WTC Final: Team India In Big Trouble, Lost Kohli And Rahane Wickets - Sakshi
Sakshi News home page

WTC Final: ఆదుకుంటారనుకుంటే ఉసూరుమనిపించారు.. ఓటమే తరువాయి..!

Published Sun, Jun 11 2023 4:49 PM | Last Updated on Sun, Jun 11 2023 5:09 PM

WTC Final: Team India In Big Trouble, Lost Kohli And Rahane Wickets - Sakshi

వరల్ట్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021 ఫైనల్లో టీమిండియా ఓటమి దాదాపుగా ఖరారైంది. ఈ సీజన్‌లో కూడా భారత్‌ టైటిల్‌ గెలవకుండా రిక్త హస్తాలతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత టీమిండియా సభ్యులు 10 ఏళ్ల భారత ఐసీసీ ట్రోఫీ కలను సాకారం​ చేస్తారనుకుంటే, దారుణంగా నిరాశపరిచారు. ఆఖరి రోజు కోహ్లి, రహానే అద్భుతం చేసి టీమిండియాకు టైటిల్‌ అందిస్తారనుకుంటే, ఉసూరుమనిపించారు.

కోహ్లి (49) ఆఫ్‌ స్టంప్‌ ఆవల వెళ్తున్న బంతిని అనవసరంగా గెలుక్కుని వికెట్‌ సమర్పించుకుంటే, రహానే (46) తన వంతు ప్రయత్నం చేద్దామనుకుని విఫలమయ్యాడు. మధ్యలో జడేజా (0), శార్దూల్‌ ఠాకూర్‌ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఫలితంగా భారత్‌ 213 పరగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. శ్రీకర్‌ భరత్‌ (22) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతనికి జతగా ఉమేశ్‌ యాదవ్‌ (0) క్రీజ్లో ఉన్నాడు. 

కాగా, 444 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 164/3 స్కోర్‌ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది. ఇక టీమిండియాకు ఓటమి మాత్రమే మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. 469 పరుగులకు ఆలౌట్‌ కాగా.. భారత్‌ 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 270/8 స్కోర్‌ వద్ద డిక్లేర్‌ చేయగా... భారత్‌ 220/7 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. 

చదవండి: ఆసియా కప్‌ 2023 విషయంలో పంతం నెగ్గించుకున్న పాకిస్తాన్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement