బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీలో రీమేక్‌గా వచ్చిన విక్రమ్ వేద, జెర్సీ సినిమాలు సక్సెస్ కాకపోవడంపై మాట్లాడారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ నటించిన ఈ సినిమాలు ఫెయిల్యూర్ కావడానికి గల కారణాలను వివరించారు. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సౌత్ డబ్బింగ్ చిత్రాలు కొన్ని మాత్రమే ఎందుకు హిట్ అవుతున్నాయన్న విషయంపై ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
బోనీ కపూర్ మాట్లాడుతూ..'కొన్ని దక్షిణాది చిత్రాల హిందీ రీమేక్ సినిమాలు సక్సెస్ కాకపోవడానికి కారణం కాపీ-పేస్ట్ చేయడం. విక్రమ్ వేద, జెర్సీ మూవీలకు కనీసం టైటిల్స్ కూడా మార్చలేదు. అలాగే సౌత్ సినిమాలను రీమేక్ చేసేటప్పుడు హిందీ ప్రేక్షకులకు తగ్గట్లుగా నార్త్ ఇండియన్ సంస్కృతిని జోడించాలి. అప్పుడు పాన్ ఇండియా అంగీకరించే సినిమా తీయాలి.' అని అన్నారు.
విక్రమ్ వేద భారతీయ జానపద కథ విక్రమ్ ఔర్ బేతాల్ ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా అదే పేరుతో తమిళంలో విడుదలైంది. ఈ చిత్రంలో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. జెర్సీ మూవీ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఇది టాలీవుడ్‌లో నాని హీరోగా నటించిన చిత్రానికి రీమేక్. షాహిద్ కపూర్ తన కొడుకు కోరిక కోసం ఆటలోకి తిరిగి వచ్చే మాజీ క్రికెటర్ పాత్రను పోషించాడు. ప్రస్తుతం బోనీ కపూర్ మలయాళ చిత్రం హెలెన్‌కి బాలీవుడ్ రీమేక్‌తో వస్తున్నాడు. ఈ చిత్రానికి మిలీ అని పేరు పెట్టారు. అతని కుమార్తె జాన్వీ కపూర్ ఈ మూవీలో టైటిల్ రోల్‌లో నటించింది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ నవంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment