IT jobs
-
ఐటీ కంపెనీల్లో శాలరీ హైక్.. ఈసారి అంచనాలు ఇవే..
ఓ వైపు ఉద్యోగుల తొలగింపు రేట్లు పెరుగుతున్నప్పటికీ భారతీయ ఐటీ పరిశ్రమ జీతాల పెంపు (Salary hike) విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), విప్రో (Wipro), హెచ్‌సీఎల్ టెక్ (HCLTech) వంటి అగ్ర సంస్థలు 2025 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (Q3 FY25) అధిక టర్నోవర్‌ను నివేదించాయి. అయినప్పటికీ ఈ ఏడాది జీతాల పెంపుదల 3% నుండి 6% స్థాయిలోనే ఉంటుందని హెచ్ఆర్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఇచ్చే శాలరీ హైక్ డిమాండ్ ఆధారిత పెరుగుదల కాదని, ప్రపంచ అనిశ్చితులకు అనుగుణంగా రంగాల వ్యాప్త సర్దుబాటు అని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు . ఈ సంవత్సరానికి ఐటీ ఉద్యోగుల తొలగింపు (అట్రిషన్) రేటు 12-13% వరకు ఉంటుందని అంచనా. కానీ జీతాల పెరుగుదల మాత్రం అంతంతమాత్రంగానే ఉండనుంది. అధిక పనితీరు కనబరిచేవారికి మాత్రం కాస్తంత మెరుగైన వేతన పెంపు లభించే అవకాశం ఉంది.ఏ కంపెనీలో ఏంటి పరిస్థితి?దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్రైజల్ సైకిల్‌ను ఇప్పటికే ప్రారంభించింది. ఇప్పటికీ పద్ధతి ప్రకారం నిర్ధిష్ట కాల వ్యవధిలో అప్రైజల్ ప్రక్రియను అమలు చేస్తున్న అతి కొద్ది కంపెనీలలో టీసీఎల్ కూడా ఒకటి. 2025లో ఉద్యోగులకు సగటున 7-8 శాతం జీతాల పెంపును కంపెనీ ప్రకటించిందిఇక ఇన్ఫోసిస్ విషయానికొస్తే 2025 ఆర్థిక సంవత్సరానికి జీతాల పెంపుదల రెండు దశల్లో జరిగింది. జూనియర్ ఉద్యోగులు జనవరిలో వేతన పెంపు అందుకోగా మిగిలిన వారికి ఏప్రిల్‌లో జీతాల పెంపుదల అందుతుంది. దేశంలో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు జీతాల పెంపుదల 6-8 శాతం పరిధిలో ఉంటుందని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ ఇప్పటికే సంకేతాలిచ్చారు.మరోవైపు విప్రో, హెచ్‌సీఎల్‌టెక్.. ఈ రెండు కంపెనీలు అధిక అట్రిషన్ రేట్లను నివేదించాయి. అయినప్పటికీ వేతన పెంపుదలలో ఆలోచించి అడుగులు వేస్తున్నాయి. స్థిర పెంపుదల కంటే వేరియబుల్ పే సర్దుబాట్లపైనే ఇవి దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ఐటీ పరిశ్రమలో అప్రైజల్ సైకిల్ సాధారణంగా ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో ఉంటుంది. కానీ ఖర్చులను తగ్గించుకునేందుకు చాలా కంపెనీలు అప్రైజల్ సైకిల్‌ను ఏప్రిల్-జూన్ మధ్య కాలం నుండి క్యూ3 (సెప్టెంబర్-అక్టోబర్) కు వాయిదా వేశాయి. -
మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. (Microsoft layoffs) మెరుగైన పనితీరు ప్రదర్శించని ఉద్యోగులపై తొలగింపు వేటు వేసింది. బిజినెస్ ఇన్సైడర్ పత్రికలో పేర్కొన్న కథనం ప్రకారం.. మైక్రోసాఫ్ట్ యూఎస్‌లో కొందరు ఉద్యోగులను వారి పనితీరు ఆధారంగా తొలగించడం ప్రారంభించింది.తాజాగా తొలగింపులకు గురైన ఉద్యోగులకు మెడికల్, ప్రిస్క్రిప్షన్, డెంటల్ హెల్త్‌కేర్ ప్రయోజనాలు తక్షణమే ముగుస్తాయని కంపెనీ తొలగింపు లేఖల్లో పేర్కొన్నట్లుగా ఇన్సైడర్ కథనంలో ఉదహరించింది. ముగ్గురు ఉద్యోగులకైతే తొలగింపు పరిహారాన్ని కూడా చెల్లించలేదని పేర్కొంది."మీ పనితీరు కనీస ప్రమాణాలను, అంచనాలను అందుకోలేకపోవడమే మీ తొలగింపునకు కారణం" అని తొలగింపు లేఖల్లో కంపెనీ పేర్కొంది. "మీరు తక్షణమే అన్ని విధుల నుండి వైదొలుగుతున్నారు. మైక్రోసాఫ్ట్ సిస్టమ్‌లు, ఖాతాలు, కార్యాలయాలకు యాక్సెస్‌ను ఈరోజు నుంచే తొగిస్తున్నాం. ఇక మైక్రోసాఫ్ట్ తరఫున మీరు ఇటువంటి పని చేయలేరు" అని వివరించింది.ఇది చదివారా? ఉద్యోగులకు మరో షాకిచ్చిన టీసీఎస్..ఇక తొలగింపునకు గురైన ఉద్యోగి భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్‌లో మరో కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు కంపెనీలో సదరు ఉద్యోగి గత పనితీరు, తొలగింపునకు గురైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కూడా ఆ లేఖల్లో పేర్కొన్నారు.గతేడాది జూన్ చివరి నాటికి మైక్రోసాఫ్ట్ సంస్థలో దాదాపు 2,28,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉన్నారు. ఇవే కాదు.. మైక్రోసాఫ్ట్ ఇటీవల సెక్యూరిటీ, ఎక్స్పీరియన్స్ అండ్ డివైజెస్, సేల్స్, గేమింగ్‌లో విభాగాల్లోనూ పలువురు ఉద్యోగులను తొలగించింది. అయితే తొలగింపులు స్వల్ప స్థాయిలోనే ఉండటం, సమీప కాలంలోనే వీటిని భర్తీ చేయనుండటంతో మొత్తంగా కంపెనీ హెడ్‌కౌంట్‌లో పెద్దగా తగ్గింపు ఉండకపోవచ్చు.భారత్‌లో 2587 మంది టెకీలు2024 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో మొదటి ఐదు భారతీయ ఐటీ సంస్థల్లో నికరంగా 2,587 మంది ఉద్యోగులు తగ్గారు. (Job cuts) గత త్రైమాసికంతో పోలిస్తే ఇది పూర్తిగా విరుద్ధం. సెప్టెంబర్ త్రైమాసికంలో 15,033 మంది ఉద్యోగులు పెరిగారు. గడచిన మూడు నెలల కాలంలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్ 7,725 మంది ఉద్యోగులను పెంచుకోగా, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలు మాత్రం ఉద్యోగులను తగ్గించాయి. -
5 ఐటీ కంపెనీలు.. 3 నెలలు.. 2587 మంది టెకీలు..
దేశ ఐటీ రంగం (IT sector) ఆటోమేషన్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ద్వారా పరివర్తన చెందుతోంది. గతంలో సాంప్రదాయకంగా శ్రామికశక్తి విస్తరణపై దృష్టి సారించిన ఐటీ పరిశ్రమ ఇప్పుడు తక్కువ నుండి మధ్యస్థ సంక్లిష్టత కలిగిన పనులను ఆటోమేట్ చేస్తోంది. ఫలితంగా నియామక విధానాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి.2024 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో మొదటి ఐదు భారతీయ ఐటీ సంస్థల్లో నికరంగా 2,587 మంది ఉద్యోగులు తగ్గారు. (Job cuts) గత త్రైమాసికంతో పోలిస్తే ఇది పూర్తిగా విరుద్ధం. సెప్టెంబర్ త్రైమాసికంలో 15,033 మంది ఉద్యోగులు పెరిగారు. గడచిన మూడు నెలల కాలంలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్ 7,725 మంది ఉద్యోగులను పెంచుకోగా, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలు మాత్రం ఉద్యోగులను తగ్గించాయి.మార్చి త్రైమాసికంలోనూ ఇదే ట్రెండ్ఇలాంటి ట్రెండ్ 2024 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలోనూ కనిపించింది. ఐటీ సంస్థలు సమిష్టిగా 12,600 ఉద్యోగాలను తగ్గించాయి. అంతకు క్రితం ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం 60,000 మంది ఉద్యోగులను జోడించిన క్రమంలో వెంటనే ఈ స్థాయిలో ఉద్యోగులు తగ్గడం గమనార్హం.గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCC) ద్వారా వృద్ధి పెరుగుతున్న నేపథ్యంలో 2025 ఆర్థిక ఏడాదిలో ఐటీ రంగం గత ఆర్థిక సంవత్సరం శ్రామికశక్తిలో నాలుగింట ఒక వంతు కంటే తక్కువగానే జతవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్క్‌ఫోర్స్ జోడింపులో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు వరుసగా రెండవ సంవత్సరం కూడా సాంప్రదాయ ఐటీ సంస్థలను అధిగమిస్తాయని భావిస్తున్నారు.కోవిడ్ మహమ్మారి సమయంలో ఐటీ పరిశ్రమ దూకుడుగా నియామకాలు చేపట్టిందని, ఫలితంగా వర్క్‌ఫోర్స్ అధికంగా పోగుపడిందని ఎవరెస్ట్ గ్రూప్‌కు చెందిన పీటర్ బెండోర్-శామ్యూల్ చెబుతున్నారు. కంపెనీలు నియామకాలను తగ్గించడం, రీబ్యాలెన్స్ కోసం అట్రిషన్‌ను అనుమతించడం వలన ఉత్పాదకత లాభాలు కొంత ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. రాబడి వృద్ధి ఇకపై కేవలం హెడ్‌కౌంట్‌ను పెంచడంపై ఆధారపడి ఉండదని, నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండ్‌తో అధిక బిల్లింగ్ రేట్లను పెంచుతుందని హెచ్‌సీఎల్‌టెక్ సీఈవో పేర్కొన్నారు.అమెరికా ఐటీలో అనిశ్చితిఅమెరికాలో వచ్చిన కొత్త పరిపాలనలో హెచ్ వన్ బీ (H1B) వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలతో సహా ఇమ్మిగ్రేషన్ విధానాలు మారవచ్చు కాబట్టి యూఎస్‌లోని భారతీయ ఐటీ నిపుణులు అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. కొంతమంది నిపుణులు యూరప్ వంటి దేశాల్లో అవకాశాలను అన్వేషిస్తున్నారు. అనిశ్చితి ఉన్నప్పటికీ నైపుణ్యం కలిగిన నిపుణులను నియమించుకునేందుకు యూఎస్ కంపెనీలు ప్రయత్నిస్తాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. -
ఉద్యోగులకు మరో షాకిచ్చిన టీసీఎస్..
ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం (IT Company) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు మరో షాకిచ్చింది. ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని (WFH) పూర్తిగా తొలగించి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తున్న టీసీఎస్ అందులోనూ కీలక మార్పులు చేసింది.ఆఫీస్ హాజరు మినహాయింపుల కోసం అభ్యర్థనలకు సంబంధించి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ (WFO) విధానాన్ని టీసీఎస్ తాజాగా సవరించింది. కార్యాలయ హాజరు అవసరాలను కఠినతరం చేసింది. కంపెనీ తన భారతీయ సిబ్బందికి చేసిన ప్రకటన ప్రకారం.. ఆఫీస్ హాజరు మినహాయింపు కోసం ఉద్యోగులు ఒక త్రైమాసికంలో గరిష్టంగా ఆరు రోజులు వ్యక్తిగత అత్యవసర పరిస్థితులను కారణంగా పేర్కొనవచ్చు. ఒక వేళ ఈ మినహాయింపులను వాడుకోలేకపోయినా తరువాత త్రైమాసికానికి బదిలీ చేసుకునే వెసులుబాటు కూడా ఉండదు.ఎంట్రీల్లోనూ పరిమితులుఇక ఒక ఎంట్రీలో గరిష్టంగా 30 మినహాయింపులను సమర్పించడానికి ఉద్యోగులకు అవకాశం ఉంటుంది. నెట్‌వర్క్‌కు సంబంధించిన సమస్యలైతే ఒకేసారికి ఐదు ఎంట్రీలు నివేదించవచ్చు. 10 రోజులలోపు పూర్తి చేయని మినహాయింపు అభ్యర్థనలు వాటంతటవే రిజెక్ట్ అవుతాయి. ఆలస్యంగా చేసే సమర్పణలకు సంబంధించి ప్రస్తుత తేదీ నుండి మునుపటి రెండు తేదీల వరకు మాత్రమే బ్యాక్‌డేటెడ్ ఎంట్రీకి అనుమతి ఉంటుంది. అలాగే ప్రస్తుత నెలలో డబ్ల్యూఎఫ్‌వో ఎంట్రీ కేటగిరీ లేకపోతే తదుపరి నెల 5వ తేదీ వరకు దాన్ని నివేదించవచ్చని కంపెనీ నోట్ పేర్కొంది.కార్యాలయ హాజరు ఆదేశం నుండి మినహాయింపులను అభ్యర్థించడానికి లార్జ్ స్కేల్ అప్లోడ్లు లేదా బ్యాకెండ్ ఎంట్రీలను టీసీఎస్ నిషేధించింది. ఐదు రోజుల వర్క్‌వీక్ హాజరు విధానాన్ని అవలంబించడంలో కొన్ని ఇతర భారతీయ ఐటీ సంస్థలతో పాటు టీసీఎస్ ముందంజ వేసింది. ఇతర సంస్థలు వారానికి రెండు నుండి మూడు రోజుల పాటు కార్యాలయంలో హాజరును తప్పనిసరి చేశాయి. హాజరు సమ్మతితో వేరియబుల్ పేని ముడిపెట్టాయి.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ జీతాల పెంపు.. ఎంత పెరుగుతాయంటే..ఉద్యోగులు స్థిరత్వం సాధించిన తర్వాత ఈ విధానాన్ని నిలిపివేసే అవకాశం ఉందని టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ మిలింద్ లక్కాడ్ చెప్పినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన తర్వాత లక్కడ్ మాట్లాడుతూ ఎంట్రీ-లెవల్ ఉద్యోగులు పూర్తి వేరియబుల్ వేతనాన్ని పొందేందుకు అర్హులని, మిడ్, సీనియర్ లెవల్ సిబ్బంది వేరియబుల్ వేతనం వారి పనితీరుపై ఆధారపడి ఉంటుందని వివరించారు.40,000 మంది నియామకంటీసీఎస్ ఈ ఏడాది 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఐటీ దిగ్గజం చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) మిలింద్ లక్కడ్ వెల్లడించారు. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 5,000 మంది తగ్గినట్లు టీసీఎస్ తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ.. ఫ్రెషర్లకు ఉద్యోగా అవకాశాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నామని ఓ ఇంటర్వ్యూలో మిలింద్ లక్కడ్ స్పష్టం చేశారు.టీసీఎస్ సంస్థలో ఉద్యోగం పొందాలంటే.. కేవలం కోడింగ్ నైపుణ్యాలు ఉంటే సరిపోదని.. అభ్యర్థులకు తగిన విద్యార్హతలు కూడా ఉండాలని లక్కడ్ వెల్లడించారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోవని స్పష్టం చేశారు. ఏఐ వల్ల ఉద్యోగుల సామర్థ్యం మెరుగుపడుతుందని తెలిపారు. మనిషి ఆలోచనా శక్తికి ఉన్న ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే క్లయింట్లను నేరుగా సంప్రదించాల్సిన విభాగాలలో.. ఇతర అవసరమైన విభాగాల్లో మానవ వనరుల ప్రాధాన్యత తప్పకుండా ఉంటుందని మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. -
ముప్పు అంచున మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు..
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఆలోచన ఉద్యోగులను కలవరపెడుతోంది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం.. మైక్రోసాఫ్ట్ పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగించాలని (lay off) యోచిస్తోంది. ఈ ఉద్యోగాల కోతలు కంపెనీలోని ముఖ్యమైన భద్రతా విభాగంతో సహా అన్ని భాగాలలో జరుగుతున్నాయి.మైక్రోసాఫ్ట్ దాని పోటీదారుల మాదిరిగానే ఉద్యోగుల పనితీరు నిర్వహణపై బలమైన వైఖరిని తీసుకుంటోంది. మేనేజర్లు గత కొన్ని నెలలుగా ఇదే పనిమీద ఉన్నారు. ఉద్యోగుల పనితీరును వివిధ స్థాయిల్లో లెక్కిస్తున్నారు. ఉద్యోగాల కోతలను కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారని, అయితే బాధిత ఉద్యోగుల సంఖ్యను పంచుకోవడానికి నిరాకరించారని నివేదిక పేర్కొంది."మైక్రోసాఫ్ట్‌లో అధిక-పనితీరు ప్రతిభపై దృష్టి పెడతాము" అని కంపెనీ ప్రతినిధిని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. "ఉద్యోగులు నేర్చుకోవడానికి, ఎదగడానికి సహాయం చేయడంలో మేము ఎల్లప్పుడూ సహకారం అందిస్తాం. అదే సమయంలో ప్రతిభ చూపనివారి పట్ల తగిన చర్యలు తీసుకుంటాము" అని ప్రతినిధి వివరించినట్లుగా చొప్పుకొచ్చింది.మైక్రోసాఫ్ట్ 2023 నుండి అనేక రౌండ్ల తొలగింపులను చేపడుతూ వస్తోంది. 2024 మేలో మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన ఎక్స్‌బాక్స్ (Xbox) విభాగం ప్రసిద్ధ ఆర్కేన్ ఆస్టిన్‌తో సహా అనేక గేమింగ్ స్టూడియోలను మూసివేసింది. పునర్నిర్మాణ ప్రయత్నంగా సంబంధిత సిబ్బందిని తొలగించింది. అదే సంవత్సరం జూన్‌లో మళ్లీ దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. జూలైలో మరో రౌండ్ తొలగింపులు చేపట్టింది.ఇలా పనితీరు కారణాల వల్ల ఏర్పడిన ఖాళీలను మైక్రోసాఫ్ట్ అప్పుడప్పుడూ భర్తీ చేస్తూ వస్తోంది. దీంతో ఇది టెక్ దిగ్గజం మొత్తం హెడ్‌కౌంట్‌లో స్వల్ప మార్పులకు దారితీసింది. నివేదిక ప్రకారం.. ఇది జూన్ చివరి నాటికి 228,000గా ఉంది.ఏఐలో పెట్టుబడులుభారత్లో క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాలను విస్తరించడం కోసం మైక్రోసాఫ్ట్ 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,700 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. భారత్‌లో మానవ వనరులకున్న సామర్థ్యం దృష్ట్యా, 2030 కల్లా కోటి మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తాజాగా చెప్పారు.ఏ దేశంలోనైనా విస్తరణ నిమిత్తం మైక్రోసాఫ్ట్ పెడుతున్న పెట్టుబడుల్లో ఇదే అత్యధికమని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఎంత కాలావధిలో ఈ మొత్తం పెడతారన్నది ఆయన వెల్లడించలేదు. భారత్‌లో ఏఐ ప్రగతి చాలా బాగుందని కితాబునిచ్చారు. గతేడాది ఫిబ్రవరిలో మన దేశంలో పర్యటించిన నాదెళ్ల, 2025 కల్లా 20 లక్షల మందికి ఏఐ నైపుణ్య శిక్షణ ఇస్తామని.. గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లోని వ్యక్తులపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. -
ఐటీ ఉద్యోగులకు తీవ్ర నిరాశ.. టాప్ 2 కంపెనీ ఝలక్
దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) వార్షిక వేతనాల పెంపును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (Q4FY25)వాయిదా వేసింది. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ చివరిసారిగా 2023 నవంబర్‌లో జీతాల పెంపును అమలు చేసింది.అన్ని ఐటీ కంపెనీలదీ అదే దారిసాధారణంగా సంవత్సరం ప్రారంభంలో అమలు కావాల్సిన వేతన పెంపు ఆలస్యం కావడం ప్రపంచ డిమాండ్ వాతావరణంలో ప్రత్యేకించి ఐటీ సేవల రంగంలో విస్తృత అనిశ్చితిని ప్రతిబింబిస్తోంది. బలహీనమైన విచక్షణ వ్యయం, క్లయింట్ బడ్జెట్ల ఆలస్యం, కొనసాగుతున్న స్థూల ఆర్థిక అనిశ్చితితో ఐటీ కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.ఇటాంటి వాతావరణంలో పోటీ కంపెనీలైన హెచ్‌సీఎల్ టెక్ (HCLTech), ఎల్టీఐ మైండ్‌ట్రీ (LTIMindtree), ఎల్&టీ (L&T) టెక్ సర్వీసెస్ కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు, లాభదాయకతను కొనసాగించడానికి రెండవ త్రైమాసికంలో జీతం ఇంక్రిమెంట్లను దాటవేశాయి.క్యూ4లో అక్టోబర్ 17న దశలవారీగా వేతనాల పెంపుదలకు ప్లాన్ చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. అందులో కొంత భాగం జనవరిలో అమలులోకి వస్తుందని, మిగిలినది ఏప్రిల్‌లో అమలులోకి వస్తుందని క్యూ2 ఫలితాల తర్వాత విలేకరుల సమావేశంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్రాజ్కా తెలిపారు.లాభం మెరుగురెండవ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం త్రైమాసికానికి 2.2 శాతం పెరిగి రూ. 6,506 కోట్లకు చేరుకుంది. తక్కువ ఆన్సైట్ ఖర్చులు, మెరుగైన వినియోగ రేట్లు, మెరుగైన కార్యాచరణ సామర్థ్యాల కారణంగా మార్జిన్లు 10 బేసిస్ పాయింట్ల మేర మెరుగయ్యాయి.వేతనాల్లో భారీ వ్యత్యాసంసాధారణంగా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు (IT Employees) మంచి జీతాలు (Salary) ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఉన్నత స్థాయి అధికారులకు, ప్రారంభ స్థాయి ఉద్యోగులకు మధ్య వేతనాల పెంపు విషయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ‘మనీకంట్రోల్’ విశ్లేషించిన డేటా ప్రకారం.. గత ఐదేళ్లలో దేశంలోని ఐదు ప్రముఖ ఐటీ కంపెనీల్లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలు 160% పెరిగాయి. కానీ ఫ్రెషర్ల (Freshers) జీతాలు పెరిగింది కేవలం 4 శాతమే.2024 ఆర్థిక సంవత్సరంలో సీఈవోల (CEO) సగటు వార్షిక వేతనం రూ. 84 కోట్లకు చేరువగా ఉండగా, ఫ్రెషర్స్ జీతాలు రూ. 3.6 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెరిగాయి. డేటాలో చేర్చిన కంపెనీల్లో టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), హెచ్‌సీఎల్ టెక్ (HCLTech), విప్రో (Wipro), టెక్ మహీంద్ర (Tech Mahindra) ఉన్నాయి.ఇదీ చదవండి: అప్పుడు బెంగళూరు.. ఇప్పుడు మరోచోట గూగుల్ భారీ ఆఫీస్!ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్‌తో సహా విమర్శకులు వేతన పెరుగుదలలో భారీ వ్యత్యాసంపై ఆందోళన వెలిబుచ్చారు. ఫ్రెషర్లకు తక్కువ జీతం ఇస్తున్నప్పుడు ఉన్నత స్థాయి అధికారులకు ఉదారంగా వేతన ప్యాకేజీలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. పెరుగుతున్న అసమానతలు, ఆర్థిక వినియోగంపై దాని హానికరమైన ప్రభావాన్ని మోహన్‌దాస్ పాయ్ ఎత్తిచూపారు.ఈ ఐటీ కంపెనీల్లో సీఈవోలు, ఫ్రెషర్లు మధ్య వేతన వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ఉదాహరణకు విప్రో నిష్పత్తి 1702:1 వద్ద ఉండగా, టీసీఎస్ నిష్పత్తి 192:1. ఐటీ పరిశ్రమలో పరిస్థితి ఇలా ఉంటే.. ఇంజనీరింగ్, తయారీ వంటి ఇతర రంగాలలో వేతన వృద్ధి మరింత దిగజారింది. 2019, 2023 మధ్య ఏటా వేతన వృద్ధి కేవలం 0.8% మాత్రమే. -
ఐటీ ఉద్యోగాలు.. ఇంకొన్నాళ్లు ఇంతే!
భారతీయ ఐటీ సేవల పరిశ్రమలో 2025–26 రెండవ అర్ధ భాగం నాటికి వృద్ధి ఊపందుకునేంత వరకు నియామకాలు సమీప కాలంలో తక్కువ స్థాయిలోనే ఉంటాయని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఇక్రా నివేదిక ప్రకారం.. యుఎస్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల తక్షణ కాలంలో కొంత విధానపర అనిశ్చితి ఏర్పడవచ్చు.అనిశ్చిత స్థూల ఆర్థిక వాతావరణం మధ్య యూఎస్, యూరప్‌లోని కీలక మార్కెట్లలో కస్టమర్లు సాంకేతికతపై తక్కువ వ్యయం చేయడంతో 6–8 త్రైమాసికాల్లో భారతీయ ఐటీ సేవల కంపెనీలకు డిమాండ్ తగ్గింది. తక్కువ అట్రిషన్, ఉద్యోగుల వినియోగాన్ని పెంచడంపై దృష్టి పెట్టడం వంటి అంశాలు కూడా నియామకాల్లో మందగమనానికి కారణం అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కొంత రికవరీ ఉన్నప్పటికీ.. 2025–26 అక్టోబర్–మార్చి నాటికి వృద్ధి ఊపందుకుంటున్నంత వరకు సమీప కాలంలో నియామకాలు తక్కువగానే ఉంటాయి. నైపుణ్యాన్ని పెంచుతున్నాయి.. 2021–22, 2022–23 కాలంలో జోడించిన ఉద్యోగుల వినియోగం పెరుగుదల 2023–24, 2024–25 క్యూ1లో ఐటీ సేవల కంపెనీల నియామకాలపై ఒత్తిడి తెచ్చింది. అట్రిషన్ స్థాయిల పెరుగుదలతో పాటు, ఇక్రా ఎంచుకున్న కంపెనీలకు 2024–25 క్యూ1 వరకు ఏడు త్రైమాసికాల్లో నికర ఉద్యోగుల చేరిక ప్రతికూలతకు దారితీసింది. ఈ జాబితాలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా, విప్రో లిమిటెడ్ ఉన్నాయి.జనరేటివ్ (జెన్) ఏఐ వేగంగా ప్రవేశిస్తున్నందున ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యాపార అవకాశాలను అన్వేషించడం ద్వారా అన్ని ప్రముఖ ఐటీ సేవల కంపెనీలు తమ ఉద్యోగులకు నైపుణ్యాన్ని పెంచుతున్నాయి. కోవిడ్‌కు ముందు ఉన్న స్థాయిలతో పోలిస్తే ఇది తాజా నియామకంలో మొత్తం నియంత్రణకు దారితీసే అవకాశం ఉందని అంచనా. ఉద్యోగుల ఉత్పాదకతను మెరుగుపరచడం కోసం జనరేటివ్ ఏఐ విస్తృత స్వీకరణ ప్రభావం రాబోయే కొన్ని సంవత్సరాలలో కనిపిస్తుందని ఇక్రా నివేదిక తెలిపింది. డిమాండ్ నియంత్రణతో.. నివేదిక రూపకల్పనకు ఇక్రా ఎంచుకున్న కంపెనీల్లో ఒక్కో ఉద్యోగికి సగటు ఆదాయం 2019–20 నుంచి 2023–24లో దాదాపు 50,000 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. 12 నెలల అట్రిషన్ రేటు 2021–22 క్యూ4, 2022–23 క్యూ1 సమయంలో దాదాపు 23 శాతానికి చేరుకుంది. నియామకాలు పెద్ద ఎత్తున జరగడం, ఆ తరువాత డిమాండ్–సరఫరా అసమతుల్యత ఇందుకు కారణం.యూఎస్, యూరప్‌లోని కీలక మార్కెట్లలో డిమాండ్ నియంత్రణ కారణంగా ఐటీ సేవల కంపెనీల ద్వారా తక్కువ నియామకాలతో అట్రిషన్ క్రమంగా క్షీణించింది. ఇక్రా నమూనా కంపెనీల అట్రిషన్ రేటు 2023–24 క్యూ3 నుండి దాదాపు 13 శాతం వద్ద స్థిరీకరించడం ప్రారంభించింది. కోవిడ్ ముందస్తు 2019–20 క్యూ1లో ఇది 18 శాతం నమోదైంది అని ఇక్రా వివరించింది. -
ఐటీ ఉద్యోగ నియామకాల పరిస్థితి ఇదీ..
ముంబై: వైట్ కాలర్ ఉద్యోగుల (నైపుణ్య, నిర్వహణ విధులు) నియామకాలు నవంబర్ నెలలో 2 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, కృత్రిమ మేథ–మెషిన్ లెర్నింగ్ (ఏఐ/ఎంఎల్), ఎఫ్ఎంసీజీ రంగాల్లో నియామకాలు సానుకూలంగా నమోదయ్యాయి. నవంబర్ నెలకు సంబంధించిన గణాంకాలను నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ విడుదల చేసింది.నౌకరీ ప్లాట్‌ఫామ్‌పై వైట్‌కాలర్ ఉద్యోగాలకు సంబంధించి 2,430 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 2 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో 16 శాతం, ఫార్మా/బయోటెక్ రంగంలో 7 శాతం, ఎఫ్ఎంసీజీ రంగంలో 7 శాతం, రియల్ ఎస్టేట్‌లో 10 శాతం చొప్పున వైట్ కాలర్ నియామకాలు అధికంగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఏఐ/ఎంఎల్ విభాగంలో 30 శాతం, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లలో 11 శాతం అధికంగా ఉపాధి కల్పన జరిగినట్టు నౌకరీ నివేదిక తెలిపింది.ఐటీ రంగంలో వైట్ కాలర్ నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చిచూసినప్పుడు ఎలాంటి వృద్ధి లేకుండా ఫ్లాట్‌గా నమోదైంది. పండుగల సీజన్ మద్దతుతో ఇతర రంగాల్లో నియామకాలు మోస్తరుగా ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే రాజస్థాన్ ముందుంది. జైపూర్ 14 శాతం, ఉదయ్‌పూర్ 24 శాతం, కోటలో 15 శాతం వైట్ కాలర్ నియామకాలు పెరిగాయి. జైపూర్‌లో విదేశీ ఎంఎన్సీ కంపెనీల తరఫున నియామకాలు 20 శాతం పెరిగాయి. భువనేశ్వర్‌లో 21 శాతం వృద్ధి కనిపించింది. -
ఐటీ జాబ్స్.. వచ్చే ఆరు నెలలూ అదుర్స్!
న్యూఢిల్లీ: టెక్నాలజీ వేగవంతంగా మారిపోతున్న నేపథ్యంలో దేశీయంగా ఐటీ సర్వీసుల విభాగంలో ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. వచ్చే ఆరు నెలల్లో నియామకాలు 10–12 శాతం వరకు పెరగనున్నాయి. జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన కొత్త టెక్నాలజీలతో 2030 నాటికి పది లక్షల పైగా ఉద్యోగాల కల్పన జరగనుంది.బిజినెస్ సర్వీసుల సంస్థ క్వెస్ కార్ప్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు త్రైమాసికాల్లో క్వెస్ ఐటీ స్టాఫింగ్ విభాగం కార్యకలాపాల ఆధారంగా దీన్ని రూపొందించారు. టెక్ నియామకాలకు నెలకొన్న డిమాండ్, మార్కెట్లో పరిస్థితుల గురించి సంస్థలకు అవగాహన కల్పించే విధంగా గణాంకాలను ఇందులో విశ్లేషించారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), సైబర్‌సెక్యూరిటీ విభాగాల్లో రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) నిపుణులైన సిబ్బందికి డిమాండ్ గణనీయంగా పెరిగింది.సీక్వెన్షియల్ ప్రాతిపదికన క్రితం త్రైమాసికంతో పోలిస్తే జీసీసీలో 71 శాతం, సైబర్‌సెక్యూరిటీలో 58 శాతం మేర ఉద్యోగావకాశాలు పెరిగాయి. పుష్కలంగా టెక్ నిపుణుల లభ్యత, వినూత్నంగా ఆలోచించగలిగే సామర్థ్యాలతో డిజిటల్ విప్లవానికి సంబంధించి భారత్ ముందంజలో ఉంటున్న నేపథ్యంలో దేశీయంగా వచ్చే 6 నెలల్లో ఐటీ సర్వీసుల్లో హైరింగ్ 10–12 శాతం పెరగవచ్చని క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో కపిల్ జోషి తెలిపారు. టాప్ 5 నైపుణ్యాలు.. నివేదిక ప్రకారం రెండో త్రైమాసికానికి సంబంధించి హైరింగ్ డిమాండ్‌లో 79 శాతం వాటా .. ఈఆర్పీ, టెస్టింగ్, నెట్వర్కింగ్, డెవలప్మెంట్, డేటా సైన్స్ వంటి అయిదు నైపుణ్యాలది ఉంది. వీటికి తోడు జావా (30 శాతం), సైబర్‌సెక్యూరిటీ (20 శాతం), డెవ్ఆప్స్ (25 శాతం) వంటి ప్రత్యేక నైపుణ్యాలకు కూడా డిమాండ్ నెలకొంది.క్యూ2లో టెక్ హైరింగ్‌కి సంబంధించి జీసీసీలు ముందంజలో ఉన్నాయి. ఏఐ/ఎంఎల్, అనలిటిక్స్, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్, డెవ్ఆప్స్ నిపుణులకు డిమాండ్ కనిపించింది. ప్రాంతాలవారీగా చూస్తే మొత్తం ఉద్యోగావకాశాలకు సంబంధించి 62 శాతం వాటాతో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. 43.5 శాతంతో హైదరాబాద్ తర్వాత స్థానంలో ఉంది. దేశీయంగా జీసీసీలు విస్తరిస్తుండటంతో వివిధ నగరాల్లో ప్రతిభావంతులకు డిమాండ్ పెరిగింది. ఈ సంస్థలు ఇంజినీరింగ్, ఐటీ, ఫైనాన్స్, అనలిటిక్స్ వంటి విభాగాల్లో సుశిక్షితులైన నిపుణులపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కూడా ఉద్యోగులను తీసుకునే యోచనలో ఉన్నాయి. -
ఐటీలో కొత్త ట్రెండ్.. మీరొస్తామంటే మేమొద్దంటామా?
ఐటీ పరిశ్రమలో కాగ్నిజెంట్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. సంస్థను వీడి వెళ్లిన ఉద్యోగులు తిరిగి రావాలనుకుంటే వారికి ‘మీరొస్తామంటే మేమొద్దంటామా’ అంటూ సాదరంగా స్వాగతం పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లొ 13,000 మంది మాజీ ఉద్యోగులను తిరిగి నియమించుకుని సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.ఒక కంపెనీలో పనిచేసి వ్యక్తిగత లేదా వృత్తిపరమైన కారణాలతో సంస్థను వీడి తిరిగి అదే కంపెనీలో చేరేవారిని ‘బూమరాంగ్ ఉద్యోగులు’ అని వ్యవహరిస్తారు. కాగ్నిజెంట్‌లో ఇలాంటి పునర్నియామకాలు గత రెండు సంవత్సరాలలో 40% పెరిగాయి.కాగ్నిజెంట్.. ఇతర కంపెనీల మాదిరిగా కేవలం ఉన్న ఉద్యోగులను నిలుపుకోవడంపైన మాత్రమే దృష్టి పెట్టకుండా సంస్థను వీడి వెళ్లిన మాజీ ఉద్యోగులను సైతం స్వాగతిస్తోంది. సాధారణంగా బూమరాంగ్ సంస్కృతి ఇతర రంగాలతో పోలిస్తే ఐటీ పరిశ్రమలో చాలా అరుదు.ఇదీ చదవండి: నో బోనస్.. ఉద్యోగులకు టీసీఎస్ ఝలక్!మాజీ ఉద్యోగులను తిరిగి ఆకర్షించడం అనేది ఇప్పుడు పెద్ద ట్రెండ్‌లో భాగం. దీనిలో కంపెనీలు ఉద్యోగి నిష్క్రమణలను దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించడానికి అవకాశాలుగా చూస్తాయి. సంస్థను వీడి వెళ్తున్న ఉద్యోగులతో మంచిగా వ్యవహరించడం, వారు తిరిగి రావడానికి తలుపులు తెరిచి ఉంచడం ద్వారా సరికొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నాయి. డెలాయిట్ వంటి ప్రముఖ కంపెనీలు మాజీ ఉద్యోగుల కోసం ఆలుమ్నీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. -
నో బోనస్.. ఉద్యోగులకు టీసీఎస్ ఝలక్!
దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కొంతమంది ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది. ఆఫీస్ నుంచి పని చేసే విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్న టీసీఎస్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కొందరు ఉద్యోగులకు బోనస్ చెల్లింపులను తగ్గించింది.‘మనీకంట్రోల్’ నివేదిక ప్రకారం.. జూనియర్ ఉద్యోగులు ఇప్పటికీ వారి పూర్తి త్రైమాసిక వేరియబుల్ అలవెన్స్‌ను అందుకున్నారు. అయితే కొంతమంది సీనియర్ ఉద్యోగులకు మాత్రం బోనస్‌లో 20-40 శాతం కోత విధించింది ఐటీ దిగ్గజం. కొంతమందికైతే బోనస్ అస్సలు లభించలేదు.“2025 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జూనియర్ గ్రేడ్లకు 100% క్యూవీఏ (త్రైమాసిక వేరియబుల్ అలవెన్స్) చెల్లించాము. ఇతర అన్ని గ్రేడ్లకు క్యూవీఏ వారి యూనిట్ వ్యాపార పనితీరుపై ఆధారపడి ఉంటుంది” అని టీసీఎస్ ప్రతినిధి చెప్పినట్లుగా మీడియా నివేదికలో పేర్కొన్నారు.టీసీఎస్ కార్యాలయ హాజరు, ఆయా వ్యాపార యూనిట్ల పనితీరు రెండింటి ఆధారంగా బోనస్‌లను నిర్ణయిస్తుంది. ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేలా కంపెనీ చర్యలు తీసుకుంటోంది. హాజరు విధానాలను స్థిరంగా పాటించకపోవడం క్రమశిక్షణా చర్యకు దారితీస్తుందని టీసీఎస్ గతంలోనే స్పష్టం చేసింది.కార్యాలయ హాజరు కీలకంఉద్యోగుల కార్యాలయ హాజరును కీలక అంశంగా చేరుస్తూ సవరించిన వేరియబుల్ పే విధానాన్ని టీసీఎస్ గత ఏప్రిల్‌లో ప్రవేశపెట్టింది. కొత్త విధానం ఉద్యోగులకు వేరియబుల్ వేతనాన్ని నిర్దేశిస్తూ నాలుగు హాజరు స్లాబ్‌లను ఏర్పాటు చేసింది. కొత్త విధానం ప్రకారం.. 60 శాతం కంటే తక్కువ సమయం కార్యాలయాల పనిచేసే ఉద్యోగులకు త్రైమాసికానికి ఎటువంటి వేరియబుల్ వేతనం లభించదు.ఇదీ చదవండి: ఇంటెల్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..60-75 శాతం మధ్య కార్యాలయ హాజరు ఉన్నవారు వేరియబుల్ వేతనంలో 50 శాతం అందుకుంటారు. అయితే 75-85 శాతం కార్యాలయానికి హాజరయ్యే ఉద్యోగులు వేరియబుల్ పేలో 75 శాతానికి అర్హులు. 85 శాతం కంటే ఎక్కువ ఆఫీస్‌కు వచ్చి పనిచేసినవారు మాత్రమే త్రైమాసికానికి పూర్తి వేరియబుల్ చెల్లింపును అందుకుంటారు. -
ట్రంప్ మానియా..ఐటీపై ప్రభావం ఎంత?
అమెరికా అధ్యక్షుడిగా మరోసారి డొనాల్డ్ ట్రంప్‌నకు అక్కడి ప్రజలు పట్టంకట్టారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన గతంలో ప్రకటించారు. దాంతో అమెరికా వెళ్లాలనుకునే ఐటీ ఉద్యోగులు కొంత నిరాశ చెందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత హయాంలో మాదిరిగానే ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం ఉంటుందనే ఆందోళనలు సహజంగా వ్యక్తమవుతున్నాయి. 80 శాతం పైగా భారత్ ఐటీ సర్వీసుల ఆదాయం అమెరికా నుంచే వస్తోంది. హెచ్1బీ/ఎల్1 వీసాలపై(యూఎస్ కంపెనీలు విదేశీయులకు అందించే వీసాలు) ట్రంప్ తొలిసారి అధికారం వచ్చిన వెంటనే నిబంధనలను కఠినతరం చేయడం తెలిసిందే.వీసా పరిమితులు?గతంలో ట్రంప్ హయాంలో విదేశీ ఐటీ సంస్థలు ఉద్యోగాల్లో అమెరికన్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని హుకుం జారీ చేయడంతో పాటు వీసాల జారీపైనా పరిమితులు విధించారు. దీంతో అప్పట్లో ఐటీ కంపెనీలు వ్యయ భారాన్ని ఎదుర్కొన్నాయి. ఈ ప్రభావంతో వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంతో పాటు విదేశీ సెంటర్లలో స్థానిక నిపుణులకే పెద్దపీట వేశాయి. 2016–17లో అమెరికాలో భారతీయ ఐటీ సంస్థల ఉద్యోగుల్లో మూడింట రెండొంతులు హెచ్1బీ/ఎల్1 వీసాల ద్వారానే నమోదుకాగా, ప్రస్తుతం ఈ సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: ఎడిట్ చేసిన ఫొటోను షేర్ చేసిన మస్క్కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు..ఐటీ అగ్ర త్రయం టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో హెచ్1బీ వీసాలు గత పదేళ్లలో 50–80% తగ్గిపోయినట్లు అంచనా. ట్రంప్ నియంత్రణల తర్వాత ఇది జోరందుకుంది. 2019–20లో ఇన్ఫీ గ్లోబల్ సిబ్బంది 65 శాతానికి, విప్రోలో 69 శాతానికి ఎగబాకినట్లు బ్రోకరేజ్ సంస్థ జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ 2.0 హయాంలో మళ్లీ వీసా పరిమితులు, కఠిన నిబంధనలు విధించినప్పటికీ.. పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చనేది నిపుణుల అభిప్రాయం. దీనికితోడు దేశీయ కార్యకలాపాలపై కార్పొరేట్ ట్యాక్స్‌ను 21% నుంచి 15%కి తగ్గిస్తామన్న ట్రంప్ ప్రతిపాదనలు కూడా భారత్ ఐటీ కంపెనీలకు సానుకూలాంశమని విశ్లేషకులు చెబుతున్నారు. వీసా నియంత్రణలు ఉన్నప్పటికీ ట్రంప్ తొలి విడతలో దేశీ ఐటీ షేర్లు పుంజుకోవడం విశేషం. టీసీఎస్ 185 శాతం, ఇన్ఫోసిస్ 174 శాతం, విప్రో 140 శాతం చొప్పున ఎగబాకాయి. -
కంపెనీని వీడి తిరిగి సంస్థలో చేరిన 13 వేలమంది!
యూఎస్ ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గతంలో వివిధ కారణాలతో కంపెనీని వీడిన ఉద్యోగుల్లో దాదాపు 13,000 మంది తిరిగి సంస్థలో చేరినట్లు కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్ రవికుమార్ తెలిపారు. మూడో త్రైమాసికంలో మొత్తం 3,800 మంది ఉద్యోగులు కొత్తగా సంస్థలోకి వచ్చినట్లు చెప్పారు.ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికుమార్ మాట్లాడుతూ..‘కంపెనీలో ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గతంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో అదనంగా 3,800 మంది కొత్తగా సంస్థలో చేరారు. అయితే ఏడాది ప్రాతిపదికన చూస్తే 6,500 ఉద్యోగులు తగ్గినట్లు కనిపిస్తుంది. ఆగస్టులో కంపెనీ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. బెల్కన్ కంపెనీలో మేజర్ వాటాను కాగ్నిజెంట్ కొనుగోలు చేయడంతో ఆ సంస్థ ఉద్యోగులు కూడా సంస్థ పరిధిలోకి వచ్చారు. దాంతో ఈ సంఖ్య పడిపోయినట్లు కనిపిస్తుంది. కొంతకాలంగా వివిధ కారణాలతో కంపెనీని వీడిన దాదాపు 13,000 మంది తిరిగి సంస్థలో చేరారు. కంపెనీ ఉద్యోగుల అట్రిషన్ రేటు(ఉద్యోగులు సంస్థలు మారే నిష్పత్తి) కూడా 14.6 శాతానికి తగ్గిపోయింది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అలెక్సా చెబితే టపాసు వింటోంది!అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రాజకీయ భౌగోళిక పరిణామాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా క్లయింట్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలకు కాంట్రాక్ట్‌లు ఇవ్వడం ఆలస్యం చేశాయి. దాంతో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. క్రమంగా యుద్ధ భయాలు, ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండడంతో తిరిగి పరిస్థితులు గాడినపడుతున్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేరుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
ఐటీ పరిశ్రమలో కొత్త చిగురులు.. చాన్నాళ్లకు మారిన పరిస్థితులు
దేశంలోని ఐటీ పరిశ్రమలో సన్నగిల్లిన నియామకాలకు మళ్లీ కొత్త చిగురులు వచ్చాయి. దాదాపు ఏడు త్రైమాసికాల తర్వాత భారతీయ ఐటీ పరిశ్రమలో క్షీణిస్తున్న హెడ్‌కౌంట్ ట్రెండ్ మారింది. టాప్ ఆరు ఐటీ కంపెనీలలో ఐదు కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య పెరిగింది.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ సంస్థలు సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తంగా 17,500 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నాయి. ఒక్క హెచ్‌సీఎల్ టెక్‌లో మాత్రమే పరిస్థితి మారలేదు. గత త్రైమాసికంలో ఈ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 780 తగ్గింది.దేశంలో ఐదవ అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టెక్ మహీంద్రా అత్యధికంగా సెప్టెంబర్ త్రైమాసికంలో 6,653 మంది ఉద్యోగులను చేర్చుకుని తాజా నియామకాలకు నాయకత్వం వహించింది. దీని తర్వాత దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టీసీఎస్ తన 600,000 మంది ఉద్యోగులకు 5,726 మంది ఉద్యోగులను జోడించింది.ఇదీ చదవండి: ఇలా కూడా రిజెక్ట్ చేస్తారా? గూగుల్ టెకీ వింత అనుభవంరెండవ, నాల్గవ అతిపెద్ద ఐటీ సంస్థలైన ఇన్ఫోసిస్, విప్రో ఈ త్రైమాసికంలో వరుసగా 2,456, 978 మంది ఉద్యోగులను చేర్చుకున్నాయి. ఇన్ఫోసిస్ వరుసగా ఆరు త్రైమాసికాల తర్వాత తన వర్క్‌ఫోర్స్‌ను విస్తరించింది. పెండింగ్‌లో ఉన్న కాలేజీ రిక్రూట్లను కూడా ఆన్‌బోర్డింగ్ చేస్తామని ఇరు కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. -
రిటర్న్ టు ఆఫీస్.. ‘నచ్చకపోతే వెళ్లిపోవచ్చు’
ఇంటి నుంచి పనిచేసే విధానానికి దాదాపు అన్ని కంపెనీలు ఇప్పటికే ముగింపు పలికేశాయి. కొన్ని కంపెనీలు వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి ఇంకొన్ని రోజులు ఆఫీస్ నుంచి పనిచేసే హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇప్పుడు ఆ పద్ధతికీ మంగళం పాడేసి పూర్తిగా రిటర్న్ టు ఆఫీస్ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాయి.ప్రపంచ టెక్నాలజీ దిగ్గజమైన అమెజాన్ కూడా ఇటీవల వారానికి 5-రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని ప్రకటించింది. అయితే దీనిపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. వివాదాస్పదమైన ఈ విధానాన్ని అమెజాన్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తాజాగా సమర్థించారు. దీనికి మద్దతు ఇవ్వని వారు మరొక కంపెనీకి వెళ్లిపోవచ్చని చెప్పారు.ఇదీ చదవండి: ఉద్యోగులను తొలగిస్తున్న మెటా..అమెజాన్ ఏడబ్ల్యూఎస్ ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో ఆ యూనిట్ సీఈవో మాట్ గార్మాన్ ప్రసంగిస్తూ.. తాను పది మందితో మాట్లాడితే వారిలో తొమ్మిది మంది జనవరిలో అమలులోకి వచ్చే కొత్త విధానానికి మద్దతుగా మాట్లాడారని చెప్పారు. కొత్త విధానం నచ్చని వారు నిష్క్రమించవచ్చని ఆయన సూచించారని రాయిటర్స్ పేర్కొంది.అమెజాన్ ప్రస్తుతం మూడు రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే సీఈవో ఆండీ జాస్సీ గత నెలలో ఐదు రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని ప్రకటించారు. దీంతో అనేకమంది ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కొంతమంది అయితే స్వచ్ఛంద రాజీనామాలకు దిగుతున్నట్లు చెప్పారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి తోటి టెక్నాలజీ కంపెనీలు రెండు-మూడు రోజుల ఇన్-ఆఫీస్ పాలసీలను అమలు చేస్తుండగా అమెజాన్ మరో అడుగు ముందుకేసి పూర్తిగా ఐదు రోజుల ఇన్-ఆఫీస్ పాలసీ అమలుకు సిద్ధమైంది. -
ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఆఫర్ లెటర్ జారీలో మార్పులు
దేశీయ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో పెద్ద సంస్కరణను ప్రకటించింది. ఈమెయిల్ల ద్వారా జాబ్ ఆఫర్ లెటర్ల జారీని నిలిపివేయాలని నిర్ణయించింది. కంపెనీలో కొత్తగా చేరేవారందరూ ఇకపై అప్లికేషన్ వివరాలను యాక్సెస్ చేయడానికి కంపెనీ అంతర్గత పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడాన్ని తప్పనిసరి చేసింది.నియామక ప్రక్రియలో మోసాలను అరికట్టడం, ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో ఉద్యోగులకు మెరుగైన అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఇన్ఫోసిస్ ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ చర్య ఫలితంగా అభ్యర్థులు ఆఫర్ లెటర్‌ను చూపి ఇతర కంపెనీలతో బేరసారాలు చేయడం కష్టతరమవుతుంది."ముఖ్యమైన నోటీసు-ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్, అనుబంధ పత్రాలు మా కెరీర్ సైట్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమ లాగిన్ ఆధారాలను ఉపయోగించి దీన్ని యాక్సెస్ చేయవచ్చు. ఇకపై అభ్యర్థులకు ఆఫర్ లెటర్లను ఈమెయిల్‌లకు పంపబోము" కంపెనీ పోర్టల్‌లో పేర్కొంది.భారతీయ సాఫ్ట్వేర్ సేవల పరిశ్రమలో ఫ్రెషర్ల ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన పెరుగుతున్న తరుణంలో ఇన్ఫోసిస్ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కంపెనీ ఫైలింగ్‌ల ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 24 లక్షల ఉద్యోగ దరఖాస్తులను అందుకుంది. వీటిలో 194,367 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 26,975 మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంది. -
మూడు రెట్ల జీతం వచ్చే ఉద్యోగం.. మకాం మార్చాలా?: టెకీ ప్రశ్న
ఉద్యోగం చేస్తున్న చాలామంది ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం వస్తే.. దాన్ని ఎంచుకుని ముందుకు సాగిపోతారు. అయితే ఇటీవల ఒక ఉద్యోగికి లక్షల జీతం లభించే ఉద్యోగం లభించినప్పటికీ.. ఓ సందేహం వచ్చింది. తన సందేహానికి సమాధానం కోరుతూ.. రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు.నేను బెంగుళూరులో మెకానికల్ ఇంజనీర్, వయసు 31, పెళ్లయింది, ఇంకా పిల్లలు లేరు. నెలకు రూ.1.30 లక్షలు సంపాదిస్తున్నాను. ఇంటి అద్దె, తల్లితండ్రులకు డబ్బు పంపించిన తరువాత కూడా నాకు రూ. 50వేలు నుంచి రూ. 60వేలు మిగులుతుంది. అయితే ఇది ఈఎంఐ చెల్లించడానికి సరిపోతుంది. ఈఎంఐ ఇంకా సంవత్సరం పాటు చెప్పించాల్సి ఉంది.ఉద్యోగ జీవితం బాగానే ఉంది, ఆరోగ్య భీమాకు సంబంధించినవన్నీ కంపెనీ చూసుకుంటుంది. అయితే ఇటీవల నాకు స్వీడన్‌లోని హెల్సింగ్బోర్గ్లో నెలకు రూ.3.90 లక్షల జీతం పొందే ఆఫర్ వచ్చింది. నా స్వగ్రామంలో నా మీదనే ఆధారపడిన తల్లిదండ్రులు ఉన్నారు. వారికి నేను ఒక్కడినే సంతానం. కాబట్టి నేను ఇప్పుడు స్వీడన్‌కు వెళ్లి అక్కడే స్థిరపడాలా? లేదా ఇక్కడే ఉండి.. ఉన్న ఉద్యోగం చేసుకోవాలా? ఆర్థిక పరంగా ఎదగటానికి 4-5 సంవత్సరాలు స్వీడన్‌కు వెళ్లడం నా పరిస్థితికి సహాయపడుతుందా?.. దయచేసి ఎవరైనా సలహా ఇవ్వగలరా? అని రెడ్డిట్‌లో సలహా కోరారు.స్వీడన్ వెళ్లాలనుకుంటే.. మీరు ఒక్కరే కాకుండా, మీ భార్యను కూడా పని చేయడానికి ప్రేరేపించండి. లేకుంటే అక్కడ ఆమె ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. సొంతంగా ఏదైనా చేయడానికి ప్రయత్నించేలా చేయండి. అక్కడ కొన్ని భాషా తరగతులకు హాజరయ్యేలా చూడండి అని ఒకరి రాశారు.స్వీడన్ మీరు అధిక సంపాదన కోసం వెళ్లే దేశం కాదు. మీరు ఒంటరిగా ఉండి, పొదుపుగా జీవిస్తే మీరు ఎక్కువ ఆదా చేసుకోవచ్చని మరొకరు అన్నారు. మీరు సన్యాసిలా జీవిస్తే మీ జీతంలో సగం వరకు ఆదా చేయవచ్చు, కానీ ప్రయోజనం ఏమిటి, అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఉద్యోగం మారితే మరింత ఎక్కువ సంపాదించవచ్చని మరికొందరు సలహా ఇచ్చారు. -
ఏడాదిలో 61,600 మంది ఉద్యోగులు రాక! కారణం..
తెలంగాణ రాష్ట్రంలో నికరంగా వైట్‌కాలర్(ప్రొఫెషనల్) ఉద్యోగులు పెరుగుతున్నారని ఎక్స్‌ఫెనో సంస్థ తెలిపింది. గడిచిన ఏడాది కాలంలో వివిధ ప్రాంతాల నుంచి 61,600 మంది వైట్‌కాలర్ ఉద్యోగులు తెలంగాణకు వచ్చారని, వివిధ కారణాలతో 41,400 మంది రాష్ట్రాన్ని వీడారని సంస్థ పేర్కొంది. ఈమేరకు సంస్థ సహవ్యవస్థాపకులు కమల్ కరంత్ ‘టాలెంట్ పాజిటివ్ తెలంగాణ 2024’(రెండో ఎడిషన్) పేరుతో నివేదిక విడుదల చేశారు.నివేదికలోని వివరాల ప్రకారం..తెలంగాణలో వైట్‌కాలర్ ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 12 నెలల కాలంలో 61,600 వైట్‌కాలర్ ప్రొఫెషనల్స్ రాష్ట్రంలోకి ప్రవేశించారు. వివిధ కారణాలతో 41,400 మంది ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. నికరంగా తెలంగాణ 20,200 మంది వైట్‌కాలర్ ఉద్యోగులను సంపాదించింది.రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ వైట్‌కాలర్ ఉద్యోగులు 41.8 లక్షల మంది ఉన్నారు. ఈ సంఖ్య ఏటా 12 శాతం పెరుగుతోంది. అందులో కనీసం ఒక సంవత్సరం పని అనుభవం కలిగిన వారు 50% మంది ఉన్నారు.కేవలం హైదరాబాద్‌లోనే దాదాపు 18.7 లక్షల మంది అనుభవజ్ఞులైన వైట్ కాలర్ ఉద్యోగులున్నారు.హైదరాబాద్ తర్వాత వరంగల్, కరీంనగర్, హనుమకొండలో అధికంగా ఈ కేటగిరీ ఉద్యోగులు పని చేస్తున్నారు.2023 లెక్కల ప్రకారం మొత్తం ఉద్యోగుల్లో పురుషులు 68 శాతం, మహిళలు 32 శాతం ఉన్నారు. 2023తో పోలిస్తే 2024లో మహిళా ఉద్యోగులు సంఖ్య ఒక శాతం పెరిగింది.టెక్ కంపెనీలు, బీఎఫ్ఎస్ఐ, బిజినెస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్, హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్, ఫార్మా రంగంలో అధికంగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఎక్కువ మంది ఇంజినీరింగ్, ఐటీ, బిజినెస్ డెవలప్మెంట్, ఆపరేషన్స్, హెచ్ఆర్ విభాగాలను ఎంచుకుంటున్నారు.ఈ ఏడాది రాష్ట్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసుకునే వారి సంఖ్య 12.3 లక్షలు, మాస్టర్స్ డిగ్రీ 4.61 లక్షలు, ఎంబీఏ 3.35 లక్షలు, పీహెచ్డీ 41 వేలు, అసోసియేట్ డిగ్రీ 20 వేలుగా ఉంది.ఇదీ చదవండి: రూ.83 లక్షల కోట్లకు డిజిటల్ ఎకానమీదేశవ్యాప్తంగా తెలంగాణ, కర్ణాటక, హరియాణా, గుజరాత్, గోవా, అరుణాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర, మేఘాలయా మినహా అన్ని రాష్టాల్లో నికరంగా ఉద్యోగుల సంఖ్య తగ్గుతుంది.తెలంగాణకు వచ్చే ఉద్యోగులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన వారున్నారు. గడిచిన ఏడాది కాలంలో అన్ని ప్రధాన రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వారి సంఖ్య 55,400గా ఉంది.తెలంగాణ నుంచి కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడుకు ఎక్కువ మంది ఉద్యోగులు వలస వెళుతున్నారు. గడిచిన ఏడాదిలో వీరి సంఖ్య 38,700గా ఉంది.గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల స్థాపించడం ద్వారా ఇతర దేశాల్లోని వారు తెలంగాణకు వస్తున్నారు. యూఎస్, యూకే, యూఏఈ, కెనడా నుంచి అధికంగా వలసలున్నాయి. ఏడాదిలో వీరి సంఖ్య 20,400గా ఉంది.ఉద్యోగం కోసం తెలంగాణ నుంచి ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఏడాదిలో 50,700గా ఉంది.ఇదీ చదవండి: కార్పొరేట్ కంపెనీలు ప్రెషర్ కుక్కర్లు!నివేదిక విడుదల సందర్భంగా ఎక్స్‌ఫెనో సహవ్యవస్థపకులు కమల్ కరంత్ మాట్లాడుతూ..‘తెలంగాణ వివిధ రంగాల్లోని వైట్‌కాలర్ ఉద్యోగులకు కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో మౌలికసదుపాయాలు పెరిగాయి. వ్యూహాత్మక పెట్టుబడులు ఎక్కువయ్యాయి. ప్రగతిశీల విధానాలు రూపొందించడం, వ్యాపార ప్రోత్సాహకాలు అందించడం వంటి కార్యక్రమాలతో ఇది సాధ్యమవుతోంది. అయితే రాష్ట్రం నుంచి కూడా చాలామంది ఉద్యోగులు వలస వెళుతున్నారు. బెంగళూరు వంటి నగరాల్లో మెరుగైన వసతులు, వేతనాలు ఉండడం ఇందుకు కారణం. ఉద్యోగులు ప్రమోషన్ కోసం, ఇతర రంగాలను ఎంచుకోవడానికి, తమ అభివృద్ధికి అనువైన నాయకత్వం..వంటి వివిధ కారణాలతో ఇతర ప్రాంతాల్లోని సంస్థలను ఎంచుకుంటున్నారు’ అని చెప్పారు. -
గిఫ్ట్ సిటీలో కాగ్నిజెంట్.. 2000 మందికి ఉపాధి
అహ్మదాబాద్: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్‌సిటీ(గిఫ్ట్ సిటీ) గాంధీనగర్‌లో టెక్‌ఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 2025 ఫిబ్రవరిలో ప్రారంభించనున్న ఈ సెంటర్‌ను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సొల్యూషన్ల వ్యూహాత్మక కేంద్రంగా వినియోగించనున్నట్లు పేర్కొంది.ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) పరిశ్రమలకు సంబంధించిన క్లయింట్లకు ఆధునిక సాంకేతిక సొల్యూషన్లు సమకూర్చనున్నట్లు తెలియజేసింది. ప్రాథమికంగా ఈ సెంటర్లో 500 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించనుంది. రానున్న మూడేళ్లలో ఈ సంఖ్యను 2,000కు పెంచనుంది.ప్రపంచస్థాయి కంపెనీలను ఆకట్టుకోవడంలో రాష్ట్రానికున్న పటిష్టతను గిఫ్ట్ సిటీలో కాగ్నిజెంట్ కొత్త కేంద్రం ప్రతిబింబిస్తున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలు, అభివృద్ధికి అత్యుత్తమ వాతావారణాన్ని కల్పిస్తున్నట్లు తెలియజేశారు. కాగా.. టెక్‌ఫిన్ సెంటర్ ద్వారా బీఎఫ్ఎస్ఐ క్లయింట్లకు డిజిటల్ పరివర్తనలో తోడ్పాటునివ్వనున్నట్లు కాగ్నిజెంట్ పేర్కొంది. -
యాక్సెంచర్‌లో జోరుగా నియామకాలు
న్యూఢిల్లీ: ఐటీ, కన్సల్టింగ్ సేవల దిగ్గజం యాక్సెంచర్ భారత్‌లో గణనీయంగా నియామకాలు చేపట్టనుంది. ప్రధానంగా ఫ్రెషర్స్‌ను తీసుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. కంపెనీ సీఈవో జూలీ స్వీట్ ఈ విషయాలు వెల్లడించారు.జెనరేటివ్ఏఐ (జెన్‌ఏ) మీద ఫోకస్‌తో తమ సర్వీసులను ఎప్పటికప్పుడు సరికొత్తగా తీర్చిదిద్దుకుంటున్నట్లు ఇన్వెస్టర్లతో సమావేశంలో ఆమె వివరించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో తమ వ్యాపార వృద్ధికి ఇదే దోహదపడిందని పేర్కొన్నారు. జెన్ఏఐ సాంకేతికతను ఉపయోగించడంలో సిబ్బందికి విస్తృతంగా శిక్షణనిస్తున్నట్లు జూలీ చెప్పారు.ఐర్లాండ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యాక్సెంచర్‌కి భారత్‌లో 3,00,000కు పైగా సిబ్బంది ఉన్నారు. అంతర్జాతీయంగా 7,74,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 64.90 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. యాక్సెంచర్ సెప్టెంబర్–ఆగస్టు వ్యవధిని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. -
వర్క్ ఫ్రమ్ హోమ్ రొటీన్ కాదు.. ఇక వచ్చేయండి..
వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని కంపెనీలు స్వస్తి పలుకుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం డెల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సేల్స్ టీమ్ ఉద్యోగులను సెప్టెంబరు 30 నుండి ఆఫీస్‌లకు వచ్చేయాలని ఆదేశించింది. వారానికి ఐదు రోజులూ ఆఫీస్ నుంచే పనిచేయాలని డెల్ ఉద్యోగులను కోరిందని దీనికి సంబంధించిన మెమోను తాము చూసినట్లు రాయిటర్స్ పేర్కొంది.ఉద్యోగులకు సహకార వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం కోసమే ఈ మార్పు చేస్తున్నట్లు డెల్ తెలిపింది. ఇందుకోస టీమ్ ఆఫీస్‌లో ఉండాల్సిన అవసరం ఉందని మెమో పేర్కొంది. "రిమోట్‌గా పని చేయడం అన్నది మినహాయింపుగా ఉండాలి. రొటీన్ కాకూడదు" అని జోడించింది.మెమో ప్రకారం.. సేల్స్ టీమ్‌లోని ఫీల్డ్ ప్రతినిధులు వారానికి ఐదు రోజులు కస్టమర్లు, భాగస్వాములతో లేదా కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. గతంలో వీరు వారానికి మూడు రోజులు కార్యాలయం నుండి పని చేయాల్సి ఉండేది. ఇక ఆఫీస్‌కు వచ్చేందుకు సాధ్యపడని సేల్స్ టీమ్ సభ్యులు రిమోట్‌గానే పని చేయవచ్చని అని డెల్ వెల్లడించింది.కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయం నుండి చాలా కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాయి. అయితే, కొన్ని టెక్ సంస్థలు, ఇప్పుడు ఉద్యోగులతో వారంలో రెండు నుండి మూడు రోజులు ఆఫీస్‌ల నుంచి పని చేయిస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి వారానికి ఐదు రోజులు కంపెనీ కార్యాలయాలలో పని చేయాలని గత వారం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ ఉద్యోగులకు ఆదేశాలను జారీ చేసింది. -
ఐటీ కంపెనీలు క్యాంపస్‌లకు వచ్చేస్తున్నాయ్..
చాలాకాలం తర్వాత ఐటీ కంపెనీలు క్యాంపస్‌లకు వచ్చేస్తున్నాయి. దాదాపు ఏడాది సుదీర్ఘ విరామం అనంతరం కంపెనీలు రిక్రూట్మెంట్ డ్రైవ్‌ల కోసం కాలేజీ క్యాంపస్‌లకు వస్తున్నాయి. ఇది ఐటీ పరిశ్రమలో పునరుజ్జీవనాన్ని సూచిస్తోంది. వ్యాపారాలు రికవరీ సంకేతాలను చూపడం, ప్రత్యేక సాంకేతిక ప్రతిభకు డిమాండ్ పెరగడంతో క్యాంపస్ నియామకాలపై కంపెనీలు దృష్టి పెట్టాయి.అయితే గతంలో మాదరి ఎంట్రీ-లెవల్ ఇంజనీర్లను పెద్దమొత్తంలో నియమించుకోవడం కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో నైపుణ్యం కలిగినవారి కోసం ఐటీ కంపెనీలు వెతుకుతున్నాయి. వీరికి వేతనాలు కూడా సాధారణంగా ఎంట్రీ-లెవల్ ఉద్యోగులకు ఇచ్చేదాని కంటే ఎక్కువగా ఆఫర్ చేస్తున్నాయి.క్యాంపస్‌ల బాటలో కంపెనీలుఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబీఎం, ఎల్‌టీఐమైండ్‌ట్రీ వంటి ప్రధాన ఐటీ సంస్థలు ప్రారంభ దశ నియామకాల కోసం ఇప్పటికే కాలేజీ క్యాంపస్‌లను సందర్శించాయి. వీటిలో టీసీఎస్ 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. అలాగే ఇన్ఫోసిస్ కూడా క్యాంపస్, ఆఫ్-క్యాంపస్ డ్రైవ్‌ల ద్వారా 15,000 నుండి 20,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాది విరామం తర్వాత విప్రో కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో 10,000 నుండి 12,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలతో తిరిగి క్యాంపస్‌ల బాట పట్టనుంది.ఇదీ చదవండి: ఉద్యోగులకు విప్రో కొత్త కండీషన్!మరింత కఠినంగా ఎంపికక్యాంపస్ ప్లేస్మెంట్ ప్రక్రియ ఇప్పుడు మరింత కఠినంగా మారింది. అధిక కట్-ఆఫ్ స్కోర్లు, ప్రత్యేక నైపుణ్యాలు, సర్టిఫికేషన్లకు ప్రాధాన్యం పెరిగింది. అభ్యర్థులను అంచనా వేయడానికి సాంప్రదాయ కోడింగ్ పరీక్షలే కాకుండా వారి నైపుణ్యాలు, నేపథ్యంపై సంపూర్ణ అవగాహన పొందడానికి సోషల్ మీడియా ప్రొఫైల్స్, సంబంధిత సర్టిఫికేషన్లను పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో హై-డిమాండ్ నైపుణ్యాలపై కంపెనీలు దృష్టి కేంద్రీకరించడం వల్ల క్లౌడ్, డేటా, ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న టక్నాలజీలలో ప్రత్యేక పరిజ్ఞానం ఉన్నవారికే ఉద్యోగ అవకాశాలు దక్కే పరిస్థితి ఏర్పడింది. -
ఆర్నెళ్లు ఆలస్యం.. యాక్సెంచర్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్
ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ప్రముఖ కన్సల్టింగ్, ఐటీ సంస్థ యాక్సెంచర్ చేదు వార్త చెప్పింది. కన్సల్టెన్సీ రంగంలో కొనసాగుతున్న సవాళ్లను సూచిస్తూ యాక్సెంచర్ తన ప్రమోషన్ సైకిల్లో గణనీయమైన మార్పును ప్రకటించింది. పదోన్నతుల ప్రక్రియను ఆరు నెలలు ఆలస్యం చేసింది.యాక్సెంచర్‌లో ప్రమోషన్లు ఆనవాయితీ ప్రకారం డిసెంబర్లో చేపడతారు. కానీ బ్లూమ్‌బెర్గ్ ద్వారా పొందిన అంతర్గత కంపెనీ సందేశం ప్రకారం.. ప్రమోషన్లు ఇప్పుడు వచ్చే జూన్‌లో జరుగుతాయి. కార్పొరేట్ వ్యయం, స్థూల ఆర్థిక అస్థిరత కఠినతరం కావడం వంటివాటతో ఆర్థిక అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కంపెనీ ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ఆఫీస్‌కు రాకుంటే.. ఉద్యోగులకు విప్రో కొత్త కండీషన్!క్లయింట్ వ్యూహాలు, డిమాండ్ స్థాయిలకు అనుగుణంగా కంపెనీ విజిబులిటీకి కొత్త ప్రమోషన్ షెడ్యూల్ సరిగ్గా సరిపోతుందని కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారు. ఎందుకంటే ఇవి సాధారణంగా సంవత్సరం మధ్య నాటికి స్పష్టంగా తెలుస్తాయి. ఈ వార్తల తర్వాత యాక్సెంచర్ స్టాక్ మంగళవారం దాదాపు 5 శాతం క్షీణతను చూసింది.కన్సల్టెన్సీ పరిశ్రమను ప్రభావితం చేసే విస్తృత ఆందోళనలకు ఇన్వెస్టర్లు ప్రతిస్పందించారు. ప్రమోషన్లను ఆలస్యం చేయాలనే యాక్సెంచర్ నిర్ణయం కన్సల్టెన్సీ పరిశ్రమలో విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తుంది. మెకిన్సే, ఎర్నెస్ట్ & యంగ్, ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ వంటి కంపెనీలు కూడా ఆర్థిక ఇబ్బందులకు ప్రతిస్పందనగా సిబ్బంది సర్దుబాట్లు చేశాయి. -
ఆఫీస్‌కు రాకుంటే.. ఉద్యోగులకు విప్రో కొత్త కండీషన్!
ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పించడానికి దేశీయ ఐటీ దిగ్గజం విప్రో కొత్త కండీషన్ పెట్టింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కు సంబంధించి నూతన విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆఫీస్‌లో హాజరుకు ఉద్యోగుల లీవ్‌లకు లింక్ పెట్టింది. దీని ప్రకారం.. ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు ఆఫీస్‌లకు వచ్చి పనిచేయాలి. లేకుంటే లీవ్స్ వదులుకోవాల్సిందే..కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీ గురించి తెలియజేస్తూ సెప్టెంబర్ 2వ తేదీనే ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపింది. ఈ పాలసీకి కట్టుబడి ఉండాలని ఆదేశించింది. మరోవైపు ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హమ్ రిక్వెస్ట్‌లకు అనుమతి ఇచ్చి ఉంటే తక్షణమే వాటన్నింటినీ రద్దు చేసి వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్‌కి వచ్చేలా సూచించాలని హెచ్ఆర్ విభాగానికి కూడా ఆదేశాలు జారీ చేసినట్లు ‘మింట్’ కథనం పేర్కొంది.ఇదీ చదవండి: వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆఫీస్ నుంచే పనివిప్రో అమలు చేస్తున్న కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీ ప్రకారం.. వారంలో మూడు రోజులు ఆఫీస్ హాజరు తప్పనిసరి. ఒక వేళ ఆఫీస్‌కి హాజరుకాకపోతే దాన్ని సెలవుగా పరిగణిస్తారు. అంటే వారంలో మూడు రోజులు ఆఫీస్‌కు రాకపోతే ఆ రోజులను సెలవుగా పరిగణించి ఆ మేరకు లీవ్స్ కట్ చేస్తారని ఓ ఉద్యోగిని ఉటంకిస్తూ మింట్ వివరించింది. అయితే ఈ నిర్భంధ హాజరు విధానం ప్రత్యేకంగా కొన్ని ప్రాజెక్టుల్లో ఉద్యోగులకు మాత్రమేనని, అందరికీ ఇది వర్తించదని చెబుతున్నారు. -
మానవ వనరులను ఆకర్షించడంలో విఫలం
విదేశాల్లోని నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఆకర్షించడంలో యూకే ప్రభుత్వం విఫలమవుతోంది. దానివల్ల రానున్న రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి క్షీణిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వెళ్లే వలసదారులు యూరప్‌లో పనిచేసేందుకు యూకేకు బదులుగా ఎక్కువ ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌ను ఎంచుకుంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.యూకే ప్రభుత్వం నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోతుంది. ఆన్లైన్ జాబ్ సెర్చ్ వెబ్సైట్ ఇండీడ్ ఆరు నెలలపాటు సర్వే చేసి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం..యూరప్‌లో ఉద్యోగం చేయాలని భావించేవారిలో ఎక్కువగా అత్యధిక ప్యాకేజీ ఆశిస్తున్నవారే ఉన్నారు. యూకే ఉద్యోగం చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే అక్కడి ప్రభుత్వ విధానాలు, తక్కువ వేతనాలు ఆఫర్ చేయడంతో ఆసక్తి చూపించడంలేదు. యూకే కంటే మెరుగైన వేతనాలు అందించే ఫ్రాన్స్, నెదర్గాండ్స్ను ఎంచుకుంటున్నారు. యూకేలో స్థానికులకు నైపుణ్యాలు పెంపొందిస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా విదేశీయుల అవసరాన్ని తగ్గిస్తామని ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ గతంలో తెలిపారు. దాంతో అధిక నైపుణ్యాలు కలిగిన వారు ఆ దేశానికి వెళ్లకపోవడానికి ఇదో కారణంగా ఉంది. ఐటీ, ఇంజినీరింగ్ వంటి అత్యంత ఉత్పాదక రంగాల్లో ఇప్పటికే సిబ్బంది కొరత ఉంది. చాలా కంపెనీలు లేఆఫ్స్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉన్నవారిపైనే ఎక్కువ పని ఒత్తిడి ఉంటోంది.ఇదీ చదవండి: ‘తొందరపాటు నిర్ణయాలు తీసుకోం’2021లో యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయిన యూకే ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేసిందనే వాదనలున్నాయి. దీనివల్ల అధిక నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఆకర్షించడంలో వెనకబడుతోందని నిపుణులు చెబుతున్నారు. కరోనా కంటే ముందు యూకేలో ఉద్యోగం చేయడానికి 54 శాతం విదేశీయులు ఇష్టపడేవారని కొన్ని సర్వేలు నివేదించాయి. ఇదిలాఉండగా, ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకొస్తే నైపుణ్యాలు కలిగిన విదేశీయులు యూకే వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దాంతోపాటు స్థానికంగా మెరుగైన జీవిన విధానానికి సరిపడే వేతనాలు అందించినా పరిస్థితిలో మార్పులు వస్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
లేఆఫ్ దడ.. కలవరపెడుతున్న డెల్ ప్రకటన
లేఆఫ్‌ల దడ టెకీలను పీడిస్తూనే ఉంది. తొలగింపులు కొనసాగుతాయని ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ తెలియజేసింది. ఉత్పత్తుల డిమాండ్ తగ్గడం, విక్రయాలు మందగించడంతో వ్యయాలను నియంత్రణకు కంపెనీ కష్టాలు పడుతోంది. ఇప్పటికే వేలాది మందికి లేఆఫ్‌లు ప్రకటించిన కంపెనీ ఇవి ఇంకా కొనసాగుతాయని వెల్లడించడం ఉద్యోగులను కలవరపెడుతోంది.ఇప్పటికే గత నెలలో ప్రకటించిన లేఆఫ్‌లలో దాదాపు 12,500 మందికి ఉద్వాసన పలికింది డెల్. పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ పుంజుకోకపోవడం, ఏఐ కోసం ఆప్టిమైజ్ చేసిన సర్వర్ల అమ్మకాలు లాభదాయకంగా లేవన్న ఆందోళనల నేపథ్యంలో ఖర్చుల నియంత్రణ కోసం ఉద్యోగుల తొలగింపులు ఇంకా కొనసాగుతాయని ప్రకటించింది.ఇదీ చదవండి: ‘ఇన్ఫోసిస్ సంగతేంటో చూడండి’..బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. డెల్ కంపెనీ ఉద్యోగులను తొలగింపులను కొనసాగించడంతోపాటు నియామకాలను సైతం తగ్గించనుంది. ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ, ఇతర చర్యలు 2025 ఫిబ్రవరి వరకు కొనసాగనున్నాయి. ఈ ఏడాది జూన్‌లో కంపెనీ ప్రకటించిన లేఆఫ్‌లతో చాలా మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ఇందులో సేల్స్ ఉద్యోగులే ఎక్కువ మంది. ప్రభావితమైన ఉద్యోగులు 12,500 మందికి పైనే ఉంటారని అంచనా వేసినా దాన్ని కంపెనీ ధ్రువీకరించలేదు. తొలగించినవారికి సీవెరెన్స్ కింద 328 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉందని నివేదిక పేర్కొంది. -
‘ ఇన్ఫోసిస్ సంగతేంటో చూడండి’.. రంగంలోకి ప్రభుత్వం
ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడంలో జాప్యం చేస్తున్న ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ విషయంలో ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగింది. ఈ సంగతేంటో చూడాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయానికి ప్రభుత్వం సూచనలను అందించింది. ఇన్ఫోసిస్ ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడంలో జాప్యం చేస్తున్న వ్యవహారాన్ని పరిశీలించి తమకు, అభ్యర్థులకు అప్డేట్లను అందించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్ర కార్మిక శాఖ కోరింది.ఇన్ఫోసిస్ 2022లో ఆఫర్ లెటర్ ఇచ్చిన 2,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో ఆలస్యం చేస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ చర్య వచ్చింది. ఆన్‌బోర్డింగ్ తేదీలలో సర్దుబాటు చేసినప్పటికీ, ఫ్రెషర్లకు ఇచ్చిన ఆఫర్లను గౌరవిస్తామని, అందిరినీ ఉద్యోగాల్లోకి చేర్చుకుంటామని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ హామీ ఇచ్చారు. 2024 జూన్ నాటికి 315,000 మంది ఉద్యోగులతో ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ ఒక ప్రధానమైన శక్తిగా ఉంది.2,000 మంది గ్రాడ్యుయేట్లను ఇన్ఫోసిస్ ఆలస్యంగా ఆన్‌బోర్డింగ్ చేయడంపై ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగుల యూనియన్ అయిన నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) నుండి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖకు ఫిర్యాదు అందింది.ఈ వారం ప్రారంభంలో వచ్చిన నివేదికల ప్రకారం.. ఇన్ఫోసిస్ ఆన్‌బోర్డ్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్న కొంతమంది గ్రాడ్యుయేట్లకు కన్ఫర్మేషన్ ఈమెయిల్‌లను పంపడం ప్రారంభించింది. మైసూర్లో చేరడానికి అక్టోబర్ 7ను షెడ్యూల్ తేదీగా పేర్కొంది. -
టెకీల పాలిట దారుణంగా ఆగస్ట్ నెల..
గడిచిన ఆగస్ట్ నెల టెకీల పాలిట దారుణంగా పరిణమించింది. ఈ ఒక్క నెలలోనే టెక్ రంగంలో ఏకంగా 27,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. 40 కంటే ఎక్కువ కంపెనీలు లే-ఆఫ్‌లను ప్రకటించాయి. ఈ తాజా రౌండ్ తొలగింపులను కలుపుకొంటే గడిచిన ఏడాదిగా 422 కంపెనీలలో లేఆఫ్‌లు 136,000 లకు పెరిగాయి.ఈ ఉద్యోగ కోతల్లో ఇంటెల్ అగ్రగామిగా ఉంది. ఇది 15,000 మంది ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఇది దాని ఉద్యోగులలో 15%. సీపీయూ చిప్ టెక్నాలజీలో కంపెనీ అగ్రగామిగా ఉన్నప్పటికీ అధిక వ్యయాలు, తక్కువ మార్జిన్ల కారణంగా ఖర్చుల తగ్గింపు ప్రణాళికకు పూనుకుంది. 2020 నుంచి 2023 మధ్యకాలంలో కంపెనీ 10% ఎక్కువ మంది ఉద్యోగులను ఇంటెల్ నియమించుకుంది.ఇక టెలికమ్యూనికేషన్స్ పరికరాల తయారీ సంస్థ సిస్కో సిస్టమ్స్ తన వర్క్ ఫోర్స్‌లో దాదాపు 6,000 మంది లేదా 7 శాతం మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు తెలిపింది. జాబితాలో మరొక పెద్ద పేరు ఐబీఎం. ఈ కంపెనీ చైనాలో దాని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఇది వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తొలగింపునకు దారితీసింది.మార్కెట్ పరిస్థితులు, మందగించిన ఆర్థిక కార్యకలాపాల కారణంగా జర్మన్ చిప్‌మేకర్ ఇన్ఫినియన్ కూడా 1,400 మంది ఉద్యోగులను తొలగించి, మరో 1,400 మందిని తక్కువ ఖర్చుతో కూడిన ప్రాంతాలకు బదిలీ చేయాలని ప్రణాళిక రచించింది. గోప్రో కంపెనీ తమ వర్క్‌ఫోర్స్‌లో 15% లేదా దాదాపు 140 మంది తగ్గించింది. ఇక యాపిల్ 100 మంది ఉద్యోగులను తొలగించింది.డెల్ టెక్నాలజీస్ కూడా భారీగానే తొలగింపులు చేపట్టనున్నట్లు వార్తల్లో నిలిచింది. బెంగళూరుకు చెందిన రేషామండి అనే అగ్రిటెక్ సంస్థ మొత్తం సిబ్బందిని తొలగించి మూతపడింది. వెబ్ బ్రౌజర్ కంపెనీ అయిన బ్రేవ్ 27 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.సోషల్ మీడియా సంస్థ షేర్‌చాట్ తన ఉద్యోగులలో 5% మందిని వదులుకుంటున్నట్లు ప్రకటించింది. -
ఐటీ ఉద్యోగార్థులకు విప్రో గుడ్‌న్యూస్
ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు 12 వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. గతంలో ఆఫర్ లెటర్స్ అందుకున్న ఫ్రెషర్లకు తమ ప్రాధాన్యత ఉంటుందని, ఇప్పటికే మొదటి త్రైమాసికంలో దాదాపు 3 వేల మంది న్యూ ఏజ్ అసోసియేట్స్ (ఫ్రెషర్స్)ని ఆన్‌బోర్డ్ చేశామని పేర్కొంది.టెక్ పరిశ్రమలో ఓ వైపు ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా విప్రో నుంచి నియామకాలపై ప్రకటన రావడంతో ఉద్యోగార్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. "గతంలో జాబ్ ఆఫర్లు పొందిన ఎన్‌జీఏలను (ఫ్రెషర్స్) ఆన్‌బోర్డ్ చేయడం మా మొదటి ప్రాధాన్యత . 2025 ఆర్థిక సంవత్సరం క్యూ1లో సుమారు 3,000 ఎన్‌జీఏలను ఆన్‌బోర్డ్ చేశాం" అని విప్రో పీటీఐకి ఒక ప్రకటనలో తెలిపింది.విప్రో 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 10,000-12,000 ఫ్రెషర్లను తీసుకుంటుంది. జెన్-ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ విభాగాల్లో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. "భవిష్యత్ అవసరాలను తీర్చడానికి బలమైన పైప్‌లైన్‌ను అభివృద్ధి చేసుకోవడంలో భాగంగా క్యాంపస్ నియామకాల వ్యూహాలను కొనసాగిస్తాం. భాగస్వామ్య విద్యా సంస్థలతో అనుసంధానం కొనసాగుతుంది" అని పేర్కొంది. -
ఐటీ కంపెనీల కంటే 20 శాతం అధిక వేతనం
దేశీయ సాంకేతిక రంగాన్ని ప్రభావితం చేస్తున్న గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీ) టైర్-2 నగరాలకు విస్తరిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో పనిచేయాలనుకునే ప్రతిభ ఉన్న అభ్యర్థులకు భారీ వేతనాలు ఇస్తున్నట్లు టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక తెలిపింది. జీసీసీలు సంప్రదాయ ఐటీ, నాన్-టెక్ కంపెనీలతో పోలిస్తే 12 నుంచి 20 శాతం ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నట్లు పేర్కొంది.టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం.. దేశంలో 1,600 జీసీసీలున్నాయి. వీటిలో 16.6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కేంద్రాలు ప్రధానంగా జనరేటివ్ ఏఐ, ఏఐ/ ఎంఎల్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్.. వంటి టెక్నాలజీలపై దృష్టి సారిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత వల్ల 2025 నాటికి జీసీసీల సంఖ్య 1,900కు చేరనుంది. దాంతో 20 లక్షల మంది ఈ విభాగంలో ఉపాధి పొందుతారు. వచ్చే ఏడాది నాటికి భారతీయ టెక్ పరిశ్రమలో ఏఐ, ఎంఎల్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీల్లో సుమారు రూ.29 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో దీని వాటా రూ.21 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: విభిన్న రంగాల్లో ఏఐ ఆధారిత స్టార్టప్లుఈ సందర్భంగా టీమ్‌లీజ్ డిజిటల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ విజ్ మాట్లాడుతూ..‘సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్, సైబర్‌సెక్యూరిటీ, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, డేటా మేనేజ్మెంట్, అనలిటిక్స్, క్లౌడ్ సొల్యూషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్.. వంటి కీలకమైన ఫంక్షనల్ రంగాల్లో 15,000 ఉద్యోగాలు కల్పనకు అవకాశం ఉంది. బెంగళూరు, గుర్గావ్, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాల్లో టెక్ ఉద్యోగాలకు అధిక వేతనాలు అందిస్తున్నారు. జైపూర్, ఇందోర్, కోయంబత్తూర్ వంటి టైర్-2 నగరాలు రాబోయే రోజుల్లో జీసీసీలు, డేటా సెంటర్లకు హబ్‌లుగా మారబోతున్నాయి. ఈ కేంద్రాల్లోని ఉద్యోగులకు సంప్రదాయ ఐటీ జీతాల కంటే 12% నుంచి 20% వరకు ఎక్కువ వేతనం చెల్లిస్తారు’ అని తెలిపారు. -
ఫ్రెషర్స్‌కు ఏటా రూ.9 లక్షలు వేతనం!
టెక్ కంపెనీ ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయని తెలుసుకదా. తాజాగా ప్రముఖ సాఫ్ట్వేర్ సేవలందించే ఇన్ఫోసిస్ కంపెనీ క్యాంపస్ ప్లేస్మెంట్లో భాగంగా ఈ ఏడాది ‘పవర్ ప్రోగ్రామ్’ విధానాన్ని అనుసరించబోతున్నట్లు ప్రకటించింది. ఈ కేటగిరీలో నియమించుకుంటున్న అభ్యర్థులకు ఏటా రూ.9 లక్షల వరకు వేతనం చెల్లిస్తామని పేర్కొంది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..క్యాంపస్ ప్లేస్మెంట్లో భాగంగా రిక్రూట్ అయ్యే అభ్యర్థులు ‘పవర్ ప్రోగ్రామ్’ కిందకు వస్తారు. ఈ కేటగిరీలోని వారికి ఏటా రూ.9 లక్షల వరకు వేతనం ఉంటుంది. కంపెనీ అవసరాలకు తగిన ప్రతిభ ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశాలున్నాయి. ప్రోగ్రామింగ్, కోడింగ్ సామర్థ్యంపై అధిక నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఏఐ, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి కొత్త సాంకేతికతలపై యువత నైపుణ్యం పెంచుకోవాలని చెప్పింది.ఇదీ చదవండి: రోబోల దండు వచ్చేస్తోంది..!ఇదిలాఉండగా, టీసీఎస్ టాలెంట్ అక్విజిషన్ విభాగం గ్లోబల్ హెడ్ గిరీష్ నందిమఠ్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ఏడాది సంస్థ రిక్రూట్మెంట్ విధానంలో కొత్త పద్ధతిని తీసుకురాబోతున్నామని చెప్పారు. ‘ప్రైమ్’ కేటగిరీలో నియామకం పొందిన అభ్యర్థులకు ఏటా రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షలు వేతనం అందిస్తామన్నారు. -
కాలగర్భంలో కలల ఉద్యోగం..!
చిన్నపుడు ఎవరైనా ‘పెద్దయ్యాక ఏం చేయాలనుకుంటున్నావ్?’ అని అడిగితే చాలామంది పెద్ద సాఫ్ట్వేర్ ఇంజినీరో లేదా ప్రపంచంలోని టాప్ టెక్ కంపెనీలో మంచి ఉద్యోగం చేయాలని చెప్పేవారు. అదే డ్రీమ్ జాబ్‌గా ఊహించుకుని కష్టపడి చదివి ఏదో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరినవారు కూడా ఉన్నారు. అయితే మారుతున్న జీవన శైలి, టెక్ కంపెనీలో వస్తున్న మార్పులు తమ కలల సాకారానికి వ్యతిరేకంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ప్రధానంగా ‘జెన్ జీ’(1997-2005 మధ్య జన్మించిన వారు) యువతకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది.కొవిడ్ సమయంలో ఐటీ కంపెనీల రెవెన్యూ గణనీయంగా తగ్గిపోయింది. ప్రధానంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల జీతాలకే ఎక్కువగా ఖర్చు అవుతుంది. దాంతో కరోనా కాలంలో అదే అదనుగా లేఆఫ్స్ పేరుతో చాలామంది ఉద్యోగులను తొలగించారు. ‘జెన్ జీ’ యువతకు కొత్తగా టెక్ జాబ్స్ సంపాదించడం సవాలుగా మారింది. ఇప్పటికీ ఇది కొనసాగుతోంది. కొన్ని కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి నెలలు గడుస్తున్నా ఆఫర్లేటర్ ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ ‘డ్రీమ్‌జాబ్’ ఊహ నుంచి క్రమంగా బయటకొచ్చి ఇతర ఉద్యోగాలను ఎంచుకుంటున్నారు.సాఫ్ట్వేర్ కంపెనీలే ఉద్యోగులను తొలగించడంతోపాటు ఉన్నవారిపై పని ఒత్తిడి పెంచుతున్నాయి. 2022లో ప్రపంచవ్యాప్తంగా 1064 ప్రధాన కంపెనీలు 1,65,269 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. 2023లో 1193 సంస్థల నుంచి 2,64,220 మంది టెకీలు, 2024లో ఇప్పటి వరకు 398 కంపెనీల్లో 1,30,482 మంది సాఫ్ట్వేర్లను ఇంటికి పంపించాయి. వర్క్‌ఫ్రమ్ హోం ఇస్తున్నామనే ఉద్దేశంతో దాదాపు అన్ని కంపెనీలు నియమాలకంటే ఎక్కువసేపు పని చేయిస్తున్నాయి. దాంతో ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న కొందరు ఉద్యోగార్థులు తమ చిన్నప్పటి ‘డ్రీమ్‌జాబ్’కు స్వస్తి పలుకుతున్నారు.ఇదీ చదవండి: ప్రపంచాన్ని శాసిస్తున్న రంగాలు.. వాటి ఆదాయాలుఇప్పటికే టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న 51 శాతం ఉద్యోగులు తమ కుటుంబాలతో కలిసి ఉండేందుకు, పిల్లల చదువుల కోసం, వారితో సమయం గడుపుతూ మెరుగైన భవిష్యత్తు అందించేందుకు వేరే కొలువులవైపు మొగ్గు చూపుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా, దేశవ్యాప్తంగా 19 శాతం జెన్ జీ ఉద్యోగులు తన ‘డ్రీమ్‌జాబ్’ను నెరవేర్చుకునేందుకు టాప్ కంపెనీలను ఎంచుకుంటున్నట్లు కొన్ని సర్వేల్లో వెల్లడైంది. ఏదేమైనా సరైన నైపుణ్యాలున్న వారికి ఏ కంపెనీలోనైనా కొలువు సిద్ధంగా ఉంటుంది. భవిష్యత్తులో డిమాండ్ ఉండే కోర్సులు నెర్చుకుని అందులో అడ్వాన్స్డ్ స్కిల్స్ సంపాదిస్తే ఉద్యోగం ఖాయం. వృత్తి జీవితం వేరు. వ్యక్తిగత జీవితం వేరు. రెండింటిని బ్యాలెన్స్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పాటించాలి. -
‘ప్రైమ్ కేటగిరీ’లో రూ.11 లక్షల వరకు జీతం
టెక్ కంపెనీ ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయని తెలుసుకదా. తాజాగా ప్రముఖ సాఫ్ట్వేర్ సేవలందించే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈ ఏడాది ‘ప్రైమ్ రిక్రూట్మెంట్’ విధానాన్ని అనుసరించబోతున్నట్లు ప్రకటించింది. ఈ కేటగిరీలో నియమించుకుంటున్న అభ్యర్థులకు ఏటా రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షల మధ్య వేతనం ఉంటుందని పేర్కొంది.టీసీఎస్ టాలెంట్ అక్విజిషన్ విభాగం గ్లోబల్ హెడ్ గిరీష్ నందిమఠ్ మాట్లాడుతూ..‘ఈ ఏడాది సంస్థ రిక్రూట్మెంట్ విధానంలో కొత్త పద్ధతిని తీసుకురాబోతున్నాం. ‘ప్రైమ్’ కేటగిరీలో నియామకం పొందిన అభ్యర్థులకు ఏటా రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షలు వేతనం అందిస్తాం. కంపెనీ అవసరాలకు తగిన ప్రతిభ ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశాలున్నాయి. కొంతమంది అభ్యర్థులు ‘డ్రీమ్ కేటగిరీ’(ఇష్టమైన జాజ్) ఉద్యోగాలు వస్తే టీసీఎస్ నుంచి సదరు కొలువును ఎంచుకుంటున్నారు. దాంతో కంపెనీకి టాలెంట్ ఉన్న ఇంజినీర్ల కొరత ఎదురవుతుంది. దాన్ని తగ్గించేందుకే ఈ ‘ప్రైమ్’ కేటగిరీను ప్రవేశపెట్టాం. క్యాంపస్ ప్లేస్మెంట్లో ఈ కేటగిరీ కింద ఉద్యోగం పొందిన విద్యార్థులు మరొక కంపెనీ నియామక ప్రక్రియకు వెళ్లకుండా కళాశాలలు నిర్ధారిస్తాయి. ప్రోగ్రామింగ్, కోడింగ్ సామర్థ్యంపై అధిక నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఏఐ, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి కొత్త సాంకేతికతలపై యువత నైపుణ్యం పెంచుకోవాలి. టీసీఎస్‌లో ఐటీ సేవల రంగాన్ని మార్చే వేగవంతమైన సాంకేతిక పురోగతి ఉంది. వ్యూహాత్మక వృద్ధి వ్యాపారాలు, పరిశోధనా విభాగాలున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ సమన్లుజూన్ 30, 2024 నాటికి టీసీఎస్‌లో మొత్తం 6,06,998 మంది ఉద్యోగులున్నారు. 2024-25లో టీసీఎస్ క్యాంపస్‌ల నుంచి 40,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని యోచిస్తున్నారు. డిజిటల్ కేటగిరీలో ఉద్యోగం పొందిన అభ్యర్థులకు ఏటా రూ.3.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వేతనం ఆఫర్ చేస్తున్నారు. డిజిటల్, ప్రైమ్ కేటగిరీలో రిక్రూట్ అయిన వారికి శిక్షణ తక్కువగా అవసరం అవుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. -
ఒక్క నెలలో ఇంత మంది టెకీల తొలగింపా?
ఐటీ రంగంలో పరిస్థితులు ఇంకా మెరుగైనట్లు కనిపించడం లేదు. లేఆఫ్‌ల భయం ఉద్యోగులను ఇంకా వీడలేదు. గడిచిన జూలై నెలలో ప్రపంచవ్యాప్తంగా పలు ఐటీ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగించాయి. భారత్‌లోనూ గణనీయ సంఖ్యలో ఐటీ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు.ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు జూలై నెలలోనూ కొనసాగాయి. విదేశాలలోపాటు, భారత్‌లోనూ పలు కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి. గత నెలలో మొత్తంగా దాదాపు 8000 మంది ఉద్యోగాలు కోల్పోగా భారత్‌లో 600 మంది ఉద్వాసనకు గురయ్యారు. జూన్‌తో పోలిస్తే ఉద్యోగుల తొలగింపుల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ, ప్రభావం గణనీయంగానే ఉంది.జూలైలో ప్రధాన తొలగింపులు ఇవేమసాచుసెట్స్కు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ యూకేజీ (UKG) తన వర్క్‌ఫోర్స్‌లో 14% మందిని తొలగించింది. మొత్తం 2,200 మంది ఇంటి బాట పట్టారు. కాలిఫోర్నియాకు చెందిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ట్యూట్ (Intuit Inc.) కార్యకలాపాల క్రమబద్ధీకరణ పేరుతో దాదాపు 10% మంది అంటే 1,800 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది.సాఫ్ట్వేర్ కంపెనీలు ఓపెన్ టెక్స్ట్, రెడ్బాక్స్ కూడా ఉద్యోగుల తొలగింపులను ప్రకటించాయి. అవి వరుసగా 1,200, 100 ఉద్యోగాలను తగ్గించాయి. భారతీయ ఎడ్టెక్ దిగ్గజం అన్కాడెమీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా 100 మంది మార్కెటింగ్, బిజినెస్, ప్రొడక్షన్ ఉద్యోగులను, 150 మంది సేల్స్ సిబ్బందిని మొత్తంగా 250 మందిని తొలగించింది.చెన్నైకి చెందిన అగ్రిటెక్ సంస్థ వేకూల్ 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా బెంగళూరు ఆధారిత ఆడియో సిరీస్ ప్లాట్‌ఫారమ్ పాకెట్ఎఫ్ఎం దాదాపు 200 మంది రైటర్లను తొలగించింది. ఇక ‘ఎక్స్’కి పోటీగా వచ్చిన భారతీయ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’ (Koo) డైలీహంట్తో కొనుగోలు చర్చలు విఫలమవడంతో మూతపడింది. దీంతో దాదాపు 200 మంది ఉద్యోగులపై ప్రభావం పడింది. -
ఐటీ నిరుద్యోగుల కష్టాలు తీరినట్టే..!!
గతేడాదినియామకాల మందగమనం తర్వాత, భారతీయ ఐటీ రంగం 2025 ఆర్థిక సంవత్సరం కోసం నియామక ప్రణాళికలను పునరుద్ధరిస్తోంది. దాదాపు 3,50,000 ఉద్యోగాలను జోడించడానికి సిద్ధంగా ఉంది. ఈ రంగానికి డిమాండ్ వాతావరణం మెరుగుపడటంతో కంపెనీలు నియామకాలపై దృష్టి పెట్టాయని స్టాఫింగ్ సంస్థల నిపుణులు చెబుతున్నారు.గడిచిన సంవత్సరంలో స్థూల ఆర్థిక ఎదురుగాలుల కారణంగా నియామక కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయి. నాస్కామ్ ప్రకారం, టెక్ పరిశ్రమ 2024 ఆర్థికేడాదిలో 60,000 కొత్త ఉద్యోగాలను మాత్రమే జోడించింది. ఇది అంతకుముందు సంవత్సరంలో వచ్చిన 2,70,000 ఉద్యోగాల కంటే చాలా తక్కువ. ఐటీ మేజర్లు గత ఏడాది మొత్తం ఉద్యోగుల సంఖ్య వృద్ధిలో పడిపోయాయి. అయితే, నియామక ఔట్లుక్ ఇప్పుడు సానుకూలంగా మారుతోంది.ఎన్డీటీవీ నివేదిక ప్రకారం.. “హెడ్‌కౌంట్ తగ్గుదలతో FY25ని ప్రారంభించినందున, భారతీయ అగ్రశ్రేణి ఐటీ సంస్థలు నికర హెడ్‌కౌంట్ జోడింపులను నమోదు చేయడానికి ముందు క్షీణతను భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టెక్ రంగం నికర వృద్ధి కోసం ప్రస్తుత ఔట్లుక్ FY24లో చూసినట్లుగా 2,00,000-2,50,000 మధ్య ఉంది. అయితే క్షీణత, విస్తరణ నియామకాల కోసం 3,25,000-3,50,000 కంటే ఎక్కువ నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ వృద్ధిలో 60% పైగా అగ్రశ్రేణి ఐటీ సంస్థల నుంచి రావచ్చు’’ ఎక్స్‌ఫెనో ఐటీ స్టాఫింగ్ బిజినెస్ హెడ్ సుందర్ ఈశ్వర్ పేర్కొన్నారు.ఆర్థిక అనిశ్చితులు, ఖర్చు-అవసరాల కారణంగా మొత్తం నియామకాల్లో ఫ్రెషర్లు గణనీయమైన భాగాన్ని కలిగి ఉండే అవకాశం ఉందని టీమ్‌లీజ్ డిజిటల్ బిజినెస్ హెడ్ కృష్ణ విజ్ తెలిపారు. పెద్ద ఐటీ సంస్థలు ఇప్పటికే ఫ్రెషర్ హైరింగ్‌లో గణనీయమైన పెరుగుదలను సూచించాయి. FY25లో టీసీఎస్ 40,000 మంది, హెచ్‌సీఎల్ టెక్ 10,000 మంది, ఇన్ఫోసిస్ లిమిటెడ్ 15,000-20,000 మంది విప్రో 12,000 మంది వరకు ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించాయి. -
ఐటీ పుంజుకోదా..? ఎకనామిక్ సర్వే ఏం చెప్పిందంటే..
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో నియామకాలు గణనీయంగా మందగించాయని, ఇవి మరింతగా తగ్గకపోయినప్పటికీ గణనీయంగా పుంజుకునే అవకాశం లేదని ఆర్థిక సర్వే పేర్కొంది.దశాబ్దాల తర్వాత తొలిసారిగా కొన్ని పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో హెడ్‌కౌంట్ క్షీణించిన తరుణంలో ఆర్థిక సర్వేలో ఐటీ రంగంపై ప్రస్తావించారు. ఫిబ్రవరిలో, టెక్ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం కేవలం 60,000 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని పేర్కొంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం సృష్టించిన 2,70,000 ఉద్యోగాలతో పోలిస్తే చాలా తక్కువ.అయితే ప్రభుత్వం చేపట్టిన ప్రోత్సాహక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవడం, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఎక్కడా లేని సామర్థ్యాన్ని సంగ్రహించడం ద్వారా వ్యాపార, కన్సల్టెన్సీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులను విస్తరించవచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. -
ఐటీ ఫ్రెషర్లకు పండగే.. క్యూ కట్టనున్న కంపెనీలు!
టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్, విప్రో వంటి పెద్ద ఐటీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY25) గణనీయమైన సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలను ప్రకటించాయి. దీంతో భారత ఐటీ రంగం రిక్రూట్మెంట్ ప్రయత్నాలలో గణనీయమైన పునరుద్ధరణను పొందుతోంది. టాప్ కంపెనీలు మొత్తంగా 80,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నాయన్న వార్తలు ఐటీ ఫ్రెషర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.ముందంజలో టీసీఎస్ ఆదాయపరంగా భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ సంవత్సరం 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జూన్ త్రైమాసికంలోనే 5,452 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దాని మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,998కి చేరుకుంది.ఇన్ఫోసిస్ వ్యూహాత్మక నియామకందేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. ఈ నియామకం ఆన్-క్యాంపస్, ఆఫ్-క్యాంపస్ రిక్రూట్మెంట్ మిశ్రమంగా ఉంటుంది. వరుసగా ఆరు త్రైమాసికాలుగా హెడ్‌కౌంట్‌లో క్షీణతను నివేదించినప్పటికీ, ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో జయేష్ సంఘ్రాజ్కా భవిష్యత్ వృద్ధిపై ఆశావాదాన్ని వ్యక్తం చేశారు.తాజా ప్రతిభపై హెచ్‌సీఎల్‌టెక్ దృష్టిఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 8,080 మంది ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, ఆర్థక సంవత్సరంలో 10,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలను హెచ్‌సీఎల్‌టెక్ ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న టెక్ ల్యాండ్‌స్కేప్‌లో పోటీగా నిలవడానికి ఉత్పాదక ఏఐలో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో సహా అప్‌స్కిల్లింగ్ కార్యక్రమాలపై దృష్టి సారించడం ద్వారా తాజా ప్రతిభపై పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తోంది.విప్రో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్విప్రో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 నుంచి 12,000 మంది ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ఒక సంవత్సరం విరామం తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్కు తిరిగి రావడాన్ని సూచిస్తోంది. -
అలాంటి ఉద్యోగుల విషయంలో కఠిన వైఖరి
ఉద్యోగుల కాంట్రాక్టు విషయంలో తన కఠిన వైఖరిని ఐటీ సంస్థ విప్రో స్పష్టం చేసింది. తమ ఉద్యోగులతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఒప్పందాలకు కట్టుబడి ఉంటామని విప్రో తెలిపింది. అంటే కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించి బయటకు వెళ్లిపోయేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పేసింది."ఉద్యోగులు, ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లతో కుదుర్చుకున్న కాంట్రాక్టుల విషయంలో ఖచ్చితంగా ఉంటాం. ఇందులో మా వైఖరి మారలేదు. మారబోదు’’ అని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో అన్నారు. కంపెనీలో ప్రతి ఒక్కరికీ మంచి అవకాశాలు కల్పిస్తున్నామని, కానీ కొంత మంది బయట మంచి అవకాశాలు దొరికితే వెళ్లిపోతున్నారని ఆయన చెప్పారు.గత ఏడాది నవంబర్‌లో విప్రోను వీడి కాగ్నిజెంట్‌లో సీఎఫ్ఓగా చేరిన తమ మాజీ సీఎఫ్ఓ జతిన్ దలాల్ నుంచి కాంట్రాక్టు ఉల్లంఘన కింద విప్రో ఇటీవల రూ.25 కోట్లు కోరింది. 2015లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయినప్పటి నుంచి దలాల్‌కు మంజూరు చేసిన స్టాక్ యూనిట్ల విలువను బట్టి ఈ మొత్తాన్ని విప్రో డిమాండ్ చేసింది. ఇదే వ్యవహారంలో తన మాజీ యజమాని విప్రోతో వ్యాజ్యాన్ని పరిష్కరించుకోవడానికి ఇటీవల కాగ్నిజెంట్ సీఎఫ్‌వో జతిన్ దలాల్‌కు రూ. 4 కోట్లు చెల్లించింది. -
కంపెనీలు వెళ్లిపోతాయ్..!
ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు రిజర్వేషన్ ఉండాలంటూ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తెచ్చిన బిల్లుపై నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ బిల్లు 2024ను వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించింది. దీని వల్ల కంపెనీలు రాష్ట్రాన్ని విడిచివెళ్లే ప్రమాదం ఉందని తెలిపింది.నాస్కామ్ తెలిపిన వివరాల ప్రకారం..కర్ణాటక రాష్ట్రం సాంకేతిక రంగంలో ఎంతో వృద్ధి చెందింది. రాష్ట్ర జీడీపీలో ఈ రంగం వాటా 25 శాతంగా ఉంది. భారతదేశ డిజిటల్ టాలెంట్‌లో నాలుగింట ఒక వంతు ఇక్కడి నుంచే సమకూరుతుంది. 1,100 స్టార్టప్‌లు స్థానికంగా ఆవిష్కరణలు చేస్తున్నాయి. మొత్తం గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)లో 30 శాతం కర్ణాటకలోనే కొలువు తీరాయి. ప్రభుత్వం తాజాగా స్థానికులకే ఉద్యోగాలు కేటాయించేలా బిల్లు తీసుకొచ్చింది. దాంతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు, వేరే దేశాలకు చెందినవారు కర్ణాటకలో పనిచేసే పరిస్థితులుండవు. టెక్ కంపెనీలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. భారీగా టెక్నాలజీ ఎగుమతులు చేస్తున్న రాష్ట్రంలో ఈ బిల్లు వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై విస్తృతంగా సమీక్ష జరిపే విరమించుకోవాలి.కర్ణాటక స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ బిల్లు 2024 ప్రకారం..రాష్ట్రంలోని ప్రైవేట్ కంపెనీల్లో స్థానికులకు యాజమాన్య స్థాయిలో 50 శాతం, ఇతర పొజిషన్లలో 75 శాతం రిజర్వేషన్లు ఉండాలని నిర్ణయించారు. దీనివల్ల సాంకేతిక రంగంలో రాష్ట్రానికి ఉన్న అనుకూల వాతావరణంపై, ప్రతికూల ప్రభావం ఉంటుందని, పరిశ్రమ తిరోగమన బాట పడుతుందన్న పలువురు నిపుణుల హెచ్చరికలకు నాస్కామ్ కూడా గొంతు కలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కొరత ఉందని పలు నివేదికలు వెలువడుతున్న తరుణంలో ఇలాంటి బిల్లు విడుదల చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: ఏసీ ఆన్ చేయమంటే క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..?ప్రైవేట్ టెక్ కంపెనీల్లో గ్రేడ్ సీ, డీ ఉద్యోగాల్లో కన్నడిగులకు 100 శాతం రిజర్వ్ చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గతంలో ప్రకటించారు. స్థానిక అభ్యర్థులకు ప్రైవేట్ సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. -
జీతం ఇవ్వలేదని సీఈఓ కిడ్నాప్.. 8 మంది అరెస్టు
ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని ఐటీ కంపెనీ సీఈవోను అపహరించిన ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు జూబ్లీహిల్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి.వెంకటగిరి తెలిపారు. నిందితుల నుంచి 84 ల్యాప్‌టాప్‌లు, 18 మొబైల్ ఫోన్లు, ఒక కారు, పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.పోలీసుల కథనం ప్రకారం..హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో రవిచంద్రరెడ్డి గిగ్లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటీ కన్సల్టెన్సీ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతడు వివిధ కన్సల్టెన్సీల ద్వారా రిక్రూట్ అయిన దాదాపు 1,200 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోయాడు. దాంతో ఉద్యోగులు, కన్సల్టెంట్లు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కంపెనీ సీఈఓ రవిచంద్రపై ప్రస్తుత ఉద్యోగులు, పలువురు మాజీ ఉద్యోగులు ఇటీవల రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రవి తమకు జీతాలు చెల్లించకుండా మోసం చేశాడని ఆరోపించారు. తాము రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల రూపాయలు వరకు చెల్లించి ఇతర కన్సల్టెన్సీల ద్వారా ఈ కంపెనీలో రిక్రూట్ అయ్యామని పేర్కొన్నారు. తమ జీతాల బకాయిలు అందకుండా తమను అన్యాయంగా ఉద్యోగంలో నుంచి తొలగించారని ఆరోపించారు.ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న బిజినెస్ కన్సల్టెంట్ ఒకరు, ఇద్దరు సాఫ్ట్వేర్లు, మరో ఐదుగురు ఉద్యోగులు కలిసి రవిచంద్రను కిడ్నాప్ చేయాలనుకున్నారు. ముందుగా అనుకున్న విధంగానే జులై 10 అర్ధరాత్రి వీరు రవి నివాసంలోకి ప్రవేశించి కిడ్నాప్ చేశారు.కిడ్నాప్ అయిన వెంటనే రవి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగే సమయంలో నిందితులు ఆమెపై దాడి చేశారని చెప్పారు. ఇంట్లో ఉన్న 84 ల్యాప్‌టాప్‌లను అపహరించినట్ల పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసు బృందం రవిచంద్రను శ్రీశైలం హైవేలోని ఓ హోటల్లో గుర్తించి రక్షించారు. నిందితులు దొంగలించిన 84 ల్యాప్‌టాప్‌లు, 18 మొబైల్ ఫోన్లు, ఒక కారు, మూడు పాస్పోర్ట్లతోపాటు వారికి చెందిన రెండు కార్లు, ఒక మోటర్‌బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ పి.వెంకటగిరి వివరించారు.ఇదీ చదవండి: ప్లాట్‌ఫామ్ ఫీజు 20 శాతం పెంపు!ఇదిలాఉండగా, ఉద్యోగం కోసం నైపుణ్యాలు పెంచుకుని నేరుగా కంపెనీలను ఆశ్రయించి ఇంటర్వ్యూలకు హాజరుకావాలని నిపుణులు చెబుతున్నారు. అంతేగానీ, దళారుల ద్వారా ఉద్యోగాల్లో చేరితే ఆర్థికంగా, ఉద్యోగపరంగా నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. -
ఐటీ కష్టాలు తీరినట్టేనా? నియామకాల పునరుద్ధరణ సంకేతాలు
దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నియామకాల పునరుద్ధరణకు టీసీఎస్‌లో పరిణామాలు సంకేతంగా నిలుస్తున్నాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 11,000 మంది ట్రైనీలను చేర్చుకున్నామని, మార్చి 2025తో ముగిసే సంవత్సరానికి 40,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది.దేశపు అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల ఎగుమతిదారు అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) హెడ్‌కౌంట్ (ఉద్యోగుల సంఖ్య) మొదటి త్రైమాసికంలో 5,452 పెరిగి 6,06,998కి చేరుకుందని కంపెనీ తెలిపింది. అయితే 2024 ఆర్థిక సంవత్సరంలో దీని హెడ్‌కౌంట్ 13,249 తగ్గింది. క్రితం త్రైమాసికంలో ఉన్న 12.5%తో పోలిస్తే క్యూ1లో అట్రిషన్ 12%కి తగ్గింది.రెండో త్రైమాసికంలో అట్రిషన్ స్థిరపడుతుందని క్యూ1 ఎర్నింగ్స్ కాల్లో టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. "ప్రతిభను పెంపొందించడానికి టీసీఎస్‌కు ట్రైనీలు కీలకమైన వ్యూహం. అది ఈ సంవత్సరం కూడా కొనసాగుతుంది" అని ఆయన చెప్పారు.40 వేల జాబ్స్2025 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకునే ప్రణాళికలో ఉన్నామని టీసీఎస్ తెలిపింది. అయితే ఇది బాహ్య కారకాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందని పేర్కొంది. కంపెనీ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్‌ని కూడా ముగించి క్వాలిఫైడ్ అభ్యర్థులను ప్రాసెస్ చేస్తోంది. టీసీఎస్ అయాన్ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ అనేది అభ్యర్థి సామర్థ్యాలు, నైపుణ్యాలను అంచనా వేసే సామర్థ్య పరీక్ష. కంపెనీ నైపుణ్య అంతరాలను అంచనా వేస్తుందని, అవసరాల ఆధారంగా నియామకాలు చేపడుతోందని లక్కాడ్ చెప్పారు. -
వచ్చే 2-3 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!
భారతదేశ సాంకేతిక రంగంలో రానున్న 2-3 ఏళ్లకుగాను 10 లక్షల మంది టెక్నాలజీ ఇంజినీర్ల అవసరం ఉందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీతా గుప్తా అంచనా వేశారు. విద్యార్థుల్లో కంపెనీలకు అవసరమయ్యే నైపుణ్యాలను పెంచితే తప్పా ఈ డిమాండ్‌ను పూడ్చలేమని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా సంగీతా గుప్తా మాట్లాడుతూ..‘రాబోయే 2-3 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు ఇతర రంగాల్లో అధునాతన నైపుణ్యాలు కలిగిన దాదాపు 10 లక్షల మంది టెక్ ఇంజినీర్ల అవసరం ఉంది. దురదృష్టవశాత్తు కళాశాలలు విద్యార్థులకు తగినంత ప్రాక్టికల్ నైపుణ్యాలను అందించడం లేదు. దేశవ్యాప్తంగా నెలకొనే ఇంజినీర్ల కొరతను తీర్చాలంటే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా ప్రభుత్వం శిక్షణ అందించాలి. ఏఐ, బిగ్ డేటా అనలిటిక్స్, సైబర్-సెక్యూరిటీ వంటి రంగాల్లో భారీ ఉద్యోగాలు రానున్నాయి. ప్రస్తుతం ఆయా రంగాల్లో పని చేస్తున్నవారు కూడా అధునాతన నైపుణ్యాలు పెంచుకోవాలి. వేగంగా మారుతున్న డిజిటల్ టెక్నాలజీలో కొలువులు సాధించాలంటే నిత్యం కొత్త సాంకేతికతనే నేర్చుకోవాల్సిందే’నని చెప్పారు.కంపెనీ అవసరాలకు తగిన నైపుణ్యాలు లేకపోవడం వల్ల 80,000 ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయామని గత నెలలో టీసీఎస్ తెలిపింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఏఐపై శిక్షణ పొందిన ఉద్యోగుల సంఖ్యను కూడా రెట్టింపు చేసినట్లు చెప్పింది. ప్రముఖ ఇంజినీరింగ్, నిర్మాణ సంస్థగా పేరున్న లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ జూన్‌లో తమ ఐటీ, ఐటీ ఆధారిత సేవల యూనిట్లో 20,000 ఇంజినీర్ల కొరత ఉందని పేర్కొంది. 2028లో డిజిటల్ నైపుణ్యాలకు సంబంధించిన డిమాండ్ సరఫరా అంతరం 25 శాతం నుంచి 29 శాతానికి పెరుగుతుందని నాస్కామ్ అంచనా వేసింది. మార్కెట్లో ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ సరైన నైపుణ్యాలు లేక కంపెనీలు కొంత ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: అసౌకర్యంగా ఉండేందుకు ఎవరూ లగ్జరీ కార్లు కొనరుదేశ టెక్నాలజీ రంగ ఆర్థిక వ్యవస్థ 250 బిలియన్ల డాలర్లు(సుమారు రూ.20 లక్షల కోట్లు)గా ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ రంగంలో దాదాపు 5.4 మిలియన్ల(54 లక్షల) మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో టెక్నాలజీ సేవలు 7.5 శాతంగా నమోదవుతున్నాయి. -
యూఎస్ సాఫ్ట్వేర్ కంపెనీలో లేఆఫ్‌లు.. 2,200 మంది తొలగింపు
యూఎస్‌కు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ ‘యూకేజీ’ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. ఓ నివేదిక ప్రకారం కంపెనీ తన తాజా రౌండ్లో మొత్తం శ్రామికశక్తిలో దాదాపు 14% మందికి ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఈ లేఆఫ్‌లతో 2,200 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయినట్లు అంచానా వేస్తున్నారు.జూలై 4న సెలవు రోజు కావడంతో జూలై 3వ తేదీనే తొలగింపులు ప్రారంభించినట్లు చెబుతున్నారు. యూకేజీ లేఆఫ్‌ల గురించి బిజినెస్ జర్నల్ నివేదించింది. ఫ్లోరిడాకు చెందిన ఈ సాఫ్ట్వేర్ కంపెనీ భారీ లేఆఫ్‌లతో తన శ్రామిక శక్తిని ఎలా తగ్గించుకుందో వివరించింది. కంపెనీ సీఈవో క్రిస్ టాడ్ ఈమెయిల్ ప్రకారం కంపెనీ తన వర్క్‌ఫోర్స్‌లో 14% మందిని తగ్గించిందని నివేదిక పేర్కొంది.అనేక దేశాలలో ఉనికిని కలిగి ఉన్న అతిపెద్ద సాఫ్ట్వేర్ డెవలపర్లలో ఒకటైన యూకేజీ మొత్తం 15,882 మంది ఉద్యోగులను కలిగి ఉందని పేర్కొంది. కీలకమైన వృద్ధి రంగాలపై దృష్టి సారించడం, దీర్ఘకాలిక వ్యూహం లక్ష్యంగా చేస్తున్న సంస్థాగత మార్పుల్లో భాగంగా తొలగింపులను ప్రారంభించినట్లు యూకేజీ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. కంపెనీ సీఈవో క్రిస్ టాడ్ తొలగింపులను వచ్చే వారం ప్రకటించాలనుకున్నారు. అయితే ఇంతలోపే వార్తలు బయటకు రావడంతో కంపెనీ తన చర్యలను వేగవంతం చేయాల్సి వచ్చిందంటున్నారు. ప్రస్తుత ఉద్యోగాల కోతలు యునైటెడ్ స్టేట్స్కే పరిమితం అవుతాయని క్రిస్ టాడ్ ధ్రువీకరించారు. -
ఒక్క కంపెనీలోనే త్వరలో 8 వేల మందికి ఉద్యోగాలు!
ప్రముఖ ఐటీ సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్ 2024లో సుమారు 6000 నుంచి 8000 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభావంతులను ఆకర్షించేందుకు కంపెనీ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ బాలసుబ్రమణియన్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా కంపెనీ వర్క్‌ఫోర్స్‌ను విస్తరించాలని భావిస్తున్నాం. ప్రతిభావంతులైన వ్యక్తులను ఆకర్షించడానికి కంపెనీ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తుంది. ఇండియా, యూఎస్, కెనడా, మెక్సికో, యూకేతో సహా వివిధ దేశాలలో 2024లో 6,000 నుంచి 8,000 మంది ఉద్యోగులను నియమిస్తాం. భారత్‌లో హైదరాబాద్, నోయిడా, కోయంబత్తూర్, దెహ్రాదూన్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని కంపెనీ కార్యాలయాల్లో ఉద్యోగులను నియమించాలని నిర్ణయించాం. టెక్ లీడ్స్, ఆటోమేషన్ టెస్టింగ్ స్పెషలిస్ట్‌లు, ఏఈఎం ఆర్కిటెక్ట్‌లు, బిగ్ డేటా లీడ్స్, వర్క్‌డే ఫైనాన్షియల్ కన్సల్టెంట్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది’ అన్నారు.‘నగరాల వారీగా నిర్దిష్ట నియామకాలు ఉంటాయి. హైదరాబాద్, నోయిడా కార్యాలయాల్లో ఐసీఎస్ఎం, హెచ్ఆర్ఎస్డీ, ఫ్రంట్‌ఎండ్, ఎంఎస్డీ, జావా ఎఫ్ఎస్డీ, డాట్నెట్ ఎఫ్ఎస్డీ విభాగాల్లో ఉద్యోగులను నియమిస్తాం. కోయంబత్తూర్, బెంగళూరులో అజూర్ డేటాబ్రిక్స్, పైథాన్ ఏడీఎఫ్ వంటి టెక్నాలజీ నిపుణులకు ప్రాధాన్యం ఇస్తాం. యూఎస్‌లో ఆటోమేషన్ నైపుణ్యం కలిగిన క్లౌడ్ అప్లికేషన్ ఆర్కిటెక్ట్‌లు అవసరం. జావా ఫుల్-స్టాక్ ఇంజినీర్లు, టెస్ట్ అనలిస్ట్‌లు (ఎస్‌డీఈటీ), సీనియర్ జావా ఫుల్-స్టాక్ డెవలపర్లను నియమించాలని యోచిస్తున్నాం. యూకేలో టెస్ట్ మేనేజర్లను (మాన్యువల్, ఆటోమేషన్), డెవొప్స్(అజూర్), సర్వీస్ డెస్క్ ప్రొఫెషనల్స్, ఫుల్-స్టాక్ డెవలపర్లకు (జావా, డాట్నెట్) అవకాశం ఇస్తాం’ అని బాలసుబ్రమణియన్ తెలిపారు.ఇదీ చదవండి: ఫోన్ పే, జీపే, పేటీఎం.. ద్వారా విద్యుత్తు బిల్లు చెల్లించకూడదుఅంతర్జాతీయంగా ప్రముఖ ఐటీ సంస్థలు కాస్ట్‌కటింగ్ పేరిట ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో కొన్ని కంపెనీలు మాత్రం కొత్తవారికి అవకాశం కల్పిస్తుండడం మంచి పరిణామమని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ రానున్న సమావేశాల్లో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తే ఐటీ రంగం ఊపందుకుంటుందని అభిప్రాయ పడుతున్నారు. -
సింగర్ శ్రేయా ఘోషల్ భర్త ఎవరో తెలుసా? ట్రూ కాలర్ కంపెనీ..
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం మొదలైన భాషల్లో పాటలు పాడి పాన్ ఇండియా సింగర్‌గా పేరు తెచ్చుకున్న 'శ్రేయా ఘోషల్' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులోనే సుమారు 200 కంటే ఎక్కువ పాటలు పాడిన ఈమె పలు జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. సింగర్‌గా మాత్రమే తెలిసిన చాలా మందికి శ్రేయా ఘోషల్.. వ్యక్తిగత జీవితం గురించి తెలియదు. ఈమె భర్త ఓ ప్రముఖ కంపెనీలు పనిచేస్తున్నట్లు బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. ఈ కథనంలో శ్రేయా ఘోషల్ భర్త ఎవరు?, ఏ సంస్థలో పనిచేస్తారు? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..సింగర్ శ్రేయా ఘోషల్ భర్త పేరు 'శిలాదిత్య ముఖోపాధ్యాయ' (Shiladitya Mukhopadhyaya). ఈయన సుమారుగా రూ. 1400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన ప్రముఖ ట్రూకాలర్ కంపెనీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏప్రిల్ 2022 నుంచి ట్రూకాలర్‌లో బిజినెస్ గ్లోబల్ హెడ్‌గా సేవలందిస్తున్న ముఖోపాధ్యాయ కంపెనీని సక్సెస్ వైపు నడిపించడంలో కీలకపాత్ర పోషించారు.ట్రూకాలర్ సంస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న శిలాదిత్య ముఖోపాధ్యాయ.. శ్రేయా ఘోషల్ చిన్ననాటి స్నేహితుడు. వీరిరువురు సుమారు తొమ్మిదేళ్లు ప్రేమించుకుని 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2021లో బాబు దేవయాన్ జన్మించాడు. ఈయన ముంబై విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్‌లో బీఈ పట్టా పొందాడు.భారతీయ సినిమా నేపథ్య సంగీతానికి శ్రేయా ఘోషల్ రాణి అయితే, ఆమె భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ వ్యాపార ప్రపంచంలో పాపులర్ పర్సన్. అతడు ముంబై యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఈయన గతంలో కాలిఫోర్నియాలోని ఓ ప్రముఖ కంపెనీలో కూడా పనిచేసినట్లు సమాచారం.ఇక శ్రేయా ఘోషల్ విషయానికి వస్తే.. భారతదేశంలో ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకునే సింగర్లలో ఒకరైన ఈమె, ఇప్పటికే ఐదుసార్లు జాతీయ చలన చిత్ర అవార్డులను అందుకుంది. ఈమె ఆస్తి విలువ సుమారు రూ. 180 నుంచి రూ. 185 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం. అయితే శిలాదిత్య ముఖోపాధ్యాయ మొత్తం ఆస్తికి సంబంధించిన అధికారిక వివరాలు అందుబాటులో వెల్లడికాలేదు. -
‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కోసం డెల్ ఉద్యోగులు చేస్తున్న రిస్క్ ఏంటి?
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడం కంపెనీలకు కత్తిమీద సాములా మారింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా, కఠిన నిబంధనలు తీసుకొస్తున్నా ఉద్యోగులు జంకడం లేదు. ఆఫీస్‌కు రావడానికి ససేమిరా అంటున్నారు. ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ ఉద్యోగులైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ప్రమోషన్లు సైతం వదులుకునేందుకు సిద్ధమయ్యారు.డెల్ కంపెనీ గత ఫిబ్రవరిలో రిటర్న్-టు-ఆఫీస్ తప్పనిసరి నిబంధనను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. హైబ్రిడ్‌గా పనిచేస్తారా.. లేక రిమోట్‌గా పనిచేస్తారా అన్నది అధికారికంగా తెలియజేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఎంచుకున్న ఉద్యోగులు ప్రమోషన్ లేదా పాత్ర మార్పులకు అర్హులు కాదని కంపెనీ పేర్కొంది.హైబ్రిడ్‌ను ఎంచుకున్న ఉద్యోగులకు త్రైమాసికానికి 39 రోజులు, వారానికి సుమారు మూడు రోజులు ఆఫీసులో హాజరును కంపెనీ తప్పనిసరి చేసింది. వారి హాజరును కలర్-కోడ్ సిస్టమ్ ద్వారా పర్యవేస్తుంది. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం.. డెల్ ఫుల్‌టైమ్ యూఎస్ ఉద్యోగులలో దాదాపు 50 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎంచుకున్నారు.దీని అర్థం ఈ ఉద్యోగులు పదోన్నతికి అర్హులు కాదు. ఇక అంతర్జాతీయ సిబ్బందిలోనూ మూడింట ఒక వంతు మంది వర్క్ ఫ్రమ్ హోమ్‌నే ఎంచుకున్నారు. ఆఫీసుకు వెళ్లడం కన్నా ఇంటి నుంచి పనిచేయడంలోనే తమకు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది ఉద్యోగులు భావిస్తున్నారు. దీంతో ప్రమోషన్లను సైతం వదులుకునేందుకు సిద్ధమయ్యారు. -
టీసీఎస్‌లో విచిత్ర పరిస్థితి! 80,000 జాబ్స్ ఉన్నాయి.. కానీ..
ఐటీ కంపెనీల్లో అనిశ్చితి కొనసాగుతోంది. ఓ వైపు లేఆఫ్‌ల పేరుతో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తుండగా మరో వైపు నియామకాలు మందగించాయి. వేలాది మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే భారత్‌కు చెందిన ఐటీ దిగ్గజం టీసీఎస్‌లో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కంపెనీలో 80,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ తగిన నైపుణ్యాలున్న అభ్యర్థులు దొరకడం లేదు.స్కిల్స్ గ్యాప్ కారణంగా టీసీఎస్ 80,000 ఖాళీలను భర్తీ చేయడానికి కష్టపడుతోందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఇది ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలు, కొత్త ఉద్యోగాల అవసరాల మధ్య అసమతుల్యతను తెలియజేస్తోంది. ఈ అంతరాలను భర్తీ చేయడానికి కాంట్రాక్టర్లపై ఆధారపడవలసి వస్తోందని టీసీఎస్ రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ (ఆర్ఎంజీ) గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్ అమర్ షెట్యే టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు.ఓ వైపు ఎంపిక చేసుకున్న ఫ్రెషర్లను ఉద్యోగాలలోకి చేర్చుకోకుండా ఇలా స్కిల్ గ్యాప్ పేరుతో వేలాది ఉద్యోగాలను ఖాళీగా ఉంచడంపై ఉద్యోగార్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. టీసీఎస్ సహా భారత ఐటీ దిగ్గజాలు ఫ్రెషర్స్ ఆన్‌బోర్డింగ్‌లో జాప్యం చేస్తుండటంతో చాలామంది జాయిన్ డేట్లను కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నారు. గత రెండేళ్లలో 10,000 మందికి పైగా ఫ్రెషర్లు ఈ జాప్యం వల్ల ప్రభావితమయ్యారని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) తెలిపింది. -
ఐటీ కంపెనీలు ఇంతపని చేస్తున్నాయా?.. రోజులు గడుస్తున్నా..
అసలే ఉద్యోగాలు దొరక్క యువత అల్లాడిపోతుంటే.. ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగాలు కల్పించడంలో జాప్యం చేస్తున్నాయి. భారతదేశంలోని ఐటీ దిగ్గజాలు సైతం ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) పేర్కొంది.గత రెండేళ్ల కాలంలో ఐటీ కంపెనీలు సుమారు 10,000 కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని ఎన్ఐటీఈఎస్ వెల్లడించింది. ఈ జాబితాలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో మొదలైన కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేసి.. ఉద్యోగంలో చేర్చుకోవడంలో చాలా ఆలస్యం చూపిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని.. ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు.ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో ఏర్పడిన వ్యాపార అనిశ్చితి కారణంగా ఫ్రెషర్లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో జాప్యం జరుగుతుందని ఐటీ కంపెనీలు చెబుతున్నాయి. వ్యాపార అవసరాలను బట్టి ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకోవడం జరుగుతుందని, ఉద్యోగంలో చేర్చుకోవాలనుకున్నప్పుడు వారికి ముందుగానే సమాచారం తెలియాజేస్తామని ఇన్ఫోసిస్ మెయిల్స్ పంపినట్లు సమాచారం.విప్రో కూడా రెండేళ్ల క్రితం అభ్యర్థులకు అందించిన క్యాంపస్ ఆఫర్లను ఆన్‌బోర్డ్ చేయలేదు. గత సంవత్సరం ముందు, మేము క్యాంపస్‌కి వెళ్లి చాలా ఆఫర్లు చేసాము. వారందరిని ఇంకా ఉద్యోగాల్లో చేర్చుకోలేదు. వారిని ఉద్యోగాల్లో చేర్చుకున్న తరువాత కొత్త ఫ్రెషర్లను తీసుకుంటామని విప్రో సిహెచ్ఆర్ఓ సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు.తగ్గిన ఐటీ ఉద్యోగుల సంఖ్యభారతదేశంలో కరోనా మహమ్మారి తరువాత చాలామంది ఐటీ ఉద్యోగులు, తమ ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా ప్రభావం తగ్గినా తరువాత కూడా కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే వచ్చాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు విడుదల చేసిన డేటా ప్రకారం.. 20236-24 ఆర్ధిక సంవత్సరంలో 63759 మంది ఉద్యోగులు తగ్గిపోయారని తెలిసింది. -
అరుదైన స్థానం దక్కించుకున్న హైదరాబాద్ కంపెనీ
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ‘టెక్నాలజీ పయనీర్స్ 2024’ జాబితాలో దేశంలోని పది కంపెనీలు చోటు సంపాదించాయి. కృత్రిమ మేధ (ఏఐ)తో సరికొత్త ఆవిష్కరణలు చేసిన 100 స్టార్టప్ కంపెనీలతో ఈ జాబితా రూపొందించారు. అందులో హైదరాబాద్‌కు చెందిన నెక్ట్స్‌వేవ్ కంపెనీ స్థానం దక్కించుకోవడం విశేషం.నెక్ట్స్‌వేవ్..ఏదో ఒకకోర్సు నేర్చుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరగానే సరిపోదు. నిత్యం కొత్త అంశాలు నేర్చుకుంటేనే ఉద్యోగంలో నిలదొక్కుకోగలం. ఆ దిశగా పని చేస్తోంది ‘నెక్ట్స్‌వేవ్’. ఐఐటీల్లో చదివిన హైదరాబాదీ యువకులు శశాంక్ రెడ్డి, రాహుల్, అనుపమ్ కొవిడ్ లాక్డౌన్ సమయంలో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ సంస్థను స్థాపించారు. కంటిన్యూయస్ కెరీర్ బిల్డింగ్ ప్రోగ్రాం(సీసీబీపీ) పేరిట కాలేజీల నుంచి గ్యాడ్యుయేట్లుగా బయటకు వచ్చే విద్యార్థులకు కంపెనీల్లో అవసరమయ్యే ఐఓటీ, ఏఐ, ఫుల్‌స్టాక్ తదితర స్కిల్స్ నేర్పించడం దీని ఉద్దేశం.దేశంలో డిగ్రీ అయిపోయాక ఖాళీగా ఉంటున్న దాదాపు 60 శాతం మందిని నిపుణులుగా తీర్చిదిద్దాలనేది సంస్థ లక్ష్యం. ఇక్కడ శిక్షణ పొందిన వారు ప్రముఖ సంస్థల్లో కొలువు దక్కించుకొని, నైపుణ్యాలకు సానబట్టే వేదిక దొరికితే దూసుకెళ్తామని నిరూపించారు కూడా. దేశవ్యాప్తంగా మూడు వేల కాలేజీలకు చెందిన 2 లక్షల మంది విద్యార్థులు ఈ స్టార్టప్ కమ్యూనిటీలో భాగస్వాములయ్యారు. ఫ్రెషర్స్‌తో పాటు వివిధ కారణాల వల్ల కెరియర్లో గ్యాప్ వచ్చిన, వేరే రంగంలో పనిచేసిన వారికీ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పించే బాధ్యత తమదేనని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. పనితీరుతో ఇన్వెస్టర్లనూ మెప్పించి.. గతంలో రూ.21 కోట్ల క్యాపిటల్‌ను సాధించారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే సాఫ్ట్వేర్ రంగంలో నిలదొక్కుకోవచ్చని చెబుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఉద్యోగాల కల్పనకు సహాయం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏడాదికి పది లక్షల మంది నిపుణులను తయారు చేయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలుపుతున్నారు.ఐటీ పరిశ్రమలో లేఆఫ్స్.. ఇప్పుడేం చేయాలంటే..ఐటీ పరిశ్రమలో ప్రముఖ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరుతో కొంతకాలంగా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగంలోని సాఫ్ట్వేర్ల అప్డేషన్ అగిపోయింది. బ్యాంకింగ్ వెబ్సైట్లు, యాప్‌ల్లో కొత్త ఫీచర్లు అందించాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. దానికితోడు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్‌లు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు భారీగా పెరిగాయి. ఇవిచాలవన్నట్లు అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితులు నెలకొంటున్నాయి. దాంతో ఐటీ కంపెనీల లాభాలు భారీగా తగ్గుతున్నాయి. ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించి..తిరిగి పరిస్థితులు గాడినపడితే ఐటీ రంగం పుంజుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆలోపు కొత్తగా ఉద్యోగాలు కోసం చూస్తున్నవారు నిరాసక్తి చెందకుండా నైపుణ్యాలు పెంచుకోవాలని సూచిస్తున్నారు. -
ఇన్ఫోసిస్‌పై కంప్లైంట్.. ఆఫర్ లెటర్ ఇచ్చి రెండేళ్లయినా..
ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మీద ఐటీ యూనియన్ ''నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్'' (NITES) కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. దాదాపు 2,000 మంది క్యాంపస్ రిక్రూట్లకు సంబంధించిన ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను కంపెనీ పదేపదే ఆలస్యం చేస్తోందని ఆరోపించింది.ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో రెండేళ్లకు పైగా జాప్యం జరుగుతోంది. దీనివల్ల బాధిత ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీనిపై విచారణ జరిపించాలని యూనియన్ మంత్రిత్వ శాఖను కోరింది. దీనిపైన ఇన్ఫోసిస్ ఇంకా స్పందించలేదు.చాలా మంది ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్లపై నమ్మకంతో ఇతర జాబ్ ఆఫర్లను తిరస్కరించారు. దీనివల్ల ఆదాయం లేకపోవడం మాత్రమే కాకుండా.. ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ చేసుకుంటారనే విషయం మీద స్పష్టత లేకుండా ఉన్నారు. చాలామంది తమ కెరీర్ సాఫీగా ముందుకు సాగటానికి ఇన్ఫోసిస్‌ను ఎంచుకుంటున్నారు. అయితే ఇన్ఫోసిస్ ఆలస్యం వల్ల ఉద్యోగమే ప్రశ్నార్థకంగా మారిందని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ తెలిపారు.ఇన్ఫోసిస్ ఆన్‌బోర్డింగ్ ఆలస్యానికి.. కంపెనీ రిక్రూట్లకు జీతం చెల్లించాలని యూనియన్ కోరింది. ఆలస్యం కారణంగా ఏర్పడిన మానసిక, భావోద్వేగ ఒత్తిడిని పరిష్కరించడానికి ఇన్ఫోసిస్ బాధితులకు సహాయం అందించాలని ఐటీ యూనియన్ కోరింది.ఐటీ సంస్థల ఆన్‌బోర్డింగ్ ఆలస్యం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా టీసీఎస్ 200 రిక్రూట్ల ఆన్‌బోర్డింగ్‌ను ఆలస్యం చేసింది. ఈ కారణంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు మహారాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది. ఇప్పుడు అదే సమస్య మళ్ళీ వెలుగులోకి వచ్చింది. దీనిపైన ఇన్ఫోసిస్ స్పందించాల్సి ఉంది. -
అది నమ్మక ద్రోహమే.. ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల కంప్లైంట్
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల సంఘం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. సుమారు 2,000 మంది క్యాంపస్ రిక్రూట్మెంట్లకు ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ఈ ఐటీ కంపెనీ పదేపదే ఆలస్యం చేస్తోందని, ఇది ఉద్యోగులకు ఆర్థిక, మానసిక ఇబ్బందులను కలిగిస్తోందని యూనియన్ ఆరోపించింది.దీర్ఘకాలిక జాప్యంతో ఆర్థిక ఇబ్బందులుఇన్ఫోసిస్లో రెండేళ్లుగా ఆన్‌బోర్డింగ్ జాప్యం కొనసాగుతోందని, దీంతో బాధితులు అనిశ్చితి, ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారని యూనియన్ పేర్కొంది. ‘‘ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్లపై ఆధారపడి చాలా మంది ఇతర ఉద్యోగ ఆఫర్లను తిరస్కరించారు. ఇప్పుడు ఆదాయంతోపాటు స్పష్టమైన ఆన్‌బోర్డింగ్ టైమ్‌లైన్ లేకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు, అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు' అని ఎన్ఐటీఈఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్ఫోసిస్ చర్యలు తీవ్రమైన నమ్మక ద్రోహాన్ని సూచిస్తున్నాయని, కంపెనీ ద్వారా తమ కెరీర్లు సజావుగా ప్రారంభమవుతాయని యువ నిపుణులు విశ్వసించారని యూనియన్ వాదిస్తోంది.ప్రభుత్వ జోక్యానికి విజ్ఞప్తినియామకాలకు మద్దతు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ఇన్ఫోసిస్ కు ఉందని, దీనిపై జోక్యం చేసుకోవాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఎన్ఐటీఈఎస్ కోరుతోంది. అనిశ్చితి వల్ల ఏర్పడిన మానసిక, భావోద్వేగ ఒత్తిడిని పరిష్కరించాలని, జాప్యం జరిగిన కాలానికి పూర్తి వేతనాలు చెల్లించాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది. అంతేకాక, ఆన్‌బోర్డింగ్ ఇలాగే కొనసాగితే, సంస్థలో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కనుగొనడంలో నియామకాలకు ఇన్ఫోసిస్ బాధితులకు సహాయం అందించాలని ఎన్ఐటీఈఎస్ కోరుతోంది.ఇలాంటి అంశాల్లో ఐటీ సంస్థలపై ఎన్ఐటీఈఎస్ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. టీసీఎస్ 200 లేటరల్ రిక్రూట్మెంట్లను ఆలస్యం చేసిందని ఎన్ఐటీఈఎస్ దాఖలు చేసిన ఫిర్యాదుపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు మహారాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గత అక్టోబర్‌లో నోటీసులు జారీ చేసింది. కొత్త నియామకాల్లో జాప్యం దేశీయ ఐటీ సేవల పరిశ్రమలో విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తోంది. కంపెనీలు క్యాంపస్ నియామకాలను తగ్గించాయి. దీంతో యువ, తక్కువ వేతనంతో కూడిన ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో యువ ఉద్యోగుల నిష్పత్తి టీసీఎస్‌లో ఐదేళ్ల కనిష్టానికి, ఇన్ఫోసిస్‌లో దశాబ్ద కనిష్ఠానికి పడిపోయాయి. -
సైలెంట్ లేఆఫ్‌లు.. 20 వేల మంది టెకీలు ఇంటికి..
ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ గత కొంత కాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. లేఆఫ్‌ల పేరుతో లక్షలాది మంది ఉద్యోగులను కంపెనీలు అధికారికంగా తొలిగించాయి. అప్రకటింతగానూ వేలాదిగా ఐటీ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. దేశంలోని ఐటీ పరిశ్రమలో 2023 క్యాలెండర్ సంవత్సరంలో దాదాపు 20 వేల మంది ‘సైలెంట్’గా ఉద్యోగాలు కోల్పోయారు.ఆలిండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐఐటీఈయూ) వెల్లడించిన వివరాల ప్రకారం 2023 క్యాలెండర్ ఇయర్లో దేశ ఐటీ రంగం దాదాపు 20,000 మంది టెకీలను ‘సైలెంట్ లేఆఫ్’ విధానంలో తొలగించింది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఈ తొలగింపులు చిన్నా పెద్ద అన్ని ఐటీ కంపెనీలలో జరిగాయని, వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ఏఐటీఈయూ భావిస్తోంది.ఇలా అత్యధికంగా ఉద్యోగులను తొలగించిన ఐటీ కంపెనీల్లో ప్రముఖంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్టీఐ-మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఒక్క హెచ్‌సీఎల్ టెక్‌లో మాత్రమే ఉద్యోగుల సంఖ్య పెరిగింది. అప్రకటిత పద్ధతిలో ఉద్యోగులను తొలగించే పరిస్థితిని "సైలెంట్ లేఆఫ్" సూచిస్తుంది. అంటే కాంట్రాక్టులను పునరుద్ధరించకపోవడం, పని గంటలను తగ్గించడం, ముందస్తు పదవీ విరమణకు పురిగొల్పడం, ఖాళీలను భర్తీ చేయకపోవడం వంటివి. -
హమ్మయ్య.. ఇన్ఫోసిస్‌లో ఆ ముప్పు లేదు!
టెక్ పరిశ్రమలో ఎటు చూసినా జనరేటివ్ ఏఐ ప్రభంజనం.. అంతటా లేఆఫ్‌ల భయంతో ఐటీ ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. అయితే ఇన్ఫోసిస్‌లో మాత్రం ఆ ముప్పు లేదంటున్నారు సంస్థ సీఈవో సలీల్ పరేఖ్. జెన్ఏఐ కారణంగా పరిశ్రమలోని ఇతరుల మాదిరిగా తాము ఉద్యోగాలను తగ్గించబోమని సీఎన్‌బీసీ-టీవీ18 ఇంటర్వ్యూలో చెప్పారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతితో ఇన్ఫోసిస్ ఉద్యోగులను తొలగిస్తోందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. "లేదు, మేము అలా చేయడం లేదు. నిజానికి ఇండస్ట్రీలో ఇతరులు అలా చేశారు. ఆ విధానం సరికాదని మేం చాలా స్పష్టంగా చెప్పాం' అని పేర్కొన్నారు. పెద్ద సంస్థలకు అన్ని సాంకేతికతలు కలిసి వస్తాయనేది తన అభిప్రాయమని ఆయన వివరించారు. వచ్చే కొన్నేళ్లలో కృత్రిమ మేధ (ఏఐ)లో నిపుణులుగా ఎదిగే వారు మరింత మంది తమతో చేరుతారని, ప్రపంచంలోని పెద్ద సంస్థలకు సేవలు అందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో క్లయింట్ల పరంగా, ఉద్యోగుల సంఖ్య పరంగా మరింత విస్తరిస్తామని పరేఖ్ తెలిపారు.మరి నియామకాలు?లేఆఫ్‌ల విషయాన్ని పక్కన పెడితే 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌లో నియామకాల పరిస్థితి ఎలా ఉండనుంది అన్నదానిపై తన దృక్పథాన్ని పరేఖ్ తెలియజేశారు. ఆర్థిక వాతావరణం మెరుగుపడటం, డిజిటల్ పరివర్తనపై వ్యయం పెరగడం జరిగితే నియామకాలు మళ్లీ ఊపందుకుంటాయని చెప్పారు. అయితే నియామకాలపై ఎటువంటి వార్షిక లక్ష్యం లేకపోయినా ఆర్థిక వాతావరణం ఆధారంగా నియామకాలు చేపడతామని వివరించారు. -
ఆఫీస్‌కి రాకపోతే ఫైరింగే.. ప్రముఖ ఐటీ కంపెనీ వార్నింగ్!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) రిటర్న్-టు-ఆఫీస్ పాలసీకి సంబంధించి తమ ఉద్యోగులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. పదేపదే రిమైండర్లు చేసినప్పటికీ కార్యాలయానికి తిరిగి రావాలనే ఆదేశాన్ని విస్మరించేవారు తొలగింపు సహా తీవ్రమైన క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసిందని ‘లైవ్‌మింట్’ కథనం పేర్కొంది."నిర్దేశాలను పాటించడంలో వైఫల్యం కంపెనీ విధానాల ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తనకు దారితీస్తుందని దయచేసి గమనించండి. తదనుగుణంగా మీపై తగిన క్రమశిక్షణా చర్యలు ప్రారంభించడం జరుగుతుంది. ఇది తొలగింపునకు కూడా దారితీయవచ్చు" అని ఒక ఉద్యోగికి రాసిన లేఖలో కాగ్నెజెంట్ హెచ్చరించినట్లుగా నివేదిక పేర్కొంది.ఇన్ ఆఫీస్ వర్క్ ప్రాముఖ్యతను కాగ్నిజెంట్ ఇంతకు ముందే పునరుద్ఘాటించింది. ఆఫీస్ పాలసీని పాటించడంలో వైఫల్యాన్ని కంపెనీ పాలసీల ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తనగా పరిగణిస్తామని, ఇది టర్మినేషన్‌కు సైతం దారితీసే అవకాశం ఉందని ఏప్రిల్ 15 నాటి లేఖలో కాగ్నిజెంట్ స్పష్టం చేసింది.భారత్‌లో కాగ్నిజెంట్ శ్రామిక శక్తి గణనీయంగా ఉంది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. దాని 347,700 మంది ఉద్యోగులలో సుమారు 2,54,000 మంది భారత్‌లోనే ఉన్నారు. కంపెనీ అతిపెద్ద ఉద్యోగుల స్థావరం భారత్ అని దీనిని బట్టీ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ రిటర్న్-టు-ఆఫీస్ విధానం భారత్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది.ఇన్ ఆఫీస్ వర్క్ తప్పనిసరి ఆదేశాలు అనేక కారణాల నుంచి వచ్చాయి. ఆవిష్కరణలు, జట్టు కృషి, బలమైన సంస్థాగత సంస్కృతిని వ్యక్తిగత సహకారం ప్రోత్సహిస్తుందని కంపెనీలు విశ్వసిస్తున్నాయి. అంతేకాకుండా, ప్రత్యేకించి సెన్సిటివ్ డేటా, కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌లను నిర్వహించే పరిశ్రమలలో కార్యాచరణ, భద్రతాపరమైన అంశాలు కూడా కారణంగా ఉన్నాయి.టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), విప్రో (Wipro) వంటి కంపెనీలు కూడా గతంలో రిటర్న్-టు-ఆఫీస్ విధానాన్ని తప్పనిసరి చేశాయి. అయితే, కొన్ని కంపెనీలు రిమోట్ పని సౌలభ్యానికి అలవాటుపడిన కొంతమంది ఉద్యోగుల నుంచి ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి. చాలా మంది ఉద్యోగులు రిమోట్ వర్క్ మెరుగైన పని-జీవిత సమతుల్యతను అందిస్తుందని, ప్రయాణ ఒత్తిడిని తగ్గిస్తుందని వాదించారు. అయితే కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఈ ఉద్యోగుల ప్రాధాన్యతలను వ్యాపార అవసరాలు, కార్యాచరణ సామర్థ్యాలతో సమతుల్యం చేస్తున్నాయి. -
Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలలో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్థిక అనిశ్చితి, ప్రాజెక్ట్‌లు తగ్గిపోవడం వంటి కారణాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లకు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ ఒకటి వెల్లడైంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే 21 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి టెక్ కంపెనీలు.layoffs.fyi ప్రచురించిన తాజా డేటా ప్రకారం.. టెక్నాలజీ రంగంలోని 50 కంపెనీల నుండి ఒక్క ఏప్రిల్ నెలలోనే 21,473 మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ఈ ఏడాది లేఆఫ్‌ల ధోరణికి ఏప్రిల్ నెల తొలగింపులు అద్దం పడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కనీసం ఇప్పటి వరకూ 271 కంపెనీలు 78,572 మంది ఉద్యోగులను తొలగించాయి. జనవరిలో 122 కంపెనీలలో 34,107 ఉద్యోగాల కోతలు జరిగాయి. ఫిబ్రవరిలో 78 కంపెనీలు 15,589 మందిని తొలగించాయి. ఇక మార్చిలో 37 కంపెనీల్లో 7,403 మంది ఉద్యోగాలను కోల్పోయారు. మార్చి నుంచి ఏప్రిల్‌కు ఒక్క నెలలో ఉద్యోగుల తొలగింపులు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ఏప్రిల్‌లో టెక్ తొలగింపులుయాపిల్ ఇటీవల 614 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొదటి ప్రధాన రౌండ్ ఉద్యోగ కోత.పైథాన్, ఫ్లట్టర్, డార్ట్‌లో పనిచేస్తున్న వారితో సహా వివిధ టీమ్‌లలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను గూగుల్ తొలగించింది.అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలాది ఉద్యోగాలను తగ్గించింది.ఇంటెల్ దాని ప్రధాన కార్యాలయంలోని దాదాపు 62 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసింది. ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది.ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా అత్యధికంగా 14 వేల మందిని లేఆఫ్ చేసింది.ఓలా క్యాబ్స్ దాదాపు 200 ఉద్యోగాలను తొలగించింది. హెల్త్ టెక్ స్టార్టప్ హెల్తీఫైమ్ దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించింది. గృహోపకరణాలను తయారు చేసే వర్ల్‌పూల్ సుమారు 1,000 మందిని లేఆఫ్ చేసింది.టేక్-టూ ఇంటరాక్టివ్ కంపెనీ తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 5% మందిని తొలగించింది. నార్వేలోని టెలికాం కంపెనీ టెలినార్ 100 మంది ఉద్యోగులను తొలగించింది. -
దేశంలో నెం.1 ఐటీ కంపెనీ.. 19 ఏళ్లలో తొలిసారి ఇలా..
దేశంలో నంబర్ వన్ ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఉద్యోగుల సంఖ్య తొలిసారి తగ్గింది. టీసీఎస్‌లో హెడ్‌కౌంట్ తగ్గడం కంపెనీ 2004లో లిస్ట్ అయినప్పటి నుంచి 19 ఏళ్లలో ఇదే మొదటిసారి అని కంపెనీ వెల్లడిందింది. హెడ్‌కౌంట్ అనేది ఒక నిర్దిష్ట వ్యవధిలో కంపెనీలో లేదా నిర్దిష్ట విభాగంలో పని చేసే సిబ్బంది సంఖ్యను సూచిస్తుంది. 202-24 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 13,249 తగ్గి మొత్తం సిబ్బంది సంఖ్య 6,01,546కి తగ్గిపోయిందని టీసీఎస్ ప్రకటించింది. ఇక కొత్త ఉద్యోగుల నికర చేరిక మొత్తం సంవత్సరానికి కేవలం 22,600 మాత్రమే. 2022 ఆర్థిక సంవత్సరం డేటాను పరిశీలిస్తే ఆ ఏడాది కంపెనీ 1.03 లక్షల మంది ఉద్యోగులు పెరిగారు. క్యూ 4లో కంపెనీ హెడ్‌కౌంట్ 1,759 తగ్గింది. టీసీఎస్‌లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 5,680 తక్కువ. అలాగే రెండవ త్రైమాసికంలో కంపెనీలో మొత్తంంగా 6,333 మంది ఉద్యోగులు తగ్గారు. అయితే 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ 523 మందిని అధికంగా నియమించుకుంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 24 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో టీసీఎస్ లాభం 9 శాతం పెరిగి రూ. 12,434 కోట్లకు చేరుకుంది. మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలానికి దాని ఆదాయం కూడా 3.5 శాతం పెరిగి రూ. 61,237 కోట్లకు చేరుకుంది. కంపెనీ లాభం అంచనాలను అధిగమించినప్పటికీ, దాని ఆదాయం మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. మరోవైపు టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ 2024 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అట్రీషన్ (రిటైరవడం, తొలగించడం లేదా మానేయడం ద్వారా కంపెనీని వీడటం) రేటులో 12.5 శాతం క్షీణతను నివేదించారు. రానున్న రోజుల్లో ఈ రేటు మరింత తగ్గుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. -
ఐటీ జాబ్ కోసం వేచిచూస్తున్నారా.. టెకీలకు శుభవార్త
కాస్ట్‌కటింగ్ పేరిట, అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో గత కొంతకాలంగా ఐటీ కంపెనీలు ఆశించినమేర నియామకాలు చేపట్టలేదు. అయితే క్రమంగా ఈ పరిస్థితులు మారుతున్నాయని యూఎస్‌లోని కంప్యూటింగ్ టెక్నాలజీ ఇండస్ట్రీ అసోసియేషన్ డేటా ద్వారా తెలుస్తుంది. ఇకపై యూఎస్‌లో టెక్ కంపెనీల నియామకాలు పుంజుకోనున్నాయని ఈ డేటా నివేదించింది. సమీప భవిష్యత్తులో ఐటీ కంపెనీలకు ప్రాజెక్ట్‌ల సంఖ్య పెరుగబోతున్నట్లు డేటా విశ్లేషించింది. అమెరికాలో కార్యాకలాపాలు సాగిస్తున్న భారత టెక్ కంపెనీలకు ఇది శుభపరిణామమని నిపుణులు చెబుతున్నారు. ఆయా కంపెనీల్లో త్వరలో నియామకాలు ఊపందుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు. అమెరికాలోని టెక్ కంపెనీలు గత నెలలో 6,000 మంది ఉద్యోగులను కొత్తగా చేర్చుకున్నాయని డేటా ద్వారా తెలిసింది. యూఎస్‌లోని భారత కంపెనీల్లో ప్రధానంగా టీసీఎస్‌లో 50,000 మంది, ఇన్ఫోసిస్‌లో 35,000, హెచ్‌సీఎల్ టెక్‌లో 24,000, విప్రోలో 20,000, ఎల్ అండ్ టీ మైండ్‌ట్రీలో 6,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. త్వరలో ఈ సంఖ్య మరింత పెరుగబోతున్నట్లు తెలిసింది. ఐటీ కంపెనీల్లో ప్రధానంగా సాంకేతిక సేవలు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లో భారీ నియామకాలు ఉండబోతాయని సమాచారం. యూఎస్‌లో వివిధ పోజిషన్‌ల్లో పనిచేయడానికి మార్చిలో తమకు దాదాపు 1,91,000 కొత్త టెక్ ఉద్యోగులు అవసరమని కంపెనీలు పోస్ట్ చేశాయి. అంతకుముందు నెల కంటే ఈ సంఖ్య 8,000 అధికంగా ఉండడం గమనార్హం. మొత్తంగా మార్చిలో 4,38,000 యాక్టివ్ టెక్ జాబ్స్ ఉన్నాయని అంచనా. సాఫ్ట్వేర్ డెవలపర్లు, ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్‌ల నియామకాల్లో ఫిబ్రవరి-మార్చి మధ్య కాలంలో పెరుగుదల కనిపించింది. న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, చికాగో, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కోలోని కంపెనీలు మార్చిలో అత్యధిక నియామకాలు చేపట్టినట్లు నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి: పాతబడేకొద్దీ మరింత ప్రమాదం యూఎస్‌లోని భారత కంపెనీల ఉద్యోగులకు సంబంధించి హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఆసక్తికర నివేదిక వెల్లడించింది. దాని ప్రకారం.. యుఎస్ టెక్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న మొత్తం శ్రామికశక్తిలో భారత కంపెనీలు 2 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2023లో యుఎస్‌లో టెక్ ఉద్యోగుల ఉపాధి 1.2% పెరిగింది. 2023 వరకు టెక్ కంపెనీలు దాదాపు 5 లక్షల ఉద్యోగులను తొలగించాయని అంచనా. అప్పటి నుంచి తొలగింపుల పర్వం కాస్త నెమ్మదించిందని నివేదిక తెలిపింది. ప్రస్తుతం కంపనీలు నియామకాల ప్రక్రియ ప్రారంభించడంతో ఉద్యోగులకు డిమాండ్ ఏర్పడి కంపెనీల రాబడి సైతం పెరుగబోతుందని తెలిసింది. రాబోయే క్యూ4 ఫలితాల్లో కంపెనీలు మెరుగైన ఫలితాలు పోస్ట్ చేస్తాయని, ఇక నుంచి కంపెనీల్లో వృద్ధి కనిపిస్తుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అంచనా వేసింది. -
ఉద్యోగులకు భారీగా వేతనపెంపు.. ఎంతంటే..
కంపెనీల్లో ఉన్నతస్థాయి ఉద్యోగులకు 2024-25 ఏడాదికిగాను భారీగా వేతనాలు పెంపు ఉండనుందని మైఖేల్ పేజ్ ఇండియా శాలరీ గైడ్ 2024 నివేదిక ద్వారా తెలిసింది. సగటున దాదాపు 20 శాతం మేర వార్షిక వేతనాలు పెరుగుతాయని నివేదికలో తెలిపారు. ఫైనాన్స్-అకౌంటింగ్, ఆరోగ్య సంరక్షణ లైఫ్‌సైన్సెస్, బీఎఫ్ఎస్ఐ, ఇంజినీరింగ్ తయారీ, మానవ వనరులు, లీగల్, టెక్నాలజీ తదితర రంగాల్లోని కంపెనీలు, ఉద్యోగులపై చేసిన సర్వే ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. నివేదికలో ప్రధాన అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. తయారీ రంగాల్లోని పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మరింత డిమాండ్ పెరిగింది. టెక్నాలజీ ఆధారిత కంపెనీల్లో నైపుణ్యాలు పెంచుకుంటే ఉన్నత ఉద్యోగాలు అందుతున్నాయి. డేటా అనలిటిక్స్, జనరేటివ్ ఏఐ, మెషీన్ లెర్నింగ్, ఎల్ఎల్ఎం వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న వృత్తినిపుణులకు మరింత డిమాండ్ ఉండనుంది. ఆర్బీఐతోపాటు ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు భారత వృద్ధిరేటుపై సానుకూలంగా స్పందిస్తున్నాయి. అందులో భాగంగా భారత జీడీపీ వృద్ధి స్థిరంగా 6 శాతంపైనే నమోదవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. దాంతో ప్రస్తుతం అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితులను తట్టుకుని భారత్ వృద్ధిబాట పడుతుందని నివేదికలో తెలిపారు. ఐటీ కంపెనీలు ఉద్యోగుల శాలరీ పెంపు విషయాన్ని సమీక్షిస్తున్నాయి. టెకీలకు సరాసరి 8-10 శాతం వేతనపెంపు ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఐటీ రంగంలో జూనియర్ ఉద్యోగులకు 35-45 శాతం, వారిపై ఉద్యోగులకు 30-40 శాతం, మేనేజ్మెంట్ స్థాయిలోని సీనియర్లకు 20-30 శాతం వేతన పెంపు ఉండొచ్చని నివేదిక ద్వారా తెలిసింది. -
వందలాది ఉద్యోగులు ఇంటికి.. ఐటీ కంపెనీ నిర్ణయం
EXL Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో లేఆఫ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఎక్సెల్ సర్వీస్ (Exl Service) అనే ఐటీ సంస్థ ఏఐ డిమాండ్ పేరుతో వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐకి పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా న్యూయార్క్ ఆధారిత ఐటీ సంస్థ ఎక్సెల్ సర్వీస్ తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరిస్తోంది. ఇందులో భాగంగా 800 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. వీరు కంపెనీ మొత్తం ఉద్యోగులలో 2 శాతం కంటే తక్కువే అని తెలుస్తోంది. కంపెనీ తాజా నిర్ణయం కారణంగా భారత్, అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. వీరిలో 400 మందిని పూర్తిగా ఇంటికి పంపిస్తుండగా మిగిలిన 400 మందికి కంపెనీలోని ఇతర విభాగాల్లో అవకాశం ఇవ్వనుంది. ఉద్యోగాల కోత ప్రాథమికంగా యునైటెడ్ స్టేట్స్, భారత్‌లో డేటా అనలిటిక్స్, డిజిటల్ ఆపరేషన్స్‌లో పనిచేస్తున్న జూనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది. ఎక్సెల్ సర్వీస్ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 55 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. గతంలో కంపెనీ సీఈవోగా ఉన్న రోహిత్ కపూర్ ప్రస్తుతం బోర్డు చైర్మన్‌గా పదోన్నతి పొందారు. అలాగే వికాస్ భల్లా, వివేక్ జెట్లీ అనే ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు డేటా, ఏఐ ఆధారిత సొల్యూషన్స్‌తో కూడిన విస్తృత బాధ్యతలను స్వీకరిస్తున్నారు. కాగా ప్రస్తుతం తొలగిస్తున్న వారి స్థానంలో ఏఐ, డేటాలో అత్యంత పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్నవారిని నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తమ క్లయింట్స్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. -
ఇలా అయితే టెకీలకు పెళ్లిళ్లు కష్టమే! షాకవుతున్న నెటిజన్లు..
కాలం మారుతోంది.. ఖర్చులు పెరుగుతున్నాయి. ఉద్యోగం ఉన్నవారి పరిస్థితులు కూడా తారుమారు అవుతున్నాయి. ముఖ్యంగా కరోనా తరువాత టెకీల పరిస్థితులు వర్ణాతీతం అయిపోయింది. ఇన్నో రోజులూ జాబ్ ఎప్పుడు పోతుందో అనే భయంలో బిక్కుబిక్కుమంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మరో కొత్త సమస్య ఎదురైంది. లక్షల జీతం ఉన్నా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు నిరాకరిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారిలో భారీ ప్యాకేజ్ ఉంటేనే కొంతమంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటన వెలుగుయూలోకి వచ్చింది. ఇందులో ఒక వ్యక్తి తన ఫ్రెండ్ పెళ్లి చూపులకు వెళ్లాడని, అక్కడ అమ్మాయి తన శాలరీ గురించి అడిగిందని వెల్లడించాడు. అమ్మాయి శాలరీ గురించి అడిగినప్పుడు, అబ్బాయి వార్షిక వేతనం సంవత్సరానికి రూ. 8 లక్షలని చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి ఆ సంబంధం రిజెక్ట్ చేసింది. కారణం ఏంటనే అడిగితే.. తనకి ఉద్యోగం లేదని.. ఆ అబ్బాయికి కనీసం ఏడాది రూ. 25 లక్షల ప్యాకేజి ఉండాలని, లేకుండా భవిష్యత్తులో కష్టాలు పడాల్సి వస్తుందని చెప్పింది. వధువు సమాధానం విని వరుని తరపు బంధువులు షాకయ్యారు. ఏడాది రూ.8 లక్షలు వచ్చినా అమ్మాయి రిజెక్ట్ చేయడం గురించి ఆతని స్నేహితుని చెప్పుకున్నాడు. దీంతో ఆ స్నేహితుడు ఈ సమాచారం మొత్తం తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. అమ్మాయి ఆ మాత్రం అంచనాలు పెట్టుకోవడంలో తప్పులేదని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఏడాదికి రూ. 25 లక్షలు పెంచుకునే పనిలో ఉండు అంటూ కామెంట్ చేశారు. మరికొందరు నీ ప్యాకేజీకి తగిన అమ్మాయిని పెళ్లి చేసుకో అంటూ కామెంట్ చేసాడు. ఇలా తమదైన రీతిలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. One of my engineer friend who is earning 8LPA and it's been only two years of his job and belongs to a well to do baniya family got rejected for arranged marriage by a girl who left her job last year because she felt exhausted and not she's not doing anything now...reason for — IMG🩺 (@peacehipeace) April 3, 2024 -
మా జాబ్స్ తీసేసి వాళ్లకు ఇస్తున్నారు.. టీసీఎస్‌పై తీవ్ర ఆరోపణలు
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)పై అమెరికన్ ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేశారు. జాతి, వయసు ఆధారంగా టీసీఎస్ తమపై చట్టవిరుద్ధంగా వివక్ష చూపుతుందని, షార్ట్ నోటీసుతో తమను తొలగించి హెచ్1బీ వీసాలపై భారత్ నుంచి ఉద్యోగులను రిక్రూట్ చేస్తోందని అమెరికన్ ఉద్యోగుల బృందం ఆరోపించింది, వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. డజన్ల కొద్దీ అతిపెద్ద అమెరికన్ క్లయింట్లు ఉన్న టీసీఎస్‌కు వ్యతిరేకంగా సుమారు 22 మంది అమెరికన్ ఉద్యోగులు యూఎస్ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తొలగింపునకు గురైన టీసీఎస్ మాజీ ఉద్యోగుల్లో యూఎస్‌లోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న కాకేసియన్లు, ఆసియన్-అమెరికన్లు, హిస్పానిక్ అమెరికన్లు, 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. వీరిలో ఎంబీఏ, ఇతర ఉన్నత డిగ్రీలున్నవారూ ఉండటం గమనార్హం. అయితే ఈ ఆరోపణలను టీసీఎస్ ప్రతినిధి కొట్టిపారేశారు. 'చట్టవిరుద్ధమైన వివక్ష'కు సంబంధించిన ఆరోపణలు' అర్హత లేనివి, తప్పుదారి పట్టించేవి' అని తెలిపారు. "యూఎస్‌లో సమాన అవకాశాలు కల్పించే సంస్థగా టీసీఎస్ బలమైన రికార్డును కలిగి ఉంది. దాని కార్యకలాపాలలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది" అని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. -
ఉద్యోగుల జీతాల పెంపునకు టీసీఎస్ ఎస్?
టెక్ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరిట ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నా..నిబంధనల ప్రకారం ఉన్నవారికి మాత్రం వేతనాలు పెంచేపనిలో పడ్డాయి. మార్చితో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని కంపెనీలు వేతనపెంపునకు సంబంధించి నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన సంస్థలో పనిచేసే ఉద్యోగుల వేతనాలు పెంచనున్నట్లు తెలిసింది. టీసీఎస్ తన ఆఫ్‌సైట్ ఉద్యోగులకు సగటున 7 నుంచి 8 శాతం.. ఆన్సైట్ ఉద్యోగులకు 2-4 శాతం పెంచే యోచనలో ఉందని మీడియా కథనాల ద్వారా తెలిసింది. నైపుణ్యాలను మెరుగుపరుచుకొని పనితీరు కనబరిచిన వారికి ఏకంగా 12-15 శాతం వరకు జీతం పెంచనున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: ప్రాజెక్టుల ఏర్పాటుకు లంచం.. స్పందించిన అదానీ గ్రూప్ త్వరలో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో టీసీఎస్ ఉద్యోగుల వేతన పెంపు ప్రక్రియ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుందని తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి వేతన పెంపు అమల్లోకి వస్తుందని సమాచారం. ఇదిలా ఉండగా, భారీ వేతనాలు తీసుకుంటున్న వారి ఖర్చులు, పదోన్నతుల అంశాన్ని ఇంకా కంపెనీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నైపుణ్యాలను మెరుగుపర్చుకున్న ఉద్యోగులకు గతేడాదే టీసీఎస్ 12-15 శాతం వరకు సగటు ఇంక్రిమెంట్‌ను ఇచ్చింది. దాంతోపాటు ప్రమోషన్లను అందించింది. మరోవైపు ఉద్యోగుల సంఖ్యను మాత్రం తగ్గించుకుంది. -
ఆఫీస్‌కు రాకపోతే ప్రమోషన్ కట్.. ప్రముఖ టెక్ కంపెనీ కీలక నిర్ణయం
ఉద్యోగులు ఆఫీస్‌కు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని ప్రముఖ ల్యాప్‌ట్యాప్‌ల తయారీ కంపెనీ డెల్ ప్రకటించింది. ఈమేరకు ఉద్యోగులకు మెమో పంపినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. టెక్ కంపెనీల ఉద్యోగులకు కరోనా సమయంలో వర్క్‌ఫ్రం హోం వెసులుబాటు ఇచ్చిన విషయం తెలిసిందే. క్రమంగా కొవిడ్ భయాలు తగ్గి, పరిస్థితులు మెరుగవుతుంటే కంపెనీలు హైబ్రిడ్పని విధానానికి మారాయి. తాజాగా ఆ విధానాన్ని సైతం తొలగించి కొన్ని కంపెనీలు పూర్తిగా కార్యాలయాలకు రావాలని కోరుతున్నాయి. అయినప్పటికీ కొంతమంది ఉద్యోగులు ఇతర కారణాల వల్ల ఆఫీస్ నుంచి పని చేసేందుకు ఇష్టపడడం లేదు. దాంతో కంపెనీలు చేసేదేమిలేక అలాంటి వారిపై చర్యలకు పూనుకున్నాయి. తాజాగా డెల్ కంపెనీ కార్యాలయాలకు రాని ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వబోమని లేఖలు పంపింది. అయితే కరోనా పరిణామాలకు దశాబ్దం ముందు నుంచే హైబ్రిడ్ పని (వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి, మరికొన్ని రోజులు కార్యాలయాలకు రావడం) విధానాన్ని సంస్థ అనుమతిస్తోంది. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్ డెల్ దీనికి ప్రోత్సహించారు. ఉద్యోగులు ఆఫీసుకు రావాలంటూ పట్టుపడుతున్న కంపెనీల విధానాన్ని అప్పట్లో మైఖేల్ తప్పుబట్టారు. ఇపుడు మాత్రం కంపెనీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందనే వాదనలు ఉన్నాయి. ఇదీ చదవండి: వీడియో క్రియేటర్లకు పెద్దదెబ్బ.. యూట్యూబ్ కొత్త నిబంధన..? కంపెనీ పంపిన లేఖలో ఉద్యోగులను హైబ్రిడ్, రిమోట్ వర్కర్లుగా వర్గీకరించింది. హైబ్రిడ్ సిబ్బంది వారంలో కనీసం 3 రోజులు ఆఫీసుకు రావాల్సి ఉంది. పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే వారికి చాలా పరిమితులు ఉంటాయని కంపెనీ లేఖలో పేర్కొంది. పదోన్నతి లేదా కంపెనీలో ఇతర జాబ్ రోల్లకు ఇంటి నుంచి పనిచేసే వారి పేర్లను పరిశీలించరని కంపెనీ తెలిపింది. -
ఉద్యోగులకు ఏమైంది..? కంపెనీ ఎందుకు మారడం లేదు..
ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు 2-3 ఏళ్లు కుదురుగా ఒక కంపెనీలో పనిచేశాక సంస్థ మారడం ఆనవాయితీగా వస్తోంది. అందుకు చాలాకారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా కొత్త కంపెనీ భారీగా వేతనం ఆఫర్ చేస్తుండడమే. కానీ ప్రస్తుత రోజుల్లో ఆ పద్ధతి మారుతోంది. రెండేళ్ల క్రితం వరకైతే ఐటీ ఉద్యోగులు తరచూ కంపెనీలు మారుతూ ఉండేవారు. ఇప్పుడు ఈ ధోరణితో మార్పు కనిపిస్తోంది. గతంలో లాగా కంపెనీ మారినప్పుడు, వేతనాల్లో పెంపు భారీగా ఉండకపోవడంతో ఉద్యోగులు సంస్థలు మారడం లేదని తెలుస్తుంది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ఐటీ పరిశ్రమ ప్రస్తుతం విభిన్న పరిస్థితులను ఎదుర్కొంటోంది. కొత్తగా వస్తున్న ప్రాజెక్టులు తగ్గడంతో నియామకాలు తగ్గిస్తున్నారు. కొన్ని విభాగాల్లో చూస్తే, కావాల్సిన నిపుణుల లభ్యతా తక్కువగానే ఉంటోంది. కృత్రిమ మేధ (ఏఐ), ప్రాంప్ట్ ఇంజినీరింగ్, మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్ నిపుణులకు ఇప్పుడు గిరాకీ పెరుగుతోంది. మరో వైపు, అమెరికాలాంటి దేశాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాల కోత మొదలయ్యింది. జీతం పెరగకపోయినా అదే కంపెనీలో.. చాలాకాలంపాటు ఒకే కంపెనీలో పనిచేస్తే వేతనం పెద్దగా పెరగదు అని ఐటీ నిపుణులు భావిస్తుంటారు. అందుకే, తరచూ ఉద్యోగాలు మారేందుకు సిద్ధం అవుతారు. సంస్థలు మారినప్పుడల్లా 15-20 శాతం వేతనం అధికంగా వచ్చేలా చూసుకుంటారు. ఇప్పుడా పరిస్థితులు మారాయి. నియామకాలు అంతగా లేకపోవడంతో, ఉన్న కంపెనీలో కొనసాగేందుకే ప్రయత్నిస్తున్నారు. అధునాతన నైపుణ్యాలున్న వారికి మాత్రం ఈ బాధ లేదు. ఏఐ, ఎంఎల్ నైపుణ్యాలున్న వారికి, సంప్రదాయ కోడింగ్‌లో మంచి పట్టు ఉన్న వారికీ మంచి అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఎంత..? ఐటీ రంగంలో ఉద్యోగాలు తగ్గుతున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఇది 2019 స్థాయిలోనే ఉన్నాయని ఐటీ రంగ నిపుణులు వెల్లడించారు. 2020 తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అధిక సంఖ్యలో ఐటీ ఉద్యోగాల సృష్టి జరిగింది. ఆ తర్వాత క్రమంగా ఇవి నెమ్మదించాయి. ముఖ్యంగా ఫ్రెషర్ల(తాజా ఉత్తీర్ణుల) నియామకంపై ప్రభావం కనిపిస్తోంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అని అనుకుంటున్నారు. కృత్రిమ మేధ(ఏఐ) అన్ని రంగాల్లోనూ విస్తరిస్తోంది. ఇది కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోంది మినహా, ఉన్న ఉద్యోగాలను తగ్గించే స్థాయికి చేరుకోలేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఎల్ఐసీ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా వేతన పెంపు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందే.. మారుతున్న ప్రాజెక్ట్‌లు, టెక్నాలజీ కారణంగా పాత ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏటా కొత్తగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్నారు. వీరు ఇప్పటికే కొత్త తరం సాంకేతికతలను నేర్చుకుంటున్నారు. దీంతో పాత వారికి వీరి నుంచి పోటీ ఎదురవుతోంది. మరోవైపు గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు, తొందరగా ఏదో ఒక ఉద్యోగంలో చేరాలని భావిస్తున్నారు. -
మానవ మెదడుతో ఏదీ సరితూగదు.. ఏఐని తలదన్నే ఉద్యోగాలివే..
సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కొన్ని రకాల ఉద్యోగాలను కోల్పోవలసి రావచ్చని సర్వేలు చెబుతున్నాయి. 2030 నాటికి 40-80 కోట్ల ఉద్యోగాలకు ముప్పు కనిపిస్తోందని పలు సర్వేల ద్వారా తెలుస్తుంది. దాదాపు 35 కోట్ల మంది కొత్త ఉద్యోగాల్లోకి మారాల్సి రావచ్చని అంచనా. సంప్రదాయ ఉద్యోగాల్లోనే కొనసాగుదామనుకొన్నా సాధ్యం కాదు. అటువంటి పనులన్నీ కంప్యూటర్లు, వాటికి అనుసంధానమయ్యే యంత్రాలు పూర్తిచేస్తాయి. అయితే, యంత్రాలను నియంత్రించడం, వాటికి పనుల్ని నిర్దేశించడం, స్టాఫ్ట్వేర్లు అయితే ఏఐకి సూచనలు ఇవ్వడం వంటివి మనుషులే చేయాలి. ఇలాంటి కొత్త తరహా విధులకు సంబంధించి సరికొత్త ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో లభిస్తాయి. కోల్పోయిన ఉద్యోగాలకంటే పెద్దసంఖ్యలో లభ్యమవుతాయి. కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతాయని 1990 దశకంలో అందరూ భయపడిపోయారు. తదనంతర కాలంలో కోల్పోయిన ఉద్యోగాలకంటే అధికంగా కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. కాకపోతే, నూతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా శక్తిసామర్థ్యాలను, నైపుణ్యాలను నేర్చుకోవాల్సి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పటికే ఉన్న ఉద్యోగాలపై ప్రభావం చూపుతూ కొత్త అవకాశాలకు దారితీస్తోంది. అందులో ప్రధానంగా రానున్న రోజుల్లో ఈ కింది ఉద్యోగాలకు గిరాకీ ఏర్పడనుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రాంప్ట్ ఇంజినీర్ స్థూలంగా చెప్పాలంటే.. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది ఏఐ నుంచి అత్యంత కచ్చితమైన, అవసరమైన సమాచారం తెలుసుకునేందుకు అడగాల్సిన ప్రశ్నలు ఏంటో గుర్తించడం. దీనికి స్థిరమైన భాషాజ్ఞానం అవసరం. ఇదేమంత సులభమైన పని కాదు. ఏ లాంగ్వేజ్ ఇన్పుట్కు ఏఐ ఎలా ప్రతిస్పందిస్తుందో తెలుసుకునేందుకు ఈ ఇంజినీర్లు భాష లోతుల్లోకి వెళ్లి పరిశోధన చేస్తారు. వివిధ రకాలైన ప్రాంప్ట్‌కు ఎలా స్పందించాలనే విషయమై ఏఐకు శిక్షణ కూడా ఇస్తారు. ఈ ఉద్యోగాన్ని ప్రోగ్రామింగ్, ఇన్‌స్ట్రక్టింగ్, టీచింగ్‌ల సమ్మేళనంగా చెప్పవచ్చు. ఇందుకోసం వీరు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ), నేచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ (ఎన్ఎల్యూ) అనే టెక్నాలజీలను వినియోగిస్తారు. ప్రాంప్ట్ ఇంజినీర్లు అనలిటిక్స్‌ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏఐ ట్రెయినర్ జనరేటివ్ ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఏఐ ట్రెయినర్లకు గిరాకీ ఏర్పడుతోంది. యూజర్ల అవసరాలు ఏంటో కచ్చితంగా తెలుసుకుని అందుకు తగ్గట్లు ఏఐకి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. యూజర్లు ఏఐను వినియోగిస్తున్నపుడు ఎలాంటి ప్రతిస్పందనలు వస్తున్నాయో తెలుసుకుని అందుకు తగ్గుట్లు కోడ్రాసి దాని సామర్థ్యం పెంచేలా కృషి చేస్తారు. కస్టమర్ సర్వీస్, ఏఐ డెవలప్మెంట్, క్వాలిటీ అస్యూరెన్స్ టీమ్‌ల్లో వీరికి ప్రాధాన్యం ఇస్తారు. ఏఐ ఆడిటర్ ఏఐ అప్లికేషన్ల పెరుగుదలతో ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం చాలా కీలకంగా మారింది. ఏఐ ఆడిటర్లు అవుట్‌పుట్‌ను ఆసక్తికరంగా, ఉపయోగకరంగా మార్చేలా చూస్తారు. అయితే ఇందుకోసం కొన్ని చట్ట పరమైన వ్యవహారాలపై అవగాహన ఉండాలి. ఏఐ ఎథిక్స్ ఎక్స్పర్ట్ ఏఐ పరిధి పెరుగుతున్నపుడు నైతిక సమస్యలు రావొచ్చు. వాటిని పరిష్కరించడం చాలా ముఖ్యం. ఏఐకి కొన్ని విలువలు జోడించేలా ఎథిక్స్ ఎక్స్పర్ట్ పనిచేయాల్సి ఉంటుంది. ఏఐకి నైతిక మార్గదర్శకాలు ఇవ్వడం, గోప్యత, పారదర్శకత, జవాబుదారీతనంతో ఉండేలా కోడ్ చేస్తారు. పైన తెలిపిన కొన్ని విభాగాల్లోని ఉద్యోగాలకుతోడు మానవ మెదడు చేసేచాలా పనులను ఏఐ ఎప్పటికీ చేయలేదు. ఒకవేళ చేసినా అంత కచ్చితత్వంతో చేయలేదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటి వివరాలు కొన్నింటిని కింద తెలుసుకుందాం. సృజనాత్మకత అత్యంత తెలివైన కంప్యూటర్ కూడా మైమరపించే చిత్రాలను గీయలేకపోవచ్చు, వీనులవిందైన సంగీతాన్ని సృష్టించలేకపోవచ్చు! కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల్లా కొత్త ఆలోచనలు సృష్టించలేదు, తన పరిధి మేరకే ప్రవర్తిస్తుంది. ఊహకు అందని సృజనాత్మకతతో కొత్త అడుగులు వేయడం కేవలం మనుషులకే సాధ్యం. ఇది విద్య, వినోద, వ్యాపార రంగాల్లో ఎక్కడైనా ఏ రూపంలోనైనా అభ్యర్థులను ప్రత్యేకంగా నిలబెట్టగలదు. అందుకే సృజనాత్మకతతో కూడిన రంగాలను ఏఐ ఏమీ చేయలేకపోవచ్చు. సృజనలో ఊహాశక్తి, సందర్భానికి తగిన విధంగా స్పందించడం, పరిస్థితిని చూసి స్ఫూర్తి పొందడం భాగం.. ఇవన్నీ మనుషులు చేసినట్టుగా సాఫ్ట్వేర్లు చేయలేవు. ఇటువంటి స్కిల్స్ అవసరమైన ప్రతి చోటా అభ్యర్థుల అవసరం కచ్చితంగా ఉంటుంది. దీన్ని అలవరుచుకోవడం, ప్రతిదీ కొత్తగా ఆలోచించడానికి, చేయడానికి ప్రయత్నించడం ద్వారా ఏఐతో పోటీలో నెగ్గుకురావొచ్చు. నిర్ణయాత్మకశక్తి ఒక రోబోను ఏదైనా క్లిష్ట పరిస్థితిలో ఉంచి, నిర్ణయం తీసుకోమంటే అది ఏం చేయగలుగుతుంది? ఎటువంటి కెరియర్ అయినా సరే నిర్ణయాలు తీసుకునే శక్తి అవసరమయ్యే పోస్టుల్లో మనుషులే ఉండగలరు. సమస్యలను పరిష్కరించడం, సంప్రదింపులు చేసే నేర్పు తదితర నైపుణ్యాలు ఇలాంటి చోట్ల అవసరం అవుతాయి. ‘సిచ్యువేషన్ జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్’ అభ్యర్థులకు ఉండాల్సిన స్కిల్స్‌లో ముఖ్యమైనవి. ఇదీ చదవండి: 2జీ, 3జీ, 4జీ, 5జీ.. తరాల్లో మతలబు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏఐ తెలివైనదే.. కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ (ఈఐ) దానికి సులభం కాదు, కేవలం మనుషులకే సాధ్యం. ఎదుటివారి ఆలోచనలను, భావోద్వేగాలను, మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవడం.. అందుకు తగిన విధంగా ప్రవర్తించడం.. అవసరాన్ని బట్టి ఆదరణ, అభిమానం చూపడం.. ఇవన్నీ దానికి రావు. నిజానికి స్థాయీ భేదం లేకుండా ఏ ఉద్యోగాలకైనా ఇది ఎంతో కొంత అవసరం అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా బృందాల్లో పనిచేసినప్పుడు, లేదా వాటిని నడిపిస్తున్నప్పుడు ఈఐ తప్పక ఉండాలి. అందుకే దీన్ని పెంచుకునేందుకు అభ్యర్థులు దృష్టి పెట్టాలి. వీటితోపాటు డిజిటల్ లిటరసీ, డేటా లిటరసీ, డిజిటల్ థ్రెట్ అవేర్నెస్, క్రిటికల్ థింకింగ్.. వంటి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలి. -
ఐటీ పరిశ్రమకు భారీ షాక్.. ‘70 శాతం ఉద్యోగాలు పోనున్నాయ్’
కృత్రిమ మేధ (ఏఐ) మనిషి జీవితంలో ఎన్నో మార్పులు, సౌకర్యాలు తీసుకొస్తోంది. ఆన్లైన్లో వస్తుసేవల క్రయవిక్రయాలకు తోడ్పడుతోంది. ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్ చూడవచ్చో సలహాలిస్తోంది. సిరి, అలెక్సాల ద్వారా మాట్లాడుతోంది. వ్యాపారాలు సులభంగా వేగంగా సాగేందుకు ఉపకరిస్తోంది. అదే సమయంలో ఉద్యోగాలకు ఏఐ ఎసరుపెడుతుందని, మనిషి అవసరాన్ని తగ్గించేస్తుందన్న బెరుకు వ్యక్తమవుతోంది. ఏఐ ప్రపంచంలో గొప్ప అవకాశాలతోపాటు అనిశ్చితులూ మన కోసం ఎదురుచూస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ముఖ్యంగా ఐటీ పరిశ్రమలో కొలువుల కోతపై ఆందోళన నెలకొంది. మనుషులు చేసే ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేస్తుందనే భయాలు టెకీల్లో గుబులు రేపుతున్నాయి. ఏఐ టూల్స్‌తో ఐటీ పరిశ్రమలో సిబ్బంది అవసరాలను 70 శాతం తగ్గించవచ్చని హెచ్‌సీఎల్ మాజీ సీఈవో వినీత్‌నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఏఐ ప్రభావం ఎలా ఉండబోతుందో చర్చించారు. ఈ సందర్భంగా ఆటోమేషన్తో మాస్ లేఆఫ్స్ తప్పదని ఆయన హెచ్చరించారు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌ను నియమించుకునే బదులు ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచాలని సూచించారు. చాట్‌జీపీటీ, జెమిని, కోపైలట్ వంటి ఏఐ టూల్స్ రాకతో లేటెస్ట్ టెక్నాలజీ టూల్స్‌తో సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతాయనే ఆందోళనల మధ్య హెచ్‌సీఎల్ మాజీ సీఈవో వినీత్ నాయర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరిచుకున్నాయి. ఏఐ టూల్స్ కారణంగా కంపెనీల హైరింగ్ అవసరాలు 70 శాతం తగ్గుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇదీ చదవండి: 2జీ, 3జీ, 4జీ, 5జీ.. తరాల్లో మతులబు ఐటీ ఉద్యోగులు చేపట్టే కోడింగ్, టెస్టింగ్, మెయింటెనెన్స్, ట్రబుల్ టికెట్స్ రెస్పాండింగ్ స్కిల్స్‌ను ఏఐ చేపడుతుందని చెప్పారు. ఆపై ఈ నైపుణ్యాలన్నీ వాడుకలో లేనివిగా మారతాయని, ఫలితంగా పెద్దసంఖ్యలో లేఆఫ్స్ చూస్తామని నాయర్ హెచ్చరించారు. అయితే ఏఐకి సూచనలు ఇవ్వాలంటే ఉద్యోగులు అవసరం. కాబట్టి ఆ దిశగా వారికి నైపుణ్యాలు నేర్పాలని తెలిపారు. భారత ఐటీ కంపెనీలకు ఏఐ అపార అవకాశాలు కల్పిస్తుందని వివరించారు. -
ఏఐ వచ్చా.. వెంటనే ఉద్యోగం.. జీతం ఎంతంటే..
ఏఐ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి యువత సిద్ధమవ్వాలి. అదే జరిగితే మన దేశం ఏఐ విభాగంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలుస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయని ఉద్యోగస్థులు బయపడుతున్న నేపథ్యంలో తాజా నివేదిక కొంత ఊరట కలిగిస్తుంది. ఏఐతోపాటు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లలో పుష్కలంగా కొలువులు సంపాదించవచ్చని ఏటా 20 లక్షల కంటే ఎక్కువ జీతంతో జాబ్ ఆఫర్ చేస్తున్నాయని నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిపుణులకు జాబ్ ఆఫర్లలో 2024 ఫిబ్రవరి నెలలో 20 శాతం కంటే ఎక్కువ పెరుగుదలే ఉందని తేలింది. నౌక్రీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక ప్రకారం..మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్, స్టాక్ ఏఐ సైంటిస్ట్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత ఉద్యోగాల్లో గతేడాదితో పోలిస్తే ఈసారి 100 శాతం, గత ఫిబ్రవరితో పోల్చుకుంటే 44 శాతం వేతనాలు పెరిగాయి. ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం.. మెట్రో నగరాలతోపాటు నాన్ మెట్రో నగరాల్లో ఎప్పటికప్పుడు మార్కెట్లో వస్తున్న కొత్త ప్రతిభకు డిమాండ్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, ఏఐ విభాగాల్లో రానున్న రోజుల్లో అధికమొత్తంలో కొలువులు రాబోతున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: రిస్క్ అని తెలిసినా అవే అప్పులు చేస్తున్నారు..! ఆందోళనలో ఆర్బీఐ ఫిబ్రవరి 2024లో రాయ్‌పుర్ లాంటి మెట్రోయేతర నగరాల్లో గతేడాది 14 శాతం వృద్ధితో కొత్త ఉద్యోగాలు సృష్టించగా.. సూరత్, జోధ్‌పుర్, గాంధీనగర్‌లు వరుసగా 12శాతం, 10 శాతం, 8 శాతం వృద్ధిని సాధించాయి. 16 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్ పీరియెన్స్ ఉన్న సీనియర్ నిపుణులు గరిష్ట జాబ్ ఆఫర్లను పొందారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఏటా 20 లక్షల కంటే ఎక్కువ జీతం తీసుకునేవారిలో జాబ్ ఆఫర్లు 23శాతం వృద్ధి చెందినట్లు తెలిసింది. -
కుండ బద్దలు కొట్టిన ఇన్ఫోసిస్ ఎగ్జిక్యుటివ్!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధిక్యం క్రమంగా పెరుగుతోంది. 2022లో ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీని (ChatGPT)ని పరిచయం చేసినప్పటి నుండి జనరేటివ్ ఏఐ (generative AI) పట్ల ఆసక్తి కొత్త శిఖరాలకు చేరుకుంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని, వారి దైనందిన జీవితంలో వారికి సహాయపడుతుందని కొంతమంది భావిస్తుండగా, ఇది మానవ ఉద్యోగాలను తీసివేస్తుందని మరొక వర్గం అంటోంది. ఈ క్రమంలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు కఠోర విషయం చెప్పారు. జెనరేటివ్ ఏఐ.. సంస్థల్లో హెడ్ కౌంట్ తగ్గడానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. మరో మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులను నియమించుకుంటాయి. ఇదీ చదవండి: ఇక నెలకు 11 రోజులు హాయి.. ఐటీ దిగ్గజం గుడ్‌న్యూస్! బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం.. జనరేటివ్ ఏఐ వంటి కొత్త టెక్నాలజీల వల్ల భవిష్యత్తులో కంపెనీలకు తక్కువ మంది ఉద్యోగులు అవసరమవుతారు. ఈ మార్పు వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో క్రమంగా జరుగుతుందని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కో-హెడ్ (డెలివరీ) సతీష్ హెచ్‌సీ అన్నారు. కంపెనీలు ఉత్పాదక ఏఐ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించినందున అవి మరింత సమర్థవంతంగా మారతాయని, సాంప్రదాయిక ఉద్యోగాల కోసం వారికి ఎక్కువ మంది అవసరం ఉండదని ఆయన వివరించారు. రాయిటర్స్‌కి మరో ఇంటర్వ్యూలోనూ ఈ ఇన్ఫోసిస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇదే విషయాన్నే వెల్లడించారు. తమ కంపెనీ "ఏఐ ఫస్ట్" గా మారుతోందని చెప్పారు. "మొదట్లో ఇన్ఫోసిస్ డిజిటల్ ఫస్ట్ కాదు. దీనికి మాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడు డిజిటల్‌కు ఎలా అలవాటు పడ్డామో అలాగే ఏఐకి కూడా మెరుగ్గా అలవాటు పడుతున్నాం. ఏఐ ఫస్ట్ అవుతున్నామని భావిస్తున్నాం" అని ఆయన పేర్కన్నారు. -
ఐటీ కారిడార్‌లో మారుతున్న ట్రెండ్..
వర్క్ ఫ్రం హోం, ఆఫీసులకు తిరిగి వెళ్లడంపై ఉద్యోగుల్లో పెద్ద చర్చే సాగుతోంది. హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లోని ఐటీ కారిడార్లు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయి. కరోనా భయం తగ్గిన నేపథ్యంలో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు క్రమంగా స్వస్తి పలుకుతున్నాయి. హైబ్రిడ్ మోడల్‌ను అనుసరిస్తుండటంతో ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని నెలలుగా ఐటీ కారిడార్‌లో క్రమంగా కార్యకలాపాలు గాడిన పడ్డాయి. హాస్టళ్లలో గదులు నిండుతున్నాయి. మాల్స్ సందర్శకులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. చిరువ్యాపారులు, హోటళ్లు, ట్రావెల్స్, డ్రైవర్ల జీవన ప్రయాణం గాడిలో పడింది. ఏమిటీ హైబ్రిడ్ మోడల్? ఐటీ కంపెనీల్లో అన్ని విభాగాల ఉద్యోగులు వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి మిగతా రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేసేలా ఆదేశాలు ఇస్తున్నాయి. ఈ విధానానికి హైబ్రిడ్ మోడల్ అనే పేరు వాడుకలోకి వచ్చింది. చిన్న కంపెనీల్లో ఉద్యోగులు వంద శాతం కార్యాలయానికి వచ్చి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఐటీ కంపెనీ భవనాలు 65 శాతం ఆక్యుపెన్సీతో పని చేస్తున్నాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. బహుళజాతి కంపెనీలు మాత్రం పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎత్తేసే ఆలోచన చేయడం లేదు. అలాగని ఉద్యోగులు కార్యాలయానికి రావాలంటూ ఒత్తిడి చేయడం లేదు. కొన్ని బడా కంపెనీలు మాత్రం వంద శాతం వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌ను అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు ఇప్పటికే వారికి సందేశాలు పంపించాయి. అత్యధిక ఉద్యోగులు హైబ్రిడ్ మోడల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాంతో కొన్ని కంపెనీలు హైబ్రిడ్ మోడల్‌ను పాటించేందుకు సిద్ధపడుతున్నాయి. ప్రముఖ కంపెనీల్లో ఇలా.. ఇప్పటికే టీసీఎస్, మెటా, గోల్డ్‌మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్ తదితర కంపెనీలపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. గతంలో వర్క్ ఫ్రం హోంను పూర్తిస్థాయిలో ప్రోత్సహించిన ‘జూమ్’ సంస్థ కూడా తమ ఆఫీసులకు 50 మైళ్ల పరిధిలో ఉన్న వారు వారానికి రెండురోజులు ఆఫీసుకు రావాలని చెబుతోంది. తాజాగా ఇన్ఫోసిస్ సంస్థ నెలలో 11 రోజుల పాటు ఇంటి నుంచి పని చేసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించింది. మరో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ భారత్‌లోని తమ ఉద్యోగులను వారానికి కనీసం మూడురోజులు ఆఫీసుకి వచ్చి పని చేయాలని కోరినట్లు ఒక నివేదిక తెలిపింది. ప్రయోజనాలివే.. ఉద్యోగులకు కొంతకాలంపాటు హైబ్రిడ్ వర్క్‌కు అనుమతించడం ద్వారా కంపెనీలు మౌలిక సదుపాయాల ఖర్చులను గణనీయంగా ఆదా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. హైబ్రిడ్ పని వాతావరణం కారణంగా ఐటీ కంపెనీలు తమ మౌలిక సదుపాయాల ఖర్చుల్లో కనీసం 50% ఆదా చేసుకోవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. ఉద్యోగులు ఆసక్తిమేరకు పనిచేస్తే ఆఫీస్‌లో ఉన్నా ఇంటి దగ్గర ఉన్నా సమర్థంగా పనిచేస్తారు. అయితే కావాల్సిందల్లా వారిలో ఆసక్తిని రేకిత్తించడమే. అందుకు కంపెనీ యాజమాన్యాలు, టీమ్ నాయకులు ప్రత్యేక చొరవ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. హైబ్రిడ్ వర్క్‌లో తక్కువ ముందే ఆఫీస్‌కు వస్తారు కాబట్టి ఫోకస్‌గా పనిచేసే అవకాశం ఉంది. దాంతో ఉద్యోగులు సృజనాత్మకతతో విధులు నిర్వర్తిస్తారని చెబుతున్నారు. టీమ్‌లోని సభ్యులు వివిధ ప్రాంతాల నుంచి ఆఫీస్‌కు రావాల్సి ఉంటుంది. దాంతో క్రాస్-కల్చరల్ వాతావరణం పెంపొందుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇదీ చదవండి: ఇక నెలకు 11 రోజులు హాయి.. ఐటీ దిగ్గజం గుడ్‌న్యూస్! మూన్‌లైటింగ్‌కు చెక్.. హైబ్రిడ్ మోడల్లో భాగంగా ప్రధానంగా పనిచేస్తున్న కంపెనీలోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇతర కంపెనీలకు చెందిన రహస్య పని ఒప్పందాలు(మూన్‌లైటింగ్ ) ఇకపై సాగవు. దాంతో కంపెనీల సమాచారం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కొందరు ఉద్యోగులు రహస్యంగా రెండో ఉద్యోగం (మూన్ లైటింగ్) కూడా చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇది ఉద్యోగుల నైతికత మీద ఆధారపడి ఉంది. -
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మరో ఐటీ కంపెనీ మంగళం!
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఐటీ ఉద్యోగులకు మరో కంపెనీ ఆఫీసుకి పిలిచింది. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ భారత్‌లోని తమ ఉద్యోగులను వారానికి కనీసం మూడురోజులు ఆఫీసుకి వచ్చి పని చేయాలని కోరినట్లు ఒక నివేదిక తెలిపింది. దీంతో రిమోట్ వర్కింగ్‌ను ముగించిన తాజా కంపెనీగా కాగ్నిజెంట్ అవతరించింది. వారానికి సగటున మూడు రోజులు ఆఫీసులో ఉండాలని, టీమ్ లీడర్ సూచన మేరకు నడుచుకోవాలంటూ భారత్‌లోని ఉద్యోగులకు గత వారం కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ పంపిన మెమోను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం పేర్కొంది. అయితే ఎప్పటి నుంచి ఈ ఆదేశాలు అమలవుతాయన్నది కంపెనీ పేర్కొనలేదని నివేదిక తెలిపింది. ఆఫీసు నుండి పని చేయడం వల్ల కంపెనీ సంస్కృతిపై మంచి సహకారం, అవగాహన లభిస్తుందని కాగ్నిజెంట్ చెబుతోంది. అయితే దీని వల్ల ఫ్లెక్సిబులిటీ, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటాయని చాలా మంది ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆఫీస్‌లో కలిసి పనిచేస్తూ సహకార ప్రాజెక్ట్‌లు, ట్రైనింగ్, టీమ్ బిల్డింగ్ వంటి అంశాలకు సమయం కేటాయించాలని కంపెనీ సీఈవో కోరుతున్నారు. కొత్త యాప్ భారత్ కోసం కొత్త హైబ్రిడ్-వర్క్ షెడ్యూలింగ్ యాప్‌ను కూడా కాగ్నిజెంట్ ప్రారంభించనుంది. ఇది మేనేజర్లకు షెడ్యూల్‌లను సమన్వయం చేయడంలో, వారి టీమ్‌ల కోసం ఆఫీస్‌లో స్పేస్‌ను రిజర్వ్ చేయడంలో సహాయపడుతుందని మెమోలో పేర్కొన్నారు. కాగ్నిజెంట్ 3,47,700 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వారిలో దాదాపు 2,54,000 మంది భారతదేశంలోనే ఉన్నారు. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్టెక్తో సహా అనేక భారతీయ ఐటీ కంపెనీలు ఆఫీస్‌కి వచ్చి పనిచేయాలని ఉద్యోగులను ఇప్పటికే కోరాయి. మార్చి 31 నాటికి ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయడాన్ని టీసీఎస్ తప్పనిసరి చేసింది. -
‘పెద్ద సంఖ్యలో’.. ఐటీ ఉద్యోగులకు క్యాప్‌జెమినీ చల్లని కబురు!
ప్రముఖ మల్టీనేషనల్ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ భారత్‌లోని ఐటీ ఉద్యోగులకు చల్లటి కబురు చెప్పింది. దేశీయ వ్యాపారంలో వృద్ధిని అంచనా వేస్తూ 2025 ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలో "పెద్ద సంఖ్యలో" ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది. బిజినెస్ వార్త సంస్థ మింట్‌తో జరిగిన సంభాషణలో క్యాప్‌జెమినీ చీఫ్ టెక్నాలజీ & ఇన్నోవేషన్ ఆఫీసర్ నిషీత్ శ్రీవాస్తవ ఈ విషయాన్ని వెల్లడించారు. పరిశ్రమలోని పోటీ కంపెనీలకు అనుగుణంగా తమ కంపెనీ హెడ్‌కౌంట్ పెరుగుతుందని తెలిపారు. ఇది ఐటీ సెక్టార్లో సవాలుగా ఉన్న 2024 ఆర్థిక సంవత్సరం తర్వాత సానుకూల మార్పును సూచిస్తుంది. క్యాప్‌జెమినీకి 2024 ఫిబ్రవరి నాటికి భారత్‌లో 1,75,000 మంది ఉద్యోగులు ఉన్నారు. నాస్కామ్ ప్రకారం 253.9 బిలియన్ డాలర్లు సంచిత రాబడితో 2024 ఆర్థిక సంవత్సరం ముగియగలదని అంచనా వేస్తున్న భారత ఐటీ రంగం.. స్థూల ఆర్థిక అనిశ్చితి కారణంగా కాలంగా ఎదుర్కొంటున్న వ్యయ కట్టడి పరిస్థితి నుంచి పుంజుకునేలా కనిపిస్తోంది. మింట్ నివేదిక ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాలలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో కంపెనీల్లో 49,936 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. మూడవ త్రైమాసిక ఫలితాలను అనుసరించి దేశీయ ఐటీ మేజర్లు వివిధ పరిశ్రమలలోని క్లయింట్ల సెంటిమెంట్‌కు అనుగుణంగా వ్యయం విషయంగా విచక్షణతో వ్యవహరిస్తున్నాయి. -
‘ఎడారిలో ఒయాసిస్సు’ లా, ఐటీ ఉద్యోగులకు టీసీఎస్ బంపరాఫర్!
ఆర్ధిక మాద్యం, ప్రాజెక్ట్ ల కొరత, చాపకింద నీరులా అన్నీ రంగాల్లో మనుషుల స్థానాన్ని కృతిమమేధతో భర్తీ చేయడం వంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో టెక్నాలజీ సంస్థలు కొత్త ఉద్యోగాల నియామకాల్ని తగ్గించాయి. ఈ తరుణంలో ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ హైరింగ్‌పై కీలక ప్రకటన చేసింది. టీసీఎస్ నియామకాల్ని తగ్గిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఆ సంస్థ సీఈఓ కే.కృత్తివాసన్ స్పందించారు.మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ఉద్యోగుల నియమాకం ఉంటుందని తెలిపారు. సంస్థ పనితీరు బాగుంది. ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో ఉంది. సంస్థకు వచ్చే ప్రాజెక్ట్‌ల పరంగా ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం. వాస్తవానికి, మా నియామక ప్రణాళికలను తగ్గించడానికి మాకు ఎటువంటి ప్రణాళిక లేదు. చెప్పినట్లుగానే నియామకాన్ని కొనసాగిస్తాము అని సీఈఓ స్పష్టం చేశారు. జాబ్ ఆఫర్ లెటర్లను వెనక్కి పలు దేశాల్లో ఐటీ మార్కెట్లో ఒడిదడుకులు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఇప్పటికే క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిపి.. ఇచ్చిన జాబ్ ఆఫర్ లెటర్లను వెనక్కి తీసుకుంటున్నారని నివేదికల మధ్య టీసీఎస్ ఈ ప్రకటన వచ్చింది. నాస్కామ్ నివేదిక ప్రకారం.. 2023-24లో పరిశ్రమ కేవలం 60వేల కొత్త ఉద్యోగా అవకాశాలు కల్పించాయని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 5.43 మిలియన్లకు చేరుకుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (NASSCOM)గత వారం తెలిపింది. ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సిందే ఇక వర్క్ ఫ్రమ్ హోంలో ఉద్యోగుల్ని కార్యాలయాలకు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేయడంపై కృతివాసన్ స్పందించారు. ఆఫీస్ నుంచి పనిచేయడం వల్ల ఉద్యోగులు కొత్త కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. కానీ ఇంటి నుంచి, లేదంటే వారానికి మూడు రోజులు ఆఫీస్ కు రావడం వల్ల వ్యక్తిగతంగా ఉద్యోగులకు, సంస్థలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని నేను నమ్ముతున్నాను. ఒక సంస్థగా మేం ఉద్యోగులకు సహాకారం, స్నేహానికి విలువ ఇస్తాం. ఇదంతా ఆన్లైన్ లేదంటే జూమ్ కాల్ ద్వారా సాధ్యం కాదు. సీనియర్ల ఎలా పనిచేస్తున్నారో ఇంటి వద్ద నుంచి పనిచేసే వారికి ఏం తెలుస్తోంది? అని ప్రశ్నించారు. అంతేకాదు వర్క్ ఫ్రమ్ హోం కంటే ఆఫీస్ కి వచ్చి పనిచేయడమే సరైన మార్గమని విశ్వసిస్తున్నట్లు టీసీఎస్ సీఈఓ కృతివాసన్ తెలిపారు. -
గూగుల్‌లో వేతనాలు మూడు రెట్లు పెంపు! ఎందుకో తెలుసా?
ద్రవ్యోల్బణ భయాలు క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో చాలా టెక్ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరిట ఉన్న ఉద్యోగులకు ఉద్వాసన పలకడం, వేతనాల్లో కోత విధించడం వంటి చర్యలకు పూనుకుంటున్నాయి. అందుకు భిన్నంగా గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంటుంది. మంచి నైపుణ్యాలు కలిగి ఉండే ఉద్యోగార్థులకు మరింత జీతం ఎక్కువ ఇచ్చైనా వారి సేవలు వినియోగించుకునేందుకు ముందుకొస్తుంది. తాజాగా ఒక నిపుణుడిని అట్టేపెట్టుకునేందుకు టెక్ దిగ్గజం గూగుల్ అతడి జీతాన్ని 300 శాతం పెంచేందుకు సిద్ధమయ్యింది. గూగుల్‌లో పనిచేస్తున్న సదరు నిపుణుడు పర్ప్లెక్సిటీ ఏఐకి మారాలని నిర్ణయించుకున్నాడు. దాంతో గూగుల్ అతడి జీతాన్ని గణనీయంగా పెంచడం ద్వారా ఆ ఉద్యోగ మార్పును నిలువరించిందని పర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఇటీవల బిగ్ టెక్నాలజీ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన శ్రీనివాస్ ‘ప్రధాన టెక్ కంపెనీలు తమ కీలక నిపుణులను నిలబెట్టుకునేందుకు ఎలా ప్రవర్తిస్తాయన్న విషయాన్ని’ వివరించేందుకు ఉదాహరణగా ఈ సంఘటనను తెలిపారు. ఇదీ చదవండి: 2024లో హైదరాబాద్‌లో పూర్తికానున్న ఇళ్లు ఎన్నంటే.. ఆ నిపుణుడికి కృత్రిమమేధ (ఏఐ) విభాగంతో ప్రత్యక్ష సంబంధం లేదనీ, సెర్చ్ బృందంలో సభ్యుడిగా ఉన్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు. అయినా, ఏఐ సంస్థకు మారేందుకు ప్రయత్నించినప్పుడు గూగుల్ ఈ చర్యలకు పూనుకుందన్నారు. టెక్ పరిశ్రమలో తొలగింపుల గురించి ఆయన మాట్లాడుతూ.. కంపెనీ ఉత్పాదకతకు పెద్దగా ఉపకరించకున్నా, అధిక జీతాలు పొందుతున్న ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో ఐటీ రంగంలో 32,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. -
ఐటీ ఉద్యోగుల జేబులు ఖాళీ అవుతున్నాయ్..
ప్రపంచవ్యాప్తంగా కొన్ని నెలలుగా ఐటీ ఉద్యోగుల జేబులు ఖాళీ అవుతున్నాయి. అంటే జీతాలు తగ్గిపోతున్నాయి. ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌ల ప్రకారం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులకు జీతం ఆఫర్లు 30 నుంచి 40 శాతం తగ్గాయి. అంతర్జాతీయ స్థూల ఆర్థిక మార్పులు, ఐటీ రంగం మందగమనం నేపథ్యంలో ఈ పతనం ఏడాది క్రితమే మొదలైందని పరిశ్రమలో ఉన్నతస్థాయి ఉద్యోగులు ఎకనామిక్ టైమ్స్‌తో చెప్పారు. కొన్ని పెద్ద టెక్ కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోవడానికి ప్రయత్నించడంతో కొన్ని నెలల క్రితం మార్పు ప్రారంభమైంది. 2021-2022లో కోవిడ్ మహమ్మారితో ఉద్యోగ నియామకాల స్తంభనకు దారితీసిన తర్వాత తక్కువ పే ప్యాకర్లు సాధారణంగా మారిపోయాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సిరీస్ A ఫండింగ్‌ని దాటిన ప్రారంభ దశ స్టార్టప్‌ల ద్వారానే చాలా వరకు నియామకాలు జరుగుతున్నాయని ఓ నిపుణుడు చెప్పినట్లుగా నివేదక పేర్కొంది. “ఐటీ కంపెనీలు మళ్లీ నియామకాలు ప్రారంభించాయి. అయితే మునుపటి సంవత్సరాల మాదిరిగా కాకుండా నియామకాలలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి" అని ఆ ఎక్స్పర్ట్ తెలిపారు. మంచి టెక్ టాలెంట్ ఉన్న చాలా మంది ప్రస్తుతం మార్కెట్లో వాస్తవిక వేతనాలతో అందుబాటులో ఉన్నారని, అలాంటి కొంతమంది నిపుణులను తాము నియమించుకుంటున్నట్లు ఐవీక్యాప్ వెంచర్స్ వ్యవస్థాపకుడు విక్రమ్ గుప్తా తెలిపారు. పెద్ద సంఖ్యలో సీనియర్ టెక్ టాలెంట్లను స్టార్టప్‌లు ఎంపిక చేసుకుంటున్నాయని కార్న్ ఫెర్రీ ఇండియా ఎండీ నవనిత్ సింగ్ చెబుతున్నారు. ఉద్వాసనకు గురైన, పెద్ద టెక్ కంపెనీలు, స్టార్టప్‌లతో కలిసి పనిచేసిన అభ్యర్థులతో తాము మాట్లాడుతున్నామని, వారు 30 శాతం వరకు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మైఖేల్ పేజ్ హెడ్, రీజినల్ డైరెక్టర్ ప్రన్షు ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. -
హడలిపోతున్న తరుణంలో చల్లటి కబురు.. ఐటీ కంపెనీల ప్లాన్ ఇదే..!
ఐటీ పరిశ్రమలలో ప్రస్తుతం లేఆఫ్‌లు బెంబేలెస్తున్నాయి. కొత్త నియామకాలు తగ్గిపోయాయి.. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. దీంతో తమ పరిస్థితి ఏంటని ఫ్రెషర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో వారు ఎగిరి గంతేసే ఓ నివేదిక వెల్లడైంది. టీమ్‌లీజ్ ఎడ్టెక్ కెరీర్ ఔట్లుక్ రిపోర్ట్ 2024 ప్రకారం.. ప్రముఖ ఐటీ దిగ్గజాలు రాబోయే ఆరు నెలల్లో 40,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలో ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ ఐటీ పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తోందని రిక్రూట్మెంట్ సంస్థ టీమ్‌లీజ్ డిజిటల్ విశ్లేషిస్తోంది. "జెనరేటివ్ ఏఐ ఆటోమేషన్‌కు అనుగుణంగా వర్క్‌ఫ్లో మారబోతోంది. ఈ ఏఐ సిస్టమ్‌లతో సమర్థవంతంగా సహకరించడానికి ఫ్రెషర్లు సిద్ధంగా ఉండాలి" అని టీమ్‌లీజ్ ఎడ్టెక్ సీవోవో జైదీప్ కేవల్రమణి పేర్కొన్నారు. "ఎంప్లాయర్లు కొంతకాలంగా సంప్రదాయవాద అడుగులు వేశారు. ప్రపంచ గందరగోళాల మధ్య నియామకం మందగించింది. అయితే మా ఇటీవలి సర్వే భారతదేశ వృద్ధి కథనంపై ఎంప్లాయర్ విశ్వాసాన్ని వెల్లడిస్తుంది. సంస్థలు తమ భవిష్యత్తు మార్గాలపై మరింత నమ్మకంగా ఉన్నాయి" టీమ్‌లీజ్ వ్యవస్థాపకుడు, సీఈవో ఎడ్టెక్ శంతను రూజ్ తెలిపారు. గతేడాది కంటే తక్కువే.. ఐటీ రంగంలో ఫ్రెషర్ల నియామకం ఉద్దేశం 2024 తొలి ఆర్నెళ్లలో 42 శాతానికి తగ్గింది. 2023లో ఇదే కాలంలో ఇది 49 శాతంగా ఉండేది. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ ప్రొఫెషనల్స్ కోసం నియామక ఉద్దేశం గత ఏడాది ఇదే కాలంలో 62 శాతం నుంచి ప్రస్తుత ప్రథమార్ధంలో (జనవరి-జూన్ 2024) అన్ని రంగాలలో 68 శాతానికి స్వల్పంగా మెరుగుపడిందని నివేదిక పేర్కొంది. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరం ప్రథమార్ధంలో ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉన్న మొదటి మూడు పరిశ్రమలు ఈ-కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లు (55%), ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ (53%), టెలికమ్యూనికేషన్స్ (50%) అని నివేదిక విశ్లేషించింది. -
ఈ స్కిల్ మీలో ఉంటే చాలు.. ఉద్యోగం రెడీ!
2024లోనూ ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్న క్రమంలో.. డిజిటల్ ఇంజినీరింగ్, బిజినెస్ ప్లాట్‌ఫామ్ సేవల సంస్థ 'ఫుల్క్రమ్ డిజిటల్' (Fulcrum Digital) మాత్రం కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు శుభవార్త చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ డొమైన్లలో 700 మందిని నియమించుకోవాలని యోచిస్తోందని ఫుల్క్రమ్ డిజిటల్ కంపెనీ ఛైర్మన్ 'రాజేష్ సిన్హా' తెలిపారు. కంపెనీ కార్యకలాపాలను మరింత సులభతరం చేయడానికి ఏఐ టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడానికి సంస్థ ఆసక్తి చూపుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాకుండా, డేటా సైన్టిస్ట్, సాఫ్ట్వేర్ డెవలపర్స్ వంటి టెక్నాలజీలలో నైపుణ్యం కలిగిన వారిని కూడా సంస్థ ఈ ఏడాది నియమించుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. న్యూయార్క్‌కు చెందిన ఫుల్క్రమ్ డిజిటల్ సాఫ్ట్వేర్ కార్యాలయాలు లాటిన్ అమెరికా, యూరప్, ఇండియాలలో కూడా ఉన్నాయి. ఇదీ చదవండి: ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను!.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కొత్త టెక్నాలజీ అవసరం.. రోజు రోజుకి కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. కాబట్టి ఉద్యోగులు కూడా తప్పకుండా కొత్త టెక్నాలజీలలో నైపుణ్యం పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను నేర్చుకోగలుగుతారో.. అప్పుడే సంస్థల్లో మనగలుగుతారు. లేకుంటే ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. టెక్నాలజీలలో నైపుణ్యం లేకపోవడం వల్ల, ఇతర కారణాల వల్ల గత నెలలో ఏకంగా 32వేలమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఉద్యోగి తన నైపుణ్యం పెంచుకోవాలి. -
‘హే గూగుల్’.. ఏంటిది? వందలాది ఉద్యోగులను తీసేస్తున్న టెక్ దిగ్గజం
ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని టెక్ దిగ్గజం గూగుల్ వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తోంది. తమ డిజిటల్ అసిస్టెంట్, హార్డ్‌వేర్, ఇంజినీరింగ్ టీమ్‌లలో పనిచేస్తున్న వందలాది మంది సిబ్బందిని ఇంటికి సాగనంపుతోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ చర్యలు కొంకా కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. బాధితుల్లో వాయిస్ అసిస్టెంట్ టీమ్ గూగుల్ చేపట్టిన ప్రస్తుత లేఆఫ్‌లతో ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో వాయిస్ ఆధారిత గూగుల్ అసిస్టెంట్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హార్డ్‌వేర్ టీమ్‌లో పనిచేస్తున్న వారు ఉన్నారు. కంపెనీ సెంట్రల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్‌లోని వర్కర్లపైనా లేఆఫ్‌ల ప్రభావం ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఉత్పత్తుల ప్రాధాన్యతలకు అనుగుణంగా 2023 ద్వితీయార్థంలో తమ అనేక బృందాలు మరింత సమర్థవంతంగా, మెరుగ్గా పని చేయడానికి సిబ్బందిలో మార్పులు చేశాయని గూగుల్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంస్థాగత మార్పులలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా గూగుల్ అసిస్టెంట్ టీమ్‌లో తొలగింపులు జరుగుతున్నట్లు సెమాఫోర్ అనే న్యూస్ వెబ్సైట్ మొదట నివేదించింది. 9to5Google అనే గూగుల్ సంబంధిత సమాచార వెబ్సైట్ హార్డ్‌వేర్ టీమ్‌లో పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నట్లు పేర్కొంది. ప్రభావిత సిబ్బందికి తొలగింపు సమాచారాన్ని కంపెనీ పంపుతోంది. గూగుల్‌లో ఇతర విభాగాల్లో ఉన్న ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం వీరికి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఉద్యోగుల యూనియన్ మండిపాటు గూగుల్ తొలగింపులపై ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేసింది. ‘కంపెనీ కోసం ఉద్యోగులు నిరంతరం కష్టపడుతన్నాం.. దీంతో కంపెనీ ప్రతి త్రైమాసికంలో బిలియన్ల కొద్దీ ఆర్జిస్తోంది. కానీ ఉద్యోగులను తొలగించడం మాత్రం ఆపడం లేదు’ అని వాపోయింది. అయితే తొలగింపులకు వ్యతిరేకంగా తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేసింది. Tonight, Google began another round of needless layoffs. Our members and teammates work hard every day to build great products for our users, and the company cannot continue to fire our coworkers while making billions every quarter. We won’t stop fighting until our jobs are safe! — Alphabet Workers Union (AWU-CWA) (@AlphabetWorkers) January 11, 2024 -
భారీగా తగ్గిపోయిన నియామకాలు.. ఐటీ రంగం ప్రభావంతోనే!
ముంబై: కార్యాలయ ఉద్యోగ నియామకాలు (వైట్ కాలర్) 2023 డిసెంబర్ నెలలో భారీగా తగ్గిపోయాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 16 శాతం మేర తగ్గినట్లు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్‌లో వెల్లడైంది. ఐటీ, బీపీవో, విద్య, రిటైల్, హెల్త్‌కేర్ రంగాల్లో నియామకాల పట్ల అప్రమత్త ధోరణే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ‘‘2023 నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్ నెలలో కార్యాలయ ఉద్యోగ నియామకాలు 2 శాతం పెరిగాయి. ఐటీయేతర రంగాల్లో నియామకాలు ఇందుకు అనుకూలించాయి. నౌకరీ జాబ్ స్పీక్ సూచీ 16 శాతం తగ్గిపోవడానికి ఐటీ రంగమే ఎక్కువ ప్రభావం చూపించింది. ఐటీలో నియామకాలు పూర్తి స్థాయిలో సాధారణ స్థాయికి చేరుకునేందుకు ఎక్కువ కాలమే వేచి చూడాల్సి రావచ్చు’’ అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ వెల్లడించారు. నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ డిసెంబర్ నెల గణాంకాల ప్రకారం.. బీపీవో రంగంలో (వార్షికంగా క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు) నియామకాలు 17 శాతం తగ్గాయి. విద్యా రంగంలో 11 శాతం, రిటైల్‌లో 11 శాతం, హెల్త్‌కేర్‌లో 10 శాతం చొప్పున తగ్గాయి. ఐటీ రంగంలో నియామకాలు ఏకంగా 21 శాతం పడిపోయాయి. క్రితం ఏడాది నవంబర్‌తో పోల్చి చూసినప్పుడు ఐటీ నియామకాలు 4 శాతం తగ్గాయి. డేటా సైంటిస్ట్లకు డిమాండ్.. ఐటీలో నియామకాల పట్ల అప్రమత్త ధోరణి నెలకొన్నప్పటికీ.. ఫుల్ స్టాక్ డేటా సైంటిస్ట్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్, ఆటోమేషన్ ఇంజనీర్లకు మంచి డిమాండ్ కనిపించింది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో నియామకాలు ఫ్లాట్‌గా (పెరగకుండా/తగ్గకుండా) ఉన్నాయి. నౌకరీ డాట్ కామ్ ప్లాట్‌ఫామ్‌పై కొత్త జాబ్ పోస్టింగ్‌లు, నియామకాల ధోరణులు, ఉద్యోగాలకు సంబంధించిన శోధనల సమాచారాన్ని ఈ నివేదిక ప్రతిఫలిస్తుంటుంది. ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ)లోనూ నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 4 శాతం పెరిగాయి. ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్లో ఆతిథ్య రంగ నియామకాలు ఎక్కువగా నమోదయ్యాయి. 16 ఏళ్ల అనుభవం ఉన్న వారికి అధిక డిమాండ్ నెలకొంది. ఫార్మా రంగంలోనూ 2 శాతం అధిక నియామకాలు నమోదయ్యాయి. అహ్మదాబాద్, వదోదర, ముంబైలో ఫార్మా నియామకాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 17 శాతం డౌన్ డిసెంబర్ నెలలో హైదరాబాద్‌లో నియామకాలు 17 శాతం తక్కువగా నమోదయ్యాయి. చెన్నై, బెంగళూరులో అయితే 23 శాతం చొప్పున తగ్గాయి. పుణెలో 15 శాతం తగ్గినట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. -
టీసీఎస్ సంచలన నిర్ణయం?, ‘ ఆ 900 మంది ఉద్యోగుల శాలరీ నిలిపేసిందా?’
ఉద్యోగుల విషయంలో టెక్ దిగ్గజం టీసీఎస్ అమానుషంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా 2 వేల మంది ఉద్యోగుల్ని రీలొకేట్ చేసిందంటూ ఐటీ ఉద్యోగుల సంఘం ‘నైట్స్’ ఆరోపించింది. తాజాగా, వారిలో చెప్పిన మాట వినలేదన్న కారణంతో 900 మంది ఉద్యోగుల జీతాల్ని నిలిపివేసిందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ అంశం టెక్ కంపెనీల్లో చర్చాంశనీయంగా మారింది. ఇటీవల కాలంలో చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోంకు స్వస్తి చెబుతున్నాయి. ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలంటూ పిలుపు నిస్తున్నాయి. 2 వేల మంది బదిలీ అయితే, గత ఏడాది నవంబర్‌లో టీసీఎస్ 2వేల మంది టెక్కీలకు వర్క్ ఫ్రమ్ హోంను రద్దు చేసింది. ఆఫీస్‌కు రావాలని ఆదేశించింది. ఆ సమయంలో వారికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే 2 వేల మంది ఉద్యోగుల్ని ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేసింది. ఇందుకోసం 15 రోజులు గడువు విధించింది. గడువు ముగిసే లోపు ఉద్యోగులు బదిలి చేసిన ప్రాంతానికి వెళ్లాల్సిందే. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ అంశంపై టీసీఎస్ ఉద్యోగులు.. ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నైట్స్ కేంద్ర కార్మిక శాఖను ఆశ్రయించింది. ఐటీ ఉద్యోగుల్ని కాపాడండి ఈ తరుణంలో నైట్స్ తాజాగా టీసీఎస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహరాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీంతో మహరాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ ఉద్యోగుల రీలొకేట్ అంశంపై వివరణ ఇవ్వాలని కోరుతూ టీసీఎస్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న తమను కలవాలని టీసీఎస్ ప్రతినిధులను కార్మిక శాఖ ఆదేశించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా టీసీఎస్ చర్యలపై దర్యాప్తు చేయాలని, ఆ సంస్థ అనైతిక పద్దతుల నుంచి ఐటీ ఉద్యోగుల్ని కాపాడాలని కోరినట్లు నైట్స్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలుజా ఒక ప్రకటనలో తెలిపారు. 900 మంది ఉద్యోగుల జీతాల నిలిపివేత ఈ నేపథ్యంలో ఉద్యోగుల పట్ల టీసీఎస్ వ్యవహరిస్తున్న తీరుపై విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగులకు బదిలీ నోటీసులు పంపిన కొద్ది నెలలకే తమ కంపెనీ విధానాలకు అనుగుణంగా లేరంటూ 900 మందికి పైగా జీతాలు చెల్లించకుండా నిలిపివేసినట్లు సమాచారం. దీనిపై టీసీఎస్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. జీతాల్ని నిలిపి వేసి “రీలొకేషన్‌ను వ్యతిరేకిస్తున్న ఉద్యోగుల జీతాలను టీసీఎస్ అనైతికంగా నిలిపివేసింది. బలవంతపు బదిలీలను అంగీకరించమని లేదా ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆదేశించింది. ఇలా ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలా ఉన్న టీసీఎస్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్ని నైట్స్ తీవ్రంగా ఖండిస్తుంది. రీలొకేషన్ వల్ల ఉద్యోగులకు కలిగి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ అంతరాయం, ఒత్తిడి, ఆందోళనలన్నింటినీ కంపెనీ విస్మరిస్తోంది’’ అని వ్యాఖ్యానించింది. నా జీతం 6వేలే మరోవైపు ఓ జాతీయ మీడియా సంస్థ బాధిత ఉద్యోగుల్లోని కొందరితో గూగుల్‌మీట్‌లో మాట్లాడింది. ‘‘మమ్మల్ని రీలొకేట్ చేసింది కానీ ఎలాంటి ప్రాజెక్ట్ ఇవ్వలేదు. కంపెనీ పోర్టల్ అల్టిమాటిక్స్లో టైమ్ షీట్‌ను అప్డేట్ చేయలేదనే కారణంతో కొంతమంది ఉద్యోగులకు డిసెంబర్ నెలకు కేవలం రూ. 6వేలు మాత్రమే చెల్లించింది’’ అని ఓ ఉద్యోగి వాపోయాడు. మాట వినలేదని బాధిత ఉద్యోగులలో ఓ ఉద్యోగికి టీసీఎస్ ఓ మెయిల్ పంపింది. అందులో ఇలా ఉంది.. “ఈ ఈమెయిల్ మిమ్మల్ని టీసీఎస్ ముంబై బ్రాంచ్ రీలొకేషన్‌కు సంబంధించింది. 14 రోజుల్లోపు సంబంధిత బ్రాంచ్‌కు సమాచారం అందించి.. ఈ కాపీలో ఉన్న వివరాల్ని మీరు పూర్తి చేసి మెయిల్‌కు రిప్లయి ఇవ్వండి’’ అని సారాంశం. ఈ మెయిల్ వచ్చిన కొద్దిరోజులకు మరో మెయిల్ వచ్చింది. మీరు ఇప్పటి వరకు బదిలీ చేసిన బ్రాంచ్‌కి రిపోర్ట్ చేయడంలో విఫలమయ్యారని గుర్తించాం. కంపెనీ నిర్ణయాన్ని పాటించనుందుకు మీ జీతాన్ని తక్షణమే నిలిపి వేస్తున్నాం అని మెయిల్లో తెలిపింది. చేతిలో ప్రాజెక్టేలేదు.. “ఆర్ధిక సమస్యల కారణంగా మా ప్రాజెక్ట్ ఆగిపోయింది. 3-4 నెలలు బెంచ్‌లో ఉన్నాం. ఆ సమయంలో, నాకు ప్రాజెక్ట్ ఇవ్వకుండా వేరే ప్రాంతానికి వెళ్లమని సంస్థ ఆదేశించింది. బెంచ్‌లో ఉన్నప్పుడు నేను ఎక్కడ ఉంటే ఏం లాభం’’ అని మరో ఉద్యోగి ప్రశ్నించాడు. -
కొత్త ఏడాదిలోనూ భారీ లేఆఫ్‌లు! కలవరపెడుతున్న లేటెస్ట్ సర్వే
Layoffs in 2024: లక్షలాది తొలగింపులతో ఈ ఏడాదంతా అష్టకష్టాలు పడిన ఉద్యోగులు కొత్త సంవత్సరంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. నూతన ఏడాదిలో పరిస్థితులన్నీ చక్కబడతాయని భావిస్తున్న తరుణంలో ఉద్యోగులను కలపెట్టేలా ఓ లేటెస్ట్ సర్వే వెలువడింది. దీని ప్రకారం.. 2024లో భారీ తొలగింపులు ఉండనున్నాయి. ఉద్యోగార్థుల రెజ్యూమ్‌ల రూపకల్పనలో తోడ్పాటు అందించే ప్రొఫెషనల్ ప్లాట్‌ఫామ్ ‘రెజ్యూమ్ బిల్డర్’ ఈ సర్వే నిర్వహించింది. ఈ నెలలో 900 కంటే ఎక్కువ కంపెనీల నుంచి వచ్చిన ప్రతిస్పందనల ఆధారంగా ఈ తాజా సమాచారాన్ని ప్రకటించించింది. ఈ సర్వేలో పాల్గొన్న 10 కంపెనీలలో దాదాపు నాలుగు కంపెనీలు 2024లో ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని చెప్పాయి. అలాగే సగానికి పైగా కంపెనీలు 2024లో హైరింగ్ ఫ్రీజ్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపాయి. కారణాలివే.. ఎందుకు లేఆఫ్‌లు చేపడుతున్నారని అడిగినప్పుడు, సగం కంపెనీలు మాంద్యం అంచనా ఒక కారణమని చెప్పాయి. కొంచెం తక్కువగా అంటే 10 కంపెనీల్లో నాలుగు తాము ఉద్యోగులను తొలగించి ఆ స్థానాలను కృత్రిమ మేధస్సు (AI)తో భర్తీ చేయనున్నట్లు తెలిపాయి. ఏఐ యాడ్ టెక్కి అనుకూలంగా గూగుల్ తన యాడ్ సేల్స్ యూనిట్లలోని 30 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2023లో ఇప్పటికే తమ కంపెనీలు 30 శాతానికి పైగా సిబ్బందిని తొలగించినట్లు చెప్పిన మెజారిటీ బిజినెస్ లీడర్లు 2024లోనూ 30 శాతం మందికిపైగానే తొలగించనున్నట్లు పేర్కొన్నారు. కంపెనీల వారీగా.. కొత్త సంవత్సరంలో అధిక సంఖ్యలో కంపెనీలు తొలగింపులు చేపడతాయని చెబుతున్నప్పటికీ అన్ని కంపెనీల్లో లేఆఫ్‌లు ఉంటాయని కాదు. చిన్న కంపెనీలతో పోలిస్తే మధ్యతరహా, పెద్ద కంపెనీలలో తేడాలున్నాయి. మధ్యతరహా కంపెనీల్లో 42 శాతం, పెద్ద కంపెనీల్లో 39 శాతం తొలగింపులు ఉంటాయని సూచించగా, చిన్న కంపెనీల్లో 28 శాతం మాత్రమే లేఆఫ్‌లు ఉంటాయని ఆ కంపెనీల లీడర్లు వెల్లడించారు. ఈ కంపెనీల్లోనే అత్యధికం పరిశ్రమల వారీగా నిర్మాణ, సాఫ్ట్వేర్ కంపెనీలు వరసగా 66 శాతం, 65 శాతం సిబ్బందిని వచ్చే సంవత్సరంలో తొలగించే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్, రిటైల్, ఫైనాన్స్, బీమా కంపెనీల్లోనూ కొంత మేర లేఆఫ్‌ల గందరగోళం నెలకొంది. ఇన్ఫర్మేషన్, రిటైల్ కంపెనీలు 44 శాతం, ఫైనాన్స్ కంపెనీలు 38 శాతం లేఆఫ్‌లను చేపట్టనున్నట్లు చెబుతున్నాయి.