టీమిండియాతో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్లో (జూన్ 7-11 వరకు లండన్‌లోని కెన్నింగ్‌స్టన్ ఓవల్) టీమ్ ఆస్ట్రేలియా ప్రత్యేక జెర్సీతో బరిలోకి దిగనుంది. ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఆసీస్ జట్టు ధరించబోయే జెర్సీని ఆ జట్టు స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా రివీల్ చేశాడు. ప్రత్యేక జెర్సీతో తీసుకున్న సెల్ఫీని ఖ్వాజా ట్విటర్‌లో షేర్ చేశాడు. ట్వీట్‌కు క్యాప్షన్‌గా.. అబద్దం ఆడటం లేదు, ఈ జెర్సీ గ్యాంగ్స్టా అంటూ కామెంట్ జోడించాడు.
Not gonna lie. These vest are gangsta 🔥. World Test Championship. #straya🇦🇺🦘🪃 #loveavest #prizedpossession #wtc #gonnaneedit❄️ pic.twitter.com/wr6npGJs38
— Usman Khawaja (@Uz_Khawaja) May 23, 2023
రెగ్యులర్ ఆస్ట్రేలియా జెర్సీతో పోలిస్తే చాలా వైవిధ్యంగా కనిపిస్తున్న ఈ జెర్సీ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. డార్క్ గ్రీన్ కలర్‌లో 'V' నెక్ బోర్డర్‌తో ఈ జెర్సీ డబ్ల్యూటీసీ లోగోను కలిగి ఉంది. మరోవైపు టీమిండియా సైతం డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ప్రత్యేక జెర్సీని ధరించనుంది. అయితే ఆటగాళ్లు ఐపీఎల్‌తో బిజీగా ఉన్న కారణంగా జెర్సీ వివరాలు ఇంకా తెలియరాలేదు. పైగా బీసీసీఐ.. భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్‌ను కూడా మార్చింది. కిల్లర్ జీన్స్ స్థానంలో కొత్తగా అడిడాస్ భారత కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ధరించబోయే ప్రత్యేక జెర్సీపై అడిడాస్ లోగో కనిపించనుంది.
ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 20 మంది సభ్యులతో కూడిన భారత బృందం (మొదటి బ్యాచ్) ఇవాళ (మే 23) ఉదయం ఇంగ్లండ్‌కు బయల్దేరింది. ఈ బృందంలో కోచ్ రాహుల్ ద్రవిడ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, స్టాండ్ బై ప్లేయర్ ముకేశ్ కుమార్, నెట్ బౌలర్లు ఆకాశ్‌దీప్, పుల్కిత్ నారంగ్‌లతో పాటు సహాయ సిబ్బంది ఉన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో ఉండి, ఐపీఎల్-2023 నుంచి నిష్క్రమించిన జట్లలోని కీలక సభ్యులు విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్‌లు రేపు (మే 24) లండన్‌కు బయల్దేరతారని క్రిక్‌బజ్ తెలిపింది.
ఇంగ్లండ్‌లోని పరిస్థితులకు అలవాటు పడేందుకు టీమిండియా ఫస్ట్ బ్యాచ్ రెండు వారాల ముందుగానే లండన్‌కు బయల్దేరింది. మిగతా భారత బృందం దశల వారీగా ఇంగ్లండ్‌కు వెళ్తుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, అజింక్య రహానే, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ ఐపీఎల్ 2023 ముగిసాక (మే 31 లోపు) ఇంగ్లండ్‌కు బయల్దేరతారని సమాచారం.
చదవండి: కోహ్లి ఒక్కడితోనే వేగలేకుంటే మరొకరు తయారయ్యారు.. ప్రపంచ దేశాల్లో వణుకు..!
Comments
Please login to add a commentAdd a comment