బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ విక్రమ్ వేద. మాధవన్, విజయ్ సేతుపతి నటించిన సూపర్ హిట్ మూవీ విక్రమ్ వేదకు రీమేక్ ఇది. మాతృకను తెరకెక్కించిన గాయత్రి, పుష్కర్ హిందీ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఆగస్టు 24న ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. బాలీవుడ్ హీరోహీరోయిన్లు, వారి సినిమాలు వస్తున్నాయంటే చాలు ఎక్కడలేని విషాన్ని కక్కే కమల్ రషీద్ ఖాన్ అనే రివ్యూయర్ ఈ ట్రైలర్ ఎలా ఉందో చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.
అయితే కేఆర్‌కే.. ఈ సినిమా గురించే కాకుండా అతడి వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడాడు. 'హృతిక్.. నీకు, కంగనాకు మధ్య ఏం జరిగిందో నాకు పూసగుచ్చినట్లు చెప్పావుకదా, దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? పైగా నీ ల్యాప్‌ట్యాప్‌లో కొన్ని ప్రైవేట్ ఫొటోలు చూపించావు, అవి చాలా ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయి. సరైన సమయం వచ్చినప్పుడు వాటి గురించి కూడా ఓ వీడియో చేస్తా' అని చెప్పుకొచ్చాడు. కాగా తనకు తాను సినీ విశ్లేషకుడినని చెప్పుకునే కేఆర్‌కే.. సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్.. ఇలా అందరు హీరోల మీద కూడా ఎప్పుడూ విమర్శలు చేస్తుంటాడు.
It’s my review of #VikramVedhateaser! Watch and share pls. #VikramVedha! ... https://t.co/rD3FEGF4WI via @YouTube
— Kamal Rashid Kumar (@kamaalrkhan) August 25, 2022
I challenge #HrithikRoshan! If his film #VikramVedha will become a HIT then I will stop reviewing films. And if #VV will become flop then he will cut his 6th finger.🤪😁
— Kamal Rashid Kumar (@kamaalrkhan) August 25, 2022
చదవండి: నెట్టింట వైరల్ అవుతున్న ‘అర్జున్‌రెడ్డి’ డిలీటెడ్ సీన్
సినిమా ఛాన్సులు రావేమోనని క్యాన్సర్ ఉందని చెప్పలేదు
Comments
Please login to add a commentAdd a comment