
న్యూఢిల్లీ: ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి విద్యాలక్ష్మీ (పీఎం–విద్యాలక్ష్మీ) పథకాన్ని అందుబాటులోకి తెచి్చనట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. దేశంలోని టాప్ 860 నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థల్లో (క్యూహెచ్ ఈఐ) ప్రవేశం పొందిన విద్యా ర్థులు ఈ పథకం కింద రుణం కోసం అర్హులు.
రూ.7.5 లక్షల వరకు రుణాలకు 75% క్రెడిట్ గ్యారంటీ కూడా ఉంటుంది. విద్యార్థులు లేదా వారి కుటుంబాలు ఎటువంటి ఆస్తులను తన ఖాగా ఇవ్వాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు పీఎం–విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి విద్యా రుణం కోసం డిజిటల్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాంక్‌కు 8,300కి పైగా బ్రాంచ్‌లు, 12 ప్రత్యేక విద్యా రుణ ఆమోద కేంద్రాలు, 119 రిటైల్ అస్సెట్ ప్రాసెసింగ్ కేంద్రాలు ఉన్నాయి. అర్హులైన వి ద్యార్థులందరూ నాణ్యమైన విద్య పొందేందుకు అవ సరమైన ఆర్థిక తోడ్పాటు అందించ డం తమ లక్ష్యమని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముదలియార్ తెలిపారు.