సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల్లో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. గత రెండు నెలలుగా సగం జీతాలే తీసుకుంటున్న ఉద్యోగులు మే నెలలోనైనా ప్రభుత్వం పూర్తి జీతం ఇస్తుందా? పాత పద్ధతిలో నే వెళుతుందా అనే మీమాంసలో పడ్డారు. అయి తే, పూర్తి వేతనాలు చెల్లించే విషయంలో ప్రభు త్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని తె లుస్తోంది. గతం కంటే రాష్ట్ర ఆదాయం మెరుగుపడటం, రంజాన్ పండుగ ఉండటంతో ప్రభుత్వం ఈ నెలలో పూర్తి వేతనం ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నా యి. సగం వేతనాలకు బిల్లుల తయారీని నిలిపివేయాలని జిల్లాల ట్రెజరీలకు మౌఖిక ఆదేశాలు అందాయని చర్చ జరుగుతున్నా.. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఉత్త ర్వులు వెలువడలేదు. కాగా, అన్ని ప్రభుత్వ శాఖ లు ఇప్పటికే బిల్లులను ఆన్‌లైన్‌లో ట్రెజరీలకు పం పాయి. వీటిని బిల్లులు చేసేందుకు గాను ట్రెజరీ శాఖ కూడా సిద్ధమవుతోంది. తాజాగా సగం వేతనాలకే బిల్లులు తయారు చేయాలనే సంకేతాలు ఆర్థిక శాఖ నుంచి ట్రెజరీలకు వచ్చాయని సంఘా లు పేర్కొంటున్నాయి తప్ప అధికారిక ప్రకటన లేదు. ఈ నేపథ్యంలో మే నెల వేతనం ఏమవుతుం దో? సీఎం కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో? చివరి క్షణంలో ఆర్థిక శాఖ నుంచి ఏం ఉత్తర్వులు వస్తాయోనని ఉద్యోగులు వేచి చూస్తున్నారు.
‘పూర్తి జీతమివ్వాలి..’
రాష్ట్రంలో ఉపాధ్యాయ, ఉద్యోగులకు మే నెల పూ ర్తి వేతనం చెల్లించాలని సీఎం కేసీఆర్‌కు పీఆర్‌టీయూ–టీఎస్ విజ్ఞప్తి చేసింది. లాక్‌డౌన్ సడలింపులతో ప్రభుత్వ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయని, రాష్ట్ర ఆదాయం కూడా పెరగడంతో మే నెల వేతనాలు పూర్తిగా చెల్లించాలని పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు విన్నవించారు. అలాగే మార్చి, ఏప్రిల్‌లో కోత పెట్టిన వేతనాలను కూడా చెల్లించాలని జేఏసీ చైర్మన్ కారెం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ మమత సీఎస్ సోమేశ్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment