jersey
-
PR Sreejesh: జెర్సీ నంబర్ 16కు వీడ్కోలు
న్యూఢిల్లీ: భారత దిగ్గజ గోల్‌కీపర్ శ్రీజేశ్ ఇకపై హాకీ మైదానంలో కనిపించడు. అలాగే అతని జెర్సీ నంబర్ 16 కూడా కనిపించదు. గోల్‌పోస్ట్ ముందు ప్రత్యర్థులకు అడ్డుగోడలా నిలబడి భారత జట్టుకు విశేష సేవలందించిన శ్రీజేశ్ ఘనకీర్తికి గుర్తుగా ఆ జెర్సీకి అతనితోపాటే రిటైర్మెంట్ ఇవ్వాలని హాకీ ఇండియా (హెచ్ఐ) నిర్ణయించింది. బుధవారం ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జట్టు సభ్యులను ఘనంగా సన్మానించారు. శ్రీజేశ్కు రూ. 25 లక్షల నగదు పురస్కారం చెక్ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్ టిరీ్క, భోళానాథ్ సింగ్‌లు మాట్లాడుతూ శ్రీజేశ్‌ను ఆకాశానికెత్తారు. ఆధునిక భారత హాకీకి అతనొక దేవుడని కితాబిచ్చారు. భారత సీనియర్ పురుషుల జట్టులో 16వ నంబర్ జెర్సీని ఎవరికీ కేటాయించబోమని భోళానాథ్ చెప్పారు. ‘శ్రీజేశ్ త్వరలోనే జూనియర్ భారత జట్టు కోచ్‌గా వెళతారు. ఘనమైన కెరీర్‌కు అతను వీడ్కోలు పలికితే ... హాకీ ఇండియా అతని ఘనకీర్తికి గుర్తుగా జెర్సీ నంబర్ 16కు రిటైర్మెంట్ ఇచ్చింది. అయితే ఇది సీనియర్ స్థాయికే పరిమితం. జూనియర్ జట్టులో 16వ జెర్సీ యథాతథంగా కొనసాగుతుంది’ అని ఆయన వివరించారు. -
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
-
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
టీ20 వరల్డ్‌కప్-2024 ప్రారంభానికి మరో ఐదు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఈ మెగా ఈవెంట్‌కు సమయం దగ్గరపడతుండడంతో క్రికెట్ బోర్డులు ఒక్కొక్కటిగా తమ జట్ల జెర్సీలను రిలీజ్ చేస్తున్నాయి.ఈ క్రమంలో టీమిండియా వరల్డ్‌కప్ జెర్సీని బీసీసీఐ రివీల్ చేసింది. భారత క్రికెట్ జట్టు అధికారిక స్పాన్సర్ అడిడాస్ జెర్సీ రిలీజ్‌కు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసింది.టీమిండియా జెర్సీలో.. వీ షేప్ నెక్కి ట్రై కలర్ స్ట్రిప్స్ ఉన్నాయి. ఈసారి జెర్సీలో బ్లూతో పాటు కాషాయం రంగు కూడా ఉంది. అడిడాస్‌కి చెందిన లోగో.. జెర్సీ కుడివైపు ఉంది.బీసీసీఐ లోగో ఎడమవైపు ఉంది. అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు జెర్సీ బాగొలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో జూన్5 న ఐర్లాండ్‌తో తలపడనుంది.ఇక పొట్టి ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. ఈ జట్టులో కేఎల్ రాహుల్, రింకూ సింగ్, శుబ్‌మన్ గిల్ వంటి స్టార్ క్రికెటర్లకు చోటు దక్కలేదు.టీ20 వరల్డ్ కప్ భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హర్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వీ జైశ్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్,రిషభ్ పంత్, సంజూ శాంసన్ , శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేందర్ చాహల్, ఆర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.రిజర్వ్ ఆటగాళ్లు: శుభ్‌మాన్ గిల్, రింకు సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ View this post on Instagram A post shared by adidas India (@adidasindia) -
నేను లేనుగా.. ఎవరితో చేస్తారో చేసుకోండి: నాని
ప్రస్తుతం అంతా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. 'పుష్ప 2', 'సలార్ 2'.. ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడన్ని మూవీస్ లైన్లో ఉన్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలే కాదు మ్యాడ్ 2, ప్రేమలు 2 లాంటివి కూడా సెట్స్‌పైకి వెళ్లాయి. దీంతో ఆటోమేటిక్‌గా హిట్, బ్లాక్ బస్టర్ సినిమాలకు కూడా సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అలాంటి రిక్వెస్ట్ హీరో నానికి ఎదురైంది. దీనికి అతడు ఇచ్చిన సమాధానం కూడా అంతే ఆసక్తికరంగా అనిపించింది. (ఇదీ చదవండి: పెళ్లి న్యూస్‌తో షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. హల్దీ వీడియో వైరల్) నేచురల్ స్టార్ నాని కెరీర్లో బెస్ట్ మూవీ అంటే 'జెర్సీ' అని చెప్పొచ్చు. క్రికెట్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన ఈ చిత్రం ఎలాంటి కమర్షియల్ అంశాలు లేనప్పటికీ అద్భుతమైన హిట్‌గా నిలిచింది. ప్రేక్షకుల ముందుకొచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చిత్రాన్ని రీసెంట్గా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో రీ రిలీజ్ చేశారు. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే 'జెర్సీ' మూవీకి సీక్వెల్ కావాలని నానికి అభిమానుల నుంచి రిక్వెస్ట్ వచ్చింది. తాజాగా 'ఆ ఒక్కటి అడక్కు' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న నానికి ఈ ప్రశ్న ఎదురైంది. దీంతో.. 'నేను లేనుగా, ఎవరితో చేస్తారో చేసుకోండి' అని నాని సమాధానమిచ్చాడు. నాని చెప్పిన దానిబట్టి చూస్తే 'జెర్సీ' సీక్వెల్ కష్టమే. ఎందుకంటే సినిమాలో నాని పాత్ర చనిపోతుంది. ఒకవేళ సీక్వెల్ తీయాలన్నా ఈ పాత్ర లేకుండా సాధ్యం అవుతుందా లేదా దర్శకుడికే తెలియాలి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ రెండు కాస్త స్పెషల్) -
IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీ ఎలా ఉందో చూడండి..!
త్వరలో (మార్చి 22) ప్రారంభంకానున్న ఐపీఎల్ 2024 ఎడిషన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీని ఇవాళ (మార్చి 7) విడుదల చేసింది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి జెర్సీ కొంచం కొత్తగా కనిపిస్తుంది. కొత్త జెర్సీతో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఫోటోలకు పోజులిచ్చాడు. కొత్త జెర్సీ విషయాన్ని రివీల్ చేస్తూ భువీ ఫోటోనే సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. హైదరాబాద్ వేడిని బయటపెట్టడానికి సిద్దం.. ఐపీఎల్ 2024 కోసం మా జ్వలించే కవచం అంటూ క్యాప్షన్లు జోడించింది. సన్‌రైజర్స్ కొత్త జెర్సీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయగలరు. Ready to unleash the fiery heat of Hyderabad 🔥 Our 🆕 blazing armour for #IPL2024 🧡 #PlayWithFire pic.twitter.com/mMQ5SMQH6O — SunRisers Hyderabad (@SunRisers) March 7, 2024 ఇదిలా ఉంటే, రానున్న ఐపీఎల్ సీజన్ కోసం ఆరెంజ్ ఆర్మీ ఇదివరకే సన్నాహకాలను మొదలుపెట్టింది. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ప్రాక్టీస్‌ను షురూ చేసింది. మిగిలిన ఆటగాళ్లు కూడా ఒక్కొక్కరుగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్‌కు చేరుకుంటున్నారు. ఈ సీజన్‌కు సంబంధించిన తొలి విడత షెడ్యూల్ ఇదివరకే విడుదలైంది. ఈ విడతలో సన్‌రైజర్స్ నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. 𝑺𝒑𝒊𝒏𝒏𝒊𝒏𝒈 things around a little with this #FlameComing 💫 Welcome back home, Mayank 🧡 pic.twitter.com/LduWWXa89n — SunRisers Hyderabad (@SunRisers) March 6, 2024 #FlameComing season just got better with the O̶G̶ AG 🔥 Welcome home, Mayank 🧡 pic.twitter.com/uOyYxiTl1u — SunRisers Hyderabad (@SunRisers) March 6, 2024 ఎస్ఆర్హెచ్ టీమ్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌ను మార్చి 23వ తేదీన ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ లోకల్ టీమ్ కేకేఆర్‌ను ఢీకొంటుంది. మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో, మార్చి 31 గుజరాత్ టైటాన్స్‌తో, ఏప్రిల్ 5 చెన్నై సూపర్‌కింగ్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. వీటిలో ముంబై ఇండియన్స్, సీఎస్కే మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగనుండగా.. గుజరాత్‌తో మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. First team huddle of the season at Uppal ft. a whole lotta orange 🥹🧡 pic.twitter.com/JV4dvzwicE — SunRisers Hyderabad (@SunRisers) March 5, 2024 కొద్ది రోజుల కిందటే సన్‌రైజర్స్ యాజమాన్యం పాత కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ను తప్పించి పాట్ కమిన్స్‌ను నూతన కెప్టెన్‌గా ఎంపిక చేసింది. కమిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ ఈ సీజన్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో సన్‌రైజర్స్ టీమ్ చాలా పటిష్టంగా కనిపిస్తుంది. అన్ని విభాగాల్లో అగ్రశ్రేణి ఆటగాళ్లతో కళకళలాడుతుంది. సన్‌రైజర్స్ జట్టు వివరాలు.. అబ్దుల్ సమద్ బ్యాటర్ 4 కోట్లు రాహుల్ త్రిపాఠి బ్యాటర్ 8.5 కోట్లు ఎయిడెన్ మార్క్రమ్ బ్యాటర్ 2.6 కోట్లు గ్లెన్ ఫిలిప్స్ బ్యాటర్ 1.5 కోట్లు హెన్రిచ్ క్లాసెన్ బ్యాటర్ 5.25 కోట్లు మయాంక్ అగర్వాల్ బ్యాటర్ 8.25 కోట్లు ట్రావిస్ హెడ్ బ్యాటర్ 6.8 కోట్లు అన్మోల్ప్రీత్ సింగ్ బ్యాటర్ 20 లక్షలు ఉపేంద్ర యాదవ్ వికెట్ కీపర్ 25 లక్షలు షాబాజ్ అహ్మద్ ఆల్ రౌండర్ 2.4 కోట్లు నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ 20 లక్షలు అభిషేక్ శర్మ ఆల్ రౌండర్ 6.5 కోట్లు మార్కో జాన్సెన్ ఆల్ రౌండర్ 4.2 కోట్లు వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ 8.75 కోట్లు సన్వీర్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు పాట్ కమిన్స్ బౌలర్ 20.5 కోట్లు (కెప్టెన్) భువనేశ్వర్ కుమార్ బౌలర్ 4.2 కోట్లు టి నటరాజన్ బౌలర్ 4 కోట్లు వనిందు హసరంగా బౌలర్ 1.5 కోట్లు మయాంక్ మార్కండే బౌలర్ 50 లక్షలు ఉమ్రాన్ మాలిక్ బౌలర్ 4 కోట్లు ఫజల్హాక్ ఫరూకీ బౌలర్ 50 లక్షలు జయదేవ్ ఉనద్కత్ బౌలర్ 1.6 కోట్లు ఆకాశ్ సింగ్ బౌలర్ 20 లక్షలు ఝటావేద్ సుబ్రమణ్యం బౌలర్ 20 లక్షలు -
'జెర్సీ' హీరోయిన్ పచ్చబొట్టు కహానీ.. 18 ఏళ్లప్పుడు ప్రేమ.. అందుకే ఇప్పటికీ!
చాలామంది ఒంటిపై పచ్చబొట్టు చూస్తూనే ఉంటాం. దీన్ని ఇప్పటి జనరేషన్ స్టైల్‌గా టాటూ అంటున్నారు. అయితే ఒక్కో టాటూ వెనుక ఒక్కో స్టోరీ ఉంటుంది. దాన్ని సదరు వ్యక్తులు బయటపెడితే గానీ తెలియదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇందులో మినహాయింపు ఏం కాదు. ఇప్పుడు కూడా ఓ యంగ్ హీరోయిన్.. అలా తన ఎదపై ఉన్న పచ్చబొట్టు మీనింగ్, అసలు ఇది ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?) శ్రద్ధా శ్రీనాథ్.. స్వతహాగా కన్నడ బ్యూటీ. 2015లో ఓ మలయాళ మూవీతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత కన్నడ, తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో తెలుగులో నాని 'జెర్సీ'లో హీరోయిన్గా చేసి మన ప్రేక్షకులకు కూడా దగ్గరైపోయింది. డిఫరెంట్ పాత్రలు చేస్తూ క్రేజ్ పెంచుకున్న ఈ భామ.. వెంకటేశ్ 'సైంధవ్'లో యాక్ట్ చేసింది. ఇది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. తాజాగా 'సైంధవ్' సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న శ్రద్ధా శ్రీనాథ్.. మిగతా విషయాలతో పాటు తన ఎదపై ఉన్న టాటూ సీక్రెట్ కూడా చెప్పింది. 18 ఏళ్ల వయసులో ఓ అబ్బాయి అంటే తనకు క్రష్ ఉండేదని, అతడి ద్వారా తనకు బీటల్స్ బ్యాండ్ గురించి తెలిసిందని చెప్పుకొచ్చింది. లవ్ అని అర్థమొచ్చేలా ఉన్న ఈ టాటూని అప్పట్లోనే క్రష్ కోసం వేసుకున్నానని అసలు సంగతి చెప్పింది. అయితే ఆ అబ్బాయి ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. సో శ్రద్ధా శ్రీనాథ్ టాటూ సీక్రెట్ అదనమాట. (ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) -
ధోని జెర్సీ నంబర్ ‘7’కు రిటైర్మెంట్: బీసీసీఐ
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, రెండు ప్రపంచకప్‌లను గెలిపించిన సారథి మహేంద్ర సింగ్ ధోనిపై బీసీసీఐ సముచిత గౌరవం ప్రదర్శించింది. అతను మైదానంలో ధరించిన ‘7’ నంబర్ జెర్సీకి కూడా రిటైర్మెంట్ ఇస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. దిగ్గజ క్రికెటర్‌గా భారత క్రికెట్‌కు ధోని చేసిన సేవలకు గుర్తిస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. దీని ప్రకారం ఇకపై భారత క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించే ఏ ఆటగాడు కూడా తమ జెర్సీపై ‘7’ నంబర్ వాడేందుకు బోర్డు అనుమతించదు. గతంలో ఆల్‌టైమ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ గౌరవార్ధం కూడా అతను ధరించిన ‘10’ నంబర్‌కు కూడా బీసీసీఐ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించింది. సచిన్ తప్పుకున్న తర్వాత ఒకే ఒకసారి ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ ‘10’ నంబర్ జెర్సీని వేసుకోగా అభిమానుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. దాంతో అతను తన నంబర్‌ను మార్చుకోవాల్సి వచ్చింది. జెర్సీ నంబర్లకు రిటైర్మెంట్ ప్రకటించడం ఇతర క్రీడల్లో చాలా కాలంగా ఉంది. బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ వేసుకున్న ‘23’ నంబర్‌ను కూడా అతని కెరీర్ తర్వాత చికాగో బుల్స్ టీమ్ రిటైర్మెంట్ ఇచ్చింది. -
అది మెస్సీ క్రేజ్.. జెర్సీల విలువ 64 కోట్ల పై మాటే..!
ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విశ్వవ్యాప్తంగా ఈ స్టార్ ఫుట్‌బాలర్‌కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మెస్సీ ప్రపంచంలో ఏ మూలలో ఫుట్‌బాల్ ఆడినా ఇసకేస్తే రాలనంత మంది జనాలు స్టేడియాలకు తరలి వస్తారు. అతను ధరించే బ్రాండ్లు, అతని ఎండార్స్మెంట్ల రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది. తాజాగా మెస్సీ ధరించిన జెర్సీలను ఆన్లైన్లో వేలానికి పెట్టగా కళ్లు బైర్లు కమ్మే మొత్తానికి అవి అమ్ముడుపోయాయి. గతేడాది ఖతర్ వేదికగా జరిగిన ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను న్యూయార్క్‌లో ఆన్లైన్ వేలానికి పెట్టగా.. ఓ అజ్ఞాత అభిమాని ఏకంగా 78 లక్షల డాలర్లకు (రూ. 64 కోట్ల 86 లక్షలు) ఆ ఆరు జెర్సీలను సొంతం చేసుకున్నాడు. ఇంత పెద్ద మొత్తంలో ఓ వ్యక్తి ధరించిన జెర్సీలు అమ్ముడుపోవడం క్రీడల చరిత్రలో ఇదే మొదటిసారి అయ్యుంటుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి, మూడోసారి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో మెస్సీ రెండు గోల్స్ సాధించి అర్జెంటీనాను ఒంటిచేత్తో గెలిపించాడు. -
‘జెర్సీ’భామ సినీ జర్నీ..ఎల్ఎల్బీ పట్టా పొంది సినిమాల్లోకి
శ్రద్ధా శ్రీనాథ్.. ‘జెర్సీ’తో తెలుగు తెర మీద మెరిసింది.. మెప్పించింది. తన నటనతోదక్షిణాదిన అన్ని భాషల్లో ఇటు వెండితెరనూ అటు వెబ్తెరనూ మెరిపిస్తోంది. ఆ తార గురించి కొన్ని విషయాలు.. ► శ్రద్ధా జన్మస్థలం.. జమ్మూ – కశ్మీర్‌లోని ఉధమ్‌పూర్. నాన్న.. ఆర్మీ ఆఫీసర్, అమ్మ టీచర్. బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్‌లో ఎల్ఎల్బీ పట్టా పుచ్చుకుంది. ► చదువు పూర్తయ్యాక కొద్ది రోజులు రియల్ ఎస్టేట్ రంగంలో లీగల్ అడ్వయిజర్‌గా పనిచేసింది. ► అనుకోకుండా నటించిన ఓ కమర్షియల్ యాడ్ అమెను ఒక కన్నడ చిత్రం ఆడిషన్స్‌కి వెళ్లేలా చేసింది. దానికి ఆమె సెలెక్ట్ కాలేదు కానీ ఆ ప్రయత్నం మాత్రం యాక్టింగ్ కెరీర్‌ను ఆమె సీరియస్‌గా తీసుకునేలా చేసింది. ► ‘కోహినూర్’ అనే మలయాళ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. తర్వాత కన్నడ ‘యూటర్న్’లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌నూ అందుకుంది. ► తమిళ, కన్నడ సినిమాల్లో ఎక్కువగా నటించే శ్రద్ధా శ్రీనాథ్.. ‘జెర్సీ’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ లోనూ నటించింది. ► నటనావకాశాలు తప్ప దాని ప్లాట్‌ఫామ్స్ గురించి శ్రద్ధ పెద్దగా ఆలోచించడం లేదు. అందుకే వెబ్‌తెర చాన్స్లనూ అందిపుచ్చుకుంటోంది. అలా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ‘ఇరుగప్పట్రు’, సోనీ లివ్ ‘విట్నెస్’ లతో అలరిస్తోంది. తను నటించిన ‘సైంధవ్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. టూర్స్ చేయడం చాలా ఇష్టం. అలా వెళ్లినప్పుడల్లా అక్కడేదైనా కొత్త పని నేర్చుకుంటూంటా! ఈ మధ్య హాలిడే కోసం ఓ రిసార్ట్‌కు వెళ్లినప్పుడు.. అక్కడ కుండలు తయారు చేయడం నేర్చుకున్నా: శ్రద్ధా శ్రీనాథ్ -
కోహ్లి... నీకో బహుమతి: సచిన్
అహ్మదాబాద్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో తన 49 సెంచరీల రికార్డును చెరిపేసిన కింగ్ కోహ్లికి అమూల్యమైన బహుమతిని బహూకరించాడు. 24 ఏళ్ల కెరీర్లో తన 10 నంబర్ జెర్సీ అంతర్జాతీయ క్రికెట్లో లిఖించిన చరిత్ర అందరికీ తెలిసిందే. ఫైనల్‌కు ముందు సచిన్ స్వయంగా చేసిన ఆటోగ్రాఫ్ జెర్సీని కోహ్లికి అందజేశాడు. ఈ జెర్సీని సచిన్ 2012లో జరిగిన ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఆఖరి వన్డే సందర్భంగా ధరించాడు. ‘ఈ ప్రత్యేక సందర్భంలో ప్రత్యేక అనుభూతినిచ్చే గిఫ్ట్‌ను సచిన్... విరాట్‌కు అందజేశాడు’ అని బీసీసీఐ సచిన్, కోహ్లిల ఫోటోతో పోస్ట్ చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 50వ సెంచరీతో సచిన్ రికార్డు (49)ను బద్దలు కొట్టాడు. -
క్రికెట్ నేపథ్యంలో హిట్ కొట్టిన సినిమాలు.. ఈ ఓటీటీలలో చూడొచ్చు
వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత్ సత్తా చాటి మరికొన్ని గంటల్లో నేడు ఆస్ట్రేలియాతో ఫైనల్ ఫైట్‌కు రెడీ అయింది. లీగ్ దశలో పరాజయమే లేకుండా విజయ పరంపరతో కొనసాగిన భారత జట్టు.. అదే దూకుడుతో ఫైనల్ మ్యాచ్‌లోనూ వీర విజృంభణతో దూసుకెళ్లి కప్ సాధించాలని కోట్లాది మంది భారతీయులు ఆశిస్తున్నారు. అహ్మదాబాద్ వేదికగా నేటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు విద్యార్థులు, ఉద్యోగులూ, వ్యాపారులూ, సినీ సెలబ్రెటీలు తదితర క్రికెట్ క్రీడాభిమానులంతా సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన కొన్ని సూపర్ హిట్ సినిమాలను గుర్తుచేసుకుంటున్నారు. ఆ సినిమాలో ఏ ఓటీటీలో ఉన్నాయో అని తెగ వెతుకుతున్నారు. సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ 2017లో 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' అనే చిత్రాన్ని జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వం వహించారు. భారతీయ త్రిభాషా డాక్యుమెంటరీ స్పోర్ట్స్ చిత్రంగా తెరకెక్కించారు. 200 నాటౌట్ ప్రొడక్షన్స్, కార్నివాల్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా రవి భాగ్చంద్కా, శ్రీకాంత్ భాసీ నిర్మించారు . ఈ చిత్రం భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జీవితంపై రూపొందించిన డాక్యుమెంటరీ.ఇది టెండూల్కర్ క్రికెట్, వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా చూపించారు. అలాగే అతని జీవితంలో ఇంతకు ముందెన్నడూ వినని లేదా చూడని కొన్ని అంశాలను కూడా ఈ చిత్రంలో చూడవచ్చు. ఇందులో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్ కూడా కొన్ని సీన్స్‌లలో కనిపిస్తారు. ఈ చిత్రం చూడాలనుకుంటే సోనీ లైవ్‌లో అందుబాటులో ఉంది. MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ 2016లో MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రం విడుదలైంది. ధోని బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. నీరజ్ పాండే రచించి దర్శకత్వం వహించారు. భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితం ఆధారంగారూపొందించబడింది. ఈ చిత్రంలో MS ధోనిగా దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించారు , వీరితో పాటు దిశా పటానీ , కియారా అద్వానీ, అనుపమ్ ఖేర్ నటించారు. ఈ చిత్రం ధోని చిన్నప్పటి నుంచి జీవితంలోని అనేక సంఘటనల ద్వారా అతని జీవితాన్ని వివరిస్తుంది. ధోనీ అంగీకారంతో ఈ సినిమా మొదలైంది. 61 దేశాలలో ఈ సినిమా విడుదలైంది. వాణిజ్యపరంగా ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇది 2016లో అత్యధిక వసూళ్లు చేసిన ఐదవ బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా రూ. 215.48 కోట్లు వసూలు చేసిన ఆరవ భారతీయ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను చూడాలనుకుంటే.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉచితంగానే చూడొచ్చు. 800 ముత్తయ్య మురళీధరన్ 2023లో తెలుగులో ఈ సినిమా విడుదలైంది. శ్రీలంక స్టార్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రంగాచారి నిర్మించిన ఈ సినిమాకు ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించగా శ్రీదేవి మూవీస్ పై శివలెంక కృష్ణప్రసాద్ దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేశాడు. మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 6న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్స్ తీసిన ఏకైక బౌలర్‌గా ముత్తయ్య మురళీధరన్ ఉన్నారు. అందుకే ఈ చిత్రానికి 800 అనే టైటిల్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 2 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. 'ఆజార్' 2016లో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా 'ఆజార్' అనే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టోనీ డిసౌజా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ద్వారా శోభా కపూర్, ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇమ్రాన్ హష్మీ టైటిల్ రోల్లో సూపర్‌గా మెప్పించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 13 మే 2016న విడుదలైంది . అజార్ జీవితంలో మ్యాచ్ ఫిక్సింగ్, వివాహేతర సంబంధం వంటి అంశాలపై కూడా ఈ చిత్రంలో క్లారిటీ ఇచ్చారు. అజార్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమాలో ఇవే ► నాని నటించిన జెర్సీ ZEE5లో స్ట్రీమింగ్ అవుతుంది. ► గోల్కోండ హైస్కూల్ (సన్‌నెక్ట్స్) ► కౌసల్య కృష్ణమూర్తి (సన్‌నెక్ట్స్) ► విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' (అమెజాన్,డిస్నీ హాట్‌స్టార్) ► నాగచైతన్య 'మజిలీ' (అమెజాన్ ప్రైమ్ వీడియో) ► వెంకటేష్ 'వసంతం' (డిస్నీ హాట్‌స్టార్) ► లగాన్ హిందీ (నెట్‌ఫ్లిక్స్) -
కోహ్లి ‘జెర్సీ’ మారింది!
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి కాస్త గందరగోళానికి కేంద్రంగా మారాడు. మైదానంలోకి దిగినప్పుడు అతను వేసుకున్న జెర్సీ సహచరుల జెర్సీకంటే భిన్నంగా ఉండటంతో సమస్య మొదలైంది. సాధారణంగా టీమ్ కిట్ స్పాన్సర్ ‘అడిడాస్’కు సంబంధించిన మూడు అడ్డగీతలు మన ఆటగాళ్ల జెర్సీల భుజాలపై తెల్ల రంగులో కనిపిస్తాయి. కానీ వరల్డ్ కప్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన జెర్సీపై త్రివర్ణ పతాకాన్ని పోలిన రంగులతో ఈ గీతలు కనిపిస్తాయి. అయితే కోహ్లి తెలుపు గీతల టీ షర్ట్‌తోనే వచ్చేశాడు. ఆరు ఓవర్లు ముగిసేవరకు దీనిని ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత విషయం తెలియడంతో కోహ్లి ఏడో ఓవర్లో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి జెర్సీని మార్చుకొని తర్వాతి ఓవర్లో గ్రౌండ్లోకి వచ్చాడు. -
CWC 2023: కొత్త ట్రైనింగ్ కిట్‌లో టీమిండియా.. ఎలా ఉందో చెప్పండి..!
2023 వరల్డ్‌కప్ ప్రాక్టీస్ సెషన్‌ను టీమిండియా కొత్త ట్రైనింగ్ కిట్ ధరించి ప్రారంభించింది. మెగా టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్ (అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో) కోసం ఇదివరకే చెన్నైకు చేరుకున్న రోహిత్ సేన.. కొత్త ట్రైనింగ్ కిట్‌లో నిన్నటి నుంచి ప్రాక్టీస్ చేస్తుంది. డ్రీమ్11 స్పాన్సర్ చేసిన ఈ కొత్త ట్రైనింగ్ కిట్ ఆరెంజ్ కలర్లో ఉంది. టీమిండియా రెగ్యులర్ జెర్సీల తరహాలోనే ఈ కిట్ భుజాలపై కూడా మూడు స్ట్రైప్స్ ఉన్నాయి. Team India is sporting a new practice jersey🧡🤩 📸: Disney + Hotstar pic.twitter.com/MRPe4SceOc — CricTracker (@Cricketracker) October 5, 2023 looks like boys in the orange jersey are ready to deliver (the world cup) 😉 https://t.co/x8ePswD5zn — Swiggy (@Swiggy) October 5, 2023 Indian team in new Practice Jersey. pic.twitter.com/x8ToDJUiHy — Johns. (@CricCrazyJohns) October 5, 2023 అలాగే కుడివైపు ఛాతిపై అడిడాస్ లోగో, ఎడమవైపు బీసీసీఐ ఎంబ్లెం ఉంది. ఆరెంజ్ కిట్‌లో కొత్తగా కనిపించిన టీమిండియాను చూసి భారత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెరైటీ కలర్లో టీమిండియా ఆటగాళ్లు చూడముచ్చటగా ఉన్నారని అనుకుంటున్నారు. జెర్సీ కలర్‌తో సంబంధం లేదు, ఈసారి వరల్డ్‌కప్ మనదే అంటూ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. కొత్త ట్రైనింగ్ కిట్‌లో విరాట్ కోహ్లి తదితర టీమిండియా ఆటగాళ్ల ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. Virat Kohli giving autographs to fans in Chennai. pic.twitter.com/20wHetv8xH — Mufaddal Vohra (@mufaddal_vohra) October 5, 2023 ఇదిలా ఉంటే, 2023 వరల్డ్‌కప్ ఇవాల్టి (అక్టోబర్ 5) ప్రారంభమైన విషయం తెలిసిందే. టోర్నీ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ 30 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (33), డేవిడ్ మలాన్ (14), హ్యారీ బ్రూక్ (25), మొయిన్ అలీ (11) ఔట్ కాగా.. జో రూట్ (50), జోస్ బట్లర్ (30) క్రీజ్‌లో ఉన్నారు. మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టారు. -
టీమిండియా వరల్డ్‌కప్ జెర్సీలో మార్పులు.. తేడా గమనించారా..?
భారత క్రికెట్ జట్టు ఇటీవలే అన్ని ఫార్మాట్లలో జెర్సీలను మార్చిన విషయం తెలిసిందే. కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అడిడాస్ వచ్చాక భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టుకు కూడా మూడు ఫార్మాట్లలో వేర్వేరు జెర్సీలను రూపొందించింది. టీ20ల్లో కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్ జెర్సీ, వన్డేల్లో కాలర్‌తో లైట్ బ్లూ కలర్ జెర్సీ, టెస్ట్‌ల్లో వైట్ కలర్ జెర్సీలను అడిడాస్ ప్రవేశపెట్టింది. జెర్సీలపై కుడివైపు తమ (అడిడాస్) లోగోను, ఎడమవైపు టీమ్ లోగో, దానిపై మూడు నక్షత్రాలు, మధ్యలో లీడ్ స్పాన్సర్ డ్రీమ్ 11 పేరు, దాని కింద కాస్త పెద్ద అక్షరాలతో ఇండియా అని ఉంటుంది. జెర్సీపై భుజాల భాగంలో మూడు తెలుపు రంగు అడ్డ గీతలు ఉంటాయి. Indian team jersey for World Cup 2023. pic.twitter.com/q1EYsZebEK — Johns. (@CricCrazyJohns) September 20, 2023 కాగా, వరల్డ్‌కప్ నేపథ్యంలో అడిడాస్ కంపెనీ జెర్సీలో స్వల్ప మార్పులు చేసింది. భుజాలపై ఉన్న మూడు అడ్డ గీతలపై తెలుపు రంగు స్థానంలో తివర్ణ పతాకంలోని మూడు రంగులను (కాషాయం, తెలుపు, ఆకుపచ్చ) ముద్రించింది. అలాగే టీమ్ లోగోపై ఉన్న మూడు నక్షత్రాలను రెండుగా కుదించింది. రెండు నక్షత్రాలు భారత్ రెండు వన్డే వరల్డ్‌కప్‌లు (1983, 2011) గెలిచిన దానికి ప్రతీక అని పేర్కొంది. టీమిండియా కొత్త జెర్సీపై భారతీయత ఉట్టిపడటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తివర్ణంతో కూడిన జెర్సీతో టీమిండియా వరల్డ్‌కప్ గెలవడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. ఆటగాళ్లు కొత్త జెర్సీ ధరించి రూపొందించిన వీడియో అద్భుతమని అంటున్నారు. పాత జెర్సీతో పోలిస్తే, ఇది చాలా కలర్ఫుల్గా ఉందని అంటున్నారు. -
తొలి వన్డే.. సంజూ శాంసన్‌కు చోటు, ఇషాన్‌కు మొండిచెయ్యేనా!
వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియాకు రెండో టెస్టులో విజయం రాకుండా వరుణుడు అడ్డుపడ్డాడు. మొత్తానికి 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన కోహ్లి సెంచరీతో మెరిసి ఎప్పటికి గుర్తుండిపోయేలా చేసుకున్నాడు. డ్రా అయినప్పటికి కోహ్లితో పాటు రోహిత్, ఇషాన్ కిషన్‌లు మంచి టచ్‌లో కనిపించడం టీమిండియాకు సానుకూలాంశం. టెస్టులు ముగియడంతో తాజాగా టీమిండియా వన్డేలపై దృష్టి సారించింది. మరో మూడు నెలల్లో వన్డే వరల్డ్‌కప్ జరగనుండడంతో ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారనుంది. వరల్డ్‌కప్‌కు సంబంధించి టీమిండియా జట్టును ఇంకా ప్రకటించలేదు. విండీస్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఆసియా కప్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ద్వారా యువ ఆటగాళ్లకు మెరుగైన ప్రదర్శన చేసే అవకాశముంది. ఇక గురువారం(జూలై 27న) నుంచి విండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో విండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా ఆటగాళ్లు ధరించనున్న జెర్సీని రివీల్ చేసింది. డ్రీమ్ ఎలెవెన్(Dream 11) స్పాన్సర్‌గా ఉండడంతో జెర్సీ సెంటర్లో డ్రీమ్ 11 లోగో దానికింద ఇండియా అని రాసి ఉంది. కుడి పక్కన బీసీసీఐ లోగో ఉంది. సూర్యకుమార్, యజ్వేంద్ర చహల్, హర్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, జంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, శుబ్‌మన్ గిల్ ఇలా యంగ్ క్రికెటర్లంతా ఒకరి తర్వాత ఒకరు వన్డే జెర్సీ ధరించి ఫోటోలకు ఫోజిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ బుధవారం ట్విటర్లో షేర్ చేసింది. మీరు ఒక లుక్కేయండి. ఇక వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో జట్టులో సీనియర్లకే ఎక్కువ అవకాశముంది. విండీస్‌తో తొలి వన్డేకు తుది జట్టు అంచనాను ఒకసారి పరిశీలిస్తే.. ఓపెనర్లుగా రోహిత్, శుబ్‌మన్ గిల్.. వన్‌డౌన్‌లో కోహ్లి, సూర్యకుమార్, సంజూ శాంసన్‌లు నాలుగు, ఐదు స్థానాల్లో.. హార్దిక్ పాండ్యా, జడేజాలు ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు రానున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్/ చహల్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, సిరాజ్‌లు ఉండే అవకాశం ఉంది. కాగా వికెట్‌కీపర్‌గా సంజూ శాంసన్ వైపే బీసీసీఐ మొగ్గు చూపే అవకాశముంది. దీంతో ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితమయ్యేలా కనిపిస్తున్నాడు. విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఇషాన్ కిషన్ రెండో ఇన్నింగ్స్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. విండీస్‌తో తొలి వన్డే టీమిండియా తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/ చహల్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్ Test Cricket ✅ On to the ODIs 😎📸#TeamIndia | #WIvIND pic.twitter.com/2jcx0s4Pfw — BCCI (@BCCI) July 26, 2023 చదవండి: 'హర్మన్‌ప్రీత్ ప్రవర్తన మరీ ఓవర్‌గా అనిపించింది' Prabath Jayasuriya: లంక బౌలర్ సంచలనం.. బాబర్ ఆజం వీక్నెస్ తెలిసినోడు -
టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్ ఎవరంటే..?
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు జెర్సీ ప్రధాన స్పాన్సర్‌గా ఫాంటసీ స్పోర్ట్స్ లీగ్ కంపెనీ ‘డ్రీమ్11’ ఎంపికవడం దాదాపు ఖాయమైంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఎంత మొత్తానికి అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటి వరకు టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కంపెనీ ‘బైజూస్’ ఉంది. గత ఏప్రిల్‌తో బైజూస్ ఒప్పందం ముగిసింది. దాంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ల కోసం బిడ్లను పిలిచింది. గతంలో ఐపీఎల్ టోర్నీ ప్రధాన స్పాన్సర్‌గా కూడా డ్రీమ్11 వ్యవహరించింది. అయితే బీసీసీఐతో కొత్త ఒప్పందం ప్రకారం... ఇప్పటివరకు బైజూస్ చెల్లించిన మొత్తం (ఒక్కో మ్యాచ్‌కు)కంటే డ్రీమ్11 తక్కువగా చెల్లించనున్నట్లు సమాచారం. లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత దీనిపై బోర్డు అధికారిక ప్రకటన చేయనుంది. -
భార్య జెర్సీ నెంబర్ తో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్
-
భార్య జెర్సీ నెంబర్ తో అదరగొడుతున్న రుతురాజ్ గైక్వాడ్..!
-
WTC Final: కొత్త జెర్సీలో మెరిసిపోతున్న టీమిండియా క్రికెటర్లు (ఫొటోలు)
-
WTC Final: తెలుపులో నీలం రంగు.. మెరిసిపోతున్న టీమిండియా క్రికెటర్లు
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో టీమిండియా ఆటగాళ్లు ధరించబోయే జెర్సీని ఇటీవలే (జూన్ 1) భారత జట్టు అఫీషియల్ కిట్ స్పాన్సర్ అడిడాస్ ఆవిష్కరించింది. తాజాగా టెస్ట్ జెర్సీలో టీమిండియా ఆటగాళ్ల ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కొత్త టెస్ట్ కిట్ ధరించి ఫోటోలకు పోజులిచ్చారు. King Kohli and captain Rohit Sharma in India's new Test and ODI jerseys. pic.twitter.com/G5QyQtykiZ — Mufaddal Vohra (@mufaddal_vohra) June 3, 2023 తెలుపు, నీలం రంగుతో కూడిన ఈ జెర్సీలో టీమిండియా ఆటగాళ్లు మెరిసిపోతున్నారు. భుజాలు, కాలర్‌పై నీలం రంగు బార్డర్ కలిగి, నీలం రంగులో ఇండియా అని రాసి ఉండి, ఎడమవైపు ఛాతిపై బీసీసీఐ ఎంబ్లమ్, కుడివైపు అడిడాస్ సింబల్‌తో కూడిన ఈ జెర్సీ చాలా కొత్తగా, అద్భుతంగా ఉందంటూ అభిమానులు కొనియాడుతున్నారు. Virat Kohli and Rohit Sharma in the new Indian Test jersey!😍 Rate this jersey out of 10 pic.twitter.com/MkeSXBtp2H — CricTracker (@Cricketracker) June 3, 2023 గతంలో టెస్ట్‌లకు పూర్తి తెలుపు రంగు కిట్ వాడేవారని, అది చూడటానికి అంత బాగుండేది కాదని, ప్రస్తుతమున్న కిట్ చాలా బాగుందని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు వన్డే, టీ20 జెర్సీలు సైతం పర్వాలేదని మెచ్చుకుంటున్నారు. రోహిత్, కోహ్లి, హార్ధిక్, బుమ్రా, వుమెన్స్ క్రికెట్ టీమ్ స్టార్ ప్లేయర్ స్మృతి మంధన కొత్త వన్డే, టీ20 జెర్సీలు ధరించి ఫోటోలకు పోజులిచ్చారు. Rohit Sharma, Virat Kohli, and Hardik Pandya in new Indian jerseys 👕🇮🇳 Which kit did you like the most? 😍 📸: Adidas India#CricTracker #IndianCricket pic.twitter.com/OKOSxUuvXX — CricTracker (@Cricketracker) June 3, 2023 కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్లో ఉండే జెర్సీ టీ20లకు.. లైట్ బ్లూ కలర్లో కాలర్‌తో ఉన్న జెర్సీని వన్డేలకు.. వైట్ కలర్ జెర్సీని టెస్ట్‌లకు టీమిండియా ఆటగాళ్లు ధరించనున్నారు. కాగా, భారత జట్టు అఫీషియల్ కిట్ స్పాన్సర్ అడిడాస్ సంస్థనే టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. నైక్ కంపెనీ తర్వాత కిట్ స్పాన్సరే (అడిడాస్) జెర్సీని కూడా తయారు చేయడం ఇదే మొదటిసారి. King Kohli is ready to roar in India's new jersey. pic.twitter.com/QtEDpWpHaH — Mufaddal Vohra (@mufaddal_vohra) June 3, 2023 ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ జరుగనుంది. ఈ ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ కోసం భారత్, ఆసీస్ జట్లు ప్రత్యేక జెర్సీలు ధరించనున్నారు. ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. బలాబలాల విషయంలో ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని అభిమానలు అంచనా వేస్తున్నారు. pic.twitter.com/226XFwjTxC — CricTracker (@Cricketracker) June 3, 2023 Pat Cummins and Co. are ready for the WTC Final🤩 📸 : ICC #Australia #INDvsAUS #WTCFinal pic.twitter.com/xD62y9bpdP — CricTracker (@Cricketracker) June 3, 2023 -
డబ్ల్యూటీసీ ఫైనల్ల్లో ఆస్ట్రేలియా ధరించబోయే ప్రత్యేక జెర్సీ ఇదే..!
టీమిండియాతో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో (జూన్ 7-11 వరకు లండన్‌లోని కెన్నింగ్స్టన్ ఓవల్) టీమ్ ఆస్ట్రేలియా ప్రత్యేక జెర్సీతో బరిలోకి దిగనుంది. ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఆసీస్ జట్టు ధరించబోయే జెర్సీని ఆ జట్టు స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా రివీల్ చేశాడు. ప్రత్యేక జెర్సీతో తీసుకున్న సెల్ఫీని ఖ్వాజా ట్విటర్లో షేర్ చేశాడు. ట్వీట్‌కు క్యాప్షన్‌గా.. అబద్దం ఆడటం లేదు, ఈ జెర్సీ గ్యాంగ్స్టా అంటూ కామెంట్ జోడించాడు. Not gonna lie. These vest are gangsta 🔥. World Test Championship. #straya🇦🇺🦘🪃 #loveavest #prizedpossession #wtc #gonnaneedit❄️ pic.twitter.com/wr6npGJs38 — Usman Khawaja (@Uz_Khawaja) May 23, 2023 రెగ్యులర్ ఆస్ట్రేలియా జెర్సీతో పోలిస్తే చాలా వైవిధ్యంగా కనిపిస్తున్న ఈ జెర్సీ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. డార్క్ గ్రీన్ కలర్లో 'V' నెక్ బోర్డర్‌తో ఈ జెర్సీ డబ్ల్యూటీసీ లోగోను కలిగి ఉంది. మరోవైపు టీమిండియా సైతం డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ప్రత్యేక జెర్సీని ధరించనుంది. అయితే ఆటగాళ్లు ఐపీఎల్‌తో బిజీగా ఉన్న కారణంగా జెర్సీ వివరాలు ఇంకా తెలియరాలేదు. పైగా బీసీసీఐ.. భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్‌ను కూడా మార్చింది. కిల్లర్ జీన్స్ స్థానంలో కొత్తగా అడిడాస్ భారత కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ధరించబోయే ప్రత్యేక జెర్సీపై అడిడాస్ లోగో కనిపించనుంది. ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 20 మంది సభ్యులతో కూడిన భారత బృందం (మొదటి బ్యాచ్) ఇవాళ (మే 23) ఉదయం ఇంగ్లండ్‌కు బయల్దేరింది. ఈ బృందంలో కోచ్ రాహుల్ ద్రవిడ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, స్టాండ్ బై ప్లేయర్ ముకేశ్ కుమార్, నెట్ బౌలర్లు ఆకాశ్‌దీప్, పుల్కిత్ నారంగ్‌లతో పాటు సహాయ సిబ్బంది ఉన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో ఉండి, ఐపీఎల్-2023 నుంచి నిష్క్రమించిన జట్లలోని కీలక సభ్యులు విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్‌లు రేపు (మే 24) లండన్‌కు బయల్దేరతారని క్రిక్‌బజ్ తెలిపింది. ఇంగ్లండ్‌లోని పరిస్థితులకు అలవాటు పడేందుకు టీమిండియా ఫస్ట్ బ్యాచ్ రెండు వారాల ముందుగానే లండన్‌కు బయల్దేరింది. మిగతా భారత బృందం దశల వారీగా ఇంగ్లండ్‌కు వెళ్తుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, అజింక్య రహానే, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ ఐపీఎల్ 2023 ముగిసాక (మే 31 లోపు) ఇంగ్లండ్‌కు బయల్దేరతారని సమాచారం. చదవండి: కోహ్లి ఒక్కడితోనే వేగలేకుంటే మరొకరు తయారయ్యారు.. ప్రపంచ దేశాల్లో వణుకు..! -
విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 వెనుక సూపర్బ్ స్టోరీ
-
కోహ్లీ జెర్సీ నెంబర్ వెనుక కన్నీటి కథ.. ఏంటంటే?
ప్రపంచ క్రికెట్లో జెర్సీ నంబరు 18ను ఎంతమంది ధరించినా.. టక్కున గుర్తుచ్చేది మాత్రం టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లినే. విరాట్ ఏ ఫార్మట్ లో చూసినా నెంబర్ 18 జెర్సీనే ధరిస్తాడు. అండర్ 19 ఆడేటప్పటి నుంచి ఈ జెర్సీనే వేసుకుంటాడు. మరో నెంబర్ మార్చే ప్రయత్నం చేయలేదు. కోహ్లి జెర్సీ నెంబర్ 18 వెనుక ఓ కన్నీటి గాధ దాగి ఉంది. తన తండ్రి గుర్తుగా నెంబర్ 18 ధరిస్తున్నట్లు కోహ్లినే స్వయంగా వెల్లడించాడు. నాన్నకు ప్రేమతో.. 2006 డిసెంబర్ 18వ తేదీ కోహ్లికి తన జీవితంలో మర్చిపోలేని రోజు. ఆ రోజున కోహ్లి తన తండ్రిని కోల్పోయాడు. ప్రేమ్ కోహ్లి గుండెపోటుతో మరణించాడు. తన తండ్రి మరణించిన సమయంలో కోహ్లి కర్ణాటకతో ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ వార్త విన్న కోహ్లి బాధను దిగిమింగి మరి తన ఆటను కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 90 పరుగులు చేసి ఢిల్లీని ఫాలోఆన్ గండం నుంచి తప్పించాడు. మ్యాచ్ ముగిశాక తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అయితే తన జీవితంలో ఆ చీకటి రోజుని మరోసారి విరాట్ గుర్తుచేసుకున్నాడు. "మా నాన్న చనిపోయిన ఆ రాత్రి నాకు ఇంకా గుర్తుంది. కానీ మా నాన్న మరణం తర్వాత నా ఆటను కొనసాగించాలని పిలుపు వచ్చింది. నేను కూడా ఆ రోజు ఉదయం ఢిల్లీ కోచ్‌కు ఫోన్ చేసాను. నేను ఈ మ్యాచ్‌లో ఆడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆటను మధ్యలో విడిచిపెట్టి రావడం సరికాదు అని భావించాను. ఆ క్షణం నన్ను ఒక వ్యక్తిగా మార్చింది. నా జీవితంలో క్రికెట్‌కు చాలా ప్రాముఖ్యత ఇస్తాను. ఇక మా నన్న మరణించిన రోజు గుర్తుగా జెర్సీ నంబరు 18గా ఎంచుకున్నాను. అదృష్టవశాత్తూ భారత జట్టులో చేరేటప్పటికీ ‘జెర్సీ నంబరు 18’ ఖాళీగా ఉంది. దీంతో అదే నంబరును కొనసాగించాను అని కోహ్లి సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇక కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్‌కు సన్నద్దం అవుతున్నాడు. ఇప్పటికే జట్టుతో కలిసిన విరాట్.. చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. చదవండి: IPL 2023: కోహ్లికి ముచ్చెమటలు పట్టించాడు.. ఇప్పుడు రాజస్తాన్ జట్టులో చోటు కొట్టేశాడు! -
రీల్‌లైఫ్‌లో హీరో నాని.. రియల్ లైఫ్‌లో కేన్ మామ
శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు అసలు సిసలు టెస్టు మజాను రుచి చూపించింది. సంప్రదాయ క్రికెట్లో మ్యాచ్ గెలవాలనే తపనతో ఇరుజట్లు ఆడిన తీరు టెస్టు చరిత్రలో నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న శ్రీలంక.. సొంతగడ్డపై ప్రత్యర్థికి అవకాశమివ్వకూడదన్న పంతంతో న్యూజిలాండ్.. గెలవాలంటే ఐదు బంతుల్లో 7 పరుగులు కావాలి.. 70వ ఓవర్.. క్రీజులో కేన్ విలియమ్సన్, మ్యాట్ హెన్రీ.. చేతిలో మూడు వికెట్లు.. అంతలోనే సమన్వయలోపం కారణంగా రనౌట్.. బౌలర్ అషిత ఫెర్నాండో చురుగ్గా కదిలి డైవ్ చేసి మరీ బంతిని వికెట్లకు గిరాటేయడంతో హెన్రీ అవుట్. క్రీజులోకి నీల్ వాగ్నర్.. చేతిలో రెండు వికెట్లు.. గెలవాలంటే ఆరు పరుగులు కావాలి.. ఇక విలియమ్సన్ ఆలస్యం చేయలేదు.. ఫెర్నాండో బౌలింగ్‌లో అద్భుత బౌండరీతో నాలుగు పరుగులు రాబట్టాడు.. న్యూజిలాండ్ గెలుపు సమీకరణం రెండు బంతుల్లో ఒక పరుగు.. వెంటనే డాట్‌బాల్.. ఇరు జట్ల స్కోర్లు సమం.. గెలవాలంటే మిగిలిన ఒక్క బంతికి ఒక్క పరుగు కావాలి.. శ్రీలంకతో పాటు టీమిండియా అభిమానుల్లోనూ నరాలు తెగే ఉత్కంఠ.. బైస్.. షాట్ ఆడేందుకు కేన్ విలియమ్సన్ ప్రయత్నం.. వాగ్నర్‌కు కాల్.. సింగిల్ తీసేందుకు కేన్ మామ క్రీజు వీడాడు. ఆలోపే బంతిని అందుకున్న వికెట్ కీపర్ డిక్విల్లా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫెర్నాండో వైపు విసరగా.. బాల్ అందుకున్న ఫెర్నాండో వెంటనే వికెట్లకు గిరాటేశాడు.. మరి కేన్ మామ అప్పటికే పరుగు పూర్తి చేశాడా లేదోనన్న సందేహం! కివీస్‌కు అనుకూలంగా థర్డ్ ఎంపైర్ నుంచి స్పందన.. లంక ఆశలపై నీళ్లు.. ఆఖరి బంతికి కివీస్‌ను గెలిపించిన కేన్ విలియమ్సన్‌పై ప్రశంసల జల్లు. మొత్తానికి రనౌట్ నుంచి తప్పించుకొని కేన్ మామ హీరోగా నిలిచాడు. ఇదంతా రియల్ లైఫ్ మ్యాచ్‌లో జరిగింది. అయితే ఇది సీన్ ఒక సినిమాలో కూడా జరిగిందంటే మీరు నమ్ముతారా.. అది కూడా ఒక తెలుగు సినిమాలో. ఆశ్చర్యపోయినా ఇది నిజం. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. అయితే సినిమా క్లైమాక్స్‌లో నాని తన జట్టును గెలిపించడానికి పడే తపన అచ్చం కేన్ మామ ఇన్నింగ్స్‌ను తలపించింది. రియల్ లైఫ్ మ్యాచ్ లాగానే సినిమాలోనూ నాని ఆఖరి బంతికి రనౌట్ నుంచి తప్పించుకొని జట్టును గెలిపిస్తాడు. ఆ తర్వాత నాని పైకి లేచి బ్యాట్‌ను పైకెత్తి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటాడు. ఇక్కడ కూడా విలియమ్సన్ తన బ్యాట్‌ను పైకెత్తి గెలుపును సెలబ్రేట్ చేసుకోవడం కనిపిస్తుంది. ఈ రెండు మ్యాచ్‌లకు సంబంధించిన వీడియోలను పక్కపక్కన ఉంచి ఒక అభిమాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by TwEETA PORADU (@tweetaporadu) చదవండి: 'నా స్థానాన్ని ఆక్రమించావు.. అందుకే కృతజ్ఞతగా' NZ Vs SL: 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. న్యూజిలాండ్ అత్యంత అరుదైన రికార్డు! -
మాపై దయ చూపలేదు, నా గుండె ముక్కలయ్యింది: బాలీవుడ్ హీరో
ఒక భాషలో ఏదైనా సినిమా హిట్టయిందంటే చాలు దాన్ని వేరే భాషలో రీమేక్ చేయాలని తహతహలాడిపోతుంటారు సినీతారలు. ఈ క్రమంలో కొన్నిసార్లు సూపర్ హిట్లు తీసినా మరికొన్నిసార్లు మాత్రం చేతులు కాల్చుకుంటారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇలా రీమేక్‌లు తీసి వరుస ఫ్లాపులు మూటగట్టుకుంటోంది. సౌత్‌లో హిట్ అయిన చిత్రాలను హిందీలో రీమేక్ చేసి వదులుతోంది. కానీ ఎందుకో అక్కడ అస్సలు వర్కవుట్ కావడం లేదు. అయినా సరే పట్టు వదలకుండా రీమేక్‌లు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో విక్రమ్ వేద, హిట్, జెర్సీ, షెహజాదా (అల వైకుంఠపురములో), డ్రైవింగ్ లైసెన్స్(సెల్ఫీ) వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. అయినా సరే వాటిని లెక్క చేయకుండా బోలెడన్ని సినిమాలు ఇంకా క్యూలో ఉన్నాయి. లవ్ టుడే, సూరరై పోట్రు, ఎఫ్ 2, బ్రోచెవారెవరురా, ఖైదీ, కత్తి, అయ్యప్పనుమ్ కోషియుమ్.. ఇలా చాలా చిత్రాలు రీమేక్ బాటపట్టాయి. హిందీ ప్రేక్షకులు సౌత్ కంటెంట్‌ను ఇష్టపడటం లేదని కాదు.. దక్షిణాది సినిమాలను చూస్తున్నారు, ఒరిజినల్ కంటెంట్‌ను మాత్రమే ఇష్టపడుతున్నారు.. రీమేక్‌లకు మాత్రం నిర్మొహమాటంగా నో చెప్తున్నారు. అయితే మంచి కంటెంట్ ఉన్న సినిమాను వ్యతిరేకిస్తే తట్టుకోలేమంటున్నాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. నాని హీరోగా నటించిన జెర్సీ మూవీకి తెలుగులో విశేష స్పందన లభించింది. ఈ సినిమా హిందీ రీమేక్‌లో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. కోవిడ్ కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం గతేడాది ఏప్రిల్‌లో రిలీజవగా ఘోర పరాజయం పొందింది. దీనిపై షాహిద్ మాట్లాడుతూ.. 'నా గుండె పగిలినట్లైంది. ఎంతో మంచి సినిమా అది, కానీ ఈ ప్రపంచం మాపై దయచూపలేదనుకుంటా.. పాటలు విడుదలైన మరో నాలుగు నెలలకు సినిమా రిలీజైంది. జెర్సీతో ఓ విషయం నాకు బాగా అర్థమైంది. సినిమాలు ఫాస్ట్‌ఫుడ్ వంటివి. అది వేడివేడిగా ఉన్నప్పుడే వెంటనే తినేయాలి.. దాన్ని వాయిదాలు వేసుకుంటూ ఆలస్యం చేస్తే అంత మజా రాదు. అప్పుడు కరోనా టైంలో సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లాలో కూడా అర్థం కాలేదు. దురదృష్టవశాత్తూ సినిమా ఫ్లాప్ అయింది' అని చెప్పుకొచ్చాడు. తాజాగా ఫర్జీ వెబ్ సిరీస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చాడు షాహిద్ కపూర్. ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న ఈ సిరీస్‌కు మంచి ఆదరణ లభించింది.