ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ సంస్థలో విషాదం చోటు చేసుకుంది. ఆ కంపెనీకి చెందిన మాజీ సీఈఓ సుసాన్ వోజ్కికీ కుమారుడు 19 ఏళ్ల మాక్రో ట్రోపర్ మరణించారు. నార్తన్ కాలిఫోర్నియాలోని బర్కిలీ నగరం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన హాస్టల్‌లో మరణించిట్లు ట్రాపర్ తల్లిదండ్రులు నిర్ధారించారు.
ట్రోపర్ ఎందుకు మరణించారనే విషయంపై స్పష్టత లేదు. ట్రోపర్ ఆపస్మారక స్థితిలో జారుకున్నప్పుడు సమాచారం అందుకు బర్కిలీ ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ట్రాపర్ మరణించినట్లు తేలింది.
ట్రోపర్ ఎందుకు మరణించారనే అంశం వెలుగులోకి వచ్చేందుకు ఇంకా నెల రోజుల సమయం పట్టొచ్చంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టాక్సికాలజీ రిపోర్ట్ కోసం కుటుంబం ఎదురు చూస్తున్నారు. మనవడి మరణంపై ట్రోపర్ నాయనమ్మ, యూట్యూబ్ మాజీ సీఈఓ సూసన్ వోజిస్కీ తల్లి ఎస్తేర్ వోజిస్కీ కన్నీరుమున్నీరుగా విలపించారు. మెటా పోస్ట్‌లో తన మనవడిది ప్రేమించే తత్వం, గణిత మేధావి’ అంటూ అభివర్ణించింది.
యూట్యూబ్ సీఈఓ సూసన్ వోజిస్కీ
తొమ్మిదేళ్ల పాటు యూట్యూబ్‌కు సీఈఓగా వ్యవహరించిన సూసన్ వోజిస్కీ గత ఏడాది రాజీనామా చేశారు. 54 ఏళ్ల సూసన్ తన కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తొమ్మిదేళ్ల క్రితం తాను యూట్యూబ్‌లో చేరినప్పుడు, మంచి లీడర్‌షిప్ టీంను ఏర్పాటు చేశానని, నీల్ మోహన్ ఆ బృందంలో భాగమని సూసన్ చెప్పారు. సూసన్ రాజీనామాతో భారత సంతతికి చెందిన నీల్ మోహన్, యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బాధ్యతలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment