
దేశంలో ఐటీ ఉద్యోగాలకు ( IT Jobs ) ఎనలేని క్రేజ్ ఉంది. అత్యధిక జీతాలే ఇందుకు కారణం. ఉద్యోగంలో చేరినప్పుడు రూ.లక్షల్లో ప్యాకేజీ లభించడమే కాదు.. ఏటా వేతనాల పెంపు (Salary hikes) కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ఏటా తూతూ మంత్రంగా సింగిల్ డిజిట్‌లోనే జీతాలను పెంచుతున్నాయి ఐటీ కంపెనీలు.
2025 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ పరిశ్రమలో వేతన ఇంక్రిమెంట్లు మధ్యస్థంగా ఉంటాయని అంచనా. ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకులు, అభివృద్ధి చెందుతున్న నైపుణ్య అవసరాలు, కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరగడం వంటి కారణాలతో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది సగటు వేతన పెంపు 4-8.5 శాతం మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వేతన ఇంక్రిమెంట్లను ప్రభావితం చేసే అంశాలు
గ్లోబల్ ఎకనామిక్ ఛాలెంజెస్: ఐటీ సేవల పరిశ్రమ ఆర్థిక అనిశ్చితితో సతమతమవుతోంది. ఇది విచక్షణ వ్యయం తగ్గడానికి, వ్యాపార ప్రాధాన్యతలను మార్చడానికి దారితీసింది. కంపెనీలు వేతన బడ్జెట్ల విషయంలో సంప్రదాయ పద్ధతిని అవలంబిస్తున్నాయి. కొన్ని సాంప్రదాయ ఏప్రిల్-జూన్ కాలానికి మించి అప్రైజల్ సైకిల్‌ను ఆలస్యం చేస్తున్నాయి.
పెరుగుతున్న నైపుణ్య అవసరాలు: పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, నైపుణ్యాల ఆధారిత వేతనానికి ప్రాధాన్యత పెరుగుతోంది. సంస్థలు వ్యయాన్ని తగ్గించుకునేందుకు టైర్ 2 నియామకాలను ఉపయోగించుకుంటున్నాయి. మరోవైపు ప్రతిభావంతులను నిలుపునేందుకు నిలుపుదల బోనస్‌లు, ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్లు (ESOP), ప్రాజెక్ట్ ఆధారిత ప్రోత్సాహకాలను అమలు చేస్తున్నాయి.
ఇదీ చదవండి: టీసీఎస్‌లో ఉద్యోగం ఇక మరింత కష్టం!
ఏఐ స్వీకరణ: పెరుగుతున్న కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) స్వీకరణ శ్రామిక శక్తి నిర్మాణ వ్యవస్థలను పునర్నిర్మిస్తోంది. వేతన బడ్జెట్లను ప్రభావితం చేస్తోంది. ఏఐ ఆధారిత సామర్థ్యాలు, పెరుగుతున్న క్లయింట్ అవసరాలు మరింత జాగ్రత్తగా వనరులను కేటాయించడానికి కంపెనీలను ప్రేరేపిస్తున్నాయి.
పరిశ్రమ నిపుణులు ఏమంటున్నారంటే..
ఈ ఏడాది వేతనాల పెంపు చాలా జాగ్రత్తగా ఉందని టీమ్ లీజ్ డిజిటల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ విజ్ పేర్కొన్నారు. ‘4-8.5 శాతం రేంజ్‌లో ఇంక్రిమెంట్లను ఇచ్చేందుకు పరిశ్రమ వర్గాలు చూస్తున్నాయి. ఇది మునుపటి సంవత్సరాలతో పోలిస్తే తక్కువ. ప్రపంచ ఆర్థిక సవాళ్లు, మారుతున్న వ్యాపార ప్రాధాన్యాలు ఈ మందగమనానికి ప్రధాన కారణం’ అని వివరించారు.
మరోవైపు 5-8.5 శాతం వేతన పెంపు ఉంటుందని రీడ్ అండ్ విల్లో సీఈఓ జానూ మోటియానీ అంచనా వేశారు. రెండంకెల పెరుగుదల రోజులు పోయినట్లు కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. పరిశ్రమ మరింత ఆచరణాత్మక ధోరణి అవలంభిస్తున్నందున సగటు పెరుగుదల 5-8.5 శాతం మధ్య ఉంటుందని ఆమె భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment