WTC Final
-
కోహ్లి ‘కీ’లకం!
జట్టుకు దూకుడు నేర్పిన సారథి... విదేశీ పిచ్‌లపై సైతం అలవోకగా పరుగులు చేయగల నేర్పరి... టెక్నిక్, టెంపర్మెంట్లో అతడికెవరూ రారు సాటి! కంగారూ గడ్డపై పరుగులు చేసేందుకు సహచరలంతా తీవ్రంగా తడబడుతుంటే... ఆసీస్ బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో నిరూపించిన అసలు సిసలు నాయకుడు అతడు. అందుకే ప్రస్తుతం అతడు పెద్దగా ఫామ్‌లో లేకపోయినా... కీలక ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ సిరీస్‌కు ముందు ఎవరినోట విన్నా అతడి గురించే చర్చ. ‘బాడీలైన్’ బౌలింగ్‌తో ఇబ్బంది పట్టాలని ఒకరు... రెచ్చగొట్టకుండా వదిలేయాలని మరొకరు... ఇలా ఆ్రస్టేలియా మాజీ ఆటగాళ్లంతా తీవ్రంగా చర్చిస్తున్న ఆ ప్లేయర్ మరెవరో కాదు... టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ కు గురైన టీమిండియా... ఆసీస్ పర్యటనలో ఆకట్టుకోవాలంటే అతడు రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది! సుదీర్ఘ ఫార్మాట్‌ను అమితంగా ఇష్టపడే విరాట్ కోహ్లికి ఆ్రస్టేలియాపై మెరుగైన రికార్డు ఉంది. క్రీజులో కుదురుకుంటే మంచినీళ్ల ప్రాయంలా పరుగులు రాబట్టే విరాట్... ఆసీస్‌లో ఆసీస్‌పై అదరగొట్టాడు. కంగారూ గడ్డపై ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడిన కోహ్లి 1352 పరుగులు చేశాడు. 54.08 సగటు నమోదు చేసిన విరాట్... 6 సెంచరీలు, 4 అర్ధశతకాలు కొట్టాడు. పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై యాభైకి పైగా సగటుతో పరుగులు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. సుదీర్ఘ కాలంగా భారత జట్టులో కీలక సభ్యుడిగా సాగుతున్న విరాట్ తన కెరీర్లో దాదాపు చివరి ఆసీస్ పర్యటనకు సిద్ధమవుతున్నాడు. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్‌లో అందరి దృష్టి కోహ్లిపైనే నిలవనుంది. వ్యక్తిగత కారణాల వల్ల రెగ్యులర్ కెపె్టన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవడం... మరో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ గాయంతో జట్టుకు దూరమవడం... గత పర్యటనలో అదరగొట్టిన సీనియర్ ప్లేయర్లు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఇప్పుడు జట్టులోనే లేకపోవడం... ఇవన్నీ వెరసి విరాట్ కోహ్లీ విలువను మరింత పెంచాయి. పెద్దగా అనుభవం లేని యశస్వి జైస్వాల్, ఇప్పటి వరకు అరంగేట్రమే చేయని అభిమన్యు ఈశ్వరన్, నిలకడ లోపించిన కేఎల్ రాహుల్, తొలిసారి ఆసీస్‌లో పర్యటిస్తున్న ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్ వంటి వాళ్లతో కూడిన బ్యాటింగ్ లైనప్‌లో కోహ్లీ ఒక్కడే శిఖరంలా కనిపిస్తున్నాడు. పరీక్ష పెట్టే పేస్ పిచ్‌లు, సవాలు విసిరే బౌన్సీ వికెట్లు స్వాగతం పలుకుతున్న సమయంలో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయాలంటే బ్యాటింగ్ దళాన్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత కోహ్లిదే. ఫామ్ అందుకుంటాడా... గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియా గడ్డపై అద్వితీయ ప్రదర్శన కనబర్చిన టీమిండియా... ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్‌ను ఒడిసి పట్టింది. ముచ్చటగా మూడోసారి అదే జోరు కొనసాగాలంటే బ్యాటింగ్ బలగం రాణించాల్సిన అవసరముంది. అయితే సహనానికి పరీక్ష పెట్టే ఆసీస్ పిచ్‌లపై మెరుగైన ప్రదర్శన చేయాలంటే మొక్కవోని దీక్ష ముఖ్యం. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన కోహ్లి... మూడు మ్యాచ్‌ల్లో కలిపి 100 పరుగులు కూడా చేయలేదు. మరి ఇలాంటి స్థితిలో పెద్దగా అనుభవం లేని బ్యాటింగ్ ఆర్డర్‌తో భారత జట్టు ప్రతిష్టాత్మక ట్రోఫీ నిలబెట్టుకోవాలంటే కోహ్లి సత్తా చాటాల్సిన అవసరముంది. భారత జట్టు వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించాలంటే టీమిండియా ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా... 4–0తో ట్రోఫీ చేజిక్కించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఇది సాధ్యపడాలంటే కోహ్లి తనలోని అసలు సిసలు పోరాట యోధుడిని తట్టి లేపాల్సిన అవసరముంది. గతంతో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా చెలరేగిపోయిన కోహ్లీ... కొంతకాలంగా నెమ్మదించాడు. మునుపటి మెరుపులు మెరిపించ లేకపోతున్నాడు. ఈ ఏడాది 6 టెస్టులు ఆడిన కోహ్లి... అందులో 22.72 సగటుతో కేవలం 250 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో రాణిస్తాడనే నమ్మకం సాధించిన కోహ్లి... ఆసీస్ పర్యటనలో అదరగొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. కోహ్లిని వదిలేయండి: వాట్సన్ కీలక సిరీస్‌కు ముందు ఆ్రస్టేలియా ఆటగాళ్లకు... ఆ దేశ మాజీ ఓపెనర్ షేన్ వాట్సన్ కీలక సూచన చేశాడు. మైదానంలో కోహ్లి జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదని తమ ప్లేయర్లకు చెప్పాడు. రెచ్చగొడితే కోహ్లిలోని అత్యుత్తమ ఆటగాడు బయటకు వస్తాడని హితవు పలికాడు. ‘విరాట్‌ను దగ్గర నుంచి గమనించా. అతడిలో మెరుగైన ప్రదర్శన చేయాలనే కసి ఎక్కువ. అది లోలోపల ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. దాన్ని రెచ్చగొట్టి బయటకు తీయకపోవడమే మేలు. అందుకే ఆసీస్ ఆటగాళ్లు అతడిని వదిలేయాలి. లేకుంటే అతడు చాలా ప్రమాదకరం’ అని వాట్సన్ అన్నాడు. ఇప్పటి వరకు ఐదుసార్లు ఆసీస్‌లో పర్యటించిన కోహ్లి... 2014–15 పర్యటనలో 86.50 సగటుతో 692 పరుగులు చేశాడు. ‘ఆసీస్‌లో అతడు ఎలాంటి ప్రదర్శన కనబర్చాడో అందరికీ తెలుసు. అత్యుత్తమ స్థాయిలో ఉన్నప్పుడు అతడు ప్రతి బంతిని మెరుగ్గా అర్థం చేసుకుంటాడు. అది జరగకుండా ఉండాలనే కోరుకుంటున్నా’ అని వాట్సన్ అన్నాడు. కోహ్లికి బాడీలైన్ బౌలింగ్ చేయాలి: హీలీ భారత ప్రధాన ఆటగాడు కోహ్లిని అడ్డుకోవాలంటే బాడీలైన్ బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టాలని ఆసీస్ ఆటగాళ్లకు ఆ దేశ మాజీ ప్లేయర్ ఇయాన్ హీలీ సూచించాడు. పదే పదే ముందరి ప్యాడ్‌ను లక్ష్యంగా చేసుకొని బంతులేయడం ద్వారా అతడిని బ్యాక్‌ఫుట్‌కు పరిమితం చేసి త్వరగా అవుట్ చేయవచ్చని సూచించాడు. ‘తొలి టెస్టులో ఆ్రస్టేలియా పేసర్లు కోహ్లికి ఎలా బౌలింగ్ చేస్తారో చూసేందుకు ఆసక్తిగా చూస్తున్నా. క్రీజులో కోహ్లీ మెరుగైన కాళ్ల కదలికలు కనబర్చితే అతడు త్వరగా కుదురుకుంటాడు. అందుకే ముందరి ప్యాడ్ లక్ష్యంగా ప్రయతి్నంచాలి. అప్పుడే అతడిని నియంత్రించవచ్చు. ఒకవేళ అది ఫలితాన్ని ఇవ్వకపోతే. బాడీలైన్ బౌలింగ్ చేయడం మంచిది’ అని హీలీ ఆసీస్ పేసర్లకు హితవు పలికాడు. విరాట్ ఒక చాంపియన్: లయన్ భారత సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లిపై ఆ్రస్టేలియా స్పిన్నర్ నాథన్ లయన్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ అసలు సిసలు చాంపియన్ అని అన్నాడు. గత 60 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి కేవలం 2 సెంచరీలు, 11 అర్ధశతకాలు మాత్రమే చేసినా... అతడిని తక్కువ అంచనా వేయడం లేదని లయన్ పేర్కొన్నాడు. ‘ఫామ్‌లో ఉన్నాడా లేదా అనేది పక్కన పెడితే... అతడి రికార్డులు నమ్మశక్యం కానివి. అతడి పట్ల నాకు గౌరవం ఉంది. అతడిని అవుట్ చేయాలని తప్పక ప్రయతి్నస్తా. కానీ అది ఎంత కష్టమో నాకు తెలుసు. చాన్నాళ్లుగా మా మధ్య రసవత్తర సమరం జరుగుతుంది. కోహ్లి, స్మిత్ అత్యుత్తమ స్థాయి ఆటగాళ్లు’ అని లయన్ అన్నాడు. -
'డబ్ల్యూటీసీ ఫైనల్‌పై ఆశలు వద్దు.. ఆసీస్‌ను భారత్ ఓడించలేదు'
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్‌కు గురైనటీమిండియా ఇప్పుడు మరో కఠిన పరీక్షకు సిద్దమవుతోంది. మరో వారం రోజుల్లో ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు పయనం కానుంది. నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆసీస్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది.గత రెండు పర్యాయాలు కంగారులను వారి సొంతగడ్డపై చిత్తు చేసిన టీమిండియా ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. కానీ ప్రస్తుత భారత జట్టు ప్రదర్శను చూస్తుంటే హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.అంతేకాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే భారత్‌కు బీజీటీ ట్రోఫీ ఎంతో కీలకం. ఈ సిరీస్‌లో 4-0 తేడాతో గెలిస్తేనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ గవాస్కర్ ఆప వ్యాఖ్యలు చేశాడు."భారత్ డబ్యూటీసీ ఫైనల్‌కు చేరుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై టీమిండియా 4-0తో ఓడించలేదు. ఒకవేళ ఆసీస్‌ను భారత్ ఓడిస్తే మాత్రం నేను గాల్లో తేలుతాను. అసలు డబ్ల్యూటీసీ ఫైనల్ గురించే నేను మాట్లాడుకోవడం లేదు.ఇప్పుడు కేవలం ఆస్ట్రేలియాలో సిరీస్ గెలుపైనే దృష్టిపెట్టిండి. 1-0, 2-0, 3-1, 2-1 తేడాతో సిరీస్ గెలిచినా పర్వాలేదు. సిరీస్ గెలవడం ముఖ్యం. ఎందుకంటే భారత క్రికెట్ అభిమానులందరూ ప్రస్తుతం తీవ్ర నిరాశలో ఉన్నారు. మీరు గెలిచి మళ్లీ ఫ్యాన్స్‌లో జోష్ నింపండి" అంటూ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నాడు.చదవండి: PAK Vs AUS 1st ODI: అదృష్టం వల్లే ఆస్ట్రేలియా గెలిచింది: పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు -
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తేదీని ప్రకటించిన ఐసీసీ
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సీజన్ ఫైనల్ తేదీ మరియు వేదికను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 3) ప్రకటించింది. ఈ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ 11-15 మధ్యలో లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డేను (జూన్ 16) కూడా ప్రకటించారు నిర్వహకులు. లార్డ్స్‌లో మొట్టమొదటిసారిగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. తొలి ఎడిషన్ అయిన 2021లో సౌథాంప్టన్, రెండో ఎడిషన్ అయిన 2023లో ఓవర్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పటివరకు జరిగిన రెండు డబ్ల్యూటీసీ ఎడిషన్లలో టీమిండియా ఫైనల్స్‌కు చేరుకోగా.. తొలి ఎడిషన్‌లో న్యూజిలాండ్ చేతిలో, రెండో ఎడిషన్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ప్రస్తుతం భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా అతి సమీపంలో రెండో స్థానంలో ఉంది. అన్నీ ఊహించినట్లుగా జరిగితే ఈ ఎడిషన్ ఫైనల్లోనూ భారత్, ఆస్ట్రేలియా జట్లే తలపడే అవకాశం ఉంది. -
కోహ్లిని దాటేసిన రోహిత్
-
పాయింట్ల పట్టికలో దూసుకొచ్చిన భారత్
-
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తొలి భారత ఆటగాడిగా!
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా అద్బుతంగా ఆడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వీ జైశ్వాల్ మరోసారి అద్బుతమైన ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి 23 ఓవర్లు ముగిసే సరికి తొలి వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ(88 బంతుల్లో 61 నాటౌట్), యశస్వీ జైశ్వాల్(50) పరుగులతో క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ చరిత్రలో 2000 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి భారత ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు. 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు డబ్ల్యూటీసీలో 25 మ్యాచ్‌లు (40) ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ 2017 పరుగులు చేశాడు. రోహిత్ తర్వాత స్ధానంలో భారత్ నుంచి విరాట్ కోహ్లి(1942) ఉన్నాడు. కాగా ఇది వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ మూడో ఎడిషన్ ఉన్న విషయం తెలిసిందే. తొలి ఎడిషన్ విజేతగా న్యూజిలాండ్ నిలవగా.. రెండో ఎడిషన్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలిచింది. విండీస్‌తో రెండో టెస్టుకు భారత జట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్ చదవండి: IND vs WI: ఒకప్పుడు పోలీస్ అవ్వాలనుకున్నాడు.. కట్ చేస్తే ఇప్పుడు టీమిండియా క్రికెటర్! -
డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవనంత మాత్రాన.. కెప్టెన్సీ నుంచి తొలగిస్తారా? ఇలా చేస్తే..
Rohit Sharma Captaincy: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఆస్ట్రేలియా మాజీ సారథి మైకేల్ క్లార్క్ మద్దతుగా నిలిచాడు. కేవలం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఓడినంత మాత్రాన అతడిని తొలగించాలనే డిమాండ్లు సరికావంటూ హిట్‌మ్యాన్‌ను సమర్థించాడు. కాగా డబ్ల్యూటీసీ సైకిల్ 2019-21లో విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌లో జరిగిన తుదిపోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టగా 2021-23 సీజన్లోనూ ఫైనల్‌కు అర్హత సాధించింది. కానీ ఈసారి కూడా గతం మాదిరే చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. దారుణ ఓటమి ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో రోహిత్ సేన ఏకంగా 209 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది. ఈ క్రమంలో ఆసీస్ సంప్రదాయ క్రికెట్లోనూ చాంపియన్‌గా అవతరించి సరికొత్త చరిత్ర సృష్టించగా.. టీమిండియా రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో 36 ఏళ్ల రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. టాస్ విషయంలో, ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు తుదిజట్టులో చోటు కల్పించకపోవడంపై మాజీలు సైతం పెదవి విరిచారు. ఈ క్రమంలో అతడిని సారథ్య బాధ్యతల నుంచి తొలగించాలనే డిమాండ్లు వినిపించాయి. నాకు నమ్మకం ఉంది ఈ విషయంపై స్పందించిన మైకేల్ క్లార్క్ రోహిత్‌కు అండగా నిలిచాడు. ‘‘రోహిత్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. తను గొప్ప కెప్టెన్. అతడి దూకుడైన ఆట తీరు, కెప్టెన్సీ నాకు నచ్చుతాయి. ఎల్లవేళలా అతడు సానుకూల దృక్పథంతోనే కనిపిస్తాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ రికార్డు అమోఘం. నాయకుడిగా తను విజయవంతమయ్యాడు. ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవలేదన్న ఒకే ఒక్క కారణంగా రోహిత్ కెప్టెన్‌గా పనికిరాడనడం సరికాదు. నిజానికి ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో టీమిండియా వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. టెస్టు క్రికెట్లో వారి రికార్డు బాగుంది. టీమిండియా నిలకడైన ప్రదర్శనతో ముందుకు సాగుతోంది. ఇక వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్లో వారు ఎలా ఆడతారో చూడాల్సి ఉంది’’ అని క్లార్క్ చెప్పుకొచ్చాడు. రోహిత్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. చదవండి: 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్‌గా.. ఒక్కడే కాదు! ‘మొదటి బంతి’కే రూట్ అలా! పంత్‌ను లాగిన ఫ్యాన్స్.. వీడియో వైరల్ -
ఇప్పుడలా లేదు.. ఎవరూ ఎవరికి సాయం చేయరు: అశ్విన్ షాకింగ్ కామెంట్స్
Ravichandran Ashwin Shocking Comments: ‘‘ఒకప్పుడు జట్టులోని ఆటగాళ్లంతా స్నేహితుల్లా మెలిగేవారు. కానీ.. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కేవలం సహచర ఆటగాడిగానే పరిగణింపబడతాడు. అప్పటికీ.. ఇప్పటికీ చాలా తేడా ఉంది. డ్రెసింగ్‌రూం వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి ఒక్కరు అనుక్షణం పక్క వాళ్లతో పోటీ పడుతూ ముందుకు సాగాల్సిన పరిస్థితి. ‘‘హాయ్ బాస్.. ఏంటి సంగతులు?’’ అని పక్కవాళ్లతో సరదాగా మాట్లాడేందుకు ఎవరి దగ్గరా కాస్తైనా సమయం లేదు’’ అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లంతా కేవలం కొలీగ్స్ మాదిరే ఉంటున్నారని, మునుపటిలా ఫ్రెండ్స్‌లా కొనసాగే పరిస్థితి లేదన్నాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ సైకిల్ 2021-23లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఈ టీమిండియా బౌలర్‌కు ఫైనల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. అత్యుత్తమ బౌలర్‌కు మొండిచేయి ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మేనేజ్మెంట్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక.. ఆసీస్‌తో ఫైనల్లో టీమిండియా ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. వరుసగా రెండోసారి తుదిపోరుకు అర్హత సాధించినప్పటికీ ట్రోఫీ గెలవలేక చతికిలపడింది. ఇదిలా ఉంటే.. అశ్విన్ తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డ్రెసింగ్‌రూం వాతావరణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎవరికి వారే యమునా తీరే.. ఒంటరి ప్రయాణం జట్టులోని ఇతర సభ్యుల నుంచి సహకారం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లు ఉంటారని అశూ పేర్కొన్నాడు. ‘‘నిజానికి.. ఎంత ఎక్కువగా ఆట గురించి చర్చిస్తే అంత ఎక్కువగా టెక్నిక్‌ను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది. ఒకరి అనుభవాలు మరొకరికి పాఠాలుగా పనికివస్తాయి. కానీ ఇపుడు అలాంటి పరిస్థితి లేదు. మనకు ఏదైనా సాయం కావాలంటే ఎవరూ ముందుకురారు. పది మందితో కూడిన ఒంటరి ప్రయాణం లాంటిది ఇది’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. అయితే, క్రికెట్లో ఒకరు చెప్పే పాఠాల కంటే సొంతంగా నేర్చుకోవాల్సిందే ఎక్కువగా ఉంటుందంటూ ముక్తాయింపు ఇచ్చాడు. మేటి బౌలర్‌గా ఎదిగిన అశూ కాగా రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ అయిన ఈ తమిళనాడు బౌలర్.. తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు 92 టెస్టులు, 113 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మేటి బౌలర్‌గా ఎదిగిన అతడు టెస్టుల్లో 474, వన్డేల్లో 151, టీ20లలో 72 వికెట్లు పడగొట్టాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అశ్విన్ తాజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్‌గా.. ఒక్కడే కాదు! సచిన్, ధోని, కోహ్లి, రోహిత్.. రుతురాజ్ కూడా వీళ్ల బ్యాచ్‌లో చేరిపోయాడు..! -
రోహిత్ మంచి కెప్టెన్.. మేటి టెస్ట్ బ్యాటర్ కూడా! కానీ.. ఇకపై..
Rohit Sharma Captaincy: ‘‘రోహిత్ మంచి కెప్టెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం గొప్ప నాయకుడే కాదు.. మంచి టెస్ట్ బ్యాటర్ కూడా! ఈ మాట అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే, భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుందా అంటే నేనైతే కచ్చితంగా చెప్పలేను. గత రెండు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ సైకిళ్లలో టీమిండియా ఫైనల్‌కు చేరింది. కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. ప్రస్తుతం రోహిత్ శర్మ వయస్సే అతడికి పెద్ద సమస్యగా మారనుంది. ఇది నమ్మకతప్పని వాస్తవం. రానున్న రెండేళ్లలో డబ్ల్యూటీసీ సైకిల్-2025 షెడ్యూల్ ఉంటుంది. ఒకవేళ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్లో కొనసాగాలని భావిస్తే తప్పకుండా ఆడతాడు. నిజానికి ఒక డబ్ల్యూటీసీ సైకిల్లో దాదాపు ఆరు సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది. కానీ గత రెండేళ్లలో చాలా మంది క్రికెటర్లు(రోహిత్ శర్మ సహా) కీలక సిరీస్‌లు కూడా మిస్ చేశారు. టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లకు ఒక్కోసారి విశ్రాంతి దొరక్కపోవచ్చు. అలాంటపుడు మూడు ఫార్మాట్లు ఆడే అవకాశం కొంతమందికే దక్కుతుంది. సెలక్టర్లు అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకునే జట్టును ఎంపిక చేస్తారు. డబ్ల్యూటీసీ తదుపరి సైకిల్లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఉంటాయి. తర్వాత ఆస్ట్రేలియా పర్యటన ఉండొచ్చు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. కానీ.. రానున్న రెండేళ్ల కాలంలో కెప్టెన్‌గా అతడికి ప్రత్యామ్నాయం వెతక్కతప్పదు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. 36 ఏళ్ల రోహిత్ శర్మ ఇకపై సారథిగా కొనసాగడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. వరుస వైఫల్యాలు కాగా రోహిత్ శర్మ ఇటీవలి కాలంలో ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023లో అంతంత మాత్రమే ఆడిన ‘హిట్‌మ్యాన్’.. ఇటీవల ముగిసిన ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 15 పరుగులే చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులు సాధించగలిగాడు. ఇక కీలక మ్యాచ్‌లో టాస్, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కనపెట్టిన విషయంలో తీవ్ర విమర్శలపాలయ్యాడు రోహిత్. అతడిని కెప్టెన్‌గా తప్పించాల్సిందేనంటూ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: కోహ్లి సంపాదన ఎంతో తెలిస్తే షాక్!.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో! ఎలా సంపాదిస్తున్నాడంటే? -
కెప్టెన్సీ మాకు వద్దు అంటూ ట్రోల్స్ రోహిత్ శర్మ ఏం చేసాడో చూడండి..!
-
WTC లో భారత్ ఓటమికీ అసలు కారణాలు ఇవే
-
ICC Test Rankings: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. 39 ఏళ్ల తర్వాత ఇదే తొలి సారి
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు సత్తా చాటారు. తొలి మూడు స్ధానాలను ఆసీస్ బ్యాటర్లే దక్కించుకోవడం విశేషం. లబుషేన్ తొలి ర్యాంకులో కొనసాగుతుండగా.. స్టీవ్ స్మిత్ రెండో ర్యాంకులో ఉన్నాడు. అయితే టీమిండియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అదరగొట్టిన ట్రావిస్ హెడ్ మూడు స్ధానాలు ఎగబాకి మూడో ర్యాంక్ చేరుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ధాటిగా ఆడిన హెడ్ 174 బంతుల్లోనే 163 పరుగులు చేశాడు. అతడితో పాటు స్మిత్ కూడా సెంచరీతో చెలరేగాడు. కాగా 39 ఏళ్ల తర్వాత ఒకే జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు టాప్ 3 ర్యాంకింగ్స్‌లో ఉండడం ఇదే తొలి సారి. 1984లో వెస్టిండీస్ ఆటగాళ్లు గోర్డాన్ గ్రీనిడ్జ్ (810), క్లైవ్ లాయిడ్ (787), లారీ గోమ్స్ (773) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఇక టీమిండియా విషయానికి వస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడకపోయనప్పటికీ వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టకున్నాడు. మరోవైపు రీ ఎంట్రీలో అదరగొట్టిన అజింక్య రహానే 37వ స్థానానికి చేరుకోగా, శార్దూల్ ఠాకూర్ బ్యాటర్లలో 94వ స్థానానికి చేరుకున్నాడు. ఇక టాప్ 10లో భారత్ తరపున డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఒక్కడే ఉన్నాడు. పంత్ 10 స్ధానంలో కొనసాగుతుండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వరుసగా 13వ స్థానాల్లో ఉన్నారు. చదవండి: IND vs WIL వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్.. హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ! -
రోహిత్ శర్మ పరువు తీసిన సునీల్ గవాస్కర్
-
#RAshwin: బాధ కలిగిన మాట నిజమే..
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా మరోసారి రన్నరప్‌కే పరిమితమైంది. డబ్ల్యూటీసీ 2021-23 విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో టీమిండియాపై 209 పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా సగర్వంగా టైటిల్‌ను అందుకుంది. అయితే టెస్టుల్లో వరల్డ్ నెంబర్‌వన్ బౌలర్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులోకి ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను అదనపు పేసర్‌గా తీసుకొచ్చారు. అయితే ఈ నిర్ణయంపై విమర్శలు వచ్చినప్పటికి మ్యాచ్ ముగిసేవరకు అశ్విన్ స్పందించలేదు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన అనంతరం అశ్విన్ ఎట్టకేలకు నోరు విప్పాడు. ట్విటర్ ద్వారా స్పందించిన అశ్విన్ ముందుగా ఆస్ట్రేలియాకు శుభాకాంక్షలు తెలిపాడు. ''డబ్ల్యూటీసీ టైటిల్ సాధించిన పాట్ కమిన్స్ సేనకు కంగ్రాట్స్. ఈ విజయానికి వారు అర్హులు. నన్ను ఎంపిక చేయకపోవడంపై పెద్దగా బాధ లేదు. ఎంత కష్టపడినా జట్టులో 11 మందికి మాత్రమే చోటు ఉంటుంది. వికెట్ పేసర్లకు అనుకూలంగా ఉండడంతో ఒక స్పిన్నర్ చాలనుకొని జడేజాను ఆడించారు. అయితే టీమిండియా ఓటమి బాధ కలిగించింది నిజమే. మన జట్టులో కొన్ని లోపాలున్నప్పటికి గెలవడానికి ప్రయత్నించిన పోరాటం బాగుంది. రెండేళ్లు కష్టపడితే డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు వచ్చాం. ఇలా ఆఖరి మెట్టుపై బోల్తా పడడం బాధనే కలిగిస్తుంది కదా. ఇంకో విషయం ఏంటంటే.. ఈ రెండేళ్లలో నాతో పాటు ఎన్నో టెస్టు మ్యాచ్‌లు ఆడిన సభ్యులకు.. ముఖ్యంగా కోచింగ్, సపోర్ట్ స్టాఫ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. త్వరలోనే మీ ముందుకు వస్తా'' అంటూ తెలిపాడు. ఇక డబ్ల్యూటీసీ 2021-23 సైకిల్లో టీమిండియా తరపున అశ్విన్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఈ సైకిల్లో అశ్విన్ మొత్తంగా 61 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ అదే డబ్ల్యూటీసీ ఫైనల్లో మొత్తంగా ఐదు వికెట్లు(తొలి ఇన్నింగ్స్‌లో ఒకటి, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు) పడగొట్టాడు. ఒకవేళ అశ్విన్ ఫైనల్ ఆడి ఉంటే టీమిండియా పరిస్థితి వేరుగా ఉండేదేమో అని అభిమానులు భావిస్తున్నారు. Congratulations Australia on winning this #WTCFinal and closing out this cycle of test cricket. It is disappointing to end up on the wrong side of things, nevertheless it was a great effort over the last 2 years or so to get here in the first place. Amidst all the chaos and… — Ashwin 🇮🇳 (@ashwinravi99) June 11, 2023 చదవండి: అహ్మదాబాద్ స్టేడియం నిజంగా గొప్పదా!.. ఎందుకంత ప్రాముఖ్యత? -
పాపం గిల్... భారీ జరిమానా?
-
వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్స్ ఇంగ్లాండ్ లో ఎందుకు వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్స్ ఇంగ్లాండ్ లో ఎందుకు వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్స్ ఇంగ్లాండ్ లో ఎందుకు
-
ఐపీఎల్లో అలా అడగడం లేదు కదా.. రోహిత్ శర్మపై లెజెండ్ ఫైర్
ఐసీసీ ఈవెంట్లో టీమిండియా మరోసారి నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఘోర ఓటమి చూసింది. 444 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 234 పరుగులకే కుప్పకూలింది. కాగా డబ్ల్యూటీసీ విజేతను నిర్ణయించడానికి కేవలం ఒక్క మ్యాచ్ సరిపోదని, కనీసం మూడు మ్యాచ్‌ల సిరీస్‌నైనా ఆడించాలని రోహిత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఈ వాదనతో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విభేదించాడు. "డబ్ల్యూటీసీ ఫైనల్ ఎంతో కాలం క్రితమే నిర్ణయించబడి ఉంటుంది. ఫైనల్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఉంటుందని డబ్ల్యూటీసీ సైకిల్ మొదటి మ్యాచ్ మొదలకావడానికి ముందే మీకు తెలుసు. కాబట్టి అందకు తగ్గట్టు మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. మీరు ఐపీఎల్‌కు ఎలా అయితే సిద్దమవుతున్నారో ఈ మ్యాచ్‌కు కూడా అలానే ప్రిపేర్ కావాలి. అక్కడ ఎవరూ మూడు మ్యాచులు పెట్టండి అని అడగడం లేదు కాదా. ఎవరికైనా కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి. భవిష్యత్తులో ముందుకు ఎలా వెళ్లాలన్న దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు విజేతను నిర్ణయించడానికి మూడు మ్యాచ్‌లు పెట్టమని అడుగుతున్నారు. అదే అప్పుడు కూడా ఓడిపోతే ఐదు మ్యాచ్‌లు పెట్టమని అడగరని గ్యారంటీ ఎంటీ" అని సన్నీ ప్రశ్నించాడు. చదవండి: WTC Final: కోహ్లికి ఏమైంది.. రోహిత్, ద్రవిడ్‌తో విభేదాలా? కారణం అదేనా -
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేత ఆస్ట్రేలియా
-
'ఇదొక గుణపాఠం.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ మా కొంపముంచింది'
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2021-23 టైటిల్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఓవల్ వేదికగా ఆసీస్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. వరుసగా రెండో ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన టీమిండియా రన్నరప్‌కే పరిమితమైంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ''టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొని వారిని(ఆస్ట్రేలియాను) కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్‌కి దించడంతో మేము బాగా ప్రారంభించామని అనుకున్నాను. అందుకు అనుగుణంగా మా బౌలర్లు ఆట తొలిరోజు మొదటి సెషన్లో బాగా బౌలింగ్ చేశారు. కానీ తర్వాతి సెషన్ నుంచి మా పతనం ఆరంభమైంది. ఆస్ట్రేలియన్ బ్యాటర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. పట్టు చిక్కిందనుకున్న సమయంలో ట్రెవిస్ హెడ్, స్టీవెన్ స్మిత్‌ల భాగస్వామ్యం వారిని ముందంజలో ఉంచింది. ఒక రకంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులతోనే సగం విజయం సాధించింది. కానీ మేము గెలవడానికి ప్రయత్నించాం. రెండో ఇన్నింగ్స్‌లో వారిని తొందరగా ఔట్ చేయాలనుకున్నాం. అందులో దాదాపు సక్సెస్ అయ్యాం. కానీ తొలి ఇన్నింగ్స్‌లో లభించిన భారీ ఆధిక్యం వాళ్లకు కలిసొచ్చింది.. అదే మా కొంపముంచింది. మా బ్యాటింగ్ విభాగం బాగానే ఉందనుకుంటున్నా. కీలక సమయంలో ఆడడంలో విఫలమయ్యాం. నాలుగేళ్లలో రెండు ఫైనల్స్ ఆడామంటే మా ఆట బాగానే ఉందని అర్థం. ఈ ఫైనల్ కోసం రెండేళ్లు పాటు కష్టపడ్డాం. వరుసగా టెస్టు సిరీస్‌లు గెలిచి ఫైనల్ దాకా వచ్చాం. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఓడిపోయాం. మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానులు మాకు బాగా మద్దతిచ్చారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు'' అంటూ ముగించాడు. -
WTC Final 2023: టీమిండియా ఘోర పరాజయం
-
ఆస్ట్రేలియా చరిత్ర.. అన్ని ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన తొలి జట్టుగా
డబ్ల్యూటీసీ 2021-23 ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా అవతరించింది. జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా టీమిండియాతో జరిగిన ఫైనల్లో ఆసీస్ 209 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 444 పరుగుల కష్ట సాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కనీసం డ్రాకు కూడా ప్రయత్నించకుండానే 234 పరుగులకు ఆలౌట్ అయింది తొలి సెషన్‌లోపే ఆసీస్ బౌలర్ల ధాటికి తోక ముడిచి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. గిల్ క్యాచ్ విషయంలో చేసిన పొరపాటు మినహా మిగతా అన్ని విషయాల్లో పక్కా ప్లాన్‌తో ఆడిన ఆస్ట్రేలియా పరిపూర్ణ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు క్రికెట్లో చరిత్ర సృష్టించింది. ఇప్పటికే వన్డే, టి20 వరల్డ్‌కప్స్‌తో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలు నెగ్గిన ఆస్ట్రేలియా తాజాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల(వన్డే, టి20, టెస్టులు) ఐసీసీ ట్రోఫీలు అందుకున్న తొలి జట్టుగా ఆస్ట్రేలియా రికార్డులకెక్కింది. తాజా డబ్ల్యూటీసీ టైటిల్‌తో కలిసి ఇప్పటివరకు ఆసీస్ తొమ్మిది ఐసీసీ టైటిల్స్ నెగ్గడం విశేషం. అందులో వన్డే వరల్డ్‌కప్‌ను ఐదుసార్లు(1987, 1999, 2003, 2007, 2015), ఒక టి20 వరల్డ్‌కప్(2021), ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండుసార్లు (2006, 2009)లో గెలుచుకున్న ఆస్ట్రేలియా తాజాగా 2023లో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ నెగ్గి ఐసీసీ అన్ని మేజర్ టైటిల్స్ గెలిచిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. ✅ICC ODI World Cup ✅ICC Champions Trophy ✅ICC T20 World Cup ✅ICC World Test Championship Australia becomes the first team to win all ICC trophies 👏 Their 9th ICC title🤯 pic.twitter.com/yQLXJFFtTu — CricTracker (@Cricketracker) June 11, 2023 చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసారు..! -
WTC Final: విజేత ఆసీస్.. భారత్‌పై 209 పరుగుల తేడాతో విజయం
టీమిండియా ఆలౌట్.. 209 పరుగుల తేడాతో ఆసీస్ విజయం డబ్ల్యూటీసీ ఫైనల్ 2021-23 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. టీమిండియాతో జరిగిన ఫైనల్లో ఆసీస్ జట్టు 209 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 444 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఐదోరోజు లంచ్ సెషన్‌లోపే 234 పరుగులకే కుప్పకూలింది. 161/3 క్రితం రోజు స్కోరుతో ఐదోరోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు కోహ్లి రూపంలో కాసేపటికే షాక్ తగిలింది. ఆ వెంటనే జడేజా కూడా డకౌట్ కావడంతో టీమిండియా ఓటమి దాదాపు ఖరారైంది. అయితే రహానే, శార్దూల్‌లు తొలి ఇన్నింగ్స్‌లో లాగా ఏదైనా అద్బుతం చేసి డ్రా దిశగా నడిపిస్తారేమోనని ఆశించారు. కానీ ఆసీస్ బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. రహానే, శార్దూల్‌లు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో.. టెయిలెండర్డను ఔట్ చేయడం ఎంతో సేపు పట్టలేదు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియోన్ నాలుగు వికెట్లు తీయగా.. స్కాట్ బోలాండ్ మూడు, స్టార్క్ రెండు, కమిన్స్ ఒక వికెట్ తీశాడు. సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా: 469& 270/8 టీమిండియా: 296 ఆలౌట్& 234 ఆలౌట్ ఫలితం: 209 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ 2021-23 ఛాంపియన్‌గా అవతరించింది. ఓటమికి రెండు వికెట్ల దూరంలో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి మరింత దగ్గరైంది. ప్రధాన బ్యాటర్లంతా ఇప్పటికే వెనుదిరగడంతో ఆసీస్ బౌలర్లు టెయిలెండర్ల వికెట్లు తీసే పనిలో పడ్డారు. మిచెల్ స్టార్క్ ఉమేశ్ యాదవ్‌ను ఔట్ చేయడం ద్వారా టీమిండియా 220 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ► తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న శార్దూల్ ఠాకూర్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం డకౌట్‌గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో శార్దూల్ ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఆసీస్ విజయం సాధించడం తథ్యం. రహానే(46) ఔట్.. ఆరో వికెట్ డౌన్ డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్ మాదిరి ఆదుకుంటాడనుకున్న రహానే(46) మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 212 పరుగుల వద్ద ఆరో వికెట్ నష్టపోయింది. మరో 232 పరుగులు చేయాల్సిన టీమిండియా ఓటమి నుంచి తప్పించుకోవడం అసాధ్యంగా కనిపిస్తుంది. జడేజా డకౌట్.. ఐదో వికెట్ డౌన్ ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బ కొట్టాడు. కోహ్లి ఔటైన రెండు బంతుల వ్యవధిలోనే జడేజా కూడా డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కోహ్లి(49)ఔట్.. టీమిండియా 179/4 భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు కోహ్లి రూపంలో షాక్ తగిలింది. 49 పరుగులు చేసిన కోహ్లి స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 179 పరుగులు వద్ద నాలుగో వికెట్ నష్టపోయింది. కాగా భారత్ విజయానికి ఇంకా 265 పరుగులు చేయాల్సి ఉంది. ఐదోరోజు మొదలైన ఆట.. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ ఆట ఆఖరి రోజుకు చేరుకుంది. క్రితం రోజు స్కోరు ఆటను ఆరంభించిన టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కోహ్లి 46, రహానే 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. చేయాల్సినవి 280 పరుగులు.. చేతిలో ఉన్నవి ఏడు వికెట్లు. మరి టీమిండియా 444 పరుగుల టార్గెట్‌ను చేధించి చరిత్ర సృష్టిస్తుందా లేక డ్రాకు మొగ్గుచూపుతుందా అనేది చూడాలి. -
ఓవల్‌లో వాలిపోయిన ప్రేమజంట.. ఫోటోలు వైరల్!
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ చద్దా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. అతికొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఢిల్లీలో వీరి ఎంగేజ్మెంట్ వేడుక వైభవంగా జరిగింది. నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం విదేశాల్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఇంగ్లాండ్‌లోని ఓవల్‌లో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఈ జంట మెరిసింది. (ఇది చదవండి: ఎంగేజ్మెంట్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న పరిణీతి చోప్రా ) ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు పరిణీతి, రాఘవ చద్దా ఓవల్‌లో వాలిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న త్వరలోనే వివాహాబంధంతో ఒక్కటి కానుంది. వీరి పెళ్లి వేడుక రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: టాప్ హీరోయిన్ కూతురి అన్నప్రాసన వేడుక చూశారా?) View this post on Instagram A post shared by 😍 PARINEETI ADDICTED 😍 (@parineetigalaxy) -
'చీటింగ్ అనే పదం వాళ్ల బ్లడ్‌లోనే ఉంది!'
క్రికెట్‌ను కొన్నేళ్ల పాటు ఆస్ట్రేలియా శాసించిందన్న మాట అందరికి తెలిసిందే. 1990 దశకం నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియా క్రికెట్‌ను ఏకచత్రాధిపత్యంతో ఏలింది. ఈ రెండు దశాబ్దాల్లో కంగారూలు మూడు వన్డే వరల్డ్‌కప్‌లతో పాటు వన్డే, టెస్టుల్లో చాలాకాలం పాటు నెంబర్‌వన్‌గా కొనసాగారు. భయమంటే ఏంటో ఎరుగని జట్టుగా ఉన్న ఆస్ట్రేలియాకు టీమిండియా కూడా దాసోమయ్యింది. 2003 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ అందుకు చక్కటి ఉదాహరణ. స్టీవా, రికీ పాంటింగ్, మార్క్ వా, ఆడమ్ గిల్‌క్రిస్ట్, మైకెల్ బెవాన్, గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్, మైకెల్ క్లార్క్, జాసన్ గిలెస్పీ.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. జట్టుగా ఎంత బలంగా ఉంటుందో.. ఆధిపత్యం ప్రదర్శించడంలోనూ అంతే పట్టుదలగా ఉండేది. ఒక దశలో కంగారూలతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు కంగారు పడే పరిస్థితి ఉండేది. అయితే ఇన్ని ఘనతలున్నా కంగారూలకు చీటింగ్ అనేది పర్యాయపదంగా ఉండిపోయింది. ఆస్ట్రేలియా ఎన్నో గొప్ప మ్యాచ్‌లు గెలిచినా కొన్నిసార్లు ఆ జట్టు చీటింగ్ చేసి గెలిచిన మ్యాచ్‌లే ఎక్కువగా గుర్తుండిపోయాయి. ముఖ్యంగా క్యాచ్ ఔట్ల విషయంలో ఆసీస్ ఆటగాళ్లు చేసిన చీటింగ్‌లు ఏ జట్టు చేయలేదని చెప్పొచ్చు. బాల్ టాంపరింగ్ నుంచి సాండ్ పేపర్ ఉదంతం వరకు అన్ని ఆస్ట్రేలియా ఖాతా నుంచి వచ్చినవే. అందుకే చీటింగ్ అనే పదం కంగారూల బ్లడ్‌లోనే ఉందంటారు క్రికెట్ అభిమానులు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మరోసారి చీటింగ్‌ను బయటపెట్టింది. 444 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు గిల్, రోహిత్‌లు శుభారంభం అందించారు. 41 పరుగులు జోడించిన అనంతరం స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో షాట్ ఆడే యత్నంలో శుబ్‌మన్ గిల్ స్లిప్‌లో ఉన్న గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్యాచ్ తీసుకునే క్రమంలో డైవ్ చేసిన గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి.. ఫోర్స్‌కు బంతిని నేలకు తాకించినట్లు కనిపించింది. దీంతో గిల్ రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్‌లో కెమెరా యాంగిల్ పరిశీలించగా గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి నేలకు తాకించినట్లు కనిపించింది. అయితే గ్రీన్ చేతి వేలు బంతి కింద ఉన్నట్లు థర్డ్అంపైర్ మైక్‌లో చెప్పి బిగ్ స్ర్కీన్‌పై గిల్ ఔట్ అని ప్రకటించాడు. ఈ నిర్ణయం రోహిత్, గిల్‌తో పాటు సగటు అభిమానిని ఆశ్చర్యపరిచింది. గతంలోనూ పాంటింగ్, స్టీవ్ స్మిత్, మైకెల్ క్కార్ల్ కెప్టెన్లుగా ఉన్నప్పుడు ఇలాంటి చీటింగ్‌లు చాలానే జరిగాయి. అంపైర్లు కూడా ఆసీస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఫలితాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి కూడా నాటౌట్ అని క్లియర్‌గా కనిపిస్తున్నా థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం ఇచ్చాడు. అయితే సాఫ్ట్ సిగ్నల్ నిబంధన ఉండి కూడా ఎందుకు ఉపయోగించడం లేదని అభిమానుల సందేహం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) Always winning with cheating #notout pic.twitter.com/H2m939vqCD — Milind Joshi (@MilindJ03022606) June 10, 2023 Cheating is in Australian cricket team DNA. pic.twitter.com/fqXsPxulBQ — SAVAGE (@Freakvillliers) June 10, 2023 చదవండి: #NotOut: థర్డ్ అంపైర్ చీటింగ్.. గిల్ ఔట్ కాదు -
చేధిస్తే చరిత్రే; టెస్టుల్లో అత్యధిక లక్ష్య చేధన ఎంతో తెలుసా?
ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ తుది అంకానికి చేరుకుంది. నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 270 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియా ముందు 444 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టెస్టు క్రికెట్లో ఇంత భారీ టార్గెట్‌ను చేధించిన సందర్బాలు లేవు. ఒకవేళ టీమిండియా భారీ టార్గెట్‌ను అందుకుంటే మాత్రం కొత్త చరిత్రను తిరగరాసినట్లవుతుంది. టెస్టుల్లో అత్యధిక చేధన ఎంతో తెలుసా? ఇక టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల లక్ష్య చేధన 418గా ఉంది. 2003లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ ఏడు వికెట్లు కోల్పోయి 418 పరగుల టార్గెట్‌ను అందుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంది. 2008లో ఆస్ట్రేలియా విధించిన 414 పరుగుల టార్గెట్‌ను ప్రొటిస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక మూడో స్థానంలో టీమిండియా ఉంది. 1976లో వెస్టిండీస్ విధించిన 403 పరుగుల టార్గెట్‌ను టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇది మినహా ఇప్పటివరకు టీమిండియా 400 పరుగుల టార్గెట్‌ను మళ్లీ చేధించిన దాఖలాలు లేవు. ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా విధించిన 444 పరుగుల టార్గెట్‌ను చేధిస్తే.. అత్యధిక పరుగుల టార్గెట్‌ను చేధించిన జట్టుగా టీమిండియా రికార్డులకెక్కనుంది. India will create history if they chase down 444. No team chased down more 418 in Test cricket! pic.twitter.com/Tkyd3khSpz — Mufaddal Vohra (@mufaddal_vohra) June 10, 2023 చదవండి: #NotOut: థర్డ్ అంపైర్ చీటింగ్.. గిల్ ఔట్ కాదు