ప్రస్తుత జమానాలో ప్రపంచ క్రికెట్ దేశాలకు సింహస్వప్నంగా ఉన్న టీమిండియా బ్యాటర్ ఎవరంటే..? అందరూ ముక్తకంఠంతో విరాట్ కోహ్లి పేరు చెప్తారు. అయితే ఐపీఎల్-2023 తర్వాత సీన్ మారనుంది. అంతర్జాతీయ క్రికెట్ ఆడే దేశాలకు కోహ్లితో పాటు మరో టీమిండియా ఆటగాడి నుంచి ప్రమాదం పొంచి ఉంది. అతని పేరే శుభ్‌మన్ గిల్. ఈ టీమిండియా యంగ్ సెన్సేషన్ ప్రస్తుతం కోహ్లితో సమానంగా చెలరేగుతూ, ప్రపంచ దేశాల బౌలర్లకు ఛాలెంజ్ విసురుతున్నాడు.
ఆ ఫార్మాట్, ఈ ఫార్మట్ అన్న తేడా లేకుండా వీరిద్దరు పోటీపడి మరీ పరుగులు సాధిస్తున్నారు. సెంచరీలు చేసే విషయంలోనూ వీరి మధ్య పోటీ ఏ మాత్రం తగ్గడం లేదు. నువ్వు కొడితే, నేను కొడతా అన్నట్లు వీరి మధ్య పోటీ సాగుతుంది. ఈ ఏడాది వీరిద్దరు ఒకే మ్యాచ్‌లో మూడు సార్లు సెంచరీలు బాదడమే ఇందుకు ఉదాహరణ. అలాగే వీరు ఈ క్యాలెండర్ ఇయర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లతో పాటు ఐపీఎల్‌లోనూ సెంచరీలు సాధించారు.
కోహ్లి-గిల్ ప్రస్తుత ఫామ్ చూసి ప్రపంచ దేశాల బౌలర్లు వణికిపోతున్నారు. ఇన్ని రోజులు ఒక్క కోహ్లితోనే వేగలేకపోయాము.. ఇప్పుడు మరొకరు తయారయ్యారని అనుకుంటున్నారు. హేమాహేమీ బౌలర్లు సైతం వీరిద్దరి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. అందరి కంటే ముందు టీమ్ ఆస్ట్రేలియాలో గుబులు మొదలైంది. జూన్ 7 నుంచి జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్లో వీరిని ఎలా కట్టడి చేయాలో అర్ధం కాక వారు తలలు పట్టుకుంటున్నారు.
కోహ్లి, గిల్ భీకర ఫామ్ చూసి వారు హడలెత్తిపోతున్నారు. ఐపీఎల్ 2023లో ఇద్దరు వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన వైనాన్ని చూసి ఆసీస్ బౌలర్లు భయబ్రాంతులకు గురవుతున్నారు. కోహ్లితో పోలిస్తే వారు ఎక్కువగా గిల్ విషయంలో భయపడుతున్నారు. కోహ్లి ఎలా ఆడతాడో వారికి ఓ అవగాహణ ఉంది. అదే గిల్ విషయంలో వారికి ఆ అవగాహణ లేదు. ఇందు కోసం ఆసీస్ మేనేజ్‌మెంట్ ఇటీవలి కాలంలో గిల్ ఆడిన ఇన్నింగ్స్‌ల వీడియోలను ఆటగాళ్లకు అందుబాటులోకి తెచ్చినట్లు సమాచారం.
It’s the third time that both Shubman Gill and Virat Kohli have scored a 💯 in the same match this year 🔥💙
— Sportskeeda (@Sportskeeda) May 22, 2023
Hopefully for the fourth time in the WTC Final 🤞
📸: IPL/BCCI #IPL2023 #India #TeamIndia #CricketTwitter pic.twitter.com/vca4Rn5Geo
Comments
Please login to add a commentAdd a comment