Kamal R Khan
-
ఆ సినిమాలే ఓ పరమ చెత్త.. అందుకే ఎవరూ చూడరు: సినీ క్రిటిక్
బాలీవుడ్ సినీ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్(కేఆర్కే) పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ సినిమాలకు కాంట్రవర్సీ రివ్యూలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే పూర్తిగా నెగెటివ్ రివ్యూలు ఇస్తూ ఫేమస్ అయ్యారు. గతంలో షారూక్ ఖాన్ పఠాన్ మూవీతో పాటు పలు స్టార్ హీరోల చిత్రాలపై సంచలన కామెంట్స్ చేస్తూ షాకిస్తుంటారు. బాలీవుడ్ అంటేనే కేవలం రీమేక్ చేయడం తప్పా.. సినిమాలు తీయడం రాదని గతంలో పలుసార్లు బహిరంగంగానే విమర్శించారు. (ఇది చదవండి: ప్రతీకారమే లక్ష్యం.. భయపెట్టేందుకు వస్తోన్న 'కల్లరై'!) తాజాగా మరోసారి కేఆర్కే తనదైన శైలిలో బాలీవుడ్ చిత్రాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల విడుదలైన ఒపెన్ హైమర్, బార్బీ చిత్రాలు భారీగా వసూళ్లు సాధించడంతో కేఆర్కే బాలీవుడ్ సినీ ప్రముఖులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. హాలీవుడ్ సినిమాలకు ప్రచారం లేకపోయినా ఇండియాలో సక్సెస్ అవుతాయని అన్నారు. ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించకుండానే వారి చిత్రాలకు ప్రేక్షాదరణ దక్కుతుందని అన్నారు. కానీ అందుకు భిన్నంగా బాలీవుడ్ దర్శకులు, నటీనటులు ఎంత ప్రచారం చేసుకున్న సినిమాలు చూసేందుకు జనాలు ఆసక్తి చూపడం లేదని ఎద్దేవా చేశారు. కేఆర్కే ట్వీట్లో రాస్తూ..'బాలీవుడ్ నటులు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి పరుగెత్తుతుంటారు. కానీ బాలీవుడ్ నటులు పరిగెత్తినట్లుగా ఇంగ్లీష్ సినిమా నటులు భారత్‌లో తమ చిత్రాలను ప్రమోట్ చేయడం లేదు. హాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఏ జర్నలిస్టుకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం లేదు. కానీ ఇప్పటికీ హాలీవుడ్ సినిమాలు ఇండియాలో బ్లాక్ బస్టర్ బిజినెస్ చేస్తున్నాయి. ఎందుకు? ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీ తనను తానే నాశనం చేసుకుంది. ఇప్పుడు బాలీవుడ్లో ప్రతి చిత్రం చెత్తగా ఉంటోందని ప్రజలు బాలీవుడ్ చిత్రాలను చూడటానికి ఆసక్తి చూపరు. ఈ విధ్వంసానికి కార్పొరేట్ సంస్థలు పూర్తిగా బాధ్యత వహిస్తాయని నేను నమ్ముతున్నా. ఎందుకంటే వారు సినిమాలు కాకుండా ప్రాజెక్ట్‌లను మాత్రమే చేస్తున్నారు. ' సినీ క్రిటిక్ బాలీవుడ్‌పై మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (ఇది చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!) English films actors are not promoting their films in India like Bollywood actors are running pillar to pole to promote their films. Hollywood producers, directors, actors are not Giving interviews to every Aira Gera Natthu Khera journalist. Still Hollywood films are doing… — KRK (@kamaalrkhan) July 24, 2023 -
ఆలియా బాటలోనే కియారా! పెళ్లికి ముందే ప్రెగ్నెంటా? నటుడి షాకింగ్ ట్వీట్
బాలీవుడ్ క్రిటిక్, నటుడు కమల్ ఆర్ ఖాన్(కేఆర్కే) గురించి తెలిసిందే. సినీ సెలబ్రెటీలు టార్గెట్‌గా తరచూ వారిని విమర్శిస్తుంటాడు. స్టార్ హీరోల సినిమాలు, బి-టౌన్ సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు, ఎఫైర్స్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో అతడు ఎన్నోసార్లు వివాదంలో చిక్కుకున్నాడు. ఈక్రమంలో అతడిపై పలుమార్లు పోలీసు కేసు కూడా నమోదైంది. అయినప్పటికీ కమల్ ఆర్ ఖాన్ తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు. ఇప్పటికే ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆలియా భట్ వంటి స్టార్స్ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో పడ్డాడు. చదవండి: ఎయిర్పోర్ట్ వివాదం: విజయ్ సేతుపతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం అయితే తాజాగా అతడు ఓ బాలీవుడ్ కొత్త జంటను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం కమల్ ఓ షాకింగ్ ట్వీట్ చేశాడు. ‘ప్రస్తుతం బాలీవుడ్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే! ఫస్ట్ ప్రెగ్నెంట్ అయ్యాకే ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తాజాగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ జంట కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యింది’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే తన ట్వీట్ ఆ జంట ఎవరనేది మాత్రం చెప్పలేదు. దీంతో కొత్తగా పెళ్లి చేసుకుంది కియారా-సిద్ధార్థ్ కదే! అంటే కేఆర్కే వారిని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశాడా? అని నెటిజన్లంతా ఆలోచనపడ్డారు. చదవండి: శివరాత్రి స్పెషల్: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే ఆలియా భట్ బాటలోనే కియారా కూడా వెళ్లిందా? కియారా గర్భవతి అయినందువల్లే వారు సడెన్‌గా చేసుకున్నారా? అని కొందరూ అనుమానం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు కేఆర్కే కామెంట్స్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం ఇకనైనా ఆపమంటూ అతడిపై మండిపడుతున్నారు. ‘మీ పని మీరు చూసుకోండి.. ఎప్పుడూ పక్కవాళ్లపై పడుతుంటారు’ అంటూ కేఆర్కేకు చురకలు అంటిస్తున్నారు నెటిజన్లు. కాగా కొంతకాలంగా సీక్రెట్‌గా డేటింగ్లో ఉన్న కియారా-సిద్ధార్థ్ రీసెంట్గా గుట్టుచప్పుడుగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఫిబ్రవరి 7న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. Bollywood’s new trend is, that first get pregnant and then get married. According to sources, Bollywood Ki recently Huyee Marriage Ka Bhi Yahi Formula Hai. Accha Hai. — KRK (@kamaalrkhan) February 12, 2023 -
పలువురితో నిర్మాత ఎఫైర్లు.. ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య!
బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్(కేఆర్కే) సెలబ్రిటీలను, వారి సినిమాలను విమర్శించడమే పనిగా పెట్టుకుంటాడు. స్టార్ హీరోల సినిమా రిలీజవుతుందంటే చాలు ముందుగానే ఫ్లాప్, డిజాస్టర్ అంటూ ప్రచారం చేస్తాడు. సినీప్రముఖుల వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో బయటపెడుతూ విమర్శలు గుప్పిస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. 'బ్రేకింగ్.. ఓ బడా నిర్మాత భార్య ఇల్లు వదిలి బయటకు వచ్చేసింది. ప్రస్తుతం హోటల్లో ఉంటోంది. తన భర్త చాలామందితో అఫైర్లు పెట్టుకున్నాడన్న కోపంతో అతడికి ఏకంగా విడాకులు ఇచ్చేందుకు రెడీ అయింది' అని రాసుకొచ్చాడు. అయితే ఆ నిర్మాత ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. ఈ ట్వీట్‌పై కొందరు నెటిజన్లు గరమవుతున్నారు.వారి వ్యక్తిగత విషయాల్లోకి తొంగి చూడటం అవసరమా? అని క్లాస్ పీకుతున్నారు. మరికొందరు మాత్రం అది ఎవరై ఉంటారా? అని ఆలోచనలో పడ్డారు. నెటిజన్ల రియాక్షన్స్ కింది ట్వీట్స్‌లో చూడండి. Breaking:- One big producer’s wife has left his house and staying in a hotel. She is angry because of multiple affairs of producer husband and asking for divorce. I am loving it. — KRK (@kamaalrkhan) January 18, 2023 It's T-Series owner Bhushan Kumar .... Divya ghosla right now in oberai mumbai .. room number B255 — Ravi construction pvt ltd (@SonaliK55399651) January 19, 2023 The real news is that #tseries ki Divya pakdi gayi range hathon with john Abraham. Bhushan ne bhaga diya ghar se🙌 — Viraj Sanghi (@bombaywala77) January 18, 2023 చదవండి: ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మంచు మనోజ్ కొత్త ఇల్లు కొన్న త్రిష.. ఎన్ని కోట్లో తెలుసా? -
బ్రహ్మస్త్రపై కేఆర్కే సంచలన కామెంట్స్.. ఇదొక పెద్ద..!
బాలీవుడ్ సినీ క్రిటిక్‌గా పాపులర్ అయిన కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) బ్రహ్మాస్త్రపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల విడుదలైన రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ మూవీని తనదైన శైలిలో విమర్శించారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కేఆర్కే మరోసారి సంచలనాత్మక ప్రకటన చేశారు. బ్రహ్మస్త్ర ఒక పెద్ద డిజాస్టర్ అని బాంబు పేల్చారు. ఈ వ్యాఖ్యలకు తనను నిందించవద్దని నిర్మాత కరణ్ జోహార్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. మరోసారి సంచలన వ్యాఖ్యలతో ఒక్కసారిగా బాలీవుడ్‌ను షేక్ చేశారాయన. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ పెద్ద ఫెయిల్యూర్ అని అభివర్ణించారు. బాలీవుడ్లో ఇతర సినిమాల్లాగే ఇది కూడా పెద్ద వైఫల్యమని చిత్రబృందానికి దిమ్మతిరిగే షాకిచ్చారు. కేఆర్కే సోషల్ మీడియాలో స్పందిస్తూ ' అలియా భట్, రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర చిత్రాన్ని నేను సమీక్ష చేయలేదు, అయినప్పటికీ ప్రజలు సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లలేదు. అందుకే ఇదొక పెద్ద డిజాస్టర్. ఇతర బాలీవుడ్ నిర్మాతల్లాగే కరణ్ జోహార్ తన వైఫల్యానికి నన్ను నిందించరని ఆశిస్తున్నా" అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. I didn’t review film #Brahmastra still people didn’t go to theatres to watch it. So it has become a disaster. Hope @karanjohar won’t blame me for the failure like many other Bollywood people. — KRK (@kamaalrkhan) September 16, 2022 కాగా కేఆర్కే హిందీ బిగ్‌బాస్-3లో పాల్గొన్నారు. పలు హిందీ సినిమాల్లో నటించినా ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. అయితే నటీనటులపై తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ నటులైన సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, అమిర్ ఖాన్, షారుక్ ఖాన్ల మీద ఎప్పుడూ విమర్శలు చేస్తూ పాపులారిటీ దక్కించుకున్నారు. బాలీవుడ్ స్టార్స్‌పై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే కేఆర్కే చుట్టూ నిత్యం వివాదాలు అల్లుకునే ఉంటాయి. 2020లోఆయన చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. దీంతో కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే)ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. -
KRK Arrest: నటుడు, క్రిటిక్ కేఆర్కే అరెస్ట్.. ఆ ట్వీట్‌తో వివాదం
బాలీవుడ్ సినీ విమర్శకుడిగా పొరేందిన కమల్ ఆర్ ఖాన్(కేఆర్కే)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై ఎయిర్‌పోర్టులో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈరోజు(మంగళవారం) కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. కాగా కేఆర్కే హిందీ బిగ్‌బాస్-3లో పాల్గొన్నారు. పలు హిందీ సినిమాల్లో నటించినా ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. అయితే నటీనటులపై తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో కేఆర్కే వెలుగులోకి వచ్చారు. తనను తాను సినీ క్రిటిక్‌గా చెప్పుకునే రషీద్ ఖాన్.. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, అమిర్ ఖాన్, షారుక్ ఖాన్ సమా టాప్ హీరోల మీద ఎప్పుడూ విమర్శలు చేస్తూ పాపులారిటీ దక్కించుకున్నారు. బాలీవుడ్ స్టార్స్‌పై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే కేఆర్కే చుట్టూ నిత్యం వివాదాలు అల్లుకునే ఉంటాయి. 2020లోఆయన చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. 'కొంతమంది ప్రముఖులను తీసుకెళ్లకుండా కరోనా వెళ్లదు. ఆ సమయంలో నేను పేర్లు చెప్పలేదు. కానీ నాకు తెలుసు.. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి వాళ్లు చనిపోతారని. అంతేకాకుండా తర్వాత పైకి పోయేది ఎవరో కూడా నాకు తెలుసు' అంటే కేఆర్కే చేసిన ట్వీట్ తీవ్ర దుమారాన్ని రేపింది. దీనిపై కేసు నమోదవగా తాజాగా కేఆర్కేను పోలీసులు అరెస్ట్ చేశారు. KRK arrested for below tweets done in 2020 pic.twitter.com/WklfVN8Lzi — Gabbbar (@GabbbarSingh) August 30, 2022 -
హృతిక్.. కంగనా ప్రైవేట్ ఫొటోలు చూపించాడు
బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ విక్రమ్ వేద. మాధవన్, విజయ్ సేతుపతి నటించిన సూపర్ హిట్ మూవీ విక్రమ్ వేదకు రీమేక్ ఇది. మాతృకను తెరకెక్కించిన గాయత్రి, పుష్కర్ హిందీ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఆగస్టు 24న ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. బాలీవుడ్ హీరోహీరోయిన్లు, వారి సినిమాలు వస్తున్నాయంటే చాలు ఎక్కడలేని విషాన్ని కక్కే కమల్ రషీద్ ఖాన్ అనే రివ్యూయర్ ఈ ట్రైలర్ ఎలా ఉందో చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. అయితే కేఆర్కే.. ఈ సినిమా గురించే కాకుండా అతడి వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడాడు. 'హృతిక్.. నీకు, కంగనాకు మధ్య ఏం జరిగిందో నాకు పూసగుచ్చినట్లు చెప్పావుకదా, దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? పైగా నీ ల్యాప్‌ట్యాప్‌లో కొన్ని ప్రైవేట్ ఫొటోలు చూపించావు, అవి చాలా ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయి. సరైన సమయం వచ్చినప్పుడు వాటి గురించి కూడా ఓ వీడియో చేస్తా' అని చెప్పుకొచ్చాడు. కాగా తనకు తాను సినీ విశ్లేషకుడినని చెప్పుకునే కేఆర్కే.. సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్.. ఇలా అందరు హీరోల మీద కూడా ఎప్పుడూ విమర్శలు చేస్తుంటాడు. It’s my review of #VikramVedhateaser! Watch and share pls. #VikramVedha! ... https://t.co/rD3FEGF4WI via @YouTube — Kamal Rashid Kumar (@kamaalrkhan) August 25, 2022 I challenge #HrithikRoshan! If his film #VikramVedha will become a HIT then I will stop reviewing films. And if #VV will become flop then he will cut his 6th finger.🤪😁 — Kamal Rashid Kumar (@kamaalrkhan) August 25, 2022 చదవండి: నెట్టింట వైరల్ అవుతున్న ‘అర్జున్‌రెడ్డి’ డిలీటెడ్ సీన్ సినిమా ఛాన్సులు రావేమోనని క్యాన్సర్ ఉందని చెప్పలేదు -
వాళ్లు ఇండస్ట్రీకి హాని చేయాలని చూస్తున్నారు: తాప్సీ
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం దొబారా. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 19న రిలీజైంది. సినిమాకు పెద్దగా ఓపెనింగ్స్ లేవంటూ పలువురు సినీవిశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే కమల్ రషీద్ ఖాన్ (కేఆర్కే) మాత్రం ఓ అడుగు ముందుకేసి తాప్సీపై, ఆమె సినిమాపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. బాలీవుడ్లో పెద్ద హీరోయిన్ అయిన తాప్సీ దొబారా మూవీ 215 స్క్రీన్స్‌లో రిలీజైంది. జనాలు లేకపోవడంతో మార్నింగ్ షోలు రద్దయ్యాయంటూ నవ్వుతున్న ఎమోజీలు యాడ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దొబారా మూవీకి ఎక్కడ చూసినా హౌస్ఫులే, కానీ కలెక్షన్లు మాత్రం ఎనిమిది లక్షలే వచ్చాయంటూ సెటైర్ వేస్తూ ట్వీట్ చేశాడు. అలాగే రోహిత్ జైస్వాల్ అనే రివ్యూయర్ సైతం 'కోల్‌కతాలో ఒకరోజు హల్దిరామ్స్ స్వీట్స్ అమ్మితే ఎంత డబ్బు వస్తుందో దొబారా సినిమా ఫస్ట్‌డేకి కూడా అంత కలెక్షన్లు రాలేదు' అని విమర్శించాడు. అయితే హన్సల్ మెహతా అనే సినీ విశ్లేషకుడు వీరి మాటలను తప్పుపట్టాడు. 'దొబారా 370 స్క్రీన్లలోనే రూ.72 లక్షలు వసూలు చేసింది. ఇదేం చిన్న విషయం కాదు. కానీ విశ్లేషకులం అని చెప్పుకునే మీలాంటివారే సినిమాకు నష్టాన్ని కలగజేస్తున్నారు' అని రిప్లై ఇచ్చాడు. దీనికి తాప్సీ స్పందిస్తూ.. 'సర్, ఒక అబద్ధాన్ని ఎన్నిసార్లు వల్లెవేసినా అది నిజం కాలేదు. కేవలం సినిమాల గురించి మాట్లాడుతూ పేరు తెచ్చుకున్న ఇలాంటివారు ఇండస్ట్రీకి హాని తలపెట్టాలనే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. వాళ్లెంత మూర్ఖులో చూడండి. అయినా ఇలాంటివాళ్లకు దొబారా సినిమా అర్థం కావడం కొంత కష్టమేలెండి. దానికి మనమేం చేయగలం చెప్పండి' అని ట్విటర్లో చురకలంటించింది. Sir झूट को जितना मर्ज़ी ज़ोर ज़ोर से बोला जाए वो सच नहीं बन जाता । और ये लोग जिनकी relevance ही films की वजह से है वो ही industry को खतम करने में लगे है तो सोचो कितने मूर्ख होंगे। वैसे भी #Dobaaraa इनके दिमाग़ के लिए थोड़ी कठिन फ़िल्म है तो बेचारे क्या कर सकते है। https://t.co/p4q0A82S5M — taapsee pannu (@taapsee) August 20, 2022 చదవండి: బస్సు డ్రైవర్ అసభ్యంగా తాకాడు: సీఎంలను ట్యాగ్ చేసిన నటి -
జెర్సీ సినిమా భరించలేకున్నానంటూ కేఆర్కే రివ్యూ
తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన జెర్సీ హిందీలో రీమేక్ అయిన విషయం తెలిసిందే! షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల అనంతరం నేడు (ఏప్రిల్ 22న) థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాపై బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ రివ్యూ ఇచ్చాడు. 'జెర్సీ సినిమాను చూసి భరించలేకపోతున్నాను. ఇదేం సినిమారా బాబు. కబీర్ సింగ్‌లో షాహిద్ ఎలా హింసాత్మకంగా ఉన్నాడో ఇక్కడ కూడా అలానే ఉన్నాడు. ఈ సినిమా చేసేందుకు షాహిద్‌కు ఇదొక్కటి సరిపోతుందేమో!' అని ట్వీట్ చేశాడు కేఆర్కే. మరో ట్వీట్లో 'కేవలం క్రికెట్ చూడటానికి నేను జెర్సీ సినిమా ఎందుకు చూడాలో నాకైతే అర్థం కావడం లేదు. అంతగా కావాల్సి వస్తే ఐపీఎల్ చూస్తాను. జెర్సీ నిర్మాతలు సినిమా క్రికెట్ గురించి కాదని ప్రతిచోటా చెబుతూ వచ్చారు. వారి మాటలను నమ్మి నేను సినిమా చూడాలని నిర్ణయించుకున్నాను. తీరా సినిమా చూశాక ఆరు గంటల క్రికెట్‌ను వారు జెర్సీ ద్వారా మూడు గంటల్లో చూపించినట్లు తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలు మినహా అంతా క్రికెట్ చుట్టూనే సాగుతోంది' అంటూ కేఆర్కే వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. మరోపక్క ఇషాన్ ఖట్టర్, వరుణ్ ధావన్, రకుల్ ప్రీత్ సింగ్, కునాల్ కెమ్ము తదితరులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. Ye Film #Jersey Mujhse Jheli Nahi Jaa Rahi. Ye Kaya Hai Bhai? Film Ka Hero #KabirSingh main mental and violent tha. Waisa Hi Yahan hai. Toh Bas Shahid Ke Liye Itna Hi Kafi tha Film Karne Ke Liye. These actors are really Big Jhandu. — KRK (@kamaalrkhan) April 21, 2022 I really can’t understand that why should I watch film #jersey to watch cricket. If I have to watch cricket only then better I will watch #IPL. — KRK (@kamaalrkhan) April 21, 2022 Makers of #Jersey are saying everywhere that the film is not about cricket. So I decided to watch the film on their words. After watching the film, I can say that makers must be thinking to show 6hours cricket in 3hours film. Coz This film is all about cricket except few scenes. — KRK (@kamaalrkhan) April 21, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1361281962.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: ఓటీటీలో అమితాబ్ బచ్చన్ లేటెస్ట్ మూవీ, ఎక్కడో తెలుసా? 'కేజీయఫ్-2' విజయంపై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు -
బాహుబలిని మించిన సినిమా తీస్తా: కమల్ ఆర్ ఖాన్
Kamla R Khan Comments On Baahubali: బాలీవుడ్ సినీ విమర్శకుడిగా గుర్తింపు పొందిన కమల్ ఆర్ ఖాన్ తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. తన యూట్యూబ్ చానల్లో ద్వారా నటీనటులు, సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు షేర్ చేస్తుంటాడు. ఇటీవల పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్, ఈ మూవీ డైరెక్టర్ జక్కన్నపై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత చెత్త సినిమా తీసినందుకు డైరెక్టర్ రాజమౌళిని జైలులో పెట్టాలని కేఆర్కే తీవ్ర విమర్శలు గుప్పించాడు. చదవండి: ‘శాకుంతలం’ డబ్బింగ్ కోసం 3 నెలలు శిక్షణ తీసుకున్న సామ్ తాజాగా అతడు రాజమౌళి మరో పాన్ ఇండియా చిత్రం బాహుబలిపై స్పందించాడు. బాహుబలి మూవీ కేవలం తెలుగులోనే కాదు ప్రపంచ సినిమాలోనే ఎలాంటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో రాజమౌళి, ప్రభాస్‌తో పాటు ఎంతోమంది నటీనటులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అయితే ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందిన బాహుబలి చిత్రాన్ని మించిన సినిమా తీస్తానంటూ కేఆర్కే సవాలు చేశాడు. దేశ్‌ద్రోహీ మూవీ సీక్వెల్‌ను ప్రకటిస్తూ దీన్ని బాహుబలిని మిచంఇన బడ్జెట్‌తో తెరకెక్కిస్తానని పేర్కొన్నాడు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలేంటో లుక్కేయండి! దీంతో అతడి కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అతడి తీరుపై ప్రభాస్, జక్కన్న ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తాము మరో మహమ్మారిని ఎదుర్కొలేమని, నాలుగో వేవ్‌ను చూడలేమంటూ అతడి ట్వీట్‌పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2008లో కేఆర్కే హీరోగా నటించిన చిత్రమే ‘దేశద్రోహి’. ఈ సినిమాపై, ఇందులో కేఆర్కే నటనపై ఇప్పటికీ ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఇన్నాళ్ల తర్వాత దేశద్రోహి పార్ట్ 2 తెరకెక్కించేందుకు కేఆర్కే సిద్ధమయ్యాడు. అది కూడా బాహుబలిని మించేలా తెరకెక్కిస్తానని, ఇది చూసి బాలీవుడ్ వారు సినిమా ఎలా తీయాలో నేర్చుకోవాలి అంటూ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు కేఆర్కే. Shooting is going to start soon! pic.twitter.com/WEXxe5MkRB — KRK (@kamaalrkhan) April 18, 2022 -
'ఆర్ఆర్ఆర్'పై కెఆర్కె రివ్యూ.. జక్కన్నపై షాకింగ్ కామెంట్స్
Kamaal R Khan Review RRR: అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బిగ్గెస్ట్ మల్లీస్టారర్ చిత్రం రౌద్రం.. రణం.. రుధిరం.. (ఆర్ఆర్ఆర్). పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌలి డైరెక్ట్ చేశారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో థియేటర్లలో అభిమానుల సందడి విపరీతంగా ఉంది. సినిమా సూపర్ హిట్ అంటూ అభిమానులు, ప్రేక్షుకులు, సినీ తారలు సైతం ప్రశంసిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రతీ ఒక్కరూ పొగడ్తలతో ముంచెత్తుతుంటే ఒక క్రిటిక్ మాత్రం విమర్శించాడు. బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ (కెఆర్కె) జక్కన కళాఖండ ఆర్ఆర్ఆర్పై తీవ్ర విమర్శలు గుప్పించాడు. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత చెత్త సినిమా తీసినందుకు డైరెక్టర్ రాజమౌళిని జైలులో పెట్టాలని కెఆర్కె విమర్శించాడు. ఆర్ఆర్ఆర్ను తలాతోక లేని సౌత్ మసాలా చిత్రంగా ఆయన అభివర్ణించాడు. ఈ మూవీ చూడంటంతో తన నాలెడ్జ్ జీరో అయిందన్నాడు. 'తప్పు చెప్పలేను.. కానీ దేశ వీరులను చెత్త సినిమాతో పోల్చడం నేరం. రూ. 600 కోట్ల బడ్జెట్‌తో చెత్త సినిమా తీసిన రాజమౌళిని 6 నెలలు జైలులో పెట్టాలి.' అని కమల్ ఆర్ ఖాన్ పేర్కొన్నాడు. I can’t call it mistake but I will call it biggest crime. Director #Rajamouli should be jailed for minimum 6 months for making this crap film #RRR with ₹600Cr budget. — KRK (@kamaalrkhan) March 24, 2022 Sir @ssrajamouli you are killing my all senses. My all knowledge has become Zero today. Kaise Kar lete ho sir? Maza Hi Aa Gaya sir. Every director makes his Aag and #RRR is your AAG. — KRK (@kamaalrkhan) March 24, 2022 Film #RRR is that shit film, which has never made before in the history of Indian cinema. This film destroys the brain cells of a human being to make him alive dead. It is the worst film ever made In India. Thugs of Hindustan is Mughal E Azam compare to this crap. 0* from me. — KRK (@kamaalrkhan) March 24, 2022 Film #RRR is full time south Masala film without head and feet. — KRK (@kamaalrkhan) March 24, 2022 -
‘సల్మాన్ ఖాన్ నన్ను ఇంతగా లవ్ చేస్తున్నాడా!’
Kamaal R Khan Tweet Salman Khan Misses Him: బాలీవుడ్ సినీ విమర్శకుడిగా గుర్తింపు పొందిన కమల్ ఆర్ ఖాన్ నటీనటులపై తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. తన యూట్యూబ్ చానల్లో ద్వారా వారిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు షేర్ చేస్తుంటాడు. సినీ సెలబ్రెటీలను విమర్శించడమే తన పని అన్నట్టుగా వ్యవహరిస్తాడు. ఈ క్రమంలో అతడు వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడు వరుసగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. చదవండి: ఇన్‌స్టాలో భర్త పేరు తొలగించిన ప్రియాంక... అసలేం జరిగింది? సల్మాన్ నటించిన ‘రాధే’ చిత్రంపై నెగెటివ్ రివ్యూలతో మొదలైన ఆయన విమర్శలు సల్లూభాయ్ సొంత బ్రాండ్ ‘బీయింగ్ హ్యూమన్’ దాకా చేరాయి. అదేవిధంగా ‘రాధే’ హీరోయిన్ దిశా పటానీని, సల్మాన్‌తో సన్నిహితంగా ఉండే షారుఖ్ ఖాన్, గోవిందా తదితర సెలబ్రిటీలపై కూడా ఘాటుగా విమర్శలు గుప్పించాడు కమల్. సోషల్ మీడియాలో వారికి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో కమల్ కేసు నమోదు చేస్తూ కోర్టును ఆశ్రయించాడు సల్మాన్. తాజాగా మరోసారి కమల్‌పై సల్మాన్ ఫిర్యాదు దాఖలు చేశాడట. చదవండి: పునీత్ స్టైల్లో ‘నాటు నాటు’ సాంగ్, ఆర్ఆర్ఆర్ టీం ఫిదా ఈ విషయాన్ని స్వయంగా కమల్ తన ట్వీటర్లో వెల్లడించాడు. ‘‘సల్మాన్ ఖాన్ నన్ను ఇంతగా లవ్ చేస్తున్నాడని తెలిసి నేను ఆశ్చర్యపోతున్నాను. ఆయన నన్ను 24/7లో ప్రతి క్షణం నన్ను మిస్ అవుతున్నాడు. ఎందుకంటే ఆయన నాకు మరోసారి కోర్టు నోటీసులు పంపాడు. అయితే ఈ మధ్య నేను సల్మాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి వీడియో చేయలేదు. అతను నటించిన ఏ సినిమాకు నేను రివ్యూ ఇవ్వలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు. కానీ, అతను నాకు వ్యతిరేకంగా మరోసారి కేసు వేశాడు. ఈ కేసు విచారణ నవంబర్ 29న జరగనుంది’ అంటూ తన ట్వీట్ రాసుకొచ్చాడు. చదవండి: విడాకుల తర్వాత సమంత తొలి ఇంటర్వ్యూ, ఆసక్తికర విషయాలు వెల్లడి Since court order came, I haven’t made any video about #SalmanKhan neither reviewed any of his film, song or trailer, nor tweeted about him. But he filed one more case against me n hearing is on 29th November. I am surprised that @BeingSalmanKhan loves me so much & miss me 24*7! — KRK (@kamaalrkhan) November 22, 2021 -
‘ఫ్యామిలీమ్యాన్’పై విమర్శలు.. కేఆర్కేకు షాకిచ్చిన నటుడు
Manoj Bajpayee- Kamaal Rashid Khan: సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే విమర్శకుడు కమాల్ రషీద్‌ఖాన్ (కేఆర్కే)కు విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయి గట్టి షాకిచ్చాడు. కేఆర్కేపై పరువు నష్టం దావా వేశాడు. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా కోరాడు. ఈ మేరకు మనోజ్ బాజ్‌పేయి తరఫు న్యాయవాది పరేశ్ ఎస్ జోషి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కాగా మనోజ్ నటించిన ఫ్యామిలీమ్యాన్ సిరీస్ ఎంతగా హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, కేఆర్కే మాత్రం అదొక సాఫ్ట్‌పోర్న్ సిరీస్ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో ఓ నెటిజన్ అతడిని ఉద్దేశించి.. ‘‘ఒక్క అడల్ట్ సీన్ ఉన్నందుకే సిరీస్‌ను సాఫ్ట్ పోర్న్ అంటావా. నువ్వొక క్రిటిక్. ఇదో పెద్ద జోక్’’ అంటూ విమర్శించాడు. ఇందుకు బదులుగా.. ‘‘నేనేమీ చెత్త పనులు చేయను. కాబట్టి వెబ్ సిరీస్‌లు చూడను. కాబట్టి సునీల్ పాల్ లాంటి వాళ్లను నువ్వు ఇలాంటి విషయాలు అడగాలి. అయినా, చార్సీ, గంజేదీ(ఎప్పుడూ గంజాయి మత్తులో జోగే) మనోజ్‌ను ఎలా చూడగలుతారో? మత్తు బానిసల వల్ల బాలీవుడ్‌ను ద్వేషించే వాళ్లు.. అలాంటి అందరి వ్యక్తులను ద్వేషించాలి కదా’’ అని కేఆర్కే ట్విటర్ వేదికగా స్పందించాడు. గత నెల 26న చేసిన ఈ ట్వీట్‌పై మనోజ్ బాజ్‌పేయి.. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో ఐపీసీ సెక్షన్ 500 కింద పరువు నష్టం దావా దాఖలు చేశాడు. ఈ విషయం గురించి మనోజ్ లాయర్ పరేశ్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే మనోజ్ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. సెప్టెంబరు 4న తదుపరి విచారణ జరుగనుంది’’ అని పేర్కొన్నారు. ఇక కేఆర్కేకు కేసులేమీ కొత్త కాదు. గతంలో సల్మాన్ ఖాన్ రాధే మూవీ రివ్యూలో భాగంగా.. హీరోపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ అతడి లీగల్ టీం కేఆర్కేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే విధంగా.. రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ మృతి నేపథ్యంలోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా... ఫ్యామిలీమ్యాన్ సిరీస్‌లో.. ‘‘భార్యకు వివాహేతర సంబంధం, భర్తకు మరో మహిళతో ఎఫైర్, మైనర్ బాలికకు బాయ్‌ఫ్రెండ్, చిన్న పిల్లాడు తన వయసుకు మించి ప్రవర్తించడం.. ఓ కుటుంబం అంటే ఇలాగే ఉంటుందా? ఇవా మీరు చూపించేది? మనోజ్ సభ్యత లేని వాడు’’ అంటూ కమెడియన్ సునీల్ పాల్ విమర్శించిన సంగతి తెలిసిందే. చదవండి: Manoj Bajpayee: నేను పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు -
‘కళ్లజోడు మొహం బోరుకొట్టే ఆమీర్ విడాకులు!’
ప్రస్తుతం బి-టౌన్లో ఆమీర్ ఖాన్, కిరణ్ రావుల విడాకుల విషయం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమీర్, కిరణ్‌లు రావు తాము విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. దీంతో ఆమీర్ దంగల్ నటి ఫాతిమాతో ఎఫైర్ కారణంగానే కిరణ్ రావుకు విడాకులు ఇస్తున్నాడంటూ సోషల్ మీడియా నెటిజన్లు సైటిరికల్గా ట్రోల్ చేయడం ప్రారంభించారు. అంతేగాక అప్పుడు రినా దత్తాతో 15 ఏళ్లు... ఇప్పుడు కిరణ్ రావుతో 16 ఏళ్లు.. ఎందుకు ఇలా చేశారు ఆమీర్ అంటూ ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సినీ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్కే ఆమీర్-కిరణ్ రావుల విడాలకులపై స్పందించాడు. ఆమీర్ నిజాయితీ పరుడని అందరూ అంటారు, ఆయన నిజాయితీగా విడాకులు ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ప్రశ్నించాడు. అంతేగాక కిరణ్ రావు లుక్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేఆర్కే తన యూట్యూబ్‌లో ఛానల్లో ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో ‘ఆమీర్ లాంటి స్టార్ హీరో కిరణ్ రావు లాంటి సాధారణ మహిళను పెళ్లి చేసుకోవడం ఏంటని అప్పుడే అనుకున్న. ఎందుకంటే ఆయన ఓ సూపర్ స్టార్, ఆయన తలుచుకుంటే కత్రినా కైఫ్ వంటి అందమైన హీరోయిన్, ఫాతిమా సనా లాంటి వారిని పెళ్లి చేసుకోవచ్చు. కానీ కళ్లజోడు లేకపోతే కనీసం చూడలేని, సర్వసాధారణమైన కిరణ్ రావును ఆమీర్ పెళ్లి చేసుకున్నాడని విని షాక్ అయ్యా. ఆమీర్ ఆమెనే ఎందుకు పెళ్లి చేసుకున్నాడని బాధపడ్డాను’ అంటూ వ్యాఖ్యానించాడు. అదే విధంగా ఆమీర్ డబ్బు మనిషి కాదని, ఆయన మొదటి భార్య రీనా దత్తకు విడాకులు ఇచ్చేముందు ఎలాంటి భరణం, డబ్బు చెల్లించకుండానే ఆ బంధాన్ని విడిపించుకున్నాడంటూ ఎద్దేవా చేశాడు. ‘ఇప్పడు ఆమీర్‌కు డబ్బు కొరత లేదు. ఆయన ఖచ్చితంగా కిరణ్ రావుకు భరణం చెల్లించాల్సిందే’ అని చెప్పుకొచ్చాడు. అంతేగాక ఇప్పుడు ఆమీర్ నిజాయితీగా అసలు విషయం చెప్పాలన్నాడు. కిరణ్ రావు కళ్లద్దాల మొహం చూడలేకపోతున్నానని, 15 ఏళ్లు ఆమెను చూసి చూసి బోరు కొట్టడం వల్లే విడాకులు తీసుకున్న నిజం ఒప్పుకోవాలంటూ కమల్ ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశాడు. -
బాలీవుడ్ నటుడిపై కేసు నమోదు
ముంబై : బాలీవుడు నటుడు కమల్ ఆర్ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల మృతిచెందిన బాలీవుడ్ దిగ్గజ నటులు రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్‌లను అవమానించే రీతిలో సోషల్ మీడియాలో కామెంట్లు చేశారనే ఫిర్యాదుతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్‌లపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కమల్‌పై చర్యలు తీసుకోవాలని యువసేన కోర్ కమిటీ మెంబర్ రాహుల్ కనాల్ బాంద్రా సబ్అర్బన్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. రిషీ కపూర్ హాస్పిటల్ చేరిన రోజున.. ‘త్వరలోనే వైన్ షాప్‌లు తెరుచుకోనున్నాయి.. అప్పటివరకు ఆయన మరణించకూడదు’ అని కమల్ ట్వీట్ చేశారు. మరోవైపు ఇర్ఫాన్ ఖాన్‌ను కూడా అవమానపరిచేలా కమల్ వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఓ సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ..‘ ఇటీవ మరణించిన ఇద్దరు బాలీవుడ్ నటులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కమల్ ఆర్ ఖాన్‌పై సెక్షన్ 294 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది’ అని తెలిపారు.(చదవండి : నా భర్త ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో కదా??) -
త్వరలో చనిపోతా..తిట్టాలంటే..
సాక్షి, ముంబై: వివాదస్పద మూవీ సమీక్షకుడు బాలీవుడ్ నిర్మాత, నటుడు, కమాల్ రషీద్ ఖాన్ (కెఆర్కె) మరోసారి కలకలం సృష్టించాడు. బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలపై వివాదాస్పద రివ్యూలతో పాపులర్ అయన కమాల్ ఆర్ ఖాన్ ఈసారి ఓ విషాద వార్తతో సంచలనం రేపాడు. తనకు స్టమక్ కాన్సర్ (జీర్ణాశయ క్యాన్సర్) సోకిందని ట్విటర్లో వెల్లడించాడు. ఈ మేరకు కేఆర్కే బాక్స్ ఆఫీస్ ట్విటర్లో నిన్న (మంగళవారం) విడుదల చేసిన ఒక ప్రకటన వైరల్ అయింది. తనకు సోకిన క్యాన్సర్ వ్యాధి థర్డ్ స్టేజ్‌లో ఉందని మహా అయితే తాను ఒకట్రెండేళ్లు మాత్రమే బతికి వుంటానని ట్వీట్ చేశాడు. దీంతోపాటు తనను ఎవరైనా తిట్టాలనుకున్నా.. ప్రేమను వ్యక్తం చేయాలనుకుంటే ఎప్పటిలాగే కొనసాగించవచ్చని..కానీ కాల్స్ మాత్రం చేయవద్దని కోరాడు. అయితే, తనపై ఎవరూ జాలిపడొద్దని, తనను ఓదార్చేందుకు ఫోన్లు చేయద్దని కోరాడు. ఇన్నాళ్లూ తనను తిట్టిన వారికి, ద్వేషించిన వారికి అభినందనలు తెలియజేసిన కమాల్, అందరూ తనను ద్వేషించినా, తాను మాత్రం ప్రేమిస్తూనే ఉంటానని పేర్కొన్నాడు. అయితే ఎప్పటికీ నెరవేరని రెండే రెండు కోరికలు మిగిలిపోయాయని తెలిపాడు. ‘ఒకటి: గొప్ప (ఏ గ్రేడ్) ప్రొడ్యూసర్ కావాలనుకున్నా.. రెండు: బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ తో కలిసి పనిచేయాలనుకున్నా. కానీ ఇవి రెండూ నాతో పాటే సమసిపోనున్నాయంటూ’ ఖాన్ తన ప్రకటనలో వెల్లడించాడు. ఇక నుంచీ కుటుంబానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తానని స్పష్టం చేశాడు. ఈ విషయం తెలియడంతో ఇన్నాళ్లూ అతన్ని ద్వేషించిన వారు కూడా అయ్యో పాపం అనుకుంటున్నారు. కాగా 2008లో భోజ్‌పురి సినీ నిర్మాతగా కరియర్‌ను ప్రారంభించిన కమాల్ ఆర్ ఖాన్ వివాదాస్పద బాలీవుడ్, టాలీవుడ్ మూవీ రివ్యూలు, సినిమా ప్రముఖులపై ముఖ్యంగా అమీర్‌ఖాన్‌పై అనుచిత వ్యాఖ్యలతో వెలుగులో వచ్చాడు. దీంతో అప్పట్లో ట్విటర్ అతని ఖాతాను కూడా తొలగించింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి-2 తనకు నచ్చలేదంటూ గతంలో వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. This is press release of #KRK about his health. pic.twitter.com/0UlscVD4wq — KRKBOXOFFICE (@KRKBoxOffice) April 3, 2018 -
నాలుగేళ్లుగా రిలేషన్షిప్... సాక్ష్యం ఇదే!
సాక్షి, సినిమా : గొప్ప విశ్లేషకుడిగా తనను తాను అభివర్ణించుకునే నటుడు కమ్ దర్శకుడు కమల్ రషీద్ ఖాన్ మరోసారి తన వెటకారం చూపించాడు. సెలబ్రిటీలను టార్గెట్ చేసి విరుచుకుపడి.. ఆపై వాళ్ల ఫ్యాన్స్‌తో తిట్లు తినటం ఈయనగారికి అలవాటే. అయితే ఈసారి మాత్రం ఓ పెను వివాదంపైనే అతని కన్నుపడింది. బాలీవుడ్లో సంచలనంగా మారిన కంగనా రనౌత్-హృతిక్ రోషన్ వ్యవహారంలో అతను వేలు పెట్టాడు. కండల వీరుడికి మద్దతుగా ఈ మధ్య ఓ ట్వీట్ చేయగా.. అది ఇప్పుడు మీడియాతోసహా అందరి దృష్టిని ఆకర్షిస్తోది. నటి కరీనా కపూర్‌తో దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేసిన ఖాన్.. కింద ఓ సందేశం పెట్టాడు. ‘నేను-కరీనా నాలుగేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నాం. కావాలంటే చూడండి ఇదే సాక్ష్యం అంటూ కమల్ పేర్కొన్నాడు. అయితే అక్కడ అతని ఉద్దేశం మాత్రం వేరే అన్నది స్పష్టంగా తెలిసిపోతుంది. కలిసి ఫోటోలు దిగిటం.. నటించినంత మాత్రాన సంబంధం ఉన్నట్లు ఆరోపించటం సరికాదన్న రీతిలో కంగన, ఆమె చెల్లి రంగోలిని దెయ్యాలంటూ ఈ వివాదాల విశ్లేషకుడు చురకలు అంటించాడు . ఏది ఏమైనా ఆ ఇద్దరి ఫోటో చూసిన ప్రతీ ఒక్కరూ కమల్ కామెడీ టైమింగ్‌కు హాట్సాఫ్ చెబుతున్నారు. కరీనా-సైఫ్ ఈ పోస్టును చాలా తేలికగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. I had relationship with Kareena Kapoor for 4 Years n I have only this photo to prove. #KanganaRanaut #RangoliChudail pic.twitter.com/hnsuVzGkMe — KRK (@kamaalrkhan) 10 October 2017 -
బాలీవుడ్లో మాటల యుద్ధం
బాలీవుడ్ లో భారీ చిత్రాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అక్టోబర్ 28న శివాయ, యే దిల్ హై ముష్కిల్ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రచారం, రివ్యూల విషయంలో వివాదం మొదలైంది. శివాయ చిత్ర హీరో దర్శకుడు అయిన అజయ్ దేవగన్ తన ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేసిన ఓ ఆడియో క్లిప్ వివాదానికి తెర తీసింది. ఆడియో క్లిప్ లోని గొంతు ప్రముఖ బాలీవుడ్ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్‌దిగా చెప్పిన అజయ్ దేవగన్, ఆయన తన శివాయ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేసేందుకు 25 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా తెలిపాడు. ఈ విషయాన్ని శివాయ చిత్ర మరో నిర్మాత కుమార్ మంగత్‌కు కమాల్ ఫోన్ లో చెపుతుండగా రికార్డ్ చేసిన ఆడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసినట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా..' నేను 25 సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించాను. నా తండ్రి యాక్షన్ డైరెక్టర్‌గా ఇక్కడే పనిచేశారు. అందుకే ఈ రంగంతో నాకు ఎంతో అనుబందం ఉంది. ఇలాంటి రంగంలో కమాల్ ఆర్ ఖాన్ లాంటి వాళ్లు చేస్తున్న పనులు నాకు ఎంతో బాధను కలిగిస్తున్నాయి. సినీ రంగానికి చెందిన వారే ఇండస్ట్రీ నాశనానికి సపోర్ట్ చేయటం బాధాకరం. ఈ విషయంలో కరణ్ జోహర్ ప్రమేయం ఉందా లేదా అన్న విషయం పై కూడా విచారణ జరగాలి' అని తెలిపారు. అజయ్ స్టేట్ మెంట్‌పై కమాల్ కూడా ఘూటుగానే స్పందించాడు. వారి సినిమాను ఇబ్బంది పెట్టే లైసెన్స్ నాకు ఇచ్చినందుకు అజయ్ దేవగన్, కుమార్ మంగత్లకు నా కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పటి వరకు ఈ ట్వీట్లపై కరణ్ జోహార్ మాత్రం స్పందించలేదు. Hear what self proclaimed no. 1 critic and trade analyst Kamaal R Khan has to say. https://t.co/wRc7moSlsZ— Ajay Devgn (@ajaydevgn) 1 September 2016Today both films #Shivaay n #AeDilHaiMushkil got free publicity of millions of ₹ with my name and this is the power of The Brand KRK. G.N.— KRK (@kamaalrkhan) 1 September 2016If you are talking with Kumar Mangat or @ajaydevgn then you should be careful because they can tape you.— KRK (@kamaalrkhan) 2 September 2016My press conference today at 5pm at my office 7/70, mahada, Andheri West, where I will give detailed reply for all allegations of Ajay Devgn— KRK (@kamaalrkhan) 2 September 2016 -
కమాల్ ఆర్ ఖాన్‌పై కేసు
వివాదాస్పద బాలీవుడ్ విశ్లేషకుడు కమాల్ ఆర్ ఖాన్‌పై కేసు నమోదైంది. బాలీవుడ్‌తో పాటు పలు ప్రాంతీయ చిత్రాలపై రివ్యూలు రాయటంలో పాటు, పలు చిత్రాలకు నటుడిగా, దర్శకుడిగా పనిచేసిన కమాల్, సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ వార్తల్లో నిలుస్తుంటాయి. ఇటీవల పవన్ కళ్యాణ్‌పై చేసి కామెంట్స్‌తో దక్షిణాదిలో కూడా కమాల్ పేరు మారుమోగింది. బాలీవుడ్ హీరోయిన్స్‌కు సంబందించి..సోషల్ మీడియాలో ఫోటోలతో పాటు ఇబ్బందికరమైన కామెంట్స్ పోస్ట్ చేసినందుకు గాను కమాల్ ఆర్ ఖాన్‌పై కేసు నమోదైంది. ఐపిసీ సెక్షన్ 354, 309ల కింద ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసుకు సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.