వాషింగ్టన్ : డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) సంయుక్త సారథులు బిలియనీర్ ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి అమెరికాలోని 20 లక్షల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇకపై వారానికి ఐదురోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనని హెచ్చరికలు జారీ చేయనున్నారు. కాదు కూడదు అంటే అంటే వారిని తొలగించే దిశగా అడుగులు వేయనున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెలుగులోకి వచ్చింది.
అమెరికా ప్రభుత్వం చేస్తున్న దుబారా ఖర్చుల్ని తగ్గించాలని ట్రంప్ ఆదేశాలతో మస్క్, వివేక్ రామస్వామిలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని రద్దు చేయనున్నారు. వారానికి ఐదురోజులు కార్యాలయాలకు వచ్చి పనిచేసేలా ఆదేశించనున్నారు.
ఒకవేళ ఆఫీస్ నుంచి పనిచేయడాన్ని వ్యతిరేకించే ప్రభుత్వ ఉద్యోగులకు.. కోవిడ్-19 సమయంలో అమెరిన్ ట్యాక్స్ పేయర్స్ చెల్లించిన ప్రత్యేక చెల్లింపుల్ని నిలిపివేయనున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.
ఇటీవల,వివేక్ రామస్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న భారీ దుబారా ఖర్చుల్ని తగ్గించే పనిలో ఉన్నాం. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులతో బలవంతంగా రాజీనామా చేయించి వారి సంఖ్యను భారీగా తగ్గిస్తాం. దుబారా ఖర్చుల్ని తగ్గిస్తాం. తాము సైతం డోజ్‌లో ఫెడరల్ అధికారులు,ఉద్యోగులులా కాకుండా వాలంటీర్లుగా పనిచేస్తామని తెలిపారు. మీకు మస్క్ గురించి తెలుసో,లేదో.. ఆయన ఉలి తీసుకురాలేదు. రంపం తెచ్చారు. మేం దాన్ని బ్యూరోక్రసీపై వాడాలనుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ హైలెట్ చేసింది.
కాగా,అమెరికాలోని ప్రముఖ ఎన్‌జీవో సంస్థ పార్ట్‌నర్‌షిప్ ఫర్ పబ్లిక్ సర్వీస్ నివేదిక ప్రకారం.. అమెరికాలో మొత్తం 20లక్షలమంది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులున్నారు. 400పైగా ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ మొత్తం ఉద్యోగుల్లో 80 శాతం మంది అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment