పీఎం-విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం | Cabinet approves PM Vidyalaxmi scheme for financial support meritorious students | Sakshi
Sakshi News home page

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం.. పీఎం-విద్యాలక్ష్మి పథకానికి ఆమోదం

Published Wed, Nov 6 2024 3:54 PM | Last Updated on Wed, Nov 6 2024 4:18 PM

Cabinet approves PM Vidyalaxmi scheme for financial support meritorious students

ఢిల్లీ, సాక్షి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం- విద్యాలక్ష్మి పథకంతో పాటు పలు అంశాలకు ఆమోదం తెలిపింది. డబ్బు లేని కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకు దూరం కావద్దనే పీఎం- విద్యాలక్ష్మి పథక లక్ష్యం.  ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు పీఎం-విద్యాలక్ష్మి ద్వారా ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. 

నాణ్యత కలిగిన 860 ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు  ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించనుంది.  రూ. ఏడున్నర లక్షల  వరకు రుణ సౌకర్యం అందించనుంది. ఈ పథకం ద్వారా 75 శాతం క్రెడిట్ గ్యారెంటీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. పీఎం-విద్యాలక్ష్మి ద్వారా ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి పొందనున్నారు.

 

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు రూ. 10,700 కోట్ల వర్కింగ్ క్యాపిటల్‌ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఎఫ్‌సీఐ ఆపరేషన్ సామర్థ్యం పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్  మీడియాతో మాట్లాడారు. ‘‘2004-14తో పోల్చితే 2014-24 మధ్య నాలుగు రెట్లు అధికంగా రైతులకు ఆహార సబ్సిడీ అందింది’’ అని అన్నారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement