Kamla R Khan Comments On Baahubali: బాలీవుడ్ సినీ విమర్శకుడిగా గుర్తింపు పొందిన కమల్ ఆర్ ఖాన్ తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. తన యూట్యూబ్ చానల్‌లో ద్వారా నటీనటులు, సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు షేర్ చేస్తుంటాడు. ఇటీవల పాన్ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్, ఈ మూవీ డైరెక్టర్ జక్కన్నపై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత చెత్త సినిమా తీసినందుకు డైరెక్టర్ రాజమౌళిని జైలులో పెట్టాలని కేఆర్‌కే తీవ్ర విమర్శలు గుప్పించాడు.
చదవండి: ‘శాకుంతలం’ డబ్బింగ్ కోసం 3 నెలలు శిక్షణ తీసుకున్న సామ్
తాజాగా అతడు రాజమౌళి మరో పాన్ ఇండియా చిత్రం బాహుబలిపై స్పందించాడు. బాహుబలి మూవీ కేవలం తెలుగులోనే కాదు ప్రపంచ సినిమాలోనే ఎలాంటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో రాజమౌళి, ప్రభాస్‌తో పాటు ఎంతోమంది నటీనటులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అయితే ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందిన బాహుబలి చిత్రాన్ని మించిన సినిమా తీస్తానంటూ కేఆర్‌కే సవాలు చేశాడు. దేశ్‌ద్రోహీ మూవీ సీక్వెల్‌ను ప్రకటిస్తూ దీన్ని బాహుబలిని మిచంఇన బడ్జెట్‌తో తెరకెక్కిస్తానని పేర్కొన్నాడు.
చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలేంటో లుక్కేయండి!
దీంతో అతడి కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అతడి తీరుపై ప్రభాస్, జక్కన్న ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తాము మరో మహమ్మారిని ఎదుర్కొలేమని, నాలుగో వేవ్‌ను చూడలేమంటూ అతడి ట్వీట్‌పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2008లో కేఆర్‌కే హీరోగా నటించిన చిత్రమే ‘దేశద్రోహి’. ఈ సినిమాపై, ఇందులో కేఆర్‌కే నటనపై ఇప్పటికీ ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఇన్నాళ్ల తర్వాత దేశద్రోహి పార్ట్ 2 తెరకెక్కించేందుకు కేఆర్‌కే సిద్ధమయ్యాడు. అది కూడా బాహుబలిని మించేలా తెరకెక్కిస్తానని, ఇది చూసి బాలీవుడ్ వారు సినిమా ఎలా తీయాలో నేర్చుకోవాలి అంటూ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు కేఆర్‌కే.
Shooting is going to start soon! pic.twitter.com/WEXxe5MkRB
— KRK (@kamaalrkhan) April 18, 2022
Comments
Please login to add a commentAdd a comment