government employees
-
ఉద్యోగులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు: వెంకట్రామిరెడ్డి
సాక్షి, గుంటూరు: ఎన్నికల్లో ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఏపీ గవర్నమెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు రాలేదని ధ్వజమెత్తారు. ‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు. వాలంటీర్లకు నెలకు 10 వేలు జీతం ఇస్తామని చెప్పి విస్మరించారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోలేదు’’ అని వెంకట్రామిరెడ్డి నిలదీశారు.‘‘కూటమి ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులను టార్గెట్ చేసి వేధిస్తోంది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కూడా కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. చిన్న ఉద్యోగులపై కూడా ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. కూటమి వేధింపులు తాళలేక ఐదు మంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోంది. వందలాది సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులు.. ప్రభుత్వ ఉద్యోగులే. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరపాలి’’ అని వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు.‘‘పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. బకాయిలను ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తారో షెడ్యూల్ ఇవ్వాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. వీఆర్ఏలకు తక్షణమే జీతాలు పెంచాలి’’ అని వెంకట్రామిరెడ్డి అన్నారు.ఇదీ చదవండి: చంద్రబాబే సుప్రీం.. రెడ్బుక్కే రాజ్యాంగం!చీకట్లో మహిళా ఉద్యోగులతో పెన్షన్లను పంపిణీ చేయమంటున్నారు. ఇదేనా ఉద్యోగులకు ఇచ్చే గౌరవం?. వేరే ఊరులో ఉండే మహిళా ఉద్యోగులు చీకట్లో వచ్చి ఎలా పెన్షన్లు పంచుతారు?. ఇవ్వకపోతే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో మహిళా ఉద్యోగుల గురించి ఎంతో చెప్పారు. కానీ ఆయన శాఖలోనే ఉద్యోగులకు పనిచేసే వాతావరణం లేదు. ఆర్టీసీ ఉద్యోగులను గత ప్రభుత్వం మూడు నెలల్లోనే ప్రభుత్వంలోకి తీసుకుంది. గత ప్రభుత్వం మూడు, నాలుగు నెలలకు ఒకసారి ఉద్యోగ నేతలతో సమావేశాలు నిర్వహించేంది. సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారు. ఈ ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో ఉద్యోగులను పట్టించుకోలేదు. కనీసం జీతాలు కూడా సరైన సమయంలో వేయటం లేదుట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల విషయంలో వేధింపులకు దిగుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చేయటంలేదు. పైగా హెల్త్ డిపార్ట్మెంట్లో వెయ్యి మందిని ఉన్నపళంగా తొలగించారు. ఒత్తిడి తట్టుకోలేక నలుగురు ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని పెద్ద వాలంటీర్లుగా మార్చారు. వందలాది మంది ఉద్యోగులకు షోజాజ్ లు ఇచ్చారు. ఆదివారం కూడా పని చేయమని నోటీసులు ఇచ్చారు’’ అని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. -
ప్రభుత్వ ఉద్యోగులమైనా.. ఏం‘ప్రయోజనం’?
నల్లగొండ జిల్లాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మహిళా ఉద్యోగి ఒకరు అనారోగ్య కారణాలతో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్) కింద విధుల నుంచి తప్పుకొన్నారు. తద్వారా అందే సొమ్ముతో తన ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయించుకోవచ్చని భావించారు. ఆమెకు గ్రాట్యుటీ, టీజీఎల్ఐసీ, లీవ్స్ ఎన్‌క్యాష్‌మెంట్, కమ్యూటేషన్ తదితర ప్రయోజనాల కింద మొత్తంగా రూ.60 లక్షల వరకు అందాల్సి ఉంది. కానీ ఏడాదిన్నర గడిచినా పెన్షన్ మినహా ఇతర ప్రయోజనాలేవీ అందలేదు. దీనితో తన ఆరోగ్య సమస్యకు పరిష్కారం లభించలేదని ఆమె వాపోతున్నారు.రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రానికి చెందిన ఓ టీచర్ (స్కూల్ అసిస్టెంట్) ఈ ఏడాది ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాలను ముందే లెక్కలు వేసుకుని.. జూన్‌లో కుమార్తె వివాహం జరిపించేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్‌లో రిటైర్ అయినా.. తర్వాతి రెండు నెలల్లో తనకు ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని భావించారు. కానీ పెళ్లి తేదీ సమీపిస్తున్నా ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందలేదు. దీంతో రూ.20 లక్షల మేర అప్పులు చేసి కుమార్తె పెళ్లి చేశాడు. ప్రభుత్వం నుంచి సొమ్ము అందగానే అప్పులు తిరిగి కట్టేయవచ్చని అంచనా వేసుకున్నారు. కానీ ఇంకా అందలేదు. అప్పులపై ఇప్పటికే రూ.2 లక్షలకుపైగా వడ్డీలు కట్టారు. ప్రభుత్వం నుంచి సొమ్ము ఇంకెప్పుడు వస్తుందోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. కేవలం నెలవారీ వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు తప్ప మిగతా ప్రయోజనాలేవీ అందడం లేదు. ఆయా బిల్లుల చెల్లింపును ఆర్థిక శాఖ నిలువరించడంతో వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. దీనితో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత చదువులు, ఇల్లు కట్టుకోవడం సహా ముఖ్యమైన అవసరాలకు సొమ్ము అందక.. బయట అడ్డగోలు వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. అన్నిరకాల ప్రయోజనాలూ ఆపేసి.. సాధారణంగా ఉద్యోగులకు ఏటా ఆర్జిత సెలవులను నగదు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఇలా సుమారు ఒక నెల వేతనానికి సరిపడా సొమ్ము అందుతుంది. వైద్య చికిత్సలకు సంబంధించిన మెడికల్ రీయింబర్స్మెంట్, ఉద్యోగుల జీవిత బీమా పథకం కింద బాండ్స్ మెచ్యూరిటీ అయితే అందాల్సిన సొమ్ము, పదవీ విరమణ పొందితే వచ్చే గ్రాట్యుటీ తదితర ప్రయోజనాలు రావాల్సి ఉంటుంది. కానీ సుమారు మూడేళ్లుగా ఉద్యోగులకు వేతనాలు, రిటైరైన వారికి పెన్షన్ డబ్బులు మినహా ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు అందడం లేదు. మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పదవీ విరమణ పొందిన వారికి సంబంధించి వివిధ రకాల బిల్లులు కలిపి సుమారు రూ.3,800 కోట్ల మేర ప్రభుత్వం బకాయిపడినట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వరా? ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాల కింద అందేవాటిలో మెజారిటీ అంశాలు ఉద్యోగులు వ్యక్తిగతంగా జమ చేసుకున్నవే. ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి (జీపీఎఫ్), జీవిత బీమా (టీజీఎల్ఐ) పథకాల కింద నెలవారీ వేతనాల నుంచి నిధులు జమ అవుతాయి. ఇలా దాచుకున్న నిధి నుంచి అత్యవసర పరిస్థితిలో కొంత మేర రుణరూపంలో వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక జీవిత బీమా పథకానికి సంబంధించి ఉద్యోగి వయసు 58 సంవత్సరాలు నిండితే.. ఆ బాండ్ కాలపరిమితి పూర్తి కావడంతో అందుకు సంబంధించి ఆర్థిక ప్రయోజనం వెంటనే ఉద్యోగి ఖాతాలో జమ కావాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లుగా ఉన్న నేపథ్యంలో... జీవితబీమా పథకం బాండ్లు మెచ్యూరిటీ అయిన ఉద్యోగుల సంఖ్య సుమారు 25 వేల మంది వరకు ఉంటుంది. వీరికి జీవిత బీమా పథకం కింద చెల్లించాల్సిన బకాయిలు రూ.850 కోట్లుగా అంచనా. జీపీఎఫ్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రెండేళ్లుగా పైసా అందలేదు. ఇలా రూ.450 కోట్ల మేర చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నట్లు ఉద్యోగ సంఘ నేతలు అంచనా వేస్తున్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ రావట్లేదు.. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి నగదు రహిత కార్డుల అంశం కొలిక్కి రాలేదు. దీంతో ఉద్యోగులు వారి వైద్య చికిత్సల కోసం చేసిన ఖర్చులను తిరిగి పొందేందుకు మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం కింద దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ బిల్లులు కూడా రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రూ.లక్ష లోపు ఉన్నవాటిలో కొ న్నింటిని కొత్త ప్రభుత్వంలో చెల్లించినా.. అంతకంటే ఎక్కు వ మొత్తంతో కూడిన బిల్లులు మాత్రం పరిష్కారం కాలేదు. తిప్పలు పడుతున్న రిటైర్డ్ ఉద్యోగులు 2021 ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. దానితో మూడేళ్లపాటు రిటైర్మెంట్లు ఆగిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఉద్యోగుల పదవీ విరమణలు మొదలయ్యాయి. ఈ ఏడాది నవంబర్ నెలాఖరు నాటికి దాదాపు 9,500 మంది పదవీ విరమణ పొందారు. వీరిలో 90శాతం మంది ఉద్యోగులకు ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదు. ఈ రూపంలో దాదాపు రూ.875 కోట్లు రావాల్సి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. వాస్తవానికి పదవీ విరమణ పొందిన నెలరోజుల్లోనే ఈ ప్రయోజనాలు ఉద్యోగులకు అందాలి. ఇలా సమకూరే నిధితో వారు తదుపరి జీవన ప్రణాళికను అమలు చేసుకుంటారు. కానీ ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పెరుగుతున్న అసంతృప్తి ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంపై ఉద్యోగులలో అసంతృప్తి పెరుగుతోంది. డీఏ బకాయిలు, పీఆర్సీ అమల్లో జా ప్యంపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు.. బిల్లుల చెల్లింపులన్నీ నిలిచిపోవడంతో సంఘాల నేతలను నిలదీస్తున్నారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జిల్లాల వారీగా వివిధ ఉద్యోగ సంఘాల కార్యవర్గాల ఎన్నికల సమయంలో.. పోటీ చేసినవారంతా ఉద్యోగుల ఆర్థిక అంశాలే ఎజెండాగా ముందుకు సాగారని గుర్తు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపుపై స్పందన లేకపోవడంతో ఇబ్బందిగా మారిందని వరంగల్ జిల్లా ఉద్యోగ సంఘ నేత ఎ.జగన్మోహన్రావు పేర్కొన్నారు. జిల్లాల్లో కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలన్నా ఉద్యోగులు నిలదీసే పరిస్థితి ఉందని వాపోయారు.బిల్లులు చెల్లించకుంటే.. ఉద్యమిస్తాం ప్రభుత్వ ఉద్యోగుల చెల్లింపులకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎఫ్ఎంఐఎస్) అమల్లోకి వచ్చిన తర్వాత నుంచీ సమస్యలు పెరిగాయి. అంతకు ముందు జిల్లా ఖజానా విభాగం(డీటీఓ) లేదా ఉప ఖజానా కార్యాలయాల (ఎస్టీఓ) పరిధిలో బిల్లుల చెల్లింపుల ప్రక్రియ వేగంగా జరిగేది. గత ప్రభుత్వంలో ఐఎఫ్ఎంఐఎస్ విధానాన్ని తెచ్చి, చెల్లింపులన్నీ కేంద్రీకృతం చేశారు. ఎలాంటి బిల్లును క్లియర్ చేయాలన్నా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల, రెండు నెలల్లో పరిష్కారం కావాల్సిన అంశాలు.. ఇప్పుడు ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కావడం లేదు. అన్నింటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో ముడిపెట్టడం వల్ల ఉద్యోగులకు చెల్లింపులు భారీగా పేరుకుపోయాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం రేవంత్‌ను కలసి ఉద్యోగుల సమస్యలను నివేదించాం. చిన్నపాటి బిల్లులు మాత్రమే క్లియర్ అయ్యాయి. ఈ నెలాఖరు కల్లా మెజార్టీ బిల్లులు పరిష్కరిస్తామన్నారు. లేకుంటే వచ్చే నెలలో జేఏసీ తరపున సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఉద్యమిస్తాం. – ఏలూరి శ్రీనివాసరావు, టీజీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు -
జీవో 317 బదిలీలకు ఓకే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో భాగంగా జీవో–317 కింద గతంలో కొత్త లోకల్ కేడర్లకు కేటాయించిన ఉద్యోగులను స్పౌజ్ కేటగిరీ, పరస్పర బదిలీలు, అనారోగ్య కారణాల కింద వేరే లోకల్ కేడర్లకు మళ్లీ బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. బదిలీలను డిసెంబర్ 31లోగా పూర్తిచేయాలని గడువు విధించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను పాత లోకల్ కేడర్ల నుంచి కొత్త లోకల్ కేడర్లకు గత ప్రభుత్వం కేటాయించింది. ఇందుకోసం 2021 డిసెంబర్ 6న జీవో 317ను జారీ చేసింది. ఈ ప్రక్రియలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని సుదూర ప్రాంతాల్లోని కేడర్లకు వెళ్లిన ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో జీవో–317, జీవో–56 సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సుల మేరకు తాజాగా మూడు కేటగిరీల కింద కేడర్ మార్పునకు అనుమతిచ్చింది. ఇక భార్యాభర్తలు ఒకేచోట! రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే భార్యాభర్తలను ఒకవేళ వే ర్వేరు లోకల్ కేడర్లకు కేటాయిస్తే కేడర్ మార్పును కోరుతూ దరఖాస్తు చేసుకోవడానికి వారికి అవకా శం కల్పిస్తామని జీవో–317లో ప్రభుత్వం పేర్కొంటోంది. పాలనావసరాలు, ఖాళీలకు లోబడి భార్యాభర్తలిద్దరినీ ఒకే కేడర్‌కు కేటాయిస్తామని హామీ ఇ చ్చింది. కొన్ని శాఖల్లో దీన్ని అమలు చేయలేదు. చాలామంది ఉద్యోగులు స్పౌజ్ కేటగిరీ కింద కేడర్ మార్పుకు దరఖాస్తు చేసుకున్నా పరిగణనలోకి తీసుకోలేదు. మంత్రివర్గం ఈ అంశాన్ని పరిశీలించి ఖాళీలకు లోబడి గరిష్టంగా సాధ్యమైనంత వరకు కేడర్ మార్పునకు అవకాశం కల్పించాలని సిఫార్సు చేసింది. సంబంధిత విభాగాధిపతుల నుంచి ప్రతిపాదనలు, సిఫార్సులను సేకరించి డిసెంబర్ 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్ని శాఖల కార్యదర్శులను తాజాగా ప్రభుత్వం ఆదేశించింది. నేటి నుంచి పరస్పర బదిలీలకు దరఖాస్తుల స్వీకరణ.. ఒకే శాఖలో ఒకే కేటగిరీ పోస్టులను కలిగిన ఇద్దరు వ్యక్తులు వేర్వేరు లోకల్ కేడర్లలో పనిచేస్తుంటే వారిని ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు పరస్పర బదిలీ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నెల 1 నుంచి 31 వరకు ఆన్లైన్ ద్వారా మళ్లీ కొత్తగా పరస్పర బదిలీలకు దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించింది. ఇందుకు ప్రత్యేక వెబ్‌పోర్టల్ (po2018mutualtransfers. telangana.gov.in) ను రూపొందించింది. ఎప్పటిలోగా ఈ బదిలీలను పూర్తి చేయాలన్న అంశాన్ని ప్రభుత్వం స్పష్టం చేయలేదు. ఒకే యాజమాన్యం కింద ఒకే కేటగిరీ పోస్టులో ఉండి ఒకే సబ్జెక్టును ఒకే మీడియంలో బోధిస్తున్న ఉపాధ్యాయు లు, ప్రధానోపాధ్యాయులు మాత్రమే ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు పరస్పర బదిలీకి అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా ప్రజాపరిషత్, మండల పరిషత్, ఇతర స్థానికసంస్థల పాఠశాలల్లోని బోధనేతర ఉద్యోగులను పరస్పర బదిలీల్లో భాగంగా మరో లోకల్ కేడర్ పరిధిలోని సంబంధిత జిల్లా ప్రజాపరిషత్, మండల పరిషత్, ఇతర స్థానిక సంస్థల్లోని పాఠశాలలకు మాత్రమే బదిలీ చేస్తామని తెలిపింది. పరస్పర బదిలీల కింద వచ్చే ఉద్యోగులను కొత్త లోకల్ కేడర్ సీనియారిటీ జాబితాలో చివరి రెగ్యులర్ ఉద్యోగి తర్వాత చివరి ర్యాంకును కేటాయిస్తామని స్పష్టం చేసింది.అనారోగ్య కారణాల కిందబదిలీలకు పచ్చజెండా.. ఆరోగ్య కారణాల కింద ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు బదిలీ కోరుతూ ఉద్యోగులు సమర్పించిన దరఖాస్తులను సంబంధిత శాఖల కార్యదర్శులు పరీక్షించి అర్హులైన ఉద్యోగుల కేడర్‌ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 70 శాతం, ఆపై వైకల్యం కలిగిన ఉద్యోగులు, కారుణ్య నియామకం కింద నియమితులైన వితంతు ఉద్యోగులు, కేన్సర్ బాధిత ఉద్యోగులు, న్యూరోసర్జరీ, కిడ్నీ మార్పిడి, కాలేయం మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న ఉద్యోగులు కేడర్ మార్పునకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అవకాశం కల్పించాలని కోరింది. మానసిక వైకల్యంగల పిల్లలు కలిగిన ఉద్యోగులను వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాలకు బదిలీ చేయాలని సూచించింది. డిసెంబర్ 31లోగా బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలని కోరింది. -
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల మెడపై వేలాడుతున్న ‘లే ఆఫ్’ కత్తి!
వాషింగ్టన్ : డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) సంయుక్త సారథులు బిలియనీర్ ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి అమెరికాలోని 20 లక్షల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇకపై వారానికి ఐదురోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనని హెచ్చరికలు జారీ చేయనున్నారు. కాదు కూడదు అంటే అంటే వారిని తొలగించే దిశగా అడుగులు వేయనున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెలుగులోకి వచ్చింది.అమెరికా ప్రభుత్వం చేస్తున్న దుబారా ఖర్చుల్ని తగ్గించాలని ట్రంప్ ఆదేశాలతో మస్క్, వివేక్ రామస్వామిలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని రద్దు చేయనున్నారు. వారానికి ఐదురోజులు కార్యాలయాలకు వచ్చి పనిచేసేలా ఆదేశించనున్నారు.ఒకవేళ ఆఫీస్ నుంచి పనిచేయడాన్ని వ్యతిరేకించే ప్రభుత్వ ఉద్యోగులకు.. కోవిడ్-19 సమయంలో అమెరిన్ ట్యాక్స్ పేయర్స్ చెల్లించిన ప్రత్యేక చెల్లింపుల్ని నిలిపివేయనున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.ఇటీవల,వివేక్ రామస్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న భారీ దుబారా ఖర్చుల్ని తగ్గించే పనిలో ఉన్నాం. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులతో బలవంతంగా రాజీనామా చేయించి వారి సంఖ్యను భారీగా తగ్గిస్తాం. దుబారా ఖర్చుల్ని తగ్గిస్తాం. తాము సైతం డోజ్‌లో ఫెడరల్ అధికారులు,ఉద్యోగులులా కాకుండా వాలంటీర్లుగా పనిచేస్తామని తెలిపారు. మీకు మస్క్ గురించి తెలుసో,లేదో.. ఆయన ఉలి తీసుకురాలేదు. రంపం తెచ్చారు. మేం దాన్ని బ్యూరోక్రసీపై వాడాలనుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ హైలెట్ చేసింది.కాగా,అమెరికాలోని ప్రముఖ ఎన్జీవో సంస్థ పార్ట్నర్షిప్ ఫర్ పబ్లిక్ సర్వీస్ నివేదిక ప్రకారం.. అమెరికాలో మొత్తం 20లక్షలమంది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులున్నారు. 400పైగా ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ మొత్తం ఉద్యోగుల్లో 80 శాతం మంది అమెరికా రాజధాని వాషింగ్టన్లో పనిచేస్తున్నారు. -
వామ్మో.. 61 ఏళ్లు.. సర్కారు బెంబేలు
సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదలుకొని రానున్న ఐదేళ్లలో ఏకంగా 44 వేల మంది ప్రభుత్వ ఉద్యో గులు రిటైర్ కానున్నారు. వీరికి రిటైర్మెంట్ బెనిఫిట్ల కింద సగటున రూ.30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు చెల్లించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పెద్ద భారంగా మారనుంది..’ఇది ఇటీవల 16వ ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదికలోని ఓ ప్రధాన అంశం. ఆర్థిక శాఖ లెక్క ప్రకారం రానున్న ఐదేళ్ల కాలంలో ఖజానాపై దాదాపు రూ.20 వేల కోట్ల భారం పడనుందని అంచనా. అంటే సరాసరి నెలకు రూ.350 కోట్ల పైచిలుకు రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసమే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో మూడేళ్ల పాటు రిటైర్మెంట్లు లేకపోవడం, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే మళ్లీ రిటైర్మెంట్లు ప్రారంభం కావడం, అప్పటి నుంచి ఉన్న భారం ఒక్కసారిగా మీద పడడంతో ఎలా నెట్టుకురావాలో అర్థం కాక ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. పదవీ విరమణ వయసు పెంపుతో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. 2021లో తీసుకున్న ఈ నిర్ణయంతో 2024 మార్చి 31వరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు జరగలేదు. దీంతో వారికి రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించే అవసరం పడలేదు. ఆ తర్వాత నుంచి రిటైర్మెంట్లు మొదలవగా ఈ ఏడాది డిసెంబర్ వరకు మొత్తం 7,995 మంది రిటైరవుతారని చెబుతున్నారు. వీరికి తక్షణ బెనిఫిట్ల కోసం రూ.3,200 కోట్ల వరకు అవసరం కాగా సరిగ్గా చెల్లించలేని పరిస్థితి ఉంది. పైగా ఇక నుంచి ఈ భారం ప్రతి యేటా పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం కనీసం నెలకు రూ.350 కోట్ల చొప్పున ఏడాదికి రూ.3,800 కోట్లు అవసరం అవుతాయని, రానున్న ఐదేళ్ల కాలంలో సుమారు రూ.20 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ అధికారులు చెపుతున్నారు. ఏమేమి చెల్లించాలి? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి రిటైరైన తర్వాత చెల్లించాల్సిన బెనిఫిట్లు చాలానే ఉంటాయి. వారి మూల వేతనానికి అనుగుణంగా హెచ్ఆర్ఏ, సీసీఏ, డీఏలను కలుపుకొని లెక్కించిన వేతనానికి 10 రెట్లు ఆర్జిత సెలవుల (లీవ్ శాలరీ) రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లీవ్ శాలరీల మొత్తం ఒక్కో ఉద్యోగికి సగటున రూ.8 లక్షల వరకు ఉంటుందని అంచనా. దీంతో పాటు గ్రాట్యుటీ కింద రూ.12 లక్షలు, కమ్యుటేషన్ రూపంలో మరో రూ.20 లక్షలు చెల్లించాలి. ఈ లెక్కల ప్రకారం చూస్తే కనీసం రూ.40 లక్షలు ఒక్కో ఉద్యోగికి చెల్లించాలన్న మాట. రానున ఐదేళ్లలో అంటే 2028 నాటికి రిటైర్ అయ్యే సంఖ్య నెలకు 10 వేలకు చేరుతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అప్పుడు నెలకు కనీసం రూ.400 కోట్లు (అప్పటికి) అవసరమని అంచనా. గడ్డు పరిస్థితుల్లో ఖజానా రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత పరిస్థితి ప్రకారం మార్చి నెల నుంచి రిటైరైన వారికి బెనిఫిట్లు చెల్లించడం కష్టసాధ్యంగా మారింది. ప్రస్తుతం ఉద్యోగుల మెడికల్ బిల్లుల చెల్లింపు కూడా సాధ్యం కాని పరిస్థితి ఉంది. సరెండర్ లీవ్స్ లాంటి చెల్లింపులు కూడా గగనమవుతున్నాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికితోడు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒక డీఏ ప్రకటించింది. 2022 జూలై డీఏ ప్రకటించినా మరో నాలుగు డీఏలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ జీవిత బీమా (జీఎల్ఐ) కింద జమ చేసుకున్న నిధులను కూడా వాడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రిటైరయ్యే ఉద్యోగులకు వారి జీఎల్ఐతో పాటు జీపీఎఫ్లపై వడ్డీలు కూడా చెల్లించాల్సి వస్తోంది. ఈ చెల్లింపుల విషయంలో ఆర్థిక శాఖ తలలు పట్టుకుంటోంది. తమ బిల్లుల కోసం ఉద్యోగులు రోజూ సచివాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. రిటైర్మెంట్కు మూడు నెలల ముందే బెనిఫిట్ల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళతాయని, ఈ మూడు నెలల కాలంలో ప్రభుత్వ వీలును బట్టి ఆర్థిక అంశాలను సర్దుబాటు చేసుకుని ఉద్యోగుల బెనిఫిట్లు చెల్లించాల్సిందేనని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ప్రభుత్వ ఉద్యోగులకు 3.64% డీఏ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు దీపావళి కానుక ఇచ్చింది. మంత్రివర్గం ఆమోదం మేరకు 3.64% కరువు భత్యం (డీఏ) మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ డీఏను డిసెంబర్ 1న చెల్లించే నవంబర్ నెల వేతనంతో కలిపి ఇవ్వనున్నట్టు ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. దీంతో ప్రస్తుతం 22.75%గా ఉన్న డీఏ 26.39 శాతానికి పెరగనుంది. 2022, జూలై 1 నుంచి ఈ డీఏ వర్తిస్తుందని, ఇందుకు సంబంధించిన బకాయిలను (జూలై 1, 2022 నుంచి అక్టోబర్31, 2024 వరకు) ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్) ఖాతాలో జమ చేయనున్నట్టు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, మార్చి 31, 2025లోపు పదవీ విరమణ పొందే ఉద్యోగులకు 17 వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్టు తెలిపారు. 2004, సెప్టెంబర్ 1 తర్వాత నియమితులై కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఇచ్చే డీఏలో 10 శాతం వారి ‘ప్రాన్’ (పరి్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్) అకౌంట్లలో జమ చేస్తామని, మిగిలిన మొత్తాన్ని జనవరి, 2025 వేతనం నుంచి మొదలుపెట్టి 17 వాయిదాల్లో చెల్లిస్తామన్నారు. పీఎఫ్ ఖాతాలు లేని కాంటిజెంట్ ఉద్యోగులకు కూడా 2025, జనవరి నెల వేతనంతో మొదలుపెట్టి 17 వాయిదాల్లో చెల్లిస్తామని తెలిపారు. ఒకవేళ ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఈ డీఏను ఒకేసారి చెల్లించనున్నట్టు పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జీహెచ్ఎంసీ ఉద్యోగుల డీఏలను ఆయా సంస్థలే భరించాల్సి ఉంటుందని వివరించారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా అన్ని శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
మూడేళ్ల తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తాం అనడం దుర్మార్గం : హరీష్ రావు
సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మన్మోహన్ వీడ్కోలు కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ అయిన 6 వేల మంది ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 3 సంవత్సరాల తర్వాత చెల్లిస్తాం అనడం దుర్మార్గం.4 డీఏలకు ఒక డీఏ మాత్రమే ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపరిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు సూచించారు. -
కులగణనకు ఇంటింటి సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేను నవంబర్ 4 లేదా 5న ప్రారంభించి 30లోగా పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. సర్వేకు సంబంధించిన ప్రశ్నావళి, విధివిధానాలను ఆమోదించింది. రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని ఫిబ్రవరి 17న శాసనసభలో తీర్మానం చేయడంతోపాటు ఇప్పటికే జీవో 18 ప్రభుత్వం జారీ చేయగా సీఎం రేవంత్ సోమ వారం రాష్ట్ర నోడల్ అధికారి, జిల్లా కలెక్టర్లతో సమావేశమై సర్వేపై దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లా, మండల స్థాయిలోని 80 వేల మంది అధికారులు, సిబ్బందికి కులగణనపై శిక్షణ అందించనున్నట్లు పొన్నం తెలిపారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 ఇళ్లను కేటాయించి సర్వే పూర్తి చేయడానికి 3, 4 రోజుల సమయం ఇస్తున్నామన్నారు. 15–20 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తికానుందని... ఇప్పటికే షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు వివరించారు. గత ప్రభుత్వం ఒక్క రోజులో కుటుంబ సర్వే నిర్వహించి వివరాలను బయటపెట్టలేదని.. కానీ తాము సర్వే ముగిశాక సమాచారాన్ని, ప్రయోజనాలను ప్రజా బాహుళ్యంలో ఉంచి పారదర్శకంగా వ్యవహరిస్తామని పొన్నం తెలిపారు. సర్వేలో సరైన సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. దీపావళి కానుకగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామసభ పెట్టి కులమతాలు, పారీ్టలకు అతీతంగా పేదల్లో బహు పేదలను ఎంపిక చేయాలని నిర్ణయించామన్నారు. దీపావళి మర్నాడు లేదా ఆ తర్వాతి రోజున సీఎంతోపాటు మంత్రులం స్వయంగా మొగ్గు వేసి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. ఉద్యోగులకు ఒక డీఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు పెండింగ్ డీఏలను చెల్లించాల్సి ఉండగా దీపావళి కానుకగా 2022 జనవరి నుంచి రావాల్సిన ఒక డీఏను మంజూరు చేశామని పొంగులేటి చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చల్లో సీఎం, డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే జీవో 317 కింద గత ప్రభుత్వ హయాంలో దూర ప్రాంతాలకు బదిలీ అయిన ఉద్యోగులను స్పౌజ్, ఆరోగ్య, పరస్పర కేటగిరీల కింద తక్షణమే సొంత ప్రాంతాలకు బదిలీలు నిర్వహించాలని నిర్ణయించామని వివరించారు. జీవో 317 కింద దూర ప్రాంతాలకు వెళ్లిన ఇతర ఉద్యోగుల సమస్యతోపాటు ఉద్యోగ నియామకాలకు జీవో 46తో ఉన్న ఇబ్బందుల పరిష్కారానికి చట్ట రీత్యా, కోర్టుల రీత్యా చిక్కులున్న నేపథ్యంలో తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి కేంద్రం ఆమోదం కోసం పంపాలని నిర్ణయించామని పొంగులేటి తెలిపారు. ఉద్యోగులకు ఒక డీఏ చెల్లిస్తే ప్రభుత్వంపై రూ. 3 వేల కోట్ల భారం పడనుందని.. అందుకు ప్రతి నెలా రూ. 230 కోట్లు అదనంగా కావాలని పొన్నం తెలిపారు. నాలుగు కేటగిరీలుగా మిల్లర్ల విభజన.. రాష్ట్రంలో మిల్లర్లను నాలుగు విభాగాల కింద విభజిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఎలాంటి ఆరోపణలు లేని మిల్లర్లకు ప్రథమ కేటగిరీ, ప్రభుత్వ నోటిసులకు స్పందించి చెల్లింపులు చేసిన వారిని రెండో కేటటిరీ, నోటిసులిచ్చినా చెల్లింపులు చేయక రికవరీకి గురైన వారిని మూడో కేటగిరీగా విభజించి వారి నుంచి బ్యాంకు గ్యారెంటీలు తీసుకున్న తర్వాత ధాన్యం సేకరణలో అనుమతించాలని, ఇంకా డిఫాల్టర్లుగా మిగిలిపోయిన వారిని అనుమతించరాదని నిర్ణయించామన్నారు. మిల్లర్ల న్యాయమైన సమస్యల పరిష్కారానికి పొరుగు రాష్ట్రాల్లో అవలంభిస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి ఆమోదించామని చెప్పారు. రూ. 24,269 కోట్లతో మెట్రో రెండో దశ హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టును కేంద్రంతో కలిసి జాయింట్ వెంచర్ కింద నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. నాగోల్–శంషాబాద్, రాయదుర్గ్–కోకాపేట, ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట, మియాపూర్–పటాన్చెరు, ఎల్బీనగర్–హయత్‌నగర్ కారిడార్లలో 76.4 కి.మీ. కొత్త మెట్రో రైల్వే లైన్‌ను రూ. 24,269 కోట్ల అంచనాలతో ఏర్పాటు చేయడానికి రూపొందించిన డీపీఆర్‌ను కేంద్రానికి పంపేందుకు మంత్రివర్గం ఆమోదించింది. పీపీపీ విధానంలో రోడ్ల అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ, ఆర్ అండ్ బీ పరిధిలో 16–17 వేల కి.మీ. కొత్త రోడ్ల నిర్మాణం/పునరుద్ధరణ పనుల విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి తప్పనిసరిగా బీటీ రోడ్డు, ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు, ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు 4 లేన్ల రోడ్లను నిర్మించాలన్న ప్రతిపాదనలను ఆమోదించింది. ప్రతి ఉమ్మడి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని పీపీపీ విధానంలో వచ్చే 4 ఏళ్ల పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకు రూ. 25 వేల కోట్ల నుంచి రూ. 28 వేల కోట్ల వ్యయం కానుందని ప్రాథమికంగా అంచనా వేసింది. మరికొన్ని నిర్ణయాలు.. ⇒ ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి గోషామహల్ స్టేడియం స్థలాన్ని అప్పగించడంతోపాటు ములుగులోని గిరిజన వర్సిటీకి 211 ఎకరాల భూమిని, స్పోర్ట్స్ వర్సిటీకి గచ్చిబౌలి స్టేడియాన్ని అప్పగించాలనే ప్రతిపాదనలకు ఆమోదం. ⇒ మధిర, వికారాబాద్, హుజూర్‌నగర్‌లో స్కిల్స్ వర్సిటీకి అనుబంధంగా కొత్త ఐటీఐల మంజూరు. ⇒ కొత్తగా ఏర్పడిన 8 కోర్టులు, రెండు వైద్య కళాశాలలకు సిబ్బంది మంజూరు. ⇒ కేంద్ర ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా కడెం ప్రాజెక్టులో పూడికతీతకు ఆమోదం. అన్ని ప్రాజెక్టుల్లో 23 శాతం పూడికతో నిండి ఉన్నాయని, భవిష్యత్తులో వాటిలోని పూడిక తొలగిస్తామని పొంగులేటి తెలిపారు. సినీనటుడు బాలకృష్ణకు స్టూడియో నిర్మాణానికి ఎలాంటి స్థలం కేటాయించలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. దీపావళికి ముందే పొలిటికల్ బాంబుల పేలుళ్లు రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు ఒకట్రెండు రోజుల్లో పేలబోతున్నాయని దక్షిణ కోరియా పర్యటన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి స్పందించారు. దీపావళి టపాసుల కంటే ముందే ఇవి పేలుతాయని స్పష్టం చేశారు. కాగా, దక్షిణ కొరియాలో అమలైన నదుల పునరుజ్జీవ ప్రాజెక్టు గురించిన వివరాలను మంత్రులు పొంగులేటి, పొన్నం తమ సహచరులకు వివరించినట్లు సమాచారం. అయితే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు గురించి ప్రభుత్వం తీసుకోనున్న చర్యలపై ప్రత్యేకంగా మరో సమావేశం ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే అభిప్రాయం కేబినెట్లో వ్యక్తమైనట్లు తెలియవచ్చింది. -
ఆదాయం తగ్గింది.. మార్చి దాకా అడగొద్దు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. వచ్చే మార్చి 31 వరకు ఎలాంటి ఆర్థికపరమైన ఒత్తిడులు చేయవద్దని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆర్థికేతర అంశాలను తక్షణమే పరిష్కరించేందుకు సర్కారు సిద్ధంగా ఉందని.. దీనికి సంబంధించి మంత్రులతో కమిటీ వేస్తున్నామని తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)ఆందోళన బాట పడతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఏసీ ప్రతినిధులతో సీఎం రేవంత్ గురువారం సమావేశమయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి జేఏసీ నుంచి హాజరైన 36 మందికి మాట్లాడే అవకాశం కల్పించారు. వారు చెప్పిన అంశాలు, సమస్యలను విన్నారు. అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రతినిధులను ఉద్దేశించి సీఎం రేవంత్ 15 నిమిషాల పాటు మాట్లాడారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. డీఏలపై ఆలోచన చేస్తాం.. ప్రభుత్వం ఇవ్వాల్సిన 5 డీఏలను తక్షణమే విడుదల చేయాలని సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కనీసం మూడు డీఏలను వెంటనే ఇవ్వాలని.. 26న జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఏలపై ప్రకటన చేయాలని కోరారు. దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని, ఏమాత్రం వీలైనా ఎంతో కొంత న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. పెండింగ్ బిల్లులు, నగదు రహిత ఆరోగ్య కార్డుల జారీ అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నామని తెలిపారు. డీఏల విషయంలో ప్రభుత్వానికి ఒకట్రెండు రోజులు సమయం ఇవ్వాలని కోరారు. 317 జీవో సమస్యలను పరిష్కరిస్తాం.. స్థానిక జిల్లాలకు ఉద్యోగుల బదిలీ కోసం తీసుకొచ్చిన 317 జీవోతో ఏర్పడ్డ సమస్యలను పరిష్కారిస్తామని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. ఈ అంశంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన సీల్డ్ కవర్ నివేదికను శుక్రవారం ఉద్యోగ ప్రతినిధుల ముందే తెరుస్తామని చెప్పారు. అందులోని అంశాలను పరిశీలించి, తగిన సలహాలు ఇస్తే.. సమస్యలన్నీ పరిష్కారం అయ్యే దిశగా కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. భట్టి నేతృత్వంలో మంత్రుల కమిటీ.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో.. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబులతో కమిటీ వేస్తున్నట్టు సీఎం రేవంత్ వెల్లడించారు. దీపావళి పండుగ తర్వాత ఈ కమిటీ సంఘాల నేతలతో సంప్రదింపులు జరుపుతుందని.. ఈ క్రమంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వానికి సూచనలు చేస్తుందని తెలిపారు. సమావేశంలో జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, అదనపు కార్యదర్శి జనరల్ పింగిలి శ్రీపాల్‌రెడ్డి, కో–చైర్మన్ చావా రవితోపాటు పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎంకు సమస్యలు వివరించాం ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రతినిధులంతా సీఎంతో నేరుగా మాట్లాడారు. అన్ని సమస్యలను ఆయన ముందు పెట్టారు. తొలి సమావేశం సుహృద్భావ వాతావరణంలోనే జరిగింది. సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం సహకరిస్తుందని భావిస్తున్నాం. – మారం జగదీశ్వర్, జేఏసీ అధ్యక్షుడు కనీసం రెండు డీఏలైనా ఇవ్వాలి తక్షణమే రెండు డీఏలైనా ఇస్తే ఉద్యోగులకు ప్రభుత్వంపై నమ్మకం కుదురుతుంది. ప్రతీ దానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో ముడిపెట్టడం సరికాదు. ప్రభుత్వంతో కలసి ప్రజలకు సేవ చేసేందుకు ఉద్యోగులు అన్నివేళలా కృషి చేస్తారు. – చావా రవి, జేఏసీ కో–చైర్మన్ కొంత సానుకూలం సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి. ప్రభుత్వం మార్చి 31 వరకూ సమయం కావాలని కోరింది. ఇది న్యాయమైన కోరికే. అయితే, పెండింగ్‌లో ఉన్న 5 డీఏల విషయంలో కనీసం రెండు ఇవ్వడానికి కేబినేట్ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. – పింగిలి శ్రీపాల్‌రెడ్డి, జేఏసీ అదనపు సెక్రటరీ జనరల్ సీపీఎస్ వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వంపై నయాపైసా భారం పడని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను వెంటనే రద్దు చేయాలి. సీపీఎస్‌తో రెండు దశాబ్దాలుగా సామాజిక భద్రత లోపిస్తోంది. భవిష్యత్తులోనూ ఇది అధిక భారంగా మారుతుంది. కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు రాజస్థాన్, ఛత్తీస్గడ్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు ఈ విధానాన్ని రద్దు చేశాయి. రాష్ట్రంలోనూ సీపీఎస్‌ను రద్దు చేస్తే ఎల్బీ స్టేడియంలో రెండు లక్షల కుటుంబాలతో ధన్యవాదాలు తెలుపుతాం. – సీఎంకు సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ వినతి పరిస్థితి బాగోలేదు.. సహకరించండి!ఉద్యోగుల డిమాండ్లన్నీ న్యాయమైనవేనని, వాటిని పరిష్కరించేందుకు తమకు అభ్యంతరం లేదని సీఎం రేవంత్ తెలిపారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలన్నారు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉందని.. కొన్నాళ్లుగా వివిధ శాఖల ఆదాయం కూడా తగ్గిందని తెలిపారు. వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఆర్థిక అంశాల్లో తమపై ఒత్తిడి తేవొద్దని కోరారు. ఆర్థిక అవసరాలు లేని బది లీలు, పాలనాపరమైన అంశాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ఉద్యోగులు సహకరించాలని కోరారు. -
ఉద్యోగుల ఉద్యమ బాట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై పది నెలలవుతున్నా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం లేదని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీ జేఏసీ) ఆవేదన వ్యక్తం చేసింది. కొత్త ప్రభుత్వమని ఇన్నాళ్లూ వేచి చూశామని తెలిపింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ప్రతి మంత్రి గడప తొక్కామని, తమ సమస్యలు సీఎం వద్దకు తీసుకెళ్లాలని విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొంది. తమ డిమాండ్లు దృష్టికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అపాయింట్మెంట్ కోరుతున్నా ఇవ్వడం లేదని వాపోయింది. సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రకటించింది. మంగళవారం టీఎన్జీవో కార్యాలయంలో టీజీ జేఏసీ (తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లతో కూడిన సంయుక్త కార్యాచరణ కమిటీ) విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల మొత్తం 51 డిమాండ్లు, అతి ముఖ్యమైన ఆరు డిమాండ్లకు సంబంధించి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం జేఏసీ చైర్మన్, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. డీఏలు, హెల్త్‌కార్డులు ఏమయ్యాయి? ‘ఉద్యోగుల డిమాండ్లు, పెండింగ్ బిల్లులు, జీపీఎఫ్, ఇతర సమస్యలపై సమావేశంలో చర్చించాం. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ఈ నెల 26న జరిగే కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మంత్రివర్గ భేటీలో ఉద్యోగుల సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకోకుంటే నిరసనలతో కూడిన కార్యాచరణతో ముందుకెళ్తాం. ప్రత్యేక తెలంగాణలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులు నేడు తమ సమస్యలకు సంబంధించి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సి వస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఐదు డీఏలు ఇస్తామన్న హామీ ఏమైంది? జీపీఎఫ్‌లో ఉన్న డబ్బులను కూడా తీసుకునే పరిస్థితి లేదు. పీఆర్సీ ముచ్చటే లేదు. ఉద్యోగుల భాగస్వామ్యంతో హెల్త్‌కార్డులు ఇవ్వాలని కోరినా దాని ఊసేలేదు. హెల్త్‌కార్డులు ఇస్తామని తెచ్చిన జీవో ఏమైందో చెప్పాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఉద్యోగులు, పెన్షనర్లు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలో వరదలు వస్తే ఉద్యోగులమంతా ఏకమై ప్రభుత్వానికి (సీఎంఆర్ఎఫ్) రూ.130 కోట్లు ఇచ్చాం. అప్పుడు రెండురోజుల్లో సమావేశం పెడతామన్నారు. ప్రభుత్వానికి చేదోడువాదోడుగా ఉంటున్న ఉద్యోగులకు, ప్రభుత్వం కూడా అదే విధంగా ఉండాలి. జేఏసీ ఏ పారీ్టకీ కొమ్ముకాయదు. ఉద్యోగుల సమస్యలపై మాత్రమే పోరాటం ఉంటుంది..’ అని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. సీఎం పేషీ ఉద్యోగులే సమస్యలపై ప్రశ్నిస్తున్నారు ‘మా సమస్యలపై ఎక్కని గడప లేదు. సీఎం దగ్గరకు వెళదామంటే పేషీ అధికారులు అపాయింట్మెంట్ లేదని చెబతున్నారు. కానీ అక్కడి ఉద్యోగులే డీఏ ఏమైంది? హెల్త్‌కార్డులు ఏమయ్యాయి? అని అడుగుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒకసారి కూర్చుని మాట్లాడితే మా సమస్యలు సగం వరకు పరిష్కారమవుతాయి. ఆయనపై విశ్వాసం ఉంది. ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇస్తూ ఉద్యోగులకు ఊరటనిచ్చారు. ప్రమోషన్లు, బదిలీలు చేపట్టి మా పక్షాన నిలిచిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి. ప్రజా ప్రభుత్వంలో భాగం చేయాలి..’ అని జేఏసీ నేతలు కోరారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లివీ.. 1. 2022 జూలై 1 నుంచి పెండింగ్‌లో ఉన్న ఐదు కరువు భత్యాలు (డీఏ)లు వెంటనే విడుదల చేయాలి. బకాయిలను నగదు రూపంలో చెల్లించాలి. 2. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేయాలి, ఇ–కుబేర్ వ్యవస్థను రద్దు చేయాలి. ట్రెజరీ విభాగం ద్వారా బిల్లులను క్లియర్ చేసే పాత విధానాన్ని పునరుద్ధరించాలి. 3. అన్ని ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు/చర్చలు ఇప్పటికే పూర్తయినందున ధరల పెరుగుదల ప్రకారం 51 శాతం ఫిట్మెంట్తో 2వ పీఆర్సీ సిఫార్సుల నివేదిక తెప్పించుకుని అమలు చేయాలి. 4. ప్రభుత్వం, ఉద్యోగులు/ పెన్షనర్లు సమాన సహకారంతో ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అమలు చేయాలి. 5. కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్– యూపీఎస్ ) స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్ ( ఓపీఎస్) పథకాన్ని పునరుద్ధరించాలి. 6. జీవో–317 సమీక్షించాలి.317 జీవో బాధితులు కోరుకునే చోటకు బదిలీ చేయాలి. ఖాళీల లభ్యత కోసం అడగకుండా, వీలైనంత త్వరగా వెబ్సైట్ ద్వారా లేవనెత్తిన అన్ని ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని పరిష్కరించాలి. ఉద్యోగుల కార్యాచరణ ఇలా... – ఈ నెల 23 నుంచి 30 వరకు టీజీ జేఏసీ జిల్లా కమిటీల ఏర్పాటు – 28న సీఎం, సీఎస్‌లకు కార్యాచరణ లేఖ అందజేత – నవంబర్ 2న జేఏసీ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలతో జిల్లా కలెక్టర్లకు కార్యాచరణ లేఖ అందజేత – 4, 5 తేదీల్లో ర్యాలీలతో జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులకు వినతిప్రతాల సమర్పణ – 6న టీజీ జేఏసీ కార్యవర్గ సమావేశం – 7 నుంచి డిసెంబర్ 27 వరకు ఉమ్మడి పది జిల్లాల్లో ఉద్యోగుల పెండింగ్ సమస్యల సాధన సదస్సులు – జనవరి 3, 4 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు. భోజన విరామ సమయంలో ప్లకార్డులతో నిరసన – 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మౌన ప్రదర్శనలు, – 23న రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు, 30న రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు -
ఉద్యోగుల సమస్యలపై సీఎం స్పందించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించాలని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటై పది నెలలు గడిచినా, ఉద్యోగుల సమస్యల పట్ల సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండడం ఇదే మొదటిసారి అని, ఉద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. శుక్రవారం టీఎన్జీఓ కార్యాలయంలో టీజేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వానికి వినతులు సమరి్పస్తున్నా, స్పందన మాత్రం రావడం లేదన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని డీఏలు మంజూరు చేస్తుందని ప్రభుత్వ ఉద్యోగులంతా ఆశగా ఎదురుచూశారని, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి తీపికబురు రాలేదని చెప్పారు. ఆర్థిక సంబంధిత అంశాలే కాకుండా ఎలాంటి ఖర్చు లేకుండా పరిష్కరించాల్సిన సమస్యలు కూడా ఉన్నాయని, కనీసం వాటి పట్ల అయినా సీఎం చొరవ తీసుకొని ఉంటే బాగుండేదన్నారు. ఉద్యోగుల సమస్యలు వినే తీరిక ప్రభుత్వానికి లేనట్టు కనిపిస్తోందని తెలిపారు.సీఎస్ శాంతికుమారిని కలిసేందుకు జేఏసీ తరఫున ప్రయత్నాలు చేసినా, ఆమె సమయం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఈ నెల 23న మంత్రివర్గ సమావేశమున్నట్టు వార్తలు వస్తున్నాయని, ఆ రోజు ఉద్యోగుల సమస్యల పట్ల నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు. లేకుంటే దశల వారీగా ఉద్యమానికి సిద్ధమవుతామని, వారం రోజుల్లో జేఏసీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి అన్ని వర్గాల అభిప్రాయాలు స్వీకరించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలని సీఎం సూచించడంతో జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాల తరఫున వినతులు ఇచ్చామన్నారు. ఉద్యోగ జేఏసీతో కనీసం ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని, ఉద్యోగులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను సైతం ప్రభుత్వం నిర్వహించకపోవడం సరికాదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇవ్వడం శుభపరిణామమే అయినా, సప్లిమెంటరీ, మెడికల్ తదితర బిల్లులన్నీ పెండింగ్‌లో నెలల తరబడి ఉంటున్నాయని, హెల్త్ కార్డుల అంశం తేలలేదన్నారు. ఇప్పుడు సంఘాల మాటలు కూడా ఉద్యోగులు వినే పరిస్థితి లేకుండా పోతోందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల సమస్యలపై జోక్యం చేసుకొని పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నేత సదానంద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సచివాలయంలో సీఎంఓ ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రిని కలిసి ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తరఫున వినతిపత్రాన్ని అందచేశారు. -
ఉద్యోగులకు మెరుగైన హెల్త్ స్కీం తెస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై దృష్టిసారించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఏ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లినా తక్షణమే నగదురహిత ఉచిత వైద్యం అందేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అలాగే డిజిటల్ ఫ్యామిలీ కార్డుల జారీ కోసం సేకరిస్తున్న కుటుంబాల వివరాల్లో ప్రజలు ఆరోగ్య సమాచారాన్ని కూడా నిక్షిప్తం చేస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలు, అమలుపై మంత్రి దామోదర ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.సాక్షి: ప్రభుత్వోద్యోగులకు ఇప్పటికీ నగదురహిత వైద్య సేవలు సరిగ్గా అందట్లేదు. ఈ పథకాన్ని మెరుగుపరిచేందుకు ఏం చేయబోతున్నారు? దామోదర: ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులకు నగదురహిత ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) కొత్తగా తీర్చిదిద్దేందుకు ఏర్పా ట్లు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా జీవో జారీచేసింది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదు. మేం అత్యంత పకడ్బందీగా ఆ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ట్రస్ట్ ద్వారా నగదురహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలా లేక బీమా పద్ధతిలో అమ లు చేయాలా అనే విషయమై ఆలోచిస్తున్నాం. ఉద్యోగుల నుంచి కంట్రిబ్యూషన్ తీసుకోవాలా లేదా? అనే అంశంపై నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఉద్యోగుల అభిప్రాయం తీసుకొని వారు కోరుకుంటున్నట్లుగా ఈ పథకానికి రూపకల్పన చేస్తాం. సాక్షి: తొలుత డిజిటల్ హెల్త్ కార్డులని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా అన్ని పథకాలకు వర్తించేలా డిజిటల్ ఫ్యామిలీ కార్డులు జారీ చేస్తామంటోంది. ఈ మార్పునకు కారణం ఏమిటి?దామోదర: మొదట డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలనుకున్నాం. కానీ అన్ని రకాల సంక్షేమ పథకాలు, సేవలకు ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డుంటే బాగుంటుందన్న అభిప్రాయం వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా ఏకీకృతం చేయడం వల్ల ప్రజలు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఒక్కో సేవకు ఒక్కో కార్డు అంటూ ఇవ్వడం వల్ల అంతా గందరగోళం నెలకొంటుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.సాక్షి: సైబర్ దాడుల ముప్పు నేపథ్యంలో ప్రజల వివరాలతో కూడిన డిజిటల్ హెల్త్ కార్డులు ఎంతవరకు భద్రం?దామోదర: సైబర్ దాడులకు గురికాకుండా, ప్రజల సమాచారం ఇతరుల చేతుల్లోకి పోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తాం. ఈ విషయంలో ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహరించదు. సాక్షి: వైద్య, ఆరోగ్యశాఖకు దాదాపు రూ. 5 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులకు ఆమోదం లభించిందా? ఈ నిధులను వేటి కోసం వాడతారు?దామోదర: ప్రపంచ బ్యాంకు నిధుల ప్రక్రియ కొనసాగుతోంది. ఒకవేళ ప్రపంచ బ్యాంకు నిధులు వస్తే వైద్య మౌలిక సదుపాయాలపై దృష్టిసారిస్తాం. ప్రధానంగా 14 కాంపోనెంట్లపై కేంద్రీకరిస్తాం. ట్రామా కేర్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు, వ్యాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లు, సిములేషన్ అండ్ స్కిల్ ల్యాబ్స్ ఫర్ ఎమర్జెన్సీ కేర్, ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్, డయాగ్నొస్టిక్ సర్వీసెస్ పెంపు, ఆర్గాన్ రిటీవ్రవల్ అండ్ స్టోరేజ్ సెంటర్లు, ఆరోగ్య మహిళ కార్యక్రమంతో కలిపి ఎంసీహెచ్ సర్వీసెస్ మెరుగుపరచడం, కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్లు, డ్రగ్స్ డీఅడిక్షన్ సెంటర్లు, టిమ్స్, ఉస్మానియా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కొత్త పరికరాల కొనుగోళ్లు, కేన్సర్ కేర్‌లపై దృష్టిసారిస్తాం.సాక్షి: ఇప్పటివరకు వైద్య నియామకాలు ఎన్ని జరిగాయి? భవిష్యత్తులో ఇంకెంతమందిని భర్తీ చేస్తారు?దామోదర: ఇప్పటివరకు 7,308 వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేశాం. ఇంకా 6,293 పోస్టులు భర్తీ దశలో ఉన్నాయి. వాటికి నోటిఫికేషన్లు కూడా ఇచ్చాం. రానున్న రోజుల్లో మరిన్ని పోస్టులను కూడా భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. -
ప్రభుత్వ ఉద్యోగులపై సర్కారు
ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాల్సిన చంద్రబాబు సర్కారు ఆ పని చేయకపోగా.. తిరిగి వారిపైనే కత్తి దూస్తోంది. ఇప్పటికే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయ (సెక్రటేరియట్) ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దుకు రంగం సిద్ధం చేసింది. సంబంధిత ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇప్పటికే చేరింది. – సాక్షి, అమరావతిఉద్యోగులకు మధ్యంతర భృతితోపాటు క్రమం తప్పకుండా డీఏ ఇస్తామని, సీపీఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం తెస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారం చేపట్టాక వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయకపోగా.. ఆ విషయంపై ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో ఉద్యోగ సంఘాలను అణచివేసే ప్రయత్నాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ సంఘం గుర్తింపు రద్దు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.70 ఏళ్ల సంఘాన్ని నిర్వీర్యం చేసేందుకు కంకణంఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ హోదాలో కాకర్ల వెంకట్రావిురెడ్డి ఈ ఏడాది మార్చి నెలలో ఆర్టీసీ ఉద్యోగులను కలిశారు. ఎలాంటి సమావేశం, ప్రెస్‌మీట్ పెట్టకపోయినా కొన్ని పత్రికలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటూ తప్పుడు వార్తలు రాయడంతో ఆయనను సస్పెండ్ చేశారు. అంతటితో ఆగకుండా ఆయనపై నాలుగు కేసులు పెట్టించారు. దీంతో సంతృప్తి చెందని ప్రభుత్వం ఇపుడు ఏకంగా ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సంఘం గుర్తింపును రద్దు చేసేందుకు సిద్ధపడింది. విచారణ నివేదికలు, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఎక్కడా ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం పేరు కూడా లేదు. అయినా కేవలం వెంకట్రావిురెడ్డిపై కక్షతో 70 ఏళ్ల చరిత్ర గల ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది.అప్పట్లో ఉద్యోగ సంఘాలను వాడుకుని..2019 ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘాల నాయకులను చంద్రబాబు ఎలా వాడుకున్నారో అందరికీ తెలిసిందే. సత్యాగ్రహ దీక్ష పేరుతో ప్రత్యేక విమానంలో ఉద్యోగ సంఘాల నాయకులను ఢిల్లీ తీసుకెళ్లి.. వారితో నల్లచొక్కాలు తొడిగించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తిట్టించారు. బీజేపీని ఒక్క స్థానంలో కూడా గెలవనివ్వబోమని, ఏపీ నుంచి బీజేపీని తరిమి తరిమి కొడతామని పెద్దఎత్తున ప్రకటనలు కూడా అప్పట్లో ఉద్యోగ సంఘాల నాయకులతో ఇప్పించారు. 2019 ఎన్నికల తర్వాత వారిపై చర్యలు తీసుకోవాలని చాలా ఫిర్యాదులు వచ్చాయి. అయినా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దమనసుతో వ్యవహరించారు. ఉద్యోగ సంఘాల నాయకులు తమ పనులు చేయించుకునేందుకు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటం సహజమేనని, అలాంటి చిన్నచిన్న విషయాలకు ఉద్యోగులపై చర్యలు తీసుకోవద్దని అధికారులకు సూచించారు. కానీ.. ఇప్పుడు చంద్రబాబు ఉద్యోగులెవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘానికి ఎలాంటి సంబంధం లేని ఘటనను సాకుగా చూపించి.. సంఘాన్ని రద్దు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఒకవేళ ప్రభుత్వ సంఘాల సమాఖ్య చైర్మన్ హోదాలో వెంకట్రావిురెడ్డి తప్పు చేస్తే ఆయనపై చర్యలు తీసుకోవాలి తప్ప సంఘాన్ని నాశనం చేయడం ఏమిటని సచివాలయ ఉద్యోగులంతా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వింత ఎప్పుడూ చూడలేదని వారంతా పేర్కొంటున్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
-
ఏపీలో శాడిస్టు పాలన: వైఎస్సార్సీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి,తాడేపల్లి: ఏపీలో శాడిస్టు ప్రభుత్వం నడుస్తోందని, చంద్రబాబు తన మీడియాతో వ్యక్తిత్వ హననం చేస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే గడికోటశ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్రకార్యాలయంలో బుధవారం(ఆగస్టు21) శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు మేలు చేశాం. కరోనా సమయంలో ప్రభుత్వ పరంగా ఉద్యోగులకు అన్నీ చేశాం. చంద్రబాబు ఉద్యోగులతో ఎప్పుడూ ఫ్రెండ్లీగా లేరు. బాబు హయాంలో ఉద్యోగులకు ఎప్పుడూ మంచి జరగలేదుఇష్టంలేని వారిని వేధిస్తూ నవ్వుకునే తీరులో చంద్రబాబు ప్రభుత్వ పాలన సాగుతోంది. నెల్లూరులో ఐఅండ్‌పీఆర్ అధికారిని చంద్రబాబు దారుణంగా దూషించారు. చంద్రబాబు ఉద్యోగవర్గాలకు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉంటారు. ఉద్యోగులను తిడుతూ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. వైఎస్జగన్ హయాంలో ఉద్యోగులకు చేయగలిగినంత చేశాం. కరోనా కష్టకాలంలో కూడా ఎన్నో మేళ్లు చేశాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను తీవ్రంగా వేధిస్తున్నారుఉద్యోగు, అధికారులు అందరినీ వేధిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను కూడా వదలకుండా వేధిస్తున్నారు. ప్రద్యుమ్న, సాయిప్రసాద్, ఠాగూర్ లాంటి వారంతా చంద్రబాబుకు అనుకూలమైనప్పటికీ వైఎస్జగన్ వారికి కీలకమైన పోస్టులు ఇచ్చారు. మరి ఇప్పుడు చంద్రబాబు కొందరు అధికారులపై ఎందుకు కక్షసాధింపులకు దిగుతున్నారు?డీఎస్పీ పోస్టుల్లో ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఇసుకరెడ్డి, మైనింగ్ రెడ్డి అంటూ మాట్లాడటం కరెక్టేనా? ఎక్కడ ఏ కాగితం తగులపడినా ఉద్యోగులను టార్గెట్ చేసి సస్పెండ్ చేయడం సబబు కాదు. చంద్రబాబు తప్పులు బయట పడతాయని టీడీపీ వారే తగులపెడుతున్నారనే అనుమానం కలుగుతోంది. అధికారులను వేధించటం, వారిని కించపరిచటం మానుకోవాలి. ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన రెడ్డి కడప జిల్లా వ్యక్తి కావటమే ఆయన చేసిన తప్పా? ఆయనపై కూడా ఎందుకు వేధింపులకు పాల్పడుతున్నారు?అభివృద్ధి, సంక్షేమం అనేది చంద్రబాబు హయాంలో ఎప్పుడూ ఉండదు. వైఎస్ఆర్ హయాంలో అభివృద్ధి, సంక్షేమంలో ఎంతో ముందుకు తీసుకెళ్లారు. శ్రీ సిటీని వైఎస్ఆర్ తెచ్చినా, తానే తెచ్చినట్టు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. జగన్ హయాంలో ప్రారంభించిన పరిశ్రమలను కూడా తానే తెచ్చినట్టు చంద్రబాబు హడావుడి చేస్తున్నారు’ అని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. -
AP: రేపటి నుంచి ఉద్యోగుల బదిలీలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా తొలగించింది. ప్రజా సంబంధిత సేవలందించే 14 శాఖల్లోని ఉద్యోగుల బదిలీలకు సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు అనుమతించింది. ఎక్సైజ్ శాఖలో మాత్రం వచ్చేనెల 5 నుంచి 15వ తేదీ వరకు బదిలీలకు అనుమతించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ శనివారం జారీ చేశారు. ఈ నెలాఖరుకల్లా 14 శాఖల్లో బదిలీలు పూర్తవ్వాలని, వచ్చే నెల 1వ తేదీ నుంచి నిషేధం తిరిగి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖలో వచ్చే నెల 16 నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. 5 సంవత్సరాలుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇతర ఉద్యోగుల్లో పరిపాలన అవసరాలు లేదా వ్యక్తిగత అభ్యర్థనలపై బదిలీలకు అర్హులు. ఎన్నికల ప్రక్రియ కోసం బదిలీలను బదిలీగా పరిగణించరు. కారుణ్య ప్రాతిపదికన నియమితులైన వితంతువులైన మహిళా ఉద్యోగులు, దృష్టి లోపం గల ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది.బదిలీలు జరిగే శాఖలు– రెవెన్యూ (భూపరిపాలన), సెర్ప్‌తో సహా పంచాయత్ రాజ్ – గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, గ్రామ, వార్డు సచివాలయాలు, పౌర సరఫరాలు, మైనింగ్– జియాలజీ, అన్ని విభాగాలలో ఇంజనీరింగ్ సిబ్బంది, దేవదాయ, రవాణా, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక, పరిశ్రమలు, ఇంధన, స్టాంపులు–రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్. ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీలను ముందు భర్తీ చేయాలినోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని ఖాళీ పోస్టులను ముందుగా భర్తీ చేయాలి. ఐటీడీఏ ప్రాంతాలతో పాటు వెనుకబడిన ప్రాంతాల్లో పోస్టుల భర్తీకి శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యతనివ్వాలి. నిబంధనల ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో రెండేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులు కోరిన చోటుకు బదిలీ చేసేందుకు ప్రాధాన్యతనివ్వాలి. ఐటీడీఏ పరిధిలో బదిలీ చేసే ఉద్యోగులు 50 ఏళ్ల లోపు ఉండాలి. ఐటీడీఏ పరిధిలో గతంలో పనిచేయని ఉద్యోగులను బదిలీ చేయాలి. ఐటీడీఏ పరిధిలో బదిలీ చేసిన ఉద్యోగుల స్థానంలో ప్రత్యామ్నాయం లేకుండా రిలీవ్ చేయడానికి వీల్లేదు. బదిలీ దరఖాస్తుల పరిశీలనకుఅంతర్గత కమిటీలుప్రభుత్వ మార్గదర్శకాలు, షరతులకు అనుగుణంగా సంబంధిత అధికారులు బదిలీలను అమలు చేయాలి. జిల్లా, జోనల్, బహుళ జోనల్‌తో పాటు రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలి. ప్రాధాన్యతల విషయంలో దుర్వినియోగం జరగకుండా సంబంధిత శాఖల అంతర్గత కమిటీలు దరఖాస్తులను పరిశీలించి, తగిన సిఫార్సులు చేయాలి. ఎటువంటి ఫిర్యాదులు, ఆరోపణలకు అవకాశం లేకుండా పారదర్శకంగా గడువులోగా బదిలీల ప్రక్రియను సంబంధిత శాఖాధిపతులు పూర్తి చేయాలి. ఉద్యోగ సంఘాల ప్రతినిధుల బదిలీల విషయంలో నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలి.ఈ వర్గాలకు బదిలీల్లో ప్రాధాన్యత– దృష్టి లోపం ఉన్న ఉద్యోగులు, మానసిక వికలాంగ పిల్లలను కలిగి ఉన్న ఉద్యోగులు సంబంధిత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న చోటుకి బదిలీ చేయాలని కోరేవారు– గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులు– 40 శాతంకన్నా ఎక్కువ వైకల్యం గల ఉద్యోగులు– క్యాన్సర్, ఓపెన్ హార్ట్ ఆపరేషన్స్, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా అటువంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్న స్టేషన్లకు బదిలీలు కోరుకునే ఉద్యోగులు (స్వయం లేదా జీవిత భాగస్వామి లేదా ఆధారపడిన పిల్లల వైద్యం కోసం)– భార్య, భర్త ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయితే, వారిద్దరినీ ఒకే స్టేషన్లో లేదా ఒకరికొకరు సమీపంలో ఉన్న స్టేషన్లలో ఉండేలా బదిలీకి ప్రయత్నించాలి.ఈ మార్గదర్శకాల ప్రకారం జరిగే అన్ని బదిలీలు, ప్రాధాన్య స్టేషన్ల ఎంపికను వినియోగించుకున్న ఉద్యోగుల బదిలీలను అభ్యర్థన బదిలీలుగా పరిగణిస్తారు. -
AP: ఉద్యోగుల బదిలీల విధివిధానాలు విడుదల
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం బుధవారం(ఆగస్టు14) విడుదల చేసింది.బదిలీల జీవో గురువారం విడుదల కానుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి 31 వరకు 16 రోజుల్లో మొత్తం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
Assam govt: తల్లిదండ్రులతో గడిపేందుకు సెలవు
గువాహటి: అస్సాం ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులు లేదా అత్తమామలతో గడిపేందుకు రెండు రోజులు సెలవులిస్తున్నట్లు సీఎం కార్యాలయం గురువారం ప్రకటించింది. తల్లిదండ్రులు, అత్తమామలు లేని వారు స్పెషల్ కాజువల్ లీవ్‌కు అనర్హులని స్పష్టం చేసింది. నవంబర్ 6, 8వ తేదీల్లో స్పెషల్ కాజువల్ లీవ్ తీసుకునే వారు తమ తల్లిదండ్రులు, అత్తమామలతో గడిపేందుకే కేటాయించాలని వివరించింది. వయోవృద్ధులైన తల్లిదండ్రులు, అత్తమామలను జాగ్రత్త చూసుకునేందుకు వారికి గౌరవం, మర్యాద ఇచ్చేందుకు ఈ లీవ్ ప్రత్యేక సందర్భమని వెల్లడించింది. నవంబర్ 7న ఛాత్ పూజ, నవంబర్ 9న రెండో శనివారం, నవంబర్ 10న ఆదివారంతో పాటు ఈ రెండు రోజుల సెలవును ఉపయోగించుకోవచ్చని సీఎంఓ తెలిపింది. -
పచ్చ బిళ్ల వేసుకుని వెళ్లండి: అచ్చెన్నాయుడు
గంగ చంద్రముఖిగా మారేందుకు ఎక్కువ సమయమేమీ పట్టలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రెండు వారాల్లోపే టీడీపీ నేతలు తమ అసలు రంగును బయటపెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు దీనికి నిదర్శనంశ్రీకాకుళం, సాక్షి: ‘‘టీడీపీ కార్యకర్తల్లారా.. పసుపు బిళ్ల పెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లండి. మీకు అక్కడి అధికార యంత్రాంగం సకల రాచమర్యాదలు చేస్తుంది. అలా చేయకుంటే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు..’’ అంటూ ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.‘‘.. ఏ ఆఫీస్ అయినా సరే. పసుపు బిళ్ళతో వచ్చే టీడీపీ కార్యకర్తలకు పనులు చేయాల్సిందే. తమ కార్యాలయంలో అడుగు పెట్టిన టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు మర్యాదగా చూసుకోవాలి. మీకు కుర్చీ వేసి, టీ ఇచ్చి పనిచేస్తారు. అలా వారికి నేను ఆదేశాలను జారీ చేస్తా. మాట వినని ఉద్యోగులు ఎవరైనా ఉంటే వారిని నేను దారిలోకి తెస్తా. ఒకరో ఇద్దరో ఆ మాట జవ దాటితే ఏమవుతుందో ప్రత్యేకంగా నేను ఆ అధికారులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినా టీడీపీ కార్యకర్తల పనులు వేగంగా జరిగేలా నేనే సమావేశం పెట్టి ఆ అధికారుల్ని ఆదేశిస్తా’’ అని టీడీపీ కార్యకర్తలకు అచ్చెన్న భరోసా ఇచ్చారు. అంతేకాదు.. మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టవద్దు అంటూ కార్యకర్తలను ఉద్దేశించి రెచ్చగొట్టేలా అచ్చెన్నాయుడు మాట్లాడారు. సోమవారం సాయంత్రం శ్రీకాకుళం పట్టణ కేంద్రంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించగా.. ఆ భేటీలోనే అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. AP Animal Husbandry and Fisheries Minister Atchannaidu’s open warning to officials and brazen abuse of power. Honorary Minister tells govt officials to salute TDP workers and give them royal treatment in govt offices. #Atchannaidu #TDP #AP #AndhraPradesh pic.twitter.com/NSPY9FGFfQ— Sakshi Post (@SakshiPost) June 18, 2024 VIDEO CREDITS: Sakshi Post -
ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉంటారు. ప్రజలంటే ఎంత ప్రేమ చూపిస్తారో ఉద్యోగులతోనూ అంతే అభిమానంతో ఉంటారు. అందుకే సీఎం వైఎస్ జగన్ ఉద్యోగులకు మంచి మిత్రుడని, ఆయన ఐదేళ్ల పాలన ఉద్యోగుల పట్ల స్నేహపూర్వకంగా సాగిందని, పలువిధాలుగా మేలు కూడా చేకూర్చారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. రెండేళ్లు కోవిడ్ కష్టాల్లోనూ ఉద్యోగులకు క్రమం తప్పకుండా జీతాలివ్వడం, గత చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎగ్గొట్టిన రెండు డీఏలను కూడా వైఎస్ జగన్ సర్కారు చెల్లించడం ఇందుకు చిన్న ఉదాహరణలని చెబుతున్నారు. చంద్రబాబుది కపట ప్రేమబాబు ప్రతి ఎన్నికలకు ముందు ఉద్యోగులపై కపట ప్రేమ చూపిస్తారని, అధికారంలోకి వస్తే నరకం చూపిస్తారని, ఈసారీ ఇదే ఎత్తుగడ వేశారని రాష్ట్ర సచివాలయ ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులు వేళపాళా లేకుండా పనిచేయాల్సి వచ్చేదని, వారి పట్ల చంద్రబాబుకు, టీడీపీ నేతలకు కనీస గౌరవం కూడా ఉండేదికాదని, తరచూ బెదిరింపులు, ఛీత్కరింపులతో అవమానాలు ఎదురయ్యేవని వివరించారు. ఉమ్మడి ఏపీలో పెన్షనర్లకు డీఏనే రద్దు చేసిన చరిత్ర చంద్రబాబుదని, 2019 ఎన్నికలకు ముందు డీఏలు ఎగ్గొట్టారని తెలిపారు. గతంలో చిరుద్యోగులు జీతాలు పెంచాలని ఎన్నిమార్లు కోరినప్పటికీ నాలుగున్నరేళ్లు పట్టించుకోని చంద్రబాబు.. గత ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎన్నికల స్టంట్‌లో భాగంగా జీతాలు పెంచుతున్నట్లు ఉత్తర్వులు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఇలా చంద్రబాబు పాలన అంటే ఉద్యోగులకు నరకమేనని చెబుతున్నారు.జగన్ పాలనలో ఏ సమస్యా లేదుగత ఐదేళ్లలో వైఎస్ జగన్ పాలనలో ఉద్యోగులకు అలాంటివి ఎప్పుడూ ఎదురు కాలేదని తెలిపారు. సీఎం సహా మంత్రులు, అధికారులు ఉద్యోగులను సమయం దాటి పనిచేయాలని ఎప్పుడూ కోరలేదు. పైగా, సీఎం జగన్ ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వేలాది యువతకు ఉద్యోగాలు రావడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులపై పని ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గిందని తెలిపారు. ఇప్పుడు ఉద్యోగులంతా చాలా ఉత్సాహంగా, ఆనందంగా పనిచేస్తున్నారని చెబుతున్నారు. వేతనాలు, పెన్షన్ల చెల్లింపులు కూడా ప్రతి నెలా 1 నుంచి 10వ తేదీలోగా చెల్లించారని ఉద్యోగ వర్గాలు తెలిపాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల డీఏలు, ఎర్న్డ్ లీవ్‌ల మంజూరులో కొంత జాప్యం అయింది తప్ప ఉద్యోగులకు, పెన్షర్లకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంటున్నాయి. సీఎం జగన్ ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పిన మేరకు తొలి కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగులు, పెన్షనర్లకు 27 శాతం మధ్యంతర భృతి మంజూరు చేసి, రూ.17,918 కోట్లు చెల్లించారని వివరిస్తున్నారు. 11వ వేతన సవరణ అమలు చేసి రూ.11,707 కోట్ల అదనపు వ్యయాన్ని ఈ ప్రభుత్వం భరించిందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఉద్యోగ సంఘాలు అడగకుండానే సీఎం జగన్ 12వ పీఆర్సీని ఏర్పాటు చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన మాట మేరకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా వారి వేతనాలను కూడా పెంచారు. మధ్య దళారీల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించారు.ఉద్యోగుల మేలు కోసమే జీపీఎస్ చంద్రబాబు సీఎంగా ఉండగా సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ తేవాలన్న ఉద్యోగులు కోరగా, ఆయన ససేమిరా అన్నారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్ ఉద్యోగుల రిటైర్మెంట్ తరువాత చాలా తక్కువగా పెన్షన్ వస్తోందని గుర్తించి సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చారు. అయితే కొన్ని రాష్ట్రాలు సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించడమే కానీ, చేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేయాలనే తపనతో జగన్ సర్కారు సుదీర్ఘ కసరత్తు చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేలా జీపీఎస్‌ను రూపొందించింది. బేసిక్ జీతంలో 50 శాతం అంటే రూ.1 లక్ష జీతం ఉంటే రూ. 50 వేలు రిటైర్ అయిన తర్వాత పెన్షన్‌గా వస్తుంది. 82 ఏళ్ల వయస్సులో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండేలా ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్ రూపొందించారు. దీనిని ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. సీపీఎస్ కంటే జీపీఎస్ మేలన్నాయి. సీఎం జగన్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కూడా 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పొడిగించారు. గత ప్రభుత్వాలు పట్టించుకోని ఆర్టీసీ కారుణ్య నియామకాలనూ సీఎం జగన్ చేపట్టారు. ఇచ్చిన మాట మేరకు ఆర్టీసీలోని 55 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. 10 వేలకుపైగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ ఇస్తున్నారు. ఏపీ వైద్య విధాన పరిషత్‌లో ఉన్న 14,658 మందిని సొసైటీ నుంచి ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు. ఇళ్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాల ఖర్చులో 60 శాతం ప్రభుత్వం భరిస్తుందని తాజా మేనిఫేస్టోలో పేర్కొన్నారు.ఆర్థిక ప్రయోజనాలిలా..సీఎం జగన్ ఇచ్చిన మాట మేరకు ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చారు. వారి వేతనాల వ్యయం భారీగా పెరగడమే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు హయాంలోకన్నా ఉద్యోగుల వేతనాల వ్యయం ఇప్పుడు రూ.11 వేల కోట్లకు పైగా పెరిగింది. పెన్షర్ల వ్యయం రూ.6 వేల కోట్లకు పెరిగింది.ప్రభుత్వ రంగాన్ని మూసివేయడంలో ఘనుడు చంద్రబాబుప్రభుత్వ రంగాన్ని మూసివేయడం, వీఆర్ఎస్ కూడా ఇవ్వకుండా గోల్డెన్ హ్యాండ్ షేక్ అంటూ ఉద్యోగులను ఇంటికి పంపేయడంలో చంద్రబాబుకు ఘనమైన చరిత్ర ఉంది. 2014–19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు శాశ్వత ఉద్యోగుల నియామకాలను ఉద్దేశపూర్వకంగా తగ్గించేశారు. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేసే ఆలోచన చేశారు. బాబు ఐదేళ్ల పాలనలో కేవలం 34 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులనే నియమించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1999 నుంచి 2004 మధ్య సీఎంగా ఉండగా ఆల్విన్, నిజాం షుగర్స్, రిపబ్లిక్ ఫోర్బ్స్, చిత్తూరు డెయిరీ, ప్రకాశం డెయిరీ వంటి 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి, అతి తక్కువ ధరకు తన వాళ్లకు కట్టబెట్టారు. ఉద్యోగులను నడిరోడ్డుపై వదిలేశారు. మనసులో మాట పుస్తకంలో చంద్రబాబు చెప్పిన విషయాలను ఉద్యోగులు ఇంకా మరిచిపోలేదు. రాష్ట్రంలో 2,70,700 ఉద్యోగాల్లో 40.62 శాతం అదనంగా ఉన్నాయని రాశారు. శాశ్వత ఉద్యోగాల కాలపరిమితిని సమీక్షించాలన్నారు. 1996 – 97లోనే సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల్ని శాశ్వత ప్రాతిపదికన నియమించడం మానేహామంటూ తన ఘనకార్యాలను రాసుకున్నారు. కొత్త నియామకాలు చేపట్టకూడదని, కాంట్రాక్టు ప్రాతిపదికనే ఇవ్వాలని, సిబ్బందిని తగ్గించడానికి ఇది ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ఇంతేకాదు.. బాబు ఉద్యోగులను లంచగొండులుగా చిత్రీకరిస్తుంటారు. విద్యుత్ సంస్థ ఉద్యోగుల్లో 66 శాతం, పౌర సరఫరాల సంస్థలో 65 శాతం, రెవెన్యూలో 64 శాతం, పోలీసు శాఖలో 62 శాతం, స్థానిక సంస్థల్లో 52 శాతం అవినీతిపరులేనని తన పుస్తకంలో రాశారు. ఇప్పడు ఎన్నికల్లో లబ్ధికి, మరోసారి మోసం చేయడానికి ఉద్యోగులు, పెన్షర్ల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు.చిరుద్యోగులకూ మేలు చేసిన సీఎం జగన్చిరుద్యోగులకూ సీఎం జగన్ మేలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి రాగానే దాదాపు అన్ని రంగాల్లో చిరుద్యోగుల జీతాలు పెంచారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో రూ.1,100 కోట్లు ఉండే వీరి జీతాల ఖర్చు ఇప్పుడు రూ.3,300 కోట్లకు పెరిగింది. చిరుద్యోగుల పట్ల సీఎం జగన్‌కు ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. అంతే కాదు.. వారికి మరింత మేలు చేకూరుస్తూ మేనిఫెస్టో రూపొందించారు. నెలకు రూ.25 వేల వరకు జీతం పొందే ఆప్కాస్, అంగన్వాడీలు, ఆశావర్కర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు విద్య, వైద్యానికి, ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల పథకాలను వర్తింపజేస్తామని తాజా మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అంటే జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనతో పాటు వైద్య రంగంలో నవరత్నాల పథకాలు వారికి అందుతాయి. -
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
ఏపీలో ప్రైవేటీకరణ అభిమాని చంద్రబాబు జాతీయ ప్రైవేటీకరణ అభిమాని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అన్ని ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటు ఏకస్వామ్య కంపెనీలకు అప్పజెప్పాలన్నది వారి ఆలోచన. ఇక్కడ రిజర్వేషన్లు అమలు కావు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ కూటమికి ఓటు వేయడమంటే, ప్రైవేటీకరణకు ఓటు వేయడమే. కానీ నిరుపేదలకు ప్రభుత్వ విద్య, ప్రభుత్వ ఉద్యోగ అవకాశం మొదటి తరంలో చాలా ముఖ్యం. మన దేశ భవిష్య త్తుకు పునాది స్కూలు విద్యను పూర్తిగా ప్రభుత్వ రంగంలోకి తెచ్చి, ప్రైవేట్ స్కూలు విద్యను రద్దు చెయ్యడంలో ఉంది. ఉద్యోగస్థులు మొత్తం సమాజ భవిష్యత్ గురించి ఆలోచించకుండా ప్రైవేటీకరణకు, మత తత్వానికి ఓటు వేస్తే ప్రజాస్వామ్యం కాదుకదా, మానవీయ విలువలు కూడా బతకవు.ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటీకరణ అభిమాని చంద్రబాబు నాయుడు జాతీయ ప్రైవేటీకరణ అభిమాని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. దేశంలోని మొత్తం కేంద్ర ప్రభుత్వ కంపెనీలను, అతి పెద్దదైన రైల్వేతో సహా ప్రైవేట్ ‘మోనోపలి’ (ఏకస్వామ్య) కంపెనీలకు అప్పజెప్పి ప్రభుత్వం కేవలం సూపర్వైజ్ చెయ్యాలనేది ఆరెస్సెస్/బీజేపీ సిద్ధాంతం. దేశంలో రిజర్వేషన్ వ్యవస్థను కూడా క్రమంగా రద్దు చెయ్యాలన్నది వారి సిద్ధాంతం. నరేంద్ర మోదీ ఓబీసీ పేరుతో ప్రధానమంత్రి అయ్యారు కనుక గత పదేండ్ల పాలనలో వాళ్ళు రిజర్వేషన్ పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ రిజర్వేషన్ వ్యతిరేక విధానం రిజర్వేషన్ ద్వారా కాక జనరల్ కోటాలో ఉద్యోగాలు తెచ్చుకున్న వారికి నచ్చ వచ్చు కూడా. కానీ విద్యా అసమాన వ్యవస్థ ఉండగా రిజర్వేషన్లు ఎత్తేస్తే దేశంలో అంతర్యుద్ధం జరుగుతుందని చాలామందికి అర్థం కాని విషయం. దేశంలోని ఉత్పత్తి కులాలు రిజర్వేషన్లు రద్దు చెయ్య డాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాయి.బీజేపీతో పొత్తుతో చంద్రబాబు అధికారంలోకి వస్తే మొట్ట మొదట ప్రైవేట్ స్టీల్ కంపెనీకి అప్పజెప్పే అతిపెద్ద స్టీల్ కంపెనీ ‘విశాఖ ఉక్కు’. ఆ తరువాత బీజేపీ తెలంగాణలోని బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ వంటి అతిపెద్ద కంపెనీలను ప్రైవేట్ గుజరాతీ, ముంబై కంపెనీలకు అమ్మకానికి పెడుతుంది. బీజేపీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ చేతుల్లోని సంస్థల్లో దొడ్డిదారిన ఏ సెలక్షన్ కమిటీని ఫేస్ చెయ్యకుండా అధికారులను, యూనివర్సిటీ ప్రొఫెసర్లను సైతం నియమిస్తోంది.ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు బీజేపీకి ఓటు వేయడమంటే ప్రైవేటీకరణకు అనుకూలంగా ఓటు వేయడమే. చంద్ర బాబు 2014 నుండి 2019 వరకు చూపిన స్వతంత్రతను కూడా చూపలేడు. ఆయన పూర్తిగా బీజేపీ ఏమి చెబితే అది చెయ్యాల్సిందే. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఈ కూటమికి ఓటేస్తే ముందు ప్రైవేటీకరణ సమస్యను కొని తెచ్చుకుంటారు.బీజేపీ ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టారు ఎంప్లాయిమెంట్‌ను అమెరికా మోడల్లోకి మార్చాలనే ఆలోచనతో ఉన్నట్లు వాళ్ళ ఆర్థికవేత్తల రచనలు చదివితే స్పష్టంగా అర్థమౌతుంది. ఆంధ్రప్రదేష్ సుదీర్ఘ తీర ప్రాంతం గల రాష్ట్రం. విశాఖ పోర్టు మాత్రమే కాక క్రమంగా ఇతర సీ–పోర్టులను అక్కడ అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని కొత్త పోర్టుల నిర్మాణం జరుగుతోంది. అయితే బీజేపీ ప్రభుత్వం వాటి నిర్మాణం మాత్రమే కాక వాటి మేనేజ్మెంట్ మొత్తాన్ని ప్రైవేట్ సెక్టా రుకు అప్పజెప్పే ఆలోచనలో ఉన్నది. ఈ పని ఇప్పటికే ఎయిర్‌పోర్టుల విషయంలో చేశారు. దేశంలోని పెద్ద, పెద్ద ఎయిర్‌పోర్టులన్నిటినీ ప్రైవేటు మేనేజ్మెంట్కు – అదీ పెద్ద పెద్ద మోనోపలి కంపెనీలకు అప్పజెప్పారు. ఇక్కడి ఉద్యోగాలన్నీ ప్రైవేట్ కంపెనీల చేతిలోనే ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగాలన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలే. అక్కడ పెద్ద ఉద్యోగాలన్నీ పెద్ద కంపెనీల బంధువులకు మాత్రమే వస్తాయి. యూపీఎస్సీ పరీక్షల్లో పోటీపడి ఎవరైనా ఉద్యోగం తెచ్చుకునేది అక్కడ ఉండదు. కమ్మ, రెడ్డి కులాలకు కూడా పెద్ద ఉద్యోగాలు రావు.ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకొని తీరాన్నంతా అభివృద్ధి చేసుకుంటే అది ముంబైకి మించిన నగరమయ్యే అవకాశ ముంది. కోల్‌కతా కూలిపోతున్న నగరం. ఇటు చెన్నై దేశపు చివరి మూలన ఉంది. దానికి ఇంకా అభివృద్ధి అవకాశం తక్కువ. ఇంగ్లిష్ విద్యలో ఆదివాసులు, దళితులు, బీసీలు, ఇతర బీద పిల్లలు చదువు కుంటే వైజాగ్ నగరాన్ని అత్యాధునిక నగరంగా మార్చే అవకాశం వారికొస్తుంది. ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ విద్య నాణ్యంగా కొన సాగితే అడవుల్లోని ఆదివాసులు పక్షులుగా ఎదిగి విమానాలుగా మారుతారు. వారికి ఎంత పోడు భూమి ఇచ్చినా, ఎంత పంట సహాయం చేసినా ఒక్క తరంలో అడవి నుండి విశాఖ నగరంలోకి, అక్కడి నుండి అమెరికాకో, ఆస్ట్రేలియాకో పోలేరు. అయితే ఈ ఆదివాసులకు ప్రభుత్వ విద్య, ప్రభుత్వ ఉద్యోగ అవకాశం మొదటి తరంలో చాలా ముఖ్యం. ప్రైవేట్ సెక్టారు వీరికి అవకాశాలివ్వదు. వారిని ఉన్నత ఉద్యోగాల్లోకి రానివ్వదు. ఆంధ్రలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాణ్యమైన ఇంగ్లిష్ విద్య ఈ ఆదివాసుల్లో కొనసాగితే, 20–30 సంవత్సరాల్లో అమెరికాలో నల్లజాతీయులను మించిన మేధా వులు ఆదివాసుల నుండి వచ్చి విశాఖ పట్టణాన్ని ప్రపంచ నగరంగా మారుస్తారు. ఈ ఆదివాసుల నుండి ఎంతోమంది ఎలాన్ మస్క్‌లు వచ్చే అవకాశముంది. ఇటువంటి మార్పు భారతదేశపు గుజరాతీ క్యాపిటలిస్టులకు, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, ఆరెస్సెస్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. వీరికి ప్రభుత్వ ఉద్యోగులు ఓటువేసి గెలిపించే ప్రయత్నం చేస్తే వ్యవస్థనంతా గుజరాత్–ముంబై క్యాపిటలిస్టులకు అప్పజెప్పడమే.భారతదేశం అమెరికా కాదు, యూరప్ కాదు, ఆస్ట్రేలియా కాదు, కెనడా కాదు. ఇది 140 కోట్ల జనాభా కలిగిన చిన్న దేశం. దీన్ని చిన్న దేశం అని ఎందుకు అంటున్నానంటే భూపరిమాణంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, చైనాతో పోలిస్తే ఇది చాలా చిన్న భూమి కలిగిన దేశం. ఈ దేశ జనాభా ఇంకా ముందు, ముందు పెరుగుతుంది. ఆధునిక సైన్స్‌ను ఇంగ్లిష్ భాషతో ముడేసి గొప్ప, గొప్ప శాస్త్ర పరిశోధనల ద్వారానే మనం ఇంతమందికి తిండి, బట్ట, ఇల్లు ప్రపంచంలో తలెత్తుకుని బతికే ఆత్మ గౌరవాన్ని ఇవ్వగలం. అందుకు భావితరాలు – ముఖ్యంగా ఆదివాసులు, దళితులు, ఓబీసీలు – ఇంగ్లిష్‌లో చదువుకొని ప్రపంచ జ్ఞానాన్ని సాధించకుండా ఈ దేశానికి మనుగడ ఉండదు. మన దేశ భవిష్యత్తుకు పునాది స్కూలు విద్యను పూర్తిగా ప్రభుత్వ రంగంలోకి తెచ్చి, ప్రైవేట్ స్కూలు విద్యను రద్దు చెయ్యడంలో ఉంది; అన్ని రకాల ఎంట్రన్స్‌లను, కోచింగ్‌లను రద్దు చేసి నేరుగా 12వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా, విద్యార్థి శ్రమ గౌరవ పనుల్లో పాల్గొన్న సర్టిఫికెట్ల ఆధారంగా ఉన్నత చదువులకు పోవడంలో ఉంది. అమెరికా, యూరప్ ఇదే చేస్తాయి. బీజేపీ, చంద్రబాబు ఇటువంటి విద్యకు పూర్తిగా వ్యతిరేకం. కనుక ఇప్పుడు ఉద్యోగాలు ఏ కులస్థులైనా మొత్తం సమాజ భవిష్యత్ గురించి ఆలో చించకుండా ప్రైవేటీకరణకు, కుల తత్వానికి, మత తత్వానికి, వర్గ తత్వానికి ఓటు వేసుకుంటే సమాజంలో తిరుగుబాటు మొదలైతే దేశం కుప్పకూలుతుంది.భారతదేశపు ప్రైవేట్ రంగం అమెరికాలో, యూరప్‌లో ఉన్నట్టు మానవతా విలువలతో ఏర్పడినది కాదు. గ్రామాల్లో రైతులను, కూలీలను దోచుకొని వారితో బడిలో, గుడిలో ప్రేమతో పెరిగిన మనుషులుగా కాక మేం కులానికి ఎక్కువ, మేం కంచం–మంచం పొత్తును అంగీకరించం అనే వారి చేతిలో పెరిగింది. ఈ దేశంలో అతిపెద్ద పెట్టుబడిదారులు కుష్ఠు రోగులకు, కుంటి వారికి, గుడ్డి వారికి ఒక ఆశ్రమం కట్టించి ఆదుకున్నట్టు చూశామా! అమెరికా తెల్లజాతి ధనవంతులు, నల్లజాతి స్త్రీలను తమ ఇంట్లో వంట మనిషిగా పెట్టుకొని వారి పిల్లలను చదివించి మేధావులను చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. నల్లవారికి ప్రత్యేక స్కూళ్ళు, కాలేజీలు పెట్టి ముందు చదివించింది తెల్లజాతి పెట్టుబడిదారులు. ఈ దేశంలో అతిపెద్ద పెట్టుబడిదారులు దళితుల కోసం, ఆదివాసుల కోసం ఒక్క స్కూలు కట్టి చదివించారా!అందుకే దిక్కులేని రోడ్డుమీద బతికే పిల్లల్ని దగ్గరకు తీసి ‘నిన్ను ఇంగ్లిష్ మీడియం బడిలో చదివిస్తాన’ని హామీ ఇచ్చిన వ్యక్తిని దింపేసి నారాయణ స్కూలును వెనుక ఉండి నడిపించే వ్యక్తికి ఓటు వేస్తే, ప్రజాస్వామ్యం కాదు గదా మానవ విలువలే బతకవు. అందరికంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నేను చెప్పే ఈ మాట గురించి ఆలోచించండి.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఏపీ ఉద్యోగులతో ఒక మాట!
దేశంలోనే అన్ని రంగాల్ని మొట్టమొదటగా ప్రైవేటీకరించడం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అన్నిటికంటే ప్రమాదకరమైంది – స్కూళ్ళు, జూనియర్ కాలేజీల విద్యా ప్రైవేటీకరణ. దీంతో పేదలకు చదువు దూరమైంది. ఆంగ్లం అందకుండా పోయింది. దీనికి విరుగుడుగా జగన్ నేతృత్వంలో విద్యా, వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ వ్యతిరేక మోడల్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైంది. దేశంలోని మొత్తం స్కూలు విద్యను ఎల్కేజీ నుండి 12వ తరగతి వరకు ప్రైవేట్ రంగం నుండి ప్రభుత్వ రంగంలోకి మార్చకుండా విద్యా సమానత్వాన్ని తేవడం సాధ్యమా? అందుకే గ్రామాలలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు అట్టడుగు గ్రామీణ శ్రమజీవుల జీవితాలను మార్చడానికి ప్రభుత్వం ఏమి చేస్తున్నదో అర్థం చేసుకోవడం ముఖ్యం.రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు ఎక్కువ ఎటు ఓటు వేశారనేది ముందుగానే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించినప్పుడు తెలుస్తుంది. ముఖ్యంగా అత్యధిక సంఖ్యలో ఉన్న టీచర్లు – స్కూలు, కాలేజీ, యూనివర్సిటీలలో పనిచేసేవారు ఎటువైపు ఉన్నారు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, సహాయక సిబ్బంది ఎటు ఓటు వేస్తారనేది కూడా ముఖ్యం. వీరితోపాటు గణనీయ సంఖ్యలో ప్రభుత్వ పోలీసు రంగం ఉద్యోగులు కూడా ఎటు ఓటు వేస్తారనేది చాలా ముఖ్యం. ఇక రెవెన్యూ, మున్సిపాలిటీ, సఫాయి శాఖతో పాటు ప్రభుత్వ రంగంలో ఉన్న పర్మనెంటు ఉద్యోగులు ఎటు ఓటు వేస్తారు, ఎవరు గెలవాలనుకుంటారు అనేది చాలా ముఖ్యమైంది. ఇంతకీ ఈ ఉద్యోగుల ఓటు గురించి ఎన్నడూలేని విధంగా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లోనే ఎందుకు చర్చించాలి? దానికొక ముఖ్య కారణమున్నది.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబులాగే ఒక రీజినల్ పార్టీ నడిపే ప్రభుత్వం. దేశంలోనే అన్ని రంగాల్ని మొట్టమొదటగా ప్రైవేటీ కరించడం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి, చంద్రబాబునాయుడు. అన్నిటికంటే ప్రమాదకరమైంది–స్కూళ్ళు, జూనియర్ కాలేజీల విద్యా ప్రైవేటీకరణ. దాన్ని ఆయన విపరీతంగా ప్రైవేటీకరించి అక్కడినుండి పార్టీ ఫండ్‌ను జమ చేశాడు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో ఎంట్రెన్సులు, కోచింగ్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. ఈ దశలోనే పుట్టగొడుగుల్లా స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు, గైడ్ రైటింగ్ కంపెనీలు, అడ్వరై్టజ్ ర్యాంకులు మొదలయ్యాయి.వైద్య రంగంలో కూడా ప్రభుత్వ రంగాన్ని మండలాల వరకు అభివృద్ధి చెయ్యకుండా ప్రైవేట్ హాస్పిటల్స్, ఒక్కొక్క డాక్టరు తన సొంత హాస్పిటల్ కట్టి నడపడం మొదలయ్యాయి. గత ఐదేళ్ళ జగన్ పాలనలో ప్రభుత్వ విద్యా రంగంలో ఇంగ్లిష్ మీడియం పెట్టి, స్కూళ్ళ అభివృద్ధి ప్రారంభించాక స్కూలు విద్యలో ప్రైవేట్ రంగం విద్య బాగా పడిపోయింది.స్కూలు టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థ వ్యతిరేక అభివృద్ధిని ఎలా చూడాలి? రాష్ట్రంలో మండలం, గ్రామ స్థాయిలో చిన్న, చిన్న ప్రభుత్వ హాస్పిటల్స్ పెరిగి, వాటిని టెలీ మెడిసిన్‌తో ముడేసిన వైద్యం... వైద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకమైందా, కాదా? గ్రామ సెక్రటేరియట్ల నిర్మాణం, చిన్న జీతాలతోనైనా 2,50,000 మంది వలంటీర్లను ప్రభుత్వ రంగంలో నియమిస్తే ప్రభుత్వ రంగం విస్తరించినట్టా, ప్రైవేట్ రంగం విస్తరించినట్టా?నిజంగానే బడ్జెట్ డబ్బులో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంత బీద, దిగువ మధ్యతరగతి రైతాంగానికి, కూలీలకు బదిలీ చేయబడ్డది కనుక ఉద్యోగుల జీతభత్యాల పెరుగుదల ఆగిందనుకుందాం. అయినా ప్రభుత్వ రంగ ఎదుగుదల, ప్రైవేట్ రంగ ఎదుగుదల కోణం నుండి చూసినప్పుడు ప్రభుత్వం 30 వేల ఎకరాల్లో అమరావతి కట్టడం కోసం కాంట్రాక్టర్లకు ఆ డబ్బు ఇస్తే ఏ రంగం పెరిగేది? అందుకు బదులు గ్రామీణ అభివృద్ధి ముఖ్యంగా విద్యా, వైద్య రంగాల అభివృద్ధి జాతీయ వాదంలో కీలకమైంది.ఈ స్థితిలో ప్రభుత్వ రంగ ఉద్యో గులు, ముఖ్యంగా టీచర్లు ఏ ముఖ్యమంత్రిని కోరుకోవాలి? ప్రభుత్వ రంగాన్ని గణనీయంగా పెంచిన జగన్నా, ప్రైవేట్ రంగ అనుకూల బాబునా? మరీ ముఖ్యంగా మోదీల కూటమినా? పవన్ కల్యాణ్‌కి సినిమా రంగం తప్ప ఏ రంగం గురించి తెలియదు. ఆయన మోదీ, బాబు ఏది చెబితే అది చేస్తాడు.ఉద్యోగస్తులు నిరంతరం ప్రజా జీవన విధానం, వారి ఆర్థిక స్థితి గతులతో సంబంధం లేకుండా తమ జీతాల పెంపు, అనుకూల ట్రాన్స్ ఫర్, రిటైర్మెంట్ ఏజ్ పెంపు గురించి ఆలోచిస్తే క్రమంగా ప్రభుత్వ రంగాన్ని మూసేసి ప్రైవేట్ రంగ ఎదుగుదలకు ఓటెయ్యడమే. భవిష్యత్ తరాల బతుకుదెరువు గురించి, రాష్ట్ర, దేశ భవిష్యత్ గురించి మాకెందుకు అనుకుంటే ప్రైవేటీకరణను ప్రభుత్వ రంగ ఉద్యోగులే కోరుకోవడం కాదా? ఉద్యోగుల్లో, ముఖ్యంగా టీచర్లు కమ్యూనిస్టు పార్టీలతో ఉండి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుంటారు.అదే టీచర్లు ఇప్పుడు ఏపీలో ప్రైవేట్ విద్యారంగాన్ని ప్రభుత్వ రంగంలోకి మారిస్తే, ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే, నాడు–నేడు పథకం ద్వారా స్కూళ్ల రూపురేఖలను మారిస్తే ఈ ప్రక్రియకు మద్దతు ఇవ్వాలి కదా! కమ్యూ నిస్టు పార్టీలు ఈ నూతన ప్రభుత్వ రంగ అభివృద్ధిని వ్యతిరేకిస్తూ జగన్‌ను ఓడించాలని చూస్తున్నాయి. ఇది విద్యా, వైద్య రంగంలో పెరుగుతున్న ప్రభుత్వ ఆస్తులను వ్యతిరేకించడం కాదా?కమ్యూనిస్టులు ఏపీలో ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ మీడియంను తీసేసి, ఆ బడులను మూసేసి, విద్యా దోపిడీదారులకు అప్పజెబుతారా? భారతదేశంలో అతి పెద్ద ప్రైవేట్ సెక్టార్, విద్యా రంగం. ప్రైవేట్ రంగంలో ఇంగ్లిష్ విద్య పేరుతో చంద్రబాబు మిత్రబృందం వేల కోట్లు దోచుకుంటుంటే జగన్ ప్రభుత్వం ఆ దోపిడీకి అడ్డుకట్ట వేసే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది.కమ్యూనిస్టులు సైతం ప్రభుత్వ రంగ అభివృద్ధిని వ్యతిరేకిస్తూ, మాతృభాష ప్రాంతీయ వాదానికి తలొగ్గి మళ్ళీ ప్రైవేట్ విద్యా వైద్యానికి ఊడిగం చేస్తే ప్రజలు వీరినెలా నమ్ముతారు? విద్యా, వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ వ్యతిరేక మోడల్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైంది. దాన్ని చంపెయ్యడానికి కమ్యూనిస్టులు నడుం కడితే ప్రజలు ఏమైపోవాలి?ఆరెస్సెస్/బీజేపీ నేతృత్వంలో నడిచే కేంద్ర ప్రభుత్వం కేంద్ర స్థాయి పరీక్షలు, సెంట్రల్ యూనివర్సిటీల ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే రాయనిస్తున్నది. అంటే క్రమంగా హిందీని దేశపు ఉత్పత్తి కులాల పిల్లల మీద రుద్ది, ధనవంతులకు మాత్రమే ప్రైవేట్ ఇంగ్లిష్ అంతర్జాతీయ జ్ఞాన సంపదను అందు బాటులో ఉంచ చూస్తున్నది.ఈ విద్యా విధానాన్ని ఎలా ఎదు ర్కోవాలి? దేశంలోని మొత్తం స్కూలు విద్యను ఎల్కేజీ నుండి 12వ తరగతి వరకు ప్రైవేట్ రంగం నుండి ప్రభుత్వ రంగంలోకి మార్చ కుండా విద్యా సమానత్వాన్ని సాధించగలమా? దేశంలో విద్యా వ్యవస్థని, కనీసం స్కూలు విద్యా వ్యవస్థనైనా ప్రభుత్వ రంగంలోకి మార్చడానికి ప్రభుత్వ టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, మానవ సమానత్వం కోసం పనిచేసేవాళ్ళు సపోర్టు చెయ్యకపోతే ఎలా?అంతేకాక ప్రభుత్వ ఉద్యోగులు బీద ప్రజల సంక్షేమం కోసం బడ్జెట్ డబ్బును ఖర్చు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తమ కుటుంబాల గురించే ఆలోచిస్తే ప్రభుత్వ రంగం కూలిపోక ఏమౌతుంది? ఈ సమస్య చాలా కీలకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ముందు ఉన్నది. దేశంలోనే అన్ని రంగాల్ని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలోకి నెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్లు ప్రభుత్వ రంగ వ్యతిరేకికే ఓటు వేస్తే జరిగేదేంటి?గ్రామాలలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్లు అట్టడుగు గ్రామీణ శ్రమ జీవుల జీవితాలను మార్చడానికి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూసి ఆ ప్రభుత్వాన్ని కొనసాగించాలా వద్దా అని నిర్ణ యించుకోవాలి. ఉత్పత్తి రంగంలో పనిచేసే ప్రజల జీవితాలను మెరుగుపర్చే ప్రభుత్వం ఉన్నప్పుడు తమ జీతభత్యాల పెంపుదలతో కొంత రాజీపడాల్సి వస్తే కూడా పడాలి. అది ఒక ఉద్యోగి రాష్ట్రానికి, దేశానికి చేసే మేలు. రాజకీయ నాయకులు దోచుకుంటున్నప్పుడు వారిపై పోరాటం తప్పు కాదు.ఉద్యోగులు హక్కులను, ఆత్మగౌర వాన్ని ఎప్పుడు కూడా తాకట్టు పెట్టకూడదు. అయితే, తమ హక్కుల పోరాటం, ఉత్పత్తి రంగంలో పనిచేసే మానవాళిని ఆకలితో మాడ్చ టానికో, బీద పిల్లలు ధనవంతుల పిల్లలతో పోటీపడి ఎదిగే జీవితాన్ని అడ్డుకోవడానికో చెయ్యడం మహానేరం. ఈ మాట 38 సంవత్సరాలు ప్రభుత్వ రంగంలో పనిచేసిన వ్యక్తిగా చెబుతున్నాను. ప్రతి ఉద్యోగి, ఓటరు, పౌరుడు దిక్కు లేని వారికి దిక్కుగా నిలబడాలి. అందుకే 2024 ఎన్నికల్లో వాళ్ళ ఓటు వాళ్ళ జీవిత లక్ష్యాన్ని సూచిస్తుంది.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఉద్యోగులపై ఈసీ నిఘా
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగులపై నిఘా పెట్టింది. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. ఏ పార్టీకైనా కొమ్ముగాస్తున్నట్టు ఏ విధంగా తేలినా షోకాజ్ నోటీసులు, ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతోంది. వ్యక్తిగత కదలికలే కాకుండా, వారి సామాజిక మాధ్యమ ఖాతాలపై కూడా కన్నేసి ఉంచింది. అన్ని సాంకేతిక వనరులను వినియోగించుకుంటూ గతంలో ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు, రాజకీయ పార్టీలతో అంటకాగుతున్న నేతలను కనిపెట్టాలని నిర్ణయించింది. దీంతో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు అప్రమత్తమయ్యాయి. జాగ్రత్తగా ఉండాలని తమ ఉద్యోగులకు సూచిస్తున్నాయి. ఎన్నికల కోడ్ ముగిసే వరకూ ఏ పార్టీ నేతలను కలవద్దని స్పష్టం చేశాయి. రాజకీయ పార్టీలు, నేతలు నిర్వహించే విందులు, వినోద కార్యక్రమాలకు వెళ్ళొద్దని హెచ్చరించాయి. సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయుల వ్యక్తిగత సామాజిక మాధ్యమ ఖాతాలపై ఎన్నికల కమిషన్ నిఘా పెట్టింది. వారు ఉండే వాట్సాప్ గ్రూపులు, వారి ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రాం ఖాతాలను ప్రత్యేక బృందాలు పరిశీలిస్తున్నాయి. గతంలో ఆరోపణలున్న వారిపై మరింత నిఘా పెట్టినట్టు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఓ నేతకు అనుకూలంగా సామాజిక మాధ్యమంలో పోస్టు చేసినా, లేదా ఎవరైనా పోస్టు చేసినదాన్ని ఫార్వర్డ్ చేసినా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్టుగానే పరిగణిస్తారు. ఆరోపణలు వచ్చిన ఉద్యోగి ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలించే అవకాశం ఉందని సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. టీచర్లు, ఉద్యోగులే కీలకం పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులదే కీలక పాత్ర. రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. 1.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీళ్లల్లో దాదాపు 90 శాతం ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఉద్యోగుల్లో క్లాస్–4 తప్ప, అందరికీ ఎన్నికల విధులు తప్పనిసరి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వీళ్ళు పని చేస్తుంటారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వీరికి ప్రత్యేక నిబంధనావళిని ఎన్నికల కమిషన్ జారీ చేసింది. రాజకీయ నేతలతో ఎలాంటి సంబంధాలు నెరపడానికి వీల్లేదని, ఏ సభలు సమావేశాల్లో పాల్గొనవద్దని, విందులు, వినోదాలకు వెళ్ళొద్దని, అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామ్యం కావద్దని, ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వొద్దని పేర్కొంది. ప్రతి నేత సమావేశం, ప్రచారం వీడియో చిత్రీకరణ ఉంటుందని, ఇందులో ఉద్యోగి ఉన్నట్టు తేలితే, నేతలతో సంబంధాలున్నట్టు ఆధారాలతో ఫిర్యాదులొచ్చిన తక్షణమే సస్పెన్షన్ తప్పదని కూడా స్పష్టం చేసింది. అయినా సరే..! ఎన్నికల కోడ్‌లో ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు వాటిని బేఖాతరు చేస్తున్నారు. సిద్దిపేటలో ఇటీవల 110 మంది డీఆర్డీఏ ప్రాజెక్టు మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు ఓ రాజకీయ పార్టీ ఎంపీ అభ్యర్థి నిర్వహించిన బహిరంగ సమావేశానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోతో ప్రత్యర్థి పార్టీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని కమిషన్ సస్పెండ్ చేసింది. వీడియోను మార్ఫింగ్ చేశారని ఆ ఉద్యోగులు వాదిస్తున్నారు. సదాశివ పేటలో ఓ జూనియర్ లెక్చరర్ ఓ జాతీయ పార్టీ అభ్యర్థికి మద్దతుగా జరిగిన మీటింగ్‌లో పాల్గొనడం ప్రత్యర్థులు పసిగట్టారు. ఈ వీడియోను ఈసీకి అందజేయడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు ఓ పార్టీ మీటింగ్‌లో పాల్గొన్న వీడియో బయటకు రావడంతో ఈసీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రధాన ఉపాధ్యాయ సంఘం నేతలు ఓ పార్టీ నేత ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆయా సంఘాల నేతలు సూచిస్తున్నారు. -
సిద్ధిపేట: 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్
సాక్షి, సిద్ధిపేట: జిల్లాలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్‌కు గురయ్యారు. రెండురోజుల క్రితం మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి సమావేశంలో పాల్గొన్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభలో పాల్గొనడంపై ఎన్నికల కమిషన్, సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. -
సర్కారుపై ‘విరమణ’ భారం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడేళ్ల తర్వాత మొదలైన ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లతో ఆర్థిక శాఖలో ఆందోళన మొదలైంది. పదవీ విరమణ చేసే ఉద్యోగులకు ఇవ్వాల్సిన తక్షణ బెనిఫిట్లను చెల్లించేందుకు ఏటా రూ.3,500 వేలకోట్ల భారం పడనుంది ఈ మేరకు నిధులను ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. 2021లో అప్పటి బీఆర్ఎస్ సర్కారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల (క్లాస్–4 ఉద్యోగులు మినహా) రిటైర్మెంట్లు జరగలేదు. తిరిగి ఈ ఏడాది మార్చి 31వ తేదీ నుంచి ఉద్యోగుల పదవీ విరమణలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 7,995 మంది ఉద్యోగులు రిటైర్ కానున్నట్టు సమాచారం. వీరికి ప్రభుత్వం చెల్లించాల్సిన తక్షణ బెనిఫిట్ల కింద రూ.3,200 కోట్ల వరకు అవసరమని ఆర్థిక శాఖ అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల మెడికల్ బిల్లుల చెల్లింపు కూడా కష్టమవుతుండటం, ఇక నుంచి ఏటా రిటైర్మెంట్ల భారం మరింత పెరగనుండటం ఆర్థిక శాఖను కలవరపెడుతోంది. సరాసరి రూ.40 వేల మూల వేతనం ఈ ఏడాది రిటైర్మెంట్లను పరిశీలిస్తే 1,419 మంది గెజిటెడ్ స్థాయి, 5,360 మంది నాన్ గెజిటెడ్ స్థాయి, 1,216 మంది క్లాస్–4 ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. నాన్ గెజిటెడ్ వారు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. రిటైరయ్యే వారి సగటు మూల వేతనం రూ.40వేల వరకు ఉంటుందని అంచనా. దీనికి హెచ్ఆర్ఏ, సీసీఏ, డీఏలు కలిపితే ఈ మొత్తం రూ.60 వేల వరకు ఉంటుంది. రిటైరయ్యే ప్రతి ఉద్యోగికి లీవ్ శాలరీల కింద 10 నెలల వేతనాన్ని.. అంటే రూ.6 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీనికితోడు గ్రాట్యుటీ కింద రూ.12 లక్షలు, కమిటేషన్ కింద రూ.20 లక్షలు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాలి. అంటే సగటున ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి రూ.38లక్షల నుంచి రూ.40 లక్షల వరకు తక్షణ బెనిఫిట్లను వారి హక్కుగా ఇవ్వాలి. ఈ ఏడాది రిటైరయ్యే 7,995 మందికి ఈ బెనిఫిట్లను చెల్లించాలంటే రూ.3 వేల కోట్లకుపైగా అవసరం. ఇక 2025లో 9,630 మంది, 2026లో 9,719 మంది, 2027లో 9,443 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తారని లెక్కలు చెప్తున్నాయి. అంటే వారికి తక్షణ బెనిఫిట్ల కింద సగటున ఏటా రూ.3,500 కోట్ల వరకు చెల్లించాలి. దీనితో ఖజానాపై భారం పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుత పరిస్థితేమిటి? ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్స్‌లకు కూడా చెల్లించే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. వీటికితోడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2022 జూలై, 2023 జనవరి, జూలై, 2024 జనవరిలో చెల్లించాల్సిన నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఐదో డీఏ (జూలై, 2024) కూడా ముందుకు వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో.. ఈ నాలుగు డీఏల చెల్లింపును సర్కారు వాయిదా వేస్తూ వస్తోంది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ జీవిత బీమా (జీఎల్ఐ) కింద జమ చేసుకున్న నిధులను కూడా వాడుకోవాల్సి వచ్చిందని ఆర్థికశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు రిటైరైన ఉద్యోగులకు వారి జీఎల్ఐతోపాటు జీపీఎఫ్‌పై వడ్డీ చెల్లించాలని.. ఇవన్నీ కలిపితే చాలా భారం పడుతుందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. గత ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచి అప్పటికి ఈ భారం నుంచి గట్టెక్కిందని.. ఇప్పుడు చెల్లించక తప్పదని తెలిపారు. ఈ చెల్లింపుల కోసం నెలకు రూ.250 కోట్లదాకా అవసరమన్నారు. ఎప్పటికప్పుడే బెనిఫిట్లు చెల్లించాలి: ఉద్యోగ సంఘాలు రిటైర్మెంట్లతో సర్కారుపై భారమన్న ప్రచారంపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఉద్యోగి రిటైరవడానికి మూడు నెలల ముందే బెనిఫిట్ల కోసం దరఖాస్తు చేసుకుంటారని, ఉద్యోగుల హక్కు కింద ప్రభుత్వం వాటిని ఎప్పటికప్పుడే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. పదవీ విరమణ వయసును మరోసారి పెంచడం వంటి ఆలోచనలు చేయవద్దని కోరుతున్నాయి.