కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ | Union Cabinet Approves 2% Increase In DA For Central Government Employees | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

Mar 28 2025 5:48 PM | Updated on Mar 28 2025 6:56 PM

Union Cabinet Approves 2% Increase In DA For Central Government Employees

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. అదనపు 2 శాతం డీఏ పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.దీంతో ప్రస్తుతం ఉన్న డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) 53 శాతం నుంచి 55 శాతానికి పెరిగినట్లైంది.  

రెండు శాతం డీఏ పెంపు ద్వారా 48.56 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 66.55 లక్షల మంది పెన్షనర్లకు లాభం చేకూరనుంది. తాజా కేబినెట్‌ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై రూ.6వేల 614 కోట్ల భారం పడనుండగా.. పెరిగిన డీఏ జనవరి 2025 నుంచి అమల్లోకి రానుంది.  

రైతులపై భారం తగ్గించేందుకు  
రైతులపై భారం తగ్గించేందుకు పోషక ఆధారిత ఎరువులపై సబ్సిడీ ఇస్తున్న కేంద్రం ఇస్తుంది. అయితే, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో పోషక ఆధారిత పీఅండ్‌కే ఎరువులకు సబ్సిడీ (రూ. 37,216 కోట్లు) మంజూరు చేసింది. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సీడీ పథకం కింద 28 రకాల పోషక ఆధారిత ఎరువుల గరిష్ట చిల్లర ధరను తయారీదారులు/దిగుమతిదారులు తగినంత స్థాయిలో నిర్ణయించేందుకు అనుమతి ఇచ్చింది.  

కోవిడ్ సంవత్సరాల నుండి, అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక స్థాయికి డీఏపీ ధరలు పెరిగాయి. తాజాగా, కేబినెట్‌లో రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు, ధరల అస్థిరత ప్రభావాన్ని తగ్గించేందుకు డీఏపీ గరిష్ట చిల్లర ధర 50 కిలోల బ్యాగ్‌కు రూ.1,350 కు పరిమితం చేసింది.

	2025 జనవరి 1 నుంచి డీఏ పెంపు వర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement