భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించిన బాహుబలి-2తో ప్రభాస్ కు వచ్చిన కీర్తి అంతా ఇంతా కాదు. బాలీవుడ్ నుంచి హాలివుడ్ దాకా ప్రభాస్ పేరు మారుమ్రోగుతోంది. ప్రభాస్ పేరు ఇంతలా మారుమోగుతుంటే, బిగ్ బ్రాండ్స్ చడీచప్పుడు కాకుండా ఎలా కూర్చుంటాయి..! వెనువెంటనే తమ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా బాహుబలిని నియమించుకోవాలని శతవిధాలా ప్రయత్నాలు ప్రారంభించాయి.