Financial support
-
పీఎం-విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
ఢిల్లీ, సాక్షి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం- విద్యాలక్ష్మి పథకంతో పాటు పలు అంశాలకు ఆమోదం తెలిపింది. డబ్బు లేని కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకు దూరం కావద్దనే పీఎం- విద్యాలక్ష్మి పథక లక్ష్యం. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు పీఎం-విద్యాలక్ష్మి ద్వారా ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. నాణ్యత కలిగిన 860 ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించనుంది. రూ. ఏడున్నర లక్షల వరకు రుణ సౌకర్యం అందించనుంది. ఈ పథకం ద్వారా 75 శాతం క్రెడిట్ గ్యారెంటీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. పీఎం-విద్యాలక్ష్మి ద్వారా ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి పొందనున్నారు.#WATCH | Delhi: After the Union Cabinet meeting, Union Minister Ashwini Vaishnaw says, "FCI plays a very big role in the procurement of food. It has been decided today to significantly strengthen the Food Corporation of India (FCI)...Today, the cabinet has decided fresh equity… pic.twitter.com/TL26u6xS2G— ANI (@ANI) November 6, 2024 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు రూ. 10,700 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఎఫ్‌సీఐ ఆపరేషన్ సామర్థ్యం పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. ‘‘2004-14తో పోల్చితే 2014-24 మధ్య నాలుగు రెట్లు అధికంగా రైతులకు ఆహార సబ్సిడీ అందింది’’ అని అన్నారు. #Cabinet approves PM-Vidyalaxmi scheme to provide financial support to meritorious students so that financial constraints do not prevent any youth of India from pursuing quality higher educationUnder the scheme, any student who gets admission to a Quality Higher Education… pic.twitter.com/Z8C3fllXuo— PIB India (@PIB_India) November 6, 2024 -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
-
మరోసారి ఉదారత చాటుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ఉదారత చాటుకున్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్ధి కలను సాకారం చేసేందుకు ఆర్ధిక భరోసా కల్పించారు. వివరాలు.. పాలకొల్లుకు చెందిన జహ్నవి దంగేటి ఏవియేషన్ శిక్షణకు గతంలో ఏపీ ప్రభుత్వం రూ. 50 లక్షల సాయం అందజేసింది. గతేడాది జూలైలో రాజమహేంద్రవరం పర్యటన సందర్భంగా సీఎంజగన్ జాహ్నవికి ఈ సాయం అందించారు. తాజాగా రాజమహేంద్రవరం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ నుంచి వరద బాధితులను పరామర్శించేందుకు కోనసీమ జిల్లాకు బయలుదేరుతున్న ముఖ్యమంత్రిని జాహ్నవి కలిశారు. పైలెట్ ఆస్ట్రొనాట్ అవ్వాలన్న తన కోరికను అర్థం చేసుకొని ఉన్నత చదువుకు చేసిన సాయానికి వైఎస్ జగన్‌కు జాహ్నవి, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడాలో కమర్షియల్ పైలెట్ శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్ధిక సాయం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేయగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా గతంలో ప్రభుత్వం చేసిన ఆర్ధిక సాయంతో గ్రామీణ ప్రాంతానికి చెందిన జాహ్నవి ఐఐఏఎస్ ఫ్లోరిడా, యూఎస్ఏ నుంచి సైంటిస్ట్ వ్యోమగామి అభ్యర్థిగా సిల్వర్ వింగ్స్ అందుకున్నారని సీంఎ జగన్‌కు సమాచార శాఖ మంత్రి వేణుగోపాల్ వివరించారు. ఇప్పటికే జాహ్నవి నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. అయితే భారత సంతతికి చెందిన కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్‌లా అంతరిక్షంలోకి అడుగుపెట్టాలన్న సంకల్ప స్ఫూర్తితో ముందుకెళుతున్నట్లు వైఎస్ జగన్‌కు జాహ్నవి వివరించారు. చదవండి: గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి: సీఎం జగన్ -
సాయిచంద్, జగదీశ్ కుటుంబాలకు కోటిన్నర చొప్పున సాయం.. కేటీఆర్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మృతి చెందిన భారత్ రాష్ట్ర సమితి యువ నాయకుల కుటుంబాలను ఆదుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారకరామారావు వారి కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు. ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్, తెలంగాణ ఉద్యమంలో గాయకుడిగా ప్రజల్లో చైతన్యం రగిల్చిన రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. సాయిచంద్ (ఫైల్) ఈ యువ నాయకుల కుటుంబాలకు కోటిన్నర రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒకనెల వేతనంతో ఈ సాయం అందించనున్నట్లు శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాకు చెప్పారు. వారి తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు, భార్యకు కోటి రూపాయల లెక్కన అందిస్తామని పేర్కొన్నారు. జగదీశ్ (ఫైల్) కాగా, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉంటూ వేదసాయిచంద్ ఆకస్మికంగా మరణించడంతో ఆయన భార్య వేద రజనికి అదే సంస్థ చైర్మన్ పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని కేటీఆర్ చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాయిచంద్ కుటుంబాన్ని శుక్రవారం ప్రభుత్వ విప్ బాల్కసుమన్, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ పరామర్శించారు. రజనికి రూ.1.5 కోట్ల సాయానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. -
పేద విద్యార్థికి సాయం.. కేఎల్ రాహుల్ మంచి మనసు
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఒక పేద విద్యార్థికి సహాయం చేసి తన పెద్ద మనసు చాటుకున్నాడు. విషయంలోకి వెళితే.. హుబ్బళ్లి పరిధిలోని మహాలింగపురకు చెందిన అమృత్ మావినకట్టి అనే విద్యార్థి పీయూసీలో 600కు గాను 571 మార్కులు సాధించాడు. పై చదువులకు డబ్బులు లేక, దాతల కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో హుబ్బళ్లికి చెందిన నితిన్ అనే వ్యక్తి అమృత్‌ను ఓ ప్రైవేట్ కాలేజీలో చేర్చేందుకు ప్రయత్నించారు. బీకాంతో పాటు సీఏ కోర్సులో చేరేందుకు ఏడాదికి రూ.85 వేలు చెల్లించాల్సి ఉంది. దీంతో నితిన్ తన స్నేహితుడు అక్షయ్ సాయం కోరాడు. కేఎల్ రాహుల్‌కు మిత్రుడైన అక్షయ్ విద్యార్థి సమస్యను ఆయనకు వివరించారు. వెంటనే స్పందించిన రాహుల్.. ఫీజులతో పాటు పుస్తకాల కొనుగోలు, ఇతర అవసరాలకు సరిపడా డబ్బులను నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. కేఎల్ రాహుల్ సాయం తనకు అందిందని.. అతని అండతో ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానంలో నిలవడానికి ప్రయత్నిస్తానని విద్యార్థి అమృత్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2023లో ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో రాహుల్ సీజన్ మధ్యలోనే వైదొలిగాడు. అదే నెలలో బీసీసీఐ అనుమతితో భార్య అతియా శెట్టితో కలిసి జర్మనీకి వెళ్లిన కేఎల్ రాహుల్ మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రీహాబిటేషన్‌లో ఉన్న అతను ఎప్పుడు మళ్లీ క్రికెట్లోకి అడుగుపెడతాడనేది క్లారిటీ లేదు. అయితే అక్టోబర్ -నవంబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. KL Rahul has financially helped a deserving (95%) student named Amrut Mavinkatti, who lost his mother from Mahalingapura to study B. Com at Hubballi’s KLE College through Akshay Sir. Man With Golden Heart @KLRahul 🥺❤ pic.twitter.com/6xcT9pEsx6 — KLRAHUL TRENDS™ (@KLRahulTrends_) June 11, 2023 చదవండి: కోహ్లి అలా చేస్తాడని అస్సలు ఊహించలేదు.. అది అతడికే తెలియాలి: గంగూలీ -
గొప్పమనసు చాటుకున్న నిర్మాత.. లైట్‌మన్ కుటుంబానికి ఆర్థికసాయం
నటుడు సత్యరాజ్, వసంత రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వెపన్'. ఎంఎస్.మన్సూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇటీవల ఈ చిత్ర షూటింగ్లో ఓ దుర్ఘటన జరిగింది. ఎస్.కుమార్ అనే లైట్‌మన్ ప్రమాదవశాత్తూ మరణించాడు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీని పెద్దలే తాకట్టు పెట్టారు: నట్టి కుమార్ సంచలన కామెంట్స్) దీంతో అతని కుటుంబానికి వెపన్ చిత్ర నిర్మాత ఎంఎస్. మన్సూర్ రూ.12 లక్షలు ఆర్ధిక సాయం చేశారు. ఈ మొత్తాన్ని బుధవారం చెక్కు రూపంలో లైట్‌మన్ కుమార్ భార్య జూలియట్, పిల్లలకు ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.పెల్వమణి, లైట్స్‌మన్ యూనియన్ అధ్యక్షుడు సెంథిల్, మేనేజర్ కందన్ల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా నిర్మాత మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ లైట్‌మన్ కుమార్ మృతి తన కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినట్లు బాధిస్తోందన్నారు. వృత్తి కోసం రేయింబవళ్లు శ్రమించిన వ్యక్తి మరణం మనసును కలచివేస్తోందన్నారు. కుమార్ లేని లోటు అతని కుటుంబానికి ఎవరూ తీర్చలేనిదన్నారు. అందుకే తాను ఓదార్పుగా చిన్న మొత్తాన్ని సాయం చేసినట్లు తెలిపారు. (ఇది చదవండి: దక్షిణాదిలో స్టార్ క్రేజ్.. అక్కడేమో ఒక్క హిట్ కోసం తంటాలు!) -
టాటా డీలర్లకు ఐసీఐసీఐ గుడ్ న్యూస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ డీలర్స్కు గుడ్ న్యూస్. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్‌తో టాటా మోటార్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టాటా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలను విక్రయించే డీలర్లకు ఐసీఐసీఐ బ్యాంకు రుణం సమకూరుస్తుంది.తీసుకున్న రుణాన్ని సౌకర్యవంతంగా తిరిగి చెల్లించేలా కాల పరిమితి ఉంటుంది. టాటాకు చెందిన డీజిల్, పెట్రోల్ వాహనాలను విక్రయిస్తున్న డీలర్లకు ఇప్పటికే ఈ బ్యాంక్ రుణం అందిస్తోంది. -
మంచి మాట..: ఏది నిజమైన సంపద?
సంపద అంటే చాలామంది దృష్టిలో, భవంతులు, పొలాలు. మరికొందరికి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు. ఇంకొందరి భావనలో వాహనాలు, ఇళ్ళ స్థలాలు. కషీవలుడికి పంట, పశువులు, పండితుడికి జ్ఞానం... ఇలా సంపదను ఎన్నో రకాలుగా భావించి నిర్వచించవచ్చు. ఇది లౌకిక దృష్టి, సహజమైనది. ఆ రకమైన సంపద మన జీవనానికి అవసరమైనది. అయితే, సంపదంటే కేవలం ఇదే కాదు, ఈ భావనలకు లేదా మరికొన్ని ఇటువంటి భావనలకే ఈ మాట అర్థాన్ని పరిమితం చేయలేం. ఇది అర్థమయితేనే దాని లోతైన, విస్తృతార్థం బోధపడుతుంది. ఇహపరమైన సంపద ఏ రూపంలో ఉన్నా, తరతరాలకు తరగనిదైనా ఎవరి దగ్గర ఉన్నా వారికి తృప్తి అనేది ఉండాలి. తమ శక్తి మేరకు కూడబెట్టామన్న ఆలోచన రావాలి. ఇంకా ఎక్కువ పొందాలి అన్న తీవ్రమైన కోరిక కూడదు. అది ఉన్నవారు ప్రశాంతతకు దూరమవుతారు. అపార సంపన్నులైనా పరిమిత ప్రాథమిక అవసరాలతో, కోరికలతో నిరాడంబర జీవితం గడపగలగాలి. తమ తోటి వారికి ఆర్ధిక సహాయం చేయగలిగే దృష్టి రావాలి. ఆపన్నులకు చేయాత నివ్వాలన్న భావన రావాలి. ఇలా ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన నిజమైన సంపద. ఈ తృప్తి, నిరాడంబర జీవితం, పక్కవారిని ఆదుకోవాలన్న ఆలోచన ఉన్న వారు ఎంత పేదవారైనా ఐశ్వర్యవంతులే. ఆ ఆలోచన లేని వారు ఎంత ధనవంతులైనా అభాగ్యులే. గురువుల నుండి నేర్చుకున్న విద్యకు మెరుగు లు దిద్ది మన పరిశీలనా దృష్టితో దానిని మరింతగా వృద్ధి చేసుకోవాలి. ఇతరులకు అందివ్వగలగాలి. అపుడు అదెంతో సుసంపన్నమవుతుంది. ఇలా గురువులే కాదు ఇతరులూ చేయవచ్చు. గురువుల జ్ఞానం లేదా పాండిత్యం వారి శిష్యప్రశిష్యుల ద్వారా సర్వవ్యాపితమై అ దేశం జ్ఞాన సంపదగా నిక్షిప్తమవుతుంది. ‘మిడాస్ టచ్’ అనే కథలో ఒక రాజు తను ముట్టుకున్నది ప్రతిది బంగారంగా మార్చగల వరం పొందాడు. ఇక తన ఆనందానికి అవధులే లేవనుకుంటూ తన రాజభవనంలోని ప్రతి దానిని ముట్టుకుని హేమమయం చేసుకున్నాడు. తను తినే ఆహారం, తాగే మంచి నీరు, చివరకు తన కూతురు బంగారు విగ్రహంగా మారి పోవటం చూసి నిశ్చేష్టుడై, తన వరాన్ని వెనుకకు తీసుకోమని ఆ దేవతను వేడుకున్నాడు. నిజమైన ప్రేమ, అనుబంధాలు ముఖ్యమైన వని, అవే నిజమైన సంపదని గ్రహించాడు. నిజమైన సంపద ఇహపరమైనది కాదు. దానిని మన భౌతిక సంపదతో కొలవలేం. మన వ్యక్తిత్వం, గుణశీలత, మానవీయతలను మన ముందు తరాలవారికి వారసత్వంగా ఇవ్వగలగాలి. అదే నిజమైన సంపద. ఒక దేశంలోని అద్భుత కట్టడాలు సృజనశీలురు వారి అపురూప సృష్టి, సంగీత, సాహిత్య ప్రవాహాలు, శిల్ప సంపద, జీవనవిధానం, ఆహారం, నాట్యం, చలనచిత్రాలు, శాస్త్రవేత్తల అద్భుత మేధస్సు.. వీటి కలయిక ఆ దేశ సంస్కృతిగా భావన చేస్తారు. ఈ సంస్కృతి ఆ దేశ సంపదవుతుంది. వీటికి మనం జత చేయవలసిన అంశాలు ఆ దేశ ప్రజల నీతి, నిజాయితీ, నైతిక వర్తన, నిబద్ధత, వ్యక్తిత్వం, వారి ఆలోచనా తీరు. ఇవి వారికి వారసత్వసంపదగా వచ్చిన సంస్కృతిని మరింత ఉదాత్తంగా చేస్తుంది. ఇహపరమైన సంపదే కాకుండా ప్రతి ఒక్కరికీ సహజసిద్ధమైన చక్కని లక్షణాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఆలోచనలు. మనల్ని సక్రమమార్గంలో పయనింపచేసే పథాలు. మనలోని అంతర్గత శక్తులకు సరైన ఆకృతి వీటివల్లే వస్తుంది. ఆలోచనలు మనిషి వ్యక్తిత్వ వికాసాన్నే కాదు సమాజ, దేశ వికాసాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. దేశ ప్రజల సక్రమ ఆలోచనా సరళి దేశ సంపదగానే భావించాలి. – బొడ్డపాటి చంద్రశేఖర్, అంగ్లోపన్యాసకులు -
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, అదనంగా వందల కోట్లు కేటాయించిన కేంద్రం!
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)కు రూ. 820 కోట్ల అదనపు నిధుల కేటాయింపు ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. దేశంలోని అన్ని పోస్టాఫీసులకు తన సేవలను విస్తరించేందుకు ఐపీపీబీ ఈ నిధులను వినియోగించుకుంటుంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు ఈ విషయాన్ని తెలిపారు. 1.56 లక్షల పోస్టాఫీసులలో ఐపీపీబీ ప్రస్తుతం 1.3 లక్షల పోస్టాఫీసుల నుండి పనిచేస్తోందని తెలిపారు. రెగ్యులేటరీ అవసరాలు, సాంకేతిక అప్గ్రేడేషన్ల కోసం ఐపీపీబీకి రూ.500 కోట్ల కేటాయింపులకు క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని కూడా ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు లక్ష్యం: ఐపీపీబీ తన బ్యాంకింగ్ సేవలను 1,56,434 పోస్టాఫీసులకు విస్తరించబోతున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలు, తల్లులు, సోదరీమణులు బ్యాంకింగ్ సౌకర్యాన్ని పొందేందుకు వీలుగా రూ. 820 కోట్ల పెట్టుబడి పెట్టాలని కేంద్ర క్యాబినెట్ తాజా నిర్ణయం తీసుకుందని ఠాకూర్ పేర్కొన్నారు. అధికారిక ప్రకటన ప్రకారం, రెగ్యులేటరీ అవసరాలను తీర్చడానికి ఈక్విటీ పెట్టుబడిగా ఐపీపీబీ ఏర్పాటుకు సంబంధించి ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ. 1,435 కోట్ల నుండి రూ. 2,255 కోట్లకు సవరించడానికి కూడా క్యాబినెట్ ఆమోదముద్ర పడింది. సామాన్యులకు అత్యంత అందుబాటులో, సరసమైన, విశ్వసనీయమైన, పారదర్శకమైన బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రాజెక్ట్ లక్ష్యమని ఆ వర్గాలు వెల్లడించాయి. అందరికీ బ్యాంకింగ్ సదుపాయం లభ్యత, ఆర్థిక సేవల విస్తరణ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడం, నగదు రహిత వ్యవస్థ దిశగా అడుగులు, తదనుగుణమైన ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు ధ్యేయమని కూడా పేర్కొన్నాయి. ప్రస్తుతం ఐపీపీబీ ఇలా.. ఒక అధికారిక ప్రకటన ప్రకారం, ఐపీపీబీ 1.36 లక్షల పోస్టాఫీసులను బ్యాంకింగ్ సేవలను అందించడానికి వీలు కల్పించింది. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందించడానికి దాదాపు 1.89 లక్షల మంది పోస్ట్‌మెన్, గ్రామీణ డాక్ సేవక్‌లకు స్మార్ట్‌ఫోన్, బయోమెట్రిక్ పరికరాలను సమకూర్చింది. ఐపీపీబీ 2018 సెప్టెంబర్‌లో 650 శాఖలు/నియంత్రణ కార్యాలయాలతో ప్రారంభమైంది. ప్రారంభించినప్పటి నుండి, ఇది మొత్తం 82 కోట్ల ఆర్థిక లావాదేవీలతో 5.25 కోట్లకు పైగా ఖాతాలను తెరిచింది. లావాదేవీల విలువ రూ.1,61,811 కోట్లు. రూ. 21,343 కోట్ల విలువైన 765 లక్షల ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ లావాదేవీలను కలిగి ఉంది. 5 కోట్ల ఖాతాలలో 77 శాతం ఖాతాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. 48 శాతం మహిళా ఖాతాదారులు సుమారు రూ. 1,000 కోట్ల డిపాజిట్‌తో ఉన్నారు. దాదాపు 40 లక్షల మంది మహిళా ఖాతాదారులు తమ ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ప్రయోజనం పొందారు. దీని విలువ దాదాపు రూ.2,500 కోట్లు. పాఠశాల విద్యార్థుల కోసం 7.8 లక్షలకు పైగా ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
ప్రియ చదువు కోసం.. మొత్తం ఊరే కదిలింది!
జ్ఞానం, నైపుణ్యం ఉన్నా.. సరైన ప్రోత్సాహం లేక ముందుకు వెళ్లలేక ఆగిపోతున్నారు ఎందరో. మన దేశంలో ఆర్థిక పరిస్థితులు సహకరించక మధ్యలోనే వదిలేస్తున్న పిల్లల్ని చూస్తున్నాం. పదో తరగతిలో టాపర్‌గా నిలిచిన ప్రియాకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అమ్మ, నాన్నమ్మల కాయకష్టంతో.. కష్టపడి చదువుకుంది. స్టేట్ టాపర్‌గా నిలిచిన చదువుల బిడ్డకు.. ఉన్నత చదువుల కోసం డబ్బుల్లేవు. ఇలాంటి తరుణంలో ఊహించని సాయం.. ఆమె చదువు బండి ముందుకు వెళ్లడానికి చేతులు చాచింది. ప్రియాన్షు కుమారి.. తండ్రి కౌశలేంద్ర శర్మ ఆమె పసితనంలో ఉన్నప్పుడే చనిపోయాడు. కొద్దిరోజులకే కుటుంబ పెద్దగా ఉన్న తాత కూడా అనారోగ్యంతో కన్నుమూశాడు. అప్పటి నుంచి నాన్నమ్మ, అమ్మ.. ఇద్దరూ ఆ ఇంటిని, ప్రియాన్షు, ఆమె సోదరి పోషణను చూసుకుంటూ వస్తున్నారు. వచ్చే సంపాదనతో ఆ ఇద్దరు ఆడబిడ్డలకు మంచి బట్ట, తిండితో పాటు చదువును సైతం అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో.. ప్రియాన్షు ఈ ఏడాది బోర్డు ఎగ్జామ్‌లో 472 మార్కులతో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఈ వార్త తెలియగానే ఆ కుటుంబమే కాదు.. ఊరు మొత్తం సంబురాలు చేసుకుంది. కష్టపడి చదువుకున్న ప్రియాన్షు గురించి ఆ ఊరికి బాగా తెలుసు. అందుకే ఆ ఊరి మాజీ సర్పంచ్, రిటైర్డ్ సైనికుడు సంతోష్ కుమార్.. ఆమె పైచదవులకు అవసరమయ్యేందుకు కొంత డబ్బును అందించాడు. ఇది తెలిసి.. ఊరు ఊరుకుంటుందా?.. మొత్తం కదిలింది. స్టేట్ టాపర్‌గా నిలిచి.. ఎక్కడో బీహార్‌లోని మారుమూల పల్లె సుమేరా పేరును హెడ్‌లైన్స్‌లో నిలిపింది ప్రియా. అందుకే ఆమె చదువులు ఆగిపోకూడదని నిర్ణయించుకుంది. ఆ తల్లులను విశ్రాంతి తీసుకోమని కోరుతూ.. ప్రియా చదువుల కోసం కొంత ఆర్థిక సాయం అందించింది. అంతేకాదు.. సాయం చేయడానికి ఎవరైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ముందకు వస్తారేమో.. వద్దని అంటున్నారు ఆ ఊరి ప్రజలు. తమ ఊరి బిడ్డను తామే చదివించుకుని.. ఆమె ఉన్నత లక్ష్యమైన సివిల్స్ కలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు కూడా. -
రషీద్ ఖాన్ మంచి మనసు.. యంగ్ బౌలర్‌కి ఆర్థిక సాయం!
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ దిగ్గజం రషీద్ ఖాన్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ అండర్-19 క్రికెటర్ బిలాల్ సమీకి రషీద్ ఆర్థిక సహాయాన్ని అందించాడు. కాగా సమీ ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ ఆఫ్ఘాన్ జట్టులో భాగమై ఉన్నాడు. అండర్-19 ప్రపంచకప్ ముగిసిన తర్వాత సమీ తన బౌలింగ్ యాక్షన్‌పై ఇంగ్లండ్‌లో శిక్షణ పొందడానికి రషీద్ ఆర్థిక సహాయం చేశాడు. "అండర్-19 ఆటగాడు బిలాల్ సమీకి ఇంగ్లండ్‌లో శిక్షణ పొందడానికి ఆర్థిక సహాయం చేసిన రషీద్ ఖాన్ ధన్యవాదాలు. రషీద్ తన సహాయంతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు" అని ఇబ్రహీం మొమండ్ అనే ట్విటర్ యూజర్ ట్వీట్ చేశాడు. కాగా రషీద్ ఖాన్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. ఇక ఐపీఎల్- 2022 మెగా వేలానికి ముందు రషీద్ ఖాన్‌ను అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రూ.15 కోట్లకు సొంతం చేసుకుంది. చదవండి: IND vs WI: ఇప్పుడు ఇంగ్లండ్ పని అయిపోయింది.. తరువాత టీమిండియానే: పొలార్డ్ -
40వేల కోట్లు సాయం చేయండి ప్లీజ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్.. రూ.40,000 కోట్ల ఆర్థిక సాయం కోసం కేంద్రాన్ని ఆశ్రయించింది. ఇందులో సగం స్వల్పకాలిక రుణాన్ని చెల్లించడానికి సార్వభౌమ హామీ రూపంలో అవసరమని విన్నవించింది. ‘అదనపు రుణం సంస్థకు అవసరం లేదు. కార్యకలాపాలను నిర్వహించేందుకు వ్యాపారం నిలకడగా మారింది. ఒక లక్ష మొబైల్ సైట్లను ఏర్పాటు చేసేందుకు రూ.20,000 కోట్లు కావాలి’ అని బీఎస్ఎన్ఎల్ సీఎండీ పి.కె.పూర్వార్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు కలిపి కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రకటించిన రూ.69,000 కోట్ల ఉపశమన ప్యాకేజీకి ఇది అదనమని అన్నారు. ప్రస్తుతం సంస్థ రుణ భారం రూ.30,000 కోట్లుంది. టెలికం రంగంలో ఇదే తక్కువ అని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. 2019–20లో బీఎస్ఎన్ఎల్ నష్టాలు రూ.15,500 కోట్లుంటే.. ఇది గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,441 కోట్లకు వచ్చి చేరింది. -
టీమిండియా క్రికెటర్ల పెద్ద మనసు.. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం
ముంబై: కరోనా మహమ్మారితో దేశం మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు కరోనా బారీన పడుతుండగా.. మరికొంతమంది ప్రాణాలు వదులతున్నారు. ఆ కోవకు చెందినవారే సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ రుచిర్ మిశ్రా. మిశ్రా టైమ్స్ ఆఫ్ ఇండియాలో పదేళ్లుగా స్పోర్ట్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఈ పదేళ్ల కాలంలో ఆయన టీమిండియా స్వదేశంలో ఆడిన ప్రతీ మ్యాచ్‌తో పాటు డొమస్టిక్ లీగ్‌లను కవర్ చేసేవాడు. మంచి స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా పేరు సంపాదించిన మిశ్రాకు పలువురు టీమిండియా క్రికెటర్లు పరిచయమయ్యారు. ఇలా ఆనందంగా సాగుతున్న అతని జీవితంలో కరోనా పెను విషాదం నింపింది. కొన్ని రోజుల కిందట రుచిర్ మిశ్రా కరోనా బారీన పడి మే4న నాగ్‌పూర్‌లో కన్నుమూశారు. దీంతో అతని కుటుంబం కష్టాల్లో పడింది. వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు రుచిర్ మిశ్రా ఒక ఫండ్ రైజర్‌ను స్థాపించి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది తెలుసుకున్న టీమిండియా క్రికెటర్లు ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారా, టీమిండియా వుమెన్స్ కోచ్ రమేశ్ పొవార్‌లు స్పందించారు. ఉమేశ్ రూ. లక్ష విరాళం ఇవ్వగా.. అశ్విన్, పుజారా, పొవార్‌లు రూ. 50 వేలు విరాళంగా ఇచ్చి పెద్ద మనుసు చాటుకున్నారు. మీ ఇంటి పెద్దని మేం తీసుకురాలేకపోవచ్చు.. కానీ మేమిచ్చే ఈ డబ్బు మీ ఆర్థిక పరిస్థితి బాగుండేలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం.. అంటూ క్రికెటర్లు పేర్కొన్నారు. కాగా మిశ్రా కుటుంబానికి క్రికెటర్లు చేసిన సాయం తెలుసుకొని వసీం జాఫర్ సహా మరికొందరు సెలబ్రిటీలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇక కరోనా సెగతో ఐపీఎల్ 14వ సీజన్‌ను బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆటగాళ్లంతా ఇంటికి చేరుకున్నారు. కివీస్‌తో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు సమాయత్తమవుతున్న టీమిండియా జూన్ 2న ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది. జూన్ 18 నుంచి 22 వరకు టీమిండియా కివీస్‌తో ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడనుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది. చదవండి: క్రికెటర్ భువనేశ్వర్ ఇంట్లో విషాదం I just contributed to this family! If you are from the cricket fraternity and would like to donate. Please do so🙏🙏 https://t.co/3P8q7tht2d pic.twitter.com/12LfO51Dx8 — Mask up and take your vaccine🙏🙏🇮🇳 (@ashwinravi99) May 20, 2021 -
‘మా లేఖపై మోదీ ఇప్పటివరకు స్పందించలేదు’
సాక్షి, హైదరాబాద్: వరద సాయంపై ప్రతిపక్ష నేతలు బురద రాజకీయం చేస్తున్నారని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 లక్షల 30 వేల కుటుంబాలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించామని తెలిపారు. హైదరాబాద్‌లోని నాలాలపై అక్రమ నిర్మాణాలున్నాయని, భారీ వర్షాలతో అపార నష్టం జరిగిందని వెల్లడించారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌తో రాబోయే విపత్తును ఎదుర్కొన్నామని, ప్రాణ నష్టం జరగకుండా చూశామని తెలిపారు. వరద సహాయక చర్యలపై ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్థికంగా ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తే ఇప్పటి వరకు ప్రధాని స్పందించలేదని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణపై ప్రధాని మోదీ వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అడిగిన వెంటనే సాయం చేస్తున్నారని అన్నారు. కర్ణాటక సీఎం లేఖ రాసిన నాలుగు రోజుల్లోనే స్పందించారని గుర్తు చేశారు. గుజరాత్ కూడా వరద సహాయం ప్రకటించారని తెలిపారు. ‘8,800 కోట్లు నష్టం జరిగిందని బీజేపీవాళ్లు చెప్పారు. మన నగరం మన బీజేపీ అంటున్నారు. ఎక్కడుంది వరద సాయం ఇవ్వని బీజేపీ మన నగరంలో ఎక్కడుంది. ఒక్క పైసా ఇవ్వలేని అసమర్ధులు.. మీరా మమ్మల్ని విమర్శించేది?’ అని బీజేపీ నేతలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. కిషన్‌రెడ్డి సహాయ మంత్రా? నిస్సహాయత మంత్రా చెప్పాలని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని కేటీఆర్ జోస్యం చెప్పారు. -
కృష్ణా పోలీసుల పెద్ద మనసు
సాక్షి, కృష్ణా/కైకలూరు: దళితులపై దాడులకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించవద్దన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. బాధితులకు అండగా నిలవడమే కాకుండా తమ సేవాగుణాన్ని కూడా చాటుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో ఒక దళిత యువతి విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం అయినంపూడి గ్రామానికి చెందిన దళిత యువతి (22) అదే మండలం వడాలికి చెందిన మంద సాయిరెడ్డి(24) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే యువతిని వివాహం చేసుకునేందుకు సాయిరెడ్డి నిరాకరించడంతో ఆమె ముదినేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు సాయిరెడ్డిని రిమాండ్‌కు తరలించారు. యువతిని కొంతమంది బెదిరించడంతో మరో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు యువతి ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ఘటనపైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: నెల్లూరులో బాలుడి కిడ్నాప్ కలకలం) పోలీసుల సేవా గుణం ఇంటి దగ్ధం విషయం తెలుసుకున్న కృష్ణా జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో గుడివాడ డీఎస్పీ ఎన్. సత్యానందం సిబ్బందితో గురువారం బాధితుల వద్దకు వెళ్లి రూ.25 వేలు నగదు, మరో రూ.25వేలు విలువ చేసే నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలు అందించారు. ఇంటి నిర్మాణానికి పోలీసుల తరఫున పూర్తి సాయం అందిస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇల్లు దగ్ధం కేసులో విచారణ జరుపుతున్నామని చెప్పారు. ముఖ్యంగా అర్ధరాత్రి ఇల్లు దగ్ధమవుతున్న సమయంలో ఎస్ఐ మణికుమార్ తన సిబ్బందితో కలిసి మంటలు అదుపు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. దాడులకు పాల్పడుతున్నవారి విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాధితులకు భరోసా కల్పిస్తోందని దళిత సంఘాలు అభినందిస్తున్నాయి. -
టర్మ్‌ప్లాన్‌తో మెరుగైన బీమా రక్షణ
జీవిత బీమా తీసుకోవడం అంటే.. తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా ఇవ్వడమే. అయితే, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను అచ్చమైన జీవిత బీమా అని చెప్పుకోవాలి. ‘‘టర్మ్ ప్లాన్ అయితే, తక్కువ ఖర్చు (ప్రీమియం)కు గరిష్ట బీమా కవరేజీనిస్తుంది. టర్మ్ ప్లాన్ ను ఇప్పుడు 99 ఏళ్లకు మించిన కాలానికీ తీసుకునే అవకాశం ఉంది. టర్మ్ ప్లాన్‌లో చెల్లించే ప్రీమియం వెనక్కి రాదని తెలిసిందే. పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు జీవించి ఉంటే కట్టిందంతా వ్యర్థమే అవుతుందన్న ఆలోచనతో కొంత మంది టర్మ్ ప్లాన్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో బీమా కంపెనీలు పాలసీ కాల వ్యవధి తీరే వరకు జీవించి ఉంటే కట్టిన ప్రీమియంను వెనక్కిచ్చే ఫీచర్‌తోనూ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. వీటి మధ్య సారూప్య, వ్యత్యాసాలను చూస్తే.. రెగ్యులర్ టర్మ్ ప్లాన్లు అచ్చమైన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ నిర్దేశిత కవరేజీతో, నిర్ణీత కాలానికి అందించేది. 5 నుంచి 45ఏళ్ల కాలానికి బీమా కవరేజీ లభిస్తుంది. పాలసీదారు పాలసీ కాల వ్యవధిలో మరణానికి గురైతే నామినీకి బీమా మొత్తాన్ని అందిస్తుంది. ఏకమొత్తంలో లేదా ఏటా నిర్ణీత శాతం చొప్పున ఎంచుకున్న ప్లాన్ ఆప్షన్ ఆధారంగా చెల్లింపులు ఉంటాయి. పాలసీ కాలవ్యవధి ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే ఎటువంటి ప్రయోజనాలు వెనక్కి రావు. పాలసీదారుకు జీవిత కాలం పాటు సంపూర్ణ కవరేజీ అన్నది ఇందులో లభిస్తుంది. కేవలం మరణానికి కవరేజీ మాత్రమే లభిస్తుంది. భరించగలిగే ప్రీమియంతో వచ్చే ప్లాన్ ఇదొక్కటే. ప్రీమియం అన్నది పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు స్థిరంగా (మార్పు లేకుండా) ఉంటుంది. ప్రీమియం వెనక్కిచ్చే టర్మ్ ప్లాన్ దురదృష్టవశాత్తూ మరణానికి గురైతే తన కుటుంబానికి పరిహారం రావాలి. ఒకవేళ పాలసీ గడువు తీరే వరకు జీవించి ఉన్నా ఎంతో కొంత వెనక్కి రావాలని ఆలోచించే వారు చాలా మంది ఉన్నారు. రిటర్న్ ఆఫ్ ప్రీమియం (ఆర్వోపీ) టర్మ్ ప్లాన్లు ఈ కోవకు చెందినవే. వీటిల్లో గడువు తీరే వరకు పాలసీదారు జీవించి ఉంటే కట్టిన ప్రీమియం మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. పాలసీదారుకు హామీపూర్వక విలువను ఆఫర్ చేస్తుంది. పాలసీదారుగా మీ ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా పాలసీ కాల వ్యవధిని ఎంచుకోవచ్చు. తమకు ఎంతో కొంత వెనక్కి రావాలని ఆశించేవారికి ఆర్వోపీ టర్మ్ ప్లాన్ అన్నది విలువకు తగిన పాలసీ అవుతుంది. సాధారణంగా 20, 25, 30, 40 ఏళ్ల టర్మ్ తో ఈ పాలసీలు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు మీరు 20 ఏళ్ల కాలవ్యవధిపై ఎంతో కొంత రుణం తీసుకుని ఉంటే, 20 ఏళ్ల టర్మ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. అనుకోని విధంగా మరణం చోటు చేసుకుంటే రుణం ఎలా చెల్లించాలన్న సమస్య ఉండదు. ఒకవేళ జీవించి ఉంటే చివర్లో నూరు శాతం ప్రీమియం వెనక్కి వచ్చేస్తుంది. కొన్ని ఆర్వోపీ ప్లాన్లు చెల్లించిన ప్రీమియానికి అధికంగానే వెనక్కి ఇస్తున్నాయి. ఇలా మెచ్యూరిటీ తర్వాత అందుకునే మొత్తంపై పన్ను ఉండదు. బీమా ప్రీమియం చెల్లింపు సమయంలోనూ ఆ మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. ప్రీమియం చెల్లింపులు మీ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రీమియం చెల్లింపు విధానాన్ని ఎంచుకోవచ్చు. సాధారణంగా అయితే వార్షికంగా, అర్ధ సంవత్సరానికి, త్రైమాసికం, నెలవారీగా చెల్లించే ఆప్షన్లు ఉంటాయి. కొన్ని సింగిల్ (ఒక్కసారి చెల్లించే) ప్రీమియం ఆప్షన్ తోనూ వస్తున్నాయి. సంతోష్ అగర్వాల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పాలసీబజార్ డాట్ కామ్ లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం -
అందరికీ మంచి జరగాలి
-
మీ అన్నగా, తమ్ముడిగా సాయం
సాక్షి, అమరావతి: ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ నడుపుతున్న వారందరికీ ఒక అన్నగా, తమ్ముడిగా ఆర్థిక సాయం చేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఎవరూ కూడా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ గల వారికి గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి రెండవ ఏడాది రూ.10 వేల చొప్పున నగదును జమ చేశారు. మొత్తం 2,62,493 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.262.49 కోట్లు జమ అయింది. గత ఏడాది కంటే ఈ ఏడాది కొత్తగా 37,756 మంది ఈ పథకంలో లబ్ధిదారులయ్యారు. కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లు నడిపేవారిని ఉద్దేశించి సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు సీఎం జగన్‌తో తమ సంతోషాన్ని పంచుకున్నారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. అందరికీ మంచి జరగాలి ► గత ఏడాది అక్టోబర్ 4న వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించాం. అయితే ఈ ఏడాది కోవిడ్‌తో లాక్డౌన్ వల్ల బతకడం కష్టమైంది. ఆటోలు, ట్యాక్సీలు తిరగక ఆ కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి కాబట్టి వారికి మేలు చేయడం కోసం ఈ ఏడాది జూన్ 4నే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ► ఎక్కడైనా, ఎవరికైనా అర్హత ఉండి ఈ పథకంలో లబ్ధి కలగకపోతే ఆందోళన చెందొద్దు. నాకు ఓటు వేయకపోయినా సరే, అర్హులైతే చాలు పథకం వర్తింప చేయాలని స్పష్టం చేశాం. అవినీతికి తావు లేకుండా ఈ పథకం అమలులో పూర్తి పారదర్శకత పాటిస్తున్నాం. ► ఇంకా అర్హులెవరైనా మిగిలిపోతే గ్రామ సచివాలయాల్లో లేదా స్పందన యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏమైనా ఇబ్బంది ఉంటే స్పందన హెల్ప్‌లైన్ నంబరు 1902కు కాల్ చేయాలి. అలా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత ఉంటే వచ్చే నెల 4వ తేదీన ఆర్థిక సహాయం చేస్తాం. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. ఆలోచించాను.. అమలు చేశాను.. ► పాదయాత్ర సందర్భంగా 2018 మే నెలలో ఏలూరులో మాట ఇచ్చాను. ప్రతి జిల్లాలో ఆటో డ్రైవర్లు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఇన్సూరెన్సు కట్టాలి. అది కడితేనే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తారు. ప్రీమియం ఎక్కువ కావడంతో డ్రైవర్లు ఇబ్బంది పడే వారు. ఎఫ్‌సీ లేకపోతే రోజుకు రూ.50 జరిమానా విధించే వారు. ► అప్పుడు దాదాపు అన్ని జిల్లాల్లో డ్రైవర్లు వచ్చి నన్ను కలిశారు. ఎఫ్‌సీ కోసం ఒకేసారి దాదాపు రూ.10 వేలు ఖర్చు చేయాలి. లేదంటే రోజుకు రూ.50 ఫైన్ ఎలా కడతారని ఆలోచించాను. ఏలూరు సభలో మాట ఇచ్చాను. అధికారంలోకి వచ్చాక అమలు చేశాను. ఈ సారి మళ్లీ మీ తమ్ముడిగా, అన్నగా సహాయం చేస్తున్నాను. పాత బాకీల కింద జమ చేసుకోరు ► గత ఏడాది ఆటోలు, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ల డ్రైవర్ల ఖాతాలో నగదు వేస్తున్నప్పుడు, దాన్ని పాత అప్పుల కింద జమ చేసుకోకుండా అన్ ఇన్‌కమ్‌బర్డ్ ఖాతాల్లో వేశాం. అప్పుడు దాదాపు రూ.236 కోట్లు ఖర్చు చేశాం. ► ఈసారి రూ.262 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. గత ఏడాది కంటే ఈసారి 37,756 మంది కొత్త లబ్ధిదారులు చేరారు. డబ్బులు అందిన సంతోషంతో అనంతపురానికి చెందిన రామలక్ష్మి క్యాలెండర్ ప్రకారం సేవలు ► అన్ని వర్గాలకు సేవలందించే విధంగా క్యాలెండర్ ప్రకటించాం. అందులో భాగంగా ఇవాళ (గురువారం) ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాం. ► ఈ నెల 10వ తేదీన రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు సహాయం అందిస్తాం. ఆ తర్వాత 17న నేతన్న నేస్తం, 24న కాపు నేస్తం, 29న ఎంఎస్ఎంఈలకు రెండో విడత లబ్ధి కలిగిస్తాం. అన్ని వర్గాల వారికి న్యాయం ► పేదలకు న్యాయం చేస్తేనే రాష్ట్రం, దేశానికి చాలా మంచిది. ఇప్పుడు లబ్ధి పొందుతున్న వారిలో అన్ని వర్గాల వారు ఉన్నారు. ఎస్సీలు 61,390 మంది, ఎస్టీలు 10,049 మంది, బీసీలు 1,17,096 మంది, ఈబీసీలు 14,590 మంది, మైనారిటీలు 28,118 మంది, కాపులు 29,643 మంది, బ్రాహ్మణులు 581 మంది, క్రైస్తవులు 1,026 మంది ఉన్నారు. ► అందరూ కలిపి మొత్తం 2,62,493 మందికి ఈ ఏడాది వైఎస్సార్ వాహనమిత్ర పథకంలో లబ్ధి చేకూరుస్తున్నాం. గత ఏడాది లబ్ధి పొందలేకపోయిన వారికీ.. ► గత ఏడాది 8,600 మంది మైనారిటీ కార్పొరేషన్ లబ్ధిదారులు, మరో 3,600 మంది బ్యాంక్ ఖాతాల వివరాలు సక్రమంగా లేకపోవడంతో వారికి ఆర్థిక సహాయం అందలేదని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. అందువల్ల ఆ 12,200 మందికి గత ఏడాది మొత్తంతో పాటు ఈ ఏడాది సొమ్ము కూడా శుక్రవారం సాయంత్రంలోగా జమ చేస్తామని చెప్పారు. ► వైఎస్సార్ వాహనమిత్ర పథకంలో గత ఏడాది 2,36,334 మందికి లబ్ధి చేకూర్చగా, వారిలో 11,595 మంది వాహనాలు అమ్ముకున్నారని ఆయన వెల్లడించారు. దీంతో వారు అనర్హులు కాగా, 2,24,739 మందిని అర్హులుగా గుర్తించామని తెలిపారు. ►ఈ ఏడాది 38,605 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 849 మంది అనర్హులుగా తేలారని చెప్పారు. మిగిలిన 37,756 మందిని అర్హులుగా గుర్తించామని, దీంతో ఈ ఏడాది మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2,62,493 కు చేరిందన్నారు. ►కార్యక్రమం ప్రారంభంలో వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, అవంతి శ్రీనివాస్, సీఎస్ నీలం సాహ్ని, రవాణా శాఖ కమిషనర్ సీతారామాంజనేయులు, పలువురు అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మీ మేలు మరవలేం నేను ఎంఏ చదివాను. ఉపాధి కోసం ఆటో తోలుతున్నా. ఇంత వరకూ నేను ఎప్పుడూ ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందలేదు. తొలిసారి మీ ప్రభుత్వంలో గవర్నమెంటు సొమ్ము పది వేలు తిన్నాను సార్. గతంలో ఇన్సూరెన్స్, ఫిటినెస్ వంటి వాటి కోసం ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడు ఆ ఖర్చులు మీరిచ్చిన డబ్బులతో పెట్టగలగుతున్నాం. ఆటో డ్రైవర్లకు కూడా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఇన్సూరెన్స్ కోసం బయట రూ.7,300 చెల్లిస్తున్నాం. ప్రభుత్వం ద్వారా చేయిస్తే ఇంకా తక్కువ మొత్తంతోనే వీలవుతుంది. తక్కువ వడ్డీకి రుణాలిప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని వర్గాల వారికి మీరు చేస్తున్న మేలు మరచిపోము. – భాగ్యలక్ష్మి, మహిళా ఆటో డ్రైవర్, అనంతపురం. -
ఆరు నెలల్లో పూర్వ వైభవం..
అసలే లాక్డౌన్.. ఆపై ఉత్పత్తులు నిలిచిపోవడం.. దానికి తోడు ఐదేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు విడుదల కాకపోవడంతో చిన్న పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. లాక్డౌన్లో సడలింపు ఇచ్చినా కోలుకోలేనంతగా కష్టాల్లో కూరుకుపోయిన ఎంఎస్ఎంఈలకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. తాళాలు వేసే స్థితికి చేరుకున్న పరిశ్రమలను రీస్టార్ట్ చేయించింది. ప్రోత్సాహకాలు, రాయితీలతో పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా వేస్తున్న అడుగులు సత్ఫలితాలిస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) 13,548 ఉండగా.. ఇందులో నగర పరిధిలో 6,331 ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో 2 లక్షల మందికి పైగా నిర్వాహకులు, ఉద్యోగులు, కార్మికులున్నారు. అప్పోసప్పో చేసి పరిశ్రమను లాగిస్తున్నా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎంఎస్ఎంఈ సెక్టార్ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. 2014 నుంచి 2019 వరకూ రావల్సిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రాయితీలేవీ విడుదల చేయకపోవడంతో జిల్లాలో 40 శాతం వరకూ పరిశ్రమలు అంపశయ్యపైకి చేరుకున్నాయి. నష్టాలతో నడుస్తున్న ఈ పరిశ్రమలకు లాక్డౌన్ శరాఘాతంలా మారిపోయింది. వీటిని గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన రీస్టార్ట్ ప్యాకేజీ జీవం పోసింది. జిల్లాలో గాజువాక, ఆటోనగర్, అగనంపూడి, స్టీల్‌ప్లాంట్, పరవాడ, పెదగంట్యాడ, పెందుర్తి ప్రాంతాల్లో పలు ఎంఎస్ఎంఈలు నడుస్తున్నాయి. ఇంజినీరింగ్ లేత్ వర్క్, ఫ్యాబ్రికేషన్, కాస్టింగ్, మెషినింగ్, కాయిర్ ప్రాసెసింగ్ పరిశ్రమలున్నాయి. అచ్యుతాపురం, పరవాడ, గాజువాక, ఆటోనగర్, పెదగంట్యాడ, కంచరపాలెం, గంభీరం, గుర్రంపాలెం (పెందుర్తి), రాచపల్లి పారిశ్రామిక వాడల్లోనూ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఎస్ఎంఎంఈలకు ప్రభుత్వం ప్రకటించిన రీస్టాట్ ప్యాకేజీతో జిల్లాలోని పలు పరిశ్రమలకు కొత్త ఊపిరి వచ్చింది. 779 అకౌంట్లు.. రూ.53.35 కోట్లు గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీలు తదితర పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎంఎస్ఎంఈలకు విడుదల చేయకుండా విస్మరించింది. కాని కష్ట కాలంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సబ్సిడీ నిధుల బకాయిలను విడుదల చేసింది. దీంతో.. జిల్లాలోని 276 అకౌంట్లకు రూ.28 కోట్ల వరకూ ఈ నెల 22న అందాయి. జూన్ 29న 503 అకౌంట్లకు రూ.25.35 కోట్లు అందనున్నాయి. లాక్డౌన్ కాలంలో మూడు నెలల విద్యుత్ బిల్లులపై స్థిర విద్యుత్తు చార్జీలు మాఫీ చేయడంతో జిల్లాలో పదివేలకు పైగా ఎంఎస్ఎంఈలకు మేలు జరిగింది. మూడు నెలల పాటు ఈ చార్జీలను వాయిదా వేయడం వల్ల 140 భారీ పరిశ్రమలకు కూడా లబ్ధి చేకూరింది. ఈ నేపథ్యంలోనే పలు పరిశ్రమలు సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకున్నాయి. షిఫ్టుల వారీగా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆరు నెలల్లో అధిగమించేలా... లాక్డౌన్లో నిబంధనలు సడలించినప్పటికీ.. పరిశ్రమలకు కారి్మకుల కొరత వేధిస్తోంది. ఇప్పటికే వివిధ జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన కారి్మకుల్లో 80 శాతం వరకూ తమ తమ సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో కారి్మకులు దొరకడంలేదు. సాధారణంగా మార్చి నెల తర్వాత ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటాయి. కాని లాక్‌డౌన్‌తో పూర్తిగా వర్క్ ఆర్డర్లు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే ఆర్డర్లు వస్తున్నా.. ఒక్కో పరిశ్రమలో 60 శాతం వరకు కార్మికుల సంఖ్య తగ్గిపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవన్నీ తాత్కాలికమేనని.. ప్రభుత్వం అందించిన చేయూతతో కేవలం ఆరు నెలల్లో సమస్యలన్నింటినీ అధిగమించి.. ఎంఎస్ఎంఈలకు పూర్వ వైభవం వస్తుందని పారిశ్రామిక వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కార్మికుల సమస్య తాత్కాలికమే లాక్డౌన్లో కార్మికుల్లో చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. దీంతో కార్మికుల సమస్య వేధిస్తున్నప్పటికీ ఇది తాత్కాలికమే. ఉదాహరణకు రాష్ట్రం నుంచి 2.80 లక్షల మంది కారి్మకులు వెళ్లిపోతే.. 1.80 లక్షల మంది వచ్చారు. ఈ లెక్కన చూస్తే.. కార్మికుల కొరత కొంత మాత్రమే ఉంది. సీఎం జగన్ వల్ల ఆర్థిక సమస్య నుంచి ఎంఎస్ఎంఈలు గట్టెక్కడం సరికొత్త విప్లవమనే చెప్పాలి. – ములగాడ సుధీర్, ఏపీసీసీఐఎఫ్ చైర్మన్ పరిశ్రమలను బతికించారు.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని బతికించారు. లాక్డౌన్ కాలంలో మూడు నెలల విద్యుత్తు బిల్లులపై స్థిర విద్యుత్తు చార్జీలు మాఫీ చేయడంతో జిల్లాలో పదివేలకు పైగా ఎంఎస్ఎంఈలకు మేలు జరిగింది. మూడు నెలల పాటు ఈ చార్జీలను వాయిదా వేయడం వల్ల 140 భారీ పరిశ్రమలకు కూడా దీనివల్ల లబ్ధి జరగనుంది. ముఖ్యమంత్రికి పరిశ్రమలన్నింటి తరఫునా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – ఏకే బాలాజీ, ఏపీ ఛాంబర్స్ డైరెక్టర్ సాహసోపేత నిర్ణయం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు ఏ సీఎం తీసుకోని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. నిర్వహణ మూలధన రుణాల (వర్కింగ్ క్యాపిటల్ లోన్స్)కు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడంతో 6 నుంచి 8 శాతం వరకూ వడ్డీతో రాష్ట్ర ఆర్థిక సంస్థ ద్వారా రుణాలు పొందే అవకాశం కలి్పంచింది. వెబ్సైట్లో సాంకేతిక లోపాలు రెండు రోజుల్లో క్లియర్ అవుతాయి. ఆ తర్వాత నుంచి రీస్టాట్ ప్రయోజనాల కోసం ఆన్‌లైన్‌తో దరఖాస్తు చేసుకోవచ్చు. – జి. సాంబశివరావు, ఏపీ చాంబర్స్ మాజీ అధ్యక్షుడు కొనుగోళ్లనూ ప్రోత్సహించడం చరిత్రాత్మకం ప్రభుత్వ విభాగాల అవసరాలకు ఉద్దేశించిన వస్తువుల్లో 25 శాతం ఎంఎస్ఎంఈల నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల పరిశ్రమలకు లాభం చేకూరుతుంది. త్వరితగతిన కోలుకునేందుకు అవకాశం లభిస్తుంది. 4 శాతం ఎస్సీ ఎస్టీ పరిశ్రమల నుంచి, 3 శాతం మహిళా పారిశ్రామికవేత్తలకు చెందిన పరిశ్రమల నుంచి 18 శాతం ఓపెన్ కేటగిరీకి చెందిన వారి పరిశ్రమల నుంచి కొనుగోలు చేస్తామని సీఎం ప్రకటించడం నిజంగా గ్రేట్. – పైడా కృష్ణప్రసాద్, ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ (ఎలెక్ట్) ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈ వెన్నెముక దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈ సెక్టార్ వెన్నెముక వంటిది. అందుకే దాన్ని కాపాడేందుకు సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న ప్రోత్సాహకాలు ఎంతో బూస్టప్ ఇస్తాయి. బకాయిలు అందడం వల్ల ముడి సరకు కొనుగోళ్లకు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ఉపయుక్తమవుతున్నాయి. అర్హులైనవారికి రుణాలందించాలని ఆదేశించడం సీఎం ఉదారతకు ఓ ఉదాహరణ. – డా.కె కుమార్‌రాజా, ఏపీ చాంబర్స్ వైస్ ప్రెసిడెంట్ -
లాక్డౌన్ వేళ..ఆర్థిక అండ
జయనగరం పూల్‌బాగ్: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో పూజలు, ప్రార్థనలు నిషేధించింది. భక్తులు రాకపోవడంతో అర్చకులు, మౌజమ్(ఇమామ్)లు, పాస్టర్లకు భృతి కరువైంది. వీరిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. జిల్లా వ్యాప్తంగా 3,060 మందికి రూ.5వేలు చొప్పున రూ.కోటీ53లక్షల ఆర్థిక సా యం మంగళవారం అందజేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లాలో వివిధ దేవాలయాల్లో పూజలు చేసే 1616 మంది అర్చకులు, చర్చిల్లో ప్రార్థనలు జరిపే 1320 మంది పాస్టర్లు,62 మసీదుల్లో నమాజ్ చేయించే 124 మంది మౌజామ్,ఇమామ్‌లు లబ్ధిపొందనున్నారు. వీరి ఖాతాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి నగదు జమచేయనున్నారు. ఆర్థిక సాయంపై లబ్ధిదారు ల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేక ఆర్థిక సాయం... లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పాస్టర్లను, మౌజామ్లు, ఇమామ్‌లను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. అందులో భాగంగా ఒక్కొక్కరికి రూ.5వేలు సాయం అందించనుంది. జిల్లా వ్యాప్తంగా 1320 మంది పాస్టర్లు, 62 మంది మౌజామ్లు, 62 మంది ఇమామ్‌లు ఉన్నారు. వారందరికీ సాయం అందుతుంది. దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు ఎండోమెంట్ శాఖ ద్వారా సాయం అందనుంది. జిల్లావ్యాప్తంగా అందరికీ కలిపి రూ.కోటి 53 లక్షలు సాయం అందనుంది. – ఎం.అన్నపూర్ణమ్మ, మైనారిటీ సంక్షేమాధికారి, విజయనగరం కష్టకాలంలో ఆదుకుంటున్నారు.. సీఎం జగన్మోహన్రెడ్డి కష్టకాలంలో ఆదుకుంటున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇటువంటి సమ యంలో ఆర్థికంగా సాయం అందించి ఆదుకోవడం శుభపరిణామం. రెండు నెలలుగా ఆలయాలకు భక్తులు రాకపోవడంతో భృతికరువైంది. అర్చకులకు అండగా నిలవడం అభినందనీయం. – ఆకెళ్ల భాస్కరరావు, అర్చకులు, విజయనగరం -
ఆర్థిక ఆసరాపై దృష్టి సారించాలి
మూడో దశ లాక్డౌన్ గడువు వచ్చే ఆదివారంతో ముగియబోతుండగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు యాభై రోజులక్రితం లాక్డౌన్ పరంపర మొదలయ్యాక ఇది ప్రధాని నిర్వహించిన అయిదో వీడియో కాన్ఫరెన్స్. కరోనా వైరస్ మహమ్మారితో అలుపెరగకుండా పోరాడుతున్న పలు రాష్ట్రాలు తమ ఆర్థిక ఇబ్బందులనూ, లాక్డౌన్ వల్ల ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలనూ, అది కొనసాగించడంలోని మంచిచెడ్డలనూ ఆయన దృష్టికి తీసుకొచ్చారు. (చదవండి: భారత్‌లోనే తక్కువ: డబ్ల్యూహెచ్‌వో) అయితే కేంద్రం ఆలోచనలేమిటో మోదీ బయట పెట్టలేదు. అలాగే సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకూ ఏ మాదిరి చేయూతనిస్తారన్న స్పష్టత కూడా ఇవ్వలేదు. రాష్ట్రాలన్నీ కరోనా వ్యతిరేక పోరులో సమష్టిగా, చురుగ్గా పాల్గొనడం వల్లే ప్రపం చంలో దేశానికి మంచి పేరొచ్చిందని నరేంద్ర మోదీ చెప్పిన మాట వాస్తవం. అయితే ఆ క్రమంలో అవి పడుతున్న పాట్ల విషయంలో తగిన హామీ ఇస్తే బాగుండేది. వర్తమాన కాలంలో రాష్ట్రాలు మాత్రమే కాదు... కేంద్రం కూడా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. అయితే వాటిని అధిగ మించడానికి అవసరమైన వనరుల కల్పన కేంద్ర ప్రభుత్వానికే సాధ్యం. ఈ విషయంలో ఇప్పటికే ఆర్థిక నిపుణులు పలు సలహాలిచ్చారు. ఆచరణ సాధ్యమైన ప్రతిపాదనలేవో, వేటిని అనుసరిస్తే తక్కువ నష్టంతో బయటపడటం సాధ్యమో కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. లాక్డౌన్ విధించి యాభైరోజులు కావస్తున్నా ఇప్పటికీ పీపీఈలపైనా, ఇతర వైద్య ఉపకరణాలపైనా జీఎస్టీ తొలగించమని రాష్ట్రాలు కోరే పరిస్థితి వుండకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాలకు తన వంతుగా చేయాల్సిందేమిటన్నది కేంద్రం తనకు తానే చూడాలి. కరోనా విపత్తును అధిగమించడానికి ఇప్పటికే అమెరికా, జర్మనీ, బ్రిటన్ వంటివి తమ తమ జీడీపీల్లో పది శాతం మేర నిధుల్ని విడుదల చేసి రాష్ట్రాలకు బాసటగా నిలుస్తున్నాయి. మన దేశంలో కూడా అటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం వుంది. స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వలస కూలీల గురించి ప్రస్తావిస్తూ ‘ఇంటికి తిరిగి వెళ్లాలను కోవడం మానవ స్వభావమ’ని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలో నిజముంది. అయితే దాన్ని ముందే గుర్తించకపోవడం వల్ల అటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు వలస కార్మికులు, వలస కూలీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చింది. పని లేకపోవడానికి తోడు, ఆకలి రివాజుగా మారిన స్థితిని వలస కూలీలు తట్టుకోలేకపోయారు. (చదవండి: వూహాన్లో ఆరు కొత్త కరోనా కేసులు) ఇవిగాక కరోనా వైరస్ గురించి, తమలాంటి సామాన్య పౌరులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వెలువడుతున్న కథనాలు వింటూ స్వస్థలాల్లో తమ వారెలా వుంటున్నారోనన్న బెంగ వారిని అలుముకుంది. వీటన్నిటి పర్యవసానంగా వారు వందలు, వేల కిలోమీటర్లు నడిచి వెళ్లడానికి సిద్ధపడ్డారు. ఈ క్రమంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. వివిధ నిబంధనల కారణంగా కావొచ్చు... వలసజీవుల కోసం నడుపుతున్న రైళ్లలో తమకు చోటు దొరకడం అసాధ్యమని భావించినవారు ఇప్పటికీ నడకనే నమ్ముకుని వెళ్తున్నారు. ఒకపక్క దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఎలాంటి చర్యలు అవసరమన్న అంశంపై చర్చిస్తున్న తరుణంలో అందులో కీలక పాత్ర పోషించాల్సిన వలసజీవులను స్వస్థలాలకు తరలించే ప్రక్రియ కొనసాగు తోంది. ముందే ఎవరి ఇళ్లకు వారు వెళ్లే వెసులుబాటు కల్పిస్తే, వారంతా తిరిగొచ్చేందుకు ఎలాంటి చర్యలు అవసరమో ఇప్పుడు చర్చించే పరిస్థితి వుండేది. పౌరుల జీవికపై లాక్డౌన్ పెను ప్రభావాన్ని చూపుతున్న తీరును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించి కరోనా అంటే సాధారణ పౌరుల్లో వుండే భయాందోళనలను తొలగించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. వైద్యరంగంలో మౌలిక సదుపాయాలు సక్రమంగా వుంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. వైద్యుల పర్యవేక్షణ వుంటుంది గనుక అందరిలోనూ వ్యాధులపై అవగాహన కలుగుతుంది. వాటి నివారణకు ఏం చేయాలో అర్ధం చేసుకుంటారు. వైద్య రంగ మౌలిక సదుపాయాలను మరింతగా అభివృద్ధి చేయాలంటే రూ. 16,000 కోట్లు అవసరమని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడటంతోపాటు వడ్డీలేని రుణాలు లేదా తక్కువ వడ్డీ రుణాలు కల్పించడంతోపాటు వీటిని ద్రవ్యలోటు పరిమితుల పరిధినుంచి మినహాయించాలన్న సూచన కూడా చేశారు. ఆరోగ్యంతోపాటు ఉపాధి కల్పనపై ఇప్పుడు అందరూ దృష్టి కేంద్రీకరించాలి. దాదాపు పది లక్షలమంది కార్మికులకు ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని ఆదుకుంటే జనంలో కొనుగోలు శక్తి పెరుగుతుంది. అప్పుడు సరుకులకు డిమాండు ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవస్థ సక్రమంగా అడుగేయాలంటే ఇదెంతో కీలకం. ఈ రంగాలకు చేయూతనిచ్చి, రెండు త్రైమాసికాలపాటు వీటికి వడ్డీ మాఫీ చేయాలన్న జగన్ సూచన కూడా శిరోధార్యం. లాక్డౌన్ అమలు అన్నిచోట్లా ఒకేలా లేదు. అంతర్రాష్ట్ర సరుకు రవాణాకు అడ్డంకులుండవని చెప్పినా, చాలా రాష్ట్రాలు వాటిని సక్రమంగా పాటించడం లేదు. ఈ వైఖరి వున్న సమస్యల్ని మరింత పెంచుతోంది. సరుకు రవాణా సరిగా లేకపోతే పరిశ్రమల్ని తెరిచి ఉపయోగం వుండదు. కావలిసిన ముడి సరుకు ఎక్కడో ఆగిపోతే ఉత్పత్తి స్తంభించిపోతుంది. ఇలాంటి లోపాల్ని సరిదిద్దాల్సిన అవసరం వుంది. లాక్డౌన్ కొనసాగింపుపై ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం సహజమే. మహారాష్ట్ర వంటివి ఈ వ్యాధిని కట్టడి చేయడంలో ఎన్నో సమస్యలు ఎదు ర్కొంటున్నాయి. అటు వలస కార్మికులకు సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతున్నాయి. అన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఇప్పుడున్న లాక్డౌన్ నుంచి సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ఏవిధమైన చర్యలు అవసరమో కేంద్రం సమగ్రమైన వ్యూహాన్ని రచించాలి. రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకునే చర్యలు ప్రకటించాలి. (చదవండి: ఆపదలో ఆదుకుంది) -
ఫ్రీ ఫుడ్
అనూజా బషీర్ ‘ఫ్రీ ఫుడ్ క్యాంపెయిన్’ నడుపుతున్నారు. ఇటువంటి అన్నదానాల గురించి వినీ వినీ ఇదొక పెద్ద విశేషంగా మీకు అనిపించకపోవడం సహజమే. అయితే అనూజ ప్రత్యేకం. ఆమెది కొచ్చి. ఇంజినీరింగ్ చదివింది. కాలేజ్ ప్రాజెక్టు పని మీద స్నేహితులతో కలిసి బెంగుళూరు వెళ్లి, అక్కడి చర్చిగేట్ ప్రాంతంలోని ఓ కాఫీ షాప్‌లో కూర్చొని ఉన్నప్పుడు వచ్చిన ఆలోచనతోనే ఇప్పుడు రోజుకు వంద మందికి పైగా కడుపులు నింపే ఉద్యమాన్ని నడిపిస్తున్నారు! ఆ రోజు.. వాళ్లకు సమీపంలో ఒక చిన్న పిల్లవాడు కడుపు చేతపట్టుకుని తినేందుకు ఏమైనా ఉంటే పెట్టండి అని హోటళ్ల వాళ్లను అడుగుతుండడం వీళ్లు గమనించారు. అలా సంపాదించిన ఫుడ్‌ని అతడు తనకన్నా చిన్న పిల్లలకు పంచడం కూడా వీళ్ల కంటపడింది. అప్పుడే.. ఆకలితో ఉన్నవాళ్లకు తనూ ఏదైనా ‘షేర్’ చేయాలని అనుకున్నారు అనూజ. ఎర్నాకులంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో తనకు తెలిసినవాళ్లుంటే ఆర్థిక సహకార సమాచారం కోసం వారిని సంప్రదించారు అనూజ. అయితే ఈ దేశంలో ఆహారానికి ఎంత కొరత ఉందో, ఆర్థిక సహాయానికీ అంతే కొరత ఉందని ఆమెకు అర్థమైంది. ఇలా లాభం లేదని కొచ్చిలో ఉన్న ఒక అనాధ ఆశ్రయానికి వెళ్లారు. అందరూ మహిళలే నడుపుతున్న ఆశ్రయం అది. దాదాపు 500 మంది ఉంటారు. వాళ్లందరికీ ప్రతిరోజూ భోజనం సమకూర్చడం పెద్ద పని. అప్పటికీ దాతల సహాయంలో నడుస్తోంది. ఆ భారాన్ని కొంతైనా తగ్గించేందుకు, తన వంతుగా రోజుకు వంద భోజన పొట్లాలను అనూజా ఆ ఆశ్రమానికి ఇవ్వడం ప్రారంభించారు. కెట్టో ఓఆర్జీ అనే పేరుతో ఆన్లైల్లో నిధులను సమీకరించడానికి చేసిన ప్రయత్నం కూడా సఫలం అవడంతో ఇప్పుడు కోళికోడ్, తిరువనంతపురాలలో కొన్ని ఆశ్రమాలకు భోజనం అందించే ఆలోచనలో ఉన్నారు. రెండేళ్లుగా అనూజా ఈ ఆహార ఉద్యమాన్ని నడుపుతున్నప్పటికీ పేరెక్కడా వినిపించలేదు. అయినా ఆకలి సేవకు ఏ పేరు సరిపోతుంది చెప్పండి?! ఫ్రీ–కశ్మీర్ ప్లకార్డును పట్టుకున్నానని అనుకుంది కానీ, ప్రమాదాన్ని పట్టుకున్నానని అనుకోలేదు ఈ యువతి. ఢిల్లీలోని జె.యన్.యూ క్యాంపస్‌లో ఆదివారం జరిగిన హింసకు వ్యతిరేకంగా ముంబైలోని ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ దగ్గర సోమవారం రాత్రి పొద్దు పోయేవరకు ప్రదర్శనలు జరిగాయి. ఆ ప్రదర్శనల్లో ఈ మహిళ ‘ఫ్రీ కశ్మీర్’ అనే ప్లకార్డ్ పట్టుకుని ఉండటం కాస్త ఆలస్యంగా పోలీసుల కళ్లలో పడింది. ఇక అప్పట్నుంచీ ఆమె కోసం గాలిస్తున్నారు. ఫ్రీ కశ్మీర్ అనడాన్ని ఇంటిలిజెన్స్ కూడా తీవ్రంగా పరిగణిస్తోందనీ, ఆమె కశ్మీర్ మహిళ అయుంటుందా అని ఆరా తీస్తోందని కూడా వార్తలు కూడా వచ్చాయి. ఇవన్నీ ఆమె దృష్టికి వెళ్లినట్లుంది.. వెంటనే సోషల్ మీడియాలో ఒక వీడియోను అప్లోడ్ చేసింది. ‘నేను కశ్మీర్ మహిళను కాదు. నా పేరు మెహెక్ మీర్జా ప్రభు. మాది ముంబై. నేను రైటర్ని. ప్రదర్శనలో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు అక్కడ రకరకాల ప్లకార్డులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి తీసుకున్నాను తప్ప, ఎంపిక చేసుకుని తీసుకోలేదు. అయినా ‘ఫ్రీ కశ్మీర్’ అంటే నా ఉద్దేశం.. ఇండియా నుంచి కశ్మీర్‌కు విముక్తి కల్పించమని కాదు.. కశ్మీర్లో ఇంటర్నెట్ నిషేధాన్ని తొలగించమని అక్కడి పౌరుల స్వేచ్ఛను హరించవద్దని..’’ అంటూ ఆమె వివరణ ఇచ్చింది. ఏమైనా.. కొన్ని ఫొటోలు వార్తల్లో ఎప్పటికీ నిలిచిపోయినట్లుగా.. ఈ ఫొటో కూడా నిరసనల చరిత్రలో ‘నిలిచిపోయే’ స్థానాన్ని దక్కించుకోబోతున్నట్లే కనిపిస్తోంది. -
శ్రీలంకకు 3,230 కోట్ల సాయం
న్యూఢిల్లీ: శ్రీలంక నూతన అధ్యక్షుడు గోతబయ రాజపక్సతో ప్రధాని మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడం, దౌత్య సంబంధాలను బలపరుచుకోవాల్సిన ఆవశ్యకతపై ఇరువురూ చర్చించారు. ఈ సమావేశం అనంతరం లంక ప్రభుత్వానికి సుమారు రూ.3,230 కోట్ల రుణ సహాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. గోతబయ రాజపక్స మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం భారత్‌కి వచ్చారు. శ్రీలంకలోని మైనారిటీ తమిళుల ఆకాంక్షలూ, భద్రతాంశాలూ, వ్యాపార ఒప్పందాలూ, మత్స్యకారుల సమస్యలపై ఈ సమావేశం దృష్టిసారించింది. ఈ సందర్భంగా ప్రధాని మీడియాతో మాట్లాడుతూ... శ్రీలంక సత్వరాభివృద్ధి పథంలో పయనించేందుకు భారత్ సంపూర్ణ మద్దతునిస్తుందని చెప్పారు. శ్రీలంక అభివృద్ధికి, ఉగ్రవాదం అణచివేతకు రూ.3,230 కోట్ల సాయాన్ని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు శ్రీలంక పోలీసు అధికారులు భారత్‌లో శిక్షణ పొందుతున్నట్టు ప్రధాని వెల్లడించారు. లంక అధ్యక్షుడు గోతబయ మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య చర్చలు ఫలవంతమయ్యాయనీ, ఆర్థిక సహకారం అంశాన్ని కూడా భారత ప్రధానితో చర్చించానని చెప్పారు. రాజపక్సకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ్‌భవన్‌లో ఘనంగా స్వాగతం పలికారు. -
గురునాథ్ కుటుంబానికి ఆర్థిక సాయం
సాక్షి, హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని రక్షించే క్రమంలో మంటలు అంటుకొని మరణించిన డ్రైవర్ గురునాథ్ కుటుంబానికి మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. రెవెన్యూ ఉద్యోగులూ గురునాథ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. మేడ్చల్ జేసీ విద్యాసాగర్, రాజేంద్రనగర్ ఆర్డీఓ రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) తరఫున గురునాథ్ భార్యకు రూ. 1.15 లక్షలు అందజేశామని, మొత్తంగా రూ. 5 లక్షలు ఇవ్వనున్నట్లు సంఘం అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు -
ఏపీలో 13 జిల్లాలకు రూ.13 కోట్లు
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న విషయాన్ని మరోసారి నిజం చేసి చూపించారు. ఇప్పటికే కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించడానికి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం కింద ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పంటకు కనీస మద్దతు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతు కుటుంబానికి తక్షణమే సాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి వ్యవసాయశాఖ కొత్త ఆలోచనా విధానాన్ని రూపొందించింది. ఇందుకోసం 13 జిల్లాలకు రూ. కోటి చొప్పున రూ.13 కోట్లు కేటాయించినట్లు వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు రూ. కోటి రూపాయలు చొప్పున వారి గ్రీన్ చానెల్ అకౌంట్లలో డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ఇక మీదట దురదృష్టవశాత్తు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే తక్షణమే వారి కుటుంబాలకు జిల్లా కలెక్టరే స్వయంగా వెళ్లి ఆర్థిక సాయం అందిస్తారని తెలిపారు.