endorsement
-
ఫుట్‌బాల్ ఆటగాడి మెడకు బిగుస్తున్న ఉచ్చు..
మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఫుట్‌బాలర్ మాసన్ గ్రీన్వుడ్ మెడకు ఉచ్చు మరింత బిగుస్తుంది.సెక్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాసన్ గ్రీన్‌వుడ్‌ను గత ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌పై బలవంతగా లైంగిక వేధింపులకు దిగినట్లు వచ్చిన వార్తలు నిజమా కాదా అనేది నిర్థారించాల్సి ఉంది. అయితే మాంచెస్టర్ యునైటెడ్ మొదట మాసన్ గ్రీన్వుడ్ విషయంలో ఎలాంటి చర్య తీసుకోలేదు. చదవండి: ఫుట్‌బాల్ ఆటగాడిపై ఆరోపణలు.. సంచలనం రేపుతున్న ఆడియో క్లిప్ తాజాగా అతనిపై వచ్చిన సెక్స్ ఆరోపణలు నిజమేనని తెలియడంతో ఫుట్‌బాల్ క్లబ్ కూడా గ్రీన్‌వుడ్‌పై కఠిన చర్యలు తీసుకుంది. తక్షణమే గ్రీన్‌వుడ్‌ను క్లబ్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. తన తప్పు లేదని నిరూపించుకునేవరకు గ్రీన్వుడ్ ఏ క్లబ్ తరపున ఫుట్‌బాల్ ఆడకుండా ఫుట్‌బాల్ సమాఖ్యకు సిఫార్సు చేసినట్లు పేర్కొంది. దీనికి తోడూ అన్ని ఎండార్స్మెంట్ల నుంచి గ్రీన్‌వుడ్‌ను తొలగిస్తున్నామంటూ తమ అధికారిక వెబ్సైట్లో అతని పేరు తొలగించిన పేజ్‌ను విడుదల చేసింది. ఇక గ్రీన్‌వుడ్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న నైక్ కంపెనీ తమ స్పాన్సర్సిప్ను రద్దు చేసుకుంటున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. ''మాసన్ గ్రీన్‌వుడ్‌పై వస్తున్న ఆరోపణలు మమ్మల్ని ఆలోచనలో పడేశాయి. అందుకే తాత్కాలింకగా అతనితో స్పాన్సర్‌షిప్‌ను రద్దు చేసుకుంటున్నాం. పరిస్థితిని గమనిస్తున్నాం.'' అంటూ తెలిపింది. ఇక హారిట్ రాబ్సన్ అనే యువతి మాసన్ గ్రీన్‌వుడ్‌కు మాజీ గర్ల్‌ఫ్రెండ్ అంటూ చెప్పుకుంటూ గత ఆదివారం కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. తనతో శృంగారంలో పాల్గొనాలని చెప్పాడని.. మాట విననందుకు తన శరీర భాగాలపై దాడి చేశాడంటూ.. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఆ తర్వాత హారిట్- గ్రీన్‌వుడ్‌కు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో టేపును కూడా రిలీజ్ చేయడం సంచలనం రేపింది. -
అయ్యో భగవంతుడా.. నీకెవరు దిక్కు
వికారాబాద్: జిల్లాలోని అనంతపద్మనాభ స్వామి, దొంగఎన్కెపల్లి సంజీవస్వామి, పరిగి మండలంలోని వేణుగోపాల స్వామి, బషీరాబాద్ మండల పరిధిలోని మల్కన్‌గిరి ఆంజనేయ స్వామి తదితర ఆలయాలకు సంబంధించి మొత్తం 2,000 ఎకరాల భూములు (ఎండోమెంట్)ఉన్నాయి. ఇవి కేవలం రికార్డుల్లో మాత్రమే ఉన్నాయి. భూముల నమోదుకు సంబంధించి ఎండోమెంట్ అధికారులు వినియోగించే ఫామ్ వన్ రిజిస్టర్‌తో పాటు పర్మినెంట్ రిజిస్టర్లలోనూ పొంతనలేని విధంగా భూముల సమాచారం నమోదై ఉందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఆక్రమణల్లో వందల ఎకరాలు రెండేళ్ల క్రితం తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో ఎండోమెంట్‌కు సంబంధించి ఇప్పటి వరకు 700 ఎకరాలు మాత్రమే నమోదయ్యాయి. వందల ఎకరాల్లో దేవాదాయ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. తమ కళ్ల ముందే అన్యాక్రాంతమవుతున్నా ఎండోమెంట్ అధికారులు చేష్టలుడిగి వ్యవహరిస్తున్నారు. భూముల పరాధీనంపై స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు దేవాదాయశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు. మొత్తం 2,000 ఎకరాల గాను సుమారు 800 ఎకరాలకు పైగా పరాధీనంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పరిగి మండల పరిధిలోని కిష్టమ్మగుడి తండాలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయానికి పూడూరు మండలంలో 14 ఎకరాల భూమి ఉంది. సదరు పొలాన్ని కొందరు తమ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇటీల స్థానిక నేతలు ఉద్యమించటంతో ఎండోమెంట్ అధికారులు రిజిస్ట్రేషన్ రద్దు చేయించి తిరిగి ఆ భూములను ఆలయం పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు, సహకరించిన అధికారులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషనర్ ఆదేశించినా.. 15 రోజుల క్రితం ఎండోమెంట్ కమిషనర్ అనిల్‌కుమార్ వికారాబాద్‌కు వచ్చి రెవెన్యూ, ఎండోమెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేవాదాయ భూములు, ఇతర ఆస్తుల పరిరక్షణపై ఆయన చర్చించారు. రెవెన్యూ, ఎండోమెంట్ అధికారులు సమన్వయంతో పని చేసి మొత్తం భూములు ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. 15 రోజుల పాటు ఈ విషయమై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పని పూర్తి చేయాలని ఆదేశించారు. గడువు దాటినా సంబంధిత ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. పూర్తి వివరాలతో తమ వద్దకు వస్తే ధరణిలో నమోదుకు తాము సిద్ధంగా ఉన్నా మ ని రెవెన్యూ అధికారులు చెబుతుండగా ఎండోమెంట్ అధికారుల్లో ఎలాంటి చలనం కనిపించటం లేదు. చదవండి: అన్నకు ఆనందంగా రాఖీకట్టిన చెల్లెలు.. అంతలోనే.. -
రూ.10 కోట్ల ఆఫర్‌ని తిరస్కరించిన నటి
ఒక్కసారి పాపులారిటీ వచ్చాక తారలు ఇక యాడ్స్ మీద దృష్టి పెడతారు. సెకన్ల వ్యవధి మాత్రమే ఉండే యాడ్స్‌కి కోట్లలో పారితోషికం లభిస్తుండటంతో స్టార్ హీరోలు సైతం వీటిలో నటించేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్ సాయి పల్లవి ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్ ఆఫర్‌ను తిరస్కరించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 2 కోట్లు ఇస్తామన్నా సరే ఆ యాడ్ చేయడానికి సాయి పల్లవి అంగీకరించలేదు. తాను ఇలాంటి ఉత్పత్తులను వాడనని.. అలాంటిది సదరు ఉత్పత్తులు వాడమని జనాలకు ఎలా చెప్తానని సాయి పల్లవి ప్రశ్నించారు. తాజాగా ఈ జాబితాలో హీరోయిన్ శిల్పాశెట్టి కూడా చేరారు. ఈ నటి ఏకంగా రూ. పది కోట్ల ఆఫర్‌ను వదులుకున్నట్లు సమాచారం. వివరాలు.. ఓ స్లిమ్మింగ్ పిల్స్ కంపెనీ వారు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం శిల్పను సంప్రదించారట. అంతేకాక ఈ యాడ్‌లో నటించేందుకు గాను రూ.10 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారట. కానీ శిల్ప దీనికి అంగీకరించలేదని సమాచారం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి శిల్ప మాట్లాడుతూ.. ‘టాబ్లెట్లు, పౌడర్లు వాడటం, కడుపు కట్టుకోవడం వల్ల బరువు తగ్గుతారనే మాటలను నేను నమ్మను. పాటించను. అలాంటప్పుడు ఇలాంటి ఉత్పత్తులకు నేను ప్రచారకర్తగా ఎలా వ్యవహరిస్తాను. ఆహారంలో కొద్ది పాటి మార్పులు, క్రమం తప్పక వ్యాయామం చేస్తూంటే ఆలస్యమైనా సరే తప్పక బరువు తగ్గుతాం. ఇందుకు నేనే ఉదాహరణ. అంతే తప్ప ఇలాంటి ఉత్పత్తులను అంగీకరించను, ప్రోత్సాహించను’ అన్నారు. శిల్ప ఫిట్నెస్ ఫ్రీక్ అనే విషయం అందరికి తెలిసిందే. ఫిట్నెస్, ఆరోగ్య కరమైన ఆహార పదార్థాలకు సంబంధించి శిల్ప ఒక యాప్‌ను కూడా తీసుకొచ్చారు. ఆహార నియమాలు, ఫిట్నెస్ సలహాలను ఈ యాప్ ద్వారా అడిగి తెలుసుకోవచ్చు. ఇక వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాతో వివాహం అయ్యాక సినిమాలకు దూరమైన శిల్పాశెట్టి.. దశాబ్దకాలం తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయబోతున్నారు. షబ్బీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న ‘నికమ్మ’తో శిల్ప బాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిచనున్నారు. -
దేవదాయ శాఖకు అవినీతి మకిలి!
కర్నూలు(న్యూసిటీ) : దేవదాయ, ధర్మాదాయ శాఖకు అవినీతి మకిలి పట్టింది. ఇతర ప్రభుత్వ శాఖల మాదిరిగానే ఈ శాఖ అధికారులు కూడా అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు సర్వత్రా ఆరోపణలున్నాయి. వీటిని నిజం చేస్తూ కొంతమంది అధికారులు ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. మూడేళ్లలో నలుగురు అధికారులపై ఏసీబీ దాడులు నిర్వహించారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దాడుల్లో భారీగా ఆస్తులు బయటపడడం ఆ శాఖ అవినీతిని తేటతెల్లం చేస్తోంది. జిల్లావ్యాప్తంగా దేవదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో 3888 ఆలయాలున్నాయి. ఇందులో 6ఏ గ్రూపు దేవాలయాలు 10, 6బీ ఆలయాలు 88, 6సి ఆలయాలు 3780 ఉన్నాయి. 6ఎ గ్రూపు ఆలయాల్లో ఒక్కో ఆలయ ఆదాయం ఏడాదికి రూ.25 లక్షల నుంచి రూ.కోటికిపైగా ఉంటుంది. పరువుతీసిన అధికారులు శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా ఉన్న జీవీ సాగర్‌బాబు 2016 సెప్టెంబర్‌లో ఏసీబీకి చిక్కారు. ఈయన దేవస్థానం అభివృద్ధి పనులు, ఉద్యోగుల బదిలీల విషయంలో చేతివాటం ప్రదర్శించి రూ.3 కోట్ల ఆస్తులను అక్రమంగా కూడగట్టారని ఏసీబీ అధికారులు తేల్చడం అప్పట్లో సంచలనం సృష్టించింది. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో మల్లికార్జునుడు, భ్రమరాంబదేవీల పూజలో పాల్గొంటుండగా ఆలయ ఈఓగా ఉన్న వ్యక్తి అవినీతికి పాల్పడి శ్రీశైల ఆలయ పరువు తీశారు.గతేడాది ఫిబ్రవరి నెలలో పత్తికొండలోని ఆంజనేయస్వామి ఆలయంలో పనిచేస్తున్న పురోహితుడు తండ్రి మరణిస్తే కుమారుడు ఎక్స్‌గ్రేషియా కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయి చివరకు ఏíసీబీ అధికారులను ఆశ్రయించారు. సహాయ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ బిందుబాయికి రూ.5 వేలు, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లుకు రూ. 2 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొరవడిన పర్యవేక్షణ.. జిల్లాలోని పలు ఆలయాలకు రూ.లక్షల్లో ఆదా యం సమకూరుతోంది. ఆలయాలకు సంబం« ధించిన వ్యవహారాలన్నీ ఈఓ చేతుల మీదుగా జరుగుతాయి. ఈక్రమంలో కొందరు ఈఓలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఈఓలు, దేవదాయ శాఖ సిబ్బంది అక్రమాల్లో మునిగి తేలుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల వీరయ్య.. ఇటీవల ఓంకారేశ్వరస్వామితో పలు గ్రూపు ఆలయాల ఈఓగా ఉన్న వీరయ్య ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. దాడుల్లో ఏకంగా రూ.10 కోట్ల విలువైన ఆస్తులు దొరికినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. వీరయ్య వ్యవహారం ఆది నుంచి వివాదాస్పదంగా ఉంది. దేవదాయశాఖలో క్లర్కుగా చేరిన ఈయన పదోన్నతిపై కార్యనిర్వహణా««ధికారిగా పదోన్నతి పొందారు. ఆతర్వాత 2000లో సహాయ కమిషనర్ కార్యాలయంలో పర్యవేక్షకుడుగా పనిచేశారు. 2002లో గూడూరు మండలం నాగలాపురంలో ఉన్న సుంకులాపరమేశ్వరి ఆలయ ఈఓగా పనిచేశారు. 2009 నుంచి ఓంకారేశ్వరస్వామితోపాటు పలు గ్రూపు ఆలయాలకు ఈఓగా వ్యవహరిస్తున్నారు. అయితే విధి నిర్వహణలో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈక్రమంలోనే ఏసీబీ అధికారులు ఈనెల 10న దాడులు నిర్వహించారు. -
అందుకు నో అంటున్న విరాట్ కోహ్లి
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ను నీరవ్ మోదీ నిండాముంచిన వ్యవహారంతో బ్యాంక్ ప్రతిష్ట దారుణంగా దెబ్బతింది. నీరవ్ స్కాం నేపథ్యంలో పీఎన్బీతో తన ఎండార్స్మెంట్ కాంట్రాక్టు రెన్యువల్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విముఖత చూపుతున్నట్టు సమాచారం. అయితే ఈ ఏడాది చివరి వరకూ కాంట్రాక్టు టర్మ్ ముగియనున్నందున అప్పటివరకూ ఎండార్స్‌మెంట్‌ను తొలగించబోమని కోహ్లీ బ్రాండ్ వ్యవహారాలను చక్కదిద్దే ఏజెన్సీ కార్నర్‌స్టోన్ స్పోర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ స్పష్టం చేసింది. కాంట్రాక్టును పొడిగించడంపై ఇప్పటివరకూ పీఎన్బీతో ఎలాంటి చర్చలూ జరపలేదని సంస్థ సీఈఓ బంటీ సజ్దే చెప్పారు. అయితే నీరవ్ మోదీ స్కాంలో పీఎన్బీని నిందించేందుకు సరైన కారణం లేదని బంటీ పేర్కొనడం గమనార్హం. పీఎన్బీ కుంభకోణం నేపథ్యంలో విరాట్ కోహ్లీ మాత్రం కాంట్రాక్టు పొడిగింపునకు సుముఖత వ్యక్తం చేయరని సమాచారం. -
బిగ్ బ్రాండ్స్ కు నో చెబుతున్న బాహుబలి
-
బిగ్ బ్రాండ్స్ కు నో చెబుతున్న బాహుబలి
భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించిన బాహుబలి-2తో ప్రభాస్ కు వచ్చిన కీర్తి అంతా ఇంతా కాదు. బాలీవుడ్ నుంచి హాలివుడ్ దాకా ప్రభాస్ పేరు మారుమ్రోగుతోంది. ప్రభాస్ పేరు ఇంతలా మారుమోగుతుంటే, బిగ్ బ్రాండ్స్ చడీచప్పుడు కాకుండా ఎలా కూర్చుంటాయి..! వెనువెంటనే తమ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా బాహుబలిని నియమించుకోవాలని శతవిధాలా ప్రయత్నాలు ప్రారంభించాయి. పెద్ద పెద్ద మొత్తంలో నగదును ఆఫర్ చేస్తూ తమ ప్రొడక్ట్ లకు ఎండోర్స్ చేసుకోవాలని కోరుతున్నాయి. అయితే ప్రభాస్ మాత్రం వాటి ఆఫర్లను సుతిమెత్తంగా తిరస్కరిస్తున్నట్టు తెలిసింది. 18 కోట్ల విలువైన అతిపెద్ద బ్రాండు ఎండోర్స్ మెంట్ ను ప్రభాస్ అంగీకరించలేదని ఆయన అధికార ప్రతినిధి చెప్పారు. ఇప్పటికే ప్రభాస్ దగ్గరికి చాలా బ్రాండ్స్ వచ్చాయని, కానీ ఆయన వేటికీ అంగీకారం తెలుపలేదని పేర్కొన్నారు. బాహుబలి-2 షూటింగ్ సమయంలోనూ ప్రభాస్ ముందుకు 10 కోట్ల ఎండోర్స్ మెంట్ వచ్చిందని, అయితే సినిమాపైనే దృష్టిసారించిన ప్రభాస్ దాన్ని తిరస్కరించినట్టు రాజమౌళి కూడా తాజాగా రివీల్ చేశారు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఎఫెక్ట్ తో ప్రభాస్ కీర్తి కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, భారీ అవకాశాలు ఆయన ముంగిట్లో వాలుతున్నాయి. అయితే తన సొంత కమిట్ మెంట్స్ కే ప్రభాస్ తొలి ప్రాధాన్యమిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మూడు భాషల్లో తెరకెక్కుతున్న సాహోపైనే ప్రభాస్ దృష్టిసారించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.. జూలైలో దీని షూటింగ్ ప్రారంభం కానుంది. కొంతమంది టాప్ బాలీవుడ్ డైరెక్టర్లు, ప్రొడక్షన్ హౌజ్ లు ప్రభాస్ ముందుకు కొత్త స్క్రిప్టులతో వస్తున్నారట. -
కరువు సీమకు నీరివ్వండి..
► నీటిపై ట్రిబ్యునల్‌కు కేంద్రం ఎండార్స్మెంట్ ఇవ్వాలి ► అఖిలపక్ష సమావేశంలో నేతల డిమాండ్ కడప సెవెన్‌రోడ్స్: కరువు ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగునీరు, కనీసం ఒక ఆరుతడి పంటకు అవసరమయ్యే సాగునీరు ఇవ్వాలని ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని పరిశీలించాలంటూ కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు స్పెషల్ ఎండార్స్మెంట్ ఇవ్వాలని కోరారు. ఆరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా వెళ్లి ప్రధాని మోదీకి ఈ మేర కు విన్నవించాలని తీర్మానించారు. బుధవారం కడప హరిత హోటల్లో రాయలసీమ అభ్యుదయ సంఘం నాయకుడు ఇస్మాయిల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో నేతలు తమ గళాన్ని వినిపించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, సీనియర్ పాత్రికేయుడు వై.నాగిరెడ్డి, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్లు శ్రీరామిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు మీసాల రంగన్న, చవ్వా రాజశేఖర్, ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ ఎండార్స్మెంట్ ఇవ్వాలి కరువు ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందించే అవకాశాలను పరిశీలించాలంటూ కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు స్పెషల్ ఎండార్స్మెంట్ ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరాల్సిన అవసరం ఉంది. 1956 నాటి ఇరిగేషన్ యాక్టులో కూడా కరువు ప్రాంతాల నీటి అవసరాలు తీర్చాలనే అంశం లేదు. దీనికి చట్టసవరణ తీసుకు రావాల్సిన అవసరం ఉంది. కరువు సీమకు నికర జలాల కేటాయింపుపై ఆర్డినెన్స్ తీసుకు రావాలని కేంద్రాన్ని అడగాలి. ఈ డిమాండ్ల సాధనకు అవసరమైన కార్యచరణ ప్రణాళిక రూపొందించాలి. – వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప లోక్‌సభ సభ్యుడు సమగ్ర గణాంకాలతో నివేదిక ఇవ్వాలి రాష్ట్రానికి కేటాయించిన జలాలను పునః పంపిణీ చేయడానికి ఎవరూ ఒప్పుకోరు. రాయలసీమలో ఏటా తాగునీరు కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు. అలాగే నష్టపోయిన పంటలకు కోట్లాది రూపాయలు ఇన్‌ఫుట్ సబ్సిడీ, బీమా కింద చెల్లిస్తున్నారు. ఇలాంటి సమగ్ర గణాంకాలతో నివేదిక రూపొందించి ప్రధానమంత్రికి సమర్పిస్తే సీమ దయనీయ పరిస్థితులు ఆయనకు అర్థమవుతాయి. అప్పుడే నీటి విషయంలో మనకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. – ఎస్.రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే, మైదుకూరు ఒక ఆరుతడి పంటకైనా నీరివ్వాలి! బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు గెజిట్ నోటిఫికేషన్ జరిగితే గాలేరు –నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టులకు చుక్కనీరు అందదు. 2330 టీఎంసీల నీరు కృష్ణాలో పారిన తర్వాతే తెలుగుగంగకు నీరు ఇస్తారు. 1956 నాటి ఇరిగేషన్ చట్టం లోప భూయిష్టంగా ఉంది. అలాగే దుమ్ముగూడెం–సాగర్ టేల్ఫాండ్ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. – సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ కార్మిక కర్షక సమితి సింగిల్ ట్రిబ్యునల్ ఏర్పాటైతే నష్టం దేశంలోని ఆరు ట్రిబ్యునల్స్‌ను కలిపి ఒక సింగిల్ ట్రిబ్యునల్‌గా ఏర్పాటు చేయాలని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఇదే జరిగితే రాయలసీమకు తీరని నష్టం వాటిల్లుతుంది. ‘సీమ’కు 160 టీఎంసీల గోదావరి జలాలను అందించే అవకాశం ఉన్న దుమ్ముగూడెం–సాగర్ టేల్ఫాండ్ను విభజన చట్టంలో పొందుపరచకపోవడం విచారకరం. నాయకులు స్థానికంగా మాట్లాడితే సరిపోదు. ఢిల్లీ పెద్దలకు మన గోడు వినిపించాలి. – ఇస్మాయిల్‌రెడ్డి, రాయలసీమ అభ్యుదయ సంఘం గోదావరి నీటిలో ‘సీమ’కు ప్రాధాన్యత గోదావరి జలాలను కృష్ణానదిలోకి మళ్లించడం ద్వారా లభించే నీటిలో సీమకు మొదటి ప్రా«ధాన్యత ఇవ్వాలి. రాష్ట్రానికి వచ్చిన నికర జలాలను పునః పంపిణీ చేయాలని సీఎంను కోరాలి. – గఫూర్, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నీటితోనే అభివృద్ధి సాధ్యం సాగునీరు లభిస్తేనే పంటలు పండి అభివృద్ధి జరగడంతోపాటు ప్రజల జీవనశైలి మెరుగుపడుతుంది. రాయలసీమ కు ఒక ఆరుతడి పంటైనా నీరివ్వాలి. దుమ్ముగూడెం–సాగర్ టైల్ఫాండ్ను జాతీ య ప్రాజెక్టుగా చేపట్టాలి. –జి.శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే, రాయచోటి ఆ నీటిని ఎక్కడి నుంచి ఇస్తారు.. కోస్తాలో వర్షం, భూగర్భ జలాలు అధి కంగా ఉన్నాయి. సీమ నీటి అవసరాల పై శాస్త్రీయంగా ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచాలి. సీమకు 450 టీఎంసీల నీటిని ఇస్తామని సీఎం అంటున్నారు. అవి ఎక్కడి నుంచి ఇస్తారో తెలపాలి. – గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ గోదావరి–పెన్నా మోసపూరితం ప్రభుత్వం చెబుతున్న గోదావరి–పెన్నా అనుసంధానం పూర్తిగా మోసపూరితం. పోలవరానికి ఇస్తున్న ప్రాధాన్యత సీమ ప్రాజెక్టులకు ఇవ్వడం లేదు. కరువు ప్రాంత ప్రాజెక్టులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసుకోవడం ముఖ్యం. –బి.నారాయణ, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ‘సీమ’గోడు ప్రధానికి విన్నవించాల్సిందే! నికర జలాలను పునః పంపిణీపై నేను శాసనమండలిలో చర్చ లేవదీస్తే సీఎం, అధికా రపక్షం అడ్డు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–దిండి ప్రాజెక్టు నిర్మిస్తే మన పరిస్థితి దుర్భరంగా మారుతుంది. – సి.రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్సీ -
ఆమె అరుదైన క్రీడాకారిణి
గత వారం మిలియన్ డాలర్ల ఎండార్స్ మెంట్ సాధించిన ఇండియన్ ఏస్ షట్లర్ సైనాపై ప్రపంచ బాడ్మింటన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ థామస్ ప్రశంసల జల్లుకురిపించాడు. ఆటలో సత్తాచాటితే ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్పేందుకు సైనా చక్కటి ఉదాహరణ అని కితాబిచ్చారు. ఎడెల్ వీస్ తో 3.7 మిలియన్ డాలర్ల డీల్ కుదుర్చుకున్న సైనా ను ఆయన పొగడ్తలతో ముంచెత్తాడు.సైనా తనతో పాటు ఆటకు గుర్తింపు తెచ్చిన అరుదైన క్రీడాకారిణి అని అన్నారు. ఇలాంటి క్రీడాకారులకు ఫెడరేషన్ అన్నివిధాలా సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. మరో వైపు గత దశాబ్ద కాలంలో బాడ్మింటన్ ఆట ఎంతో పురోగమించిందని అభిప్రాయపడ్డారు. మహిళా బాడ్మింటన్ క్రీడాకారిణి మిలియన్ డాలర్ల ఎండార్స్ మెంట్ పొందడం దీనికి ఉదాహరణ అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బ్యాడ్మింటన్ ఆటను ప్రమోట్ చేస్తున్నామని.. అన్ని దేశాల్లో ఆటకు గుర్తింపు తీసుకు రావడం తమ ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. ప్రస్తుతం ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ గ్రూప్ 3 ఆటగా స్ధానం సంపాదిచిందని.. భవిష్యత్ లో మరింత పురోగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ర్యాంక్‌తో పాటు బ్రాండ్ వాల్యూ పెరిగింది
మేజర్ టోర్నీలన్నింటిలో సత్తా చాటుతున్న భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు.. ర్యాంక్ తో పాటు బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగింది. ఇటీవల విజయాలతో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న ఈ బ్యాడ్మింటన్ స్టార్.. పెద్ద సంఖ్యలో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఓ వ్యాపార ప్రకటన కోసం 12కోట్ల రూపాయల ఒప్పందం సైనాను వరించింది. ఏడాదికి 4 కోట్ల రూపాయలు ఆమెకు ఇవ్వనున్నారు. టాప్ క్రికెటర్ల తర్వాత ఇంత భారీ మొత్తానికి డీల్ కుదుర్చుకున్న తొలి క్రీడాకారిణి సైనానే కావడం విశేషం. ధోనీ, విరాట్ కొహ్లీ వంటి స్టార్ క్రికెటర్లకు మాత్రమే ఇలాంటి ఒప్పందాలు వస్తాయవని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్ వర్గాల కథనం మేరకు ధోనీ ఒక బ్రాండ్ ప్రచారం కోసం ఏడాదికి 8 నుంచి 10 కోట్లు తీసుకుంటుండగా.. విరాట్ కొహ్లీ 6-7 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే మూడేళ్లలో సైనా ఎండార్స్మెంట్ల ద్వారా భారీ మొత్తంలో డబ్బు ఆర్జించనుంది. నిన్న మొన్నటి వరకూ దాదాపు 10 ఎండార్స్ మెంట్స్ ద్వారా ఏడాదికి 5 నుంచి 7 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న సైనా బ్రాండ్ వాల్యూ ఇటీవల అనూహ్యంగా పెరిగింది. హెర్బల్ లైఫ్, స్టార్ స్పోర్ట్స్, గోద్రేజ్, ఇమానీ, సహారా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐయోడెక్స్ వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న సైనా.. ఎడెల్ వీస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. మరో వైపు ఈ ప్రపంచ నెంబర్ వన్ షట్లర్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్లాన్ చేస్తోంది. ప్రైజ్ మనీ, వాణిజ్య ఒప్పందాల ద్వారా వచ్చిన డబ్బుతో బిజినెస్ చేయాలని యోచిస్తోంది. అయితే తనకు బ్యాడ్మింటన్ తప్ప మరో విషయం తెలియదని.. వ్యాపార విషయాలన్నీ తన తండ్రి చూసుకుంటారని వివరించింది. తాను డబ్బుల గురించి ఆలోచించనని.. తన దృష్టి అంతా ఆటమీదే ఉందని చెప్పింది.