దేశీయ కంపెనీల ఉద్యోగులు ఈ సంవత్సరం సగటున 10 శాతం ఇంక్రిమెంట్లు పొందారు. ఆర్థిక అనిశ్చిత భయాలతో లేఆఫ్‌లు, ఒడిదుడుకులతో 2023 సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇంక్రిమెంట్లు డబుల్ డిజిట్ శాతం వైపు పయనాన్ని ప్రారంభించాయని నౌకరీ డాట్‌కామ్ (Naukri.com)నిర్వహించిన సర్వే పేర్కొంది.
నౌకరీ డాట్‌కామ్ సర్వే ప్రకారం.. ఈ ఏడాది ప్రతి 10 మంది ఉద్యోగులలో కనీసం ఆరుగురు 10 శాతం కంటే ఎక్కువగా ఇంక్రిమెంట్‌లు పొందారు. కనిష్టంగా కాస్త తక్కువే ఉన్నప్పటికీ అసాధారణ పనితీరు ఉన్న ఉద్యోగులు 20 నుంచి 25 శాతం ఇంక్రిమెంట్ పొందారు. ఈ సర్వేలో 2 లక్షల మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. తమ కంపెనీలు ఏప్రిల్ మార్చి మదింపు చక్రాన్ని అనుసరిస్తున్నాయని 56 శాతం మంది చెప్పారు.
బ్యాంకింగ్, తయారీ రంగాల్లో అధికంగా..
జాబ్ మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం వేతన పెంపు వేవ్ ఆశాజనకంగా ఉందని నౌకరీ డాట్ కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ అన్నారు. ఏప్రిల్-మార్చి వేతన పెంపులో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల ఉద్యోగులదే అత్యధిక వాటా.
వీరిలో చాలా మంది 10 నుంచి 20 శాతం ఇంక్రిమెంట్లు అందుకున్నారు. ఇంక్రిమెంట్ల శాతంలో హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్ రంగాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చాలా మంది ఉద్యోగులు గతేడాది కంటే మెరుగైన వేరియబుల్స్, బోనస్‌ల చెల్లింపులు ఈ ఏడాది పొందారు.
ఇదీ చదవండి: మాదేం లేదు! వర్క్ ఫ్రం ఆఫీస్‌పై ఇన్ఫోసిస్ సీఈవో కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment