Vikram Vedha
-
టైటిల్‌తో సహా కాపీ, పేస్ట్.. ఆ రెండు చిత్రాలపై బోనీ కపూర్ సంచలన కామెంట్స్
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీలో రీమేక్‌గా వచ్చిన విక్రమ్ వేద, జెర్సీ సినిమాలు సక్సెస్ కాకపోవడంపై మాట్లాడారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ నటించిన ఈ సినిమాలు ఫెయిల్యూర్ కావడానికి గల కారణాలను వివరించారు. బాలీవుడ్లో తెరకెక్కుతున్న సౌత్ డబ్బింగ్ చిత్రాలు కొన్ని మాత్రమే ఎందుకు హిట్ అవుతున్నాయన్న విషయంపై ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. బోనీ కపూర్ మాట్లాడుతూ..'కొన్ని దక్షిణాది చిత్రాల హిందీ రీమేక్ సినిమాలు సక్సెస్ కాకపోవడానికి కారణం కాపీ-పేస్ట్ చేయడం. విక్రమ్ వేద, జెర్సీ మూవీలకు కనీసం టైటిల్స్ కూడా మార్చలేదు. అలాగే సౌత్ సినిమాలను రీమేక్ చేసేటప్పుడు హిందీ ప్రేక్షకులకు తగ్గట్లుగా నార్త్ ఇండియన్ సంస్కృతిని జోడించాలి. అప్పుడు పాన్ ఇండియా అంగీకరించే సినిమా తీయాలి.' అని అన్నారు. విక్రమ్ వేద భారతీయ జానపద కథ విక్రమ్ ఔర్ బేతాల్ ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా అదే పేరుతో తమిళంలో విడుదలైంది. ఈ చిత్రంలో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. జెర్సీ మూవీ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఇది టాలీవుడ్లో నాని హీరోగా నటించిన చిత్రానికి రీమేక్. షాహిద్ కపూర్ తన కొడుకు కోరిక కోసం ఆటలోకి తిరిగి వచ్చే మాజీ క్రికెటర్ పాత్రను పోషించాడు. ప్రస్తుతం బోనీ కపూర్ మలయాళ చిత్రం హెలెన్‌కి బాలీవుడ్ రీమేక్‌తో వస్తున్నాడు. ఈ చిత్రానికి మిలీ అని పేరు పెట్టారు. అతని కుమార్తె జాన్వీ కపూర్ ఈ మూవీలో టైటిల్ రోల్లో నటించింది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ నవంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఆ హీరోతో కలిసి పని చేస్తే ఖతమన్నారు: సైఫ్ అలీ ఖాన్
సుమారు 20 ఏళ్ల తర్వాత హృతిక్ రోషన్‌తో కలిసి నటించాడు సైఫ్ అలీ ఖాన్. వీరిద్దరూ కలిసి నటించిన విక్రమ్ వేద ఇటీవలే రిలీజైన విషయం తెలిసిందే! ఇందులో పోలీస్ విక్రమ్‌గా సైఫ్, గ్యాంగ్‌స్టర్ వేదగా హృతిక్ నటించారు. తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'హృతిక్‌తో కలిసి పని చేయడం మర్చిపోలేని అనుభూతి. అతడితో కలిసి బాగా నటించాలనుకున్నా. సాధారణంగా కెమెరా ముందుకు వచ్చినప్పుడు నేను ఎవ్వరినీ పట్టించుకోను. కానీ ఈ హీరో ఉన్నప్పుడు మాత్రం కచ్చితంగా అందరి దృష్టి అతడివైపే మళ్లేది. దీంతో అతడితో పని చేస్తే మీ పని ఖతమే, మీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. కాబట్టి అతడితో కలిసి నటించకపోతే మంచిదంటూ కొన్ని కథనాలు వెలువడ్డాయి. వాటిని నేను గౌరవిస్తాను. అతడితో కలిసి నటించడం గొప్ప విజయంగా భావిస్తాను' అని చెప్పుకొచ్చాడు. కాగా ఆర్ మాధవన్, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో నటించిన తమిళ చిత్రం విక్రమ్ వేదకు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న రిలీజైంది. చదవండి: ఆస్పత్రిలో ఖుష్బూ, ఏమైందంటే? ఆ హీరోయిన్‌తో ప్రేమాయణం నడిపి బిగ్‌బాస్ కంటెస్టెంట్ -
ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే..!
దసరా సెలవుల్లో వినోదం పంచేందుకు సినిమాలు వరుస కట్టేశాయి. స్కూళ్లు, కాలేజీలకు వరుస హాలీడేస్ రావడంతో థియేటర్లకు రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ వారం ఓటీటీ, థియేటర్లలో రానున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం రండి. ధనుష్ నేనే వస్తున్నా: తమిళ స్టార్ ధనుష్ నటించిన చిత్రం 'నానే వరునెన్'. తెలుగులో ఈ సినిమా 'నేనే వస్తున్నా' అంటూ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రానికి శ్రీరాఘవ దర్శకత్వం వహించగా.. యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. ఈ సినిమాలో ఇలి అవ్రామ్, ఇందుజా, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్- పార్ట్ 1: భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్- పార్ట్ 1. చోళ రాజుల చరిత్ర నేపథ్యంలో రూపొందించిన మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ సినిమా. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్రలు పోషించారు. ఈనెల 30న ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమైంది. హృతిక్ రోషన్ మూవీ విక్రమ్ వేద: బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన చిత్రం విక్రమ్ వేద. మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన తమిళ సూపర్ హిట్ ‘విక్రమ్ వేద’ చిత్రానికి హిందీ రీమేక్ ఇది. ఈ సినిమాకు పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహించగా.. సీఎస్ సామ్ సంగీతమందించారు. పుస్కర్, గాయత్రి ధ్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాధికా ఆప్టే ఇతర కీలక పాత్రలో నటిస్తుంది. సెప్టెంబర్ 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు/ వెబ్ సిరీస్‌లు ఇవే: నెట్‌ఫ్లిక్స్ బ్లోండీ సెప్టెంబరు 28 ప్లాన్ ఏ ప్లాన్ బి సెప్టెంబరు 30 జీ5 బుల్లెట్ ట్రైన్ సెప్టెంబరు 29 కెప్టెన్ సెప్టెంబరు 30 సోనీ లివ్ కోబ్రా సెప్టెంబరు 28 అమెజాన్ ప్రైమ్ వీడియో 777 చార్లీ సెప్టెంబరు 30 డిస్నీ+హాట్ స్టార్ కర్మయుద్ధ్ సెప్టెంబరు 30 హాకస్ పోకస్ 2 -
ఇద్దరి చెడ్డవారి కథే ‘విక్రమ్ వేద’.. ట్రైలర్ అదుర్స్
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘విక్రమ్ వేద’. మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన తమిళ సూపర్ హిట్ ‘విక్రమ్ వేద’ చిత్రానికి హిందీ రీమేక్ ఇది. పుస్కర్, గాయత్రి ధ్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాధికా ఆప్టే ఇతర కీలక పాత్రలో నటిస్తుంది. సెప్టెంబర్ 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. (చదవండి: వింత జీవులతో సైనికుల పోరాటం.. ‘కెప్టెన్’ ఎలా ఉందంటే?) ‘ప్రతి కథలో మంచీ, చెడూ ఉంటాయి. కానీ ఇది ఇద్దరి చెడ్డవారి కథ’అంటూ ప్రారంభమమయ్యే ఈ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది. ఇందులో హృతిక్ గ్యాంగ్‌స్టర్‌గా నటించగా.. సైఫ్ అలీఖాన్ పోలీసు అధికారి పాత్ర పోషించాడు. వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ రీమేక్ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రిలయన్స్ ఎంటర్టైనమెంట్స్, టీ-సిరిస్ ఫిలింస్, ఫ్రైడే ఫిలిం వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. -
హృతిక్.. కంగనా ప్రైవేట్ ఫొటోలు చూపించాడు
బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ విక్రమ్ వేద. మాధవన్, విజయ్ సేతుపతి నటించిన సూపర్ హిట్ మూవీ విక్రమ్ వేదకు రీమేక్ ఇది. మాతృకను తెరకెక్కించిన గాయత్రి, పుష్కర్ హిందీ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఆగస్టు 24న ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. బాలీవుడ్ హీరోహీరోయిన్లు, వారి సినిమాలు వస్తున్నాయంటే చాలు ఎక్కడలేని విషాన్ని కక్కే కమల్ రషీద్ ఖాన్ అనే రివ్యూయర్ ఈ ట్రైలర్ ఎలా ఉందో చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. అయితే కేఆర్కే.. ఈ సినిమా గురించే కాకుండా అతడి వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడాడు. 'హృతిక్.. నీకు, కంగనాకు మధ్య ఏం జరిగిందో నాకు పూసగుచ్చినట్లు చెప్పావుకదా, దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? పైగా నీ ల్యాప్‌ట్యాప్‌లో కొన్ని ప్రైవేట్ ఫొటోలు చూపించావు, అవి చాలా ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయి. సరైన సమయం వచ్చినప్పుడు వాటి గురించి కూడా ఓ వీడియో చేస్తా' అని చెప్పుకొచ్చాడు. కాగా తనకు తాను సినీ విశ్లేషకుడినని చెప్పుకునే కేఆర్కే.. సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్.. ఇలా అందరు హీరోల మీద కూడా ఎప్పుడూ విమర్శలు చేస్తుంటాడు. It’s my review of #VikramVedhateaser! Watch and share pls. #VikramVedha! ... https://t.co/rD3FEGF4WI via @YouTube — Kamal Rashid Kumar (@kamaalrkhan) August 25, 2022 I challenge #HrithikRoshan! If his film #VikramVedha will become a HIT then I will stop reviewing films. And if #VV will become flop then he will cut his 6th finger.🤪😁 — Kamal Rashid Kumar (@kamaalrkhan) August 25, 2022 చదవండి: నెట్టింట వైరల్ అవుతున్న ‘అర్జున్‌రెడ్డి’ డిలీటెడ్ సీన్ సినిమా ఛాన్సులు రావేమోనని క్యాన్సర్ ఉందని చెప్పలేదు -
రక్తంతో తడిసిన హృతిక్ రోషన్.. బర్త్‌డే స్పెషల్ ట్రీట్
Hrithik Roshan First Look As Vedha Out From Vikram Vedha: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మాధవన్ కలిసి నటించిన చిత్రం సూపర్ హిట్ చిత్రం 'విక్రమ్ వేద'. ఈ సినిమాకు అశేష ప్రేక్షధారణ లభించిన సంగతి తెలిసిందే. అంతటి ఘన విజయాన్ని సాధించిన ఈచిత్రాన్ని హిందీలో రీమెక్ చేస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి నటించిన వేద పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో, గ్రీక్ గాడ్‌గా పేరొందిన హృతిక్ రోషన్ అలరించనున్నాడని సమాచారం. జనవరి 10న హృతిక్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు మేకర్స్. 'విక్రమ్ వేద' హీందీ రీమెక్ నుంచి హృతిక్ రోషన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ ఫస్ట్ లుక్‌లో హృతిక్ రఫ్ లుక్‌లో అట్రాక్టీవ్‌గా కనిపిస్తున్నాడు. నల్లని కళ్లద్దాలు, గడ్డం, నల్లటి కుర్తాలో రక్తంతో తడిసిన 'వేద' పాత్రను పరిచయం చేసింది చిత్ర బృందం. ఈ సినిమాను తమిళలో రూపొందించిన దర్శకుడు పుష్కర్ గాయత్రి ఈ హిందీ రీమెక్కు డైరెక్షన్ చేయనున్నాడు. ఈ సినిమాలో మాధవన్ నటించిన విక్రమ్ రోల్లో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇప్పటివరకు సైఫ్ ఫస్ట్ లుక్ ఇంకా రాలేదు. అయితే ఇవాళ హృతిక్ బర్త్‌డే స్పెషల్ ట్రీట్‌గా వెద ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఇందులో రాధికా ఆప్టే కూడా కీలక పాత్రలో మెరవనుంది. वेधा . VEDHA#vikramvedha pic.twitter.com/4GDkb7BXpl — Hrithik Roshan (@iHrithik) January 10, 2022 ఇదీ చదవండి: నోట్లో థర్మామీటర్‌తో జాన్వీ.. కరోనాగా అనుమానం -
కోర్టు మెట్లు ఎక్కనున్న రాధికా ఆప్టే?
కోర్టు మెట్లు ఎక్కనున్నారు హీరోయిన్ రాధికా ఆప్టే. ఏదైనా కేసులో ఇరుక్కున్నారా? అంటే.. కాదు. కొత్త సినిమా కోసం కోర్టులో లాయర్‌గా వాదించనున్నారు. తమిళ హిట్ ‘విక్రమ్ వేదా’ హిందీ రీమేక్‌లోనే ఆమె ఈ పాత్రలో కనిపించే అవకాశం ఉంది. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన పాత్రను హృతిక్ రోషన్, మాధవన్ పాత్రను సైఫ్ అలీఖాన్ చేయనున్నారు. తమిళంలో శ్రద్ధా శ్రీనాథ్ చేసిన లాయర్ పాత్రను హిందీలో రాధికా ఆప్టే చేయనున్నారట. కథ ప్రకారం మాధవన్ భార్య శ్రద్ధా శ్రీనాథ్. సో.. హిందీలో సైఫ్‌కి జోడీగా రాధిక కనిపిస్తారన్న మాట. మాతృకకు దర్శకత్వం వహించిన పుష్కర్–గాయత్రి ద్వయమే రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. సెప్టెంబరులోపు చిత్రీకరణను ఆరంభించాలనుకుంటున్నారు. -
ఆ నటుడిని హాఫ్ బాయిల్ అన్న గూగుల్!
తమిళ సినిమా విక్రమ్ వేద గురించి గూగుల్‌లో గాలిస్తే సినిమా పాత్రల జాబితాలో కన్నడ కంఠీరవ డా.రాజ్‌కుమార్ ఫోటో కింద హాఫ్ బాయిల్ అని రాసి ఉండటం కలకలం రేపింది. ఇది గూగుల్ సంస్థ తప్పిదమేనని కన్నడ అభిమానులు ఆక్రోశం వ్యక్తం చేశారు. నటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టి తన ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇటీవలే గూగుల్‌లో కన్నడ భాషను కించపరచడంపై వివాదం మరువకముందే మళ్లీ కొత్త సమస్య పుట్టుకు రావడం చర్చనీయాంశంగా మారింది. ಎಲ್ಲರಲ್ಲೂ ಒಂದು ಮನವಿ, ವಿಕ್ರಂ ವೇದ ತಮಿಳು ಚಿತ್ರದ ಗೂಗಲ್ ಪುಟದಲ್ಲಿ ನಮ್ಮ ಡಾ. ರಾಜಕುಮಾರ್ ಅವರ ಫೋಟೋ ಬೇರೆ ಹೆಸರಿನಲ್ಲಿ (half boil) ಅಂತ ನಮೂದಿಸಲಾಗಿದೆ, ದಯಮಾಡಿ ಅದನ್ನು ಗೂಗಲ್ ಗೆ report ಮಾಡಿ, ತಪ್ಪು ಸರಿ ಹೋಗಲಿ... pic.twitter.com/ah8p7Ish8H— Rishab Shetty (@shetty_rishab) June 21, 2021 చదవండి: వ్యాక్సిన్ తీసుకున్న హీరో సూర్య దంపతులు -
విక్రమ్ ఓకే.. వేదా ఎవరు?
రెండేళ్ల క్రితం తమిళంలో విడుదలైన ‘విక్రమ్ వేదా’ చిత్రానికి అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పుష్కర్ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్ ఎస్. శశికాంత్ నిర్మించారు. పోలీసాఫీసర్ విక్రమ్ పాత్రలో మాధవన్, గ్యాంగ్‌స్టర్ వేదా పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తారు. తమిళంలో ‘విక్రమ్‌వేదా’ చేసిన ఎస్. శశికాంతే తెలుగు రీమేక్‌ను నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఇందులో విక్రమ్ పాత్రను రవితేజ చేయనున్నారని సమాచారం. వేద పాత్ర కోసం కొంతమంది నటులను పరిశీలిస్తున్నారు. మరోవైపు స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ‘డిస్కో రాజా’ సినిమాతో బిజీగా ఉన్నారు రవితేజ. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి విక్రమ్ పాత్రలోకి వచ్చేస్తారని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘విక్రమ్‌వేదా’ చిత్రం హిందీలో కూడా రీమేక్ కానుంది. ఈ చిత్రానికి ఒరిజినల్ డైరెక్టర్స్ పుష్కర్ గాయత్రి ద్వయమే దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. -
ఆమిర్ వర్సెస్ సైఫ్
ఆమిర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ స్క్రీన్ మీద తలపడనున్నారు. మరి ఎవరు గెలుస్తారు? ప్రస్తుతానికి సస్పెన్స్. 2017లో తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘విక్రమ్ వేదా’. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శక ద్వయం పుష్కర్ గాయత్రి రూపొందించారు. ఈ సినిమా బాలీవుడ్ రీమేక్‌లో పలువురు హీరోలు నటిస్తారని వార్తలు వినిపించాయి. ఫైనల్‌గా ఆమిర్ ఖాన్, సైఫ్ అలీఖాన్ ఈ రీమేక్‌లో నటించనున్నారు. మాధవన్ పాత్రలో సైఫ్, సేతుపతి పోషించిన పాత్రను ఆమిర్ ఖాన్ చేస్తారట. 2020 మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. వై నాట్ స్టూడియోస్, నీరజ్‌పాండే, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ నిర్మించనున్నాయి. -
అవన్నీ రూమర్స్ : నిర్మాత సురేష్ బాబు
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ మళ్లీ స్పీడు పెంచారు. ఇటీవల లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకటేష్ ఎఫ్2తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి వెంకీ మామ సినిమాలో నటిస్తున్న విక్టరీ హీరో ఓ కోలీవుడ్ సూపర్ హిట్‌ను తెలుగు రీమేక్ చేయనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా తెరకెక్కిన విక్రమ్ వేదా సినిమాను వెంకటేష్, నారా రోహిత్‌లు రీమేక్ చేస్తున్నారంటు ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై నిర్మాత సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. ‘వెంకటేష్ తమిళ సినిమా విక్రమ్ వేదాను టాలీవుడ్లో రీమేక్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజంలేదు. వెంకటేష్ ప్రస్తుతం వెంకీ మామ సినిమా మాత్రమే చేస్తున్నారు. తదుపరి చిత్రాల వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. There is no truth in reports doing rounds in media that #VenkateshDaggubati garu is doing ‘Vikram Vedha’ Telugu remake. He is currently busy filming for #VenkyMama. The next films will be announced shortly. 😊 — Suresh Productions (@SureshProdns) 7 May 2019 -
వెంకీ–రోహిత్ ఓ రీమేక్?
విక్రమ్, భేతాళ కథలను ఆధారంగా తీసుకొని తమిళంలో దర్శకద్వయం పుష్కర్–గాయత్రి తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్‌వేదా’. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వంద కోట్లు కూడా సాధించింది. ఈ సినిమా తెలుగులో రీమేక్ కాబోతోందని కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే లేటెస్ట్గా ఈ రీమేక్‌లో వెంకటేశ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తారని సమాచారం. వీవీ వినాయక్ దర్శకుడు అని తెలిసింది. మాధవన్ చేసిన పాత్రను నారా రోహిత్, విజయ్ సేతుపతి రోల్లో వెంకటేశ్ కనిపిస్తారని సమాచారం. గతంలో వెంకటేశ్ – వీవీవినాయక్ కాంబినేషన్లో వచ్చిన ‘లక్ష్మీ’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. -
ఆ వార్తల్లో నిజం లేదు
తమిళంలో ‘విక్రమ్‌వేదా’ (2017) చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించిన ఈ చిత్రానికి పుష్కర్ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించారు. వైనాట్ స్టూడియో ప్రతినిధి శశికాంత్ నిర్మించారు. ‘విక్రమ్‌వేదా’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. దీంతో ఈ చిత్రం ఇతర భాషల్లో రీమేక్ కానుందని వార్తలు వచ్చాయి. ఇటీవల ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో బాలకృష్ణ, రాజశేఖర్ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయంపై వైనాట్ స్టూడియోస్ ప్రతినిధులు తమ సంస్థ ట్వీటర్ అకౌంట్ ద్వారా వివరణ ఇచ్చారు. ‘‘విక్రమ్‌వేదా’ తెలుగు రీమేక్‌లో బాలకృష్ణ, రాజశేఖర్ నటించబోతున్నారన్న వార్తల్లో నిజం లేదు. అవి పుకార్లు మాత్రమే. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులు ఇంకా మా వద్దే ఉన్నాయి. మేం అధికారిక ప్రకటన ఇచ్చేంతవరకు ఇలాంటి వార్తలను నమ్మవద్దని కోరుతున్నాం’’ అన్నారు. -
సూపర్ హిట్ రీమేక్‌పై క్లారిటీ
కోలీవుడ్‌లో ఘన విజయం సాధించిన విక్రమ్ వేదా సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల ఈ రీమేక్ ఓకె అయినట్టుగా వార్తలు వినిపించాయి. తమిళ్లో మాదవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించగా తెలుగు వర్షన్లో బాలకృష్ణ, రాజశేఖర్ నటిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై విక్రమ్ వేదా నిర్మాణ సంస్థ వై నాట్ స్టూడియోస్ క్లారిటీ ఇచ్చింది. బాలయ్య, రాజశేఖర్ విక్రమ్ వేదా రీమేక్‌లో నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్నీ పుకార్లని కొట్టిపారేశారు. అంతేకాదు ఇప్పటి వరకు విక్రమ్ వేదా రీమేక్ రైట్స్‌ను ఎవరికీ ఇవ్వలేదన్న వై నాట్ స్టూడియోస్ ప్రతినిధులు, అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండాలని కోరారు. -
‘వై నాట్’ నుంచి మరో సినిమా!
తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో విభిన్న చిత్రాలను తెరకెక్కిస్తున్న సంస్థ వై నాట్. విక్రమ్ వేద, సాలా ఖడ్డూస్( తెలుగులో ‘గురు’)లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు. సక్సెస్ ఫుల్‌గా సినిమాలు నిర్మిస్తున్న ఈ సంస్థ నుంచి మరో ప్రతిష్టాత్మక చిత్రం రానుంది. దీనికి సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. రేపు సాయంత్రం ఐదు గంటలకు ఈ చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తమిళ్, తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్చేస్తున్నారు. -
నేను అలా చేయను!
తమిళసినిమా: సాధారణంగా అయితే నేనలా చేయను అంటోంది నటి శ్రద్ధా శ్రీనాథ్. పుట్టింది జమ్ముకశ్మీర్‌లో అయినా నటిగా మలయాళం, కన్నడం, తమిళం అంటూ చుట్టేస్తోందీ బ్యూటీ. కోహినూర్ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన శ్రద్ధాశ్రీనాథ్‌కు కన్నడ చిత్రం యూటర్న్ బిగ్ టర్నింగ్‌నిచ్చింది. ఆ తరువాత తమిళంలో మాధవన్‌తో రొమాన్స్ చేసిన విక్రమ్ వేదా ఇంకాస్త గుర్తింపును తెచ్చిపెట్టింది. అంతే అక్కడ నుంచి ఈ అమ్మడికి అవకాశాలు వరుస కట్టేస్తున్నాయి. మణిరత్నం దర్శకత్వంలో కాట్రు వెలియిడై చిత్రంలోనూ అతిథి పాత్రలో మెరిసిన శ్రద్ధాశ్రీనాథ్‌కు తాజాగా అరుళ్‌నిధితో రొమాన్స్ చేసే అవకాశం వరించింది. భరత్ నీలకంఠన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటించే అవకాశం ఎలా వచ్చిందన్న ప్రశ్నకు ఈ జాణ బదులిస్తూ ఎస్సీ.సినిమాస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తనను ఎంపిక చేయాలన్న ఆలోచన చిత్ర దర్శక నిర్మాతలకు లేదంది. అనూహ్యంగానే అది జరిగిందని చెప్పింది. దర్శకుడు భరత్ నీలకంఠన్ కథా చర్చలకు బెంగళూర్ వచ్చారని చెప్పింది. అనుకోకుండా ఒక రోజు దర్శకుడి నుంచి తనకు ఫోన్ వచ్చిందని తెలిపింది. సాధారణంగా తాను రాత్రి వేళల్లో కథలను విననంది. అయితే దర్శకుడు బెంగళూర్ వచ్చిన కారణంగా ఒక రోజు రాత్రి ఆయన్ని కలిసి కథ విన్నానని చెప్పింది. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకూ దర్శకుడు కథను వినిపించారని ఆమె ఈ సందర్భంగా తెలిపిం ది. కథలోని ప్రతి సన్నివేశాన్ని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పడంతో అప్పుడే నాకు ఆ చిత్రంలో నటించాలన్న ఆసక్తి కలిగిం దని ఆమె అంది. దీన్ని థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పలేమని, ఇంటెలిజెన్సీ నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత డ్రామాతో కూడిన కథా చిత్రంగా ఉంటుందని ఆమె పేర్కొంది. ఈ చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకుడు భరత్ నీలకంఠన్ ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. అరుళ్‌నిధి, శ్రద్ధాశ్రీనాథ్ వంటి పాపులర్ జంటతో ఈ చిత్రం చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
బాలీవుడ్‌కు కోలీవుడ్ సూపర్ హిట్
విలక్షణ నటులు మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కోలీవుడ్ సూపర్‌హిట్ సినిమా విక్రమ్ వేదా. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో పాటు మాధవన్, విజయ్ సేతుపతి నటనకు ఎన్నో అవార్డులు రివార్డులు తెచ్చిపెట్టింది. ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగులోనే నాగార్జున, రానా, వెంకటేష్ లాంటి స్టార్ల పేర్లు వినిపించినా.. ఇంతవరకు ఫైనల్ కాలేదు. తాజాగా విక్రం వేదా బాలీవుడ్ రీమేక్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ బాలీవుడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ త్వరలో విక్రం వేదా రీమేక్ పట్టాలెక్కనుందని ప్రకటించారు. రిలయన్స్ఎంటర్టైన్మెంట్తో పాటు ప్లాన్ సి స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ ఈ రీమేక్‌ను నిర్మించనున్నాయి. ఒరిజినల్ వర్షన్‌కు దర్శకత్వం వహించిన పుష్కర్ గాయత్రిలే హిందీ వర్షన్‌కు కూడా డైరెక్ట్ చేయనున్నారు. నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. #BreakingNews: #VikramVedha in Hindi... Reliance Entertainment, Plan C Studios [spearheaded by Neeraj Pandey] and Y Not Studios [headed by S Sashikanth] to remake the much-loved Tamil film in Hindi... Pushkar and Gayatri, who directed the original, will direct Hindi remake. — taran adarsh (@taran_adarsh) 15 March 2018 -
రానా, రవితేజల మల్టీ స్టారర్
ఇటీవల కోలీవుడ్ లో ఘన విజయం సాధించిన సినిమా విక్రమ్ వేదా. విలక్షణ నటులు మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించిన ఈ సినిమా కోలీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక పాత్రకు రానాను ఫైనల్ చేయగా మరో పాత్రలో వెంకటేష్, నాగార్జునల పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్ డేట్ ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. ఈ క్రేజీ రీమేక్ లో రానాతో పాటు రవితేజ నటించనున్నాడట. మాధవన్ పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా రానా, విజయ్ సేతుపతి నటించిన క్రిమినల్ పాత్రలో రవితేజ నటించే అవకాశం ఉంది. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన పుష్కర్, గాయత్రిలే తెలుగు వర్షన్ కు దర్శకత్వం వహించే అవకాశం ఉంది. -
టోక్యో ఫిలిం ఫెస్టివల్ కు 'విక్రమ్ వేదా'
విలక్షణ నటులు మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ విక్రమ్ వేదా. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అక్టోబర్ లో జరుగనున్న ప్రతిష్టాత్మక 30వ టోక్యో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో విక్రమ్ వేదా చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. కోలీవుడ్ లో ఏ మాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నిర్మాతలకు కనకవర్షం కురిపించింది. ఈ సినిమాలో మాధవన్ పోలీస్ ఆఫీసర్ గా నటించగా విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్ గా నటించాడు. సినిమా కథా కథనాలతో పాటు క్లైమాక్స్ విషయంలో కూడా చిత్రయూనిట్ కొత్తగా ప్లాన్ చేసింది. ఎలాంటి ముగింపు ఇవ్వకుండా కథను అర్థాంతరంగా ఆపేయటంతో సీక్వల్ నిర్మిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. The big news is here! We are happy to inform that #VikramVedha has been selected at Tokyo International Film Festival. — Y Not Studios (@StudiosYNot) 26 September 2017 -
బ్లాక్‌బస్టర్ రీమేక్‌లో రానా, వెంకటేశ్!
మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా తమిళంలో తెరకెక్కిన 'విక్రమ్ వేధా' సినిమా ఇటీవల విడుదలై బాక్ల్‌బస్టర్ హిట్ దిశగా సాగుతోంది. ఇటు దేశంలోనూ, అటు విదేశాల్లోనూ భారీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా తెలుగులోకి రీమేక్ కానుంది. 'రానా దగ్గుబాటి, వెంకటేష్‌తో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు చర్చలు ప్రారంభించాం. 'విక్రమ్ వేధా' సినిమా విడుదలకు ముందే రీమేక్‌లో వారిని ఫస్ట్ చాయిస్‌గా భావించాం. అయితే, ఇంకా ఏది ఫైనలైజ్ కాలేదు. ఈ ప్రక్రియకు మరికొన్ని నెలల సమయం పట్టవచ్చు' అని చిత్రవర్గాలు ఐఏఎన్ఎస్ వార్తాసంస్థకు తెలిపారు. పుష్కర్ గాయత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 40 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. గతవారం విడుదలైన ఈ సినిమా ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. విక్రమ్ భేతాళ్ జానపద కథల స్ఫూర్తితో పోలీసు-గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఈ సినిమాలో మాధవన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటించగా.. విజయ్ సేతుపతి గ్యాంగ్‌స్టర్‌గా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. -
'విక్రమ్ వేదా' టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్
-
'విక్రమ్ వేదా' టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్
కోలీవుడ్ స్టార్ హీరోలు మాధవన్, విజయ్ సేతుపతిలు లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న చిత్రం విక్రమ్ వేదా. ఇద్దరూ డిఫరెంట్ క్యారెక్టర్స్‌ను ఎంచుకునే నటులు కావటంతో వారి నుంచి ఎలాంటి చిత్రం రాబోతుందో అన్ని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో విక్రమ్ వేదా టీజర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు అందుకునే స్థాయిలో థ్రిల్లింగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు విక్రమ్ వేదా టీం. ఈ సినిమాలో మాధవన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా, విజయ్ సేతుపతి క్రూరమైన విలన్‌గా కనిపిస్తున్నాడు. ఈ రెండు పాత్రల మధ్య జరిగే పోరాటమే సినిమా కథగా తెలుస్తోంది. టీజర్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్న చిత్రయూనిట్ సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్‌లతో ఆకట్టుకుంది.