ఒకప్పటి నుంచి కూడా చాలామంది ఎక్కువ సంపాదించాలంటే ఐటీ ఫీల్డ్‌లో జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్న సంగతి తెలిసిందే. లక్షల్లో జీతాలు, వీకెండ్ పార్టీలు, టూర్లు, షికార్లు, ఐదు రోజుల పనిదినాలు ఇలా చాలా అద్భుతంగా ఉంటుంది కావున మెజారిటీ యువత ఈ ఉద్యోగంపై ఎక్కువ మక్కువ చూపిస్తారు. అయితే కరోనా మహమ్మారి తరువాత పరిస్థితులు తారుమారయ్యాయి.
కరోనా విజృంభణ తరువాత చాలా వరకు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను తొలగించాయి, అదే సమయంలో కంపెనీలు ఆశించిన స్థాయిలో లాభాలను పొందలేకపోయాయి. అయితే సీఈఓలు మాత్రం రికార్డు మొత్తంలో జీతాలు తీసుకుంటున్నారు. మనం ఈ కథనంలో ఎక్కువ జీతాలు తీసుకుంటున్న ఐటీ కంపెనీల CEOల జీతాలను గురించి తెలుసుకుందాం.
థియరీ డెలపోర్టే (Thierry Delaporte)
ఎక్కువ జీతాలు తీసుకుంటున్న సీఈఓల జాబితాలో విప్రో CEO 'థియరీ డెలపోర్టే' ఉన్నట్లు సమాచారం. ఈయన 2022-23 ఆర్థిక సంవత్సరంలో 10 మిలియన్ డాలర్లను వేతంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 82.2 కోట్లు.
సలీల్ పరేఖ్ (Salil Parekh)
ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఎక్కువ సాలరీ తీసుకుంటున్నవారి జాబితాలో ఒకరు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 56.4 కోట్లు వేతంగా అందుకున్నట్లు సమాచారం. అంతకు ముందు సంవత్సరంలో ఈయన జీతం ఇప్పటికంటే 21 శాతం ఎక్కువగా ఉండేది. అయినప్పటికీ ఎక్కువ జీతం తీసుకుంటున్న రెండవ సీఈఓగా రికార్డ్ సృష్టిచాడు.
ఇదీ చదవండి: మూడు బ్యాంకుల కొత్త ప్రకటనలు.. ఈఎమ్ఐ కట్టే వారికి బిగ్ షాక్!
రాజేశ్ గోపీనాథన్ (Rajesh Gopinathan)
టీసీఎస్ మాజీ సీఈఓ రాజేశ్ గోపీనాథన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 29 కోట్లు వార్షిక వేతంగా అందుకున్నట్లు సమాచారం. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం కంటే కూడా 13 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఐటీ కంపెనీ ఉద్యోగుల సగటు జీతం కంటే ఇది సుమారు 427 రెట్లు ఎక్కువ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ సీఈఓగా కృత్తివాసన్ కొనసాగుతున్నారు.
ఇదీ చదవండి: ఫ్రెండ్‌షిప్‌డే రోజు మిత్రులకు గిఫ్ట్‌గా ఓ స్మార్ట్‌వాచ్ - ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్!
సి విజయ్ కుమార్ (HCL Technologies)
2022-23ఆర్థిక సంవత్సరంలో రూ. 28.4 కోట్లు వార్షిక వేతనం తీసుకున్న హెచ్‌సిఎల్ టెక్ సీఈఓ 'సి విజయ్ కుమార్' మన జాబితాలో ఒకరు. అయితే ఈ యన ఈ సారి తన వేతనం భారీగా తగ్గించుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment