Baahubali
-
బాహుబలి బాలుడు..!
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యులు క్లిష్టమైన కాన్పును సుసాధ్యం చేశారు. ఈ కాన్పులో మహిళ 5.25 కిలోల బాలుడికి జన్మనివ్వడం విశేషం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన మడకం సన్న భార్య నందినికి నెలలు నిండటంతో.. గురువారం ఉదయం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి వైద్యులు సాత్విక్, మల్లేశ్ సాధారణ ప్రసవం కోసంప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో రాత్రి శస్త్రచికిత్స చేయగా నందిని 5.25 కిలోల బరువైన మగశిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండగా.. ఆ రెండూ సాధారణ ప్రసవాలే జరిగాయి. ఈసారి కేసులో క్లిష్టత దృష్ట్యా తప్పనిసరిగా సిజేరియన్ చేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. కాగా, తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. -
బాహుబలి 3 కి రంగం సిద్ధం..!
-
రాజా సాబ్ స్పెషల్ సాంగ్ అప్డేట్..
-
బాహుబలి 1000 కోట్లు.. దిమ్మతిరిగే ఫ్యాక్ట్స్
-
బాహుబలి బఫెట్
గచ్చిబౌలి: భారతదేశంలోనే అతిపెద్ద ఫ్యామిలీ ‘బఫెట్’ రెస్టారెంట్ గచ్చిబౌలిలో అందుబాటులోకి వచి్చంది. మాస్టర్ పీస్ ఇండియా ఆధ్వర్యంలో దీన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే...300 రకాల విభిన్న వంటకాలు అందుబాటులో ఉండడం. 500 మంది కూర్చునే సామర్థ్యంతో సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ఈ రెస్టారెంట్లో భారతీయ వంటకాలతోపాటు పాశ్చాత్య దేశాల రుచులను భోజన ప్రియులకు అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ దమ్ బిర్యానీతోపాటు కరేబియన్ ఫుడ్డింగ్, రాజస్థానీ కోఫ్తా కర్రీ, థాయ్ రెడ్కర్రీ, జపనీస్ సకానా కుట్సు, డచ్ చికెన్‌తో పాటు అనేక రకాల వెజ్, నాన్‌వెజ్ వంటకాలు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వెరైటీ స్టార్టర్స్, డెజర్ట్స్, ఇతర అన్ని రుచులు కలిపి 300 రకాల వంటకాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. టేస్ట్‌కు టేస్ట్.. ఎన్నో వెరైటీలు అందుబాటులోకి రావడంతో ఫుడ్‌లవర్స్ ఖుషీ అవుతున్నారు. మరెందుకు ఆలస్యం.. మాస్టర్ పీస్ వైపు ఓ లుక్కేయండి మరి. -
బాహుబలి వర్సెస్ బుజ్జి
-
బాహుబలిలా వెపన్
‘‘ప్రస్తుతం భాష అనేది హద్దుగా లేదు. ‘బాహుబలి’ సినిమా ఎన్నో భాషల్లో విడుదలైంది. మా ‘వెపన్’ మూవీ కూడా అలాంటి చిత్రమే. సూపర్ హ్యూమన్ సాగా కాన్సెప్ట్‌తో రానున్న ఈ మూవీ కొత్త ట్రెండ్ కావడంతో పాటు పెద్ద హిట్టవుతుంది’’ అని నటుడు సత్యరాజ్ అన్నారు. గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘వెపన్’.ఎంఎస్ మన్జూర్ సమర్పణలో మిలియన్ స్టూడియో బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గుహన్ సెన్నియప్పన్ మాట్లాడుతూ– ‘‘ఇదొక స్కైఫై థ్రిల్లర్, యాక్షన్ మూవీ’’ అన్నారు. ‘‘వెపన్’ లాంటి మంచి సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు వసంత్ రవి, తాన్యా హోప్, రాజీవ్ పిళ్లై. -
సుర సుర సుర అసుర!
‘బాహుబలి’ ఫేమ్ ప్రభాకర్ ప్రధాన పాత్రలో పాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. రావుల రమేష్ నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ని,చిత్రంలోని మొదటి లిరికల్ (సుర సుర సుర అసురసురసుర...) వీడియోను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి, ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మా సినిమాని త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు రావుల రమేష్. ‘‘మా చిత్రానికి జాన్ భూషణ్ సంగీతం, సురేష్ గంగుల సాహిత్యం బాగా కుదిరాయి’’ అని పాలిక్ అన్నారు. -
బాహుబలి కంటే ఎక్కువ యాక్షన్ సీన్స్ చేశాను – సత్యరాజ్
‘‘వెపన్’లాంటి సినిమా తీయాలంటే డైరెక్టర్,ప్రొడ్యూసర్స్, సినిమాటోగ్రాఫర్, వీఎఫ్ఎక్స్.. ఇలా సాంకేతిక నిపుణులే కీలకం. వాళ్ల తర్వాత యాక్టర్స్‌కు ప్రాధాన్యత అని నా అబిప్రాయయం. ‘బాహుబలి’ కంటే ‘వెపన్’లో ఎక్కువ యాక్షన్ సీన్స్ చేశా. గుహన్ సరికొత్త విజన్‌తో తీశారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది’’ అన్నారు సత్యరాజ్. గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వెపన్’. మన్సూర్ నిర్మించిన ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ‘‘సరికొత్త సూపర్ హ్యూమన్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది’’ అన్నారు వసంత్ రవి. ‘‘మా బ్యానర్లో వస్తోన్న తొలి చిత్రమిది’’ అన్నారు మన్సూర్. ‘‘ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులున్నాయి’’ అన్నారు గుహన్ సెన్నియప్పన్. -
కట్టప్పా కమాన్... ఇదిగో బాహుబలి థాలీ
చెన్నైలోని పొన్నుస్వామి హోటల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ‘బాహుబలి థాలీ’ సోషల్ మీడియా స్టార్మ్‌గా మారింది. ‘మీలో బాహుబలి థాలీని టచ్ చేసే వీరుడు ఎవరు?’ అని ఒక నెటిజనుడు కామెంట్ పెట్టాడు. ట్విట్టర్ యూజర్ అనంత్ రూపన్గూడి ‘బాహుబలి థాలి’ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు థాలీ భారీ ప్లేట్‌ను కస్టమర్ల దగ్గరకు తీసుకు వస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఈ వీడియోను చూసి.... ‘నోరూరుతోంది సుమీ!’ అని లొట్టలు వేస్తున్న వారితో పాటు– ‘ఇది గుడ్ ఐడియా కాదు. రెండు ముక్కల్లో చెప్పాలంటే ఫుడ్ వేస్టేజీ’ అని విమర్శించిన వారు ఉన్నారు. ఇంతకీ బాహుబలి థాలి ధర ఎంతనుకుంటున్నారు? కేవలం రూ.1399 ప్లస్ జీఎస్టీ మాత్రమే! -
గాయంతో బాహుబలి.. బరువు తగ్గిన అరిసి కొంబన్
సాక్షి, చైన్నె: నోటి వద్ద తీవ్రగాయంతో బాహుబలి ఏనుగు, బరువు తగ్గి కనిపిస్తున్న అరిసి కొంబన్ ఏనుగు ఆరోగ్యంపై అటవీశాఖ అధికారులు దృష్టి పెట్టారు. వైద్య పరిశోధనలు, చికిత్సలకు సిద్ధమయ్యారు. ముందుగా బాహుబలిని పట్టుకుని వైద్య చికిత్సలు అందించేందుకు రెండు కుంకీ ఏనుగులను శనివారం రంగంలోకి దించారు. బాహుబలి ఏనుగు కోయంబత్తూరు జిల్లాలోని అటవీ గ్రామాల ప్రజలను వణికిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని పలుమార్లు దట్టమైన అడవుల్లోకి పంపించినా మళ్లీ గ్రామాల్లోకి వస్తోంది. ప్రస్తుతం మళ్లీ అటవీ గ్రామాల్లోకి వచ్చిన బాహుబలి ఏనుగుకు నోటి వద్ద తీవ్ర గాయం అయినట్టు అధికారులు గుర్తించారు. దానికి చికిత్స అందించేందుకు అటవీ అధికారులు, వైద్యులు సిద్ధమయ్యారు. శుక్రవారం రాత్రి నుంచి ఈ ఏనుగు కదలికలపై నిఘా పెట్టారు. మేట్టుపాళయం పరిసరాల్లో బాహుబలి ఉన్నట్టు గుర్తించారు. దీనిని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ముదుమలై శరణాలయం నుంచి వశీం, విజయ్ అనే రెండు ఏనుగులను రంగంలోకి దించారు. ఈ ఏనుగుల ద్వారా బాహుబలిని మచ్చిక చేసుకుని మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నోటి వద్ద గాయానికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. బరువు తగ్గిన అరిసి కొంబన్ తేని జిల్లాలోని అటవీ గ్రామాల ప్రజలను బెంబేలెత్తించిన అరిసి కొంబన్ ఏనుగును ఇటీవల పట్టుకున్న విషయం తెలిసిందే. దీన్ని కన్యాకుమారి జిల్లా కొచ్చియారు పరిధిలోకి తీసుకెళ్లి వదలి పెట్టారు. ఈ పరిసరాలలోనే అరిసి కొంబన్ తిరుగుతోంది. రేడియో కాలర్ అమర్చి దీని కదలికలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కొచ్చియారు తీరంలో తిరుగుతున్న ఈ ఏనుగు మరీ బరువు తగ్గి కనిపించడంతో ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. దీంతో దీని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు వైద్య బృందాలు రంగంలోకి దిగాయి. హఠాత్తుగా ఏనుగు బరువు తగ్గడం అనుమానాలకు దారి తీస్తోంది. గత ఏడాది కాలంగా ఈ ఏనుగు గ్రామాల్లోకి చొరబడి ఇష్టానుసారంగా తనకు చిక్కిన ఆహారాన్ని తింటోంది. ప్రస్తుతం అడవుల్లో లభించే ఆహారం మాత్రమే తీసుకుంటున్న దృష్ట్యా బరువు తగ్గి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
ONEWEB: ఇస్రో కీర్తి కిరీటంలో... మరో వాణిజ్య విజయం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): ఇస్రో మరో అద్భుత వాణిజ్య విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 36 వన్‌వెబ్ ఇండియా–2 ఇంటర్నెట్ సమాచార ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్‌ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి అత్యంత బరువైన ఎల్వీఎం3–ఎం3 బాహుబలి రాకెట్ వాటిని తీసుకుని ఆదివారం ఉదయం 9.00 గంటలకు నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. బ్రిటన్‌కు చెందిన నెట్ వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్, ఇండియన్ భారతి ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా రూపొందించిన 5,805 కిలోలు బరువున్న ఈ ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్లు ఎత్తులో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ 36 ఉపగ్రహాలను 97 నిమిషాల వ్యవధిలో ఒక్కోసారి నాలుగేసి ఉపగ్రహాల చొప్పున 9 విడుతలుగా భూమికి అతి తక్కువ దూరంలో లోయర్ ఎర్త్ లియో అర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. అవన్నీ కక్ష్యలోకి చేరాయని, అంటార్కిటికా గ్రౌండ్‌స్టేషన్ నుంచి సిగ్నల్స్ అందాయని ఇస్రో ప్రకటించింది. వన్‌వెబ్ ఇండియా–1 పేరిట 2022 అక్టోబర్ 23న తొలి బ్యాచ్‌లో 36 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించడం తెలిసిందే. తాజా ప్రయోగంతో మొత్తం 72 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు. ఇస్రో స్థాయి పెరిగింది: చైర్మన్ సోమనాథ్ ప్రయోగం విజయవంతం కాగానే మిషన్ కంట్రోల్ సెంటర్లో శాస్త్రవేత్తలు పరస్పరం అలింగనం చేసుకుని ఆనందం పంచుకున్నారు. రాకెట్‌లోని అన్ని దశలు అద్భుతంగా పనిచేసినట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు. ‘‘ఇది టీం వర్క్. ప్రపంచంలోనే అద్భుతమైన విజయంతో ఇస్రో కీర్తి ప్రతిష్టలను పెంచినందుకు సంతోషంగా ఉంది. ఈ ప్రయోగం చరిత్రాత్మకమైనది. దీనివల్ల ఇస్రో వాణిజ్యపరమైన ప్రయోగాల ప్రయోజనాలకు మరింత బలం చేకూరింది. ఇదే ఊపులో పీఎస్ఎల్వీ సీ55 రాకెట్ ద్వారా ఏప్రిల్‌లో సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నాం. ఈ ఏడాది చంద్రయాన్–3, ఆదిత్య–ఎల్1తో పాటు మరో నాలుగు ప్రయోగాలు చేసే అవకాశముంది’’ అని చెప్పారు. వాణిజ్య ప్రయోగాలకు ఎల్వీఎం3 రాకెట్ ఎంతో ఉపయోగకారి అని న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సీఎండీ డి.రాధాకృష్ణన్, మిషన్ డైరెక్టర్ ఎస్.మోహన్‌కుమార్ చెప్పారు. ఆత్మనిర్భరతకు తార్కాణం ప్రధాని మోదీ అభినందనలు వన్‌వెబ్ ఇండియా–2 ప్రయోగం దిగ్విజయం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. ఇస్రోకు అభినందనలు తెలిపారు. ‘‘వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల్లో అంతర్జాతీయంగా భారత్ పై చేయిని ఈ ప్రయోగం మరింత దృఢపరిచింది. ఆత్మనిర్భరత స్ఫూర్తిని ఎలుగెత్తి చాటింది’’ అని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. -
‘బాహుబలి’ ఆఫర్ వదులుకున్నందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇందులో బాహుబలి, దేవసేన, కట్టప్ప, భళ్లాలదేవుడు, కాలకేయ, శివగామి పాత్రలు ఎంతో ప్రేక్షకాదరణ పొందాయి. అందులో ముఖ్యంగా రాజమాత శివగామి రోల్‌ను ఇప్పటికీ మర్చిపోలేదు. ఈ పవర్ఫుల్ రోల్ చేసిన రమ్యకృష్ణకు విశేషమైన గుర్తింపు దక్కింది. చదవండి: చిరు ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ‘మెగా154’ నుంచి క్రేజీ అప్డేట్ ఈ పాత్ర ఆమె కోసమే క్రియేట్ చేశారా? అనేంతగ రాజమాతగా రమ్యకృష్ణ ఒదిగిపోయారు. ఇందులో శివగామిగా రమ్యకృష్ణ తప్ప మరే నటి చేసిన అంతగా గుర్తింపు వచ్చి ఉండేది కాదని రాజమౌళితో సహా అందరు అభిప్రాయపడ్డారు. అయితే మొదట ఈ రోల్ కోసం రాజమౌళి మంచు లక్ష్మిని సంప్రదించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్‌కు అమ్మగా తాను చేయలేనని మంచు లక్ష్మి ఈ ఆఫర్‌ను వదులుకుంది. ఇదే విషయాన్ని ఎన్నో సందర్భాల్లో స్వయంగా మంచు లక్ష్మియే చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి ఇదే విషయంపై ఆమె స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆమె బాహుబలిలో తాను శివగామి పాత్ర చేయనందుకు గర్వపడుతున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. చదవండి: 31 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్ కాబోతోన్న ‘దళపతి’ కాంబినేషన్ ‘బాహుబలిలో శివగామి పాత్ర కోసం నన్ను సంప్రదించారు. అయితే ప్రభాస్‌కు తల్లిగా చేయాలనుకోలేదు. ఇండియాలో మనం ఒక పాత్ర పోషించిన తర్వాత దానిలోనే ఉండిపోతాం. కానీ నేను మాత్రం ఒకే తరహా పాత్రలకు పరిమితం కావాలనుకోలేదు. బాహుబలి సినిమా అంత పెద్ద హిట్ అయ్యాక .. నిజానికి నేను చాలా గర్వపడ్డాను. హమ్మయ్యా.. నేను ఆ సినిమా చేయలేదు అనుకున్నాడు. అది ఓ ప్రత్యేకమైన సినిమా కావచ్చు. కానీ ఆ పాత్రకు నేను కరెక్ట్ అనిపించలేదు. నా జీవితం.. నా కెరీర్ దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకున్నాను. అలాగే నేను నా కెరీర్లో నేను చేసిన ఐరేంద్రి(అనగనగా ఓ ధీరుడు చిత్రంలోని పాత్ర) లాంటి పాత్ర ఇంకోటి రాలేదు. ఇక మీదట రాదు కూడా’ అని ఆమె పేర్కొంది. -
బాహుబలిని మించిన సినిమా తీస్తా: కమల్ ఆర్ ఖాన్
Kamla R Khan Comments On Baahubali: బాలీవుడ్ సినీ విమర్శకుడిగా గుర్తింపు పొందిన కమల్ ఆర్ ఖాన్ తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. తన యూట్యూబ్ చానల్లో ద్వారా నటీనటులు, సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు షేర్ చేస్తుంటాడు. ఇటీవల పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్, ఈ మూవీ డైరెక్టర్ జక్కన్నపై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత చెత్త సినిమా తీసినందుకు డైరెక్టర్ రాజమౌళిని జైలులో పెట్టాలని కేఆర్కే తీవ్ర విమర్శలు గుప్పించాడు. చదవండి: ‘శాకుంతలం’ డబ్బింగ్ కోసం 3 నెలలు శిక్షణ తీసుకున్న సామ్ తాజాగా అతడు రాజమౌళి మరో పాన్ ఇండియా చిత్రం బాహుబలిపై స్పందించాడు. బాహుబలి మూవీ కేవలం తెలుగులోనే కాదు ప్రపంచ సినిమాలోనే ఎలాంటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో రాజమౌళి, ప్రభాస్‌తో పాటు ఎంతోమంది నటీనటులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అయితే ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందిన బాహుబలి చిత్రాన్ని మించిన సినిమా తీస్తానంటూ కేఆర్కే సవాలు చేశాడు. దేశ్‌ద్రోహీ మూవీ సీక్వెల్‌ను ప్రకటిస్తూ దీన్ని బాహుబలిని మిచంఇన బడ్జెట్‌తో తెరకెక్కిస్తానని పేర్కొన్నాడు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలేంటో లుక్కేయండి! దీంతో అతడి కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అతడి తీరుపై ప్రభాస్, జక్కన్న ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తాము మరో మహమ్మారిని ఎదుర్కొలేమని, నాలుగో వేవ్‌ను చూడలేమంటూ అతడి ట్వీట్‌పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2008లో కేఆర్కే హీరోగా నటించిన చిత్రమే ‘దేశద్రోహి’. ఈ సినిమాపై, ఇందులో కేఆర్కే నటనపై ఇప్పటికీ ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఇన్నాళ్ల తర్వాత దేశద్రోహి పార్ట్ 2 తెరకెక్కించేందుకు కేఆర్కే సిద్ధమయ్యాడు. అది కూడా బాహుబలిని మించేలా తెరకెక్కిస్తానని, ఇది చూసి బాలీవుడ్ వారు సినిమా ఎలా తీయాలో నేర్చుకోవాలి అంటూ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు కేఆర్కే. Shooting is going to start soon! pic.twitter.com/WEXxe5MkRB — KRK (@kamaalrkhan) April 18, 2022 -
బాహుబలి 2: అచ్చం ప్రభాస్‌ను దించేశాడు.. వైరల్ వీడియో
టాలీవుడ్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. రెండు పార్టులుగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టింది. ప్రభాస్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ప్రభాస్ నటన, పాటలు, యాక్షన్ సన్నివేశాలు ఒక్కటేంటి సినిమాలోని అన్నీ అంశాలు అభిమానులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే సినిమా వచ్చి ఆరేళ్లు పూర్తైనా ఇప్పటికీ బాహుబలికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కాగా బాహుబాలి సెకండ్ పార్ట్‌లో ప్రభాస్ తొండం మీద కాలు పెట్టి ఏనుగు మీదకు ఎక్కి కూర్చూనే సీన్ ఒకటి ఉంటుంది. దాదాపు ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది. సినిమాకు ఈ సన్నివేశం హైలెట్‌గా నిలిచింది. తాజాగా అచ్చం బాహుబలి స్టైల్లో ఓ వ్యక్తి ఏనుగు మీదకు ఎక్కాడు. ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విటర్లో పోస్టు చేశారు. 20 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఏనుగులపై స్వారీ చేసే వ్యక్తి దాని ముందు నిల్చొని ఉంటాడు. వెంటనే ఎలాంటి సాయం లేకుండా తొండంపై కాలు పెట్టి ఏనుగు ఎక్కి కూర్చుంటాడు. చదవండి: Viral Video: దున్నపోతుతో యవ్వారం.. దెబ్బకు గాల్లో ఎగిరి పడ్డారు.. He did it like @PrabhasRaju in #Baahubali2. @BaahubaliMovie @ssrajamouli pic.twitter.com/nCpTLYXp7g — Dipanshu Kabra (@ipskabra) March 30, 2022 ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్చేస్తోంది. ఈ దృశ్యం చూసిన నెటిజన్లు బాహుబలి సినిమాలోని సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చిదంటూ కామెంట్ చేస్తున్నారు. బాహుబలి 2లో ప్రభాస్ ఇలాగే చేశాడని, ప్రభాస్ ఒకవేళ వృద్ధుడు అయిన తర్వాత ఇలాగే చేసేవాడని, బాహుబలి పార్ట్ 3లా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: మిస్ యూనివర్స్‌కు బాడీ షేమింగ్.. అసలు విషయం చెప్పిన హర్నాజ్ -
‘రాజ్ కపూర్ తర్వాత ప్రభాస్‌కే’
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిచెప్పిన చిత్రం ‘బాహుబలి’. ఎన్నో రికార్డులు, అవార్డులు ఘనతలు అందుకున్న ‘బాహుబలి’ కీర్తి కిరీటంలో మరో కలికుతురాయి వచ్చిచేరింది. బాహుబలిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటనకు గాను ‘రష్యా ఆడియన్స్ హార్ట్’ అవార్డుకు ఎంపికయ్యాడు. 2015కు గాను ప్రకంటించిన అవార్డుల జాబితాలో ప్రభాస్‌కు అభిమానులను మెప్పించిన విభాగంలో అవార్డు లభించింది. రష్యాలోని సినీ ప్రేక్షకుల అభిమానాన్ని విపరీతంగా పొందడంతోనే ప్రభాస్‌కు ఈ అవార్డు లభించిందని అక్కడి ప్రతినిధులు పేర్కొంటున్నారు. (రిజర్వ్ ఫారెస్ట్ దత్తత తీసుకుంటా..) ఇక ఈ అవార్డు అందుకుంటున్న రెండో భారతీయ నటుడిగా ప్రభాస్ నిలవనున్నాడు. గతంలో దిగ్గజ నటుడు రాజ్‌కపూర్ ఈ అవార్డును అందుకున్నారు. శ్రీ 420, అవారా, ఆరాధన వంటి చిత్రాలతో రష్యన్ ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుని రష్యన్ అభిమానులను మెప్పించిన రాజ్ కపూర్ 30ఏళ్ల క్రితం ఈ అవార్డును అందుకున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి, బాహుబలి2 చిత్రాలు ఎంతటి చరిత్ర సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్‌తో పాటు రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ తదితరులు ఈ చిత్రంలో నటించి మెప్పించారు. (ప్రభాస్ కళ్లు నాకు చాలా ఇష్టం..) -
నా లైఫ్‌లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ – ప్రభాస్
భారతీయ సినిమా చరిత్రలో ‘బాహుబలి’ది ఓ ప్రత్యేకమైన స్థానం. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, తమన్నా ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్’ పేరుతో రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. 2017 ఏప్రిల్ 28న విడుదలైన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ వసూళ్ల రికార్డులను తిరగ రాసింది. ‘బాహుబలి 2’ విడుదలై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభాస్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ దేశవ్యాప్తంగా ప్రజలు మెచ్చిన చిత్రమే కాదు.. నా లైఫ్‌లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్. ఈ సినిమా మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని నాకు అత్యంత చిరస్మరణీయంగా మలచిన దర్శకుడు రాజమౌళితో పాటు చిత్రబృందానికి, ఈ చిత్రాన్ని ఆదరించిన అభిమానులు, ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అని పేర్కొని ఓ వర్కింగ్ స్టిల్‌ను షేర్ చేశారు ప్రభాస్. ‘‘నటుడిగా ఎంతో నేర్చుకుంటూ, ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది’’ అని రానా పేర్కొన్నారు. -
బాహుబలికి ముందు ఆ సినిమానే!
సాక్షి, హైదరాబాద్: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం ‘బాహుబలి’... ఈ సినిమా విడుదలై చాలాకాలమైన ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడో చోట ఈ సినిమా ప్రదర్శితమవుతూనే ఉంది. తాజాగా ‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రాన్ని లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించారు. ఇప్పటివరకు రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించిన తొలి ఇంగ్లిషేతర సినిమా ‘బాహుబలి’ కావడం విశేషం. ఈ సినిమా ప్రదర్శనకు దర్శకుడు రాజమౌళితోపాటు రానా, ప్రభాస్, అనుష్క, కీరవాణి, శోభూ యార్లగడ్డ తదితరులు హాజరయ్యారు. చిత్ర ప్రదర్శన సందర్భంగా ప్రభాస్, రానా బీబీసీ విలేకరి హరూన్ రషీద్‌తో ముచ్చటించారు. బాహుబలి సక్సెస్ గురించి తమ ఆనందానుభూతులను పంచుకున్నారు. ‘బాహుబలి’ కి ముందు తెలుగు సినిమాలు ఏమైనా ఈ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రభావం చూపించాయా? అని రషీద్ ప్రశ్నించగా.. దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ చిత్రాన్ని ప్రభాస్ ప్రస్తావించారు. ‘30, సంవత్సరాల కిందట రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమా దేశవ్యాప్తంగా సత్తాను చాటింది’ అని తెలిపారు. అయితే,బాహుబలి సినిమా అంతకుమించి దేశవ్యాప్తంగా అన్నిచోట్ల విజయం సాధించిందని, విదేశాల్లోనూ గొప్పగా ప్రేక్షకుల ఆదరణ పొందిందని ప్రభాస్ తెలిపారు. నాగార్జున హీరోగా వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. -
‘బాహుబలి’కి భల్లాలదేవ విషెస్
హైదరాబాద్: పుట్టినరోజు సందర్భంగా యంగ్ రెబల్ స్టార్, టాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రభాస్‌కు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాహుబలి ప్రభాస్ మరిన్ని గొప్ప సినిమాలు తీయాలని, ఆయన కెరీర్ గొప్పగా సాగాలని, మున్ముందు భారీ విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బాహుబలి సినిమాలో భల్లాలదేవుడిగా ప్రభాస్‌కు పోటీగా నటించిన రానా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో విషెస్ తెలిపారు. "జన్మదిన శుభాకాంక్షలు సోదరా... నీ అందమైన మనస్సు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ" అంటూ రానా ప్రభాస్‌కు విషెస్ చెప్పారు. ప్రభాస్ తో కలిసి నవ్వులు చిందిస్తున్న ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. 'బాహుబలి' సినిమాలో ప్రభాస్-రానా పోటాపోటీగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మూడేళ్లకుపైగా కలిసి పనిచేసిన ఈ ఇద్దరు స్టార్స్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. బాహుబలిగా ప్రభాస్‌కు ఎంత పేరు వచ్చిందో.. భల్లాలదేవగా రానాకు కూడా ప్రేక్షకులు అంతగానే ఫిదా అయ్యారు. -
‘వార్-2’: హృతిక్‌ను ప్రభాస్ ఢీకొడతాడా?
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్యాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్న నటుడు ప్రభాస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్ చిత్రాలతో ప్రభాస్ కెరీర్ ఎవరెస్ట్ శిఖరాలను అందుకుంది. ‘బాహుబలి’ సినిమాల అనంతరం ఇటీవల ప్రభాస్.. ‘సాహో’ తో ప్రేక్షకులను పలుకరించాడు. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ డివైడ్ టాక్ వచ్చింది. విమర్శకులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయినా దేశవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల పరంగా పర్వాలేదనిపించింది. హిందీలో సుమారు రూ. 150 కోట్లు వసూలుచేసి.. ‘సాహో’ హిట్ అనిపించికుంది. మొత్తానికి ‘సాహో’ ప్రభాస్‌ను, ఆయన ఫ్యాన్స్ నిరాశపరిచినా.. ప్యాన్ ఇండియా స్టార్‌గా డార్లింగ్ స్టామినా ఏంటో చాటింది. ఈ క్రమంలో తన స్టార్‌డమ్‌ను కాపాడుకుంటూ.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేలా భారీ సినిమాలు తీసేందుకు ప్రభాస్ ఈ సమయాతమవుతున్నాడు. డార్లింగ్‌గా ఫ్యాన్స్ హృదయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ప్రభాస్ బుధవారం 40వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రభాస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం. ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. చెన్నైలో సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు జన్మించారు. టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రభాస్‌కు పెద్దనాన్న. ప్రభాస్ దేశవ్యాప్తంగా టాప్ స్టార్‌గా వెలుగొందుతున్నాడంటే అందుకు కారణం రాజమౌళి తీసిన బాహుబలి, బాహుబలి-2 సినిమాలు. బాహుబలి-2 సినిమా వసూళ్లపరంగా దేశంలోని అన్ని రికార్డులను చెరిపేసింది. మొదటి పదిరోజుల్లోనే ఈ సినిమా దేశంలో వెయ్యికోట్లు వసూలు చేసింది. అంతేకాదు ఇండియాలో రూ. 1500 కోట్ల మైలురాయి చేరిన తొలి సినిమాగా కూడా రికార్డు సృష్టించింది. మరో సరదా అంశం ఏమిటింటే.. ప్రభాస్ గత మూడు చిత్రాల (బాహుబలి, బాహుబలి-2, సాహో)కు అయిన బడ్జెట్ దాదాపు రూ. 800 కోట్లు. ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్డే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న తన ఫ్యాన్స్‌కు రీచ్ అయ్యేలా ప్రభాస్ భారీ సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడు. 2017లో జీక్యూ మ్యాగజీన్ ప్రచురించిన అత్యంత ప్రభావవంతమైన యువత జాబితాలో ప్రభాస్ ఆరోస్థానంలో నిలిచాడు. బాహుబలి-2 సక్సెస్ దేశవ్యాప్తంగా యువతలో ప్రభాస్‌కు మంచి క్రేజ్‌ను తీసుకొచ్చింది. ప్రభాస్‌కు 40 ఏళ్లు వచ్చాయి. ఇప్పటికీ ఓ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. అదే ఆయన పెళ్లి. ప్రభాస్ ఎప్పుడు మ్యారెజ్ చేసుకుంటారు. ఈ ప్రశ్న ఆయనకు నిత్యం ఎదురవుతూనే ఉంటుంది. గతంలో తన కో-స్టార్ అనుష్కను ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని వదంతులు వచ్చాయి. ఈ ఇద్దరు ‘మిర్చి’ సినిమా చేసినప్పటి నుంచి ఈ వదంతులు నిత్యం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తన పెళ్లి వదంతుల గురించి స్పందించిన ప్రభాస్.. తాను, అనుష్క మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు. కనీసం నువ్వు అయినా పెళ్లి చేసుకో.. ఈ వదంతులు అగుతాయని అనుష్కను అడిగినట్టు ప్రభాస్ సరదాగా వ్యాఖ్యానించారు. దక్షిణాది సినీ స్టార్స్‌లో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం ప్రభాస్‌కి దక్కింది. బ్యాంకాక్‌లోని ప్రపంచ ప్రఖ్యాత మేడం టుస్సాడ్ మ్యూజియంలో ఆయన మైనపు బొమ్మ కొలువదీరింది. బాహుబలి చిత్రంలోని అమరేంద్ర బాహుబలి పాత్ర రూపంలో ఆయన మ్యూజియంలో దర్శనమిస్తున్నారు. ప్రభాస్ బాగా నచ్చిన సినిమా తన పెద్దనాన్న కృష్ణంరాజు నటించిన 'భక్తకన్నప్ప'. బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ సినిమాలు అన్నా పడిచస్తాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రి ఇడియట్స్ సినిమాలను 20సార్లకుపైగా చూశాడట. ఇక హాలీవుడ్ విషయానికొస్తే రాబర్ట్ డీనీరో నటన అంటే ఇష్టం. ప్రభాస్‌కు వాలీబాల్ అంటే ఇష్టం. బాహుబలి సినిమా కోసం మిస్టర్ వరల్డ్ 2010 లక్ష్మణ్ రెడ్డి ప్రత్యేకంగా దేహాదారుఢ్యంపై ప్రభాస్‌కు శిక్షణ ఇచ్చారు. కండలు తిరిగిన దేహసౌష్ఠవం కోసం చిత్ర నిర్మాతలు ప్రత్యేకంగా రూ. 1.5 కోట్లు విలువచేసే జిమ్ ఎక్విప్మెంట్స్ ఇచ్చారు. చాలామంది నటులు వరుసగా సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపుతుండగా ప్రభాస్ మాత్రం ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాపై దృష్టి పెడుతున్నాడు. 'బాహుబలి' సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సాహో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. ప్రస్తుతం 'జిల్' దర్శకుడు కె.కె. రాధాకృష్ణ డైరెక్షన్లో మరో భారీ సినిమాలో నటించేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. గోపికృష్ణా మూవీస్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణంరాజు సమర్పణలో తెరకెక్కనున్న త్రిభాషా చిత్రానికి ‘జాను’ టైటిల్ ప్రచారంలో ఉంది. హృతిక్‌ను ఢీకొంటాడా? హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ ‘వార్’ ఈ ఏడాది సంచలన విజయాన్ని అందుకుంది. రూ. 300 కోట్లు వసూలు చేసి.. ఈ ఏడాదికి బిగ్గెస్ట్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో చిత్ర నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిలిమ్స్ ఉంది. ఈ సినిమా సీక్వెల్లో హృతిక్ పాత్ర యథాతథంగా కొనసాగనుండగా.. టైగర్ ష్రాఫ్ పాత్రను మాత్రం మరొకరు చేయాల్సి ఉంది. ఈ పాత్ర కోసం పలువురు హీరోల పేర్లు తెరపైకి వస్తుండగా.. ప్రభాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం గమనార్హం. బాలీవుడ్ మీడియా వర్గాలు కూడా ప్రభాస్ పేరును ‘వార్-2’కు ప్రముఖంగా సూచిస్తున్నాయి. ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్డమ్ ఉండటం.. దక్షిణాదిలో తిరుగులేని క్రేజ్ ఉండటంతో ‘వార్-2’లో హృతిక్, ప్రభాస్ కలిసి నటిస్తే.. దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ తథ్యమని సినీ విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు. -
పంచెకట్టులో రాజమౌళి.. ఎందుకోసమంటే..
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచదేశాలకు తెలిసేలా చేసిన చిత్రం బాహుబలి. తాజాగా బాహుబలి టీమ్ సభ్యులు మళ్లీ కలిశారు. లండన్‌లో రాయల్ రీ యూనియన్ జరుపుకున్నారు. వీరు ఎందుకోసం కలిశారంటే.. లండన్‌లోని అల్బర్ట్ హాల్లో శనివారం ‘బాహుబలి1’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బాహుబలి టీమ్ అక్కడికి వెళ్లింది. లండన్ వెళ్లిన వారిలో రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, కీరవాణి, శోభు యార్లగడ్డ ఉన్నారు. అక్కడ జరిగిన బాహుబలి ప్రదర్శనకు రాజమౌళి పంచెకట్టులో హాజరుకావడం విశేషం. ఈ సందర్భంగా హౌస్‌లోని ప్రేక్షకులు బాహుబలి యూనిట్‌ను చప్పట్లు, కేరింతలతో అభినందించారు. రాయల్ అల్బర్ట్ హాల్లో బాహుబలి ప్రదర్శనను చూడటానికి వచ్చిన పలువురు జపాన్ అభిమానులు వచ్చారు. బాహుబలి యూనిట్ స్టే చేసిన హోటల్ వెలుపల వారిని కలుసుకున్నారు. అలాగే వారితో ఫొటోలు కూడా దిగారు. అయితే రాయల్ అల్బర్ట్ హాల్లో తొలి నాన్-ఇంగ్లిష్ చిత్రం బాహుబలి అని ఆ చిత్ర బృందం తెలిపింది. ఇది మనందరికి గర్వకారణమని పేర్కొంది. -
ఇక ‘నాన్ బాహుబలి రికార్డ్’ అన్న పదం వినిపించదా!
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా భారతీయ సినిమా ముఖచిత్రాన్నే మార్చేసింది. వందకోట్ల వసూళ్లు సాధించటమే టార్గెట్ అనుకున్న ఇండియన్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో వసూళ్లకు గేట్లు తెరిచింది. బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా బాహుబలి విజయం ముందు దాసోహం అన్నాయి. బాహుబలి రిలీజ్ తరువాత ఆ రికార్డ్లను చెరిపేసేందుకు బాలీవుడ్ చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. కానీ ఇప్పుడు సాహో సినిమా రిలీజ్‌కు దగ్గర పడుతుండటంతో మరోసారి బాహుబలి రికార్డ్‌లపై చర్చ మొదలైంది. ఇన్నాళ్లు భారీ విజయం సాధించిన సినిమాలను నాన్ బాహుబలి రికార్డ్ సాధించిందంటూ చెపుతూ వస్తున్నారు. కానీ సాహో రిలీజ్ తరువాత రికార్డ్‌లకు సరికొత్త స్టాండర్ట్స్ సెట్ అవుతాయంటున్నారు ఫ్యాన్స్. సాహో.. బాహుబలి రికార్డులన్నింటినీ చెరిపేయటం ఖాయం అని భావిస్తున్నారు. అయితే విశ్లేషకుల మాట మాత్రం మరోలా ఉంది. సాహో మీద భారీ అంచనాలు ఉన్నా బాహుబలి మార్క్‌ను అందుకోవటం కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాహో బ్రేక్ఈవెన్ సాధించాలంటే దాదాపు 400 వందల కోట్ల వసూళ్లు సాధించాలి. కేవలం బాలీవుడ్లోనే 125 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ఆ స్థాయి వసూళ్లు సాహోకు సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బాహుబలి కాస్ట్యూమ్ డ్రామా కావటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సాహో రెగ్యులర్ సోషల్ యాక్షన్ కథ కావటంతో ఆ స్థాయిలో అంచనాలు కష్టమే అంటున్నారు. హిందీలో ఇప్పటికే ధూమ్ లాంటి యాక్షన్ సినిమాల చాలా వచ్చాయి. మరి సాహో వాటిని మించి బాలీవుడ్ జనాలు సాహో అలరిస్తుందా లేదా చూడాలి. -
ఇక అలాంటి సినిమాలు చేయను : ప్రభాస్
సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ప్రభాస్ ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అనుష్కతో తన అనుబంధం గురించి క్లారిటీ ఇచ్చిన ప్రభాస్.. ఇక మీదట ఎట్టిపరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాల్లో నటించబోనని తేల్చి చెప్పేశాడు. భారీ బడ్జెట్ చిత్రాల వల్ల చాలా రోజులు పాటు షూటింగ్ చేయాల్సి రావటంతో పాటు రిలీజ్ సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురికావాల్సి వస్తుందన్నాడు ప్రభాస్. అభిమానుల కోరిక మేరకు ఇక మీదట ఏడాదికి రెండు సినిమాలు చేసేలా ప్రయత్నిస్తానని చెప్పాడు. అంతేకాదు ‘సాహో భారీ వసూళ్లు సాధించి చరిత్ర సృష్టిస్తుందో లేదో చెప్పలేను కానీ బాహుబలి అభిమానులను మాత్రం తప్పకుండా అలరిస్తుంద’న్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ సాహో. శ్రద్ధకపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. -
‘సాహో’ బడ్జెట్‌ను స్వయంగా వెల్లడించిన ప్రభాస్
బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక సినిమా ‘సాహో. దేశ చరిత్రలోనే అతిపెద్ద యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ‘సాహో’ ఈ నెల 30న ప్రేక్షకులను పలుకరించబోతోంది. ప్రభాస్‌తోపాటు శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేశ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా కోసం చిత్రయూనిట్ ముమ్మరంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇటీవల విడుదలైన ‘సాహో’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ‘సాహో’ చిత్ర బడ్జెట్‌పై అనేక రుమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఫిల్మ్ కంపానియన్ అనుపమ చోప్రాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రభాస్ చిత్ర బడ్జెట్‌పై స్పందించారు. రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్టు ఇంతకముందు కథనాలు వచ్చాయి. చిత్ర బడ్జెట్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ కళ్లు చెదిరే విషయాలు వెల్లడించారు. ఈ సినిమా బడ్జెట్ అక్షరాల రూ. 350 కోట్లు అని తెలిపారు. ఇక, ఇది ఫ్యూచరిస్టిక్ సినిమా కాదని స్పష్టం చేసిన ప్రభాస్.. ‘ఇది ప్రస్తుతం నడిచే కథ. సినిమాలో కొన్ని పార్ట్స్ ఫ్యూచరిస్టిక్‌గా ఉంటాయి. అవి యదార్థంగానే సాగుతాయి. ట్రైలర్లో నేను ఎగరడం మీరు చూస్తారు. ఈ సీన్లను మేం పెద్దస్థాయిలో తీశాం. ట్రైలర్లో పింక్ సరస్సు కనిపిస్తోంది. ఇది ఆస్ట్రేలియాలో ఉంది. అది కూడా నిజమైనదే. ప్రపంచం నలుమూలాల్లోని ఉత్తమమైన వాటిని ఒకచోట చేర్చి ఈ సినిమాలో చూపిస్తున్నాం’ అని ప్రభాస్ వెల్లడించారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషాల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలవుతోంది. ఇక, అబుదాబిలో చిత్రీకరించిన ఓ ఛేజింగ్ సీన్ కోసం అక్షరాల రూ. 80 కోట్లు ఖర్చు పెట్టినట్టు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. -
‘సాహో’ మన సినిమా : నాని
బాహుబలి తరువాత టాలీవుడ్ నుంచి వస్తున్న మరో భారీ చిత్రం సాహో. బాహుబలి తరహాలోనే సాహోపై కూడా జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. అయితే సాహో రిలీజ్ డేట్ వాయిదా పడటం కారణంగా తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాల రిలీజ్లు డైలామాలో పడ్డాయి. వాటిలో నాని హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్ లీడర్ ఒకటి. తాజాగా తన సినిమా రిలీజ్ డేట్‌పై నాని స్పందించాడు. ‘దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సాహో మన సినిమా. ఆ సినిమా విజయాన్ని కూడా మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రభాస్ అన్న, సాహో టీంకు నా శుభాకాంక్షలు. గ్యాంగ్ లీడర్ రిలీజ్ డేట్‌ను రేపు ప్రకటిస్తా’ అంటూ ట్వీట్ చేశాడు. #Saaho is our film which is making noise nation wide and when it succeeds its our celebration. wishing Prabhas Anna and team nothing less than a huge blockbuster on August 30th 🤗#GANGLEADER release date will be announced tomorrow 🔥 pic.twitter.com/D6oJXOmFDA — Nani (@NameisNani) August 8, 2019