
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల వేతన పెంపును 5-8 శాతం మధ్య ప్రకటించి ఉద్యోగులను నిరాశ పరిచింది. టీఈఎస్‌లో కూడా శాలరీ హైక్ శాతం సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందన్న నివేదికలు వచ్చాయి. తాజగా మరో మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కూడా ఉద్యోగులకు బ్యాడ్ న్యూసే చెప్పింది.
వేతన పెంపు వాయిదా
ఇటీవల జరిగిన టౌన్ హాల్ సమావేశంలో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఎస్ ఉద్యోగులనుద్దేశించి మాట్లడుతూ బోనస్ లు, జీతాల పెంపు ఆలస్యంతో సహా కంపెనీ వేతన పెంపు ప్రణాళికలపై అప్ డేట్స్ ఇచ్చారు. ఏప్రిల్ లో అమలు జరగాల్సిన జీతాల పెంపును ఆగస్టుకు వాయిదా వేయడంపై ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని అంగీకరించారు. అయితే వాగ్దానం చేసిన పెంపుదలను గౌరవించడానికి కంపెనీ కట్టుబడి ఉందని ఆయన ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కంపెనీ ఆర్థిక లక్ష్యాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా జాప్యం ఒక వ్యూహాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు.
వేతన ప్రణాళికలు
బోనస్ స్ట్రక్చర్ గురించి కూడా కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ చర్చించారు. అర్హత కలిగిన ఉద్యోగులు తమ బోనస్ లను ప్రణాళిక ప్రకారం పొందుతారని ధృవీకరించారు. ఇంటర్నల్ మెమో ప్రకారం మార్చి 10లోగా ఉద్యోగులు తమ బోనస్ లకు సంబంధించిన ఈ లెటర్లను ఆశించవచ్చు. పనితీరును ప్రతిఫలించడం, పోటీ వేతన ప్యాకేజీలను నిర్వహించడంలో కంపెనీ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
విస్తృత ఆర్థిక నేపథ్యం
అనిశ్చిత స్థూల ఆర్థిక పరిస్థితులు ఐటీ పరిశ్రమను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో వేతనాల పెంపులో జాప్యం జరుగుతోంది. ఈ సవాళ్లను నావిగేట్ చేస్తూ ఆపరేటింగ్ మార్జిన్లను పెంచడం, ఆఫీస్ స్పేస్‌ను ఆప్టిమైజ్ చేసుకోవడంపై కాగ్నిజెంట్ దృష్టి సారించింది. ప్రతిభను నిలుపుకోవడం, మార్కెట్లో పోటీగా నిలవడం అనే ఉద్దేశంతో కంపెనీ ఈ ప్రయత్నాలను బ్యాలెన్స్ చేస్తోంది.
ఉద్యోగుల ప్రతిస్పందన
వేతనాల పెంపు ఆలస్యం గురించి ముందుగానే ప్రస్తావించడం ఉద్యోగుల్లో మిశ్రమ స్పందనకు దారితీసింది. కొంతమంది దీనిని అట్రిషన్ తగ్గించడానికి మనోధైర్యాన్ని పెంచే చర్యగా భావిస్తుండగా మరికొందరు అదనపు ఒత్తిడి, వారి ఆర్థిక ప్రణాళికపై పడనున్న ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ అనిశ్చితి ఉన్నప్పటికీ పారదర్శకత, ఉద్యోగులకు విలువ ఉండేలా చూడటం పట్ల రవికుమార్ నిబద్ధత సానుకూల పరిణామమని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment