vivek ramaswamy
-
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల మెడపై వేలాడుతున్న ‘లే ఆఫ్’ కత్తి!
వాషింగ్టన్ : డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) సంయుక్త సారథులు బిలియనీర్ ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి అమెరికాలోని 20 లక్షల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇకపై వారానికి ఐదురోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనని హెచ్చరికలు జారీ చేయనున్నారు. కాదు కూడదు అంటే అంటే వారిని తొలగించే దిశగా అడుగులు వేయనున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెలుగులోకి వచ్చింది.అమెరికా ప్రభుత్వం చేస్తున్న దుబారా ఖర్చుల్ని తగ్గించాలని ట్రంప్ ఆదేశాలతో మస్క్, వివేక్ రామస్వామిలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని రద్దు చేయనున్నారు. వారానికి ఐదురోజులు కార్యాలయాలకు వచ్చి పనిచేసేలా ఆదేశించనున్నారు.ఒకవేళ ఆఫీస్ నుంచి పనిచేయడాన్ని వ్యతిరేకించే ప్రభుత్వ ఉద్యోగులకు.. కోవిడ్-19 సమయంలో అమెరిన్ ట్యాక్స్ పేయర్స్ చెల్లించిన ప్రత్యేక చెల్లింపుల్ని నిలిపివేయనున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.ఇటీవల,వివేక్ రామస్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న భారీ దుబారా ఖర్చుల్ని తగ్గించే పనిలో ఉన్నాం. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులతో బలవంతంగా రాజీనామా చేయించి వారి సంఖ్యను భారీగా తగ్గిస్తాం. దుబారా ఖర్చుల్ని తగ్గిస్తాం. తాము సైతం డోజ్‌లో ఫెడరల్ అధికారులు,ఉద్యోగులులా కాకుండా వాలంటీర్లుగా పనిచేస్తామని తెలిపారు. మీకు మస్క్ గురించి తెలుసో,లేదో.. ఆయన ఉలి తీసుకురాలేదు. రంపం తెచ్చారు. మేం దాన్ని బ్యూరోక్రసీపై వాడాలనుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ హైలెట్ చేసింది.కాగా,అమెరికాలోని ప్రముఖ ఎన్జీవో సంస్థ పార్ట్నర్షిప్ ఫర్ పబ్లిక్ సర్వీస్ నివేదిక ప్రకారం.. అమెరికాలో మొత్తం 20లక్షలమంది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులున్నారు. 400పైగా ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ మొత్తం ఉద్యోగుల్లో 80 శాతం మంది అమెరికా రాజధాని వాషింగ్టన్లో పనిచేస్తున్నారు. -
ఉద్యోగాలపై బాంబు పేల్చిన వివేక్ రామస్వామి.. భారీగా కోతలు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం అందుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్‌కు కీలక బాధ్యతలను అప్పగించారు. ఇక, బాధ్యతల్లో చేరకముందే వివేక్ రామస్వామి పెద్ద బాంబ్ పేల్చారు. ఉద్యోగాల్లో కోతలు ఉంటాయని హింట్ ఇచ్చారు.ఇటీవల ఫ్లోరిడాలోని ట్రంప్ ఎస్టేట్ మారలాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో వివేక్ రామస్వామి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘లక్షల మంది ఫెడరల్ బ్యూరోక్రాట్లను బ్యూరోక్రసీ నుంచి సామూహికంగా తొలగించే స్థాయిలో నేను, ఎలాన్‌మస్క్ ఉన్నాం. అలా ఈ దేశాన్ని మేం కాపాడాలనుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోతలు విధించే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇక, ముందు నుంచి డొనాల్డ్ ట్రంప్.. అమెరికా ఫస్ట్ అనే నినాదం చేస్తున్న విషయం తెలిసిందే. Vivek Ramaswamy on a mission.#MAGA pic.twitter.com/wYivstPqDV— TheTrumpestFuture (@trumpestfuture) November 16, 2024 -
వివేక్ రామస్వామి 21 ఏళ్ల నాటి వీడియో వైరల్
వాషింగ్టన్ డీసీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్.. భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) బాధ్యతల్ని అప్పగించారు. ఈ తరుణంలో నాడు విద్యార్థిగా ఉన్న వివేక్ రామస్వామి బ్యూరోక్రసీని వ్యతిరేకిస్తూ ప్రసంగించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.2003లో 18 ఏళ్ల రామస్వామి ఒహాయోలోని సెయింట్ జేవియర్ స్కూల్లో తన జర్నీని ఉద్దేశించి మాట్లాడారు. ఆ ప్రసంగం ఇప్పుడు వైరల్ కావడంపై వివేక్ స్పందించారు. విద్యార్థిగా ఉన్న తాను బ్యూరోక్రసీని వ్యతిరేకించాను అని నవ్వుతున్న ఎమోజీని షేర్ చేశారు. ప్రస్తుతం తాను అనుసరిస్తోన్న భావజాలం ఆనాటి నుంచే ఉందనే ఉద్దేశంలో రాసుకొచ్చారు.కాగా, ఒహియోలోని సిన్సినాటిలో పుట్టి పెరిగిన రామస్వామి జాతీయ స్థాయి టెన్నిస్ ఆటగాడు. అతని హైస్కూల్ వాలెడిక్టోరియన్. హార్వర్డ్ నుంచి బయోలజీలో గ్రాడ్యుయేషన్ యేల్ లా స్కూల్లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. Vivek Ramaswamy, 18 years old. his High School Graduation Speech of 2003. pic.twitter.com/sG4kGLbqtL— Brian Roemmele (@BrianRoemmele) November 13, 2024 -
ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళనకో శాఖ..సారథులుగా మస్క్, వివేక్
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారత మూలాలున్న రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. యంత్రాంగంలో సమూల ప్రక్షాళన కోసం వారి సారథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) ఏర్పాటును ప్రకటించారు. ‘‘ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళన, మితిమీరిన నిబంధనలకు కోత, అనవసర ఖర్చు తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్ వ్యవస్థీకరణ తదితరాలను ఈ శాఖ పర్యవేక్షించనుంది. ఇందుకు ‘ది గ్రేట్’ మస్క్, ‘అమెరికా దేశభక్తుడు’ వివేక్ నాయకత్వం వహిస్తారు. తమ అమూల్య సలహాలతో సేవ్ అమెరికా ఉద్యమానికి మార్గదర్శనం చేస్తారు’’ అని పేర్కొన్నారు. అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకు 250 ఏళ్లు నిండే 2026 జూలై 4వ తేదీకల్లా ప్రక్షాళన ప్రక్రియను పూర్తి చేయాలని మస్క్, వివేక్‌లకు డెడ్‌లైన్ విధించారు. ‘డోజ్’ను ఈ కాలపు మన్హాటన్ ప్రాజెక్టుగా ట్రంప్ అభివరి్ణంచారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అణుబాంబుల నిర్మాణానికి చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘మన్హాటన్’. డోజ్ పనితీరుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇది ఫెడరల్ అడ్వైజరీ కమిటీ చట్టం పరిధిలోకి రావచ్చంటున్నారు. ప్రభుత్వోద్యోగులు ఆస్తులు తదితర వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాల్సి ఉంటుంది. అయితే మస్క్, రామస్వామి ప్రభుత్వంలో చేరకుండా బయటి నుంచే పనిచేస్తారని ట్రంప్ చెప్పడంతో ఆ నిబంధన వారికి వర్తించే అవకాశం లేదు. గతంలోనూ అమెరికా అధ్యక్షులు ఇలా ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేశారు. రిపబ్లికన్ పార్టీకే చెందిన రొనాల్డ్ రీగన్ 1981–1989 మధ్య ‘గ్రేస్ కమిషన్’ను స్థాపించారు. ఇక ప్రకంపనలే: మస్క్ డోజ్ ఏర్పాటును మస్క్ స్వాగతించారు. ఇది ప్రభుత్వ వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తుందన్నారు. ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావచ్చన్నారు. పారదర్శకత కోసం డోజ్ చర్యలన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ప్రజా ధనం వృ«థాను అరికట్టేందుకు లీడర్ బోర్డ్ ఏర్పాటవుతుందని తెలిపారు. ట్రంప్ టీమ్‌లో తొలి భారత అమెరికన్ ట్రంప్ 2.0 టీమ్‌లో చోటు సంపాదించిన తొలి భారత అమెరికన్‌గా 39 ఏళ్ల వివేక్ నిలిచారు. డోజ్ ఏర్పాటుపై ఆయన హర్షం వెలిబుచ్చారు. ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళనలో సున్నితంగా వ్యవహరించబోమని స్పష్టం చేశారు. కాలం చెల్లిన పలు ఫెడరల్ ఏజెన్సీలను తొలగించాలంటూ ప్రచార పర్వంలో రిపబ్లికన్లు తరచూ ఉపయోగించిన నినాదం ‘షట్ ఇట్ డౌన్’ను ఈ సందర్భంగా రీ పోస్ట్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు వివేక్ పూర్తిస్థాయిలో మద్దతివ్వడం తెలిసిందే. ట్రంప్ విజయానంతరం పలు టీవీ షోల్లో మాట్లాడుతూ ఆయన్ను ఆకాశానికెత్తారు. వివేక్ 1985 ఆగస్టు 9న ఒహాయోలోని సిన్సినాటిలో జని్మంచారు. ఆయన తల్లిదండ్రులు తమిళనాడుకు చెందిన కేరళ బ్రాహ్మణులు. ఆయన ఒహాయోలోని రోమన్ కాథలిక్ స్కూల్లో చదివారు. హార్వర్డ్ నుంచి జీవశాస్త్రంలో పట్టా పొందారు. యేల్ లా స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యారు. హెడ్జ్ ఫండ్ ఇన్వెస్టర్‌గా చేశారు. యేల్లో డిగ్రీ పూర్తవకముందే మిలియన్ల కొద్దీ సంపాదించానని చెప్పుకుంటారు. 2014లో ఓ బయోటెక్ కంపెనీని స్థాపించారు. 2023 నాటికే వివేక్ సంపద ఏకంగా 63 కోట్ల డాలర్లని ఫోర్బ్స్ అంచనా వేసింది. 18 ఏళ్లకే అద్భుత ప్రసంగం హైసూ్కల్ విద్యారి్థగా సెయింట్ 18 ఏళ్ల వయసులో జేవియర్ స్కూల్లో వివేక్ చేసిన ప్రసంగ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రసంగం పొడవునా ఆయన కనబరిచిన ఆత్మవిశ్వాసం, భవిష్యత్తును గురించి మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. Congratulations to @elonmusk and @VivekGRamaswamy on this historic achievement! $DOGE #DonaldJTrump #ElonMusk #MAGA #TrumpVance2024 #VivekRamaswamy pic.twitter.com/6b98v4hyyO— Brock W. Mitchell (@BrockWMitchell) November 13, 2024 -
వివేక్ రామస్వామికి ట్రంప్ మొండి చెయ్యి?
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. వచ్చే ఏడాది (2025) జనవరిలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈలోపు తన పాలకవర్గం కూర్పుపై ట్రంప్ సమాలోచనలు చేస్తున్నారు. కీలకమైన విదేశాంగ శాఖ కార్యదర్శి పదవికి తనకు సన్నిహితుడైన మార్కో రూబియో పేరును ఆయన పరిశీలిస్తున్నట్లు కథనాలు వెల్లడవుతున్నాయి. అయితే.. ఇండో అమెరికన్ అయిన వివేక్ రామస్వామికి విదేశాంగ శాఖ కార్యదర్శి పదవిని ఇవ్వొచ్చనే గతంలో చర్చ నడిచింది. ఇప్పుడు మార్కో పేరు తెరపైకి వచ్చిన క్రమంలో.. వివేక్ రామస్వామికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు? అనే చర్చ మొదలైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం.. రిపబ్లిక్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం వివేక్ రామస్వామి పోటీకి నిలబడ్డారు. ఆదరణ అంతంత మాత్రంగానే రాడంతో పోటీ నుంచి వైదొలిగి.. ట్రంప్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే.. వివేక్ రామస్వామికి కేబినెట్లో కీలక పదవి ఖాయమనే చర్చ నడిచింది. మరోవైపు.. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మార్కో రూబియో కీలకంగా వ్యవహించారు. రూబియో 2010 నుంచి సెనేట్‌లో పనిచేశారు. ఇక ఇండో అమెరికన్ అయిన నిక్కీ హేలీకి తన పాలకవర్గంలో చోటు ఇవ్వనంటూ ట్రంప్ బహిరంగంగానే ప్రకటించడం గమనార్హం. దీంతో వివేక్ రామస్వామి కూడా అలాంటి పరిస్థితే ఎదురు కావొచ్చనే విశ్లేషణలు నడుస్తున్నాయి. ఎవరీ మార్కో రూబియో రూబియో 2011 నుంచి సెనేటర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌పై సెనేట్ సెలెక్ట్ కమిటీ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున జేడీ వాన్స్‌ను ట్రంప్ రన్నింగ్మేట్గా ప్రకటించకముందే రూబియో ఆ రేసులో ఉన్నారు.చదవండి: వలసల నియంత్రణాధికారిగా టామ్ హొమన్ -
కమలా హారీస్ ఓ కీలుబొమ్మ: వివేక్ రామస్వామి
చికాగో: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ను టార్గెట్ చేస్తూ రిపబ్లిక్ పార్టీ నేత వివేక్ రామస్వామి తీవ్ర విమర్శలు చేశారు. కమలా హారీస్ కీలుబొమ్మ అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో అమెరికా ప్రజలు వాస్తవాలను గ్రహించాలని కోరారు.కాగా, వివేక్ రామస్వామి తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘కమలా హారీస్ ఓ కీలుబొమ్మ. చక్రంలో ఇరుక్కున్న ఓ పిల్లి వంటి వ్యక్తి ఆమె. ఇక్కడ వాస్తవం ఏమిటంటే.. అమెరికా విధానాలకు ఆమె ఎంతో దూరంగా ఉన్నారు. ఆమెకు ప్రజాదరణ చాలా తక్కువ. అది మాకు ఎంతో కలిసి వస్తుంది. ఎన్నికల్లో మేము తప్పకుండా విజయం సాధిస్తాం. ఆమె ఆర్థిక విధానాలు విఫలయమ్యాయి. మేము పాలసీలో గెలుస్తాము. ఈ దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించే పది మిలియన్ల మందికి సరిహద్దును తెరిచి ఉంచడం అమెరిక్లను ఎంతో అభ్యంతరకరం. దేశ సరిహద్దుల విషయంలో భద్రతకు మేము కట్టుబడి ఉన్నాము. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా సరైన ఎంపిక అని నేను భావిస్తున్నాను. ట్రంప్ విజయం సాధించేందుకు మేము అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం . సెనేట్ మరియు హౌస్‌పై కూడా మాకు నియంత్రణ ఉంటేనే మేము ఆ ఎజెండాను అమలు చేస్తాము’ అంటూ చెప్పుకొచ్చారు. -
‘వాన్స్’ ఉత్తమ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి: వివేక్‌రామస్వామి
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ వైస్‌ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీ వాన్స్ ఎంపికపై భారత సంతతి బిలియనీర్ వివేక్‌రామస్వామి స్పందించారు. ‘నా స్నేహితుడు వాన్స్‌ను చూసి నేను గర్వపడుతున్నా. అతను నా ఫ్రెండే కాదు. క్లాస్మేట్. లాస్కూల్‌లో చదవుకునేపుడు మేమిద్దరం చాలా ఎంజాయ్ చేశాం. వాన్స్ ఉత్తమ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్. అతడి గెలుపు కోసం, దేశం బాగు కోసం నేను ఎదురు చూస్తున్నా’అని వివేక్‌రామస్వామి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వివేక్‌రామస్వామి ప్రైమరీల దశలోనే తప్పుకుని ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ల తరపున ట్రంప్ పోటీ పడుతున్నారు. ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఒహియో సెనేటర్ జేడీ వాన్స్‌ను తాజాగా ఎంపిక చేసుకున్నారు. -
ట్రంప్‌పై కాల్పులు.. వివేక్‌రామస్వామి సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద జరిగిన హత్యాయత్నం ఘటనపై భారత సంతతికి చెందిన బిలియనీర్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడ్డ నేత వివేక్ రామస్వామి ఎక్స్(ట్విటర్)లో తీవ్రంగా స్పందించారు. ట్రంప్‌పై కాల్పులు జరగడం తనను షాక్‌కు గురిచేసిందన్నారు.అధ్యక్ష ఎన్నికల పోటీలో లేకుండా చేయడం కోసమే ట్రంప్‌ను చంపాలని చూశారని ఆరోపించారు. ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందన కూడా సరిగాలేదని వివేక్‌రామస్వామి విమర్శించారు.‘అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎలాంటివాడన్నది ఈ ఘటనతో తెలిసింది. ఈ ఘటనలో జరిగిన మంచి ఇదొక్కటే. బుల్లెట్ తాకినా,రక్తం కారుతున్నా..ట్రంప్ ప్రజల కోసమే నిలబడ్డాడు.నాయకత్వం వహించేందుకు సిద్ధమని స్పష్టం చేశాడు’అని రామస్వామి ట్రంప్‌ను కొనియాడారు. ఓటర్లు ఎవరికి ఓటేద్దామనుకుంటున్నప్పటికీ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాన్ని మాత్రం ఖండించాల్సిందేనని పిలుపునిచ్చారు.కాగా,శనివారం(జులై 13) పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ట్రంప్ ఎడమచెవికి బుల్లెట్ గాయాలయ్యాయి.ఈ ర్యాలీకి హాజరైన ట్రంప్ మద్దతుదారుడు ఒకరు కాల్పుల్లో మృతిచెందాడు. -
USA: నర్సింగ్ విద్యార్థిని హత్య.. అమెరికాలో రాజకీయ దుమారం
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. మెక్సికోతో సరిహద్దు వివాదం అంతకంతకూ రాజుకుంటోంది. దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వ్యక్తి చేతిలో లేకెన్ రిలే(22) అనే నర్సింగ్ విద్యార్థిని ఇటీవల హత్యకు గురైంది. దీనిపై రిపబ్లికన్ పార్టీ అధ్యక్షఅభ్యర్థిత్వ రేసులో ముందున్న దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇటీవల టెక్సాస్‌లోని సరిహద్దుకు వెళ్లిన ఆయన అక్కడ చేసిన ప్రసంగంలో అధ్యక్షుడు బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. దేశంలోకి అక్రమ వలసదారుల ప్రవేశం ఎక్కువవడానికి బైడెన్ చేతగానితనమే కారణమని మండిపడ్డారు. రిలే తల్లిదండ్రులతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. రిలేను తాను ఎన్నటికి మరచిపోలేనని, ఆమె హత్య అంశాన్ని అధ్యక్షుడు బైడెన్ అసలే పట్టించుకోలేదన్నారు. ఇదే విషయమై రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి ఇప్పటికే తప్పుకున్న మరో నేత వివేక్‌రామస్వామి కూడా ఘాటుగా స్పందించారు. బైడెన్ జార్జ్ ఫ్లాయిడ్ పోలీసింగ్ యాక్ట్ బిల్లు పాస్ చేయడానికి బుదలు లేకెన్ రిలే సెక్యూర్ ద బోర్డర్ బిల్లు పాస్ చేయాల్సిందని, దీని ద్వారా అక్రమ వలసదారులను వెనక్కి పంపి పోలీసులకు భారాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. కాగా, లేకెన్ రిలే మార్నింగ్ వాక్కు వెళ్లినపుడు దుండగుడు ఆమెపై దాడి చేసి కిడ్నాప్ చేసి తీవ్రంగా గాయపరిచి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన అమెరికాలో ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా పార్టీల అధ్యక్షఅభ్యర్థులను నిర్ణయించే ప్రైమరీ ఎలక్షన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇదీ చదవండి.. మళ్లీ నాలుక మడతబెట్టిన బైడెన్ -
అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు వివేక్ రామస్వామి ప్రకటన
-
అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి
వాషింగ్టన్: భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయోవా రిపబ్లికన్ కాకస్ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించగా.. ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన కారణంగా బరి నుంచి తప్పుకోవాలని రామస్వామి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్‌కు వివేక్ మద్దతు ఇవ్వనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విజయాన్ని అందుకున్నారు. ప్రైమరీలో కీలకమైన అయోవా కాకసస్ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో ఇది మొదటిది. ఇందులో ట్రంప్ అత్యధిక మెజార్టీ సాధించారు. రెండో స్థానంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్, ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ మధ్య పోటీ నెలకొంది. ఇక, కేవలం 7.7 శాతం ఓటింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచిన వివేక్ రామస్వామి ప్రైమరీ తొలి పోరులో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. వివేక్ రామస్వామి ఒహాయోలో ఆగస్టు 9, 1985లో జన్మించారు. కేరళకు చెందిన ఆయన తల్లిదండ్రులు ఆమెరికా(America)కు వలస వచ్చారు. ఆయన సోషల్ మీడియాలో తనను తాను క్యాపిటలిస్ట్, సిటిజెన్‌గా అభివర్ణించుకుంటారు. హార్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించారు. లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం.. గత ఏడాది ఆయన స్ట్రైవ్ అసెట్ మేనేజ్మెంట్ను స్థాపించారు. దీనికి ముందు ఆయనకు ఔషధరంగంలో గొప్ప పేరు ఉంది. రొవాంట్ సైన్సెస్‌ను ఏర్పాటు చేశారు. 2016లో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ 600 మిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు. కిందటి ఏడాది ఫిబ్రవరిలో ఆయన పోటీ ప్రకటన తర్వాత వార్తల్లో నిలుస్తూ వచ్చారు. అమెరికా ఆదర్శాలను తిరిగి పునరుద్ధరించేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆ సమయంలో ప్రకటించారాయన. ఇది రాజకీయ ప్రచారం మాత్రమే కాదని.. తర్వాతి తరం అమెరికన్లకు కొత్త కలలను సృష్టించేందుకు చేస్తున్న సాంస్కృతిక ఉద్యమం అని చెప్పుకున్నారాయన. అమెరికాకు మొదటి స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ ట్రంప్ తరహాలో ప్రచారం చేస్తూ వచ్చారాయన. అలాగే.. చైనా నుంచి ఎదురవుతోన్న ముప్పును ఎదుర్కోవడంతో పాటు ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గిస్తాను అంటూ ప్రకటన చేశారాయన. ఆ తర్వాత ప్రచారంలో వైవిధ్యతను కనబరుస్తూ వచ్చినప్పటికీ.. ప్రచార చివరిరోజుల్లో ట్రంప్, రామస్వామిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చివరకు..అయోవా కాకసస్ ఎన్నికల్లో చేదు ఫలితం అందుకుని అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వివేక్ రామస్వామి తప్పుకున్నారు. ఇదీ చదవండి: అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్.. భారీ ఊరట -
USA presidential election 2024: రామస్వామిపై డొనాల్డ్ ట్రంప్ విసుర్లు
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకు పడ్డారు. ఆయన మోసపూరిత ప్రచార జిమ్మికులకు పాల్పడుతున్నారన్నారు. వివేక్ అనుచరులు ‘సేవ్ ట్రంప్, ఓట్ వివేక్’ అన్న షర్టులు ధరించడం, అవి వైరలవడం ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది. తనకు మద్దతిస్తున్నట్లు కనిపిస్తూనే మోసపూరిత ప్రచార ట్రిక్కులు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. వివేక్ మాయలో పడకుండా తనకే ఓటేయాలన్నారు. వివేక్‌పై ట్రంప్ నేరుగా విమర్శలు చేయడం ఇదే తొలిసారి. -
US Elections: గన్ కల్చర్‌కు మానసిక రుగ్మతలే కారణం: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: అమెరికాలో గన్ కంట్రోల్ పాలసీపై అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల ఘటనలు జరిగిన వెంటనే గన్ కంట్రోల్ పాలసీపై మాట్లాడటం సాధారణమైపోయిందని, అసలు ఈ సమస్యకు మాలకారణమైన మానసిక రుగ్మతలకు పరిష్కారం వెతకాలని వివేక్ రామస్వామి సూచించారు. అయోవాలో తాజాగా దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందడంతో అమెరికాలో రాజకీయ పార్టీలు గన్ కంట్రోల్ పాలసీపై చర్చ ప్రారంభించాయి. దీనిపై అయోవాలోనే ఓటర్లతో సమావేశమైన సందర్భంగా గురువారం వివేక్ రామస్వామి స్పందించారు. ‘సంఘటన జరిగిన వెంటనే ఆత్రుతతో చట్టం పాస్ చేస్తే సమస్య పరిష్కారం కాదు. గన్ కంట్రోల్ పాలసీ తీసుకురావడం ఒక స్టుపిడ్ చర్య. గన్ కల్చర్ అనేది అమెరికా సంస్కృతిలో భాగమైంది. మూలాల్లోకి వెళ్లకుండా సమస్యను పరిష్కరించడానికి మనమేం దేవుళ్లం కాదు’ అని వివేక్ అన్నారు. కాగా,కాల్పులు ఘటన కారణంగా అయోవాలో తన ప్రచారాన్ని వివేక్ రద్దు చేసుకున్నారు.కేవలం ప్రార్థనలతో సరిపెట్టారు. ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు తుది పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రైమరీ బ్యాలెట్లు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. ఇదీచదవండి.. కొరియా దేశాల మధ్య ఉద్రిక్తత -
US Elections: వివేక్ రామస్వామి కీలక నిర్ణయం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియ వచ్చే నెల ప్రారంభం కానుంది. జనవరిలో అయోవా (iowa) రాష్ట్రంలో తొలి బ్యాలెట్ జరగనుంది. అయితే అయోవా ఓటింగ్‌కు మరికొద్ది రోజులే మిగిలి ఉండగా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఎన్నికల ప్రచారంలో ఇక నుంచి టీవీ చానళ్లకు ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయించాం. అలాగని మొత్తం ప్రకటనల బడ్జెట్‌ను తగ్గించ లేదు. సంప్రదాయ టీవీ కాకుండా వేరే మార్గాల్లో ఓటర్లను రీచ్ అవుతాం. టీవీ ప్రకటనలపై ఖర్చు పెడితే పెద్దగా ఉపయోగం ఉండటం లేదు’ అని వివేక్ రామస్వామి క్యాంపెయిన్ మేనేజర్ ట్రిసియా మెక్ లాలిన్ తెలిపారు. అయితే తాను ఇప్పటికే క్యాంపెయినింగ్ కోసం 20 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు రామస్వామి స్వయంగా మీడియాకు తెలిపారు. ఇంత ఖర్చు చేసినప్పటికీ అయోవాలో రామస్వామివైపు రిపబ్లికన్లు పెద్దగా మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. అయోవాలో 10 శాతం రిపబ్లికన్ల ఓట్లు కూడా రామస్వామికి వచ్చే పరిస్థితులు లేవని సమాచారం. ఇక దేశవ్యాప్తంగా కూడా రామస్వామి గ్రాఫ్ రోజురోజుకు పడిపోతున్నట్లు తెలుస్తోంది. కాగా, రిపబ్లికన్ల తరపున ప్రధాని అభ్యర్థిత్వానికి పోటీలో ఉన్న వారిలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హాట్ ఫేవరెట్‌గా దూసుకెళుతుండడం విశేషం. ఇదీచదవండి..భారత్‌లో ఉన్న పౌరులకు ఇజ్రాయెల్ అడ్వైజరీ -
Vivek Ramaswamy: ‘నేను హిందువు.. నా గుర్తింపు తప్పుగా చెప్పను’
హిందూ మత విశ్వాసంపై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి అసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎన్ఎన్ టౌన్హాల్లో నిర్వమించిన ఓ కార్యక్రమంలో ఒక ఓటరు తన మతం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ‘మీరు మా అధ్యక్షుడు కాదు, ఎందుకంటే మీరు మా పూర్వికులకు సంబంధించిన మతానికి చెందినవారు కాదని అంటే?’ ఏం చెబుతారని ప్రశ్నించారు. దీనికి ఆయన.. ‘నేను హిందువును. నా గుర్తింపును తప్పుగా చెప్పుకోను. హిందూ మతం, క్రైస్తవం రెండూ కూడా ఒకే రకమైన విలువలను బోధిస్తాయి’ అని తెలిపారు. ‘హిందూ మతం నమ్మకాల ప్రకారం ఈ భూమ్మీదికి ప్రతి మనిషి ఓ కారణంతో వస్తారు. ఆ కారణాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనలోనే ఉంటాడు. మనతో ఆయన మంచి పనులు చేయిస్తారు. మనమంతా కూడా ఆయన దృష్టిలో సమానం’ అని వివేక్ రామస్వామి తెలిపారు. A voter tonight in Iowa asked about my Hindu faith. I answered honestly. pic.twitter.com/hkUrZkbhUx — Vivek Ramaswamy (@VivekGRamaswamy) December 14, 2023 దేశంలో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చెందించే అధ్యక్షుడను తాను కాదని, కానీ అమెరికా దేశానికి సంబంధించి విలువల కోసం ఎల్లప్పుడూ నిలబడతానని తెలిపారు. 38 ఏళ్ల వివేక్ రామస్వామి.. నైరుతి ఒహియోకు చెందినవారు. అతని తల్లి గెరియాట్రిక్ సైకియాట్రిస్ట్. తండ్రి జనరల్ ఎలక్ట్రిక్‌లో ఇంజనీరు. అయితే ఆయన తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వలస వచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5, 2024లో జరగనున్నాయి. చదవండి: అమెరికాలో ఘనంగా హాలిడే పార్టీ.. పాల్గొన్న400 మంది సీఈవోలు -
US Presidential Elections 2024: ఫాసిస్ట్, అవినీతి అనకొండ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడడానికి భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పారీ్టలో తన ప్రత్యర్థి అయిన భారతీయ–అమెరికన్ నిక్కీ హేలీపై పైచేయి సాధించాలని చూస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యరి్థత్వం కోసం వివేక్ రామస్వామి, నిక్కీ హేలీతోపాటు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటీస్, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ పోటీ పడుతున్నారు. నలుగురు ఆశావహుల మధ్య నాలుగో విడత చర్చా కార్యక్రమం యూనివర్సిటీ ఆఫ్ అలబామాలో హాట్‌హాట్‌గా జరిగింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కాలేదు. చర్చలో పాల్గొన్న నలుగురు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. వివేక్ రామస్వామి దాదాపు అరగంటపాటు మాట్లాడారు. ప్రధానంగా నిక్కీ హేలీపై విరుచుకుపడ్డారు. ఆమె ఫాస్టిప్, అవినీతి అనకొండ అని ధ్వజమెత్తారు. ఆరోపణలపై మీడియాకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. రీడ్ హాఫ్మాన్ అనే ధనవంతుడి నుంచి నిక్కీ, ఆమె కుటుంబ సభ్యులు 2.5 లక్షల డాలర్లు దండుకున్నారని ఆరోపించారు. అయితే, వివేక్ రామస్వామి చేసిన ఆరోపణలపై నిక్కీ హేలీ పెద్దగా స్పందించలేదు. చర్చా కార్యక్రమంలో మౌనంగా ఉండిపోయారు. ఆమెకు క్రిస్ క్రిస్టీ మద్దతుగా నిలిచారు. వివేక్ రామస్వామి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై ఎవరు పోటీకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. -
మాజీ ఎంపీ వివేక్ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు
-
మంచిర్యాలలోని వివేక్ ఇంటి దగ్గర కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
-
లవ్ స్టోరీ చెప్పిన భార్య: తొలి బిడ్డను కోల్పోయాం.. వివేక్‌రామస్వామి భావోద్వేగం
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన, పారిశ్రామికవేత్త,భారతీయ సంతతికి చెందిన వివేక్ గణపతి రామస్వామి తనదైన శైలిలో దూసుకు పోతున్నారు. ఈక్రమంలో అయోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో భార్య అపూర్వ, కుమారుడితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తి త జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలను వివేక్‌ను ట్విటర్లో షేర్ చేశారు. తన భార్యకు గర్భం దాల్చి మూడున్నర నెలలకే గర్భస్రావం జరిగిందని ఇది తమకు చాలా బాధకరమైన క్షణమని పేర్కొన్నారు. ముఖ్యంగా తొలి బిడ్డను కోల్పోవడతో రెండోసారి కూడా ఆ భయం వెంటాడిందన్నారు. కానీ ఆ భగవంతుడిమీద విశ్వాసంతోనే ధైర్యాన్ని తెచ్చు కున్నామని, అలా కార్తీక్ , అర్జున్ వచ్చారని తమ జీవితాల్లోరావడంతో సంతోషం నిండిందంటూ అయోవాలోని ఫ్యామిలీ లీడర్ థాంక్స్ గివింగ్ ఫ్యామిలీ ఫోరమ్‌లో రామస్వామి తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. I haven’t spoken publicly about the loss of Apoorva and my first child—it’s difficult for us to talk about it. Apoorva and I draw strength from our faith in God and are so blessed to be the parents to our two sons Karthik and Arjun. pic.twitter.com/x2qzWqrxS5 — Vivek Ramaswamy (@VivekGRamaswamy) November 17, 2023 తన విశ్వాసమే తన స్వేచ్ఛ ను ఇచ్చిందనీ అదే ఈ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి నడిపించిందని చెప్పుకొచ్చాడు. దేవుడు ఒక్కడే అని తాను విశ్వసిస్తానన్నారు. అలాగే తల్లితండ్రుల పెంపకం, వారి పట్ల గౌరవం వివాహం, ఇతర సాంప్రదాయ విలువల్ని వారి నుంచి నేర్చుకున్నానన్నారు. హిందూ విశ్వాసం, సిద్ధాంతాలు, క్రైస్తవ ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు నేర్చుకున్న క్రైస్తవ విలువల మధ్య సారూప్యాన్ని ప్రస్తావించారు. ఇవి మతపరమైన సరిహద్దులను అధిగమించి ఉన్నతమైన దైవిక శక్తికి చెందినవని పేర్కొన్నారు. అటు రామస్వామి భార్య అపూర్వ కూడా తమ ప్రేమ ఎలా మొదలైందీ పంచుకున్నారు. తొలుత ఒక కాలేజీ పార్టీలో కలుసుకున్నామని తెలిపారు. మెడ్ స్కూల్లో ఉండగా, వివేక్ అక్కడ న్యాయ విద్యార్థిగా ఉన్నారు. అక్కడ వివేక్‌ను చూశాను...చాలా ఆసక్తికరమైన వ్యక్తిగా అనిపించాడు. వెంటనే వెళ్లి వివేక్‌ను పరిచయం చేసుకున్నానని కానీ అపుడు వివేక్ పెద్ద ఆసక్తి చూపించలేదన్నారు. కానీ అప్పటినుంచి తరచు కలుసుకుంటూ, తాము పరస్పరం ఎంత దగ్గరి వారిమో గుర్తించాం. అప్పటినుంచీ కలిసే ఉన్నామని తెలిపారు. కాగా వివేక్ రామస్వామి తండ్రి వీజీ రామస్వామి జనరల్ ఎలక్ట్రిక్‌లో ఇంజినీర్‌గా పనిచేశారు. తల్లి గీతా రామస్వామి వృద్ధులకు సంబంధించిన జీరియాట్రిక్ సైకియాట్రిస్టు. భార్య అపూర్వ సర్జన్. యేల్ విశ్వవిద్యాలయంలో పరిచయం వీరి పెళ్లికి దారితీసింది. 2015లో అపూర్వ తివారీని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు అబ్బాయిలు. 2023 ఆగస్టు నాటి ఫోర్బ్స్ నివేదిక ప్రకారం వివేక్ రామస్వామి సంపద విలువ 95 కోట్ల అమెరికన్ డాలర్లకు పైమాటే. అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5, 2024 మంగళవారం జరగనున్నాయి. Voters in Iowa want to know the story how Apoorva and I met. Here’s how. 😉 📍 Osceola, IA pic.twitter.com/N7duPToNlO — Vivek Ramaswamy (@VivekGRamaswamy) November 19, 2023 -
హిందూ మత విశ్వాసమే స్ఫూర్తి: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: హిందూ మత విశ్వాసం తనకు అన్ని విషయాల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచి్చందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి చెప్పారు. అధ్యక్ష రేసులో నిలిచేందుకు కూడా ఆ విశ్వాసమే తనకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడన్నది హిందూ మత మౌలిక విశ్వాసమని 38 ఏళ్ల వివేక్ చెప్పారు. -
వివేక్ రామస్వామి సర్ఫింగ్ వీడియో వైరల్: నీళ్లలోకి తోసేసి మరీ..!
అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. 3వ రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి సర్ఫ్ చేయడం నేర్చుకుంటున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. డిబేట్ తర్వాత మియామీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాజ్ సాయర్ రామస్వామి సర్ఫింగ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. "కాబోయే ప్రెసిడెంట్‌కి సర్ఫ్ చేయడంఎలాగో నేర్పిస్తున్నా’’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. మాట్లాడుతూనే ఉన్నట్టుండి వివేక్‌ను నీళ్లలోకి తోసివేయడం, అలాగే గతంలో ఎప్పుడు సర్ఫింగ్ చేయని రామస్వామి, బోర్డు మీద బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించి రెండుసార్లు నీటిలో పడిపోవండి లాంటి దృశ్యాలను ఈ వీడియోలో చూడొచ్చు. మొత్తానికి నేర్పుగా నేర్చుకుని నీటి అలల్ని ఎదుర్కొని ఈజీగా సర్ఫింగ్ చేశారు. అంతేకాదు నాట్నుంచి పక్కకు తప్పుకొని మరీ సూట్‌తోనే సర్ఫింగ్ చేయాలన్న సాయల్ సవాల్‌ను కూడా స్వీకరించిన రామస్వామి అలవోకగా వేక్ సర్ఫింగ్‌లో విజయం సాధించడం విశేషం. ఇప్పటికే 7 లక్షల 50 వేల మందికిపైగా వీక్షించారు.దీంతో నెక్ట్స్ ప్రెసిడెంట్ అని కొందరు, మేన్ ఆఫ్ యంగ్ పీపుల్ మరికొందరు కమెంట్ చేయగా, ఇంకొందరు నెగిటివ్ కమెంట్స్ కూడా చేశారు. కాగా రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీపై వివేక్ రామస్వామి వ్యక్తిగత దూషణకు దిగారు. విదేశాంగ విధానంపై చర్చలో భాగంగా వేదికపై ఉన్న ఏకైక మహిళా అభ్యర్థి నిక్కీపై విరుచుకుపడ్డారు వివేక్. ఇద్దరు భారతీయ సంతతి లీడర్ల మధ్య వైరం చర్చకు దారి తీసింది. 2024 నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి View this post on Instagram A post shared by Kaz (@kazsawyer) -
బిలియనీర్ వివేక్ రామస్వామి ఇంట్లో ‘నానీ’ జాబ్: జీతం తెలిస్తే షాకవుతారు
Vivek Ramaswamy wants to hire nanny అమెరికా అధ్యక్ష పదవి రేసులో దూసుకుపోతున్న భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త, బిలియనీర్ వివేక్ రామస్వామి తన పిల్లలను చూసుకునేందుకు నానీ కోసం వెతుకు తున్నట్లు సమాచారం. ఇందుకోసం భారీగా జీతాన్ని ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రిక్రూట్మెంట్ స్టాఫింగ్ వెబ్‌సైట్‌లోని జాబ్ లిస్టింగ్ ప్రకారం రామస్వామి తన పిల్లల్ని చూసుకునే నానీ (ఆయా)కోసం లక్ష డాలర్లు (రూ.80 లక్షల కంటే ఎక్కువ) లేదా అంతకంటే ఎక్కువ జీతాన్ని ఆందించనున్నారు. వివేక్ రామస్వామి అపూర్వ తివారీకి దంపతులకు కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు మగ పిల్లలున్నారు. వృత్తిరీత్యా అపూర్వ స్వరపేటిక నిపుణురాలు. (మరో వివాదంలో బిగ్ బీ అమితాబ్: ఇంత దారుణమా అంటూ తీవ్ర ఆగ్రహం) EstateJobs డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉద్యోగ ప్రకటన ప్రకారం ఇది ఒక హై ప్రొఫైల్ ఫ్యామిలీలో చేరడానికి ఒక అసాధారణమైన అవకాశం, ప్రత్యేకమైన కుటుంబ సాహసాలలో పాల్గొంటూ వారి పిల్లల పెరుగుదల, అభివృద్ధికి దోహదపడాలి అని ఎస్టేట్ జాబ్స్ ఉద్యోగ ప్రకటన పేర్కొంది. ఈ యాడ్‌లో క్లయింట్ పేరు ప్రస్తావించక పోయినప్పటికీ, ఇది రామస్వామి కుటుంబానికి సంబంధించిందనే అంచనాలు భారీగా ఉన్నాయి. (2023 ఐసీసీ వరల్డ్ కప్: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?) ఈ ఉద్యోగానికి వారానికి 84 నుండి 96 గంటల పని అవసరం, ఆ తర్వాత వారం మొత్తం సెలవు ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన నానీ ఇతర చెఫ్, నానీలు, హౌస్ కీపర్, ప్రైవేట్ సెక్యూరిటీతో సహా ఇతర కీలకమైన టీంతో కలిసి పనిచేయాలి. అలాగే అబ్బాయిల ఆటలు, బొమ్మలు, దుస్తులను ఒక క్రమ పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. (ఐటీ దిగ్గజాల కీలక నిర్ణయం: ఆందోళనలో టెకీలు) కాగా 2024 ఎన్నికల్లో జో బిడెన్‌తో తలపడేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ అభ్యర్థి రామస్వామి ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే. (హ్యుందాయ్ కీలక నిర్ణయం: తొలి బ్రాండ్‌గా రికార్డ్) -
ట్రంప్‌కి సైతం వణుకుపుట్టించే స్థాయికి వివేక్ రామస్వామి
భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో దూసుకెళ్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున రేసులో ఉన్న ఆయన... ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నారు. బయోటిక్ రంగంలో అమెరికాలో సంచలనం సృష్టించిన రామస్వామి... మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా వణుకుపుట్టించే స్థాయికి ఎలా ఎదిగారు? రిపబ్లిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో భారత సంతకి అభ్యర్థి వివేక్ రామస్వామి దూసుకెళ్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తర్వాతి స్థానంలోకి చేరుకొన్నారు ఆయన. ఈమధ్యనే జరిగిన జీవోపీ పోల్స్‌లో ఇది వెల్లడైంది. ఇంతకుముందు మూడో ప్లేస్‌లో ఉన్న భారత సంతతికి చెందిన రామస్వామి తాజాగా రెండో స్థానానికి చేరుకున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. మరోవైపు... అధ్యక్ష రేసు కోసం జరుగుతున్న ప్రైమరీ పోల్స్‌లో 39 శాతం మంది డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇస్తున్నారు. రామస్వామికి 13 శాతం మంది సపోర్ట్ చేస్తున్నారు. దీన్నిబట్టి ట్రంప్‌కు రామస్వామే ముఖ్య పోటీదారుగా నిలిచే అవకాశం ఉందంటున్నారు. భారత సంతతికి చెందిన మరో అభ్యర్థి నిక్కీహెలీ 12 శాతం ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ట్రంప్‌కు ప్రధాన పోటీదారుగా ఉన్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్ రెండు స్థానాలు తగ్గి అనూహ్యంగా ఐదో స్థానానికి పడిపోయారు. న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ 11 శాతం మద్దతుతో నాలుగో స్థానంలో ఉన్నారు. మరోవైపు...వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న 75 శాతం మందిని తొలగిస్తానని అనూహ్య ప్రకటన చేశారు రామస్వామి. అంతేకాదు FBI లాంటి అనేక సంస్థలను మూసేస్తాని కూడా స్పష్టంచేశారు. వచ్చే నాలుగేళ్లలో ఉద్యోగుల్ని తగ్గించడమే తన లక్ష్యమని కూడా చెప్పారు రామస్వామి.అంతేకాదు.. హెచ్-1 వీసా విధానంలో సంస్కరణలు తీసుకొస్తానని కూడా ఆయన పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ విభాగంలో సుమారు 22 లక్షల 50 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 75 శాతం మంది తొలగించడమంటే 16 లక్షల మందికి ఉద్వాసన పలనకడమేనన్నమాట. అంత ఎక్కువ సంఖ్యలో ఉద్యోగుల్ని తీసేస్తే బడ్జెట్లో వేల కోట్ల డాలర్లు ఆదా అవుతాయి. కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన కార్యకలాపాలు మూతపడే అవకాశముందని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు... ఈమధ్య జరిగిన ప్రైమరీ పోటీల్లో పలు కీలక ప్రతిపాదనలు చేసిన వివేక్ రామస్వామి చాలా మంది మద్దతు సంపాదించారు. తర్వాత నిర్వహించిన పోల్‌లో 504 మంది స్పందన తెలియజేస్తే... అందులో 28 శాతం మంది రామస్వామిని ఉత్తమంగా పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల విషయానికి వస్తే ...రష్యా విషయంలో విభిన్న వైఖరిని ప్రకటించారు రామస్వామి. అమెరికాకు ప్రధాన అడ్డంకిగా మారిన చైనా ను ఎదుర్కొనే సమయంలో రష్యా చాలా కీలకమైందని ఆయన అభిప్రాయపడ్డారు. మాస్కోను ఎట్టి పరిస్థితుల్లో బీజింగ్ పక్షాన చేరనీయకూడదన్నారు. తాను ఎన్నికల్లో గెలిచి శ్వేత సౌధంలో అడుగుపెడితే ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రష్యాకు మంచి డీల్‌ను ఆఫర్ చేస్తానని కూడా ప్రకటించారు రామస్వామి. మాస్కోతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరిస్తానన్నారు. అప్పుడు చైనాతో అవసరం మాస్కోకు తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు రామస్వామి. మరోవైపు.. రిపబ్లిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ ముందంజలోనే ఉన్నారు. కానీ ఆయనకు భారత సంతతికి చెందిన అభ్యర్థుల నుంచి చివరిదాకా గట్టిపోటీ తప్పేలాలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధ్యక్ష ఎన్నికల నాటికి పరిస్థితులు మారే అవకాశముందని కూడా అంచనావేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చే ఏడాది నవంబరులో జరగుతాయి. గత అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయారు. ఆసమయంలోనే తాను 2024 నాటి అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున మళ్లీ పోటీచేస్తానని ప్రకటించారు ట్రంప్. ఇక.. రామస్వామి పూర్వీకులు భారత్‌కు చెందిన వారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లా నుంచి అమెరికా వలసవెళ్లిన గణపతి రామస్వామి, గీతా రామస్వామికి 1985 ఆగస్టు 9న జన్మించారు వివేక్ రామస్వామి. హార్వర్డ్ నుంచి జీవశాస్త్రంలో డిగ్రీ తీసుకున్న వివేక్.. 2014లో రోవెంట్ సైన్సెస్ అనే సంస్థను స్థాపించారు. 2015లో అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ ఐపీఓకు వెళ్లారు. క్యాన్సర్, అల్జీమర్స్ లాంటి వ్యాధులకు విజయవంతంగా మందులు తయారుచేసి బయోటెక్ రంగంలో అమెరికాలో అతిపెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగారు. అమెరికాలోని టాప్ యువ బిలియనీర్లలో రామస్వామి ఒకరు. రిపబ్లికన్ పార్టీలో ఇప్పుడు ఆయన కీలక వ్యక్తిగా మారారు.