ఆఫీసులకు రాకుంటే.. లీవు తప్పదు!  | Federal workers return to offices amid threat from Elon Musk | Sakshi
Sakshi News home page

ఆఫీసులకు రాకుంటే.. లీవు తప్పదు! 

Published Tue, Feb 25 2025 6:11 AM | Last Updated on Tue, Feb 25 2025 6:11 AM

Federal workers return to offices amid threat from Elon Musk

ప్రభుత్వ సిబ్బందికి మస్క్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌: అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చిన ఆదేశాల ప్రకారం  ప్రభుత్వ ఉద్యోగులు ఈ వారం నుంచి తప్పనిసరిగా తిరిగి విధులకు హాజరు కావాల్సిందేనని ఆయన సలహాదారు ఎలాన్‌ మస్క్‌ స్పష్టం చేశారు. హాజరు కాని వారందరినీ పరిపాలనా పరమైన లీవుపై సాగనంపుతామని హెచ్చరించారు. వారికిక వేతనాలుండవన్నారు. ఆయన సోమవారం ‘ఎక్స్‌’లో ఈ మేరకు పలు పోస్టులు చేశారు. ట్రంప్‌ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేప ట్టాక వేగంగా జరుగుతున్న పరిణా మాలతో ఫెడరల్‌ ప్రభుత్వ విభాగాల్లో అయోమయం, ఉద్యోగుల్లో ఆందోళన పెరిగి పోయాయి. 

యంత్రాంగాల్లో విభేదాలు పొడచూపుతున్నాయి. ఉద్యోగులు ఎవ రికి వారు తమ పనితీరును వివరించాలంటూ మస్క్‌ రెండు రోజుల క్రితం చేసిన హెచ్చరికలపై స్పందించాలంటూ హెల్త్, హ్యూమన్‌ రిసోర్సెస్, డ్రగ్‌ ఎన్‌ఫో ర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్, ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ తమ ఉద్యోగులకు సూచించగా ఆ అవసరం లేదంటూ డిఫెన్స్, హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ, ఇంధన, వాణిజ్య విభాగాలు సూచించాయి. ఇప్పటికే కన్జూమర్‌ ఫైనాన్షియల్‌ ప్రొటెక్షన్‌ బ్యూరో ఉద్యోగులను మస్క్‌ యంత్రాంగం ఇళ్లకు పంపించేసింది.

యూఎస్‌ఎయిడ్‌లో 1,600 ఉద్యోగుల తొలగింపు
వాషింగ్టన్‌: ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక అమెరికా ప్రభుత్వ విభాగాలైన ఫెడరల్‌ ఏజెన్సీలు, అనుబంధ విభాగాల్లో సిబ్బంది కోత పరంపర కొనసాగుతోంది. తాజాగా యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (యూ ఎస్‌ఎయిడ్‌) విభాగంలోని 1,600 మంది ఉద్యోగులను ట్రంప్‌ ప్రభుత్వం తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా యూఎస్‌ఎయిడ్‌కు సంబంధించిన కీలక విధులు, ప్రత్యేక కార్యక్రమాల్లో నిమగ్నమైన సిబ్బందిని సోమవారం నుంచి సెలవులపై పంపుతున్నట్లు ట్రంప్‌ సర్కార్‌ ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement