధించడంలో ఎంతో ముఖ్య భూమిక పోషించే వారి వేతనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.
అమెరికాలో 2023 సంవత్సరానికిగాను అత్యధిక వేతనాలు అందుకున్న సీఈఓల్లో సుందర్ పిచాయ్, బ్యారీ మైక్ కార్తీ, టిమ్ కుక్ తదితరులు ఉన్నారు. గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓ సుందర్ పిచాయ్ వేతనం అక్షరాల 226 మిలియన్ డాలర్లు(రూ.1800 కోట్లు). దాంతో ఆయన రోజూ రూ.5 కోట్లు వేతనం పొందుతున్నారు. అమెరికాలోని కార్పొరేట్ సంస్థల సీఈఓల వేతనంతో పోలిస్తే సుందర్ పిచాయ్ వేతనం అత్యధికం.
అతిపెద్ద కార్ల రెంటల్ కంపెనీల్లో హెర్ట్జ్ ఒకటి. దాని సీఈఓ స్టీఫెన్ స్కెర్ వేతనం 182 మిలియన్ డాలర్లు(రూ.1500 కోట్లు). అమెరికన్ ఎక్సర్‌సైజ్ ఎక్విప్‌మెంట్ కంపెనీ పెలోటాన్ ఇంటర్ యాక్టివ్ సంస్థ సీఈఓగా బ్యారీ మైక్ కార్తీ ఉన్నారు. ఆయన వార్షిక వేతనం 168 మిలియన్ డాలర్లు(రూ.1400 కోట్లు).
ఇదీ చదవండి: ‘ఎవరు చనిపోయినా అవి మాత్రం ఆగవు’
అమెరికాలో లైవ్ నేషన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సీఈఓగా మిచెల్ రాపినో పని చేస్తున్నారు. ఆయన వార్షిక వేతనం 139 మిలియన్ డాలర్లు(రూ.1100 కోట్లు). గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పినారెస్ట్ ఒకటి. దీనికి విలియం రెడీ సీఈఓగా పని చేస్తున్నారు. ఆయన వార్షిక వేతనం 123 మిలియన్ డాలర్లు(రూ.1000 కోట్లు). ప్రపంచంలోకెల్లా అతిపెద్ద టెక్ దిగ్గజం ఆపిల్. దీనికి సీఈఓగా పని చేస్తున్న టిమ్ కుక్ వార్షిక వేతనం 99 మిలియన్ డాలర్లు(రూ.825 కోట్లు).
Comments
Please login to add a commentAdd a comment