salary increments
-
గుడ్‌న్యూస్.. డబుల్ డిజిట్ బాటలో వేతన ఇంక్రిమెంట్లు
దేశీయ కంపెనీల ఉద్యోగులు ఈ సంవత్సరం సగటున 10 శాతం ఇంక్రిమెంట్లు పొందారు. ఆర్థిక అనిశ్చిత భయాలతో లేఆఫ్‌లు, ఒడిదుడుకులతో 2023 సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇంక్రిమెంట్లు డబుల్ డిజిట్ శాతం వైపు పయనాన్ని ప్రారంభించాయని నౌకరీ డాట్‌కామ్ (Naukri.com)నిర్వహించిన సర్వే పేర్కొంది. నౌకరీ డాట్‌కామ్ సర్వే ప్రకారం.. ఈ ఏడాది ప్రతి 10 మంది ఉద్యోగులలో కనీసం ఆరుగురు 10 శాతం కంటే ఎక్కువగా ఇంక్రిమెంట్లు పొందారు. కనిష్టంగా కాస్త తక్కువే ఉన్నప్పటికీ అసాధారణ పనితీరు ఉన్న ఉద్యోగులు 20 నుంచి 25 శాతం ఇంక్రిమెంట్ పొందారు. ఈ సర్వేలో 2 లక్షల మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. తమ కంపెనీలు ఏప్రిల్ మార్చి మదింపు చక్రాన్ని అనుసరిస్తున్నాయని 56 శాతం మంది చెప్పారు. బ్యాంకింగ్, తయారీ రంగాల్లో అధికంగా.. జాబ్ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం వేతన పెంపు వేవ్ ఆశాజనకంగా ఉందని నౌకరీ డాట్ కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ అన్నారు. ఏప్రిల్-మార్చి వేతన పెంపులో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల ఉద్యోగులదే అత్యధిక వాటా. వీరిలో చాలా మంది 10 నుంచి 20 శాతం ఇంక్రిమెంట్లు అందుకున్నారు. ఇంక్రిమెంట్ల శాతంలో హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్ రంగాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చాలా మంది ఉద్యోగులు గతేడాది కంటే మెరుగైన వేరియబుల్స్, బోనస్‌ల చెల్లింపులు ఈ ఏడాది పొందారు. ఇదీ చదవండి: మాదేం లేదు! వర్క్ ఫ్రం ఆఫీస్‌పై ఇన్ఫోసిస్ సీఈవో కీలక వ్యాఖ్యలు -
కొత్త ఏడాది టెక్కీలకు గుడ్ న్యూస్.. జీతాలు పెరగనున్నాయ్!
టెక్ దిగ్గజాలు తమ సిబ్బందిని భారీగా ఇంటికి సాగనంపడం, పింక్ స్లిప్పుల కలకలంతో ఉద్యోగుల్లో భయాందోళనల నడుమ వారికి వేతన పెంపుపై శుభవార్త వెలువడింది. భారతదేశంలో ఈ ఏడాది సగటు జీతం 10 శాతం పెరిగే అవకాశం ఉందని, ఇది గత ఏడాది కంటే కేవలం 0.4 శాతం ఎక్కువని కాన్ ఫెర్రీ తాజా వేతన సర్వే సర్వే వెల్లడించింది. "మాంద్యం, ఆర్థిక మందగమనమంటూ ప్రపంచవ్యాప్తంగా ఈ భయాలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ఆశాజనకంగా ఉందని కార్న్ ఫెర్రీ ఛైర్మన్, రీజినల్ మేనేజింగ్ డైరెక్టర్ నవనిత్ సింగ్ సర్వేలో పేర్కొన్నారు. 818 సంస్థలు, 8 లక్షలకు పైగా ఉద్యోగులపై జరిపిన సర్వేలో, భారతీయ కార్పొరేట్ ఉద్యోగులు 2023లో సగటున 9.8 శాతం సాలరీ పెంపు ఉండొచ్చని సర్వే పేర్కొంది. అత్యుత్తమ నైపుణ్యాలను కనబరిచే ఉద్యోగులకు ఆయా కంపెనీలు ఏకంగా 15 శాతం నుంచి 30 శాతం వరకూ వేతన పెంపు వర్తింపచేయవచ్చని తెలిపింది. ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, టెక్నాలజీ, మీడియా, గేమింగ్‌తో సహా రంగాలు ఈ ఏడాది జీతాలు పెరిగే అవకాశం ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఈ పెంపు వివిధ రంగాల పరంగా చూస్తే.. టెక్నాలజీలో 10.4 శాతం, మీడియా 10.2 శాతం, గేమింగ్ 10 శాతం. అదనంగా, కొన్ని ఇతర రంగాల జీతాల పెంపు అంచనాలలో సేవా రంగం 9.8 శాతం, ఆటోమోటివ్ 9 శాతం, రసాయనం 9.6 శాతం, వినియోగ వస్తువులు 9.8 శాతం, రిటైల్ 9 శాతం ఉన్నాయి. అదనంగా, పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా చాలా వ్యాపారాలు తమ శ్రామిక శక్తిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని సర్వే సూచిస్తుంది. సర్వేలో పాల్గొన్న దాదాపు 60 శాతం సంస్థలు తాము ఒక రకమైన హైబ్రిడ్ మోడల్‌ను స్వీకరించినట్లు సూచించాయి. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..!
కోవిడ్ రాకతో ఐటీ సంస్థల్లో నెలకొన్న అనిశ్చితితో చాలా వరకు కంపెనీలు ఉద్యోగులను తీసివేశాయి. అంతేకాకుండా పలు వ్యాపార కార్యకలాపాలు కూడా గణనీయంగా పడిపోయాయి. కాగా ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకుంటున్నాయి. దాంతో పాటుగా పలు మల్టీనేషనల్ కంపెనీలు కూడా భారీగా ఉద్యోగ నియమాకాలను చేపడుతున్నాయి. తాజాగా డెలాయిట్ చేపట్టిన సర్వే ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ను అందించింది. చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలు ఇవే..! టాప్-10 లో ఇండియన్ ఫ్యామిలీ..! వచ్చే ఏడాది వేతనాల పెంపు..! ఇప్పటికే పలు ఐటీ కంపెనీల్లో పనిచేస్తోన్న ఉద్యోగులకు వచ్చే ఏడాది 2022లో సుమారు 8.6 శాతం వరకు ఉద్యోగుల జీతాలు పెరుగుతాయని డెలాయిట్ తన సర్వేలో వెల్లడించింది. 2022 నాటికి పలు సంస్థలు రెండంకెల వృద్ధిని సాధిస్తాయని డెలాయిట్ సర్వే పేర్కొంది. కంపెనీలోని టాప్‌పర్ఫార్మర్స్‌కు సగటు ఉద్యోగుల కంటే 1.8 రెట్లు ఎక్కువ ఎక్కువ వేతనాలు పొందుతారని డెలాయిట్ తన సర్వేలో పేర్కొంది. ఈ ఏడాదిలో ఐటీ కంపెనీల్లో సుమారు 12 శాతం ఉద్యోగులకు ప్రమోషన్స్‌ను పొందారు. 2020లో ఇది 10 శాతంగానే ఉంది. దేశవ్యాప్తంగా ఐటీ కంపెనీలు సుమారు 78 శాతం మేర నియామకాలను చేపడుతున్నాయి. పర్యాటక రంగంలో అంతంతే..! రిటైల్, హాస్పిటాలిటీ, రెస్టారెంట్లు, మౌలిక, రియాలీటీ రంగంలో వేతనాల పెంపు ఉండక్కపోవచ్చునని డెలాయిట్ అభిప్రాయపడింది. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కొత్త ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు జంకుతుండడంతో పర్యాటకరంగంలో వేతనాల పెంపు ఉండకపోవచ్చునని డెలాయిట్ సర్వే పేర్కొంది. చదవండి: Bitcoin: బిట్‌కాయిన్ విలువ రెట్టింపుకానుందా ..! బ్లూమ్‌బర్గ్ సంచలన ప్రకటన..! -
మీ ఉద్యోగాలు, ఇంక్రిమెంట్లు, బోనస్‌లు భద్రం
ముంబై: దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదిత్యపురి తమ ఉద్యోగులకు ఉద్యోగాలు, ఇంక్రిమెంట్లు, బోనస్‌ల విషయంలో కొండంత భరోసాను ఇచ్చారు. అవన్నీ భద్రమని, ఆందోళనలు అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. కరోనా ప్రేరిత అంశాలు ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఆదిత్యపురి 1.15 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులకు ఇటీవల 10 నిముషాల వీడియో సందేశం పంపా రు. ‘‘మీకు ఉద్యోగ భద్రతేకాదు. ప్రమోషన్లు, ఇంక్రిమెం ట్లు, బోనస్‌లూ అన్నీ భద్రం’ అని ఆయన సందేశంలో పేర్కొన్నారు. తన వారసుడు శశిధర్ జగదీశన్సహా మేనేజ్మెంట్ తరఫున తాను ఈ హామీ ఇస్తున్నట్లు తెలిపారు. 25 సంవత్సరాల సుదీర్ఘ బాధ్యతల నుంచి ఈ నెలాఖరున పదవీవిరమణ చేస్తున్న పురి, బ్యాంకు పండుగల ఆఫర్ ప్రకటనను (సెకండ్ ఎడిషన్) పురస్కరించుకుని చేసిన తాజా సందేశంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ⇔ కోవిడ్–19 ప్రతికూల ప్రభావాల సమయాల్లోనూ బ్యాంక్ చక్కటి పనితీరును ప్రదర్శిస్తోంది. తగిన మూలధన నిల్వలను నిర్వహిస్తోంది. తాను మంజూరు చేసిన రుణాల విషయంలో ఎటువంటి ఒత్తిడినీ ఎదుర్కొనడంలేదు. ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో చక్కటి ఫలితాలను నమోదుచేసుకుంది. భవిష్యత్తులోనూ ఇదే ధోరణి కొనసాగుతుంది. ⇔ రుణాల పంపిణీ, వసూళ్లు వంటి అంశాలతో పాటు పలు విభాగాల్లో బ్యాంక్ సాంకేతికత వినియోగం ఎంతో ముందుంది. ⇔ ఉద్యోగులుగా మీరు చేయాల్సింది ఒకటే. ‘టీమ్ వర్క్’ చేయండి. పనిలో దార్శినికతను ప్రదర్శించండి. పోటీ తత్వంలో ఇది కీలకమైన అంశం. ఈ విషయంలో మనం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కృషి చేయండి. ⇔ కరోనా వైరస్ ప్రతికూల ప్రభావాల విషయంలో ఓటమిని బ్యాంక్ ఎప్పుడూ అంగీకరించలేదు. రెండు త్రైమాసికాల నుంచీ మంచి ఫలితాలను బ్యాంక్ నమోదుచేసుకుంటున్న విషయం ఇక్కడ ప్రస్తావనాంశం. ⇔ బ్యాంక్ ప్రకటించిన పండుగల సీజన్ ఆఫర్లను మార్కెట్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడానికి సోషల్ మీడియాను ఉద్యోగులు వినియోగించుకోవాలి. ⇔ బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు కరోనా–19 పూర్వపు స్థితికి క్రమంగా చేరుకుంటున్నాయి. అతి త్వరలోనే సాధారణ స్థాయికి చేరుకుంటాయి. ⇔ కరోనా వైరస్ మన అందరి జీవితాల్లోనూ అవరోధాలు కల్పించింది. ఈ వైరస్‌తోనే కొన్నాళ్లు జీవించాల్సి ఉంటుంది. కాకపోతే వాతావరణాన్ని, ఈ పరిస్థితిని భద్రం గా మార్చుకోవడం అన్నది మీపైనే ఉంటుంది. కష్టాల్లోనూ ఆశావాదంవైపు నడవాలి. అవకాశాలు వెతుక్కోవాలి. వైరస్ ఏదో ఒక రోజు వెళ్లిపోతుంది. ఆందోళన అక్కర్లేదు. ప్రత్యేక ఆఫర్లకు చక్కటి స్పందన... పండుగల సీజన్‌ను పురస్కరించుకుని ప్రకటించిన ‘ఫెస్టివ్ ట్రీట్స్’ గురించి హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేమెంట్ బిజినెస్ కంట్రీ హెడ్ పరాగ్‌రావు వివరిస్తూ, ఈ ప్లాట్‌ఫామ్ నుంచి బ్యాంకుకు సంబంధించిన అన్ని రకాల ప్రొడక్టులపై ప్రత్యేక ఆఫర్లను పొందొచ్చని తెలిపారు. రుణాల నుంచి క్రెడిట్ కార్డుల వరకు, ప్రముఖ విక్రేతలకు సంబంధించి 1,000 రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నట్టు ప్రకటించారు. ఎంతో అద్భుతమైన డిమాండ్ కనిపిస్తోందంటూ.. ఫెస్టివ్ ట్రీట్స్ ప్లాట్‌ఫామ్‌పై 30–35 శాతం తగ్గింపులను ఇస్తున్నట్టు చెప్పారు. మొబైల్స్, కన్జ్యూమర్ డ్యురబుల్స్, వస్త్రాలు, జ్యుయలరీ, డైనింగ్ విభాగాల్లో గత 2–3 నెలల్లో కస్టమర్ల ఆసక్తి పెరిగిందని, పండుగల సీజన్లోనూ ఇది కొనసాగుతుందని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
వచ్చే ఏడాది వేతనాల పెంపు ఎంతంటే...
వచ్చే ఏడాది భారత్‌లో వేతనాలు పెంపు 10 శాతం వరకు ఉంటుందని తాజా రిపోర్టు వెలువరించింది. ఆసియా-పసిఫిక్ రీజన్లో అన్ని దేశాలతో పోలిస్తే భారత్‌లోనే అత్యధిక మొత్తంలో ఈ పెంపు ఉంటుందని తెలిసింది. 2017లో కూడా ఇంతే మొత్తంలో పెంపు ఉన్నట్టు రిపోర్టు వెల్లడించింది. గ్లోబల్ అడ్వయిజరీ, బ్రోకింగ్, సొల్యుషన్స్ కంపెనీ విల్లిస్ టవర్స్ వాట్సన్ విడుదల చేసిన 2017 క్యూ3 శాలరీ బడ్జెట్ ప్లానింగ్ రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. వేతనాల పెంపు కూడా అత్యధికంగా ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, రిటైల్ రంగాల్లో చూస్తామని రిపోర్టు తెలిపింది. బీపీఓ, కెమికల్స్, కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్, కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అండ్ రిటైల్, ఫైనాన్సియల్ సర్వీసెస్, హైటెక్, మానుఫాక్ట్ర్చరింగ్, మీడియా, ఫార్మాస్యూటికల్ అండ్ హెల్త్ సైన్సెస్, బిజినెస్, టెక్నికల్ కన్సల్టింగ్, ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్ రంగాలను ఈ రిపోర్టు కవర్ చేసింది. ఆసియా పసిఫిక్‌లో 4000 మంది జూన్‌లో ఈ సర్వేను చేపట్టింది. భారత మార్కెట్ నుంచి 300 కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. అయితే ఏడాది ఏడాది పెరుగుతున్న కొద్దీ వేతనాల పెంపు కాస్త తక్కువగానే ఉంది. అయినప్పటికీ ఆసియా పసిఫిక్ రీజన్లో భారతే ముందంజలో ఉందని రిపోర్టు వెల్లడించింది. ఇతర దేశాలను చూస్తే ఇండోనేషియాలో 8.5 శాతం, చైనాలో 7 శాతం, ఫిలిప్పీన్స్‌లో 6 శాతం, హాంకాంగ్, సింగపూర్‌లో 4 శాతం పెంపును చూడొచ్చని ఈ రిపోర్టు తెలిపింది. ఆసియా-పసిఫిక్ రీజన్‌లోని దేశాలతో పోలిస్తే భారత్‌లో వేతనాల పెంపు చేపడుతూనే ఉందని, అయితే 2011 నుంచి తొలిసారి 2018లో సింగిల్ డిజిట్లో వేతనాల పెంపును చూడనున్నామని విల్లిస్ టవర్స్ వాట్సన్ డేటా సర్వీసెస్ ప్రాక్టిస్ లీడర్, ఆసియా పసిఫిక్, సంభవ్ రక్యాన్ అన్నారు. -
వెట్టిచాకిరి!
► సీఆర్డీఏలో ఆపరేటర్లు, అటెండర్ల విధులు దుర్భరం ► రెండేళ్లుగా రాత్రింబవళ్లు పనిచేసినా పెరగని వేతనం ► రోజువారీ కూలీలుగానే పరిగణిస్తున్న అధికారగణం ► జీవో 151 ఉన్నా పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు ► బతుకులు మారేదెలా అంటూ కన్నీటి పర్యంతం రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండేళ్లుగా రేయింబవళ్లు కష్టపడుతున్నారు. వారు లేనిదే భూములకు సంబంధించిన పాత, కొత్త రెవెన్యూ రికార్డులు బయటకు రాని పరిస్థితి. చివరకు చిన్న పేపర్ జిరాక్స్ తీయాలన్నా వారే చేయాలి. రైతుల నుంచి అవసరమైన సమాచారం సేకరించే విషయంలోనూ... ప్రభుత్వం నుంచి రైతులకు ఏదైనా తెలియజేయాలన్నా కీలక పాత్ర పోషించేది కూడా వారే. మొత్తంగా వారు లేనిదే ఆ 33 వేల ఎకరాలు సమీకరించడం కష్టమయ్యేది. అటువంటి ఆపరేటర్లు, అటెండర్లకు వేతనాలు పెంచటంలో వివక్ష చూపుతున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో : రాజధాని పరిధిలో 26 యూనిట్లలో 52 మంది ఆపరేటర్లు, మరో 52 మంది అటెండర్లు పనిచేస్తున్నారు. వీరిని 2015 జనవరిలో నియమించారు. ఆపరేటర్లకు నెలకు రూ.9,500, అటెండర్లకు నెలకు రూ.6,700 ఇస్తున్నారు. జీఓ నంబర్ 151 ప్రకారం ఆపరేటర్లకు రూ.15వేలు, అటెండర్లకు రూ.12వేలు చెల్లించాల్సి ఉంది. వేతనాలు పెంపు విషయమై వారు పలుమార్లు ఉన్నతాధికారులను కలిసి విన్నవించారు. అయితే అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. వాళ్లంతా రోజు కూలీలేనట .... ప్రభుత్వ అవసరాల కోసం నియమించిన వారిని ఉన్నతాధికారులు కొందరు రోజు కూలీల కిందే పరిగణిస్తున్నట్లు ఆపరేటర్లు, అటెండర్లు కన్నీరుపెడుతున్నారు. రాజధాని అవసరాల కోసం నియమించే సమయంలో నిబంధనల ప్రకారం వర్తించాల్సినవన్నీ వర్తిస్తాయని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వ పెద్దల అవసరాలు తీరాక... ‘ఉంటే ఉండండి, వెళ్లాలంటే వెళ్లిపోండి’ అంటూ హీనంగా చూస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో రేయింబవళ్లు పనిచేసిన ఆపరేటర్లు, అటెండర్లకు ఎటువంటి అధికారిక నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులను అడిగితే... ‘మీరు రోజు కూలీల కిందే లెక్క. పనిచేసిన రోజు కూలీ. పనిచేయని రోజు లేదు’ అని తేల్చిచెప్పినట్లు తెలిసింది. వేతనాలు, అధికారిక ఉత్తర్వుల కోసం ఎక్కడైనా, ఎప్పుడైన ధర్నా, ఆందోళనలు చేస్తే వెంటనే తొలగించి కొత్తవారిని నియమించుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. వేతనాలు పెంచి చెల్లించటం కుదరదని తేల్చిచెప్పినట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వ పెద్దల కార్యక్రమాలు ఉన్న ప్రతి రోజూ వేకువ జామునే కార్యాలయానికి చేరుకుని రాజ ధాని నిర్మాణానికి అవసరమైన రికార్డులను సిద్ధం చేసి ఇచ్చేవారు. ఆపరేటర్లు, అటెండర్లకు కనీసం సెలవులు కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సమయాల్లోనూ కొందరు అధికారులు వేధింపులకు గురిచేసే వారని కన్నీరుపెట్టుకున్నారు. పని పూర్తయ్యాకే వెళ్లమనే వారని, లేకపోతే ఆఫీసు నుంచి వెలుపలకు అడుగుపెట్టనిచ్చేవారు కారని భోరుమంటున్నారు. అటువంటి ఉద్యోగులకు నిబంధనల ప్రకారం వేతనాలు పెం చే విషయమై ప్రభుత్వ పెద్దలు వివక్ష ప్రదర్శిస్తుండటంపై కార్మిక సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్డీఏ పరిధిలో పనిచేస్తున్న ఆపరేటర్లు, అటెండర్లకు వేతనాలు పెంచటంతో పాటు... వారి నియామకాలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలని, లేకపోతే సీఆర్డీఏ కార్యాలయాల ముందు ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.