dearness allowance
-
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
న్యూఢిల్లీ: పండగ సీజన్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందింది. ఉద్యోగులకు డీఏ(డియర్నెస్ అలవెన్స్), పెన్షనర్లకు డీఆర్(డియర్నెస్ రిలీఫ్)ను మూడు శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు డీఏ వారి మూలవేతనంలో 45 శాతానికి చేరింది. ఈ పెంపు జులై 1, 2024 నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రస్తుతం రూ.18 వేలు బేసిక్ వేతనం అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగికి అదనంగా రూ.540 పెంపు ఉంటుందని అంచనా.పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డీఆర్(డియర్నెస్ రిలీఫ్)లో మార్పులు చేస్తుంటుంది. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల కోటి మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. సాధారణంగా డీఏ పెంపు ఏడాదిలో రెండుసార్లు ప్రకటిస్తారు. మార్చిలో హోళీ పండగ సమయంలో ఒకసారి, దీపావళి పండగ నేపథ్యంలో అక్టోబర్-నవంబర్ సమయంలో రెండోసారి ప్రకటిస్తారు. అందులో భాగంగానే ఈ నెల చివరివారంలో దీపావళి ఉండడంతో డీఏ పెంపును ప్రకటించినట్లు తెలిసింది.ఇదీ చదవండి: బంగారం స్వచ్ఛత తెలుసుకోండిలా..ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు శాతం పెంపుఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంచుతున్నట్లు ప్రకటించారు. దీపావళి పండగ సీజన్‌కు ముందు డీఏను నాలుగు శాతం పెంచుతున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 3.9 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. ఈ పెంపు అక్టోబర్ 1 నుంచి అమలు కానుందని పేర్కొన్నారు. -
ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
రక్షణ మంత్రిత్వ శాఖలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. డిఫెన్స్ సివిలియన్ ఉద్యోగుల ప్రమోషన్‌కు అవసరమైన కనీస అర్హత సర్వీస్ నిబంధనలను మంత్రిత్వ శాఖ సవరించింది. 7వ పే కమీషన్ పే మ్యాట్రిక్స్ అండ్ పే లెవెల్స్‌ను అనుసరించే వేతనాలు చెల్లించే రక్షణ పౌర ఉద్యోగులకు ఈ సవరించిన నిబంధనలు వర్తిస్తాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 3 శాతం డీఏ పెంపుపై భారీ ఆశలు డియర్నెస్ అలవెన్స్ పెంపునకు సమయం దగ్గర పడుతుండడంతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రం ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం విశేషం. మరోవైపు ఈ సారి 3 శాతం డీఏ పెంపుపై ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం తన కోటి మందికి పైగా ఉద్యోగులు ,పెన్షనర్లకు కరువు భత్యాన్ని (DA) 3 శాతం నుండి 45 శాతానికి పెంచవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. జూలైలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠ స్థాయిని దాటిన నేపథ్యంలో ఈ పెంపు ఉంటుందని అంచనా. తాజా పెంపు డియర్నెస్ అలవెన్స్ జూలై 1, 2023 కి వర్తిస్తుంది. డీఏను చివరిసారిగా మార్చి 2023లో 4 శాతం పెంచి 42 శాతానికి చేర్చారు. (వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం) డీఏ పెంపు ఎలా ? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల కోసం డియర్నెస్ అలవెన్స్ ప్రతి నెలా లేబర్ బ్యూరో ద్వారా విడుదల చేయబడిన పారిశ్రామిక కార్మికుల కోసం (CPI-IW) తాజా వినియోగదారుల ధరల సూచికలోని అంశాల ఆధారంగా లెక్కిస్తారు. ఉద్యోగులు, పెన్షనర్ల ప్రస్తుత జీతాలపై పెరుగుతున్న ధరల భారం ఆధారంగా కేంద్రం డియర్నెస్ అలవెన్స్‌ను మంజూరు చేస్తుంది. ( వర్క్ ఫ్రం హోం: ఐటీ ఉద్యోగులకు భారీ ఝలక్) -
AP: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏలు విడుదల
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ఇచ్చిన మాట మేరకు ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక డీఏను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2022 జనవరి నుంచి ఇవ్వాల్సిన డీఏను 2.73 శాతం మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులకు డీఏను మంజూరు చేస్తూ జీవో 66ను, పెన్షనర్లకు డీఏను మంజూరు చేస్తూ జీవో–67ను రావత్ జారీ చేశారు. పెంచిన డీఏ 2.73 శాతాన్ని ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమలు చేస్తూ.. ఆగస్టు 1వ తేదీ వేతనాలతో కలిపి నగదు రూపంలో చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జనవరి 2022 నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను ఈ ఏడాది సెప్టెంబర్, డిసెంబర్, వచ్చే ఏడాది మార్చిలో మూడు సమాన వాయిదాల్లో ఉద్యోగుల జీపీఎఫ్‌లో జమ చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 22.75 శాతానికి చేరిన డీఏ ఇప్పుడు మంజూరు చేసిన డీఏతో కలిపి ఉద్యోగుల, పెన్షనర్ల మొత్తం డీఏ 22.75 శాతానికి చేరింది. ఈ సమయంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెంచిన డీఏ బకాయిలను పదవీ విరమణ బెనిఫిట్స్‌లో కలిపి చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. డీఏ పెంపు జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, మునిసిపల్ కార్పొరేషన్, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితి, 2022లో సవరించిన రెగ్యులర్ స్కేళ్లు పొందుతున్న వర్క్ చార్జ్డ్ ఉద్యోగులకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2022లో సవరించిన రెగ్యులర్ స్కేళ్లు పొందుతున్న ఎయిడెడ్ ఇనిస్టిట్యూషన్స్ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, ఎయిడెడ్ పాలిటెక్నిక్, యూన్నివర్సిటీ సిబ్బంది, ఎన్.జి.రంగా వ్యవసాయ యూనివర్సిటీ, జేఎన్టీయూ, వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి డీఏ పెంపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెప్పిన మాట మేరకు ఉద్యోగులకు ఒక డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇప్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: సీఎం జగన్‌తో యూఏఈ రాయబారి సమావేశం.. ఏపీలో పెట్టుబడులపై చర్చ -
‘మీకు నచ్చకపోతే, నా తల తీసుకెళ్లండి’.. ఉద్యోగులపై మండిపడ్డ సీఎం!
డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న నిరసనలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సరిపడా నిధులు లేని కారణంగా ఉద్యోగులకు కరువు భత్యాన్ని పెంచలేని స్థితిలో ప్రభుత్వం ఉందని తేల్చి చెప్పారు. అయితే ఉద్యోగుల డీఏ పెంపు విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మమతా మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. చాలకపోతే.. నా తల నరకి తీసుకెళ్లండి అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఇకపై డీఏ ఇవ్వడం మా ప్రభుత్వానికి సాధ్యం కాదు. మా దగ్గర డబ్బు లేదు. ఇప్పటికే అదనంగా 3 శాతం డీఏ ఇచ్చాం. ఇంకా ఎంత కావాలి? ప్రభుత్వం ప్రకటించిన డీఏ పట్ల మీరు సంతోషంగా లేకుంటే నా తల నరికి తీసుకెళ్లండి ”అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పే స్కేల్స్ విధానం వేరువేరుగా ఉంటాయి. మేం వేతనంతో కూడిన 40 రోజుల సెలవులు మంజూరు చేస్తాం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో ఎందుకు పోల్చరు? ’అని మండిపడ్డారు. ఫిబ్రవరి 15న, అసెంబ్లీలో 2023-24 బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి.. ఉపాధ్యాయులతో సహా ప్రస్తుతం పని చేస్తున్న వారితో పాటు పదవీ విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం అదనపు డీఏ చెల్లిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు, ప్రాథమిక వేతనంలో 3% డియర్నెస్ అలవెన్స్‌గా ప్రభుత్వం ఇస్తోంది. 6వ వేతన సంఘం సిఫారసుల మేరకు సవరించిన డియర్నెస్ అలవెన్స్ మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న డియర్నెస్ అలవెన్స్‌తో (డీఏ) పోలిస్తే పెంపుదల చాలా తక్కువని రాష్ట్ర ప్రభుత్వ భావించారు. అందుకే పెంపుపై అసంతృప్తితో నిరసనలు చేపట్టారు. చదవండి: తెల్లారిన బతుకులు.. వలస కార్మికులపై నుంచి దూసుకెళ్లిన ఇన్నోవా.. ఐదుగురు అక్కడికక్కడే.. -
కేంద్రం కీలక నిర్ణయం.. ఉద్యోగులకు తీపికబురు, త్వరలో జీతం పెరగనుందా!
మోదీ సర్కార్ ఉద్యోగులకు తీపికబురు చెప్పనుంది. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈసారి ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్‌ను (DA) 4 శాతం మేర పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ పెంపు జరిగితే కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) 42 శాతానికి చేరుకుంటుంది. దీనికి అనుగుణంగా ఉద్యోగుల శాలరీ కూడా పైకి కదలనుంది. ప్రస్తుతం వారి డీఏ 38 శాతంగా ఉంది. ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్, జనరల్ సెక్రటరీ, శివ గోపాల్ మిశ్రా దీనిపై మాట్లాడుతూ, "డిసెంబర్ 2022కి సంబంధించిన సీపీఐ-ఐడబ్ల్యూ జనవరి 31, 2023న విడుదలైంది. కరువు భత్యం పెంపు 4.23 శాతంగా ఉంది. అయితే కేంద్రం పాయింట్ తర్వాత ఉన్న నెంబర్లను పరిగణలోకి తీసుకోదు. అందువల్ల డీఏ పెంపు 4 శాతంగా ఉండొచ్చని వివరించారు. అందువల్ల డీఏ అనేది 42 శాతానికి పెరిగే అవకాశం ఉందన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం దాని ఆదాయ చిక్కులతో పాటు డీఏ పెంపు ప్రతిపాదనను రూపొందిస్తుందని, ఆమోదం కోసం కేంద్ర మంత్రివర్గం ముందు ప్రతిపాదనను ఉంచుతుందని ఆయన వెల్లడించారు. ఈ డీఏ పెంపు అనేది జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 38 శాతం కరువు భత్యం పొందుతున్నారు. గతంలో చివరి సవరణ సెప్టెంబర్ 28, 2022న జరగగా, ఇది జూలై 1, 2022 నుండి అమలులోకి వచ్చింది. -
ఉద్యోగులకు డీఏ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్‌ను ప్రకటించింది ప్రభుత్వం. ఒక డీఏ మంజూరు చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 2.73 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ఉద్యోగులకు 2021 జూలై 1వ తేదీ నుంచి డీఏ చెల్లింపులు ఉండనున్నట్లు తెలిపింది. -
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో డీఏ విడుదల
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు మరో డీఏ విడుదల చేసింది యాజమాన్యం. ఈ నెల జీతంతో కలిపి దీన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో టీఎస్ఆర్టీసీ మొత్తం 7 డీఏలకు గానూ 6 డీఏలను ఇచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు మరో విడత కరవు భత్యం (డీఏ) మంజూరు చేయాలని యాజమాన్యం ఇదివరకే నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి నుంచి దీన్ని చెల్లించనుంది. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త..!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు విడత డియర్నెస్ అలవెన్స్ (డీఏ) , పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) విడుదల చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను 3 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో డియర్నెస్ అలవెన్స్ 34 శాతంకు చేరనుంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 31 శాతం మేర డీఏను పెంచాలని కేంద్రం నిర్ణయించగా..ఇప్పుడు అనూహ్యంగా డీఏను 34 శాతంగా పెంచింది. 7వ వేతన సంఘం సిఫార్సులు ఆధారంగా డీఏ అమలు జనవరి 1, 2022 అమల్లోకి రానుంది. ధరల పెరుగుదల నేపథ్యంలో బేసిక్ పే/పెన్షన్‌కు అదనంగా 3 శాతం డీఏ పెంపును వేతన సంఘం సిఫార్సు చేసింది. డీఏ పెంపు నిర్ణయం 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. ఇది సివిల్ ఉద్యోగులు, రక్షణ సేవల్లో పనిచేస్తున్న వారికి వర్తిస్తుంది. ఇక 3 శాతం డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,544.50 కోట్ల మేర అదనపు భారం పడనున్నుట్లు సమాచారం. కోవిడ్-19 కారణంగా 2020లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్‌ను కేంద్రం నిలిపివేసింది. కాగా 2021 జూలైలో డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచింది. తరువాత మరో 3 శాతం పెంచి 31 శాతం డీఏను ఫిక్స్ చేసింది. చదవండి: టాక్స్ పేయర్లకు అలర్ట్..! ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..! -
తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు తీపికబురు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర మంత్రివర్గం తీపికబురు చెప్పినట్లు సమాచారం. తమకందాల్సిన కరువుభత్యానికి సంబంధించి ఎప్పటి నుంచో ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వారికి అందాల్సిన కరువు భత్యాలను మొత్తం మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గంలో నిర్ణయించినట్లు తెలిసింది. సోమవారం రాత్రి పొద్దుపోయేవరకు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. లక్షలాది మంది ఉద్యోగులతో పాటు, పెన్షనర్లకు కూడా ప్రయోజనం చేకూరే నిర్ణయం తీసుకున్నారంటూ ఉపాధ్యాయ సంఘాలు, గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆర్థికశాఖ నేడో రేపో విడుదల చేయనున్నట్లు ఆ వర్గాల నుంచి అందిన సమాచారం. అయితే కరువు భత్యానికి సంబంధించి ప్రభుత్వం నుంచి మంగళవారం రాత్రి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
దీపావళి కానుక.. 3 శాతం డీఏ పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పింఛనుదారులకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) ప్రకటించింది. జూలై 1, 2021 నుంచి అమలులోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డీఏ, పింఛనర్లకు మూడు శాతం డీఆర్ ప్రకటించింది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. డీఏ, డీఆర్ వల్ల కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,488.70 కోట్లు భారం పడనుంది. 47.14 లక్షల కేంద్ర ఉద్యోగులు, 68.62 లక్షల పింఛనర్లు లబ్ధి పొందనున్నారు. కరోనా నేపథ్యంలో గతేడాది కరువు భత్యం నిలిపివేసిన విషయం విదితమే. ఈ ఏడాది జూలైలో పునరుద్ధరిస్తూ 17% నుంచి 28 శాతానికి పెంచారు. తాజా పెంపుతో అది 31 శాతానికి చేరుకుంది. మూడంచెల పర్యవేక్షణ పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ (ఎన్ఎంపీ) అమలుకు మార్గం సుగమమైంది. గురువారం భేటీ అయిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) రూ.100 లక్షల కోట్ల విలువైన పీఎం గతిశక్తికి ఆమోదం తెలిపింది. మూడంచెల పద్ధతిలో దీన్ని పర్యవేక్షించనున్నట్లు కేంద్రం పేర్కొంది. పీఎం గతిశక్తి మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికలో అంతర్ మంత్రిత్వశాఖల సహకారంతో పాటు అంతర్ విభాగాల సహకారం ఓ గేమ్ చేంజర్ కానుందని తెలిపింది. పీఎం గతిశక్తి ని ప్రధాని 13న ప్రారంభించారు. రాబోయే పాతికేళ్ల అభివృద్ధికి ఈ ప్రణాళికతో పునాది వేస్తున్నట్లు చెప్పారు. -
గుడ్‌న్యూస్ : డీఏ పెంపుకు కేంద్రం అంగీకారం
7th Pay Commission Updates కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ! దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం చెల్లింపుపై కేంద్రం స్పందించింది. ఎటువంటి కోతలు లేకుండా ఉద్యోగులు ఊహించనట్టుగానే కరవు భత్యాన్ని పెంచింది. దీంతో 54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. 7వ వేతన ఒప్పందం సంఘం సిఫార్సులను కేంద్రం పరిగణలోకి తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఉద్యోగులకు చెల్లిస్తున్న కరువు భత్యం (డియర్నెస్ అలవెన్స్ డీఏ)ను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన డీఏను 2021 నుంచి అమలు చేయనున్నారు. కరోనా కల్లోలం కారణంగా 2020 జనవరి నుంచి డీఏ పెంపు పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు 2021 జులై నుంచి కొత్త డీఏను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై పడింది. దీంతో ప్రభుత్వం డీఏ పెంచేందుకు అంగీకరించింది. మరోవైపు పెన్షనర్లకు సంబంధించి డీఆర్ పెంపుపై ఎటువంటి ప్రకటన రాలేదు. -
7th pay Commission: కరువు భత్యంపై తేల్చేది నేడే
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిన్నరగా ఎదురు చూస్తోన్న కరువు భత్యం అంశంపై ఈ రోజు కేంద్రం సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన అధికారులతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ , డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్శాఖకు చెందిన ప్రతినిధులు జూన్ 26న సమావేశం కానున్నారు. 7వ వేతన సంఘం ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత కరువు భత్యం నిర్ణయించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. మూడు వాయిదాలు కరోనా ఉధృతి కారణంగా 2020 జనవరి నుంచి కరువు భత్యం (డీఏ) ప్రకటించలేదు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించడంతో 2020 జనవరి - జూన్, 2020 జూన్ - డిసెంబరు, 2021 జనవరి - జూన్ వరకు ఇలా ఉద్యోగులకు సంబంధించి మూడు డీఏలు, పెన్షనర్లకు సంబంధించి మూడు డీఆర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రోజు జరిగే సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంత డీఏ, డీఆర్లు ఇవ్వాలనే అంశంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు బేసిక్ డీఏపై 2020 జనవరి - జూన్ కాలానికి 4 శాతం , 2020 జూన్ - డిసెంబరు కాలానికి 3 శాతం , 2021 జనవరి - జూన్ కాలానికి 4 శాతం డీఏ పెరిగే అవకాశం ఉంది. 28 శాతం 7వ వేతన సంఘ సిఫార్సుల మేరకు 2021 జులై నుంచి డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచే అవకాశం ఉంది. 7వ వేతన సంఘం కనీస వేతనంగా రూ. 18,000లగా నిర్ణయించింది. దీనిపై 15 శాతాన్ని డీఏగా అమలు చేయాలని సూచించింది. దీంతో పాటు ఉద్యోగులకు 2.57 ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పింది. 1.15 కోటి మంది 7వ వేతన సంఘ సిఫార్సులపై ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో వెల్లడికానున్న నిర్ణయం కోసం 50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. 65 లక్షల మంది పెన్షనర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరందరికీ గత పద్దెనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్లు త్వరలోనే అందనున్నాయి. ఉద్యోగులతో పాటు, పెన్షనర్లకు బకాయిలు పడ్డ డీఏలను జులై 1న ఒకేసారి చెల్లిస్తామంటూ ఇప్పటికే ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇప్పటికే ప్రకటించారు. దానికి అనుగుణంగానే కేంద్ర ఆర్థిక శాఖ ఈ రోజు డీఏపై ఫైనల్ డెసిషన్ చెప్పేందుకు సమావేశం నిర్వహిస్తోంది. చదవండి : Toshiba: కుట్రలకు చెక్, చైర్మన్ తొలగింపు.. ఇక సంస్కరణలేనా? -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏ(కరువు భత్యం)ల చెల్లింపులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో డీఏల చెల్లింపునకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కార్యాచరణను ప్రకటించింది. దాని ప్రకారం జూలై 2018 నాటి మొదటి డీఏను 2021 జనవరి జీతాల్లో చెల్లించాలని ఆదేశించింది. మొదటి డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై 1035 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఇక జనవరి 2019 నాటి రెండో డీఏను 2021 జూలై జీతాల్లో చెల్లించాలని ఆదేశించగా.. దీని ద్వారా 2074 కోట్ల అదనపు భారం పడనుంది. (చదవండి: కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపు నిలిపివేత) జూలై 2019 నాటి మూడో డీఏను 2022 జనవరి నుంచి చెల్లించాలని ఆదేశించారు. ఇక మూడో డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై 3802 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. మొదటి డీఏ బకాయిలను జీపీఎఫ్‌లో 3 ఇన్స్టాల్మెంట్స్లో జమ చేయాలని ఆదేశించారు. సీఎం జగన్ నిర్ణయంతో 4.49 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 3.57 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. సీఎం జగన్ ఉద్యోగుల పక్షపాతి: వెంకట్రామిరెడ్డి ప్రభుత్వం డీఏల చెల్లింపుకు ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉందన్నారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. వాయిదా పడ్డ జీతాలను కూడా నవంబర్ 1 నుంచి చెల్లించనున్నారు అని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్ ఉద్యోగుల పక్షపాతి అని ప్రశంసించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న సరే సీఎం జగన్ఉ ద్యోగులకు మేలు చేయడం ఆనందంగా ఉంది అన్నారు రెవిన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. వాయిదా పడ్డ జీతాలను, పెండింగ్ డీఏలను చెల్లించేందుకు అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సీఎం జగన్ ఉద్యోగులకు మేలు చేశారన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం సంతోషం అన్నారు. -
కేంద్ర ఉద్యోగుల డీఏ పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కరువు భత్యం (డీఏ)ను 4శాతం పెంచే నిర్ణయానికి ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించిం ది. దీనివల్ల 1.13 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దార్లకు లబ్ధి చేకూరనుంది. పెరిగిన డీఏ 2020 జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డీఏ 17 నుంచి 21శాతానికి చేరుకుంది. పెరిగిన రేట్లకు అనుగుణంగా దీన్ని పెంచినట్లు కేంద్రం విడుదల చేసిన నివేదిక తెలిపింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వంపై సంవత్సరానికి రూ. 12,510 కోట్లు, 2020–21 సంవత్సరానికి (2020 జనవరి నుంచి 2021 ఫిబ్రవరి వరకు) రూ. 14,595 కోట్ల అదనపు భారం పడనుంది. దాదాపు 48 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛన్‌దారులు లబ్ధి పొందనున్నారని సమాచార, ప్రసార శాఖ మంత్రి జవడేకర్ చెప్పారు. -
ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను పెంచుతూ శుక్రవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం డీఏను పెంచేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా డీఏ పెంపును చేపడతారు. 4 శాతం డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనం నెలకు రూ క్యాడర్‌ను బట్టి రూ 720 నుంచి రూ 10,000 వరకూ పెరగనుంది. కాగా, 2019 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వర్తింపచేసే డీఏను మూల వేతనంలో 12 శాతం నుంచి 17 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 90 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. చదవండి : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక -
3.144 % డీఏ పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3.144 శాతం కరువు భత్యం (డీఏ) పెంచింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మూల వేతనంపై కరువు భత్యం 30.392 శాతం నుంచి 33.536 శాతానికి పెరిగింది. 2019, జనవరి 1 నుంచి డీఏ పెంపు వర్తించనుంది. వచ్చే డిసెంబర్లో చెల్లించనున్న ప్రస్తుత నవంబర్ వేతనంతో కలిపి పెరిగిన కరువు భత్యాన్ని ప్రభుత్వం చెల్లించనుంది.డీఏ బకాయిల చెల్లింపు ఇలా..: 2019, జనవరి 1 నుంచి 2019, అక్టోబర్ 31 మధ్య కాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిలను సంబంధిత ఉద్యోగుల జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. 2020, ఫిబ్రవరి 29కి ముందు పదవీ వివరణ చేయనున్న ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిలను మాత్రం ప్రభుత్వం నగదు రూపంలో చెల్లిస్తుంది. 2004, సెప్టెంబర్ 1 తర్వాత నియామకమై కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) వర్తించే ఉద్యోగులకు 2019, జనవరి 1 నుంచి 2019, అక్టోబర్ 31 మధ్యకాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిల్లో 10 శాతాన్ని వారి ప్రాణ్ ఖాతాల్లో ప్రభుత్వ వాటా కలిపి జమ కానుంది. మిగిలిన 90 శాతం డీఏ బకాయిలను డిసెంబర్ 2019లో నగదు రూపంలో చెల్లిస్తుంది. జీపీఎఫ్ ఖాతాలకు అనర్హులైన ఫుల్ టైం కాంటిజెంట్ ఉద్యోగుల డీఏ బకాయిలను డిసెంబర్లో నగదు రూపంలో చెల్లించనుంది. 2015, పీఆర్సీ ఉద్యోగులకు..: 2015, పీఆర్సీ ప్రకారం వేతనాలు అందుకుంటున్న జడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్ చార్జీడ్ ఎస్టాబ్లిమెంట్, ఎయిడెడ్ సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ కె.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎనీ్టయూ హెచ్‌తో సహా ఇతర వర్సిటీల బోధన, బోధనేతర సిబ్బందికి సైతం కరువు భత్యం 30.392 శాతం నుంచి 33.536 శాతానికి పెంపు వర్తించనుంది. 2010, పీఆర్సీ ఉద్యోగులకు ..: జీవో 36 ఆధారంగా 2010, పీఆర్సీ వేతనాలు అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 112.992 శాతం నుంచి 118.128 శాతానికి పెరిగింది. అదే విధంగా 2010, పీఆర్సీ ప్రకారం వేతనాలు అందుకుంటున్న జడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్ చార్జీడ్ ఎస్టాబ్లిమెంట్, ఎయిడెడ్ సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ కె.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎనీ్టయూ హెచ్‌తో సహా ఇతర వర్సిటీల బోధన, బోధనేతర సిబ్బందికి సైతం 112.992 శాతం నుంచి 118.128 శాతం డీఏ పెంపు వర్తించనుంది. జీవో నం.171 ప్రకారం.. వేతనం రూ.3850 నుంచి రూ.6700కు పెరిగిన ఫుల్ టైం కాంటింజెంట్ ఉద్యోగులకు సైతం ఇదే పెంపు వర్తిస్తుంది. 2006 యూజీసీ వేతనాలపై ఇలా..: సవరించిన యూజీసీ వేతనాలు–2006 అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 148 శాతం నుంచి 154 శాతానికి ప్రభుత్వం పెంచింది. సవరించిన యూజీసీ వేతనాలు–2006 అందుకుంటున్న... ప్రభుత్వ, ఎయిడెడ్ అనుబంధ డిగ్రీ కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ కె.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎనీ్టయూ హెచ్‌తో ఇతర వర్సిటీలు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల బోధన సిబ్బందికి ఈ పెంపు వర్తించనుంది.2016 యూజీసీ వేతనాలపై ఇలా..: సవరించిన యూజీసీ వేతనాలు–2016 అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 9 శాతం నుంచి 12 శాతానికి ప్రభుత్వం పెంచింది. యూజీసీ వేతనాలు–2016 అందుకుంటున్న... ప్రభుత్వ, ఎయిడెడ్ అనుబంధ డిగ్రీ కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది, జయశంకర్ వ్యవసాయ వర్సిటీ, జేఎన్టీయూహెచ్తోపాటుఇతర వర్సిటీలు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల బోధన సిబ్బందికి ఇది వర్తిస్తుంది. వేతన సవరణ–2010 ప్రకారం వేతనాలు పొందు తున్న ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 112.992 శాతం నుంచి 118.128 శాతానికి ప్రభుత్వం పెంచింది. పార్ట్ టైం విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లకు నెలకు రూ.100 వేతనం పెరిగింది. పెన్షనర్ల డీఏపై గురువారం ఉత్తర్వులిచ్చే అవకాశముంది. -
కరువు భత్యంపెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులు, పెన్షనర్లకు తీపికబురు. కరువు భత్యం(డీఏ) పెంపును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. 2019, జనవరి 1 నుంచి జూలై 1 మధ్య కాలానికి సంబంధించిన 3.144 శాతం డీఏను మంజూరు చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 33.536 శాతానికి పెరగనుంది. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. అలాగే 6,143 భాషా పండితులు, 802 పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ గతంలో రాష్ట్ర విద్యా శాఖ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం రాటిఫై చేసింది. గతంలో ఇచ్చిన మాట ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతానని కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించే అంశంపై కేబినెట్లో విస్తృతంగా చర్చించారు. ఈ అంశంపై అధ్యయనం జరిపి నివేదిక సమర్పించడానికి అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటైన నేపథ్యంలో వాటికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను కూడా పునర్వ్యవస్థీకరించే అంశాన్ని పరిశీలించాలని కేబినెట్ పోలీసు శాఖను కోరింది. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. -
నవంబర్ తొలి వారంలో డీఏ పెంపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులు, పెన్షనర్ల కరువు భత్యం(డీఏ) పెంపు నకు సంబంధించిన ఉత్తర్వులు నవంబర్ తొలి వారంలో వెలువడనున్నాయి. డీఏ మంజూరుకు సంబంధిం చిన ఫైలుపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. ఈ నెల 24తో హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల కోడ్ ముగిసిన వెం టనే కరువు భత్యం మంజూ రుకు సంబం« దించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేస్తుందని ప్రచారం జరిగింది. అయితే, ప్రభుత్వ ఉద్యోగులకు అక్టోబర్ మాసానికి చెందిన జీతాల చెల్లింపు తదితర పనుల్లో బిజీగా ఉండ టంతో ఉత్తర్వులు జారీ కాలేదని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ తొలి వారంలో 3.144 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు వచ్చే అవకాశా లున్నాయి. 2019 జూలై 1 నుంచి పెంపు వర్తింపజేయనున్నారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్ర మోదీ సర్కార్ దీపావళి కానుక అందించింది. డీఏ 5శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రకాష్ జవదేకర్ బుధవారం మీడియాకు వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఉద్యోగులకు చెల్లించే 12 శాతంనుంచి 17శాతానికి పెరిగింది. తాజా పెంపుతో కేంద్ర ప్రభుత్వానికి 16వేల కోట్ల రూపాయల భారం పడనుందని కేంద్రమంత్రి వెల్లడించారు. పెంచిన డీఏను ఈ ఏడాది జూలై నుంచి అమలు చేయనున్నారు. దీంతో 50 లక్షలమంది ఉద్యోగులకు, 62 లక్షలమంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. అంతేకాదు ఆశా వర్కర్కకు కేంద్రం అందించే భత్యాన్ని రెట్టింపు చేస్తున్నట్టు కేంద్రమంత్రి ప్రకటించారు. ఇప్పటివరకు వెయ్యిరూపాయిలుగా ఉన్న ఈరెమ్యూనరేషన్ ప్రస్తుతం రూ. 2 వేలకు చేరింది. -
ప్రభుత్వ ఉద్యోగులకు 3.144% డీఏ పెంపు
గతేడాది జూలై నుంచి వర్తింపజేస్తూ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ) 3.144 శాతం పెంచింది. గత ఏడాది జూలై నుంచి ఇది వర్తిస్తుందని ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీన అందుకునే వేతనం (మార్చి నెల జీతం) నుంచి ఈ పెరిగిన డీఏను నగదుగా చెల్లిస్తామని... బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.50 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు మూల వేతనంపై 12.052 శాతం డీఏ అమల్లో ఉంది. తాజా పెంపుతో ఇది 15.196 శాతానికి చేరింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంగళవారం జీవో నం.25 జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థల్లో రెగ్యులర్ జీతంపై పనిచేస్తున్న వారికి, రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఎయిడెడ్ విద్యా సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులు, బోధన, బోధనేతర సిబ్బందికి పెరిగిన డీఏ వర్తిస్తుంది. గత ఏడాది జూలై నుంచి ఫిబ్రవరి నెల వరకు చెల్లించాల్సిన డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. 2004 సెప్టెంబర్ ఒకటి తర్వాత నియామకమై కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో కొనసాగుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు 90 శాతం బకాయిలు నగదుగా చెల్లిస్తారు. మిగతా పది శాతాన్ని ప్రాన్ (పీఆర్ఏఎన్) ఖాతాలో జమ చేస్తారు. ఈ ఏడాది మే 31లోగా పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు మాత్రం మొత్తం బకాయిలను నగదు రూపంలో చెల్లిస్తారు. జీపీఎఫ్ ఖాతా లేని ఉద్యోగులు ఉన్నట్లయితే వారికి సంబంధించిన డీఏ బకాయిల మొత్తాన్ని ప్రభుత్వం కంపల్సరీ సేవింగ్ అకౌంట్లో జమ చేస్తుంది. సదరు ఉద్యోగులు ఖాతాలు తెరిచిన తర్వాత జీపీఎఫ్‌లో సర్దుబాటు చేస్తారు. బకాయిలకు సంబంధించి ఈ నెల 15వ తేదీలోగా ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో బిల్లులు సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. తమ పరిధిలోని ఉద్యోగులందరూ డీఏ బకాయిలు క్లెయిమ్ చేసినట్లుగా డీడీవోలు ధ్రువీకరణ పత్రం జత చేస్తేనే... మే నెల వేతన బిల్లులు పాస్ చేయాలని ఆదేశించింది. అయితే పెన్షనర్లకు సంబంధించిన డీఏ ఉత్తర్వులను ఇంకా విడుదల చేయలేదు. -
తెలంగాణ ఉద్యోగులకు డీఏ పెంపు
- ప్రస్తుత డీఏకు 3.144 శాతం అదనం.. ఏప్రిల్ ఒకటిన జీతంతో చెల్లింపు - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. 4.50 లక్షల మందికి ప్రయోజనం - గత ఏడాది జులై నుంచి ఇవ్వాల్సిన బకాయిలు జీపీఎఫ్‌లో జమ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది జులై నుంచి 3.144 శాతం చొప్పున పెరిగిన డీఏను చెల్లించనున్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.50 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు మూల వేతనంపై 12.052 శాతం డీఏ అమల్లో ఉంది. దీనికి అదనంగా 3.144 శాతం కలిపి.. 15.196 శాతం డీఏ చెల్లించనుంది. తెలంగాణ ఆర్థిక శాఖ మంగళవారం అందుకు సంబంధించిన జీవో నెం.25 జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం... మార్చి నెల జీతంతోనే పెరిగిన కరువు భత్యాన్ని నగదుగా చెల్లిస్తారు. అంటే ఏప్రిల్ ఒకటో తారీఖున పెరిగిన డీఏ ఉద్యోగుల చేతికందుతుంది. ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ గత ఏడాది జులై నుంచి పెరిగిన డీఏ వర్తిస్తుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంధాలయ సంస్థల్లో రెగ్యులర్ జీతంపై పనిచేస్తున్నవారికి, రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఎయిడెడ్ విద్యా సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ల్లో పని చేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి, ఉద్యోగులకు పెరిగిన డీఏ వర్తిస్తుంది. గత ఏడాది జులై నుంచి ఫిబ్రవరి వరకు ఉన్న డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. 2004 సెప్టెంబర్ ఒకటి తర్వాత నియామకమై కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో కొనసాగుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు 90 శాతం బకాయిలు నగదుగా చెల్లిస్తారు. మిగతా పది శాతాన్ని ప్రాన్(పీఆర్ఏఎన్) అకౌంట్లో జమ చేస్తారు. ఈ ఏడాది మే 31లోగా పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు వంద శాతం బకాయిలు నగదు రూపంలోనే చెల్లిస్తారు. జీపీఎఫ్ ఖాతా లేని ఉద్యోగులున్నట్లయితే వారికి సంబంధించిన డీఏ బకాయిల మొత్తాన్ని ప్రభుత్వం కంపల్సరీ సేవింగ్ అకౌంట్లో జమ చేస్తుంది. సదరు ఉద్యోగులు ఖాతాలు తెరిచిన తర్వాత జీపీఎఫ్‌లో సర్దుబాటు చేస్తారు. బకాయిలకు సంబంధించి ఈనెల 15లోగా ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో బిల్లులు సమర్పించాలని ఆర్థిక శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తమ పరిధిలోని ఉద్యోగులందరూ డీఏ బకాయిలు క్లెయిమ్ చేసినట్లుగా డీడీవోలు ధ్రువీకరణ పత్రం జత చేస్తేనే... మే నెల వేతన బిల్లులు పాస్ చేయాలని ఆదేశించింది. -
కొంపముంచిన ఈపీఎస్-95
కేంద్ర ప్రభుత్వం 1995లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీ మును ప్రారంభించి అప్పటివరకు ఉద్యోగులకు దీనిని కంపల్స రీ చేయడం జరిగింది. అప్పట్లో వేతనాన్ని నెలకు రూ. 6,000 లుగా లెక్కగట్టి పెన్షన్‌ను నిర్ణయించడంవల్ల రిటైరైన ఉద్యోగులకు పింఛను నెలకు వెయ్యి రూపాయలలోపే వస్తోంది. దీనికి కరువుభత్యంతో అనుసంధానం చేయకపోవడంవల్ల దశాబ్ద కాలంగా ఎదుగూబొదుగూ లేకుండాపోయింది. కొంత మంది పెన్షనర్లు తమ అవసరాల నిమిత్తం కొంత భాగాన్ని అమ్ముకు న్నారు. ప్రభుత్వ రూలు ప్రకారం ఈ భాగం తిరిగి పదిహేను సంవత్సరాల తరువాత పెన్షన్‌లో కలసిపోతుంది. కానీ, 95 నాటి ఈపీఎస్ స్కీములో ఉన్నవారికి ఈ రూలు వర్తించదట. అంటే వంద నెలల్లో అమ్మగా వచ్చిన మొత్తం బాకీ తీరిపోగా, వీరు జీవితాంతం కడుతూనే ఉండాలి. మరో విఘాతం ఏమిటంటే, ఈ పెన్షనర్లకు ఏ గవర్నమెంట్ ఆసుపత్రిలోనూ ఉచిత వైద్యం పొందే అవకాశం కల్పించలేదు. ప్రభుత్వ, లేదా బ్యాంకు ఉద్యోగులు.. డిపెండెంట్ల కింద వైద్య సదుపాయం పొందుదామంటే ప్రభుత్వ పెన్షను పొందుతున్నందున వీరు అర్హులుకారట. 1-4-2014 నుండి పెన్షన్‌ను రూ. వెయ్యి చేస్తామన్నారు. మరల 1-9-2014 నుంచి అన్నారు. కానీ రెండు నెలలు గడచినా పెంపు జరగలేదు. 1991లో మొదలైన నూతన ఆర్థిక విధానాల వల్ల ఆర్థికంగా నష్టపోయిన కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి 2002లో వేలాది ఉద్యోగులను బలవంతంగా వాలంటరీ సపరేషన్ స్కీం కింద తొలగించారు. ఉదాహరణకు అనేక రాష్ట్రాల్లోనున్న ఎరువుల కర్మాగారాలు (నేను రామగుండంలో పనిచేశాను). ఈ సంస్థల్లో 1992, 1997 లో జరగవలసిన వేతన సవరణలను జరపకుండా ఆపివేశారు. ఆ కారణంగా 1987లో ఉన్న వేతనాలమీద 2002లో వి.ఎస్.ఎస్ కింద కొంత అదనంగా కలిపి పంపించి వేశారు. ఈ విధంగా కూడా ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోయారు. ఈ ఈపీఎస్-95 పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఏ ఒక్కరూ స్పందించలేదు. ఏ ఉద్యోగం చేయకపోయినా వితంతువులకు, వికలాంగులకు పింఛన్లు బాగా పెంచారు. దశాబ్దాలపాటు ప్రభుత్వ ఉద్యోగం చేసినవారిని విస్మరిస్తున్నారు. 2002లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడున్నదీ బీజేపీ ప్రభుత్వమే. ఆవేదనతో రాసిన ఈ లేఖ చూసైనా మా ఈపీఎస్-95 పెన్షనర్లకు 1-1-2015 నుంచి నెలసరి పెన్షన్‌ను రూ. 7,500 లు (ప్రభుత్వం నిర్ణయించిన మినిమమ్ వేతనం 15,000 రూ.లను అనుసరించి) ఇస్తూ దీనివి కేంద్రం ఇచ్చే కరువు భత్యానికి అనుసంధానం చేయాలని విన్నవిస్తున్నాను. - ఎన్.ఎస్.ఆర్.మూర్తి రిటైర్డ్ ఆఫీసర్, రామగుండం ఎరువుల కర్మాగారం -
తుపాను విధుల్లోని అధికారులకు అదనంగా 50% డీఏ
* సీఎం చంద్రబాబు ఆదేశాలు * అధికారుల టీఏ, డీఏలకే రూ.50 కోట్లు * హైదరాబాద్‌లోని అధికారుల భోజనాలు, టిఫిన్లకు రూ.25 లక్షలు * పోలీసులకోసం అదనంగా రూ.2 కోట్లు సాక్షి, హైదరాబాద్: ఒకవైపు తుపాను తాకిడికి ఉత్తరాంధ్ర ప్రజానీకం విలవిల్లాడుతుంటే మరోవైపు సహాయక చర్యల పర్యవేక్షణకు వెళ్లిన ఐఏఎస్ అధికారులతోపాటు తుపాను విధుల్లో పాల్గొంటున్న అధికారులందరికీ అదనంగా 50 శాతం డీఏ ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. తుపాను కారణంగా సర్వస్వం కోల్పోయిన బాధితులకు ఇంతవరకు అరకొరగా కూడా ప్రభుత్వం సాయం అందకపోయినప్పటికీ.. సహాయక చర్యలను పర్వవేక్షిస్తున్న అధికారులకు మాత్రం ఎలాంటి లోటు రాకుండా ప్రభుత్వం చూస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తుపాను సహాయక చర్యలకోసం రాష్ట్రప్రభుత్వం ఏకంగా 40 మంది ఐఏఎస్‌లను ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు పంపింది. అదే సమయంలో హైదరాబాద్‌లోనే ఉండి సహాయక చర్యలను మరో 25 మంది అధికారులు పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్‌లోని అధికారులకు ఉదయం, సాయంత్రం టిఫిన్లతోపాటు మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలకోసం అడ్వాన్స్‌గా రూ.పాతిక లక్షలు విడుదల చేశారు. ఐఏఎస్‌లుగానీ, ఇతర అధికారులుగానీ వేరే జిల్లాలకు వెళితే సాధారణంగా వారికి డీఏ మంజూరు చేస్తారు. ఇప్పుడు సాధారణంగా ఇచ్చే డీఏకు అదనంగా మరో 50 శాతం ఇవ్వాలంటూ సీఎం ఆదేశాలిచ్చారు. తుపాను బాధితులకు ఆర్థికసాయం అందించడం మాట ఎలాగున్నా ఇప్పుడు అధికారుల టీఏ, డీఏలకే రూ.50 కోట్ల మేరకు వ్యయమవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ నుంచి వెళ్లిన అధికారులకు వసతి, భోజన సదుపాయం, ఇతర సౌకర్యాలు కల్పించే అదనపు బాధ్యతలు స్థానిక అధికారులపై పడుతున్నాయని, సహాయక చర్యల అమలుపైకన్నా ఎక్కువ దృష్టి వీరికి సౌకర్యాలు కల్పించడంపైనే ఉంటోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కాగా తుపాను ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అదనంగా రూ.2 కోట్లు విడుదల చేయాల్సిందిగా డీజీపీ కార్యాలయం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. -
ఉద్యోగులకు, పెన్షనర్లకు 7 శాతం డీఏ పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు శుభవార్త.వారికి చెల్లించే కరువు భత్యాన్ని (డీఏ) ఏడు శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ గురువారం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతమున్న డీఏను వంద శాతం నుంచి 107 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ తాజా పెంపుతో దాదాపు 30 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు, మరో 50 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరుతుంది. యూపీఏ ప్రభుత్వం చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న డీఏను 90 శాతం నుంచి నూరు శాతానికి పెంచింది. ఆ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఈ నూతన డీఏ పెంపు ఎనిమిది నెలలపాటు అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ఉద్యోగులకు, పింఛన్ దారులకు వర్తించనుంది.