సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులు, పెన్షనర్ల కరువు భత్యం(డీఏ) పెంపు నకు సంబంధించిన ఉత్తర్వులు నవంబర్ తొలి వారంలో వెలువడనున్నాయి. డీఏ మంజూరుకు సంబంధిం చిన ఫైలుపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. ఈ నెల 24తో హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల కోడ్ ముగిసిన వెం టనే కరువు భత్యం మంజూ రుకు సంబం« దించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేస్తుందని ప్రచారం జరిగింది. అయితే, ప్రభుత్వ ఉద్యోగులకు అక్టోబర్ మాసానికి చెందిన జీతాల చెల్లింపు తదితర పనుల్లో బిజీగా ఉండ టంతో ఉత్తర్వులు జారీ కాలేదని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ తొలి వారంలో 3.144 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు వచ్చే అవకాశా లున్నాయి. 2019 జూలై 1 నుంచి పెంపు వర్తింపజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment