అమెరికాలో ట్విస్ట్‌.. ట్రంప్‌, మస్క్‌కు ఝలక్‌! | Hands Off Protests Across US to oppose Trump and Musk policies | Sakshi
Sakshi News home page

అమెరికాలో ట్విస్ట్‌.. ట్రంప్‌, మస్క్‌కు ఝలక్‌!

Published Sun, Apr 6 2025 7:25 AM | Last Updated on Sun, Apr 6 2025 7:26 AM

Hands Off Protests Across US to oppose Trump and Musk policies

వాష్టింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ట్రంప్‌ పరిపాలన, వివాదాస్పద విధానాలపై అమెరికా అంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికన్లు వీధుల్లోకి వచ్చి ట్రంప్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. హ్యాండ్స్‌ ఆఫ్‌('Hands Off!') పేరుతో నిరసనలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అగ్రరాజ్యం అమెరికాలో నిరసనలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనలు తెలిపారు. హ్యాండ్స్‌ ఆఫ్‌ అంటూ 50 రాష్ట్రాలలో 1,200కిపైగా ప్రదేశాల్లో నిరసనలను నిర్వహించారు. ఈ నిరసనలకు పౌర హక్కుల సంస్థలు, కార్మిక సంఘాలు, LGBTQ+ న్యాయవాదులు, ఎన్నికల కార్యకర్తలు సహా 150కి పైగా సమూహాలు ఈ ర్యాలీలకు మద్దతు ఇచ్చాయి.

 

ఈ సందర్భంగా ట్రంప్ పరిపాలన విధానాలపై వీరు నిరసనలు తెలిపారు. ముఖ్యంగా సమాఖ్యల తొలగింపులు, సామూహిక బహిష్కరణలు, ఇతర వివాదాస్పద చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిరసనకారులు మాట్లాడుతూ.. డొనాల్డ్‌ ట్రంప్‌, ఎలాన్‌ మస్క్‌ అనుచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రపంచానికే సవాల్‌ చేస్తున్నారని అన్నారు. వలసదారుల పట్ల వ్యవహరించే తీరు దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వ సంస్థల తగ్గింపు, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలలో కోతలు, వలసదారుల చికిత్స, లింగమార్పిడి హక్కులపై ఆంక్షలు వంటి విస్తృత శ్రేణి అంశాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక, 2017 తర్వాత అమెరికా ఇంత మంది బయటకు వచ్చి నిరసనలు ఇలా నిరసనలు తెలపడం ఇదే మొదటిసారి. కాగా, వీరి నిరసనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement