
వాషింగ్టన్:భారత సంతతికి చెందిన బయోటెక్ బిలియనీర్ వివేక్‌రామస్వామిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆయనను ఒహియో గవర్నర్ అభ్యర్థిగా బలపరుస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్రంప్ తన ఎక్స్ ఖాతాలో వివేక్‌ను కొనియాడుతూ పోస్టు చేశారు.
‘గొప్ప రాష్ట్రమైన ఒహియో గవర్నర్ పదవికి వివేక్ రామస్వామి పోటీలో ఉన్నారు. నాకు వివేక్ బాగా తెలుసు. అతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అధ్యక్ష అభ్యర్థిగా నాతో పోటీ పడ్డాడు. అమెరికాను ప్రేమించే వ్యక్తి వివేక్. అతడు ఒహియోకు గొప్ప గవర్నర్ అవుతాడు. వివేక్‌కు నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా’అని ట్రంప్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
VIVEK RAMASWAMY is running for Governor of the Great State of Ohio. I know him well, competed against him, and he is something SPECIAL. He’s Young, Strong, and Smart! Vivek is also a very good person, who truly loves our Country. He will be a GREAT Governor of Ohio, will never…
— Donald J. Trump Posts From His Truth Social (@TrumpDailyPosts) February 25, 2025
వచ్చే ఏడాది జరగనున్న ఒహియో గవర్నర్ ఎన్నికల కోసం వివేక్ రామస్వామి సోమవారం సిన్సినాటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిలియనీర్ ఇలాన్ మస్క్ కూడా వివేక్‌కు మద్దతు ప్రకటించి గుడ్‌లక్ చెప్పడం విశేషం. అయితే వివేక్ ఒహియో గవర్నర్‌గా రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయాలంటే ముందు పార్టీ ప్రైమీరీల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ప్రైమరీల్లో వివేక్‌తో ఇద్దరు రిపబ్లికన్ నేతలు పోటీ పడుతున్నారు.
Thank you Elon. Let’s roll! https://t.co/2QDheoUSVj
— Vivek Ramaswamy (@VivekGRamaswamy) February 25, 2025
Comments
Please login to add a commentAdd a comment