
సుమారు 20 ఏళ్ల తర్వాత హృతిక్ రోషన్‌తో కలిసి నటించాడు సైఫ్ అలీ ఖాన్. వీరిద్దరూ కలిసి నటించిన విక్రమ్ వేద ఇటీవలే రిలీజైన విషయం తెలిసిందే! ఇందులో పోలీస్ విక్రమ్‌గా సైఫ్, గ్యాంగ్‌స్టర్ వేదగా హృతిక్ నటించారు. తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'హృతిక్‌తో కలిసి పని చేయడం మర్చిపోలేని అనుభూతి. అతడితో కలిసి బాగా నటించాలనుకున్నా.
సాధారణంగా కెమెరా ముందుకు వచ్చినప్పుడు నేను ఎవ్వరినీ పట్టించుకోను. కానీ ఈ హీరో ఉన్నప్పుడు మాత్రం కచ్చితంగా అందరి దృష్టి అతడివైపే మళ్లేది. దీంతో అతడితో పని చేస్తే మీ పని ఖతమే, మీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. కాబట్టి అతడితో కలిసి నటించకపోతే మంచిదంటూ కొన్ని కథనాలు వెలువడ్డాయి. వాటిని నేను గౌరవిస్తాను. అతడితో కలిసి నటించడం గొప్ప విజయంగా భావిస్తాను' అని చెప్పుకొచ్చాడు. కాగా ఆర్ మాధవన్, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో నటించిన తమిళ చిత్రం విక్రమ్ వేదకు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న రిలీజైంది.
చదవండి: ఆస్పత్రిలో ఖుష్బూ, ఏమైందంటే?
ఆ హీరోయిన్‌తో ప్రేమాయణం నడిపి బిగ్‌బాస్ కంటెస్టెంట్
Comments
Please login to add a commentAdd a comment