Ajinkya Rahane
-
’పాటిదార్‌ను తక్కువగా అంచనా వేశాను.. రహానే ఆ ట్రిక్ మిస్సయ్యాడు’
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్‌గా టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానేకు శుభారంభం లభించలేదు. అతడి సారథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ తమ తొలి మ్యాచ్‌లోనే ఘోర ఓటమిని చవిచూసింది. ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.ఇక కేకేఆర్ సారథిగా అజింక్య రహానే ఈ మ్యాచ్‌తో తన ప్రయాణం మొదలుపెట్టగా.. ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌కు కూడా ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. అయితే, సీనియర్ అయిన రహానే.. పాటిదార్ పన్నిన వ్యూహాల ముందు తేలిపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.కేకేఆర్- ఆర్సీబీ మ్యాచ్ ఆరంభంలో తాను పాటిదార్‌ను తక్కువగా అంచనా వేశానని.. అయితే, రహానే తన చెత్త నిర్ణయాలతో అతడి ముందు తలవంచాడని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘రజత్ పాటిదార్ కెప్టెన్‌గా రాణించగలడా? అనే సందేహం ఉండేది.కేకేఆర్‌తో మ్యాచ్‌లో తొలి మూడు ఓవర్లు ఆర్సీబీకి బాగానే సాగింది. కానీ నాలుగో ఓవర్లో పాటిదార్.. రసిఖ్ సలామ్‌ను తీసుకువచ్చాడు. ఐదో ఓవర్లో కృనాల్ పాండ్యాను బరిలోకి దించాడు. దయచేసి ఇలా చేయకు పాటిదార్ అని మనసులో అనుకుంటూనే ఉన్నాను.రహానే బ్యాట్‌తో చెలరేగడంతో కేకేఆర్ పది ఓవర్లలో వంద పరుగుల మార్కు అందుకుంది. నిజానికి ఆ జట్టు 200కు పైగా స్కోరు చేయాల్సింది. కానీ పాటిదార్ వ్యూహాలు అప్పుడే పని చేయడం మొదలుపెట్టాయి. తొలి పది ఓవర్లలో పాటిదార్‌కు కెప్టెన్‌గా అసలు మార్కులేమీ వేయలేకపోయాను.నిజానికి ఆర్సీబీ బలహీనత స్పిన్నర్లు. కానీ కృనాల్ సేవలను పాటిదార్ ఉపయోగించుకున్న తీరు అద్బుతం. స్పిన్నర్లనే జట్టుకు బలంగా మార్చాడు. కృనాల్ తొలి ఓవర్లో భారీగా పరుగులు ఇచ్చినా.. తర్వాత మూడు వికెట్లు తీశాడు. సూయశ్ లూజ్ బాల్స్ వేసినా.. రసెల్ రూపంలో కీలక వికెట్ దక్కించుకున్నాడు.దీంతో కేకేఆర్ కనీసం 175 పరుగుల మార్కు కూడా దాటలేకపోయింది. నేను పాటిదార్ గురించి ఏమనుకున్నానో.. అది రహానే విషయంలో నిజమైంది. నిజానికి నరైన్‌ను ఆరంభంలోనే బౌలింగ్ చేయించాల్సింది. ఆర్సీబీ బ్యాటర్లు పరుగులు పిండుకుంటున్నా.. నరైన్‌ను రహానే ఆలస్యంగా పిలిపించడం ప్రభావం చూపింది.రహానే ట్రిక్ మిస్సయ్యాడు. దానిని ఆర్సీబీ క్యాష్ చేసుకుంది. కెప్టెన్‌గా పాటిదార్ హిట్టయితే.. రహానే మాత్రం గతంలో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉన్నా తేలిపోయాడు. ఇక బ్యాటర్‌గానూ పాటిదార్ అదరగొట్టాడు. సునిల్ నరైన్ బౌలింగ్‌లో అతడు మూడు సిక్సర్లు బాదడం మామూలు విషయం కాదు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని నరైన్ బౌలింగ్‌ను చాలాసార్లు ఎదుర్కొన్నారు. అయితే, ముగ్గురూ కలిసి అతడి బౌలింగ్‌లో కేవలం నాలుగు సిక్సర్లే కొట్టారు. అయితే, పాటిదార్ మాత్రం ఇక్కడే తన సుప్రిమసీ చూపించాడు. కెప్టెన్‌గా గొప్ప ఆరంభం అందుకున్నాడు’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు. కాగా రహానే గతంలో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్(ఇప్పుడు లేదు), రాజస్తాన్ రాయల్స్ జట్లకు సారథిగా పనిచేశాడు.ఐపీఎల్-2025: కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లుకేకేఆర్- 174/8 (20)ఆర్సీబీ- 177/3 (16.2)ఫలితం: ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్‌పై ఆర్సీబీ గెలుపు -
KKR VS RCB: అప్పుడే మ్యాచ్ చేజారింది.. మంచు కూడా వారికి కలిసొచ్చింది: రహానే
ఆర్సీబీతో జరిగిన సీజన్ ఓపెనర్‌లో (IPL 2025) డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ఓటమి చవి చూసింది. సొంత మైదానంలో (ఈడెన్ గార్డెన్స్) జరిగిన మ్యాచ్ అయినా కేకేఆర్‌కు పరాభవం తప్పలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. నరైన్ (26 బంతుల్లో 44; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), రహానే (31 బంతుల్లో 56; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే 10 ఓవర్ తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. మూడు బంతుల వ్యవధిలో నరైన్, రహానే ఔటయ్యారు. దీంతో పరుగులు రావడం చాలా కష్టమైంది. ఈ దశలో ఆర్సీబీ స్పిన్నర్లు రెచ్చిపోయారు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ఫలితంగా 200 దాటుతుందనుకున్న కేకేఆర్ స్కోర్ 174 పరుగులకే పరిమితమైంది. ఛేదనలో ఆర్సీబీకి ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (36 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్నందించారు. వీరిద్దరూ పవర్ ప్లేలో 80 పరుగులు చేసి కేకేఆర్ చేతిలో నుంచి మ్యాచ్‌ను అప్పుడే లాగేసుకున్నారు. సాల్ట్, కోహ్లితో పాటు పాటిదార్ (16 బంతుల్లో 34; 5 ఫోర్లు, సిక్స్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆర్సీబీ మరో 22 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ఆర్సీబీ గెలుపులో బౌలర్లు ప్రధాన పాత్ర పోషించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కృనాల్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. హాజిల్‌వుడ్ సామర్థ్యం మేరకు రాణించి 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. యశ్ దయాల్ (3-0-25-1) పర్వాలేదనిపించాడు. సుయాశ్ శర్మ, రసిక్ సలామ్ తలో వికెట్ తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.ఓటమి అనంతరం కేకేఆర్ కెప్టెన్ రహానే ఇలా అన్నాడు. 13వ ఓవర్ వరకు మంచి స్కోర్ సాధిస్తామని అనుకున్నాను. కానీ ఆ దశలో వికెట్లు కోల్పోవడంతో తామనుకున్నది జరగలేదు. వరుస క్రమాల్లో వికెట్లు కోల్పోవడం తమ జోరుకు అడ్డుకట్ట వేసింది. నా తర్వాత (ఇన్నింగ్స్‌లో) వచ్చిన బ్యాటర్లు వారి శక్తి మేరకు ప్రయత్నించినప్పటికీ వర్కౌట్ కాలేదు. నేను, వెంకీ (అయ్యర్) బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 200-210 పరుగులు సాధించవచ్చని చర్చించుకున్నాం. కానీ వరుస వికెట్లు తమ జోరును నీరుగార్చాయి. పవర్ ప్లేలో సాల్ట్, కోహ్లి అద్భుతంగా ఆడారు. అప్పుడే మ్యాచ్ మా నుంచి చేజారింది. మంచు కూడా వారి గెలుపుకు సహకరించింది. 200 పైబడిన స్కోర్ చేసుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఓవరాల్‌గా క్రెడిట్ ఆర్సీబీ ఆటగాళ్లకు దక్కుతుంది. కీలక దశలో తమను కట్టడి చేయడంతో పాటు పవర్ ప్లేలో వారి బ్యాటింగ్ అద్భుతంగా ఉండింది. ఈ మ్యాచ్ గురించి ఇంకా డిస్కస్ చేయాలని అనుకోవడం లేదు. కొన్ని అంశాల్లో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. కాగా, కేకేఆర్ కెప్టెన్‌గా రహానేకు ఇది తొలి మ్యాచ్. తొలి మ్యాచ్‌లోనే ఓటమితో రహానే కాసింత నిరాశకు లోనైనట్లు కనిపించాడు. వ్యక్తిగతంగా అతను రాణించినా కేకేఆర్‌కు అది వర్కౌట్ కాలేదు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలింగ్ చాలా బలహీనంగా కనిపించింది. ఆర్సీబీ బ్యాటర్ల ముందు వారు తేలిపోయారు. ముఖ్యంగా వారి జట్టులో ఒక్క అనుభవజ్ఞుడైన పేసర్ కూడా లేడు. ఈ లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. గత సీజన్లో కేకేఆర్ విజయాల్లో పేసర్లు ప్రధాన పాత్ర పోషించారు. కానీ ఈ సీజన్లో ఆ జట్టు పేసర్లను కాకుండా స్పిన్నర్లనే ఎక్కువ నమ్ముకుంది. మరి స్పిన్నర్లు కేకేఆర్‌ను టైటిల్ నిలబెట్టుకునేలా చేస్తారో లేదో వేచి చూడాలి.కాగా, ఈ సీజన్లో కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్‌ను మార్చి 26న ఆడుతుంది. గౌహతి వేదికగా నాడు జరిగే మ్యాచ్‌లో కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొంటుంది. -
RCB Vs KKR: అజింక్య రహానే విధ్వంసం.. కేవలం 25 బంతుల్లోనే! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో తొలి హాఫ్ సెంచరీ నమోదైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. తొలి ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన రహానే.. ఆరంభం నుంచే ఆర్సీబీ బౌలర్లపై విరుచుపడ్డాడు.తనదైన శైలిలో స్టైల్లో షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో రహానే కేవలం 25 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 31 బంతులు ఎదుర్కొన్న రహానే.. 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.రహానే అరుదైన రికార్డు..కాగా ఈ మ్యాచ్‌తో రహానే ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే మూడు ఫ్రాంచైజీలకు సారథిగా వ్యవహరించిన తొలి భారత ఆటగాడిగా రహానే రికార్డులకెక్కాడు. రహానే తొలిసారిగా 2017 ఐపీఎల్ సీజన్లో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ (RPS) జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఆ తర్వాత ఐపీఎల్-2019లో రాజస్తాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించిన రహానే.. ఇప్పుడు మళ్లీ కేకేఆర్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. దీంతో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఐపీఎల్-2025లో మెగా వేలంలో రహానేను కేవలం రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి రౌండ్లో అమ్ముడుపోని రహానే ఆఖరి రౌండ్లో కేకేఆర్ సొంతం చేసుకుంది. Proud of You My Man Sir AJINKYA RAHANE 🥹❤️🫡 pic.twitter.com/VeNXSmW2n1— Malay 🇮🇳❤ (@malay_chasta) March 22, 2025 -
ఐపీఎల్-2025 తొలి మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ: తుదిజట్లు ఇవే!?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తాజా సీజన్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్‌తో శనివారం తెరలేవనుంది. ఇందుకు ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ వేదిక. ఇక ఈసారి ఈ రెండు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి.గతేడాది తమను చాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్‌ను వదిలేసిన కోల్‌కతా.. ఈసారి వెటరన్ ప్లేయర్ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. మరోవైపు.. బెంగళూరు ఫ్రాంఛైజీ అనూహ్య రీతిలో రజత్ పాటిదార్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇక మెగా వేలం-2025 నేపథ్యంలో జట్లలోనూ భారీ మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్లు, కొత్త జట్లతో కేకేఆర్- ఆర్సీబీ ఏమేరకు సత్తా చాటుతాయనేది ఆసక్తికరంగా మారింది. తొలి మ్యాచ్‌లో గెలుపొంది సీజన్లో శుభారంభం అందుకోవాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి.వర్షం ముప్పు లేనట్లే?మరోవైపు.. వర్షం ఈ మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తుందన్న వార్తల నడుమ.. కోల్‌కతాలో వాన తెరిపినిచ్చిందని, ఎండ కూడా కాస్తోందన్న తాజా సమాచారం సానుకూలాంశంగా పరిణమించింది. మరి క్యాష్ రిచ్ లీగ్-2025 ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లో కేకేఆర్, ఆర్సీబీ తుదిజట్లు ఎలా ఉండబోతున్నాయో చూద్దామా?కేకేఆర్ మరోసారి స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్‌ను ఓపెనర్‌గా కొనసాగించనుండగా.. అతడికి జోడీగా సౌతాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్ బరిలోకి దిగడం ఖాయమైనట్లు కనిపిస్తోంది. మూడో స్థానంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్, నాలుగో స్థానంలో కెప్టెన్ రహానే ఆడనున్నారు.కోహ్లికి జోడీగా సాల్ట్!వీరితో పాటు రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, రమణ్‌దీప్ సింగ్‌లతో కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగానే ఉంది. మరోవైపు.. ఆర్సీబీ తరఫున సూపర్‌స్టార్ విరాట్ కోహ్లితో పాటు ఫిల్ సాల్ట్ ఓపెనింగ్‌కు రానున్నాడు. వీరితో పాటు లియామ్ లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ బ్యాటింగ్ విభాగంలో కీలకం కానున్నారు.ఇక బౌలర్ల విషయానికొస్తే.. కేకేఆర్‌కు పేసర్లు హర్షిత్ రాణాతో పాటు వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్‌లు.. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి సేవలు అందించనున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా అంగ్క్రిష్ రఘువన్షీ బరిలోకి దిగే అవకాశం ఉంది.అదే విధంగా.. ఆర్సీబీ పేస్ దళం టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్, యశ్ దయాళ్, జోష్ హాజిల్‌వుడ్‌లతో పటిష్టంగా కనిపిస్తోంది. ఆర్సీబీ తరఫున స్పిన్నర్ సూయశ్ శర్మ లేదంటే స్వప్నిల్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చే అవకాశం ఉంది.కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ తుదిజట్లు (అంచనా)కేకేఆర్సునిల్ నరైన్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, రమణ్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.ఇంపాక్ట్ ప్లేయర్: అంగ్క్రిష్ రఘువన్షీ.ఆర్సీబీఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాళ్. చదవండి: ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ మరొకటి ఉండదు: ‘లక్నో’పై నెటిజన్లు ఫైర్ -
కోల్'కథ' ఎంతవరకు!
ఏ జట్టయినా విజయవంతమైన కూర్పును కొనసాగించాలనుకుంటుంది... కానీ కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం అందుకు విభిన్నమైన ప్రణాళికలతో అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. దశాబ్దకాలం తర్వాత తమ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించిన కెపె్టన్ శ్రేయస్ అయ్యర్‌ను వేలానికి వదిలేసుకున్న నైట్‌రైడర్స్... ఓ మామూలు ఆటగాడి కోసం భారీగా ఖర్చు పెట్టింది. జాతీయ జట్టుకు దూరమైన సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేకు పిలిచి మరీ జట్టు పగ్గాలు అప్పగించింది. అయితే ఎన్ని మార్చినా కోర్ గ్రూప్‌ను మాత్రం కదల్చని కోల్‌కతా... డిఫెండింగ్ చాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకునేందుకు సై అంటోంది! ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మాత్రమే ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండేళ్లు చాంపియన్‌గా నిలిచాయి. నైట్‌రైడర్స్ ఈసారి తమ గెలుపు ‘కథ’ను ఎంతవరకు తీసుకెళ్తుందనేది ఆసక్తికరం కానుంది! –సాక్షి క్రీడావిభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ చెరో ఐదుసార్లు ట్రోఫీ చేజిక్కించుకోగా... ఆ తర్వాత అత్యధికంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) మూడుసార్లు విజేతగా నిలిచింది. 2012, 2014, 2024లో కేకేఆర్ ట్రోఫీ హస్తగతం చేసుకుంది. గతేడాది ఐపీఎల్ వేలంలో ‘కోర్ గ్రూప్’ను తిరిగి కొనసాగించిన ఫ్రాంచైజీ... జట్టుకు మూడోసారి కప్పు అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆ్రస్టేలియా స్టార్ పేసర్ స్టార్క్‌ను మాత్రం వదిలేసుకుంది. పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా రూ. 23 కోట్ల 75 లక్షలు ఖర్చు చేసి ఆశ్చర్యపరిచిన యాజమాన్యం... కోటిన్నర ప్రాథమిక ధరతో కొనుగోలు చేసుకున్న సీనియర్ బ్యాటర్ అజింక్య రహానేకు అనూహ్యంగా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. వేలంలో ఒక్కో జట్టు అత్యధికంగా 25 మందిని ఎంపిక చేసుకునే అవకాశం ఉండగా... కేకేఆర్ 21 మందినే తీసుకుంది. సిక్సర్ల వీరుడు రింకూ సింగ్‌కు రూ. 13 కోట్లు... ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి, వెస్టిండీస్ టి20 స్పెషలిస్ట్‌లు రసెల్, నరైన్‌లకు రూ. 12 కోట్లు చొప్పున అందించి అట్టిపెట్టుకున్న ఫ్రాంచైజీ... హర్షిత్ రాణా, రమణ్‌దీప్‌లను రూ. 4 కోట్లతో కొనసాగించింది. ఆరుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంటే దాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంది. నరైన్‌పై భారీ అంచనాలు... సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రకాంత్ పండిత్ కేకేఆర్‌కు కోచ్‌గా వ్యవహరిస్తుండగా... గతేడాది జట్టుకు మెంటార్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ ... టైటిల్ గెలిచిన అనంతరం టీమిండియా హెడ్ కోచ్‌గా వెళ్లిపోయాడు. ఇప్పుడతడి స్థానంలో విండీస్ మాజీ ఆటగాడు డ్వేన్ బ్రావో మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ముంబై, చెన్నై జట్లు మాత్రమే వరుసగా రెండు సీజన్లు విజేతగా నిలిచాయి. ఇప్పుడు కోల్‌కతా ముందు అలాంటి అరుదైన అవకాశం మూడోసారి ఉంది. వెస్టిండీస్ స్పిన్ ఆల్‌రౌండర్ నరైన్‌ను ఓపెనర్‌గా దింపి మెరుగైన ఫలితాలు రాబట్టిన కేకేఆర్ ఈసారి కూడా అదే ప్లాన్ అనుసరిస్తుందనడంలో సందేహం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఎప్పుడో వీడ్కోలు పలికిన నరైన్... కేకేఆర్ తరఫున అటు స్పిన్నర్‌గా ఇటు ఓపెనర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత సీజన్లో 488పరుగులు, 17 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. గుర్బాజ్, నరైన్ ఇన్నింగ్స్ ఆరంభించడం ఖాయమే కాగా... అజింక్య రహానే, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్ సింగ్ మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు రానున్నారు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, నరైన్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా కీలకం కానున్నారు. రహానే రాణించేనా? డిఫెండింగ్ చాంపియన్‌గా మరింత బాధ్యతగా ఉండాల్సిన కేకేఆర్... తన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచింది. కప్పు అందించిన కెపె్టన్‌ను వదిలేసుకోవడం... తుదిజట్టులో ఉంటాడో లేదో నమ్మకంగా చెప్పలేని ఆటగాడికి జట్టు పగ్గాలు అప్పగించడం... వెరసి సీజన్ ఆరంభానికి ముందే వార్తల్లో నిలిచింది. ఫామ్‌లేమికి తోడు వయసు మీదపడుతున్న కారణంగా భారత జట్టుకు దూరమైన రహానే మరి కేకేఆర్‌ను ఎలా నడిపిస్తాడో చూడాలి. వెంకటేశ్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా... ఆస్థాన ఆటగాళ్లు రసెల్, నరైన్ కేకేఆర్‌కు ప్రధాన బలంకానున్నారు. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఈ ఇద్దరు జట్టుకు చేకూర్చే విలువ మాటల్లో చెప్పలేనిది. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబర్చిన వరుణ్ చక్రవర్తిపై భారీ అంచనాలు ఉన్నాయి. నోర్జే, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, రావ్మన్ పావెల్, వైభవ్ అరోరాతో పేస్ విభాగం బలంగానే ఉన్నా... వీరు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారో చూడాలి. విదేశీ ఆటగాళ్ల కోటాలో నరైన్, రసెల్, గుర్బాజ్ తుది జట్టులో ఉండటం పక్కా కాగా... నాలుగో ప్లేయర్‌గా నోర్జే, మొయిన్ అలీలలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు: రహానే (కెప్టెన్), రింకూ సింగ్, డికాక్, గుర్బాజ్, రఘువంశీ, పావెల్, మనీశ్ పాండే, లవ్నిత్ సిసోడియా, వెంకటేశ్ అయ్యర్, అనుకూల్ రాయ్, మొయిన్ అలీ, రమణ్‌దీప్, రసెల్, నోర్జే, వైభవ్, మయాంక్ మార్కండే, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, నరైన్, వరుణ్, చేతన్ సకారియా. అంచనా: డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న కేకేఆర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో నాణ్యమైన ప్లేయర్లు ఉన్న కోల్‌కతా... స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శిస్తే ఫైనల్‌కు చేరడం పెద్ద కష్టం కాదు. రహానే జట్టును ఎలా నడిపిస్తాడనేది కీలకం. -
కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెమినిదవ ఎడిషన్ ఆరంభానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో శనివారం (మార్చి 22) ఐపీఎల్-2025కి తెరలేవనుంది. ఇక ఈ సీజన్‌కు ముందు మెగా వేలం జరగడంతో జట్లలో చాలా మార్పులే చోటుచేసుకున్నాయి.చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తప్ప.. మిగిలిన ఐదు జట్లు తమ కెప్టెన్లను కూడా మార్చేశాయి. లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) కోసం రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు ఖర్చు చేసి.. అతడిని తమ సారథిగా నియమించుకుంది.మరోవైపు.. పంజాబ్ కింగ్స్ కూడా ఈసారి కెప్టెన్ కోసం భారీగానే ఖర్చుపెట్టింది. భారత జట్టు మిడిలార్డర్ స్టార్, ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఈ ఇద్దరు టీమిండియా స్టార్లు క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లుగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మరి మిగిలిన జట్ల కెప్టెన్లు, వారి జీతాలు ఈసారి ఎలా ఉన్నాయో చూద్దామా?కోల్‌కతా నైట్ రైడర్స్2012, 2014 2024లో చాంపియన్‌గా నిలిచిన జట్టు. గతేడాది తమకు ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను వదులుకున్న కేకేఆర్.. ఈసారి అనూహ్య రీతిలో ఓ వెటరన్ ప్లేయర్‌ను తమ కెప్టెన్‌గా నియమించింది.మెగా వేలం-2025లో తొలి రౌండ్లో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన అజింక్య రహానేను రూ. 1.5 కోట్లకు కొని.. పగ్గాలు అప్పగించింది. అతడికి డిప్యూటీగా యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కు బాధ్యతలు ఇచ్చింది. ఐపీఎల్-2025 కెప్టెన్లలో అతి తక్కువ జీతం అందుకున్న కెప్టెన్ రహానేనే కావడం గమనార్హం. అన్నట్లు వెంకటేశ్ అయ్యర్ జీతం రూ.23.75 కోట్లు.సన్‌రైజర్స్ హైదరాబాద్గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ ఈసారీ తమ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్‌ను కొనసాగించింది. అయితే, గతేడాది అతడికి రూ. 20.50 కోట్ల మేర ముట్టజెప్పిన ఫ్రాంఛైజీ.. ఈసారి రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకోవడం గమనార్హం.రాజస్తాన్ రాయల్స్ఐపీఎల్ తొట్టతొలి విజేతగా చరిత్ర సృష్టించిన రాజస్తాన్ రాయల్స్ గత కొన్నేళ్లుగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ సామ్సన్ను తమ కెప్టెన్‌గా కొనసాగిస్తోంది. ఈసారి కూడా ‘పింక్’ జట్టును సంజూ ముందుండి నడిపించనున్నాడు. ఇందుకోసం రూ. 18 కోట్ల జీతం అందుకుంటున్నాడు.చెన్నై సూపర్ కింగ్స్మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఏకంగా ఐదు ట్రోఫీలు గెలిచిన చెన్నై.. గతేడాది నుంచి రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఆడుతోంది. ఈసారీ అతడినే కెప్టెన్‌గా కొనసాగించిన సీఎస్కే.. ఇందుకోసం అతడిని రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది.ఢిల్లీ క్యాపిటల్స్ఈసారి కెప్టెన్‌ను మార్చిన ఫ్రాంఛైజీల జాబితాలో ఢిల్లీ ఒకటి. గతేడాది రిషభ్ పంత్ కెప్టెన్సీలో ఆడిన ఢిల్లీ.. ఈసారి టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది. ఇందుకోసం తమ కెప్టెన్‌కు రూ. 16.50 కోట్ల మేర చెల్లిస్తోంది.గుజరాత్ టైటాన్స్అరంగేట్ర సీజన్లో తమకు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా జట్టును వీడిన తర్వాత.. అంటే గతేడాది టీమిండియా నయా సూపర్ స్టార్ శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించింది. వేలానికి ముందు గిల్‌ను రూ. 16.5 కోట్లకు రిటైన్ చేసుకున్న గుజరాత్ ఈసారీ అతడినే సారథిగా కొనసాగిస్తోంది.ముంబై ఇండియన్స్ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను కాదని.. గతేడాది హార్దిక్ పాండ్యాను ఏరికోరి కెప్టెన్‌ను చేసిన ముంబై ఘోర పరాభవం చవిచూసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. అయితే, ఈసారీ అతడికి మరో అవకాశం ఇచ్చిన అంబానీల యాజమాన్యంలోని ముంబై... పాండ్యాను రూ. 16.35 కోట్లకు రిటైన్ చేసుకుంది.రాయల్ చాలెంజర్స్ బెంగళూరుఎంత క్రేజ్ ఉన్నా ఒక్క టైటిల్ కూడా గెలవని జట్టుగా పేరొందిన ఆర్సీబీ.. ఈసారి ఊహించని రీతిలో రజత్ పాటిదార్‌ను సారథిగా నియమించింది. విరాట్ కోహ్లి మరోసారి పగ్గాలు చేపడతాడనే ప్రచారం జరిగగా.. బెంగళూరు ఫ్రాంఛైజీ ప్రకటనతో అది జరగదని తేలింది. అన్నట్లు వేలానికి ముందు రూ. 11 కోట్లకు పాటిదార్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. ఐపీఎల్-2025 కెప్టెన్లలో రహానే తర్వాత తక్కువ జీతం ఆర్సీబీ సారథికే!చదవండి: వాళ్లను చూస్తేనే చిరాకు.. బుమ్రా, రబడ మాత్రం వేరు: డేల్ స్టెయిన్ -
IPL 2025: చరిత్రకు అడుగు దూరంలో రహానే..
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి.ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా వెటరన్, కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ చరిత్రలోనే మూడు ఫ్రాంచైజీలకు సారథిగా వ్యవహరించిన తొలి భారత ఆటగాడిగా రహానే రికార్డులకెక్కనున్నాడు.కేకేఆర్ ఫ్రాంచైజీ ఇటీవలే తమ కెప్టెన్‌గా రహానేను ఎంపిక చేసింది. రహానే కేకేఆర్‌ను గతేడాది ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ స్ధానాన్ని భర్తీ చేయనున్నాడు. అదేవిదంగా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కోల్‌కతా జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.మూడోసారి..రహానే తొలిసారిగా 2017 ఐపీఎల్ సీజన్లో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ (RPS) జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఓ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ గైర్హజారీలో పూణే జట్టును రహానే నడిపించాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2018లో రాజస్థాన్ రాయల్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన రహానే.. స్మిత్‌పై ఏడాది పాటు నిషేధం విధించడంతో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.తర్వాతి ఐపీఎల్-2019లో హాఫ్ సీజన్ వరకు ఆర్ఆర్ జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే స్మిత్ తిరిగి రావడంతో కెప్టెన్సీ నుంచి రహానే తప్పుకున్నాడు. 2019 ప్రపంచ కప్‌కు సిద్ధం కావడానికి స్మిత్ తన స్వదేశానికి వెళ్లిపోవడంతో రహానే మళ్లీ రాజస్తాన్ రాయల్స్ బాధ్యతలు చేపట్టాడు.ఆ తర్వాతి సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్,చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రహానే ఆటగాడిగానే కొనసాగాడు. ఐపీఎల్-2025లో మెగా వేలంలో రహానేను కేవలం రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి రౌండ్లో అమ్ముడుపోని రహానే ఆఖరి రౌండ్లో కేకేఆర్ సొంతం చేసుకుంది.చదవండి: PAK vs NZ: మళ్లీ అదే కథ.. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్ -
అందుకే అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయలేదు.. కేకేఆర్ సీఈవో వివరణ
ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఏకంగా 23.75 కోట్లు పెట్టి కొనుకున్న వెంకటేశ్ అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయకపోవడంపై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ వివరణ ఇచ్చాడు. అయ్యర్ ఇంకా పరిణితి సాధించాల్సి ఉందని అన్నాడు. అయ్యర్ కెప్టెన్ మెటీరియలే అయినప్పటికీ.. అత్యున్నత బాధ్యతలు చేపట్టేందుకు అతనికి ఇంకా సమయం ఉందని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్ కోసం కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్‌ను కాదని అజింక్య రహానేను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రహానేను కేకేఆర్ కేవలం రూ. 1.5 కోట్ల బేస్ ధరకు సొంతం చేసుకుంది. అందులోనూ ఓసారి అమ్ముడుపోకుండా, రెండోసారి వేలానికి వచ్చినప్పుడు దక్కించుకుంది. రహానేను కేకేఆర్ చివరి నిమిషంలో ప్లాన్ చేసుకుంది. అయినా కెప్టెన్సీని కట్టబెట్టింది. రహానే గతంలో ఓసారి కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2022 సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడాడు. 2024 సీజన్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిష్క్రమణ తర్వాత కేకేఆర్‌కు కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. తొలుత కెప్టెన్సీ రేసులో వెంకటేశ్ అయ్యర్ పేరు బలంగా వినిపించింది. ఈ విషయంపై అయ్యర్ బహిరంగంగా తన ఇష్టాన్ని వ్యక్తం చేశాడు. అంతిమంగా అయ్యర్‌ను రహానే డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ఎంపిక చేశాడు. అయ్యర్.. రహానే అండర్లో కెప్టెన్సీ మెళకువలు నేర్చుకోవడంతో పాటు అనుభవం గడిస్తాడని కేకేఆర్ యాజమాన్యం భావిస్తుంది. అయ్యర్‌ను కేకేఆర్ ఫ్యూచర్ కెప్టెన్‌గా అనుకుంటుంది.మెగా వేలం తర్వాత కేకేఆర్ యాజమాన్యం వెంకటేశ్ అయ్యర్‌ను కెప్టెన్ చేయకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే రహానేను కెప్టెన్‌గా చేయడంతో కామ్ అయిపోయారు. అయ్యర్ 2021 నుంచి ఫ్రాంచైజీకి నమ్మకస్తుడిగా ఉండటంతో పాటు ఫ్రాంచైజీలో ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను కెప్టెన్ కావడం ఖాయమని అంతా భావించారు. అయితే కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ చివరి నిమిషంలో రహానేను తెరపైకి తెచ్చాడు. అనుభవం, ఒత్తిడిలో ప్రశాంతంగా వ్యవహరించగలిగే తత్వం రహానే ఎంపికకు ప్రధాన కారణాలని వెంకీ మైసూర్ చెప్పుకొచ్చాడు. జట్టును సమన్వయం చేసుకోవడం, మీడియాను అడ్రెస్ చేయడం, ఆఫ్ ద ఫీల్డ్ సంక్లిష్టతలను మేనేజ్ చేయడం లాంటి ఛాలెంజింగ్ విధులు నిర్వహించాలంటే రహానే లాంటి నాయకుడు తమకు అవసరమని మైసూర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ లాంటి టోర్నీల్లో కెప్టెన్సీ అంటే కేవలం మైదానంలో తీసుకునే నిర్ణయాలు మాత్రమే కాదు, అనుభవంతో వచ్చే చాలా విషయాలు ఉంటాయని తెలిపాడు. అయ్యర్‌కు ఇవన్నీ వంటబట్టేందుకు సమయం పడుతుందని, అంతవరకు అతను రహానే అండర్లో ఈ విషయాలన్నీ నేర్చుకుంటాడని చెప్పుకొచ్చాడు.36 ఏళ్ల రహానే 2008లో లీగ్ ప్రారంభమైనప్పటి నుండి 17 సీజన్లలో వివిధ జట్లకు ప్రాతినిత్యం వహించాడు. 185 ఐపీఎల్ మ్యాచ్‌లు, 195 అంతర్జాతీయ ప్రదర్శనలు, టీమిండియా తరపున, దేశీయ క్రికెట్లో ముంబై తరపున, ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల తరపున కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించడం వంటి అంశాలు కేకేఆర్ కెప్టెన్‌గా ఎంపిక కావడానికి రహానేకు ఉన్న యోగ్యతలని తెలిపాడు. ఆటగాడిగా కూడా రహానే పట్ల మైసూర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2025లో అతను చెలరేగుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. -
IPL 2025: కొత్త కెప్టెన్ పేరును ప్రకటించిన కేకేఆర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ కీలక ప్రకటన చేసింది. తమ కొత్త కెప్టెన్‌గా టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే(Ajinkya Rahane)ను నియమించినట్లు సోమవారం ప్రకటించింది. అదే విధంగా.. వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer)కు కూడా కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలిపింది.‘‘అజింక్య రహానే వంటి ఆటగాడు.. తన అనుభవం, పరిణతితో గొప్ప నాయకుడు అవుతాడని చెప్పేందుకు మేము సంతోషిస్తున్నాం. ఇక వెంకటేశ్ అయ్యర్ కూడా కేకేఆర్ నాయకత్వ విభాగంలో భాగంగా ఉంటాడు. వీరిద్దరు కలిసి కేకేఆర్ మరోసారి చాంపియన్‌గా నిలిచేందుకు.. టైటిల్ నిలబెట్టుకునేందుకు సహకారం అందిస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాం’’ అని కోల్‌కతా ఫ్రాంఛైజీ తమ ప్రకటనలో పేర్కొంది. కాగా ఐపీఎల్-2025లో కేకేఆర్‌కు రహానే కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్‌గా వెంకటేశ్ అయ్యర్ సేవలు అందించనున్నాడు.గతేడాది శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోకాగా గౌతం గంభీర్ కెప్టెన్సీలో 2012, 2014లో చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా జట్టు.. పదేళ్ల తర్వాత గతేడాది మరోసారి ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. టీమిండియా మిడిలార్డర్ స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ పద్నాలుగింట తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్స్ చేరింది.క్వాలిఫైయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించి ఫైనల్ చేరుకున్న కోల్‌కతా.. ఫైనల్లోనూ ఇదే ఫలితం పునరావృతం చేసింది. ప్యాట్ కమిన్స్ బృందాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి విజేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్(26 బంతుల్లో 52 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడి మరో 57 బంతులు మిగిలి ఉండగానే జట్టు విజయాన్ని ఖరారుచేశాడు.విన్నింగ్ కెప్టెన్‌ను కోల్పోయిఅయితే, ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు శ్రేయస్ అయ్యర్‌తో పాటు వెంకటేశ్ అయ్యర్ కేకేఆర్ ఫ్రాంఛేజీని వీడగా.. వెంకటేశ్‌ను కోల్‌కతా మళ్లీ భారీ ధర పెట్టి దక్కించుకుంది. అతడి కోసం ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేసింది. అయితే, శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేయడంతో కేకేఆర్ తమ విన్నింగ్ కెప్టెన్‌ను కోల్పోయింది. ఇదిలా ఉంటే.. రూ. 1.50 కోట్లతో అజింక్య రహానేను కొనుక్కున్న కేకేఆర్ అతడిని సారథిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా పనిచేసిన రహానే.. దేశవాళీ క్రికెట్లో ముంబైకి విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు 185 మ్యాచ్‌లు ఆడిన రహానే రెండు శతకాల సాయంతో 4642 పరుగులు చేశాడు. మరోవైపు.. వెంకటేశ్ అయ్యర్ 50 మ్యాచ్‌లలో 1326 రన్స్ సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, 11 అర్థ శతకాలు ఉన్నాయి.ఐపీఎల్-2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు, ఏ ఆటగాడు ఎంత ధరపలికాడంటే..రింకూ సింగ్ (రూ. 13 కోట్లు) సునిల్ నరైన్ (రూ. 12 కోట్లు) ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు) వరుణ్ చక్రవర్తి (రూ. 12 కోట్లు) హర్షిత్ రాణా (రూ. 4 కోట్లు) రమణ్‌దీప్ సింగ్ (రూ.4 కోట్లు) వెంకటేశ్ అయ్యర్ (రూ.23.75 కోట్లు) ఆన్రిచ్ నోర్జే (రూ.6.50 కోట్లు) క్వింటన్ డికాక్ (రూ.3.60 కోట్లు) అంగ్కృష్ రఘువన్షీ(రూ.3 కోట్లు) స్పెన్సర్ జాన్సన్ (రూ. 2.80 కోట్లు) రహ్మనుల్లా గుర్బాజ్ (రూ.2 కోట్లు) మొయిన్ అలీ (రూ. 2 కోట్లు) వైభవ్ అరోరా (రూ.1.80 కోట్లు) రోవ్‌మన్ పావెల్ (రూ.1.50 కోట్లు) అజింక్య రహానే (రూ. 1.50 కోట్లు) మనీశ్ పాండే (రూ. 75 లక్షలు) ఉమ్రన్ మాలిక్ (రూ. 75 లక్షలు) అనుకూల్ రాయ్ (రూ. 40 లక్షలు) మయాంక్ మర్కండే (రూ. 30 లక్షలు) లవ్నిత్ సిసోడియా (రూ. 30 లక్షలు) చదవండి: BCCI: ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. కెప్టెన్‌గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ -
IPL 2025: కేకేఆర్ కెప్టెన్‌గా నేను రెడీ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితాలో వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer) మూడో స్థానంలో ఉన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) తరఫున గతేడాది రాణించిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌ను.. వేలంపాటకు ముందు ఫ్రాంఛైజీ వదిలేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో రూ. 2 కోట్ల కనీస ధరతో ఆక్షన్‌లోకి వచ్చిన అతడి కోసం కేకేఆర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీపడ్డాయి.ఈ క్రమంలో ఏకంగా రూ. 23.75 కోట్లకు కోల్‌కతా వెంకటేశ్ అయ్యర్‌ను తమ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్సీ రేసులో ఈ మధ్యప్రదేశ్ క్రికెటర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు పగ్గాలు అప్పగించేందుకు యాజమాన్యం సుముఖంగా ఉందనే వార్తలు వస్తున్నాయి.కెప్టెన్ అనే ట్యాగ్ అవసరం లేదుఈ విషయంపై వెంకటేశ్ అయ్యర్ స్వయంగా స్పందించాడు. నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మనసులోని మాటను వెల్లడించాడు. కెప్టెన్‌గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘కచ్చితంగా.. నేను వందశాతం సిద్ధంగా ఉన్నాను. నిజానికి కెప్టెన్సీ అనేది ఒక ట్యాగ్ మాత్రమే.నాయకుడిగా ఉండటం అనేది మాత్రం గొప్ప విషయం. డ్రెసింగ్‌రూమ్‌లో లీడర్ ఉండాలంటే కెప్టెన్ అనే ట్యాగ్ అవసరం లేదని నేను నమ్ముతాను. మన ప్రదర్శనతో సహచర ఆటగాళ్లకు స్ఫూర్తినివ్వాలి. మైదానం లోపలా, వెలుపలా రోల్ మోడల్లా ఉండాలి. మధ్యప్రదేశ్ జట్టులో నేను ప్రస్తుతం అదే పాత్ర పోషిస్తున్నాను.గళం విప్పే స్వేచ్ఛ ఉన్నపుడేమధ్యప్రదేశ్ జట్టుకు నేనేమీ కెప్టెన్‌ను కాదు. అయితే, నా అభిప్రాయాలకు, సూచనలకు అక్కడి నాయకత్వం విలువనిస్తుంది. నాకు అలాంటి వాతావరణం అంటే చాలా ఇష్టం. మనం జట్టులోకి కొత్తగా వచ్చామా.. మనల్ని వాళ్లు రూ. 20 లక్షలు లేదంటే రూ. 20 కోట్లు పెట్టి కొనుగోలు చేశారా అన్నది ముఖ్యం కాదు.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా మన గళం విప్పే స్వేచ్ఛ ఉన్నపుడే అంతా బాగుంటుంది’’ అని వెంకటేశ్ అయ్యర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో చెప్పుకొచ్చాడు.కాగా ఐపీఎల్-2021 సీజన్లో కేకేఆర్ తరఫున క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు వెంకటేశ్ అయ్యర్. మొదట కేకేఆర్ అతడిన రూ.20లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే, ఆ ఎడిషన్‌లో అద్బుతంగా రాణించడంతో 2022 వేలానికి ముందు రూ. 8 కోట్లకు అయ్యర్‌ను రిటైన్ చేసుకుంది. ఆ తర్వాత మరో రెండేళ్ల పాటు తమ జట్టుకే ప్రాతినిథ్యం వహించిన వెంకటేష్‌ను ఐపీఎల్-2025 వేలంలోకి విడిచిపెట్టి.. భారీ ధరకు తిరిగి జట్టులో చేర్చుకుంది. కాగా ఐపీఎల్లో వెంకటేష్ ఇప్పటివరకు ఆడిన 50 మ్యాచ్‌లలో 1326 పరుగులు చేశాడు.శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోఇదిలా ఉంటే.. గతేడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, వేలానికి ముందు అతడు జట్టును వీడగా.. పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో కేకేఆర్ కెప్టెన్సీ పోస్టు ఖాళీ కాగా.. వెంకటేశ్ అయ్యర్‌తో పాటు అజింక్య రహానే కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్- ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్-2025 సీజన్‌కు తెరలేవనుంది. చదవండి: Ind vs NZ: ‘కివీస్‌తో మ్యాచ్‌లో అతడికి విశ్రాంతి ఇవ్వండి’ -
కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన రహానే
విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో ముంబై జట్టు ఎదురీదుతుంది. 406 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలవాలంటే చివరి రోజు మరో 323 పరుగులు చేయాలి. చేతిలో ఏడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. శివమ్ దూబే (12), తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఆకాశ్ ఆనంద్ (27) క్రీజ్‌లో ఉన్నారు. ఈ రంజీ సీజన్లో ముంబై ఫైనల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. అదే, విదర్భ ఫైనల్‌కు చేరాలంటే డ్రా చేసుకున్నా సరిపోతుంది. తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా విదర్భ ఫైనల్‌కు చేరుతుంది.కీలక ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసిన రహానేతప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ అజింక్య రహానే నిరాశపరిచాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆదిలోనే ఔటయ్యాడు. రహానే లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి వికెట్ కోల్పోవడంతో ముంబై కష్టాల్లో పడింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో ముంబై గెలవలేదు. ఒకవేళ ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా ముంబైకి ఒరిగేదేమీ లేదు. కాబట్టి చివరి రోజు ముంబై గెలుపు కోసమే ఆడాలి. ఆ జట్టు ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న శివమ్ దూబే, ఆకాశ్ ఆనంద్‌లపై గంపెడాశలు పెట్టుకుంది. వీరి తర్వాత క్రీజ్‌లోకి వచ్చే సూర్యకుమార్ యాదవ్‌పై పెద్దగా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి. స్కై.. వేగంగా పరుగులు సాధించగలిగినా వికెట్ కాపాడుకుంటాడన్న గ్యారెంటీ లేదు. చివరి రోజు 90 ఓవర్ల ఆటకు ఆస్కారముంటుంది. దూబే, ఆకాశ్ ఆనంద్, సూర్యకుమార్ యాదవ్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడితే ముంబై సంచలన విజయం సాధించే అవకాశం ఉంటుంది.దూబే, ఆకాశ్ ఆనంద్, సూర్యకుమార్ తర్వాత కూడా ముంబై బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. షమ్స్ ములానీ, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ కూడా బ్యాటింగ్ చేయగల సమర్థులే. అయితే లక్ష్యం భారీగా ఉండటంతో వీరిపై అంచనాలు పెట్టుకోలేని పరిస్థితి ఉంది.అంతకుముందు విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 292 పరుగులు చేసి ముంబై ముందు కొండంత లక్షాన్ని ఉంచింది. యశ్ రాథోడ్ 151 పరుగులు చేసి విదర్భ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. యశ్‌కు కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (52) సహకరించాడు. వీరిద్దరి నుంచి ఈ స్థాయి ఇన్నింగ్స్‌లు రాకపోయుంటే విదర్భ ముంబై ముందు ఇంత భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయేది. విదర్భను రెండో ఇన్నింగ్స్‌లో షమ్స్ ములానీ దెబ్బకొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో ములానీ ఆరు వికెట్లు తీశాడు. తనుశ్ కోటియన్ 3, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టారు.దీనికి ముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకే ఆలౌటైంది. స్టార్ బ్యాటర్లు, టీమిండియా ప్లేయర్లు అజింక్య రహానే (18), సూర్యకుమార్ యాదవ్ (0), శివమ్ దూబే (0) దారుణంగా విఫలమయ్యారు. ఆకాశ్ ఆనంద్ (106) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి సూపర్ సెంచరీతో ముంబై పరువు కాపాడాడు. ఆకాశ్ ఆనంద్‌కు సిద్దేశ్ లాడ్ (35), శార్దూల్ ఠాకూర్ (37), తనుశ్ కోటియన్ (33) కాసేపు సహకరించారు. విదర్భ బౌలర్లలో పార్థ్ రేఖడే 4, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే తలో 2, దర్శన్ నల్కండే, భూటే చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. దృవ్ షోరే (74), దినిశ్ మాలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీలతో రాణించగా.. కరుణ్ నాయర్ (45), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అథర్వ తైడే 4, పార్థ్ రేఖడే 23, హర్ష్ దూబే 18, భూటే 11, యశ్ ఠాకూర్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. దర్శన్ నల్కండే 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే ఐదు వికెట్లతో రాణించగా.. షమ్స్‌ములానీ, రాయ్స్టన్ డయాస్ తలో రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశారు. -
Semi Final: కష్టాల్లో ముంబై.. పట్టు బిగించిన విదర్భ
దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ సెమీఫైన(Ranji Trophy Semi Final)ల్లో డిఫెండిగ్ చాంపియన్ ముంబై(Mumbai) జట్టు కష్టాల్లో పడింది. నాగ్‌పూర్ వేదికగా విదర్భ(Vidarbha)తో జరుగుతున్న పోరులో బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోగా... బౌలర్లు కూడా ప్రభావం చూపలేకపోయారు. ఆరంభంలో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచినప్పటికీ... దాన్ని చివరి వరకు కొనసాగించలేకపోయారు. దీంతో కోలుకున్న విదర్భ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.యశ్ రాథోడ్ (101 బంతుల్లో 59 బ్యాటింగ్; 4 ఫోర్లు) అర్ధశతకంతో రాణించగా... కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (102 బంతుల్లో 31 బ్యాటింగ్; 2 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అథర్వ తైడె (0), కరుణ్ నాయర్ (6), ధ్రువ్ షోరే (13), దానిశ్ (29) విఫలమవడంతో... ఒకదశలో 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన మాజీ చాంపియన్ విదర్భ జట్టును యశ్ రాథోడ్, అక్షయ్ ఆదుకున్నారు. వీరిద్దరూ అజేయమైన ఐదో వికెట్‌కు 91 పరుగులు జోడించారు.ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న విదర్భ జట్టు... ప్రస్తుతం ఓవరాల్‌గా 260 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ముంబై బౌలర్లలో షమ్స్ ములానీ 2... శార్దుల్ ఠాకూర్, తనుశ్ కొటియాన్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 188/7తో బుధవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై జట్టు చివరకు 92 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఆకాశ్ ఆనంద్ (256 బంతుల్లో 106; 11 ఫోర్లు) విలువైన సెంచరీ చేశాడు. తనుశ్ కొటియాన్ (33; 4 ఫోర్లు, 1 సిక్స్) అతడికి సహకరించాడు. విదర్భ బౌలర్లలో పార్థ్ 4 వికెట్లు పడగొట్టాడు. స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: 383ముంబై తొలి ఇన్నింగ్స్: ఆయుశ్ (సి) దానిశ్ (బి) దర్శన్ 9; ఆకాశ్ ఆనంద్ (సి) అక్షయ్ (బి) నచికేత్ 106; సిద్ధేశ్ (బి) యశ్ ఠాకూర్ 35; రహానే (బి) పార్థ్ 18; సూర్యకుమార్ (సి) దానిశ్ (బి) పార్థ్ 0; శివమ్ దూబే (సి) అథర్వ (బి) పార్థ్ 0; షమ్స్ ములానీ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్‡్ష దూబే 4; శార్దుల్ (సి) దర్శన్ (బి) యశ్ ఠాకూర్ 37; తనుశ్ (బి) పార్థ్ 33; మోహిత్ (బి) హర్‡్ష దూబే 10; రాయ్స్టన్ డయస్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (92 ఓవర్లలో ఆలౌట్) 270. వికెట్ల పతనం: 1–18, 2–85, 3–113, 4–113, 5–113, 6–118, 7–178, 8–247, 9–261, 10–270, బౌలింగ్: దర్శన్ 12–1–46–1; యశ్ ఠాకూర్ 16–0–73–2; హర్ష్ దూబే 25–3–68–2; నచికేత్ 9–2–25–1; పార్థ్ 30–9–55–4. విదర్భ రెండో ఇన్నింగ్స్: అథర్వ (ఎల్బీడబ్ల్యూ) (బి) శార్దుల్ 0; ధ్రువ్ షోరే (ఎల్బీడబ్ల్యూ) (బి) తనుశ్ 13; దానిశ్ (సి అండ్ బి) ములానీ 29; కరుణ్ నాయర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ములానీ 6; యశ్ రాథోడ్ (బ్యాటింగ్) 59; అక్షయ్ వాడ్కర్ (బ్యాటింగ్) 31; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (53 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 147. వికెట్ల పతనం: 1–0, 2–40, 3–52, 4–56, బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 6–2–14–1; మోహిత్ 2–0–13–0; షమ్స్ ములానీ 20–3–50–2; రాయ్స్టన్ డయస్ 7–4–11–0; తనుశ్ కొటియాన్ 14–1–33–1; శివమ్ దూబే 3–0–17–0; ఆయుశ్ 1–0–3–0.ముంబై మాజీ కెప్టెన్ మిలింద్ కన్నుమూత ముంబై జట్టు మాజీ సారథి, మాజీ సెలెక్టర్ మిలింద్ రేగె (76) బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. దేశవాళీల్లో ఆల్‌రౌండర్‌గా రాణించిన మిలింద్ కెరీర్లో 52 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 1532 పరుగులు చేయడంతో పాటు 126 వికెట్లు పడగొట్టారు. 26 ఏళ్ల వయసులోనే గుండెపోటుకు గురైన మిలింద్ ఆ తర్వాత తిరిగి కోలుకొని ముంబై రంజీ జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించాడు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మిలింద్ మృతికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంతాపం వ్యక్తం చేశాడు. మిలింద్ చిన్ననాటి మిత్రుడు సునీల్ గావస్కర్‌తో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) సంతాపం వ్యక్తం చేశాయి. మిలింద్ మృతికి సంతాపంగా విదర్భతో రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై ప్లేయర్లు నల్లరిబ్బన్లతో బరిలోకి దిగారు. -
ఒకే ఓవర్లో మూడు వికెట్లు.. సూర్యకుమార్ యాదవ్, శివం దూబే డకౌట్
రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై స్టార్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. విదర్భతో పోరులో కెప్టెన్ అజింక్య రహానే(Ajinkya Rahane)తో పాటు టీమిండియా స్టార్లు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav), శివం దూబే(Shivam Dube) చేతులెత్తేశారు. ఫలితంగా ముంబై జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కాగా రంజీ ట్రోఫీ ఎలైట్ 2024-25 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన రహానే సేన సెమీస్ చేరిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సెమీ ఫైనల్-2లో భాగంగా విదర్భ జట్టుతో తలపడుతోంది. నాగ్‌పూర్ వేదికగా.. విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సోమవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆరంభంలోనే ఓపెనర్ అథర్వ టైడే(4) వికెట్ కోల్పోయిన విదర్భను మరో ఓపెనర్ ధ్రువ్ షోరే అర్ధ శతకం(74)తో ఆదుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన స్పిన్ బౌలర్ పార్థ్ రేఖడే(Parth Rekhade) కూడా 23 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.383 పరుగులుఇక మిడిలార్డర్లో ప్రతి ఒక్కరు రాణించడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులు చేయగలిగింది. డానిష్ మాలేవార్(79), కరుణ్ నాయర్(45), యశ్ రాథోడ్(54) మెరుగైన ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ 34, హర్ష్ దూబే 18, నచికేత్ భూటే 11, దర్శన్ నాల్కండే 12*, యశ్ ఠాకూర్ 3 పరుగులు చేశారు.ముంబై బౌలర్లలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే ఐదు వికెట్లతో చెలరేగగా.. రాయ్స్టన్ దాస్, షామ్స్ ములానీ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. అదే విధంగా.. శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక విదర్భ మొదటి ఇన్నింగ్స్ 383 పరుగులు చేసి మెరుగైన స్థితిలో నిలవగా.. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై మాత్రం కష్టాలపాలైంది.పార్థ్ రేఖడే విజృంభణఓపెనర్ ఆయుశ్ మాత్రే తొమ్మిది పరుగులకే నిష్క్రమించగా.. మరో ఓపెనర్ ఆకాశ్ ఆనంద్(171 బంతుల్లో 67 నాటౌట్ ) పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. సిద్దేశ్ లాడ్ 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ అజింక్య రహానే 18 పరుగులకే నిష్క్రమించాడు. ఇక టీమిండియా టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్, శివం దూబే మరీ దారుణంగా డకౌట్ అయ్యారు.ఈ ముగ్గురిని విదర్భ బౌలర్ పార్థ్ రేఖడే ఒకే ఓవర్లో పెవిలియన్‌కు పంపడం విశేషం. ముంబై ఇన్నింగ్స్‌లో 41వ ఓవర్ వేసిర పార్థ్.. తొలి బంతికే రహానేను బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ పార్థ్ బౌలింగ్‌లో డానిష్ మాలేవర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం శివం దూబే వికెట్‌ను కూడా పార్థ్ దక్కించుకున్నాడు. కాగా సూర్య, దూబేలకు తొలుత డాట్ బాల్ వేసిన పార్థ్ ఆ మరుసటి బంతికే వాళ్లిద్దరిని అవుట్ చేయడం విశేషం.ఇక ఆ తర్వాత కూడా విదర్భ బౌలర్ల విజృంభణ కొనసాగింది. షామ్స్ ములానీ(4)ని హర్ష్ దూబే వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. వేగంగా ఆడుతున్న శార్దూల్ ఠాకూర్(41 బంతుల్లో 37)ను యశ్ ఠాకూర్ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ క్రమంలో మంగళవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి ముంబై 59 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసి.. విదర్భ కంటే 195 పరుగులు వెనుకబడి ఉంది. ఆకాశ్ ఆనంద్ 67, తనుశ్ కొటియాన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. విదర్భ బౌలర్లలో పార్థ్ రేఖడే మూడు వికెట్లు కూల్చగా.. యశ్ ఠాకూర్‌కు రెండు, దర్శన్ నల్కండే, హర్ష్ దూబేలకు ఒక్కో వికెట్ దక్కాయి.చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ Suryakumar Yadav 360° batting today pic.twitter.com/SZoVId69lE— Abhi (@79off201) February 18, 2025 -
Ranji Trophy Semis-2 Day 1: రాణించిన విదర్భ బ్యాటర్లు
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీ చరిత్రలోనే ఘనాపాఠి జట్టయిన ముంబైకి రెండో సెమీఫైనల్లో తొలిరోజే విదర్భ బ్యాటర్లు గట్టి సవాల్ విసిరారు. ముంబై బౌలర్లు సగం (5) వికెట్లు పడగొట్టినప్పటికీ ఒకే రోజు విదర్భ 300 పైచిలుకు స్కోరు చేసింది. టాపార్డర్‌లో ధ్రువ్ షోరే (109 బంతుల్లో 74; 9 ఫోర్లు), మిడిలార్డర్లో దానిశ్ మాలేవర్ (157 బంతుల్లో 79; 7 ఫోర్లు, 1 సిక్స్), కరుణ్ నాయర్ (70 బంతుల్లో 45; 6 ఫోర్లు), యశ్ రాథోడ్ (86 బంతుల్లో 47 బ్యాటింగ్; 6 ఫోర్లు) సమష్టిగా కదంతొక్కారు. టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకొని బరిలోకి దిగిన విదర్భకు మంచి ఆరంభమైతే దక్కలేదు.అథర్వ (4) వికెట్ పారేసుకున్నాడు. మరో ఓపెనర్ ధ్రువ్ షోరే, పార్థ్ రేఖడే (23; 2 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. వన్డేలాగే ఆడిన ధ్రువ్ 67 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. రెండో వికెట్‌కు వీరిద్దరు 54 పరుగులు జోడించడంతో జట్టు స్కోరు వందకు సమీపించింది. ఈ దశలో 93 పరుగుల వద్ద పార్థ్‌ను శివమ్ దూబే అవుట్ చేశాడు. దానిష్ క్రీజులోకి రాగా... తొలి సెషన్లోనే జట్టుస్కోరు వంద దాటింది. ధ్రువ్, దానిశ్ విదర్భ ఇన్నింగ్స్‌లో మరో 50 పైచిలుకు భాగస్వామ్యాన్ని జోడించింది.జట్టు స్కోరు 144 పరుగుల వద్ద ధ్రువ్ షోరేను షమ్స్ ములానీ పెవిలియన్ చేర్చడంతో మూడో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చి కరుణ్ నాయర్, యశ్ రాథోడ్‌లు కూడా ముంబై బౌలర్లను చక్కగా ఎదుర్కోవడంతో భారీస్కోరుకు బాట పడింది. ఆట నిలిచే సమయానికి యశ్, కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరు కలిసి అబేధ్యమైన ఆరో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే, షమ్స్ ములానీ చెరో 2 వికెట్లు తీశారు.స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: అథర్వ (సి) ఆనంద్ (బి) రాయ్స్టన్ డయస్ 4; ధ్రువ్ షోరే (సి) రహానే (బి) ములానీ 74; పార్థ్ రేఖడే (సి) సూర్యకుమార్ (బి) దూబే 23; దానిశ్ (సి) ఆనంద్ (బి) ములానీ 79; కరుణ్ నాయర్ (సి) ఆనంద్ (బి) దూబే 45; యశ్ రాథోడ్ (బ్యాటింగ్) 47; అక్షయ్ వాడ్కర్ (బ్యాటింగ్) 13; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (88 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 308. వికెట్ల పతనం: 1–39, 2–93, 3–144, 4–222, 5–261. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 14–0–57–0, మోహిత్ 14–2–61–0, రాయ్స్టన్ డయస్ 11–2–26–1, తనుశ్ కొటియాన్ 22–0–78–0, శివమ్ దూబే 9–1–35–2, షమ్స్ ములానీ 18–3–44–2. -
‘జట్టు నుంచి తప్పించారు.. అతడు మాట్లాడేందుకు సిద్ధంగా లేడు.. అందుకే’
తాను అవకాశాల కోసం అడిగే వ్యక్తిని కాదని టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే(Ajinkya Rahane) అన్నాడు. తనను జట్టు నుంచి ఎందుకు తప్పించారో తెలియదని.. ఈ విషయం గురించి మేనేజ్మెంట్ నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా తనకు పిలుపునిస్తారని ఆశగా ఎదురుచూశానని.. అయితే, సెలక్టర్లు మరోసారి మొండిచేయే చూపారని ఆవేదన వ్యక్తం చేశాడు.జట్టులో అవకాశాలు కరువుకాగా ఒకప్పుడు టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్(Vice Captain)గా వెలుగొందిన అజింక్య రహానే.. తాత్కాలిక సారథిగా ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు విజయం అందించాడు. విదేశాల్లోనూ మెరుగైన రికార్డు కలిగి ఉన్న ఈ ముంబై బ్యాటర్‌కు గత కొన్నేళ్లుగా జట్టులో అవకాశాలు కరువయ్యాయి. అయితే, దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి.. ఐపీఎల్‌లోనూ తనను తాను నిరూపించుకున్న రహానే.. అనూహ్యంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC)-2023 ఫైనల్(ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా)కు ఎంపికయ్యాడు.అనంతరం వెస్టిండీస్ పర్యటనలో టెస్టు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు. కానీ ఆ టూర్లో వైఫల్యం తర్వాత రహానేకు మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపురాలేదు. ఈ క్రమంలో దేశీ క్రికెట్‌పై దృష్టి సారించిన అతడు.. ముంబై కెప్టెన్‌గా గతేడాది రంజీ ట్రోఫీ టైటిల్ అందుకున్నాడు. టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ సత్తా చాటాడు.ఇక ప్రస్తుతం రంజీ సెమీ ఫైనల్స్‌తో బిజీగా ఉన్న అజింక్య రహానే టీమిండియా పునరాగమనం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘జట్టు నుంచి నన్ను ఎందుకు తప్పించారని ప్రశ్నించే రకం కాదు. అసలు మేనేజ్మెంట్తో నాకు కమ్యూనికేషన్ లేదు. చాలా మంది వెళ్లి మాట్లాడమని చెప్పారు.అతడికి మాట్లాడే ఉద్దేశం లేనప్పుడుఅందుకు నేను సిద్ధంగా ఉన్నా.. ఎదుటి వ్యక్తి కూడా అందుకు సుముఖంగా ఉండాలి కదా!.. ఒకవేళ అతడికి మాట్లాడే ఉద్దేశం లేనప్పుడు నేను పోరాడటంలో అర్థం ఉండదు. నేను నేరుగా అతడితోనే మాట్లాడాలనుకున్నా. అందుకే మెసేజ్‌లు చేయలేదు. ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోయింది’’ అంటూ టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తీరుపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు.అదే విధంగా.. ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత నన్ను జట్టు నుంచి తప్పించడం బాధ కలిగించింది. తదుపరి సిరీస్‌లలో నన్ను ఆడిస్తారని అనుకున్నా. కానీ నా చేతుల్లో ఏం లేదు కదా! ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాను. ఐపీఎల్లో కూడా ఆడితే మళ్లీ నన్ను పిలుస్తారేమో.రీఎంట్రీ ఇస్తాఅయితే, సౌతాఫ్రికాలో పరిస్థితులు కఠినంగా ఉంటాయి. అందుకే టెస్టు సిరీస్‌కు నన్ను పిలుస్తారని ఆశించా. కానీ ఆ జట్టులో నాకు స్థానం దక్కలేదు. చాలా బాధగా అనిపించింది. అయినా.. ఇప్పుడు ఏం అనుకుని ఏం లాభం. అయితే, ఏదో ఒకరోజు తప్పకుండా మళ్లీ జట్టులోకి తిరిగి వస్తాననే నమ్మకం ఉంది’’ అని అజింక్య రహానే ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ రహానేను కొనుగోలు చేసింది. రూ. కోటి యాభై లక్షలకు అతడిని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో టీమిండియా 3-1తో ఓడిపోయింది. తదుపరి టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనున్న రోహిత్ సేన ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ టోర్నీతో బిజీగా ఉంది.చదవండి: డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ మాత్రమే.. మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్ర: నీతా అంబానీ -
శతక్కొట్టిన రహానే, చెలరేగిన శార్దూల్.. సెమీస్‌లో ముంబై
రంజీ ట్రోఫీ(Ranji Trophy) 2024-25 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై(Mumbai) సెమీస్‌కు దూసుకువెళ్లింది. క్వార్టర్ ఫైనల్-3 మ్యాచ్‌లో హర్యానా జట్టును మట్టికరిపించి టాప్-4కు అర్హత సాధించింది. కాగా రంజీ తాజా ఎడిషన్‌లో భాగంగా శనివారం క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు మొదలయ్యాయి.తొలి ఇన్నింగ్స్‌లో రహానే విఫలంఈ క్రమంలో కోల్‌కతా వేదికగా ముంబై హర్యానాతో తలపడింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే(0), ఆకాశ్ ఆనంద్(10)తో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన సిద్ధేశ్ లాడ్(4) కూడా విఫలమయ్యాడు. కెప్టెన్ అజింక్య రహానే(Ajinkya Rahane) సైతం 31 పరుగులకే వెనుదిరగగా.. టీమిండియా టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్(9), ఆల్‌రౌండర్ శివం దూబే(28) కూడా నిరాశపరిచారు.ఇలాంటి తరుణంలో ఆల్‌రౌండర్ షామ్స్ ములానీ 91 పరుగులతో రాణించగా.. మరో ఆల్‌రౌండర్ తనుశ్ కొటియాన్ 97 పరుగులతో చెలరేగాడు. ఫలితంగా ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగులు చేసింది.అంకిత్ కుమార్ శతకం కారణంగాఅనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన హర్యానా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 301 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ అంకిత్ కుమార్ శతకం(136)తో మెరవగా.. మిగతా వాళ్ల నుంచి అతడికి ఎక్కువగా సహకారం లభించలేదు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ దెబ్బకు హర్యానా బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. అతడు 18.5 ఓవర్ల బౌలింగ్‌లో 58 పరుగులు ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. మిగతా వాళ్లలో షామ్స్ ములానీ, తనుశ్ కొటియాన్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఈ నేపథ్యంలో పద్నాలుగు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ముంబై.. 339 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అజింక్య రహానే శతక్కొట్టగా(108).. సూర్యకుమార్ యాదవ్(70) చాన్నాళ్ల తర్వాత అర్ధ శతకం బాదాడు. మిగిలిన వాళ్లలో సిద్దేశ్ లాడ్ 43, శివం దూబే 48 పరుగులతో రాణించారు.అప్పుడు శార్దూల్.. ఇప్పుడు రాయ్స్టన్ఇక ముంబై విధించిన 353 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హర్యానా తడబడింది. ఓపెనర్ లక్ష్య దలాల్(64), సుమిత్ కుమార్(62) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. దీంతో 201 పరుగులకే హర్యానా కుప్పకూలింది. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు సాధించగా.. రాయ్స్టన్ డయాస్ ఐదు వికెట్లతో చెలరేగాడు. తనుశ్ కొటియాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇక హర్యానాపై ముంబై 152 పరుగుల తేడాతో గెలుపొందిన ముంబై వరుసగా రెండోసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. శార్దూల్ ఠాకూర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ముంబై వర్సెస్ హర్యానా(క్వార్టర్ ఫైనల్-3) సంక్షిప్త స్కోర్లు👉ముంబై స్కోర్లు: 315 & 339👉హర్యానా స్కోర్లు: 301 & 201👉ఫలితం: 152 పరుగుల తేడాతో హర్యానాను ఓడించిన ముంబై👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శార్దూల్ ఠాకూర్(ముంబై)- మొత్తం తొమ్మిది వికెట్లు.చదవండి: IPL 2025: కొత్త యాజమాన్యం చేతిలోకి గుజరాత్ టైటాన్స్! -
41వ శతకంతో మెరిసిన రహానే
హర్యానాతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ (Ranji Trophy Quarter Final) మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) సూపర్ సెంచరీతో మెరిశాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 200వ మ్యాచ్ ఆడుతున్న రహానేకు ఇది 41వ సెంచరీ. రహానే ఈ సెంచరీని 160 బంతుల్లో పూర్తి చేశాడు. ఇందులో 12 ఫోర్లు ఉన్నాయి. సెంచరీ తర్వాత కొద్ది సేపే క్రీజ్‌లో ఉన్న రహానే 108 పరుగుల వద్ద ఔటయ్యాడు. రహానే సూపర్ సెంచరీ కారణంగా ముంబై హర్యానా ముందు 354 పరుగుల భారీ లక్ష్యాన్ని (తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 14 పరుగుల లీడ్ కలుపుకుని) ఉంచింది. ముంబై సెకెండ్ ఇన్నింగ్స్‌లో 339 పరుగులకు ఆలౌటైంది. రహానే.. సూర్యకుమార్ యాదవ్‌తో (70) కలిసి నాలుగో వికెట్‌కు 129 పరుగులు.. శివమ్ దూబేతో (48) కలిసి ఐదో వికెట్‌కు 85 పరుగులు జోడించాడు. ముంబై ఇన్నింగ్స్‌లో ఆయుశ్ మాత్రే (31), సిద్దేశ్ లాడ్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హర్యానా బౌలర్లలో అనూజ్ థక్రాల్ 4, సుమిత్ కుమార్, అన్షుల్ కంబోజ్, జయంత్ యాదవ్ తలో 2 వికెట్లు పడగొట్టారు.ఆరేసిన శార్దూల్అంతకుముందు హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అంకిత్ కుమార్ (136) సెంచరీ చేసి హర్యానాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అంకిత్ మినహా హర్యానా ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ముంబై బౌలర్ శార్దూల్ ఠాకూర్ 6 వికెట్లు తీసి హర్యానా పతనాన్ని శాశించాడు. షమ్స్ ములానీ, తనుశ్ కోటియన్ తలో రెండు వికెట్లు తీశారు.సెంచరీలు చేజార్చుకున్న ములానీ, కోటియన్ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 315 పరుగులకు ఆలౌటైంది. రహానే (310 మినహా ముంబై టాపార్డర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆయుశ్ మాత్రే 0, ఆకాశ్ ఆనంద్ 10, సిద్దేశ్ లాడ్ 4, సూర్యకుమార్ యాదవ్ 9, శివమ్ దూబే 28, శార్దూల్ ఠాకూర్ 15 పరుగులకు ఔటయ్యారు. ఏడు, తొమ్మిది స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన షమ్స్ ములానీ (91), తనుశ్ కోటియన్ (97) భారీ అర్ద సెంచరీలు సాధించి ముంబైకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వీరిద్దరూ లేకపోయుంటే ముంబై 200 పరుగలలోపే ఆలౌటయ్యేది. హర్యానా బౌలరల్లో అన్షుల్ కంబోజ్, సుమిత్ కుమార్ చెరో 3 వికెట్లు.. అనూజ్ థాక్రాల్, అజిత్ చహల్, జయంత్ యాదవ్, నిషాంత్ సంధు తలో వికెట్ పడగొట్టారు. -
మళ్లీ ఫెయిలైన సూర్యకుమార్.. ఇప్పట్లో రీఎంట్రీ కష్టమే!
భారత పురుషుల టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) బ్యాటింగ్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఫార్మాట్ మారినా అతడి ఆట తీరులో మాత్రం మార్పరాలేదు. ఇటీవల ఇంగ్లండ్(India vs England)తో స్వదేశంలో పొట్టి సిరీస్‌లో సారథిగా అదరగొట్టిన ఈ ముంబైకర్.. బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. తాజాగా రంజీ ట్రోఫీ(Ranji Trophy) మ్యాచ్‌లోనూ సూర్య నిరాశపరిచాడు.ఫోర్‌తో మొదలుపెట్టిహర్యానాతో మ్యాచ్‌లో క్రీజులోకి రాగానే ఫోర్ బాది దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన సూర్యకుమార్.. మరుసటి ఓవర్లోనే వెనుదిరిగాడు. కేవలం తొమ్మిది పరుగులు చేసి నిష్క్రమించాడు. కాగా సూర్య చివరగా ఈ రంజీ సీజన్లో భాగంగా మహారాష్ట్రతో మ్యాచ్ సందర్భంగా బరిలోకి దిగాడు. అయితే, ఆ మ్యాచ్‌లో కేవలం ఏడు పరుగులే చేసి అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 కెప్టెన్ ఇక టెస్టుల గురించి మర్చిపోవాల్సిందేనంటూ టీమిండియా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.కాగా దేశీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీ(Ranji Trophy) క్వార్టర్ ఫైనల్స్ శనివారం ఆరంభమయ్యాయి. ఇందులో భాగంగా.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై- హర్యానా మధ్య క్వార్టర్ ఫైనల్-3 మొదలైంది. ఇందులో టాస్ గెలిచిన ముంబై తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, హర్యానా పేసర్ల ధాటికి అజింక్య రహానే సేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.సుమిత్ దెబ్బకు బౌల్డ్ఓపెనర్ ఆయుశ్ మాత్రే(0)ను అన్షుల్ కాంబోజ్ డకౌట్ చేయగా.. మరో ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ ఆకాశ్ ఆనంద్‌ను పది పరుగుల వద్ద సుమిత్ కుమార్ బౌల్డ్ చేశాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన సిద్ధేశ్ లాడ్(4) అన్షుల్ వేసిన బంతికి బౌల్డ్‌కాగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ సుమిత్ దెబ్బకు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.ముంబై ఇన్నింగ్స్ ఏడో ఓవర్ మొదటి బంతికి సిద్ధేశ్ అవుట్ కాగా.. సూర్య క్రీజులోకి వచ్చాడు. అన్షుల్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి ఘనంగా ఆరంభించాడు. ఎనిమిదో ఓవర్లో సుమిత్ బౌలింగ్‌లోనూ తొలి బంతినే బౌండరీకి తరలించిన సూర్య.. ఆ మరుసటి రెండో బంతికి పెవిలియన్ చేరాడు. మొత్తంగా ఐదు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో తొమ్మిది పరుగులు చేసి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అవుటయ్యాడు.ఈ క్రమంలో 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలో పడిన ముంబై జట్టును కెప్టెన్ అజింక్య రహానే, ఆల్‌రౌండర్ శివం దూబే ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో సూర్యకుమర్ యాదవ్ తొలి మ్యాచ్‌లోనే డకౌట్ అయిన విషయం తెలిసిందే.ఇప్పట్లో టీమిండియా రీఎంట్రీ కష్టమేఆ తర్వాత కూడా వరుస మ్యాచ్‌లలో సూర్య నిరాశపరిచాడు. రెండో టీ20లో 12, మూడో టీ20లో 14 పరుగులు చేసిన అతడు.. నాలుగో టీ20లో మళ్లీ సున్నా చుట్టాడు. ఆఖరిదైన ఐదో టీ20లోనూ రెండు పరుగులే చేసి వెనుదిరిగాడు. అయితే, కెప్టెన్‌గా మాత్రం ఈ ఐదు టీ20ల సిరీస్‌లో 4-1తో సూర్య ఘన విజయం అందుకున్నాడు. ఇక ఇప్పటికే ఫామ్‌లేమి కారణంగా వన్డే జట్టులో ఎప్పుడో స్థానం కోల్పోయిన సూర్య.. రంజీల్లో వరుస వైఫల్యాలతో ఇప్పట్లో టెస్టుల్లోకి వచ్చే అవకాశం కూడా లేకుండా చేసుకుంటున్నాడు. కాగా 2023లో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా నాగ్‌పూర్ వేదికగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన సూర్య.. దారుణంగా విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో 8 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: Ind vs Eng: అద్భుతమైన ఆటగాడు.. అతడినే పక్కనపెడతారా?: ఆసీస్ దిగ్గజం -
Ranji Trophy QFs: ముంబై- హర్యానా మ్యాచ్ వేదికను మార్చిన బీసీసీఐ
ముంబై: డిఫెండింగ్ చాంపియన్ ముంబై(Mumbai), హరియాణా జట్ల మధ్య ఈనెల 8 నుంచి జరగాల్సిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్(Ranji Trophy Quarter Finals) వేదిక మారింది. హరియాణాలోని లాహ్లీలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌కు మార్చారు. హరియాణాలో చలితీవ్రత అధికంగా ఉండటంతో పాటు... ఉదయం పూట పొగమంచు కప్పేస్తుండటంతో లాహ్లీలో నిర్వహించాల్సిన మ్యాచ్‌ను కోల్‌కతాకు మార్చినట్లు బీసీసీఐ నుంచి సమాచారం అందింది’ అని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడు అజింక్య నాయక్ బుధవారం పేర్కొన్నారు.కాగా 42 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై జట్టు ఈసారి కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే(Ajinkya Rahane) సారథ్యం వహిస్తున్న ముంబై జట్టులో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పేస్ ఆల్‌రౌండర్లు శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్ వంటి పలువురు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. మిగిలిన మూడు క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. రాజ్‌కోట్ వేదికగా సౌరాష్ట్ర, గుజరాత్ క్వార్టర్ ఫైనల్... నాగ్‌పూర్ వేదికగా విదర్భ, తమిళనాడు పోరు... పుణేలో జమ్ముకశ్మీర్, కేరళ మ్యాచ్‌లు జరగనున్నాయి. మరిన్ని క్రీడా వార్తలుభారత బ్యాడ్మింటన్ జట్టులో జ్ఞాన దత్తు, తన్వీ రెడ్డి న్యూఢిల్లీ: డచ్ ఓపెన్, జర్మనీ ఓపెన్ అండర్–17 జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లలో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. జాతీయ జూనియర్ చాంపియన్, హైదరాబాద్ కుర్రాడు జ్ఞాన దత్తుతోపాటు హైదరాబాద్‌కే చెందిన మరో ప్లేయర్ తన్వీ రెడ్డి భారత జట్టులోకి ఎంపికయ్యారు. డచ్ ఓపెన్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు... జర్మన్ ఓపెన్ మార్చి 5 నుంచి 9 వరకు జరుగుతాయి.మనుష్–దియా జోడీ ఓటమి న్యూఢిల్లీ: సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మనుష్ షా–దియా చిటాలె (భారత్) ద్వయం పోరాటం ముగిసింది. బుధవారం సింగపూర్‌లో జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మను‹Ù–దియా జోడీ 11–9, 4–11, 8–11, 8–11తో అల్వారో రాబెల్స్–మరియా జియో (స్పెయిన్) జంట చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్‌లో ఓడిన మనుష్–దియా జోడీకి 2000 డాలర్ల (రూ. 1 లక్ష 74 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. క్వార్టర్స్‌లో రియా–రష్మిక జోడీముంబై: ఎల్ అండ్ టి ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక–రియా భాటియా (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రషి్మక–రియా ద్వయం 5–7, 6–2, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో మియా హొంటామా–క్యోకా ఒకమురా (జపాన్) జంటను ఓడించింది. 89 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది.తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. రుతుజా భోస్లే (భారత్)–అలీసియా బార్నెట్ (బ్రిటన్); ప్రార్థన తొంబారే (భారత్)–అరీన్ హర్తానో (నెదర్లాండ్స్) జోడీలు కూడా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. నేడు జరిగే సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అలెగ్జాండ్రా క్రునిక్ (సెర్బియా)తో రష్మిక; రెబెకా మరీనో (కెనడా)తో అంకిత రైనా; జరీనా దియాస్ (కజకిస్తాన్)తో మాయ రాజేశ్వరి తలపడతారు. -
పాపం పుజారా.. ఒక్క పరుగు దూరంలో సెంచరీ మిస్
రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర దిగ్గజం ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara)ను దురదృష్టం వెంటాడింది. తొలి ఇన్నింగ్స్‌లో పుజారా ఒక్క పరుగు దూరంలో 67వ ఫస్ట్ క్లాస్ సెంచరీని మిస్ చేసుకున్నాడు.పుజారా 99 పరుగుల వద్ద ముక్తర్ హూస్సేన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఏ బ్యాటర్‌కైనా ఒక్క పరుగు దూరంలో ఔటైతే ఆ బాధ వర్ణనాతీతం. ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో తన అద్భుత ఇన్నింగ్స్‌తో సౌరాష్ట్రను పటిష్ట స్ధితిలో ఉంచాడు. 167 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 99 పరుగులు చేసి పుజారా పెవిలియన్‌కు చేరాడు.కాగా తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 109 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి సౌరాష్ట్ర 442 పరుగులు చేసింది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో హర్విక్ దేశాయ్(130), చిరాగ్ జానీ(80) రాణించారు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అదుర్స్..ఇక ఇప్పటివరకు 276 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన పుజారా.. 51.89 సగటుతో 21174 పరుగులు చేశాడు. అతడి ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 66 సెంచరీలు, 80 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు 103 మ్యాచ్‌లు ఆడిన ఛతేశ్వర్.. 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు.అతడి ఇన్నింగ్స్‌లలో 19 సెంచరీలు, 35 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. పుజారా చివరగా భారత్ తరపున 2023 ఏడాదిలో ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడాడు.పాపం రహానే..మరోవైపు మేఘాలయతో జరుగుతున్న ముంబై కెప్టెన్ అజింక్య రహానే(Ajinkya Rahane) కూడా తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో 96 పరుగుల వద్ద రహానే ఔటయ్యాడు. నఫీస్ సిద్ధిక్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రహానే తన వికెట్‌ను కోల్పోయాడు. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 76 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. రహానే టీమ్ ప్రస్తుతం 172 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకముందు మేఘాలయ తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 86 పరుగులకే కుప్పకూలింది.చదవండి: దినేష్ కార్తీక్ విధ్వంసం.. హ్యాట్రిక్ సిక్స్‌లతో హాఫ్ సెంచరీ! వీడియో -
రోహిత్, జైస్వాల్, గిల్, పంత్ మాత్రమే కాదు.. రహానే, పుజారా కూడా..!
రంజీ ట్రోఫీలో ఇవాళ (జనవరి 23) టీమిండియా స్టార్ బ్యాటర్లకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. రోహిత్ శర్మ మొదలుకుని.. వెటరన్లు రహానే, పుజారా, హనుమ విహారి వరకు అంతా దారుణంగా విఫలమయ్యారు. ప్రస్తుత భారత టెస్ట్ జట్టు సభ్యులు రోహిత్ (3), జైస్వాల్ (4), శుభ్‌మన్ గిల్ (4), రిషబ్ పంత్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔట్ కాగా.. భారత వన్డే జట్టు సభ్యుడు శ్రేయస్ అయ్యర్ (11), టీమిండియా భవిష్యత్తు తార రుతురాజ్ గైక్వాడ్ (10) స్వల్ప స్కోర్లకే నిష్క్రమించారు. గతంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన భారత క్లాసికల్ బ్యాటర్లు రహానే (12), పుజారా (6), హనుమ విహారి (6) కూడా తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. విధ్వంసకర ఆటగాళ్లు రజత్ పాటిదార్ (0), శివమ్ దూబేకు (0) కూడా ఇవాళ బ్యాడ్ డేనే.టీమిండియా ఆటగాళ్లలో ఇవాళ ఎవరైనా సత్తా చాటారా అంటే అది రవీంద్ర జడేజా మాత్రమే. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ (51) మెరుపు అర్ద సెంచరీ చేసి తన జట్టు (ముంబై) పరువు నిలబెట్టాడు.ఇవాల్టి నుంచి ప్రారంభంరంజీ ట్రోఫీ 2024-25లో ఇవాల్టి నుంచి (జనవరి 23) సెకెండ్ లెగ్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు టీమిండియా ఆటగాళ్లంతా దాదాపుగా తేలిపోయారు. రవీంద్ర జడేజా మినహాయించి చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు.రంజీ ట్రోఫీలో ఇవాల్టి హైలైట్స్- ఢిల్లీపై రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర) ఐదు వికెట్ల ప్రదర్శన- ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్లు పడగొట్టిన గుజరాత్ బౌలర్ సిద్దార్థ్ దేశాయ్- మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో ఒడిషా బౌలర్ తపస్ దాస్ 6 వికెట్ల ప్రదర్శన- ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన బీహార్ ఆటగాడు ఆయుష్ లోహారుకా (101)- జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్న చత్తీస్ఘడ్ ఆటగాడు అనుజ్ తివారి- ఇదే మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన జార్ఖండ్ బౌలర్ ఉత్కర్ష్ సింగ్- హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బెంగాల్ బౌలర్ సూరజ్ సింధు జైస్వాల్- చండీఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన తమిళనాడు ఆటగాడు ఆండ్రీ సిద్దార్థ్ (106)- ఇదే మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన చండీఘడ్ బౌలర్ విషు కశ్యప్ - మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన కేరళ బౌలర్ నిధీశ్- హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకం బాదిన హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (137)- పుదుచ్ఛేరిపై సెంచరీ చేసిన ఆంధ్ర ఓపెనర్ షేక్ రషీద్ (105)- విదర్భపై 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రాజస్థాన్ బౌలర్ ఖలీల్ అహ్మద్ -
రోహిత్ శర్మనే బోల్తా కొట్టించాడు.. ఎవరీ ఉమర్ నజీర్?
టీమిండియా స్టార్ల రాకతో రంజీ ట్రోఫీ(Ranji Trophy)కి కొత్త కళ వస్తుందనుకుంటే... దాదాపుగా అందరూ ఉసూరుమనిపించారు. భారత టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant), శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా(Ravindra Jadeja), యశస్వి జైస్వాల్ గురువారం మొదలైన రంజీ రెండో దశ బరిలో దిగిన విషయం తెలిసిందే.తొలిరోజు జడ్డూ ఒక్కడే హిట్ముంబై తరఫున ఓపెనింగ్ చేసిన టీమిండియా ఓపెనర్ల జోడీ రోహిత్ శర్మ(3)- జైస్వాల్(4) పూర్తిగా విఫలమయ్యారు. మిగతా వాళ్లలో ఢిల్లీ స్టార్ రిషభ్ పంత్(1), పంజాబ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్(4) కూడా నిరాశపరిచారు. అయితే, సౌరాష్ట్ర స్పిన్నర్ రవీంద్ర జడేజా మాత్రం ఐదు వికెట్లతో చెలరేగాడు.ఆరడుగుల బుల్లెట్.. ఎవరీ ఉమర్ నజీర్?అయితే, ఈ అందరు స్టార్ల నడుమ ఈనాటి మ్యాచ్‌లో ఓ ఆరడుగుల బౌలర్ హైలైట్‌గా నిలిచాడు. అతడి పేరు ఉమర్ నజీర్ మీర్. జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్. ముంబై బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఈ స్పీడ్‌స్టర్ రోహిత్ శర్మ వికెట్ తీయడం ద్వారా క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాడు.ముంబైలోని శరద్ పవార్ క్రికెట అకాడమీ బీకేసీ మైదానంలో ముంబై- జమ్మూ కశ్మీర్ మధ్య గురువారం మొదలైన రంజీ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగి కశ్మీర్ జట్టును బౌలింగ్‌కు ఆహ్వానించింది. అయితే, ఊహించని రీతిలో పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే ఓపెనర్లు వెనుదిరిగారు.రోహిత్‌నే బోల్తా కొట్టించాడుజైస్వాల్ను ఆకిబ్ నబీ అవుట్ చేస్తే.. రోహిత్ శర్మ ఉమర్ నజీర్ బౌలింగ్‌లో కెప్టెన్ పారస్ డోగ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక టీమిండియా కెప్టెన్‌ను అవుట్ చేయడం ద్వారా వికెట్ల వేట మొదలుపెట్టిన నజీర్.. హార్దిక్ తామోర్(40 బంతుల్లో 7), ముంబై సారథి అజింక్య రహానే(12), ఆల్‌రౌండర్ శివం దూబే(0) రూపంలో మరో మూడు కీలక వికెట్లు కూల్చాడు.అలా మొత్తంగా నాలుగు వికెట్లు కూల్చి ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని నజీర్ శాసించాడు. దీంతో అతడి వివరాలపై టీమిండియా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా సమీపంలో ఉన్న మాలిక్పొరాలో నజీర్ జన్మించాడు. అతడి ఎత్తు ఆరడుగుల నాలుగు అంగుళాలకు పైమాటే. అదే అతడికి సానుకూలాంశం అయింది.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో భేష్‌ఈ పొడగరి స్పీడ్‌స్టర్ తనదైన బౌలింగ్ శైలితో దేశవాళీ క్రికెట్లో ఎంతో మంది బ్యాటర్లకు పీడకలలు మిగిల్చాడు. 31 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్‌కు.. టీమిండియాకు ఆడాలనేది చిరకాల కోరిక. అయితే, ఇంత వరకు నజీర్‌కు ఆ అవకాశం రాలేదు.అయితే, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం నజీర్ గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. మొత్తంగా 57 మ్యాచ్‌లలో అతడు 138 వికెట్లు పడగొట్టాడు. గతేడాది రంజీ ట్రోఫీ సందర్భంగా సర్వీసెస్ జట్టుపై అత్యుత్తమంగా 6/53తో రాణించాడు. తాజా రంజీ ఎడిషన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న నజీర్... గత మూడు మ్యాచ్‌లలో కలిపి పదకొండు వికెట్లు తీశాడు. అతడి ఎకానమీ రేటు 2.64గా నమోదు కావడం గమనార్హం.కుప్పకూలిన ముంబై టాప్, మిడిల్ ఆర్డర్ఇక మ్యాచ్ విషయానికొస్తే.. జైస్వాల్(4), రోహిత్ శర్మ(3), హార్దిక్ తామోర్(7), అజింక్య రహానే(12), శ్రేయస్ అయ్యర్(11), శివం దూబే(0), షామ్స్ ములానీ(0) వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో ముంబై కష్టాల్లో కూరుకుపోయింది.బ్యాట్ ఝులిపించిన శార్దూల్అయితే, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ బ్యాట్ ఝులిపించడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. 57 బంతుల్లో శార్దూల్ ఏకంగా 51 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా తనూష్ కొటియాన్(26) రాణించాడు. వీరిద్దరి కారణంగా ముంబై గౌరవప్రదమైన స్కోరు చేసింది. 33.2 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ అయింది.జమ్మూ కశ్మీర్ బౌలర్లలో ఉమర్ నజీర్, యుధ్వీర్ సింగ్ నాలుగేసి వికెట్లు కూల్చగా... ఆకిబ్ నబీ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక గురువారం నాటి తొలిరోజు ఆట ముగిసే సరికి జమ్మూ కశ్మీర్ 42 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది. ముంబై కంటే 54 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చదవండి: అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
రోహిత్‌కు అంతా తెలుసు.. రిలాక్స్డ్గా ఉంటాడు: రహానే
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. భారత్ క్రికెట్ జట్టులోని హేమాహేమీలైన స్టార్ క్రికెటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల పరిస్థితి చూస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. గత కొంత కాలం వరకు భారత్ క్రికెట్‌ను శాసించిన ఈ ఇద్దరూ ప్రస్తుతం పేలవమైన ఫామ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనతో పాటు.. అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చెప్పటింది. ఆటగాళ్లందరికీ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా భారత్ జట్టులోని క్రికెటర్లు అందరూ దేశవాళీ పోటీల్లో తప్పనిసరిగా ఆడాలి. ఏదైనా అత్యవసర పరిస్థితులు కారణంగా దేశవాళీ పోటీల్లో ఆడలేనప్పుడు బీసీసీఐ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. రోహిత్ దశాబ్దం తర్వాతగురువారం రంజీ ట్రోఫీ టోర్నమెంట్ రెండో దశ ప్రారంభమైనప్పుడు ఒక అరుదైన సంఘటన జరగనుంది. అంతర్జాతీయ పోటీల్లో ఎప్పుడూ బిజీగా ఉండే స్టార్ క్రికెటలందరు తమ రాష్ట్ర జట్ల తరఫున రంజీ ట్రోఫీ పోటీల్లో ఆడనున్నారు. ఇందులో రోహిత్ శర్మ, వైస్-కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్, అజయ్ జడేజా, హైదరాబాద్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వంటి టాప్ స్టార్లు ఉండటం విశేషం.కెప్టెన్ రోహిత్ శర్మ అయితే దాదాపు ఒక దశాబ్దం తర్వాత రంజీ ట్రోఫీ పోటీల్లో ఛాంపియన్స్ ముంబై తరఫున ఆడనున్నాడు. రోహిత్ మాజీ భారత్ ఆటగాడు అజింక్య రహానే నాయకత్వంలో ముంబై తరపున బరిలో దిగనున్నాడు. జమ్మూ కాశ్మీర్ తో జరగనున్న మ్యాచ్ లో రోహిత్ భారత్ జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి ముంబై బ్యాటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఎలైట్ గ్రూ-‘ఎ’ లో ముంబై 22 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ 23 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. అయితే ఫిట్ నెస్ లేని కారణంగా విరాట్ కోహ్లీ ఈ రంజీ ట్రోఫీ పోటీల్లో ఆడకుండా బీసీసీఐ నుంచి మినహాయింపు పొందాడు. మెడ నొప్పి తో బాధపడుతున్న కోహ్లీ కోలుకోవడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు.రహానే కితాబురోహిత్ మళ్ళీ జట్టులోకి రావడం ఆనందం కలిగిస్తోందని రహానే కితాబిచ్చాడు. "రోహిత్ తన ఫామ్ ని తిరిగి సాధించాలని ధృడ నిశ్చయంతో ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నిన్న నెట్ ప్రాక్టీస్ లో రోహిత్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ఫామ్ అనేది ఆటగాడి కెరీర్లో భాగం. రోహిత్ పై నాకు అపార నమ్మకముంది. రోహిత్ ఎప్పుడూ రిలాక్స్‌గా ఉంటాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు కూడా అతని వైఖరి అలాగే ఉంటుంది. అతనికి తన ఆట గురించి బాగా తెలుసు కాబట్టి, అతను ఏమి చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు," అని రహానే కితాబిచ్చాడు. కాగా రాజ్‌కోట్‌లో జరగనున్న మరో మ్యాచ్ లో ఢిల్లీ రెండుసార్లు విజేతలైన సౌరాష్ట్రతో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ తన భారత సహచరులు రవీంద్ర జడేజా, మరియు చతేశ్వర్ పుజారాతో తలపడతాడు.ఆస్ట్రేలియా కూడా పాఠాలు నేర్చుకోవాలిఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ 1-3 తేడాతో ఓటమి చవిచూసిన నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఇయాన్ హీలీ బీసీసీఐ కొత్త విధానాన్ని సమర్థించాడు. పది పాయింట్ల మార్గదర్శకాలను అమలు చేయడంపై మాట్లాడుతూ.. జట్టులో పెరుగుతున్నసూపర్స్టార్ సంస్కృతిని అరికట్టడానికి ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని వ్యాఖ్యానించాడు. భారత క్రికెటర్లలో క్రమశిక్షణ లేకుండా పోయింది.‘‘నిజానికి ఈ సమస్య చాలా కాలంగా ఉంది. ఇప్పుడు ఇది ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. బీసీసీఐ అధికారులు తీసుకున్న చర్యలు జట్టు క్రమశిక్షణను కాపాడుకోవడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నాను. అయితే దీని నుంచి ఆస్ట్రేలియా, ఇతర ప్రధాన జట్లు కూడా పాఠం నేర్చుకోవాలి" అని హీలి అన్నాడు. చదవండి: జైస్వాల్‌కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు -
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. అతడిపై వేటు! సూర్యకు చోటు
దేశవాళీ వన్డే టోర్నమెంట్లో విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ టోర్నీ ఆడబోయే పదిహేడు మంది సభ్యుల పేర్ల(తొలి మూడు మ్యాచ్‌లు)ను మంగళవారం వెల్లడించింది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్ శివం దూబే కూడా ఈ టోర్నీలో పాల్గొనునున్నట్లు తెలిపింది.అతడిపై వేటుఅయితే, ఓపెనర్ పృథ్వీ షాకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. నిలకడలేమి ఫామ్‌తో సతమవుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌పై సెలక్టర్లు వేటు వేశారు. మరోవైపు.. సూపర్ ఫామ్‌లో ఉన్న అజింక్య రహానే వ్యక్తిగత కారణాల దృష్ట్యా సెలక్షన్‌కు అందుబాటులో లేడని తెలుస్తోంది.గత కొంతకాలంగా పృథ్వీ షా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమి తదితర కారణాలతో రంజీ జట్టుకు అతడు కొన్నాళ్లుపాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. తిరిగి వచ్చినా కేవలం 59 పరుగులే చేశాడు.మరోవైపు.. ఐపీఎల్ మెగా వేలం-2025లో రూ. 75 లక్షల కనీస ధరకే అందుబాటులో ఉన్నా ఒక్క ఫ్రాంఛైజీ పృథ్వీ షా వైపు కన్నెత్తి చూడలేదు. ఫలితంగా ఒకప్పటి ఈ స్టార్ బ్యాటర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.ఇక దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ పృథ్వీ షా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఈ టోర్నీలో 25 ఏళ్ల పృథ్వీ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి.. 197 పరుగులే చేయగలిగాడు. మధ్యప్రదేశ్‌తో ఫైనల్లోనూ పది పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై సెలక్టర్లు వేటు వేశారు.రహానే దూరంమరోవైపు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైని విజేతగా నిలిపిన టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్.. విజయ్ హజారే ట్రోఫీలోనూ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక పొట్టి ఫార్మాట్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించి ముంబైని చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన రహానే.. వన్డే టోర్నీలో మాత్రం ఆడటం లేదు. కాగా డిసెంబరు 21 నుంచి విజయ్ హజారే ట్రోఫీ మొదలుకానుంది.తిరుగులేని ముంబైకాగా భారత దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టు ఇప్పటికి 63 టైటిల్స్ గెలిచింది. రంజీ ట్రోఫీని 42 సార్లు నెగ్గిన ముంబై జట్టు ఇరానీ కప్‌ను 15 సార్లు దక్కించుకుంది. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో 4 సార్లు విజేతగా నిలిచిన ముంబై.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీ టైటిల్‌ను రెండుసార్లు కైవసం చేసుకుంది. ఇప్పుడు మరో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది.విజయ్ హజారే వన్డే టోర్నీ 2024 -25కి తొలి మూడు మ్యాచ్‌లకు ముంబై జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్, ప్రసాద్ పవార్, అధర్వ అంకోలేకర్, తనూష్ కొటియన్, శార్దూల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్, జునేద్ ఖాన్, హర్ష్ తనా, వినాయక్ భోయిర్. చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం -
మధ్యప్రదేశ్ X ముంబై
దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై, మధ్యప్రదేశ్ జట్లు తుదిపోరుకు దూసుకెళ్లాయి. సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే దంచి కొట్టడంతో బరోడాపై ముంబై జట్టు ఘనవిజయం సాధిస్తే.... కెప్టెన్ రజత్ పాటిదార్ మెరుపులతో ఢిల్లీపై మధ్యప్రదేశ్ పైచేయి సాధించింది. బెంగళూరులో ఆదివారం జరగనున్న ఫైనల్లో మధ్యప్రదేశ్‌తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. బెంగళూరు: సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే (56 బంతుల్లో 98; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ముంబై జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో అడుగు పెట్టింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్లో ముంబై 6 వికెట్ల తేడాతో బరోడాను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. శివాలిక్ శర్మ (24 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... కెపె్టన్ కృనాల్ పాండ్యా (30; 4 ఫోర్లు), శాశ్వత్ రావత్ (33; 4 ఫోర్లు) రాణించారు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (5) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ముంబై బౌలర్లలో సుర్యాంశ్ షెగ్డే 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 17.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రహానే త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. ఈ టోర్నీలో ఫుల్ ఫామ్ కనబర్చిన రహానే... బరోడా బౌలర్లను కుదురుకోనివ్వకుండా మైదానం నలువైపులా షాట్లతో అలరించాడు. ఓపెనర్ పృథ్వీ షా (8), సూర్యకుమార్ యాదవ్ (1) విఫలమైనా... లక్ష్యం పెద్దది కాకపోవడంతో ముంబై జట్టుకు పెద్దగా ఇబ్బందులు ఎదురవలేదు. బరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అతిత్ సేత్, అభిమన్యు సింగ్, శాశ్వత్ రావత్ తలా ఒక వికెట్ తీశారు. రహానేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. 13 ఏళ్ల తర్వాత... ఢిల్లీతో జరిగిన రెండో సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 7 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ ఢిల్లీని చిత్తుచేసిన మధ్యప్రదేశ్ జట్టు 13 ఏళ్ల తర్వాత ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌కు చేరింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. వికెట్ కీపర్ అనూజ్ రావత్ (33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), ప్రియాన్‡్ష ఆర్య (29; 3 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ రావత్ (24; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టమైన బంతులతో ఆకట్టుకోవడంతో... ఢిల్లీ జట్టు పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ 2 వికెట్లు పడగొట్టగా... త్రిపురేశ్ సింగ్, అవేశ్ ఖాన్, కుమార్ కార్తికేయ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో మధ్యప్రదేశ్ జట్టు 15.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 152 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ (29 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... హర్‌ప్రీత్ సింగ్ (38 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్‡్ష (18 బంతుల్లో 30, 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ముఖ్యంగా రజత్ పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలింగ్‌ను ఏమాత్రం లెక్కచేయని రజత్ భారీ షాట్లతో విజృంభించాడు. హర్‌ప్రీత్‌తో కలిసి రజత్ అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 57 బంతుల్లోనే 106 పరుగులు జోడించడంతో... మధ్యప్రదేశ్ జట్టు మరో 26 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ 2 వికెట్లు, హిమాన్షు చౌహాన్ ఒక వికెట్ తీశారు. రజత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
కేకేఆర్‌కు గుడ్ న్యూస్.. అరివీర భయంకరమైన ఫామ్‌లో రహానే
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు కేకేఆర్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు వెటరన్ ఆటగాడు అజింక్య రహానే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా బరోడాతో జరిగిన సెమీఫైనల్లో రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ టోర్నీలో రహానే గత ఆరు మ్యాచ్‌ల్లో ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు.మహారాష్ట్రతో జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో రహానే పరుగుల ప్రవాహం మొదలైంది. ఆ మ్యాచ్‌లో అతను 34 బంతుల్లో 52 పరుగుల చేశాడు. ఆతర్వాత కేరళతో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అనంతరం సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లో 22 పరుగులు చేశాడు.రహానే విశ్వరూపం ఆంధ్రతో జరిగిన చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్‌తో మొదలైంది. ఈ మ్యాచ్‌లో రహానే 53 బంతుల్లో 95 పరుగులు చేశాడు. అనంతరం విదర్భతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 45 బంతుల్లో 84 పరుగులు చేశాడు. తాజాగా బరోడాతో జరిగిన సెమీస్‌లో 57 బంతుల్లో 98 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.ప్రస్తుత సీజన్లో (సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ) రహానే లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో రహానే 8 మ్యాచ్‌లు ఆడి 172 స్ట్రయిక్ రేట్‌తో 366 పరుగులు చేశాడు. బరోడాతో జరిగిన సెమీస్‌లో రహానే రఫ్ఫాడించడంతో ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్‌కు చేరింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. శాశ్వత్ రావత్ (33), కృనాల్ పాండ్యా (30), శివాలిక్ శర్మ (26 నాటౌట్), అథీత్ సేథ్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హార్దిక్ పాండ్యా 5 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.159 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రహానే మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. రహానేకు జతగా శ్రేయస్ అయ్యర్ (46) కూడా కాసేపు మెరుపు మెరిపించాడు. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ, మధ్యప్రదేశ్ మధ్య రెండో సెమీఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు డిసెంబర్ 15న జరిగే అంతిమ పోరులో ముంబైతో తలపడనుంది. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో అజింక్య రహానేను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రూ.1.5 కోట్ల బేస్ ధరకు సొంతం చేసుకుంది. -
రఫ్పాడించిన రహానే.. విధ్వంసకర సెంచరీ మిస్.. అయితేనేం..
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై బ్యాటర్ అజింక్య రహానే పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బరోడా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆది నుంచే దూకుడు ప్రదర్శించిన రహానే సెంచరీ దిశగా పయనించాడు.శతకానికి రెండు పరుగుల దూరంలోఅయితే, దురదృష్టవశాత్తూ శతకానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు రహానే. అయితేనేం తన మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబైకి విజయం అందించి.. ఫైనల్‌కు చేర్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్లో భాగంగా ముంబై జట్టు బరోడాతో తలపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై.. బరోడాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో బరోడా జట్టు ఏడు వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది.రాణించిన శివాలిక్ శర్మబరోడా ఇన్నింగ్స్‌లో శివాలిక్ శర్మ(36 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ శశ్వత్ రావత్(33), కెప్టెన్ కృనాల్ పాండ్యా(30), ఆల్‌రౌండర్ అతిత్ సేత్(14 బంతుల్లో 22) ఫర్వాలేదనిపించారు. ఇక ముంబై బౌలర్లలో పేసర్లు సూర్యాంశ్ షెడ్గే రెండు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. శివం దూబే, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి ఒక్కో వికెట్ తీశారు. ఇక స్పిన్ బౌలర్లు తనుష్ కొటియాన్, అథర్వ అంకోలేకర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.బరోడా బౌలింగ్‌ను చితక్కొట్టిన రహానేఇక బరోడా విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి ఆదిలో షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఓపెనర్ పృథ్వీ షా(8) అవుటయ్యాడు. అయితే, ఆ ఆనందం బరోడాకు ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్ అజింక్య రహానే బరోడా బౌలింగ్‌ను చితక్కొట్టాడు.కేవలం 56 బంతుల్లోనే 11 ఫోర్లు, ఐదు సిక్స్‌ల సాయంతో ఏకంగా 98 పరుగులు రాబట్టాడు. అయితే, అభిమన్యు సింగ్ బౌలింగ్‌లో విష్ణు సోలంకికి క్యాచ్ ఇవ్వడంతో రహానే విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తెరపడింది. తృటిలో సెంచరీ అతడి చేజారింది. సూర్య విఫలంమిగతా వాళ్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 30 బంతుల్లో 46 పరుగులతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచాడు. ఏడు బంతులు ఆడిన స్కై కేవలం ఒకే ఒక్క పరుగు చేశాడు. శివం దూబే 0, సూర్యాంశ్ షెడ్గే 6 పరుగులతో అజేయంగా నిలిచారు.ఇక రహానే ధనాధన్ బ్యాటింగ్ కారణంగా ముంబై 17.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో బరోడాను ఓడించి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ఫైనల్ చేరింది.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
విధ్వంసం సృష్టించిన షా, రహానే, దూబే
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన క్వార్టర్ ఫైనల్-4లో ముంబై విదర్భపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్‌కు చేరుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. అథర్వ తైడే (66), వాంఖడే (51) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో శుభమ్ దూబే (43 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.THE SIX HITTING MACHINE - SHIVAM DUBE 🥶 pic.twitter.com/Qy2uhlXKBp— Johns. (@CricCrazyJohns) December 11, 2024అనంతరం బరిలోకి దిగిన ముంబై.. 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు పృథ్వీ షా (26 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అజింక్య రహానే (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించగా.. ఆఖర్లో శివమ్ దూబే (22 బంతుల్లో 37 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), సూర్యాంశ్ షేడ్గే (12 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి విధ్వంసం సృస్టించారు. MUMBAI INTO SEMIS OF SMAT...!!!Suryansh Shedge with another masterclass. 🙇♂️👌 pic.twitter.com/6FxuxENHc4— Mufaddal Vohra (@mufaddal_vohra) December 11, 2024ఈ మ్యాచ్‌లో ముంబై గెలుపుపై ఆశలు వదులుకున్న తరుణంలో శివమ్ దూబే, సూర్యాంశ్ సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై విజయానికి షా, రహానే బీజం వేసినప్పటికీ.. మధ్యలో టీమిండియా స్టార్లు శ్రేయస్ అయ్యర్ (5), సూర్యకుమార్ యాదవ్ (9) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.సూపర్ ఫామ్‌లో రహానేఈ టోర్నీలో ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అజింక్య రహానే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రహానే గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 52, 68, 22, 95, 84 పరుగులు స్కోర్ చేశాడు. విదర్భతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో రహానే కేవలం 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. -
తృటిలో సెంచరీ చేజార్చుకున్న రహానే.. 54 బంతుల్లో..!
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు నాకౌట్ దశకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రీకర్ భరత్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకోగా.. అశ్విన్ హెబ్బర్ (52), రికీ భుయ్ (68) అర్ద సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్తి, షమ్స్ ములానీ, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై.. అజింక్య రహానే వీరోచిత ఇన్నింగ్స్ ఆడటంతో మరో 3 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. రహానే 5 పరుగుల స్వల్ప తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ముంబై ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా (34), శ్రేయస్ అయ్యర్ (25), శివమ్ దూబే (34) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆఖర్లో సుయాంశ్ షేడ్గే 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 30 పరుగులు చేసి ముంబైని విజయతీరాలు దాటించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2024 ఎడిషన్‌లో ఆంధ్రకు ఇది తొలి పరాజయం. -
వేలంలో అమ్ముడుపోలేదు.. ఇక్కడేమో బ్యాటర్లు ఉతికారేశారు! పాపం శార్దూల్..
భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో లో ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడు. కాగా ఇండియాలో ప్రస్తుతం దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరుగుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా.. గ్రూప్-‘ఇ’లో ఉన్న కేరళ- ముంబై జట్లు శుక్రవారం తలపడ్డాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కేరళకు శార్దూల్ ఠాకూర్ ఆరంభంలోనే షాకిచ్చాడు. కెప్టెన్, ఓపెనర్ సంజూ శాంసన్(4)ను ఆదిలోనే పెవిలియన్‌కు పంపాడు.అయితే, ఆ తర్వాత ముంబైకి పెద్దగా ఏదీ కలిసిరాలేదు. వరుస విరామాల్లో వికెట్లు తీసినా.. ఓపెనర్ రోహన్ కణ్ణుమల్, సల్మాన్ నిజార్ ధాటికి ముంబై బౌలర్లు చేతులెత్తేశారు. రోహన్ 48 బంతుల్లోనే 87 పరుగులతో చెలరేగగా.. సల్మాన్ 49 బంతుల్లో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా కేరళ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 234 పరుగులు చేసింది.కాగా ముంబై బౌలర్లలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. ఏకంగా 69 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓ మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా రమేశ్ రాహుల్ చెత్త రికార్డును సమం చేశాడు. కాగా రమేశ్ అరుణాచల్‌ప్రదేశ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలం-2025లో రూ. 2 కో ట్ల కనీస ధరతో శార్దూల్ ఠాకూర్ అందుబాటులో ఉన్నాడు. అయితే, ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపకపోవడంతో అతడు అమ్ముడుపోకుండానే మిగిలిపోయాడు. ప్పుడిలా టీ20మ్యాచ్‌లో చె త్త ప్రదర్శన కనబరిచాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. కేరళ విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై ఆఖరి వరకు పోరాడింది. ఓపెనర్లు పృథ్వీ షా(23), అంగ్క్రిష్ రఘువంశీ(16) నిరాశపరచగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(18 బంతుల్లో 32) కాసేపు బ్యాట్ ఝులిపించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న అజింక్య రహానే 35 బంతుల్లోనే 68 రన్స్ చేశాడు.రహానే ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉండటం విశేషం. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ హార్దిక్ తామోర్(23) ఒక్కడే కాస్త మెరుగ్గా ఆడాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ముంబై 191 పరుగులు చేయగలిగింది. దీంతో కేరళ 43 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా? -
రాణించిన రహానే.. దుమ్మురేపిన శ్రేయస్ అయ్యర్
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ 39 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేశాడు. శ్రేయస్‌తో పాటు వెటరన్ ఆజింక్య రహానే (34 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా రాణించడంతో మహారాష్ట్రపై ముంబై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ నిఖిల్ నాయక్ (47), అజిమ్ ఖాజీ (32) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. అర్శిన్ కులకర్ణి (19), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (19), త్రిపాఠి (16), రామకృష్ణ ఘోష్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ముంబై బౌలర్లలో తనుశ్ కోటియన్ 3, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్తి తలో 2, రాయ్స్టన్ డయాస్, సూర్యాంశ్ షెడ్గే చెరో వికెట్ పడగొట్టారు.172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. శ్రేయస్, రహానే రాణించడంతో 17.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ముంబై ఇన్నింగ్స్‌లో అంగ్క్రిష్ రఘువంశీ 21, షమ్స్ ములానీ 14 (నాటౌట్), హార్దిక్ తామోర్ (9 నాటౌట్) పరుగులు చేయగా.. పృథ్వీ షా, సూర్యాంశ్ షెడ్గే డకౌట్ అయ్యారు. మహా బౌలర్లలో ముకేశ్ చౌదరీ 4 వికెట్లు పడగొట్టగా.. అర్శిన్ కులకర్ణి ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మెరుపు ప్రదర్శన చేసిన శ్రేయస్ అయ్యర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో కూడా శ్రేయస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. కాగా, నవంబర్ 24న జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్ రికార్డు స్థాయిలో 26.75 కోట్లకు అమ్ముడుపోయాడు. అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో భారీ ధర. ఇదే వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక ధర. గత 5 ఇన్నింగ్స్‌ల్లో ముంబై తరఫున శ్రేయస్ చేసిన స్కోర్లు..142- రంజీ ట్రోఫీ233- రంజీ ట్రోఫీ47- రంజీ ట్రోఫీ130 నాటౌట్ (57)- సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ71 (39)- సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ -
వెంకటేశ్ అయ్యర్, నరైన్ కాదు.. కేకేఆర్ కెప్టెన్‌గా అతడే!?
ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. ఈ మెగా వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు తమకు కావల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ముఖ్యంగా కెప్టెన్లు రిటైన్ చేసుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ ఫ్రాంచైజీలు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ఢిల్లీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టే అవకాశముండగా.. పంజాబ్ కింగ్స్ సారథిగా శ్రేయస్ అయ్యర్ ఎంపిక కావడం దాదాపు ఖారారైంది. అదే విధంగా లక్నో సూపర్ జెయింట్స్ నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కానీ కేకేఆర్, ఆర్సీబీ పరిస్థితులు వేరు. తొలుత ఆర్సీబీ రాహుల్‌ను సొంతం చేసుకుని తమ జట్టు పగ్గాలు అప్పగిస్తుందని అంత భావించారు. మరోవైపు కేకేఆర్ రిషబ్ పంత్‌పై కన్నేసిందని వార్తలు వినిపించాయి. కానీ వేలంలో ఈ రెండూ జరగలేదు. దీంతో ఈ రెండు ఫ్రాంచైజీల కెప్టెన్లగా ఎవరు ఎంపిక అవుతారని అభిమానుల ఆతృతగా ఎదురు చూస్తున్నారు.కేకేఆర్ కెప్టెన్‌గా రహానే..!అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా వెటరన్ అజింక్య రహానే బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు పగ్గాలను రహానే అప్పగించాలని కేకేఆర్ మేనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వేలంలో ఆఖరి నిమిషంలో అజింక్య రహానేను కోల్‌కతా కొనుగోలు చేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తొలి రోజు వేలంలోకి వచ్చిన రహానేను దక్కించుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. కానీ రెండో రోజు వేలంలో ఆఖరి రౌండ్లో కనీస ధర రూ.1.75 కోట్లకు నైట్ రైడర్స్ కైవసం చేసుకుంది. కాగా కేకేఆర్ జట్టులో సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ వంటి ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. వీరిద్దరూ గత కొన్ని సీజన్లగా కోల్‌కతాకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే వీరిద్దరూ కెప్టెన్సీ రేసులో ఉన్నప్పటకి కేకేఆర్ ఫ్రాంచైజీ మాత్రం రహానే వైపే మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వెంకటేశ్ అయ్యర్‌ను ఏకంగా రూ.23.75 కోట్ల భారీ ధర వెచ్చించి మరి తిరిగి కేకేఆర్ సొంతం చేసుకుంది.దీంతో అతడికే కేకేఆర్ తమ జట్టు పగ్గాలు అప్పగిస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ అతడి కెప్టెన్‌గా అనువభవం లేనుందన కేవలం ఆల్‌రౌండర్‌గానే కొనసాగనున్నట్లు సమాచారం. కాగా రహానే గతంలో కేకేఆర్‌కు కూడా ప్రాతినిథ్యం వహించాడు.చదవండి: IPL 2025: రిషభ్ పంత్ భావోద్వేగం.. ఎమోషనల్ నోట్ వైరల్ -
IPL 2025: టీమిండియా స్టార్లకు భారీ షాక్.. పట్టించుకోని ఫ్రాంచైజీలు
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ ప్లేయర్లు అజింక్య రహానే, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, శ్రీకర్ భరత్‌లకు భారీ షాక్ తగిలింది. రెండో రోజు వేలంలోకి వచ్చిన ఈ ఆటగాళ్లను కొనుగొలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.ముఖ్యంగా ఐపీఎల్లో స్పెషలిస్ట్ ఓపెనర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ షాను కూడా ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే షా ప్రస్తుతం పేలవ ఫామ్, ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు.ఈ కారణంగానే అతడిని ఎవరూ పట్టించుకోలేదన్నది తేట తెల్లమవుతోంది. మరోవైపు గత కొన్ని సీజన్లలో సీఎస్కే తరపున అకట్టుకున్న రహానేకు కూడా మొండి చేయి ఎదురైంది. కోటిన్నర బేస్ ధరతో వేలంలోకి అడుగుపెట్టిన రహానే ఎవరూ కొనుగోలు చేయలేదు. వేలంలో అమ్ముడుపోని మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కనీస ధర కోటిగా ఉంది.శార్ధూల్ది అదే కథ..వీరితో పాటు స్టార్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్‌కు కూడా నిరాశే ఎదురైంది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శార్ధూల్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ముందకు రాలేదు. గాయం కారణంగా గత కొన్ని నెలలకు దూరంగా ఉన్న శార్ధూల్.. ఇటీవలే తిరిగి మైదానంలో అడగుపెట్టాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక పైన పేర్కొన్న ఆటగాళ్లు సెకెండ్ రౌండ్‌లోనైనా అమ్ముడుపోతారో లేదో వేచి చూడాలి.చదవండి: అతడి టెస్టు కెరీర్ గొప్పగా సాగుతోంది.. మాకు ఇంతకంటే ఏం కావాలి: బుమ్రా -
SMT 2024: ముంబై జట్టు ప్రకటన.. పృథ్వీ షా, రహానేలకు చోటు
దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్నాడు. ఈ నెల 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరగనున్న ఈ ట్రోఫీ కోసం ముంబై క్రికెట్ సంఘం ఆదివారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. రంజీ ట్రోపీలో ముంబై జట్టుకు సారథ్యం వహించిన అజింక్యా రహానేతో పాటు... ఫిట్నెస్ లేమితో పాటు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడి రంజీ జట్టులో చోటు కోల్పోయిన ఓపెనర్ పృథ్వీ షా కూడా ముస్తాక్ అలీ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత టెస్టు జట్టులో సుస్థిర స్థానం సాధించాలనుకుంటున్న శ్రేయస్ అయ్యర్ ప్రస్తుత రంజీ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు.తాజా సీజన్లో అయ్యర్ 90.40 సగటుతో 452 పరుగులు సాధించాడు. అందులో ఒక డబుల్ సెంచరీ, మరో సెంచరీ ఉంది. ఇక ఇటీవల ఆస్ట్రేలియా–‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తనుశ్ కోటియాన్, పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్, సిద్ధేశ్ లాడ్, యువ ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ ముంబై జట్టులో చోటు దక్కించుకున్నారు. ముంబై జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, అంగ్క్రిష్ రఘువంశీ, జయ్ బిస్తా, అజింక్యా రహానే, సిద్ధేశ్ లాడ్, సూర్యాన్ష్ షెడ్గె, సాయిరాజ్ పాటిల్, హార్దిక్ తమోర్, ఆకాశ్ ఆనంద్, షమ్స్ ములానీ, హిమాన్షు సింగ్, తనుశ్ కోటియాన్, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, రోస్టన్ డియాస్, జునేద్ ఖాన్.చదవండి: కోహ్లిపై ఒత్తిడి పెంచండి! -
కెప్టెన్‌గా అజింక్య రహానే.. మా స్టార్ పేసర్ వచ్చేస్తున్నాడు!
దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ఎడిషన్ నవంబరు 23న మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) తమ కెప్టెన్ పేరును వెల్లడించింది. టీ20 టోర్నమెంట్లోనూ టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానేనే తమ సారథిగా కొనసాగుతాడని స్పష్టం చేసింది.స్టార్ పేసర్ వచ్చేస్తున్నాడు!అదే విధంగా.. తమ కీలక పేసర్ తుషార్ దేశ్‌పాండే ఫిట్నెస్ గురించి అప్డేట్ అందించింది. చీలమండ శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న అతడు.. కోలుకున్నాడని.. త్వరలోనే పునరాగమనం చేస్తాడని వెల్లడించింది. కాగా ముంబై జట్టు దేశీ క్రికెట్లో సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.గత రంజీ సీజన్లో చాంపియన్‌గా నిలవడంతో పాటు.. ఇరానీ కప్-2024లో రెస్టాఫ్ ఇండియాను ఓడించి ట్రోఫీ గెలిచింది. ఇక ఈ రెండు సందర్భాల్లోనూ అజింక్య రహానే ముంబై కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. ఇక తాజా రంజీ ట్రోఫీ ఎడిషన్‌లోనూ రహానేనే ముంబైని ముందుండి నడిపిస్తున్నాడు.అందుకే అతడే కెప్టెన్ఈ నేపథ్యంలో విజయవంతమైన సారథిగా పేరొందిన రహానేనే.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ కెప్టెన్‌గా కొనసాగిస్తామని ఎంసీఏ చెప్పడం విశేషం. ‘‘ఇరానీ కప్‌తో పాటు తాజా రంజీ సీజన్లోనూ అతడి సారథ్యంలో మా జట్టు అద్బుతంగా రాణిస్తోంది. ఈసారి కూడా టీ20 టోర్నీలో అతడే మా కెప్టెన్. ఇక తుషార్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు.రంజీ ట్రోఫీ సెకండ్ లెగ్ నుంచి అతడు అందుబాటులోకి వస్తాడు. అతడి సేవలు మా జట్టుకు ఎంతో కీలకం. శార్దూల్, జునేద్, మోహిత్‌తో పాటు తుషార్ కూడా ఉంటే మా పేస్ బౌలింగ్ లైనప్ మరింత పటిష్టంగా తయారవుతుంది’’ అని ఎంసీఏ అధికారులు వార్తా ఏజెన్సీ ఐఏఎన్ఎస్తో పేర్కొన్నారు.పృథ్వీ షా సైతంకాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024తో టీమిండియా మాజీ ఓపెనర్ పృథ్వీ షా సైతం ముంబై జట్టులో తిరిగి చేరనున్నాడు. ఇటీవల.. అనుచిత ప్రవర్తన కారణంగా రంజీ జట్టు నుంచి ఎంసీఏ అతడిని తొలగించింది. అయితే, టీ20 టోర్నీలో మాత్రం పృథ్వీని ఆడించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది సయ్యద్ ముస్తాన్ అలీ ట్రోఫీ నవంబరు 23- డిసెంబరు వరకు జరుగనుంది.ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ 2024-25 తొలి మ్యాచ్‌లో ముంబై బరోడా చేతిలో ఓడింది. తర్వాత మహారాష్ట్రపై విజయం సాధించి.. త్రిపురతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. తర్వాత ఒడిషాపై గెలుపొందింది.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ఎడిషన్‌లో పాల్గొనబోయే ముంబై ప్రాబబుల్ జట్టుపృథ్వీ షా, ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, శ్రీరాజ్ ఘరత్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, సూర్యాన్ష్ షెడ్గే, ఇషాన్ ముల్చందానీ, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), ఆకాశ్ ఆనంద్ (వికెట్ కీపర్), సాయిరాజ్ పాటిల్, ఆకాశ్ పార్కర్, షామ్స్ ములానీ, హిమాన్షు సింగ్, సాగర్ చాబ్రియా, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, సిల్వెస్టర్ డిసౌజా, రాయ్స్టన్ డైస్, యోగేశ్ పాటిల్, హర్ష్ తన్నా, ఇర్ఫాన్ ఉమైర్, వినాయక్ భోయిర్, కృతిక్ హనగవాడీ, శశాంక్ అటార్డే, జునేద్ ఖాన్. చదవండి: బ్యాట్‌తోనూ సత్తా చాటిన షమీ -
స్టార్ ఓపెనర్ రీ ఎంట్రీ.. శ్రేయస్ అయ్యర్ కూడా! కానీ అతడు మిస్!
టీమిండియా ఓపెనర్, తమ స్టార్ క్రికెటర్ పృథ్వీ షాకు ముంబై క్రికెట్ అసోసియేషన్ శుభవార్త అందించింది. ఇటీవల రంజీ జట్టు నుంచి అతడిని తొలగించిన యాజమాన్యం.. దేశీ టీ20 టోర్నీ కోసం మళ్లీ పిలుపునిచ్చేందుకు సిద్ధమైంది. కాగా దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలతో టీమిండియాలోకి దూసుకువచ్చిన పృథ్వీ షా.. తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.టీమిండియా ఓపెనర్‌గా తన స్థానాన్ని కోల్పోయినిలకడలేని ఆటతీరుతో శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్లతో పోటీలో వెనుకబడి టీమిండియా ఓపెనర్‌గా తన స్థానాన్ని కోల్పోయాడు. 2018లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన పృథ్వీ.. 2021లో చివరగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు మొత్తం 5 టెస్టులు, 6 వన్డేలు ఆడిన ఈ ముంబై బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 339, 189 పరుగులు చేశాడు.ముంబై తరఫున ఆడుతూఅదే విధంగా.. టీమిండియా తరఫున ఒకే ఒక్క టీ20 ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో మళ్లీ డొమెస్టిక్ క్రికెట్‌పై దృష్టిపెట్టిన పృథ్వీ షా.. ముంబై తరఫున ఆడుతూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో పాటు.. విజయ్ హజారే ట్రోఫీ(వన్డే), సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(టీ20)లో ఆడుతూనే.. ఐపీఎల్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకంటున్నాడు.ఇంగ్లండ్ గడ్డపై రాణిస్తూఅలాగే ఇంగ్లండ్ దేశీ టోర్నీల్లోనూ పాల్గొంటున్న పృథ్వీ షా.. అక్కడ నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ 2024-25లో తొలుత పృథ్వీ షాకు అవకాశం ఇచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్.. ఆ తర్వాత అతడిని పక్కనపెట్టింది. ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలు, అనుచిత ప్రవర్తన కారణంగా పృథ్వీపై వేటు వేసింది.శ్రేయస్ అయ్యర్ కూడాఈ నేపథ్యంలో తాజాగా ముంబై ప్రాబబుల్స్ జట్టులో పృథ్వీ పేరు కనిపించడం విశేషం. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో పాల్గొనే అవకాశం ఉన్న ఆటగాళ్ల పేరును ముంబై క్రికెట్ అసోసియేషన్ తాజాగా విడుదల చేసింది. ఇందులో పృథ్వీ షాతో పాటు టీమిండియా స్టార్, ప్రస్తుతం జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్లతో పాటు వెటరన్ ప్లేయర్ అజింక్య రహానే తదితరుల పేర్లు కూడా ఉన్నాయి.అతడు మాత్రం మిస్‌అయితే, ఆల్‌రౌండర్ తనుష్ కొటియాన్ మాత్రం ఈ లిస్టులో మిస్సయ్యాడు. ఇటీవల భారత్-‘ఎ’ జట్టుకు ఎంపికైన అతడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. కానీ.. అక్కడ ఆసీస్-‘ఎ’తో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్ 2-0తో క్లీన్‌స్వీప్ అయింది. కాగా నవంబరు 23 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా సీజన్ మొదలుకానుంది. ఇందులో రంజీ సారథి రహానేనే ముంబైకి నాయక త్వం వహించే అవకాశం ఉంది.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో పాల్గొనబోయే ముంబై ప్రాబబుల్ జట్టుపృథ్వీ షా, ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, శ్రీరాజ్ ఘరత్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, సూర్యాన్ష్ షెడ్గే, ఇషాన్ ముల్చందానీ, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), ఆకాశ్ ఆనంద్ (వికెట్ కీపర్), సాయిరాజ్ పాటిల్, ఆకాశ్ పార్కర్, షామ్స్ ములానీ, హిమాన్షు సింగ్, సాగర్ చాబ్రియా, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, సిల్వెస్టర్ డిసౌజా, రాయ్స్టన్ డైస్, యోగేశ్ పాటిల్, హర్ష్ తన్నా, ఇర్ఫాన్ ఉమైర్, వినాయక్ భోయిర్, కృతిక్ హనగవాడీ, శశాంక్ అటార్డే, జునేద్ ఖాన్. చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్‌గా అతడే! -
టీమిండియా వైట్ వాష్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా 25 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. విరాట్, రోహిత్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లతో నిండిన భారత్ 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. బెంగళూరు, పుణేల వేదికగా జరిగిన తొలి రెండు టెస్టుల్లోనూ దారుణ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు.. ఇప్పుడు వాంఖడేలోనే అదే తీరును పునరావతృం చేసింది. కివీస్ స్పిన్నర్ల వలలో చిక్కుకుని భారత బ్యాటర్లు విల్లవిల్లాడారు. ఒక్క రిషబ్ పంత్ మినహా మిగితా అందరూ విఫలమయ్యారు. దీంతో స్వదేశంలో తొలిసారి రెండు కంటే ఎక్కువ మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై ఘోర ఆ ప్రతిష్టతను రోహిత్ సేన మూటకట్టుకుంది.రహానే పోస్ట్ వైరల్.. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ ప్లేయర్ అజింక్య రహానే షేర్ చేసిన ఓ వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్ ఓటమి అనంతరం తను వర్కౌట్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో రహానే షేర్ చేశాడు. అందుకు హద్దులను దాటి ముందుకు వెళ్లండి అంటూ ఆర్ధం వచ్చేలా కాప్షన్ ఇచ్చాడు. కాగా రహానే భారత జట్టులో చోటు కోల్పోయి దాదాపు ఏడాదిపైనే అయింది. రహానే జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నప్పటకి తన ఫిట్నెస్ను ఏ మాత్రం కోల్పోలేదు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రహానే బిజీబిజీగా ఉన్నాడు. రంజీ సీజన్ 2024-25లో ముంబై కెప్టెన్‌గా రహానే వ్యవహరిస్తున్నాడు. సారధిగా రహానే గతేడాది ముంబై జట్టును రంజీ చాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత ముంబైకు ఇరానీ కప్-2024ను కూడా అందించాడు. రహానే చివరగా భారత్ తరపున గతేడాది వెండీస్పై ఆడాడు.చదవండి: చాలా బాధగా ఉంది.. ఓటములకు నాదే బాధ్యత: రోహిత్ శర్మ -
యశస్విపై నాలుగు మ్యాచ్‌ల నిషేధం పడి ఉండేది..!
టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే లీడర్షిప్ క్వాలిటీస్ గురించి అందరికీ తెలుసు. 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతను ఏరకంగా భారత జట్టును గెలిపించాడో అందరం చూశాం. ప్రస్తుతం రహానే టీమిండియాలో భాగం కానప్పటికీ.. దేశవాలీ టోర్నీల్లో ముంబై జట్టును అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నాడు. రహానేకు మంచి నాయకుడిగా పేరుండటంతో పాటు నిఖార్సైన జెంటిల్మెన్గానూ గుర్తింపు ఉంది. దేశవాలీ క్రికెట్లో రహానే యువ ఆటగాళ్లకు అత్యుత్తమ గైడ్‌లా ఉంటాడు.కెప్టెన్‌గా వారికి అమూల్యమైన సలహాలు అందిస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో రహానే ఆటగాళ్ల శ్రేయస్సు కొరకు కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు. ప్రస్తుత టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ విషయంలో రహానే ఓ సందర్భంలో కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. 2022 దులీప్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా యశస్వికి (వెస్ట్ జోన్), సౌత్ జోన్ ఆటగాడు రవితేజకు మధ్య మాటల యుద్దం జరిగింది. ఆ సమయంలో రహానే జైస్వాల్‌ను మైదానాన్ని వీడాల్సిందిగా ఆదేశించాడు.For those who trolled him for sending Jaiswal out of the field, this is for you!Ajinkya Rahane reveals the reason why he sent Jaiswal out of the field. pic.twitter.com/nMzobNkwwc— Riddhima (@RiddhimaVarsh17) October 26, 2024ఒకవేళ ఆ సమయంలో రహానే అలా చేయకపోయుంటే యశస్విపై నాలుగు మ్యాచ్‌ల నిషేధం పడి ఉండేది. యశస్వి శ్రేయస్సు కోసమే తాను అలా చేశానని రహానే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ మ్యాచ్‌లో రహానే వెస్ట్ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించగా.. యశస్వి జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి భారీ డబుల్ సెంచరీ (264) చేశాడు. ఇదిలా ఉంటే, యశస్వి జైస్వాల్ ఈ ఏడాది అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. యశస్వి ఈ ఏడాది ఫార్మాట్లకతీతంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో యశస్వి రెండో స్థానంలో ఉన్నాడు. యశస్వి ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 1300 పైచిలుకు పరుగులు చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌తో ముగిసిన రెండో టెస్ట్‌లో (సెకెండ్ ఇన్నింగ్స్‌లో) యశస్వి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చదవండి: జేడీయూలో చేరిన క్రికెటర్ ఇషాన్ కిషన్ తండ్రి -
టీమిండియా 46 ఆలౌట్.. రహానే పోస్ట్ వైరల్
టెస్టుల్లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు న్యూజిలాండ్ చేతిలో చేదు అనుభవం ఎదురైంది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేనను 46 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వైస్ కెప్టెన్, వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ.. భారత బ్యాటర్ల వైఫల్యానికి, రహానే పోస్ట్‌కి సంబంధం ఏమిటంటారా?!రహానేకు అప్ప ట్లో పిలుపుటీమిండియా టెస్టు జట్టులో కీలక సభ్యుడిగా వెలుగు వెలిగిన రహానేకు ప్రస్తుతం జట్టులో చోటు కరువైంది. అయితే, ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొట్టడంతో మళ్లీ భారత జట్టు సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. ఏకంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ఆడిన జట్టులో స్థానం సంపాదించాడు.తన విలువ చాటుకున్నాడుఇంగ్లండ్ గడ్డ మీద ఆస్ట్రేలియాతో జరిగిన నాటి మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు విఫలం కాగా రహానే 89, 46 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో ఏకంగా మరోసారి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే, విండీస్‌లో పేలవ ప్రదర్శన కారణంగా రహానేకు మళ్లీ అవకాశాలు రాలేదు.రంజీ, ఇరానీ కప్ గెలిచిన సారథిప్రస్తుతం అతడు దేశవాళీ టోర్నీలతో బిజీగా ఉన్నాడు. ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రహానే గతేడాది ఆ జట్టును రంజీ చాంపియన్‌గా నిలిపాడు. అంతేకాదు ఇరానీ కప్-2024 ట్రోఫీ కూడా గెలిచాడు. ప్రస్తుతం మళ్లీ రంజీ 2024-25 సీజన్‌తో బిజీగా మారాడు. అతడి సారథ్యంలోని ముంబై తమ మొదటి మ్యాచ్‌లో బరోడా చేతిలో ఓడిపోయింది.స్ట్రైకింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాఈ క్రమంలో అక్టోబరు 18 నుంచి తమ రెండో మ్యాచ్ ఆడనుంది. ఇందులో భాగంగా రహానే సేన మహారాష్ట్ర జట్టును ఢీకొట్టనుంది. ముంబై వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం రహానే నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను గురువారం షేర్ చేస్తూ.. ‘‘స్ట్రైకింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను’’ అంటూ గ్రీన్‌టిక్ బాక్స్‌లో రైట్ గుర్తు ఉన్న ఎమోజీ పోస్ట్ చేశాడు.‘భయ్యా.. నీ టైమింగ్ సూపర్ఇక అదే సమయంలో టీమిండియా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 46 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఈ రెండింటినీ ముడిపెడుతూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘భయ్యా.. నీ టైమింగ్ సూపర్.. ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేయాలో బాగా తెలుసు. నువ్వు టీమిండియా రీఎంట్రీకి సిద్ధంగా ఉన్నావని సంకేతాలు ఇస్తున్నావు కదా! అసలే ఆస్ట్రేలియా పర్యటన ముందుంది మరి!’’ అని రహానే క్యాప్షన్‌కు తమ భాష్యాలు ఆపాదిస్తున్నారు. కాగా విరాట్ కోహ్లి గైర్హాజరీలో ఆసీస్ గడ్డ మీద టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే నాటి టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.చదవండి: Ind vs NZ: తప్పు నాదే.. పిచ్‌ను సరిగా అంచనా వేయలేకపోయా: రోహిత్ View this post on Instagram A post shared by Ajinkya Rahane (@ajinkyarahane) -
ఇరానీ కప్.. రాణించిన రహానే, సర్ఫరాజ్
లక్నో: సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే (197 బంతుల్లో 86 బ్యాటింగ్; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా, రంజీ చాంపియన్ ముంబై జట్ల మధ్య మంగళవారం ప్రారంభమైన ఇరానీక కప్ మ్యాచ్‌లో ముంబై సారథి రహానే కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రహానేతో పాటు టీమిండియా ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్ (84 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ (88 బంతుల్లో 54 బ్యాటింగ్; 6 ఫోర్లు) కూడా అర్ధ శతకాలతో మెరిశారు.ఫలితంగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 68 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన రహానే చక్కటి ఇన్నింగ్స్ ఆడగా... ఓపెనర్ పృథ్వీ షా (4), ఆయుష్ మాత్రే (19), హార్దిక్ తమోర్ (0) విఫలమయ్యారు. రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు బౌలర్లలో ముకేశ్ కుమార్ 3 వికెట్లు తీయగా, యశ్ దయాళ్ ఒక వికెట్ పడగొట్టాడు. రహానేతో పాటు సర్ఫరాజ్ ఖాన్ క్రీజులో ఉన్నాడు. వీరిద్దరూ అబేధ్యమైన ఐదో వికెట్‌కు 98 పరుగులు జోడించారు. -
గావస్కర్ ఉపయోగించని ప్లాటు రహానేకు
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌కు గతంలో కేటాయించిన స్థలాన్ని వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేకు బదలాయిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముంబైలోని ఖరీదైన బాంద్రా ప్రాంతంలో 2000 చదరపు మీటర్ల (2391 గజాలు) స్థలాన్ని రహానేకు 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని మహారాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రీడాభివృద్ధి కోసం ఈ స్థలాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఈ స్థలాన్ని 1988లో గావస్కర్‌కు కేటాయించారు. ఇండోర్ క్రికెట్ ట్రెయినింగ్ అకాడమీ కోసం లీజుకు ఇచ్చారు. కానీ 30 ఏళ్లకుపైగా గావస్కర్ ఈ స్థలాన్ని సది్వనియోగం చేయలేదు.క్రికెట్ అవసరాలకోసం అభివృద్ధి చేయలేదు. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం కేటాయించిన భూమి నిరుపయోగంగా మారడంపై 2021లోనే ఆ రాష్ట్ర మాజీ గృహనిర్మాణ మంత్రి జితేంద్ర అవ్హద్ విమర్శించారు. దీంతో గావాస్కర్ మరుసటి ఏడాదే (2022) ప్రభుత్వానికి అప్పగించారు. తాజాగా ఈ స్థలానే ఇప్పుడు రహానేకు కేటాయించారు. -
కెప్టెన్‌గా రహానే.. జట్టులోకి ఇద్దరు టీమిండియా స్టార్లు!
ఇరానీ కప్-2024కు ముంబై జట్టు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. రెస్టాఫ్ ఇండియాపై గెలుపే లక్ష్యంగా ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెడ్‌బాల్ మ్యాచ్‌లో ముంబైకి అజింక్య రహానే సారథ్యం వహించనున్నాడు.ఇక ఈ మ్యాచ్‌కు ఇద్దరు టీమిండియా స్టార్లు కూడా అందుబాటులోకి రావడంతో జట్టు మరింత పటిష్టంగా మారనుందని ముంబై వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా రంజీ ట్రోఫీ గెలిచిన జట్టుకు, రెస్టాఫ్ ఇండియా టీమ్‌కు మధ్య ఇరానీ కప్ పోటీ జరుగుతుంది.రంజీ తాజా ఎడిషన్ విజేత ముంబైఈ ఏడాది రంజీ టోర్నీలో రహానే సారథ్యంలోని ముంబై జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబరు 1 నుంచి మొదలయ్యే ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియాతో తలపడనుంది. ఇందుకోసం ఎంసీఏ మంగళవారం తమ జట్టును ప్రకటించనున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది.ఇద్దరు టీమిండియా స్టార్లు అందుబాటులోకిరహానే కెప్టెన్సీలో జరుగనున్న ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఎంసీఏ అధికారులు నిర్ధారించినట్లు పేర్కొంది. కాగా టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఇటీవల ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. లీసస్టర్షైర్కు ఆడే క్రమంలో అతడు గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.అయితే, ఇరానీ కప్ మ్యాచ్ నాటికి రహానే పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. టీమిండియాలో చోటు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్.. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు కూడా ఎంపిక కాలేదు. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్‌లతో మిడిలార్డర్లో పోటీలో అతడు వెనుకబడ్డాడు.శ్రేయస్‌కు మరో అవకాశంఇటీవల దులిప్ ట్రోఫీ-2024లోనూ శ్రేయస్ నిరాశపరిచాడు. దీంతో ఇరానీ కప్ మ్యాచ్‌లోనైనా సత్తా చాటాలని అతడు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. శస్త్ర చికిత్స అనంతరం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఇన్విటేషనల్ టోర్నీలో ఆడిన శార్దూల్ ఠాకూర్ సైతం ఈ మ్యాచ్‌కు అందుబాటులోని రానున్నట్లు సమాచారం. కాగా ముంబై చివరగా 1998లో ఇరానీ కప్ గెలిచింది. అయితే, ఈసారి మేటి ఆటగాళ్లు జట్టులో భాగమవడం సానుకూలాంశం. మరోవైపు.. రెస్టాఫ్ ఇండియా జట్టు గత హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదుంది. గత మ్యాచ్‌లలో సౌరాష్ట్రపై రెండుసార్లు, మధ్యప్రదేశ్ జట్టుపై ఒకసారి గెలిచి ఇరానీ కప్ టైటిల్ సొంతం చేసుకుంది. కాగా శ్రేయస్, శార్దూల్ రంజీ గెలిచిన ముంబై జట్టులోనూ సభ్యులేనన్న విషయం తెలిసిందే.చదవండి: ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్ మినహా..! -
రూట్‌కు పొంచి ఉన్న గండం.. అరుదైన రికార్డుకు ఎసరు!
టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. బంగ్లాదేశ్‌తో గురువారం నుంచి మొదలుకానున్న టెస్టు సిరీస్‌లో 132 పరుగులు చేస్తే.. ఇంత వరకు ఏ భారత క్రికెటర్‌కూ సాధ్యం కాని ఘనత సాధిస్తాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌ను ఐసీసీ రెండేళ్లకొకసారి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అజింక్య రహానే పేరిట ఆ రికార్డుఇక 2019-21 నుంచి డబ్ల్యూటీసీ మొదలు కాగా.. ఆ సీజన్లో భారత్ తరఫున టెస్టు స్పెషలిస్టు అజింక్య రహానే 1159 పరుగులు సాధించాడు. తద్వారా ఒక డబ్ల్యూటీసీ సైకిల్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్‌గా తన పేరిట రికార్డును పదిలం చేసుకున్నాడు. అయితే, ఆ ఘనతను అధిగమించేందుకు జైస్వాల్‌కు ఇప్పుడు అవకాశం వచ్చింది. జైస్వాల్ 132 రన్స్ చేస్తే..ప్రస్తుతం డబ్ల్యూటీసీ సైకిల్(2023-25)లో ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు 1028 పరుగులు సాధించాడు. ఈ 22 ఏళ్ల లెఫ్టాండర్ గనుక మరో 132 రన్స్ చేస్తే.. రహానేను వెనక్కినెట్టి డబ్ల్యూటీసీ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్‌గా తన పేరును లిఖించుకోగలుగుతాడు.రూట్ రికార్డుకు ఎసరు పెట్టాడుఅంతేకాదు.. మరో 371 పరుగులు చేస్తే ఓవరాల్‌గా ఈ సైకిల్లో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ స్టార్ జో రూట్(1398 రన్స్)ను కూడా జైస్వాల్ అధిగమించగలడు. ప్రస్తుతం జైస్వాల్.. మరో ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్(1028 రన్స్)తో కలిసి రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా జట్ల విషయానికొస్తే.. డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్‌లో ఉంది. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో సెప్టెంబరు 19- అక్టోబరు 1 వరకు జరుగనున్న రెండు మ్యాచ్‌ల సిరీస్ గెలిచి.. అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇక బంగ్లాదేశ్ తర్వాత రోహిత్ సేన సొంతగడ్డపై న్యూజిలాండ్(మూడు టెస్టులు)తో తలపడనుంది.డబ్ల్యూటీసీ వీరుడిగాఅనంతరం బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఇందులో భాగంగా కంగారూ జట్టుతో ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో యశస్వి జైస్వాల్ మెరుగైన ప్రదర్శన కనబరిస్తే బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగానే డబ్ల్యూటీసీ ఇండియా వీరుడిగా నిలిచే అవకాశం ఉంది. లేదంటే.. మరికొన్నాళ్లు అతడు వేచిచూడకతప్పదు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే యశస్వి జైస్వాల్ ఖాతాలో ఇప్పటికే టెస్టుల్లో మూడు శతకాలతో పాటు.. రెండు డబుల్ సెంచరీలు కూడా ఉండటం అతడి సత్తాకు నిదర్శనం.చదవండి: T20 WC: టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు: కెప్టెన్ -
సెంచరీతో కదంతొక్కిన రహానే
ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 పోటీల్లో టీమిండియా ఆటగాడు అజింక్య రహానే సెంచరీతో (192 బంతుల్లో 102; 13 ఫోర్లు, సిక్స్) కదంతొక్కాడు. ఈ టోర్నీలో లీసెస్టర్‌షైర్‌కు ఆడుతున్న రహానే.. గ్లామోర్గన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో తన జట్టు కష్టాల్లో (73/3) ఉన్నప్పుడు బరిలోకి దిగిన రహానే.. సహచరుడు పీటర్ హ్యాండ్స్కోంబ్తో (126 నాటౌట్) కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. రహానే, హ్యాండ్స్కోంబ్ సెంచరీలతో కదంతొక్కడంతో లీసెస్టర్‌షైర్ 6 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి సెకెండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.40వ శతకంఈ మ్యాచ్‌లో రహానే చేసిన సెంచరీ అతనికి ఫస్ట్ కెరీర్లో 40వది. రహానే ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 40 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీల సాయంతో 13,387 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రహానే 1600 ఫస్ట్ క్లాస్ బౌండరీల మార్కును కూడా అందుకున్నాడు.తొలి ఇన్నింగ్స్‌లోనూ రాణించిన రహానే ఈ మ్యాచ్‌లో రహానే తొలి ఇన్నింగ్స్‌లోనూ రాణించాడు. 67 బంతుల్లో 6 బౌండరీల సాయంతో 42 పరుగులు చేశాడు. రహానేతో పాటు హ్యాండ్స్కోంబ్ కూడా ఓ మోస్తరు స్కోర్ (46) చేయడంతో లీసెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 251 పరుగులు చేసింది.ఇంగ్రామ్ భారీ డబుల్అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన గ్లామోర్గన్.. కొలిన్ ఇంగ్రామ్ భారీ డబుల్ సెంచరీతో (257 నాటౌట్) విరుచుకుపడటంతో 9 వికెట్ల నష్టానికి 550 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.కాగా, నాలుగో రోజు మూడో సెషన్ సమయానికి లీసెస్టర్‌షైర్ 45 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. హ్యాండ్స్కోంబ్, లియామ్ ట్రెవస్కిస్ (8) క్రీజ్‌లో ఉన్నారు. లీసెస్టర్‌షైర్ చేతిలో మరో నాలుగు వికెట్లు ఉన్నాయి. -
రాణించిన రహానే.. అరంగేట్రం అదుర్స్
ఇంగ్లండ్ దేశవాలీ వన్డే కప్‌లో టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్య రహానే సత్తా చాటాడు. ఈ టోర్నీలో లీసెస్టర్‌షైర్ తరఫున అరంగేట్రం చేసిన రహానే.. నిన్న (జులై 24) నాటింగ్హషైర్తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ద సెంచరీతో (60 బంతుల్లో 71; 9 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. రహానే క్లాసీ ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.Can I just shock you? Ajinkya Rahane is in the runs.71 of the finest from the Indian superstar on his Leicestershire debut.Here's every boundary. pic.twitter.com/NIwhARcBiE— Metro Bank One Day Cup (@onedaycup) July 24, 2024ఈ మ్యాచ్‌లో నాటింగ్హమ్షైర్పై లీసెస్టర్‌షైర్ 15 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లీసెస్టర్.. బుడింగర్ (75), హిల్ (81), రహానే అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 369 పరుగులు చేసింది.The moment Ajinkya Rahane reached his first Foxes fifty. 😎🦊#LEIvNOT pic.twitter.com/bHjSpMcpvZ— Leicestershire Foxes 🦊 (@leicsccc) July 24, 2024అనంతరం వరుణుడు అడ్డుతగలడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన లీసెస్టర్ లక్ష్యాన్ని 14 ఓవర్లలో 105 పరుగులకు కుదించారు. ఈ లక్ష్యాన్ని ఛేదించలేక లీసెస్టర్ ఓటమిపాలైంది. 14 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 89 పరుగులు మాత్రమే చేయగలిగింది. టామ్ స్క్రీవెన్ 3 వికెట్లు తీసి లీసెస్టర్‌ను దెబ్బ తీశాడు. -
ధోని ముసలోడే కదా.. అందుకే అలా అన్నాను: సెహ్వాగ్
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఛలోక్తులు విసరడంలో దిట్ట అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిటైర్మెంట్ తర్వాత ఈ విధ్వంసకర ఓపెనర్ కామెంటేటర్, విశ్లేషకుడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్-2024 హర్యానా కామెంట్రీతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఉద్దేశించి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు సెహ్వాగ్. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సీఎస్కే ఫీల్డింగ్‌ను ప్రశంసిస్తూ.. ‘‘క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు కదా. అజింక్య రహానే మంచి క్యాచ్ అందుకున్నాడు. రచిన్ రవీంద్ర కూడా అద్బుతంగా క్యాచ్ పట్టాడు. వయసు మీద పడ్డ ధోని కూడా ఓ క్యాచ్ అందుకున్నాడు’’ అని క్రిక్‌బజ్ షోలో వ్యాఖ్యానించాడు. ఇందుకు స్పందనగా అక్కడే ఉన్న మరో మాజీ క్రికెటర్ రోహన్ గావస్కర్.. ‘‘రహానే విషయంలో ఆ పదం(ముసలోడు అన్న అర్థంలో) ఎందుకు వాడలేదు’’ అని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘వాళ్లిద్దరి వయసు ఒకటి కాదు కదా! ధోని కంటే రహానే ఫిట్‌గా ఉన్నాడు. 35 ఏళ్ల వ్యక్తికి.. 41 ఏళ్లు పైబడిన వ్యక్తికి మధ్య కచ్చితంగా తేడా ఉంటుంది. ధోనికి వయసు మీద పడుతుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు కదా’’ అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. రహానే నూటికి నూరు శాతం ధోని కంటే ఎక్కువ ఫిట్‌గా ఉన్నాడు కాబట్టే అతడిని అలా అనలేదని పేర్కొన్నాడు. కాగా గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ధోని అద్బుత రీతిలో డైవ్ చేసి.. గుజరాత్ బ్యాటర్ విజయ్ శంకర్‌ను పెవిలియన్‌కు పంపాడు. 𝗩𝗶𝗻𝘁𝗮𝗴𝗲 𝗠𝗦𝗗 😎 An excellent diving grab behind the stumps and the home crowd erupts in joy💛 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #CSKvGT pic.twitter.com/n5AlXAw9Zg — IndianPremierLeague (@IPL) March 26, 2024 పాదరసంలా కదిలి శరీరాన్ని స్ట్రెచ్ చేసి బంతిని ఒడిసిపట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్(16 బంతుల్లో 21) ఇచ్చిన క్యాచ్‌ను అజింక్య రహానే, అజ్మతుల్లా ఇచ్చిన క్యాచ్‌ను రచిన్ రవీంద్ర సంచలన క్యాచ్‌లతో మెరిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. Give your hearts to Rahane! He’ll carry it safe! 🧲💛 pic.twitter.com/95k8QD94wz — Chennai Super Kings (@ChennaiIPL) March 26, 2024 ఈ విషయంపై స్పందిస్తూ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సైతం.. ధోని, రహానే, రచిన్లను కొనియాడాడు. ధోని, రహానేను చూస్తుంటే తమ జట్టులో అదనంగా ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్లు అనిపిస్తోందంటూ ప్రశంసలు కురిపించాడు. -
అజింక్యా రహానే అద్భుత విన్యాసం.. కోహ్లికి మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఆటగాడు అజింక్యా రహానే అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. బౌండరీ లైన్ వద్ద రహానే ఫీల్డింగ్ విన్యాసానికి అందరూ ఆశ్చర్యపోయారు. బౌండరీ లైన్ వద్ద చాకచాక్యంగా వ్యవహరించిన రహానే.. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని పెవిలియన్‌కు పంపాడు. ఏం జరిగిందంటే ఆర్సీబీ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన ముస్త్ఫిజర్ రెహ్మాన్ రెండో బంతిని కోహ్లికి షార్ట్‌పిచ్ డెలివరీగా సంధించాడు. దీంతో కోహ్లి డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అటు వైపు ఫీల్డింగ్ చేస్తున్న రహానే కుడి వైపు పరుగెత్తి బంతిని అద్భుతంగా అందుకున్నాడు. కానీ బౌండరీ రోప్ దగ్గరలో బ్యాలెన్స్ కోల్పోయిన రహానే.. సమయస్పూర్తిని ప్రదర్శిస్తూ.. తనను ఫాలో అవుతూ స్క్వేర్ లెగ్ నుంచి పరుగెత్తుకొచ్చిన రచిన్ రవీంద్రకు బంతిని అందించాడు. క్యాచ్ రచిన్ ఖాతాలో చేరినప్పటికి.. రహానే ఎఫర్ట్‌కు మాత్రం అందరూ ఫిదా అయిపోయారు. ఆఖరికి విరాట్ కోహ్లి సైతం ఆశ్చర్యపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి (20 బంతుల్లో సిక్స్‌తో 21) పరుగులు చేశాడు. Brilliant relay catch 👌 Timber strike 🎯 Mustafizur Rahman is making merry & so are @ChennaiIPL 🙌 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y #TATAIPL | #CSKvRCB | @ChennaiIPL | @ajinkyarahane88 pic.twitter.com/0GKADcZleM — IndianPremierLeague (@IPL) March 22, 2024 -
‘రంజీ’ రారాజు ముంబై... ఆటగాళ్లపై కోట్లాభిషేకం
విదర్భ ఇన్నింగ్స్‌లో 135వ ఓవర్... అప్పటికే 9 వికెట్లు పడ్డాయి... కెరీర్లో చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న ముంబై పేసర్ ధవల్ కులకర్ణి ఇంత సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో 8 ఓవర్లే వేశాడు... ఒక్కసారిగా ధవల్ చేతికి కెప్టెన్ రహానే బంతిని అందించాడు... మూడో బంతికి ఉమేశ్ యాదవ్ క్లీన్‌బౌల్డ్... ముంబై శిబిరంలో సంబరాలు షురూ... వెరసి దేశవాళీ క్రికెట్ దిగ్గజం ఖాతాలో మరో రంజీ ట్రోఫీ చేరింది. ముంబై జట్టు ఏకంగా 42వ సారి రంజీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత టీమ్ ఖాతాలో మరో కప్ చేరగా... ధవల్ ఐదో రంజీ విజయంలో భాగంగా నిలిచి సగర్వంగా ఆటకు వీడ్కోలు పలికాడు. ముంబై: భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీని ముంబై జట్టు సొంతం చేసుకుంది. గురువారం ముగిసిన ఐదు రోజుల ఫైనల్లో ముంబై 169 పరుగుల తేడాతో రెండుసార్లు చాంపియన్ విదర్భపై ఘన విజయం సాధించింది. విదర్భ చివరి రోజు వరకు పోరాడినా అసాధ్యమైన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. 538 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 248/5తో ఆట కొనసాగించిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (199 బంతుల్లో 102; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ పూర్తి చేసుకోగా... హర్‡్ష దూబే (128 బంతుల్లో 65; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 130 పరుగులు జోడించారు. అక్షయ్, హర్‡్ష చాలాసేపు ముంబై బౌలర్లకు లొంగకుండా ఇబ్బంది పెట్టారు. అయితే ఎట్టకేలకు తనుష్ బౌలింగ్‌లో అక్షయ్ వికెట్ల ముందు దొరికిపోవడంతో ముంబై గెలుపు బాట పట్టింది. మిగిలిన నాలుగు వికెట్లను 15 పరుగుల వ్యవధిలోనే తీసి ముంబై చాంపియన్‌గా అవతరించింది. సెంచరీ సాధించడంతో పాటు 2 వికెట్లు తీసిన ముషీర్ ఖాన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. అతనికి రూ. 50 వేలు ప్రైజ్‌మనీ దక్కింది. టోర్నీ మొత్తంలో 502 పరుగులు, 29 వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన ముంబై ఆటగాడు తనుష్ కొటియన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. తనుష్ కు రూ. 2 లక్షల 50 వేలు ప్రైజ్‌మనీ లభించింది. 1934–35 సీజన్లో తొలిసారి విజేతగా నిలిచిన ముంబై (బాంబే) జట్టు ఈ టైటిల్‌కు ముందు 2015–16 సీజన్లో చివరిసారి ట్రోఫీని అందుకుంది. ఆటగాళ్లపై కోట్లాభిషేకం... ప్రైజ్‌మనీలో ముంబై డబుల్ ధమాకా కొట్టింది. సీజన్ విజేతకు బీసీసీఐ రూ. 5 కోట్ల ప్రైజ్‌మనీ ఇవ్వగా... ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) తమ క్రికెటర్లకు ప్రత్యేకంగా రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది. దీంతో తాజా రంజీ విజేతకు వచ్చిన ప్రైజ్‌మనీ రెట్టింపైంది. ‘ఈ సీజన్లో మా జట్లు బాగా ఆడాయి. బీసీసీఐ నిర్వహించిన వయో విభాగాల టోర్నీలన్నింటిలోనూ ఫైనల్ చేరాయి. దీంతో ఎంసీఏ ప్రోత్సాహకంగా రూ. 5 కోట్ల బహుమతి ఇస్తోంది’ అని కార్యదర్శి అజింక్య నాయక్ తెలిపారు. -
మా జట్టులో తక్కువ పరుగులు చేసింది నేనే: రహానే
Ajinkya Rahane Comments After Guiding Mumbai to Ranji Trophy Title Win: ‘‘మా జట్టులో తక్కువ పరుగులు స్కోరు చేసిన బ్యాటర్‌ను నేనే.. అయినప్పటికీ అందరికంటే అత్యంత సంతోషడే వ్యక్తిని కూడా నేనే.. ట్రోఫీ గెలవడం ఆనందంగా ఉంది. ప్రతి ఆటగాడి కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉంటాయి. ఏదేమైనా డ్రెసింగ్ రూంలో అందరూ పరస్పరం ఒకరి విజయాలు మరొకరు సెలబ్రేట్ చేసుకునే వాతావరణం కల్పించడమే అత్యంత ముఖ్యమైనది. నా జీవితంలో ఈరోజు ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. గతేడాది ఒక్క పరుగు తేడాతో ఓడి.. నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయాం. అయితే, ఇప్పుడు జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడి పట్ల మరింత బాధ్యత తీసుకుని.. వారి ఆటిట్యూడ్, ఫిట్నెస్, సహచర సభ్యులతో మెలిగే విధానం.. ఇలా ప్రతి అంశంలోనూ మరింత శ్రద్ధ వహించాం. ముంబై క్రికెట్ అసోసియేషన్ అన్ని వేళలా మాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు’’ అని రంజీ ట్రోఫీ 2023-24 టైటిల్ విన్నింగ్ కెప్టెన్ అజింక్య రహానే హర్షం చేశాడు. అదే విధంగా.. విదర్భ సైతం ఆఖరి వరకు విజయం కోసం అద్భుతంగా పోరాడిందని కొనియాడాడు. కాగా వాంఖడే స్టేడియంలో గురువారం ముగిసిన రంజీ ట్రోఫీ 2023- 24 ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విదర్భను 169 పరుగుల తేడాతో చిత్తు చేసి రికార్డు స్థాయిలో ఏకంగా 42వ సారి ట్రోఫీ గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్(136) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక రహానే 73 విలువైన పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్ 95 పరుగులతో అదరగొట్టాడు. షమ్స్ ములానీ సైతం అజేయ అర్ధ శతకంతో రాణించాడు. కాగా రంజీ తాజా ఎడిషన్‌లో అదరగొట్టి టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలనుకున్న రహానే.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మొత్తంగా పదమూడు ఇన్నింగ్స్ ఆడి కేవలం 214 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 𝐌𝐮𝐦𝐛𝐚𝐢 are WINNERS of the #RanjiTrophy 2023-24! 🙌 Mumbai Captain Ajinkya Rahane receives the coveted Trophy 🏆 from the hands of Mr Ashish Shelar, Honorary Treasurer, BCCI. 👏 👏#Final | #MUMvVID | @ShelarAshish | @ajinkyarahane88 | @MumbaiCricAssoc | @IDFCFIRSTBank pic.twitter.com/LPZTZW3IV4 — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 For his superb hundred in the #RanjiTrophy #Final, Musheer Khan is named the Player of the Match. 👍 👍 He receives the award from the hands of Mr Ashish Shelar, Honorary Treasurer, BCCI. 👏 👏#MUMvVID | @ShelarAshish | @IDFCFIRSTBank pic.twitter.com/T3l6mLW6kP — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 Tanush Kotian bagged the Player of the Tournament award for brilliant all-round display 🙌 🙌 He receives the award from Mr Ajinkya Naik, Honorary Secretary, Mumbai Cricket Association. 👏 👏#RanjiTrophy | #Final | #MUMvVID | @ajinkyasnaik | @MumbaiCricAssoc | @IDFCFIRSTBank pic.twitter.com/eMbRcr4s24 — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 -
రాణించిన రహానే, ముషీర్ ఖాన్.. టైటిల్ దిశగా ముంబై
రంజీ ట్రోఫీ 2024 ఫైనల్లో ముంబై టీమ్ గెలుపు దిశగా సాగుతుంది. విదర్భతో జరుగుతున్న తుది సమరంలో ఆ జట్టు పటిష్ట స్థితిలో ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి, 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ముషీర్ ఖాన్ (51), కెప్టెన్ అజింక్య రహానే (58) అర్దసెంచరీలతో అజేయంగా క్రీజ్‌లో ఉన్నారు. 119 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై.. 34 పరుగులకే ఓపెనర్లు పృథ్వీ షా (11), భూపేన్ లాల్వాని (18) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే ముషీర్ ఖాన్, రహానే మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తమ జట్టును సేఫ్ జోన్లోకి చేర్చారు. వీరు మూడో వికెట్‌కు అజేయమైన 107 పరుగులు జోడించి ముంబైను గెలుపు దిశగా నడిపిస్తున్నారు. చాలాకాలం తర్వాత ముంబై కెప్టెన్ రహానే ఫామ్‌లోకి వచ్చాడు. కీలకమైన ఫైనల్లో రహానే బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ అద్భుతమైన బంతితో పృథ్వీ షాను క్లీన్ బౌల్డ్ చేశాడు. లాల్వాని వికెట్ హర్ష్ దూబేకు దక్కింది. అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే కుప్పకూలింది. దవళ్ కులకర్ణి (3/15), షమ్స్ ములానీ (3/32), తనుశ్ కోటియన్ (3/7) విదర్భను దారుణంగా దెబ్బకొట్టారు. విదర్భ ఇన్నింగ్స్‌లో అథర్వ తైడే (23), యశ్ రాథోడ్ (27), ఆదిత్య థాకరే (19), యశ్ ఠాకూర్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ముంబై కూడా తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. విదర్భ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో ఆ జట్టు 224 పరుగులకే పరిమితమైంది. యశ్ ఠాకూర్ 3, హర్ష్ దూబే 3, ఉమేశ్ యాదవ్ 2, ఆదిత్య థాకరే ఓ వికెట్ పడగొట్టారు. ముంబై ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్ (75) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబైకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడంతో పాటు ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ పటిష్టంగా ఉండటంతో ఆ జట్టునే విజయం వరించవచ్చు. ముంబై ఇప్పటికే ఏ జట్టుకు సాధ్యపడని రీతిలో 41 రంజీ టైటిళ్లు సాధించింది. -
IPL 2024: కాన్వే ఔట్.. రుతురాజ్‌కు జోడీ ఎవరు..?
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా రాబోయే ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. కాన్వే వైదొలగడంతో రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు సీఎస్కే ఇన్నింగ్స్‌ను ఎవరు ఆరంభిస్తారనే అంశంపై ప్రస్తుతం నెట్టింట భారీ ఎత్తున చర్చ నడుస్తుంది. ప్రస్తుతం సీఎస్కేకు అందుబాటులో ఉన్న వనరుల ప్రకారం ముగ్గురు ఆటగాళ్లను ఓపెనర్‌గా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వారిలో కొత్తగా జట్టులో చేరిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రచిన్ ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ఓపెనర్‌గా సక్సెస్ సాధించాడు కాబట్టి అతన్నే రుతురాజ్‌కు జోడీగా పంపాలని మెజార్టీ శాతం సీఎస్కే అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సీఎస్కే యాజమాన్యం ముందు రచిన్‌తో పాటు మరో రెండు ఆప్షన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వెటరన్లు అజింక్య రహానే, మొయిన్ అలీల్లో ఎవరో ఒకరికి ఓపెనర్‌గా ప్రమోషన్ ఇవ్వాలని ధోని యోచిస్తున్నట్లు సమాచారం. రహానేకు గతంలో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా ఆడిన అనుభవం ఉండటం అతనికి యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రహానేకు గత సీజన్లో పేసర్లపై విరుచుకుపడిన ట్రాక్ రికార్డు కూడా ఉండటం సెకెండ్ అప్షన్ ఓపెనర్‌గా అతని పేరునే పరిశీలించే అవకాశం ఉంది. రచిన్, రహానేలతో పాటు మొయిన్ అలీ పేరును సైతం సీఎస్కే మేనేజ్మెంట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే బ్యాటర్‌గా మొయిన్ అలీకి పెద్ద సక్సెస్ రేట్ లేకపోవడం, వయసు పైబడటం వంటి కారణాలు అతన్ని ఓపెనర్ రేసులో వెనకపడేలా చేయవచ్చు. సీజన్ ప్రారంభానికి మరి కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో సీఎస్కే యాజమాన్యం అతి త్వరలో ఓపెనింగ్ స్థానాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాగా, ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజ్ బెంగళూరుతో తలపడనుంది. మార్చి 22న చెన్నైలో ఈ మ్యాచ్ జరుగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు.. ఎంఎస్ ధోని వికెట్కీపర్బ్యాటర్ 12 కోట్లు (కెప్టెన్) డెవాన్ కాన్వే బ్యాటర్ కోటి రుతురాజ్ గైక్వాడ్ బ్యాటర్ 6 కోట్లు అజింక్య రహానే బ్యాటర్ 50 లక్షలు అజయ్ మండల్ ఆల్ రౌండర్ 20 లక్షలు నిశాంత్ సింధు ఆల్ రౌండర్ 60 లక్షలు మొయిన్ అలీ ఆల్ రౌండర్ 8 కోట్లు శివమ్ దూబే ఆల్ రౌండర్ 4 కోట్లు రాజవర్ధన్ హంగర్గేకర్ బౌలర్ 1.5 కోట్లు షేక్ రషీద్ బ్యాటర్ 20 లక్షలు మిచెల్ సాంట్నర్ ఆల్ రౌండర్ 1.9 కోట్లు రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ 16 కోట్లు తుషార్ దేశ్‌పాండే బౌలర్ 20 లక్షలు ముఖేష్ చౌదరి బౌలర్ 20 లక్షలు మతీషా పతిరణ బౌలర్ 20 లక్షలు సిమ్రన్‌జీత్ సింగ్ బౌలర్ 20 లక్షలు దీపక్ చాహర్ బౌలర్ 14 కోట్లు ప్రశాంత్ సోలంకి బౌలర్ 1.2 కోట్లు మహేశ్ తీక్షణ బౌలర్ 70 లక్షలు రచిన్ రవీంద్ర బ్యాటర్ 1.8 కోట్లు శార్దూల్ ఠాకూర్ ఆల్ రౌండర్ 4 కోట్లు డారిల్ మిచెల్ ఆల్ రౌండర్ 14 కోట్లు సమీర్ రిజ్వీ బ్యాటర్ 8.4 కోట్లు ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలర్ 2 కోట్లు అవినాష్ రావు ఆరవెల్లి కొట్టు 20 లక్షలు -
టీమిండియా స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు గుడ్‌బై!?
టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్యా రహానే జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని దారులు మూసుకుపోయాయి. రంజీ ట్రోఫీ సీజన్ 2023-24 సీజన్లో రాణించి భారత జట్టులో మళ్లీ చోటు సంపాదించుకోవాలని భావించిన రహానే.. అందుకు తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. సీజన్ ఆసాంతం కెప్టెన్‌గా పర్వాలేదన్పించిన రహానే.. బ్యాటర్‌గా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ప్రస్తుతం తమిళనాడుతో జరుగుతున్న సెమీఫైనల్స్‌లో సైతం అదే తీరును ఈ వెటరన్ కనబరిచాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన రహానే కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్‌గా ఈ సీజన్లో 11 ఇన్నింగ్స్‌లలో కేవలం 134 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. ఈ క్రమంలో అతడి కెరీర్ ముగిసిపోయిందని, భారత జట్టులోకి రీ ఎంట్రీ కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే 35 ఏళ్ల రహానే సైతం అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించే ఛాన్స్ ఉందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక 2013 టీమిండియా తరపున టెస్టులో అరంగేట్రం చేసిన అజింక్య రహానే ఇప్పటివరకు 85 టెస్టు మ్యాచులు ఆడాడు. 85 టెస్టుల్లో 12 సెంచరీల సాయంతో 5077 పరుగుల చేశాడు. అదేవిధంగా వన్డేల్లో 90 మ్యాచ్‌ల్లో 2962 పరుగులు చేశాడు. చివరగా ఈ ఏడాది జులై 20న వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత తరపున రహానే ఆడాడు. -
తుదిజట్టులో శ్రేయస్ అయ్యర్.. రహానే కీలక వ్యాఖ్యలు
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్లో తిరిగి అడుగుపెట్టాడు. రంజీ ట్రోఫీ 2023-24 సెమీ ఫైనల్(2) సందర్భంగా ముంబై తరఫున పునరాగమనం చేశాడు. ఈ మేరకు తమిళనాడుతో శనివారం మొదలైన మ్యాచ్‌లో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై కెప్టెన్ అజింక్య రహానే వెల్లడించాడు. కాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు శ్రేయస్ అయ్యర్ రంజీ బరిలో దిగాడు. ఆంధ్రతో మ్యాచ్ సందర్భంగా మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు నేపథ్యంలో భారత జట్టుతో చేరాడు. మొదటి రెండు మ్యాచ్‌లలో విఫలమైన అయ్యర్‌ను మూడో టెస్టు నుంచి పక్కనపెట్టారు సెలక్టర్లు. ఈ క్రమంలో తనకు వెన్నునొప్పి తిరగబెట్టిందని శ్రేయస్ అయ్యర్ జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లినట్లు వార్తలు వినిపించాయి. అదే సమయంలో టీమిండియాలో తిరిగి అడుగుపెట్టాలంటే తప్పక రంజీ బరిలో దిగాలని బీసీసీఐ ఆదేశించింది. అయితే, అయ్యర్ ఫిట్నెస్ కారణాలు చూపి మినహాయింపు పొందాలని భావించగా.. ఎన్సీఏ మాత్రం అతడు ఫిట్‌గా ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చిందని జాతీయ మీడియా వెల్లడించింది. ఈ పరిణామాల క్రమంలో 2022-24 ఏడాది గానూ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టులో అయ్యర్ పేరు గల్లంతైంది. దీంతో బీసీసీఐ ఆదేశాలు ధిక్కరించినందు వల్లే అయ్యర్‌పై వేటు పడిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రంజీల్లో రీఎంట్రీ ఇవ్వడం గమనార్హం. ఈ క్రమంలో ముంబై సారథి అజింక్య రహానే మాట్లాడుతూ.. ‘‘తను అనుభవం ఉన్న ఆటగాడు. ముంబై కోసం ఎప్పుడు బరిలోకి దిగినా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటాడు. సెమీ ఫైనల్ సందర్భంగా అతడు జట్టుతో చేరడం థ్రిల్లింగ్‌గా ఉంది’’ పేర్కొన్నాడు. కాగా ముంబై వేదికగా శనివారం మొదలైన సెమీస్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తమిళనాడు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. ముంబైని బౌలింగ్‌కు ఆహ్వానించింది. రంజీ సెమీఫైనల్-2.. ముంబై వర్సెస్ తమిళనాడు తుదిజట్లు ముంబై పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, భూపేన్ లల్వానీ, అజింక్య రహానె (కెప్టెన్), ముషీర్ ఖాన్, షమ్స్ ములానీ, హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తనూష్ కొటియాన్, మోహిత్ అవస్థి, తుషార్ దేశ్ పాండే. తమిళనాడు ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, బాబా ఇంద్రజిత్, ప్రదోష్ పాల్, రవిశ్రీనివాసన్ సాయి కిశోర్ (కెప్టెన్), విజయ్ శంకర్, వాషింగ్టన్ సుందర్, ఎం.మహ్మద్, ఎస్ అజిత్ రామ్, సందీప్ వారియర్, కుల్దీప్ సేన్. -
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ..
Shreyas Iyer named in Mumbai squad: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో తిరిగి అడుగుపెట్టనున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఆంధ్రతో మ్యాచ్‌లో ఆడిన ఈ ముంబై బ్యాటర్.. తాజాగా సెమీ ఫైనల్ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు తప్పక రంజీ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో తమిళనాడుతో సెమీస్ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు చోటు ఇచ్చినట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు అజింక్య రహానే సారథ్యంలోని 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. కాగా ముంబై- తమిళనాడు మధ్య మార్చి 2 నుంచి రంజీ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. వెన్ను నొప్పి అని చెబితే ఎన్సీఏ మాత్రం అలా ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అయ్యర్ పూర్తిగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్టుల్లో ఆడి మొత్తంగా కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో మూడో టెస్టు నుంచి జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రంజీ బరిలో దిగాలన్న బీసీసీఐ నిబంధన నుంచి తప్పించుకునేందుకు వెన్నునొప్పిని కారణంగా చూపాడు. అయితే, జాతీయ క్రికెట్ అకాడమీ మాత్రం అయ్యర్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రంజీ ట్రోఫీలో ఆడకూడదనే శ్రేయస్ అయ్యర్ ఇలా చేసి ఉంటాడని.. ఈ నేపథ్యంలో అతడిపై గుర్రుగా ఉన్న బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించే యోచనలో ఉందని వదంతులు వ్యాపించాయి. అయితే, తాజాగా తాను ఫిట్‌గా ఉన్నానంటూ అయ్యర్ రంజీల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం కావడం గమనార్హం. తమిళనాడుతో సెమీస్‌కు ముంబై జట్టు: అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా, భూపేన్ లాల్వానీ, అమోగ్ భత్కల్, ముషీర్ ఖాన్, ప్రసాద్ పవార్, హార్దిక్ తామోర్, శార్దూల్ ఠాకూర్, షామ్స్ ములానీ, తనూష్ కొటియాన్, ఆదిత్య ధుమాల్, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తి, రాయ్స్టన్ డయాస్, ధావల్ కులకర్ణి. చదవండి: Rohit Sharma: ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎట్లా? రోహిత్ వ్యాఖ్యలపై టీమిండియా దిగ్గజం స్పందన -
కోట్లు పెట్టి కారు కొన్న టీమిండియా క్రికెటర్.. ధర?
టీమిండియా వెటరన్ బ్యాటర్, ముంబై కెప్టెన్ అజింక్య రహానే గ్యారేజీలో కొత్త కారు చేరింది. మెర్సిడెజ్ బెంజ్ మేబాచ్ జీఎల్ఎస్ 600 వేరియంట్‌ను రహానే కొనుగోలు చేశాడు. ఈ కారు ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! టెస్టుల్లో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనత అజింక్య రహానేది. ఆస్ట్రేలియా గడ్డపై అతడి కెప్టెన్సీలోనే టీమిండియా మొట్టమొదటిసారి టెస్టు సిరీస్ ట్రోఫీని ముద్దాడింది. అయితే, ఫామ్‌లేమి కారణంగా తిరిగి జట్టులో చోటు సంపాదించలేకపోయిన రహానే.. ఐపీఎల్ వైపు దృష్టిసారించాడు. ఈ క్రమంలో మెగా వేలం-2023లో రూ. 50 లక్షల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ తప్ప ఇతర జట్లేవీ అతడిపై ఆసక్తి చూపించలేదు. ఈ క్రమంలో సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. రహానేను బేస్ ప్రైస్‌కే కొనుగోలు చేసేలా పావులు కదిపాడు. అంతేకాదు.. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రహానేకు వరుస అవకాశాలు ఇచ్చాడు. ఈ క్రమంలో టెస్టు ఆటగాడిగా ముద్రపడ్డ రహానే.. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకుని టీ20లకూ తాను పనికివస్తానని నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో తిరిగి టీమిండియాలో అడుగుపెట్టినా.. తనకు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే, ఐపీఎల్-2024లో మాత్రం భాగమయ్యే ఛాన్స్ కొట్టేసిన అజింక్య రహానే.. ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. అతడి సారథ్యంలోని ముంబై జట్టు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. రంజీ తాజా ఎడిషన్‌లో కెప్టెన్‌గా పర్వాలేదనిపించినా.. బ్యాటర్‌గా మాత్రం రహానే విఫలమయ్యాడు. ఆడిన 5 మ్యాచ్‌లలో కలిపి కేవలం 112 పరుగులు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే.. ఆట నుంచి కాస్త విరామం దొరకగానే అజింక్య రహానే కుటుంబంతో కలిసి కారు కొనుగోలు చేసేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో ప్రకారం.. భార్య రాధికాతో కలిసి రహానే మెర్సిడెజ్ బెంజ్ మేబాచ్ జీఎల్ఎస్ 600 మోడల్ కారును కొన్నాడు. దీని ధర సుమారు రూ. 3.25 కోట్లు అని అంచనా. కాగా 2022లో రహానే బీఎండబ్ల్యూ 6 సిరీస్ స్పోర్ట్ వేరియంట్‌ను కొనుగోలు చేశాడు. దీని కోసం అతడు రూ. 69 లక్షల మేర ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక రహానే గ్యారేజీలో వీటితో పాటు ఆడి క్యూ5, మారుతి వాగ్నర్ కూడా ఉన్నాయి. ఇక ఫిబ్రవరి 23 నుంచి బరోడాతో జరిగే క్వార్టర్ ఫైనల్ సందర్భంగా రహానే మళ్లీ ముంబై సారథిగా మైదానంలో అడుగుపెట్టనున్నాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్.. ముషీర్ ఖాన్ ఎంట్రీ
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ నాకౌట్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ ధ్రువీకరించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో అయ్యర్ ఆడటం లేదని అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను రంజీల్లో ఆడమని బీసీసీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబై తరఫున బరిలోకి దిగిన అయ్యర్ ఆంధ్రతో మ్యాచ్ ఆడి.. 48 పరుగులు చేశాడు. అనంతరం భారత జట్టుతో చేరి తొలి రెండు టెస్టుల్లో భాగమయ్యాడు. అయితే, రెండు సందర్భాల్లోనూ ఆశించిన మేర రాణించలేకపోయాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి 104 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు ప్రకటించిన జట్టులో బీసీసీఐ ఈ ముంబై బ్యాటర్‌కు స్థానం కల్పించలేదు. ఈ క్రమంలో వెన్నునొప్పి కారణంగా అయ్యర్ జట్టుకు దూరమయ్యాడనే వార్తలు వినిపించాయి. అయితే, బీసీసీఐ మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే.. జాతీయ జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి టీమిండియాకు ఆడాలనుకుంటే కచ్చితంగా రంజీల్లో ఆడాల్సిందేనని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీ టోర్నీలో తిరిగి అడుగుపెడతాడని భావించగా.. గాయం కారణంగా తాను అందుబాటులో ఉండటం లేదని ముంబై మేనేజ్మెంట్కు చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. టీమిండియా ఆల్‌రౌండర్, ముంబైని క్వార్టర్ ఫైనల్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన శివం దూబే కూడా జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు, భారత యువ సంచలనం ముషీర్ ఖాన్ ముంబై జట్టులోకి వచ్చాడు. కాగా ఫిబ్రవరి 23 నుంచి బరోడాతో క్వార్టర్ ఫైనల్లో ముంబై తలపడనుంది. రంజీ క్వార్టర్ ఫైనల్స్-2024కు ముంబై జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), పృథ్వీ షా, అమోగ్ భత్కల్, భూపేన్ లల్వానీ, ముషీర్ ఖాన్, సూర్యాన్ష్ షెడ్గే, ప్రసాద్ పవార్ (వికెట్ కీపర్), హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తనూష్ కొటియాన్, షామ్స్ ములానీ, ఆదిత్య ధుమాల్, మోహిత్ అవస్థి, తుషార్ దేశ్‌పాండే, ధవళ్ కులకర్ణి, రాయ్స్టాన్ డయాస్. Mumbai squad for Ranji Trophy 2023-2024 Quarter Final match against Baroda to be played from 23rd to 26th February 2024 at MCA Sharad Pawar Cricket Academy, Bandra Kurla Complex, Mumbai. No Shivam Dube & Shreyas Iyer For Mumbai Musheer Khan returns to Mumbai squad… pic.twitter.com/YERqPzA248 — Rajesh Khilare (@Cricrajeshpk) February 20, 2024 -
శివం దూబే దూరం.. శార్దూల్ ఠాకూర్ ఎంట్రీ!
Ranji Trophy 2023-24: ముంబై తాత్కాలిక కెప్టెన్ శివం దూబే జట్టుకు దూరమయ్యాడు. కండరాల నొప్పితో బాధపడుతున్న అతడికి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. కాగా అఫ్గనిస్తాన్‌తో టీమిండియా టీ20 సిరీస్ ముగించుకున్న తర్వాత ఆల్‌రౌండర్ శివం దూబే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు టీమిండియా టెస్టు రేసులోనూ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా ముంబై తరఫున రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ బరిలో దిగాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో రెండు హాఫ్ సెంచరీలతో పాటు ఓ శతకం(117) బాదాడు. బౌలింగ్‌లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. బెంగాల్‌తో మ్యాచ్‌లో కెప్టెన్‌గా హిట్ ఈ క్రమంలో అజింక్య రహానే గైర్హాజరీలో ఆఖరిగా ముంబై ఆడిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కించుకున్నాడు. బెంగాల్‌తో ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో దూబే 72 పరుగులు సాధించాడు. అదే విధంగా రెండు వికెట్లు కూడా తీసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, బెంగాల్‌తో మ్యాచ్ సందర్భంగా శివం దూబే కండరాలు పట్టేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై చీఫ్ సెలక్టర్ రాజు కులకర్ణి మాట్లాడుతూ.. ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే దూబేకు రెస్ట్ ఇచ్చినట్లు తెలిపాడు. శార్దూల్ ఠాకూర్ ఎంట్రీ నాకౌట్ మ్యాచ్‌ల సమయానికి అతడు అందుబాటులోకి వస్తాడని తెలిపాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ముంబై తరఫున రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. సౌతాఫ్రికా టూర్లో గాయపడిన అతడు రంజీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఫిబ్రవరి 9 నుంచి ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌కు కెప్టెన్ అజింక్య రహానే తిరిగి జట్టుతో చేరనున్నాడు. చదవండి: అరిచీ.. అరిచీ.. నా గొంతు పోయింది: రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్ -
శతక్కొట్టిన రాణా.. 5 వికెట్లతో చెలరేగిన భువీ! రహానే మళ్లీ..
Ranji Trophy 2023-24- Mumbai vs Uttar Pradesh: రంజీ ట్రోఫీ 2023-24లో ఉత్తరప్రదేశ్ ముంబై జట్టుపై గెలుపొందింది. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో ఆఖరికి 2 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ముంబైతో మ్యాచ్‌లో యూపీ కెప్టెన్ నితీశ్ రాణా శతక్కొట్టగా.. పేసర్ భువనేశ్వర్ కుమార్ మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. మరో యువ పేసర్ ఆకిబ్ ఖాన్ సైతం అద్భుతంగా రాణించి జట్టు విజయానికి తానూ కారణమయ్యాడు. కాగా ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ తొలుత బౌలింగ్ చేసింది. కొనసాగుతున్న రహానే వైఫల్యం ముంబై కెప్టెన్ అజింక్య రహానే వైఫల్యం కొనసాగగా.. వికెట్ కీపర్ ప్రసాద్ పవార్(36), షమ్స్ ములానీ చెప్పుకోదగ్గ(57)ప్రదర్శన చేశారు. మిగతా వాళ్లు నామమాత్రపు స్కోరుకే పరిమితం కావడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే ఆలౌట్ అయింది. రాణా శతకం యూపీ బౌలర్లలో భువీ రెండు, అంకిత్ రాజ్‌పుత్ మూడు, ఆకిబ్ ఖాన్ మూడు, శివం శర్మ రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఉత్తరప్రదేశ్‌కు ఓపెనర్ సమర్థ్ సింగ్(63) శుభారంభం అందించగా.. కెప్టెన్ నితీశ్ రాణా(106) శతక్కొట్టాడు. దూబే సెంచరీ కొట్టినా దీంతో 324 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించిన యూపీ 126 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ముంబై శివం దూబే(117) మెరుపు శతకం కారణంగా.. 320 పరుగులు చేయగలిగింది. కాగా ముంబై రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్, మిడిలార్డర్‌ను ఆకిబ్ ఖాన్, భువీ కుప్పకూల్చారు. ఆకిబ్ టాప్-3 వికెట్లు పడగొట్టగా.. భువీ మొత్తం మూడు వికెట్లు తీశాడు. దూబే రూపంలో కరణ్ శర్మ కీలక వికెట్ దక్కించుకున్నాడు. రెండు వికెట్ల తేడాతో విజయం ఈ క్రమంలో ముంబై విధించిన 195 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ 8 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. యూపీ కెప్టెన్ నితీశ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్‌లోనూ ముంబై సారథి అజింక్య రహానే బ్యాటింగ్ వైఫల్యం కొనసాగింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 17 (8, 9) పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న అతడు ఇప్పటి వరకు రంజీ-2024లో ఒక్కటైనా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. మరోవైపు టీమిండియా తరఫున రీ ఎంట్రీలో టీ20లలో సత్తా చాటిన శివం దూబే అద్భుత బ్యాటింగ్ తీరుతో టెస్టు రేసులోకి దూసుకురావడం విశేషం. చదవండి: Ind Vs Eng 2nd Test: విశాఖ టెస్టు.. విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ -
రంజీలోనూ బ్యాట్‌తో చెలరేగిన దూబే.. టెస్టుల్లోనూ ఎంట్రీకి సై!
Ranji Trophy 2024 Kerala Vs Mumbai -Shivam Dube: టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శివం దూబే ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల అఫ్గనిస్తాన్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో ఈ ముంబై బ్యాటర్ వరుస అర్ధ శతకాలతో అలరించిన విషయం తెలిసిందే. అదే విధంగా.. కీలక సమయాల్లో రెండు వికెట్లు కూడా తీసి జట్టు విజయాల్లో భాగమయ్యాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ మొత్తంగా మూడు మ్యాచ్‌లలో కలిపి 124 పరుగులు సాధించిన దూబే.. టీమిండియా సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పటికీ.. తాజా ప్రదర్శనతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడీ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఇక ఇప్పటికే టీమిండియా తరఫున టీ20, వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన శివం దూబే.. టెస్టు జట్టులోనూ చోటు దక్కించుకోవడంపై దృష్టి సారించాడు. ఇందులో భాగంగా రంజీ ట్రోఫీ-2024లో ముంబై తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో చెలరేగి సత్తా చాటాడు. రహానే గోల్డెన్ డక్ ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా కేరళ- ముంబై మధ్య శుక్రవారం మ్యాచ్ మొదలైంది. తిరువనంతపురం వేదికగా టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ అజింక్య రహానే తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బౌలింగ్ అటాక్ మొదలుపెట్టిన కేరళ పేసర్ బాసిల్ థంపి.. తొలి బంతికే ఓపెనర్ జై గోకుల్ బిస్తాను అవుట్ చేశాడు. అతడి స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ రహానేను కూడా గోల్డెన్ డక్ చేశాడు. ఇలా ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన వేళ మరో ఓపెనర్ భూపేన్ లల్వానీ ఆచితూచి ఆడాడు. దూబే హాఫ్ సెంచరీ మిగతా వాళ్లలో సువేద్ పార్కర్(18), ప్రసాద్ పవార్(28) ఓ మోస్తరుగా రాణించగా.. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన శివం దూబే.. లల్వానీతో కలిసి భాగస్వామ్యం నెలకొల్పాడు. లల్వానీ(50), దూబే(72 బంతుల్లో 51 రన్స్)లతో పాటు.. తనూష్ కొటైన్(56) కూడా అర్ధ శతకంతో జట్టును ఆదుకున్నాడు. ఈ ముగ్గురి ప్రదర్శన కారణంగా తొలి రోజు ఆట ముగిసే సరికి ముంబై 78.4 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక.. టీమిండియాలో రీఎంట్రీ ఇస్తానని ధీమాగా ఉన్న ముంబై కెప్టెన్ అజింక్య రహానే విఫలం కావడం.. అదే సమయంలో శివం దూబే హాఫ్ సెంచరీతో సత్తా చాటడం శుక్రవారం నాటి ఆటలో హైలెట్‌గా నిలిచాయి. చదవండి: #Viratkohli: కోహ్లి ఆ రన్స్ సేవ్ చేయడం వల్లే ఇదంతా.. రోహిత్ రియాక్షన్ చూశారా? -
మళ్లీ గోల్డెన్ డక్.. రీఎంట్రీ మర్చిపోవ్సాలిందే?
Ranji Trophy 2024- Ajinkya Rahane Golden Ducks: రంజీ ట్రోఫీ-2024లో టీమిండియా వెటరన్ బ్యాటర్, ముంబై కెప్టెన్ అజింక్య రహానే మరోసారి విఫలమయ్యాడు. గ్రూప్-బిలో భాగంగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ సీజన్లో వరుసగా రెండోసారి ఇలా అవుటై విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. గతేడాది రంజీల్లో ముంబై సారథిగా అద్భుతంగా రాణించి రహానే.. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కూడా సత్తా చాటాడు. సంప్రదాయ క్రికెట్లోనే కాదు.. పొట్టి ఫార్మాట్లోనూ తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో సత్తా చాటి ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా.. అతడి స్థానంలో అనూహ్యంగా టీమిండియాలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఏకంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సీజన్ ఫైనల్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు రహానే. అంతేకాదు.. ఆ మ్యాచ్‌లో టీమిండియా తరఫున టాప్ స్కోరర్‌గానూ సత్తా చాటాడు. వైస్ కెప్టెన్‌గా ఈ నేపథ్యంలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దీంతో రహానే మళ్లీ పూర్వ వైభవం పొందుతాడని అభిమానులు ఆనందించగా.. తన వైఫల్యాలతో వారి సంతోషాన్ని ఆవిరి చేయడమే కాకుండా.. తన భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకున్నాడు. గతేడాది ముగిసిన ఈ పర్యటన తర్వాత రహానే మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కరేబియన్ గడ్డపై 2023, జూలైలో టీమిండియాకు ఆఖరిసారిగా ఆడిన రహానే మళ్లీ దేశవాళీ క్రికెట్‌పై దృష్టిపెట్టాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో టీమిండియా ఆడనున్న టెస్టు సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వాలని భావించాడు ఈ ముంబై కెప్టెన్. వరుసగా రెండు గోల్డెన్ డక్‌లు కానీ.. ఫిట్‌నెస్‌లేని కారణంగా తొలి రంజీ మ్యాచ్‌కు దూరమైన అజింక్య రహానే.. రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయ్యాడు. పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఇక తాజాగా శుక్రవారం కేరళతో మొదలైన మ్యాచ్‌లో.. బాసిల్ థంపీ బౌలింగ్‌లో.. ఎదుర్కొన్న తొలి బంతికే అవుటై పెవిలియన్ చేరాడు. దీంతో.. ఇక రహానే టీమిండియా రీఎంట్రీ కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాడు చారిత్రాత్మక ట్రోఫీ ఎత్తి.. ఇప్పుడిలా ఇదిలా ఉంటే.. 2021లో ఇదే రోజున రహానే సారథ్యంలోని భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ ట్రోఫీని ముద్దాడటం విశేషం. బ్రిస్బేన్‌లోని గాబా వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌కు రహానే కెప్టెన్ కాగా.. శుబ్‌మన్ గిల్(91) , రిషభ్ పంత్(89- నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించారు. ఈ నేపథ్యంలో గాబా మ్యాచ్ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్న టీమిండియా ఫ్యాన్స్.. ‘‘రహానే.. ఇదే రోజు ఆసీస్ గడ్డపై అలా.. ఇప్పుడు జట్టులో చోటు కోసం ఇలా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: #RoKo: కోహ్లి అలా చేయడు.. కానీ ఈసారి!.. సంజూ కూడా అంతే: రోహిత్ శర్మ Captain Ajinkya Rahane lifting the trophy #AUSvIND pic.twitter.com/MMYJCT6xLo — CricExpert (@_cricexpert) January 19, 2024 January 19, 2021- Ajinkya Rahane leads India to arguably their greatest Test series win. January 19, 2024-Ajinkya Rahane is out of the Indian side, falls for a golden duck. This thing called life comes at you fast, eh? #RanjiTrophy — Shankar (@Uniteddevil8) January 19, 2024 -
టీమిండియాలో రీఎంట్రీ ఇస్తా.. 100 టెస్టులు ఆడటమే లక్ష్యం
Aim is to play 100 Test matches: టీమిండియా తరఫున 85 అంతర్జాతీయ టెస్టులు.. 12 సెంచరీలు.. ఇందులో ఒకటి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో.. మరొకటి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో సాధించినది.. ఇక అర్ధ శతకాలు 26.. మొత్తంగా 5077 పరుగులు.. ఆస్ట్రేలియా గడ్డపై చరిత్రాత్మక టెస్టు సిరీస్ గెలిచిన భారత జట్టుకు సారథి.. 13 ఏళ్ల కెరీర్లో ముంబై బ్యాటర్ అజింక్య రహానే సాధించిన ఘనతలు. అయితే, ప్రస్తుతం జాతీయ జట్టులో 35 ఏళ్ల వెటరన్ బ్యాటర్‌కు అవకాశాలు కరువయ్యాయి. విఫలమై.. జట్టుకు దూరమై యువ ఆటగాళ్ల నుంచి ఎదురవుతున్న పోటీలో ఈ టెస్టు స్పెషలిస్టు వెనుబడిపోయాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్- 2021-23 తర్వాత వెస్టిండీస్ పర్యటనలో టీమిండియాకు ఆఖరిసారిగా ఆడిన రహానే.. వైస్ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. కానీ ఆ టూర్లో వైఫల్యం కారణంగా మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడనున్న జట్టు ఎంపిక సందర్భంగానూ సెలక్టర్లు అతడికి మొండిచేయే చూపారు. ఈ నేపథ్యంలో అజింక్య రహానే అంతర్జాతీయ కెరీర్ ఇక ముగిసిపోయినట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆకాశ్ చోప్రా వంటి భారత మాజీ క్రికెటర్లు సైతం ఇదే మాట అంటున్నారు. రీఎంట్రీ ఇస్తా.. అయితే, రహానే మాత్రం తాను కచ్చితంగా టీమిండియా తరఫున పునరాగమనం చేస్తానని నమ్మకంగా చెబుతున్నాడు. 100 టెస్టులు ఆడటమే తన ఆశయం అంటున్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ-2024లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైనప్పటికీ.. ఆంధ్రతో జరిగిన రెండో మ్యాచ్ సందర్భంగా జట్టుతో చేరాడు. 100 టెస్టులు ఆడటమే లక్ష్యం డకౌట్‌గా వెనుదిరిగి విమర్శల పాలయ్యాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ముంబై ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందడంతో సారథిగా రహానేకు మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర జట్టుపై విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘ముంబై తరఫున మెరుగైన స్కోర్లు నమోదు చేయాలని పట్టుదలగా ఉన్నాను. ఈసారి ఎలాగైనా రంజీ ట్రోఫీ గెలవాలనే సంకల్పంతో ఉన్నాం. అలాగే నా ముందున్న మరో అతిపెద్ద లక్ష్యం.. టీమిండియా తరఫున 100 టెస్టులు పూర్తిచేసుకోవడమే’’ అని అజింక్య రహానే చెప్పుకొచ్చాడు. చదవండి: Shreyas Iyer: బాధ లేదు.. నాకు అప్పగించిన పని పూర్తి చేశా.. ఇక -
Ind Vs Eng: వాళ్లిద్దరి అధ్యాయం ఇక ముగిసినట్లే!
అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారా టెస్టు కెరీర్ అధ్యాయం ముగిసిపోయినట్లేనని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టుతో ఈ విషయం నిరూపితమైందని పేర్కొన్నాడు. ఇక ముందు ఈ వెటరన్ బ్యాటర్లు టీమిండియా తరఫున ఆడే అవకాశం లేదన్నాడు. కాగా ఒకప్పుడు టెస్టు స్పెషలిస్టులుగా టీమిండియాకు పలు చిరస్మరణీయ విజయాలు అందించారు రహానే, పుజారా. వైస్ కెప్టెన్‌గా రహానే.. నయావాల్‌గా పుజారా తమ వంతు పాత్రలను చక్కగా పోషించారు. కానీ గత కొన్ని రోజులుగా వీరిద్దరిని పక్కన పెట్టేశారు సెలక్టర్లు. అడపాదడపా వచ్చిన అవకాశాలను రహానే, పుజారా సద్వినియోగం చేసుకోకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు.. యంగ్ క్రికెటర్ల నుంచి ఎదురవుతున్న పోటీలోనూ వీరు వెనుకబడిపోయారు. దీంతో ఇటీవల సౌతాఫ్రికా పర్యటన రూపంలో బిగ్ సిరీస్ నేపథ్యంలో రహానే, పుజారాలను సెలక్టర్లు పట్టించుకోలేదు. తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ప్రకటించిన రెండు మ్యాచ్‌ల జట్టులోనూ చోటివ్వలేదు. వాళ్లిద్దరిది ముగిసిన అధ్యాయం ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. "ఊహించిన విధంగానే జట్టు ప్రకటన ఉంది. అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాలను ఎంపిక చేయలేదు. ఇక వాళ్లిద్దరిది ముగిసిన అధ్యాయం. ఎప్పుడైతే సౌతాఫ్రికాతో ఆడే జట్టులో వారికి స్థానం ఇవ్వలేదో అప్పుడే ఇక ముందు కూడా వాళ్లకు ఆడే అవకాశం రాదని ఊహించాను. అక్కడ ధోని కెప్టెన్ కాబట్టి టీమిండియా దారులు మూసుకుపోయినా రహానేకు మాత్రం ఐపీఎల్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కు అతడు గత సీజన్లో ఆడాడు. ఈసారి కూడా బాగా ఆడితే మరికొన్నాళ్లపాటు కొనసాగగలడు. నిజానికి చెన్నైకి ఆడటం ముఖ్యం కాదు.. అక్కడ ధోని కెప్టెన్ కాబట్టి ఆ జట్టుకు ఆడి నిరూపించుకుంటే మళ్లీ టీమిండియా తలుపు తట్టవచ్చు" అని అభిప్రాయపడ్డాడు. కాగా ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక విజయం తర్వాత రహానే వరుసగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2023లో చెన్నైకి ఆడిన అతడు ఫుల్‌ఫామ్‌లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో చాలాకాలం తర్వాత ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ సందర్భంగా టీమిండియాకు ఆడే చాన్స్ వచ్చింది. మిగతా వాళ్లంతా విఫలమైనా ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో మిగతా వాళ్లంతా విఫలమైనా రహానే మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే, పుజారా మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఈక్రమంలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే జట్టులో రహానేకు చోటు దక్కినా.. పుజారాకు మొండిచేయి ఎదురైంది. పుజారా డబుల్ సెంచరీ అయితే, కరేబియన్ గడ్డపై పాత కథను రిపీట్ చేసిన రహానే మళ్లీ టీమిండియాలో స్థానం సంపాదించలేకపోయాడు. ఇక పుజారా సంగతి సరేసరి. ఇంగ్లండ్ కౌంటీల్లో రాణిస్తున్నా సెలక్టర్లు కరుణించడం లేదు. తాజాగా రంజీ ట్రోఫీ-2024లో ఆరంభ మ్యాచ్‌లో పుజారా డబుల్ సెంచరీతో సౌరాష్ట్ర తరఫున సత్తా చాటగా.. ముంబై కెప్టెన్ రహానే మాత్రం డకౌట్ అయ్యాడు. -
ముంబైతో రంజీ మ్యాచ్.. షమ్స్ ములానీ మాయాజాలం.. ఓటమి దిశగా ఆంధ్ర
ముంబై: బ్యాటర్ల వైఫల్యంతో ఆంధ్ర జట్టు రంజీ ట్రోఫీ తాజా సీజన్లో తొలి ఓటమి దిశగా సాగుతోంది. ముంబైతో జరుగుతున్న గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు ఫాలోఆన్ రెండో ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులు సాధించింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే ఆంధ్ర జట్టు మరో 45 పరుగులు సాధించాలి. షేక్ రషీద్ (52 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (22 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. ఓవర్‌నైట్ స్కోరు 98/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 72 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. ప్రశాంత్ కుమార్ (73; 10 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై స్పిన్నర్ షమ్స్ ములానీ (6/65) ఆంధ్రను దెబ్బకొట్టాడు. 211 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన ముంబై జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించకుండా ఆంధ్ర జట్టుకు ఫాలోఆన్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో ములానీ మరోసారి రెచ్చిపోయాడు. ఈసారి అతను 3 వికెట్లు తీశాడు. మొత్తంగా ఇప్పటికే ములానీ తన ఖాతాలో 9 వికెట్లు వేసుకున్నాడు. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 395 పరుగులకు ఆలౌటైంది. భుపేన్ లాల్వాని (61), తనుశ్ కోటియన్ (54), మోహిత్ అవస్థి (53) అర్ధసెంచరీలతో రాణించారు. ఆంధ్ర పేసర్ నితీశ్ కుమార్ రెడ్డి ఐదు వికెట్లు తీశాడు. -
Ind vs Eng: గోల్డెన్ డక్.. ఇక రీఎంట్రీ కష్టమే!
Ranji Trophy 2023-24-Mumbai vs Andhra- ముంబై: రంజీ ట్రోఫీ-2024లో తన ఆరంభ మ్యాచ్‌లో అజింక్య రహానే పూర్తిగా విఫలమయ్యాడు. డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. కాగా ‘ఎలైట్’ గ్రూప్‌లో భాగంగా ముంబై- ఆంధ్ర జట్ల మధ్య శుక్రవారం మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆంధ్ర తొలుత బౌలింగ్ చేస్తోంది. ఈ క్రమంలో ముంబై ఓపెనర్ భూపేన్ లాల్వాని (61) అర్ధ సెంచరీ చేయగా... శ్రేయస్ అయ్యర్ (48), సువేద్ పార్కర్ (41) ఫర్వాలేదనిపించారు. ఇక గత మ్యాచ్‌కు దూరమై ఈసారి కెప్టెన్‌గా బరిలోకి దిగిన సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే (0) తొలి బంతికే నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం విశేషం. ఎన్నో అంచనాల నడుమ బరిలోకి దిగిన ఈ టీమిండియా వెటరన్ బ్యాటర్ గోల్డెన్ డక్ కావడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు. రీఎంట్రీ ఇక కష్టమే ఇంగ్లండ్‌తో టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వడం ఇక కష్టమే అని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే తొలి రెండు జట్టులకు ప్రకటించిన జట్టులో స్థానం సంపాదించాడు. ఇదిలా ఉంటే.. శుక్రవారం ఆట ముగిసేసరికి ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 281 పరుగులు సాధించింది. ఆంధ్ర బౌలర్ నితీశ్‌కు 3, షోయబ్ మొహమ్మద్ ఖాన్‌కు 2 వికెట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో 281/6 ఓవర్‌నైట్ స్కోరుతో ముంబై శనివారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టింది. కెప్టెన్సీకి విహారి రాజీనామా... మరోవైపు.. ఆంధ్ర రంజీ జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి సీనియర్ బ్యాటర్ హనుమ విహారి తప్పుకున్నాడు. బ్యాటింగ్‌పై పూర్తిగా దృష్టి పెట్టేందుకే కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు సమాచారం. బెంగాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విహారి కెప్టెన్‌గా వ్యవహరించగా... అతని స్థానంలో ఈ మ్యాచ్ నుంచి రికీ భుయ్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. -
టీమిండియాలో రీఎంట్రీకి కసరత్తు: కెప్టెన్‌గా అజింక్య రహానే
Ranji Trophy 2023-24: రంజీ ట్రోఫీ-2024 సీజన్‌కు ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్‌లకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే ఈ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు.. భారత యువ ఓపెనర్ పృథ్వీ షా గాయం నుంచి కోలుకోని కారణంగా అతడికి ఈ జట్టులో చోటు దక్కలేదు. మోకాలి నొప్పితో బాధపడుతున్న పృథ్వీ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. అదే విధంగా.. గత ఎడిషన్‌లో ముంబై తరఫున ఆడిన టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్, టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఈసారి జట్టుతో లేరు. యశస్వి టీమిండియాతో కలిసి సౌతాఫ్రికా పర్యటనలో ఉండగా.. సూర్య చీలమండ గాయంతో ఆటకు విరామం ఇచ్చాడు. ఇక సౌతాఫ్రికా-ఏ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్ ముగించుకుని తిరిగి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండేలతో పాటు గత సీజన్లో ఆడిన శివం దూబే సువేద్ పార్కర్, షామ్స్ ములాని, ధవళ్ కులకర్ణి ఈసారి కూడా ముంబై తరఫున మరోసారి బరిలోకి దిగనున్నారు. బిహార్‌తో తొలి మ్యాచ్ రంజీ ట్రోఫీ-2024లో భాగంగా ముంబై తమ తొలి మ్యాచ్‌లో బిహార్‌తో తలపడనుంది. జనవరి 5న జరుగనున్న ఈ టెస్టు మ్యాచ్‌కు పాట్నాలోని మొయిన్ ఉల్ హక్ స్టేడియం ఇందుకు వేదిక. ఇక జనవరి 12 నాటి రెండో మ్యాచ్‌లో ముంబై ఆంధ్ర జట్టును ఢీకొట్టనుంది. 39 టైటిళ్లు సాధించిన ఘనత దేశవాళీ టెస్టు క్రికెట్లో ఇప్పటి వరకు జరిగిన 88 రంజీ ఎడిషన్లలో 39సార్లు విజేతగా నిలిచిన జట్టుగా ముంబైకి గొప్ప రికార్డు ఉంది. అయితే, 2014 నుంచి ఇప్పటి దాకా ఒక్కసారి కూడా చాంపియన్‌గా నిలవలేదన్న వెలితి అలాగే ఉండిపోయింది. గత సీజన్లో రహానే సారథ్యంలో ఆడిన ముంబై.. ఎలైట్ గ్రూప్ బిలో భాగంగా ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం మూడు మాత్రమే గెలిచింది. నాకౌట్స్‌కు కూడా అర్హత సాధించలేక చతికిలపడింది. అయితే, ఈసారి ఎలాగైనా ఆ అడ్డంకిని అధిగమించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. రంజీల్లో సత్తా చాటి అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయాలని రహానే భావిస్తున్నాడు. రంజీ ట్రోఫీ-2024 తొలి రెండు మ్యాచ్‌లకు ముంబై జట్టు: అజింక్య రహానె (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, సువేద్ పార్కర్, షామ్స్ ములాని, హార్దిక్ తామోర్(వికెట్ కీపర్), ప్రసాద్ పవార్(వికెట్ కీపర్), జే బిస్టా, భూపేన్ లల్వానీ, తనూష్ కొటియాన్, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తి, ధవళ్ కులకర్ణి, రాయ్స్టన్ డయాస్, అథర్వ అంకోలేకర్. చదవండి: కోహ్లికి బౌలింగ్ చేయడం చాలా కష్టం.. లిస్టులో సచిన్ కూడా! కానీ.. -
నిన్న రహానే.. ఇప్పుడు పుజారా! కన్ఫ్యూజన్లో అభిమానులు
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడిన తర్వాత ఇద్దరు సీనియర్ క్రికెటర్ల పేర్లు తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. వారెవరో కాదు.. అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారా. టెస్టు స్పెషలిస్టులైన ఈ ఇద్దరు బ్యాటర్లు టీమిండియా సాధించిన పలు చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా విదేశీ గడ్డపై ఉత్తమంగా రాణించిన రికార్డు వీరికి ఉంది. టీమిండియా తరఫున ఇప్పటి వరకు 85 టెస్టులు ఆడిన ముంబై బ్యాటర్ రహానే 5077 పరుగులు సాధించాడు. అతడి సారథ్యంలోనే ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ గెలిచిన మ్యాచ్ జరిగింది. ఇక ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్ సిరీస్ సందర్భంగా రహానే చివరిసారిగా టీమిండియా తరఫున టెస్టు ఆడాడు. మరోవైపు.. తన కెరీర్లో ఇప్పటిదాకా భారత్ తరఫున 103 టెస్టులు ఆడిన పుజారా 7195 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సందర్భంగా జూన్‌లో అతడు ఆఖరిసారి టీమిండియాకు ఆడాడు. అయితే, దేశవాళి క్రికెట్‌తో పాటు ఇంగ్లండ్ కౌంటీల్లోనూ ఆడుతూ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వీరిద్దరిని గనుక సౌతాఫ్రికాతో టెస్టులకు ఎంపిక చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సహా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Ranji Trophy prep mode: 🔛 pic.twitter.com/kFN3PyvTHx — Cheteshwar Pujara (@cheteshwar1) December 30, 2023 ఈ నేపథ్యంలో సౌరాష్ట్ర బ్యాటర్ పుజారా ఓ ఆసక్తికర వీడియోతో ముందుకు వచ్చాడు. రంజీ ట్రోఫీ ఆడేందుకు తాను సన్నద్ధం అవుతున్నట్లు తెలిపాడు. అయితే, ఇందులో అతడు రెడ్ బాల్‌తో కాకుండా వైట్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు.. రహానే సైతం శుక్రవారం ఎక్స్ వేదికగా ఓ వీడియో పంచుకున్నాడు. ‘‘విశ్రాంతి లేని రోజులు’’ అంటూ రంజీలకు సిద్ధం అవుతున్నట్లు చెప్పకనే చెప్పాడు. కాగా టెస్టుల్లో అపార అనుభవం, మెరుగైన రికార్డులు ఉన్నా టీమిండియా సెలక్టర్లు తమను పక్కన పెట్టడాన్ని రహానే- పుజారా చాలెంజింగ్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. No rest days 🏏 pic.twitter.com/EM218MqMhK — Ajinkya Rahane (@ajinkyarahane88) December 29, 2023 ఈ ఏడాది రంజీ ట్రోఫీలో సత్తా చాటి మళ్లీ భారత జట్టులో చోటే లక్ష్యంగా వీరిద్దరు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. జనవరి 5 నుంచి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. చదవండి:Rohit Sharma: ఘనంగా రోహిత్ గారాలపట్టి సమైరా బర్త్‌డే.. వీడియో వైరల్ -
అతడి వల్లే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో టెస్టులు గెలిచాం.. కానీ: భజ్జీ
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయంపై భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. ఈ సిరీస్‌కు జట్టు ఎంపిక చేసిన విధానం అస్సలు బాగోలేదంటూ పెదవి విరిచాడు. విదేశీ గడ్డపై రాణించగల సత్తా ఉన్న ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాలను పక్కన పెట్టి తప్పుచేశారని విమర్శించాడు. కాగా సఫారీ గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయం నమోదు చేయాలన్న రోహిత్ సేనకు ఆదిలోనే చుక్కెదురైన విషయం తెలిసిందే. బాక్సింగ్ డే మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడటంతో పాటు సిరీస్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో.. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఫలితంపై స్పందించిన భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జట్టు కూర్పుపై విమర్శలు గుప్పించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అజింక్య రహానేను సెలక్ట్ చేయలేదు. ఏ కారణం లేకుండానే ఛతేశ్వర్ పుజారాను తప్పించారు. వీరిద్దరు ఎలాంటి పిచ్‌లపైనైనా పరుగులు రాబట్టగల సమర్థులు. పుజారా రికార్డులు గమనిస్తే.. కోహ్లి మాదిరే జట్టు కోసం అతడు ఎంతో కష్టపడ్డాడు. అయినా.. అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో నాకైతే అర్థం కావడం లేదు. నిజానికి టెస్టు క్రికెట్లో పుజారా కంటే అత్యుత్తమమైన బ్యాటర్ మనకూ ఎవరూ లేరు. అతడు నెమ్మదిగా ఆడతాడన్నది వాస్తవం.. అయితే, మ్యాచ్ చేజారిపోకుండా కాపాడగలుగుతాడు. కేవలం అతడి కారణంగానే టీమిండియా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో టెస్టు మ్యాచ్‌లు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక్కసారి కూడా ఆకట్టుకోలేకపోయింది. టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ సెంచరీ వల్లే ఈమాత్రం సాధ్యమైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మరీ 131 పరుగులే చేసింది. ఒకవేళ కోహ్లి కాంట్రిబ్యూషన్ గనుక లేకపోయి ఉంటే పరిస్థితి మరింత దిగజారేది. నిజానికి ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లోనే టీమిండియా ఓటమి దాదాపుగా ఖరారైపోయింది’’ అంటూ భజ్జీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా సౌతాఫ్రికాతో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో రాహుల్ 101 పరుగులు చేయగా.. కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో 76 రన్స్ తీశాడు. ఇక ఇరు జట్ల మధ్య జనవరి 3 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Ind A Vs SA A: ఐదు వికెట్లు తీసిన ఆవేశ్.. తిలక్, అక్షర్ అర్ధ శతకాలు! టాప్ స్కోరర్ అతడే -
'దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. అతడు ఉంటే కథ వేరేలా ఉండేది'
సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు భారత బ్యాటర్లకు దక్షిణాఫ్రికా పేస్ దళం చుక్కలు చూపించారు. సఫారీ పేస్ దళం దెబ్బకు భారత టాపర్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం బౌలర్లు నిప్పులు చేరుగుతున్న చోట.. తన బ్యాటింగ్ సత్తాతో ఎదురు నిలిచాడు. కేఎల్ రాహుల్(70) క్రీజులో ఉన్నాడు. అతడి అద్భుత పోరాటం ఫలితంగా టీమిండియా తొలి రోజు ఆటముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్ 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ ఐదు వికెట్లతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ(5), యశస్వీ జైశ్వాల్(17), శుబ్‌మన్ గిల్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటువంటి కష్టతరమైన పరిస్థితులలో వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే జట్టులో ఉంటే బాగుండేది అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. "ఈ జట్టులో అజింక్యా రహానే ఉండాల్సింది. విదేశీ పరిస్థితుల్లో రహానేకు చాలా అనుభవం ఉంది. అతడు ఈ టెస్టులో కూడా ఉండి కథ పూర్తి భిన్నంగా ఉండేది. ఎందుకంటే ఐదేళ్ల క్రితం(2018-19) జోహన్నెస్‌బర్గ్ టెస్టులో పిచ్ గురించి పెద్దు ఎత్తున చర్చనడిచింది. అప్పుడు నేను కూడా అక్కడ ఉన్నాను. దక్షిణాఫ్రికా బౌలర్లు నిప్పులు చేరిగారు. అటువంటి బౌన్సీ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ రహానే మాత్రం అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన రహానే.. మూడో టెస్టుకు జట్టులోకి వచ్చి కీలకమైన 48 పరుగులతో టీమిండియాను గెలిపించాడని" స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నాడు. కాగా రహానే చివరగా భారత తరుపున ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఆడాడు. ఈ సిరీస్‌లో రహానే తీవ్ర నిరాశపరిచాడు. రెండు టెస్టులు కలిపి కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సౌతాఫ్రికా సిరీస్‌కు రహానేను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. -
IND VS SA 2nd T20: టీ20ల్లో రెండోసారి ఇలా..!
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో ఇద్దరు టీమిండియా ఓపెనర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. యశస్వి జైస్వాల్ మూడు బంతుల్లో.. శుభ్‌మన్ గిల్ రెండు బంతులు ఎదుర్కొని సున్నా పరుగులకే ఔటయ్యారు. టీ20ల్లో భారత్ తరఫున ఓపెనర్లు ఇలా డకౌట్ కావడం ఇది రెండోసారి మాత్రమే. 2016 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో (మీర్పుర్) నాటి ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్య రహానేలు ఇలానే డకౌట్లు అయ్యారు. టీ20ల్లో భారత ఓపెనర్లు ఇద్దరూ డకౌట్లు కావడం అదే తొలిసారి. తాజాగా గిల్, యశస్వి ఇద్దరూ డకౌట్లై అనవసరపు అప్రతిష్టను మూటగట్టుకున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు ఇద్దరూ డకౌట్లయ్యాక కూడా భారత ఆటగాళ్లు జోరు తగ్గించలేదు. సూర్యకుమార్ యాదవ్ (21), తిలక్ వర్మ ధాటిగా ఆడటంతో టీమిండియా 5 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది. అనంతరం తిలక్ 29 పరుగుల వద్ద ఔట్ కావడంతో భారత స్కోర్‌లో కాస్త వేగం తగ్గింది. 8 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 69/3గా ఉంది. స్కై (30)తో పాటు రింకూ సింగ్ (6) క్రీజ్‌లో ఉన్నాడు. -
టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన.. ఆ ఇద్దరికీ నో ఛాన్స్.. వారి కెరీర్లు ముగిసినట్లేనా..?
3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం భారత క్రికెట్ జట్టు డిసెంబర్ 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటన కోసం భారత సెలెక్టర్లు నిన్ననే (నవంబర్ 30) మూడు వేర్వేరు జట్లను ప్రకటించారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సీనియర్లకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. టెస్ట్ జట్టులో వారికి తిరిగి స్థానం కల్పించారు. 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతుంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణలతో కూడిన భారత జట్టు ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ జట్టులో ఇద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్ల పేర్లు కనిపించకపోవడంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నయా వాల్ చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే పేర్లు దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో లేకపోవడంతో వీరి కెరీర్లకు ఎండ్ కార్డ్ పడినట్లేనని అంతా అనుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వీరిద్దరు స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోవడంతో సెలెక్టర్లు వీరిని పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. వీరిద్దరికి వయసు (35) కూడా సమస్యగా మారింది. వీరికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న యువ ఆటగాళ్లు మాంచి ఊపులో ఉండటం కూడా మైనస్ పాయింట్ అయ్యుండవచ్చు. ఇప్పటికిప్పటికీ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ పుజారా, రహానేలకు ప్రత్యామ్నాయాలు అని చెప్పలేనప్పటికీ.. భవిష్యత్తు మాత్రం వీరిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుజారా, రహానేలను దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో వారి కెరీర్లు ఖతమైనట్లేనని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. దక్షిణాఫ్రికా సిరీస్‌లో శ్రేయస్, రాహుల్ విఫలమైతే తప్ప పుజారా, రహానేలు తిరిగి టెస్ట్ జట్టులోకి రాలేరన్నది కాదనలేని సత్యం. -
రఫ్ఫాడించిన రహానే.. విధ్వంసం సృష్టించిన రుతురాజ్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023 తొలి రోజు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ల హవా కొనసాగింది. హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో అజింక్య రహానే (ముంబై కెప్టెన్), బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (మహారాష్ట్ర) చెలరేగిపోయారు. హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో రహానే 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 76 పరుగులు చేయగా.. బెంగాల్‌తో మ్యాచ్‌లో రుతురాజ్ 40 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు సీఎస్కే బ్యాటర్లు మెరుపు అర్ధశతకాలు సాధించి, తమతమ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషించారు. బెంగాల్-మహారాష్ట్ర మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. రుతురాజ్, కేదార్ జాదవ్ (40 నాటౌట్) రాణించడంతో మహారాష్ట్ర 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ముంబై-హర్యానా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. భారత బౌలర్ హర్షల్ పటేల్ ఈ మ్యాచ్‌లో హర్యానా ఓపెనర్‌గా బరిలోకి దిగి 38 పరుగులు చేశాడు. హర్యానా ఇన్నింగ్స్‌లో అంకిత్ (36), నిషాంత్ సంధు (30 నాటౌట్) పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లు తనుశ్ కోటియన్ (3-0-19-3), మోహిత్ అవస్తి (3-0-15-2) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు. అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రహానే, శివమ్ దూబే (26 నాటౌట్) రాణించడంతో 15.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ముంబై ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (12) మూడు ఫోర్లు బాది ఇన్నింగ్స్‌ను ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత ఔటయ్యాడు. హర్యానా బౌలర్లలో యుజ్వేంద్ర చహల్, అన్షుల్ తలో వికెట్ పడగొట్టారు. -
వెటరన్ జోడీ రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్- గిల్! దాదా- వీరూల తర్వాత..
West Indies vs India, 3rd ODI: వెస్టిండీస్‌పై తొలి రెండు వన్డేల్లో ప్రదర్శన భారత జట్టు ఆటతీరుపై సందేహాలు రేకెత్తించినా... తమ స్థాయి ఏమిటో చివరి పోరులో టీమిండియా చూపించింది. ఇద్దరు స్టార్ బ్యాటర్లు ఆడకపోయినా, ప్రత్యర్థిని చిత్తు చేయగల సత్తా తమకుందని నిరూపించింది. ఆఖరి వన్డేలో భారీ విజయంతో సిరీస్‌ను సొంతం చేసుకున్న జట్టు ఇప్పుడు టి20 పోరుకు సిద్ధమైంది. హాఫ్ సెంచరీలతో మెరిసి ఇక్కడా సీనియర్లు లేకపోవడంతో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు యువ ఆటగాళ్లకు ఇది సరైన అవకాశం. ఇదిలా ఉంటే.. మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ అర్ధ శతకాలతో మెరిసిన విషయం తెలిసిందే. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ 64 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు రాబట్టగా.. గిల్ 92 బంతుల్లో 11 బౌండరీలు బాది మొత్తంగా 85 రన్స్ చేశాడు. వెటరన్ జోడీ రికార్డు బద్దలు మొదటి వికెట్‌కు 19.4 ఓవర్లలో వీరిద్దరు కలిసి 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ క్రికెటర్లు శిఖర్ ధావన్- అజింక్య రహానే పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టారు. కాగా 2017లో ఈ జోడీ వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లో మొదటి వికెట్‌కు 132 పరుగులు జతచేశారు. ఈ క్రమంలో ఆరేళ్ల తర్వాత వీరి రికార్డును లెఫ్ట్- రైట్ కాంబినేషన్ ఓపెనింగ్ పెయిర్ బ్రేక్ చేసి కొత్త చరిత్ర సృష్టించింది. దాదా- వీరూల తర్వాత అదే విధంగా.. కరేబియన్ దీవిలో పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యధిక భాగస్వామ్యం(ఏ వికెట్‌పై అయినా) నమోదు చేసిన రెండో భారత జోడీగా నిలిచింది. 2007 వరల్డ్‌కప్ మ్యాచ్ సందర్భంగా బెర్ముడాపై సౌరవ్ గంగూలీ- వీరేంద్ర సెహ్వాగ్ రెండో వికెట్‌కు 202 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో వీరి తర్వాతి స్థానాన్ని ఇషాన్- గిల్ ఆక్రమించారు. బ్యాటింగ్ ఆర్డర్ కకావికలం కాగా వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను 2–1 తేడాతో భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మూడో వన్డేలో భారత్ 200 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. 352 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 35.3 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా గుడకేశ్ మోటీ (34 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా, అలిక్ అతనజ్ (50 బంతుల్లో 32; 3 ఫోర్లు), అల్జారి జోసెఫ్ (39 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొద్దిగా పోరాడగలిగారు. శార్దుల్ ఠాకూర్ వన్డేల్లో తన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (4/37) నమోదు చేయగా, ముకేశ్ 3, కుల్దీప్ 2 వికెట్లు తీశారు. శుబ్‌మన్ గిల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా, ఇషాన్ కిషన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచారు. శార్దూల్ చెలరేగాడు 2007 నుంచి ఇప్పటి వరకు వెస్టిండీస్‌పై భారత్‌కు ఇది వరుసగా 13వ వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. పదునైన బౌలింగ్‌తో చెలరేగిన పేసర్ ముకేశ్ కుమార్ తొలి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని ధాటికి కింగ్ (0), మేయర్స్ (4), హోప్ (5) అవుట్ కావడంతో స్కోరు 17/3 వద్ద నిలిచింది. పదేళ్ల తర్వాత ఉనాద్కట్ ఆ తర్వాత విండీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. పదేళ్ల తర్వాత తొలి వన్డే ఆడిన ఉనాద్కట్... కార్టీ (6)ని అవుట్ చేయగా... తన వరుస ఓవర్లలో శార్దుల్ రెండు వికెట్లు తీయడంతో స్కోరు 50/6కు చేరింది. అనంతరం తన వరుస ఓవర్లలో కుల్దీప్ తర్వాతి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ దశలో మోతీ, జోసెఫ్ కొద్ది సేపు పట్టుదల కనబర్చి తొమ్మిదో వికెట్‌కు 60 బంతుల్లో 55 పరుగులు జోడించారు. అయితే ఈ జోడీని విడదీసిన శార్దుల్ తన తర్వాతి ఓవర్లో ఆఖరి వికెట్ కూడా తీసి విండీస్ ఆట ముగించాడు. చదవండి: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ అరుదైన రికార్డుకు చేరువలో శాంసన్.. కోహ్లి, రోహిత్ సరసన చేరేందుకు! కోహ్లితో పాటు ప్రపంచకప్ గెలిచి.. ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్ నుంచి ఇప్పుడిలా! -
రెండు టెస్టుల్లో కలిపి 11 పరుగులు! ఇలా అయితే: డీకే
India tour of West Indies, 2023- Ajinkya Rahane Failure: అజింక్య రహానేకు ఇది అత్యంత సాదాసీదా సిరీస్. డబ్ల్యూటీసీ ఫైనల్లో మెరుగైన ప్రదర్శన తర్వాత ఏకంగా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అతడికి ఇలాంటి అవకాశం ఎలా వచ్చిందని అందరూ ఆశ్చర్యపోవడం సహజం. అయితే, అజింక్య రహానేకు ఎవరు ఏమనుకుంటున్నారన్న అంశంతో పనిలేదు. అతడికి రెండు టెస్టుల్లోనూ ఆడే అవకాశం వచ్చింది. కానీ రెండుసార్లు విఫలమయ్యాడు. కొన్నిసార్లు కఠినమైన పిచ్‌ల కారణంగా బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవు. మరికొంత మందికి ఇలా కొన్ని సిరీస్‌లు చేదు అనుభవాన్నిస్తాయి. అయితే, అజింక్య రహానే విషయంలో మాత్రం నిలకడలేని ఆట ప్రభావం చూపుతోంది. అందుకే గతంలో అతడు జట్టులో చోటు కోల్పోయాడు. అంతర్మథనం మొదలయ్యే ఉంటుంది ఈ విషయం అతడికి కూడా తెలిసే ఉంటుంది. అయితే, సౌతాఫ్రికా టూర్లో ఇలాంటి ఆటగాడికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో అతడిలో అంతర్మథనం మొదలవడం ఖాయం’’ అని టీమిండియా వెటరన్ బ్యాటర్, కామెంటేటర్ దినేశ్ కార్తిక్ అన్నాడు. విండీస్‌తో టెస్టు సిరీస్‌లో విఫలమైన భారత జట్టు ఉప నాయకుడు అజింక్య రహానేను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడిని వైస్ కెప్టెన్‌గా ఎలా నియమించారో చాలా మందికి అర్థం కాలేదన్న డీకే.. వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడని పెదవి విరిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో అదుర్స్ కాగా ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో రహానే ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా మిగిలిన ఆటగాళ్లంతా విఫలమైన వేళ అజ్జూ రాణించాడు. ఈ మెగా ఫైట్‌లో 135 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో విండీస్ టూర్లో భాగంగా టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్ అయ్యాడు. రెండు టెస్టుల్లో కలిపి 11 పరుగులు కానీ ఆడిన రెండు టెస్టుల్లో పూర్తిగా విఫలమయ్యాడు. మొత్తంగా కేవలం 11(3, 8) పరుగులు మాత్రమే చేసి ఉసూరుమనిపించాడు. ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ డీకే.. రహానేను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో 209 పరుగుల తేడాతో ఓడిపోయిన రోహిత్ సేన.. తాజా సైకిల్లో తొలి సిరీస్‌ను కైవసం చేసుకుంది. చదవండి: ఆసీస్ ఆల్‌రౌండర్ మాక్సీ భార్య సీమంతం.. ఫొటోలు వైరల్! ఆ విషాదం తర్వాత.. -
వారెవ్వా రహానే.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో! విండీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే సంచలన క్యాచ్‌తో మెరిశాడు. బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో స్లిప్‌లో అద్బుతమైన క్యాచ్‌ను రహానే అందుకున్నాడు. మూడో రోజు ఆట ఫైనల్ సెషన్ తొలి ఓవర్ వేసేందుకు బంతిని జడ్డూ చేతికి రోహిత్ ఇచ్చాడు. ఈ క్రమంలో 87 ఓవర్ వేసిన జడేజా బౌలింగ్‌లో మూడో బంతిని బ్లాక్‌వుడ్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని మొదటి స్లిప్‌వైపు వెళ్లింది. ఈ క్రమంలో మొదటి స్లిప్‌లో ఉన్న రహానే డైవ్‌చేస్తూ ఒంటి చెత్తో కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. ఆ క్యాచ్ చూసిన విండీస్ బ్యాటర్ ఆశ్చర్యపోయాడు. పిచ్ స్లో గా ఉన్నందన భారత బౌలర్లు వికెట్లు తీయడానికి చాలా కష్టపడుతున్నారు. ఇటువంటి సమయంలో రహానే తన అద్బుత క్యాచ్‌తో జట్టుకు కీలక వికెట్‌ను అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రహానేకు ఇది 102 టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు 5 వికెట్ల నష్టానికి 229 స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ జట్టు ఇంకా 209 పరుగుల వెనుకబడి ఉంది. క్రీజులో జేసన్ హోల్డర్ (11), అథనేజ్ (37) ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, అశ్విన్, తొలి టెస్టు ఆడుతున్న ముఖేశ్ కుమార్ తలా ఒక వికెట్ పడగొట్టారు. Good sharp catch from Rahane 👏👏👏 pic.twitter.com/NNA1D0e7Bo — Raja 🇮🇳 (@Raja15975) July 22, 2023 చదవండి: Roosh Kalaria: రిటైర్మెంట్ ప్రకటించిన ముంబై ఇండియన్స్ ప్లేయర్.. -
'అతడు మళ్లీ ఫామ్‌లోకి రావాలి.. ఎందుకంటే రోహిత్ తర్వాత తనే దిక్కు'
డబ్ల్యూటీసీ ఫైనల్‌తో రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టిన టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే.. ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో మాత్రం తీవ్ర నిరాశరుస్తున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరగుతున్న టెస్టు సిరీస్‌లో రహానే దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 11 పరుగులు మాత్రమే చేసిన రహానే.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కూడా కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ సిరీస్‌లో వైస్ కెప్టెన్ రహానే తన స్ధాయికి తగ్గప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో రహానేపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్లో రహానే మరింత నిలకడగా రాణిస్తే రోహిత్ తర్వాత భారత జట్టు సారధి అయ్యే అవకాశం ఉందని జాఫర్ అభిప్రాయపడ్డాడు. "రహానే దాదాపు రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చాడు. అతడు తన ఆటలో మరింత నిలకడ ప్రదర్శించాల్సిన సమయం ఇది. అతడి కెరీర్లో నిలకడలేమి ప్రధాన సమస్యంగా ఉంది. అతడు దానికి కచ్చితంగా అధిగమించాలి. ఎందుకంటే రోహిత్ శర్మ తర్వాత టెస్టుల్లో టీమిండియా కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అతడికి గతంలో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌ను అతడి సారధ్యంలోని భారత జట్టు ఎ విధంగా సొంతం చేసుకుందో మనందరికి తెలుసు. ప్రస్తుతం రోహిత్ తర్వాత కెప్టెన్‌గా అతడే మంచి ఎంపిక" అని జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: IND vs BAN: కోపంతో ఊగిపోయిన టీమిండియా కెప్టెన్.. బ్యాట్‌తో వికెట్లను కొట్టి! వీడియో వైరల్ -
Ind vs WI: ధోని భయ్యా లేడు కదా.. ఇలాగే ఉంటది! ఇప్పటికైనా వాళ్లను పిలిస్తే..
West Indies vs India, 2nd Test: వెస్టిండీస్‌తో రెండో టెస్టులోనూ టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే విఫలమయ్యాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు 36 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. విండీస్ పేసర్ షానన్ గాబ్రియెల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో రహానే ఆట తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్లో సత్తా చాటి పునరాగమనం ఐపీఎల్-2023లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున అదరగొట్టిన రహానే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్ సందర్భంగా భారత జట్టులో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మెగా పోరులో మిగతా వాళ్లు విఫలమైన వేళ రహానే ఒక్కడే రాణించాడు. ఆ మ్యాచ్‌లో మొత్తంగా 138 పరుగులు సాధించి టీమిండియా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో విండీస్ టెస్టు సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కానీ అంచనాలు అందుకోలేక పూర్తిగా నిరాశపరిచాడు. తొలి టెస్టులో కేవలం 3 పరుగులు చేసిన రహానే.. మలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. పుజారాను కూడా పక్కనపెట్టి ఇలా రెండు సందర్భాల్లోనూ ఉప నాయకుడు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడంతో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘‘అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లు టెస్టుల్లో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు. కౌంటీల్లో రాణించిన పుజారాపై వేటు వేశారు. రహానేకు మాత్రం వైస్ కెప్టెన్ పదవి కట్టబెట్టారు. ధోని భయ్యా ఉంటేనే అయినా.. ఐపీఎల్(టీ20ల)లో ప్రదర్శన ఆధారంగా టెస్టు జట్టులోకి తీసుకోకూడదన్న అభిప్రాయాన్ని సీనియర్ బ్యాటర్ అయిన రహానే మరోసారి నిరూపించాడు. పుజారాను కాదని రహానేను సెలక్ట్ చేసినందుకు బాగానే బుద్ధి చెప్పాడు. ఇప్పటికైనా యువకులకు అవకాశం ఇస్తే బాగుంటుంది. రహానే అరుదుగా విఫలమయ్యే బ్యాటర్ కాదు.. అరుదుగా విజయాలు అందుకునే ఆటగాడు. అయినా ధోని భాయ్ ఉంటేనే రహానే పరుగులు సాధిస్తాడేమోలే!’’ అని ట్రోల్ చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2023లో సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించిన రహానేకు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వరుస అవకాశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 11 ఇన్నింగ్స్ ఆడి 326 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా విండీస్- భారత్ మధ్య జూలై 20న రెండో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు బౌలింగ్ ఎంచుకోగా రోహిత్ సేన బ్యాటింగ్‌కు దిగింది. తొలిరోజు ఆటలో.. గురువారం నాటి తొలిరోజు ఆట ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(57), రోహిత్ శర్మ(80) అర్ధ శతకాలతో రాణించగా.. విరాట్ కోహ్లి 87, జడేజా 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో రహానేతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ కూడా నిరాశపరిచాడు. 12 బంతులు ఎదుర్కొన్న గిల్.. 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. చదవండి: SL Vs Pak: లంకపై పాక్ విజయం! ప్రైజ్‌మనీ ఎంతంటే! సారీ చెప్పిన బోర్డు.. -
సౌతాఫ్రికాలో ఇలాంటి బ్యాటర్లే కావాలి: టీమిండియా బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు
India tour of West Indies, 2023: ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్లో అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. జట్టుకు అవసరమైన సమయాల్లో ఎల్లప్పుడూ ఆదుకుంటూనే ఉంటాడు. గతంలో ఫామ్‌లేమి కారణంగా జట్టు నుంచి అతడిని తప్పించాల్సి వచ్చిది. అయితే, ఎప్పటికప్పుడు టెక్నిక్‌ను మెరుగుపరచుకుంటే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. రహానే అదే పని చేస్తున్నాడు. పునరాగమనంలో భిన్నంగా కనిపిస్తున్నాడు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తను రాణిస్తాడని అనుకుంటున్నాం. ముఖ్యంగా సౌతాఫ్రికా కండిషన్లలో ఇలాంటి ఆటగాళ్ల అవసరం ఎంతగానో ఉంటుంది’’ అని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. అప్పుడు చోటే లేదు వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా విదేశీ గడ్డపై టీమిండియా సాధించిన పలు విజయాల్లో కీలక పాత్ర పోషించిన రహానేకు డబ్ల్యూటీసీ ఫైనల్ కంటే ముందు వరకు జట్టులో చోటే కరువైంది. అయితే, ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొట్టడం, అదే సమయంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దూరం కావడంతో రహానే మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే జట్టులో స్థానం దక్కింది. అవకాశం సద్వినియోగం చేసుకుని వైస్ కెప్టెన్‌గా ఇలా అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు రహానే. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ ఈ ముంబై బ్యాటర్ 89, 46 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికవడమే కాకుండా ఏకంగా వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కానీ విఫలమయ్యాడు! జట్టులో చోటైతే ఖాయం అయితే, తొలి టెస్టులో మాత్రం రహానే పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం మూడు పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్.. రహానేను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో రహానేకు చోటు ఖాయమంటూ అభిమానులు సందడి చేస్తున్నారు. చదవండి: టీమిండియా కొత్త కెప్టెన్ అరంగేట్రం.. రహానేపై వేటు! అతడు కూడా.. SL Vs Pak: జస్ట్ 87 పరుగులతో సెంచరీ మిస్! ఆ బాధ వర్ణణాతీతం! -
టీమిండియా కొత్త కెప్టెన్ అరంగేట్రం.. రహానేపై వేటు! అతడు కూడా..
India tour of West Indies, 2023 - Ind Vs WI 2nd Test: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టింది టీమిండియా. వెస్టిండీస్‌పై ఏకంగా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. విండీస్‌తో తొలి టెస్టుతో అరంగేట్రం చేసిన యశస్వి జైశ్వాల్ ఏకంగా సెంచరీతో అదరగొట్టాడు. ఓపెనర్‌గా హిట్ మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే 171 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు సరైన ఓపెనింగ్ జోడీ అనిపించుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు. విఫలమైన గిల్, రహానే అదే సమయంలో.. వన్‌డౌన్‌లో ఆడాలన్న ‘రెగ్యులర్ ఓపెనర్’ శుబ్‌మన్ కల నెరవేరినా.. సింగిల్ డిజిట్ స్కోరు(6)కే పరిమితం కావడంతో ఈ ప్రయోగం బెడిసికొట్టినట్లయింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అదరగొట్టిన అజింక్య రహానే విండీస్‌తో మ్యాచ్‌లో మాత్రం తేలిపోయాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన అతడు.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 11 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో యశస్వితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ శతకం(103), విరాట్ కోహ్లి 76, రవీంద్ర జడేజా 37(నాటౌట్) పరుగులతో రాణించగా.. గిల్, రహానే ఈ మేరకు విఫలం కావడం గమనార్హం. రుతురాజ్ గైక్వాడ్ అరంగేట్రం ఫిక్స్ ఇక విండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో రోహిత్‌తో పాటు ఏకంగా ముగ్గురు ఓపెనింగ్ బ్యాటర్లకు స్థానం దక్కిన విషయం తెలిసిందే. శుబ్‌మన్, యశస్వితో పాటు మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశమిచ్చారు సెలక్టర్లు. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్ సందర్భంగా అతడు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. యశస్వి ఓపెనర్‌గా తనను తాను నిరూపించుకోవడంతో.. మేనేజ్మెంట్ రుతును మిడిలార్డర్లో ఆడించే యోచనలో ఉన్నట్లు సమాచారం. రోహిత్‌కు జోడీగా గిల్, యశస్వి రూపంలో ఆప్షన్లు ఉండటంతో రుతును మిడిలార్డర్లో ఆడించి.. ఒకవేళ అతడు సక్సెస్ అయితే.. అక్కడే కంటిన్యూ చేయాలని భావిస్తున్నారట. రహానేపై వేటు తప్పదా? విండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా ఈ ప్రయోగం చేయాలనుకుంటున్నట్లు సమాచారం. అదే నిజమై.. ఒకవేళ రుతురాజ్ అరంగేట్రం చేస్తే శుబ్‌మన్ గిల్ లేదంటే అజింక్య రహానేలలో ఎవరో ఒకరిపై వేటు తప్పదు. దీంతో యువ బ్యాటర్ గిల్‌ను తప్పిస్తారా లేదంటే ఏకంగా వైస్ కెప్టెన్‌నే డ్రాప్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. పేస్ విభాగంలో జయదేవ్ ఉనాద్కట్ స్థానంలో ముకేశ్ కుమార్ అరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తోంది. తొలి టెస్టులో అతడికి పెద్దగా బౌలింగ్ చేసే అవకాశమివ్వలేదు కెప్టెన్ రోహిత్. ఇదిలా ఉంటే.. విండీస్‌తో రెండో టెస్టులో మూడో స్పిన్నర్‌ను ఆడించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు తోడుగా అక్షర్ పటేల్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. దీంతో శార్దూల్‌కు మొండిచేయి ఎదురయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసియా క్రీడలు-2023 ఈవెంట్లో పాల్గొనున్న భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌తో రెండో టెస్టు- భారత తుది జట్టు (అంచనా) రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, అజింక్య రహానే/రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్. చదవండి: ‘సెహ్వాగ్ నీకు బ్యాటింగే రాదు! పాక్‌లో ఉంటే ఇక్కడి దాకా వచ్చేవాడివే కాదు’ అల్కరాజ్ గెలుపు కాదు.. ఫెదరర్ ప్రతీకారం.. కన్నీళ్లు పెట్టుకున్న జకోవిచ్ -
రహానేను కించపరిచిన ఇషాన్! ఇవే తగ్గించుకుంటే మంచిది.. మొన్న కోహ్లికే..
West Indies vs India, 1st Test: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో అరంగేట్రం చేసిన భారత యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ సెంచరీతో చెలరేగితే.. ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో అడుగుపెట్టిన ఇషాన్ కిషన్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఓపెనర్‌గా దిగిన యశస్వి 171 పరుగులు సాధించగా.. వికెట్ కీపర్‌గా జట్టులోకి వచ్చిన ఇషాన్ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. సింగిల్ కోసం 20 బంతులు అయితే, ఒక్క పరుగు తీయడానికి ఏకంగా 20 బంతులు తీసుకున్నాడు. వికెట్ కీపర్‌గానూ తమ మార్కు చూపలేకపోయాడు. ఇలా ఆటతో ఆకట్టుకోలేకపోయిన ఇషాన్ కిషన్.. సీనియర్లను టీజ్ చేసి అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. తొలిరోజు ఆటలో ఏకంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి సూచనలు ఇచ్చాడు. మొన్న కోహ్లితో అలా విండీస్ ఇన్నింగ్స్ సందర్భంగా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లిని కాస్త పక్కకు జరగమని సూచించాడు. ఇక మూడో రోజు ఆట సందర్భంగా టీమిండియా విజయానికి చేరువవుతున్న తరుణంలో వైస్ కెప్టెన్ అజింక్య రహానేను కించపరిచినట్లుగా మాట్లాడాడు. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాయాజాలంలో చిక్కిన విండీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టిన విషయం తెలిసిందే. రహానేను కించపరిచినట్లుగా విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో అశూ ఏకంగా 7 వికెట్లు పడగొట్టగా.. మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 130 పరుగులకే వెస్టిండీస్ కుప్పకూలింది. అయితే, పదకొండో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్ స్పిన్నర్ జోమెల్ వారికన్ జిడ్డు బ్యాటింగ్‌తో టీమిండియా స్పిన్నర్లను కాసేపు ఇబ్బంది పెట్టాడు. ఏంటీ? ఏమంటున్నావు? మొత్తంగా 18 బంతులు ఎదుర్కొన్న అతడు 18 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో వారికన్ ఇన్నింగ్స్‌ను రహానే ఆటతో పోలుస్తూ.. ‘‘అజ్జూ భయ్యా! ఇతను నీకంటే ఎక్కువ బంతులు ఆడాడు!’’ అంటూ ఇషాన్ కిషన్ .. రహానేతో అన్నాడు. ఇందుకు కాస్త సీరియస్ లుక్ ఇచ్చిన రహానే.. ‘‘ఏంటీ? ఏమంటున్నావు?’’ అని బదులిచ్చాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇషాన్‌పై అభిమానులు ఫైర్ అవుతున్నారు. ‘‘ఆట తక్కువ! ఓవరాక్షన్ ఎక్కువ.. సీనియర్లతో ఎలా ప్రవర్తించాలో తెలియదా? మొన్న కోహ్లికే ఏదో చెప్పుబోయావు.. ఇప్పుడు రహానేను అవమానపరిచేలా మాట్లాడావు.. ఇలాంటి పిచ్చి పనులు మానేసి ఆటపై దృష్టి పెట్టు’’ అని హితవు పలుకుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే పూర్తిగా విఫలమయ్యాడు. 11 బంతులు ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. చదవండి: ఒకప్పుడు జట్టులో చోటే దిక్కు లేదు.. ఇప్పుడు ఏకంగా టీమిండియా కెప్టెన్‌గా! ఒకప్పుడు జట్టులో చోటే దిక్కు లేదు.. ఇప్పుడు ఏకంగా టీమిండియా కెప్టెన్‌గా! pic.twitter.com/UUnr20QVFM — Nihari Korma (@NihariVsKorma) July 15, 2023 -
Ind vs WI: అయ్యో యశస్వి! ఆ పేసర్ వదల్లేదు.. ఓపికగా ఎదురుచూసి..
West Indies vs India, 1st Test: వెస్టిండీస్‌తో తొలి టెస్టు మూడో రోజు ఆట తొలి సెషన్లోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ద్విశతకం దిశగా అడుగులు వేస్తున్న యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది. అరంగేట్రంలోనే అరుదైన రికార్డులు సొంతం చేసుకున్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కాగా దేశవాళీ క్రికెట్లో ముంబైకి ఆడుతున్న యశస్వి జైశ్వాల్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023 సందర్భంగా తొలిసారి టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు. అయితే, ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో అతడు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో వెస్టిండీస్ పర్యటన రూపంలో అదృష్టం తలుపుతట్టింది. ముఖ్యంగా శుబ్‌మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలని కోరుకోవడం యశస్వికి కలిసి వచ్చింది. ఈ క్రమంలో జూలై 12న టీమిండియా- విండీస్ మధ్య ఆరంభమైన తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఈ యువ ఆటగాడు ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. రెండో రోజు ఆట సందర్భంగా సెంచరీ పూర్తి చేసుకుని 143 పరుగుల వద్ద నిలిచిన యశస్వి.. మూడో రోజు తొలి సెషన్లో 150 పరుగుల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో అరంగేట్ర టెస్టులోనే అత్యంత పిన్న వయసులోనే ఈ మార్కు అందుకున్న తొలి టీమిండియా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. విండీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ క్రీజులో పాతుకుపోయి చుక్కలు చూపించాడు. పార్ట్ టైమ్ బౌలర్లతో సహా ఉన్న వాళ్లందరినీ దింపినప్పటికీ ఒక్కరికీ చిక్కలేదు. అయితే, మూడో రోజు తొలి సెషన్లో 171 పరుగుల వద్ద ఉన్న సమయంలో విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ పదే పదే ఒకే చోట బాల్ వేస్తూ యశస్విని విసిగించాడు. 126వ ఓవర్ ఆరంభం నుంచే ఇద్దరి మధ్య పోటాపోటీ యుద్ధమే జరిగింది. ఈ ఓవర్లో యశస్వి ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయాడు. ఈ క్రమంలో ఓపికతో ఎదురుచూసిన అల్జారీ జోసెఫ్ ఆఖరి బంతికి అనుకున్నది సాధించాడు. 125.6వ డెలివరీ(outside off)లో యశస్వి బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి జోషువా డా సిల్వా చేతుల్లో పడింది. దీంతో యశస్వి ఇన్నింగ్స్ ముగిసిపోయింది. ఇక వచ్చీ రాగానే వైస్ కెప్టెన్ అజింక్య రహానే కేవలం 3 పరుగులు చేసి అవుటయ్యాడు. రోచ్ బౌలింగ్‌లో బ్లాక్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు.. విరాట్ కోహ్లి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. చదవండి: కోహ్లి నెమ్మదిగా! సీనియర్ అయి ఉండి ఏం లాభం?: ఇషాంత్ శర్మ IPL: లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త కోచ్ -
Ind vs WI: అతడొక్కడే కాదు.. వాళ్లు కూడా విఫలం.. కానీ పాపం..
Ind Vs WI 2023 Test Series: ‘‘అన్ని రకాల గౌరవాలు పొందేందుకు అతడు నూటికి నూరు శాతం అర్హుడు. అలాంటిది తనను జట్టు నుంచి తప్పించడం నాకు ఆశ్చర్యంగా ఉంది. నిజానికి డబ్ల్యూటీసీ ఫైనల్లో అతనొక్కడే విఫలం కాలేదు కదా! అదే జట్టులో ఉన్న చాలా మంది కూడా కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేదు. పుజారా మాదిరే వాళ్లు కూడా పరుగులు సాధించడంలో వైఫల్యం చెందారు. స్ట్రైక్‌రేటు అంతంత మాత్రంగా ఉండటానికి కారణమదే చాలా మంది టెస్టుల్లో పుజారా స్ట్రైక్‌రేటు గురించిన విమర్శలు చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. వాస్తవానికి పుజారా స్ట్రైక్‌రేటు అంతంత మాత్రంగా ఉండటానికి కారణం.. సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టినపుడు వికెట్ పడకుండా చూసుకోవడం.. జట్టును ఆదుకునే వాళ్లకు సపోర్టు ఇవ్వడం వల్లే! ఎన్నో విజయాల్లో పుజారా కీలక పాత్ర పోషించాడు. కానీ అతడికి దక్కాల్సినంత గౌరవం దక్కలేదు. జట్టుకు ఇప్పుడు కూడా తన అవసరం ఎంతగానో ఉంది. కానీ అనూహ్య రీతిలో పక్కనపెట్టారు. ముఖ్యంగా SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) గడ్డ మీద జట్టుకు ఇలాంటి ఆటగాడు అవసరం. వాళ్లను మాత్రం పక్కన పెట్టరు?! ఎవరైనా సరే ప్రతిసారి అద్భుతంగా ఆడలేరు కదా! పుజారా లాంటి టెస్టు క్రికెటర్‌ను వదులుకుంటే నష్టపోవాల్సి ఉంటుంది’’ అంటూ టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్.. ఛతేశ్వర్ పుజారాకు అండగా నిలబడ్డాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో పుజారాను తప్పించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో టీమిండియా ఘోర ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. బ్యాటర్ల వైఫల్యమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఓపెనర్లు రోహిత్ శర్మ(15, 43), శుబ్‌మన్ గిల్(13, 18) ఆకట్టుకోలేకపోయారు. స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన కోహ్లి వన్‌డౌన్‌లో వచ్చిన పుజారా చేసిన పరుగులు 14, 27. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లి(14, 49) కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. అజింక్య రహానే మొత్తంగా 138 పరుగులతో టీమిండియా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు అతడు వైస్ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. అనూహ్యంగా పుజారాకు చోటే దక్కలేదు. ఈ నేపథ్యంలో మాజీ స్పిన్నర్ భజ్జీ స్పందిస్తూ పుజారాకు జట్టులో చోటు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టాడు. ముఖ్యంగా కోహ్లి, ఇతర బ్యాటర్లను టార్గెట్ చేస్తూ.. పుజారాకు అండగా నిలిచాడు. కాగా జూలై 12 నుంచి టీమిండియా- విండీస్ మధ్య డొమినికా వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. చదవండి: రాయుడు రిటైర్ అయ్యాడు.. మీకు తప్పకుండా జట్టులో చోటిస్తాం.. కానీ: ధోని సిక్సర్ల రింకూ.. ఎక్కడా తగ్గేదేలే! వీడియోతో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా! -
జైశ్వాల్ ఆడడం ఖాయమా? రోహిత్ ప్రశ్నకు రహానే స్పందన
టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. ఇరుజట్ల మధ్య బుధవారం నుంచి విండ్సర్ పార్క్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇటీవలే వైస్‌కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన అజింక్యా రహానే సిరీస్‌లో రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. కాగా టెస్టు స్పెషలిస్టుగా ముద్రపడిన చతేశ్వర్ పుజారా ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. కాగా అతని స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేది ఎవరనే దానిపై రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్లులో యశస్వి జైశ్వాల్ అరంగేట్రం ఖాయంగా కనబడుతోంది. పుజారా స్థానమైన మూడో నెంబర్లో బ్యాటింగ్‌కు వచ్చేది జైశ్వాల్ అని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇదే విషయమై రహానే మాట్లాడుతూ.. ''కచ్చితంగా పుజారా స్థానంలో ఎవరో ఒకరికి అవకాశం వస్తుంది. పుజారా లోటును తీర్చడానికి మూడో స్థానం కాలకం. ఈ కీలక స్థానంలో బ్యాటింగ్ వచ్చే అవకాశం ఎవరిదనేది చెప్పలేను. కానీ అతనికి(యశస్వి జైశ్వాల్‌కు) మంచి చాన్స్. ఇప్పుడున్న యంగ్ క్రికెటర్లలో మంచి టాలెంట్ ఉన్నవాడు. మొత్తానికి జైశ్వాల్ టీమిండియా తరపున టెస్టు ఫార్మాట్లో ఆడడం సంతోషం కలిగిస్తోంది. డొమొస్టిక్ క్రికెట్లో ముంబై తరపున.. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరపున బాగా ఆడాడు. గతేడాది దులీప్ ట్రోపీలోనూ తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. అంతర్జాతీయ క్రికెట్లోనూ అదే జోరు చూపించాలని కోరుకుంటున్నా. అతని బ్యాటింగ్ తీరు చూడముచ్చటగా ఉంది. స్థానం కాదు ముఖ్యం.. ఏ స్థానంలోనైనా వచ్చి బ్యాటింగ్ చేయగల సత్తా జైశ్వాల్‌ది. చాలా సంతోషంగా ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రహానేను ఇంటర్య్వూ చేసింది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసింది. ఇక 21 ఏళ్ల జైశ్వాల్‌కు ఫస్ట్‌క్లాస్ కెరీర్లో మంచి బ్యాటింగ్ యావరేజ్ ఉంది. గత 18 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో జైశ్వాల్ 1845 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మది సెంచరీలు, రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్ 2023లోనూ జైశ్వాల్ రాజస్తాన్ రాయల్స్ తరపున 14 మ్యాచ్‌ల్లో 625 పరుగులు చేశాడు. అతని ఖాతాలో ఒక సెంచరీ సహా ఐదు అర్థశతకాలు ఉన్నాయి. 𝘿𝙊 𝙉𝙊𝙏 𝙈𝙄𝙎𝙎! When #TeamIndia Captain @ImRo45 turned reporter in Vice-Captain @ajinkyarahane88's press conference 😎 What do you make of the questions 🤔 #WIvIND pic.twitter.com/VCEbrLfxrq — BCCI (@BCCI) July 11, 2023 చదవండి: TNPL 2023 DD Vs NRK: మరో 'రింకూ సింగ్'.. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సంచలనం ODI World Cup 2023: ప్రపంచ కప్ టికెట్ల ధరలు వచ్చేశాయోచ్.. ఎలా ఉన్నాయంటే? -
రహానే వైస్ కెప్టెన్ అయినపుడు మరి కోహ్లి ఎందుకు..?: మాజీ చీఫ్ సెలక్టర్
Team India Test Captain: ‘‘ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. సెలక్టర్ల మైండ్‌సెట్ ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేం కదా! నిజానికి డబ్ల్యూటీసీ తాజా సైకిల్ ఆరంభం కానున్న నేపథ్యంలో సెలక్టర్లు ప్రతి విషయంలో పూర్తి స్పష్టతతో ఉండాలి. అజింక్య రహానే వైస్ కెప్టెన్‌గా పునరాగమనం చేసినపుడు మరి విరాట్ కోహ్లి ఎందుకు తిరిగి కెప్టెన్ కాకూడదు? మరోసారి కెప్టెన్సీ చేపట్టే విషయంలో కోహ్లి ఆలోచనా ధోరణి ఎలా ఉందో నాకు తెలియదు. ఒకవేళ రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరన్న అంశంపై సెలక్టర్లు చర్చిస్తూ ఉంటే కచ్చితంగా విరాట్ రూపంలో వాళ్ల ముందు గొప్ప ఆప్షన్ ఉంది’’ అని టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్ అన్నాడు. టెస్టు సారథిగా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన కోహ్లిని తిరిగి కెప్టెన్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్ తర్వాత రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్‌కు విజయాలు అందించిన 36 ఏళ్ల రోహిత్.. ఐసీసీ ఈవెంట్లలో విఫలం కావడం, వయసు పైబడటం కూడా అతడిని సారథిగా తొలగించాలనే డిమాండ్లకు కారణం. ఈ నేపథ్యంలో తదుపరి కెప్టెన్ ఎవరన్న అంశంపై చర్చ నడుస్తున్న తరుణంలో ఎమ్ఎస్కే ప్రసాద్ ఖేల్ నౌతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి తిరిగి టెస్టు పగ్గాలు చేపడితే బాగుంటుందన్న ప్రసాద్.. కోహ్లి ఈ విషయం పట్ల సుముఖంగా లేకుంటే శుబ్‌మన్ గిల్ కూడా మంచి ఆప్షన్ అని పేర్కొన్నాడు. అయితే, ఈ యువ బ్యాటర్‌పై ఇప్పుడే భారం మోపడం సరికాదని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2023లో అదరగొట్టిన రహానే.. డబ్ల్యూటీసీ ఫైనల్-2023తో టెస్టు జట్టులో పునరాగమనం చేశాడు. కీలక మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ వెటరన్ బ్యాటర్.. వెస్టిండీస్‌తో టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కాగా జూలై 12 నుంచి టీమిండియా- విండీస్ మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Ind Vs WI: షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు.. పూర్తి వివరాలివే Ind Vs WI: ద్రవిడ్ సెంచరీ.. కోహ్లి 19 పరుగులు! విరాట్ ట్వీట్ వైరల్ -
35 ఏళ్ల వయసులో రహానే చేసినప్పుడు, నేను చేయలేనా..?
టీమిండియా టెస్ట్ క్రికెటర్, ఆంధ్ర స్టార్ ఆటగాడు హనుమ విహారి ఇటీవల స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే విషయమై విహారి మాట్లాడుతూ.. 35 ఏళ్ల వయసులో అజింక్య రహానే టెస్ట్ జట్టులోకి పునరాగమనం చేసినప్పుడు, తాను చేయలేనా అని అన్నాడు. రహానే లాంటి వెటరన్ ఆటగాడు టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం శుభపరిమాణమని, టాలెంట్ ఉన్న ఆటగాడికి వయసుతో సంబంధం లేదని రహానే నిరూపించాడని, టీమిండియాలో తాను రీఎంట్రీ ఇచ్చేందుకు ఇది స్పూర్తినిస్తుందని పేర్కొన్నాడు. తన వయసు 29 మాత్రమేనని, టీమిండియాకు ఆడేందుకు తనకు ఇంకా చాలా సమయం ఉందని చెప్పుకొచ్చాడు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన హనుమ విహారి భారత్ తరఫున 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 34 సగటున, సెంచరీ, 5 అర్ధసెంచరీల సాయంతో 839 పరుగులు చేశాడు. సీనియర్లతో టీమిండియా టెస్ట్ స్క్వాడ్ బలంగా ఉండటంతో విహారికి సరైన అవకాశాలు దక్కడం లేదు. అతను చివరిసారిగా గతేడాది (2022) టీమిండియాకు ఆడాడు. 2021 ఇంగ్లండ్ పర్యటనకు కంటిన్యుటిగా జరిగిన ఐదో టెస్ట్‌లో విహారి టీమిండియాకు చివరిసారిగా ప్రాతినిధ్యం వహించాడు. ఆ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 20, 11 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. ఆ తర్వాత అతనికి భారత సెలెక్టర్ల నుంచి పిలుపు అందలేదు. విహారి పార్ట్ టైమ్ బౌలర్‌గానూ పర్వాలేదనిపించాడు. 16 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టాడు. 2021 సిడ్నీ టెస్ట్ మ్యాచ్ విహారికి మంచి గుర్తింపు తెచ్చింది. ఇక రహానే విషయానికొస్తే.. ఐపీఎల్ 2023లో ఇరగదీసిన ఈ ముంబైకర్.. ఆ ప్రదర్శన కారణంగా టీమిండియాలో చోటు దక్కించుకుని, డబ్ల్యూటీసీ ఫైనల్లో సత్తా చాటి, ఇప్పుడు ఏకంగా టెస్ట్‌ల్లో టీమిండియా వైస్ కెప్టెన్ అయ్యాడు. ఇదే స్పూర్తితో విహారి సైతం టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. -
వెస్టిండీస్‌కు బ్యాచ్‌ల వారీగా టీమిండియా.. రోహిత్, కోహ్లి మాత్రం
West Indies Vs India 2023: వెస్టిండీస్‌తో మూడు ఫార్మాట్ల సిరీస్‌ల నేపథ్యంలో టీమిండియా అక్కడికి చేరుకుంది. జూలై 12 నుంచి మ్యాచ్‌లు ఆరంభం కానున్న తరుణంలో శుక్రవారం కరేబియన్ దీవిలో అడుగుపెట్టింది. కాగా విమాన టికెట్లు అందరికీ ఒకేసారి అందుబాటులో లేని కారణంగా భారత ఆటగాళ్లు బ్యాచ్‌ల వారీగా విండీస్‌కు పయనమయ్యారు. అమెరికా, లండన్, నెదర్లాండ్స్ నుంచి వెస్టిండీస్‌కు చేరుకున్నారు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్యారిస్, విరాట్ కోహ్లి లండన్ నుంచి త్వరలోనే బయల్దేరి రానున్నట్లు సమాచారం. కాగా ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత ఆటగాళ్లకు సుమారు నెలరోజుల పాటు విశ్రాంతి లభించిన విషయం తెలిసిందే. విండీస్‌కు ఆలస్యంగా చేరుకోనున్న రోహిత్, కోహ్లి ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లి తమ కుటుంబాలతో వెకేషన్‌కు వెళ్లారు. జాతీయ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. వీరిద్దరు వచ్చే వారం వెస్టిండీస్‌కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక జూలై 12- ఆగష్టు 13 వరకు టీమిండియా కరేబియన్ దీవిలో గడుపనుంది. టెస్టు సిరీస్‌తో మొదలై.. టీ20 సిరీస్‌తో ఈ పర్యటన ముగియనుంది. కాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు భారత జట్టు ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఇక డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో రోహిత్ సేనకు వెస్టిండీస్‌తో జూలై 12 నాటి మ్యాచ్ మొదటిది కానుంది. కాగా 2019లో చివరిసారిగా ఇరు జట్లు టెస్టు మ్యాచ్‌లో తలపడగా.. టీమిండియా విండీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేసింది. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: WC 2023: వెస్టిండీస్ కొంపముంచిన జింబాబ్వే! ఇక ఆశలు వదులుకోవాల్సిందే! Vice Captain Rahane on the way to West Indies for the Test series. pic.twitter.com/BFL7dJMwmM — Johns. (@CricCrazyJohns) June 30, 2023 -
18 నెలలు జట్టుకు దూరం.. వచ్చి ఒక్క మ్యాచ్ ఆడగానే! జడ్డూ..: గంగూలీ
India Vs West Indies Test Series: ‘‘18 నెలల పాటు జట్టుకు దూరంగా ఉండి.. తిరిగొచ్చిన తర్వాత కేవలం ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడిన క్రికెటర్.. వైస్ కెప్టెన్‌గా నియమితుడు కావడం. ఇలాంటి ఎంపిక నేనెప్పుడూ చూడలేదు. జట్టులో చాలా కాలం నుంచి నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న రవీంద్ర జడేజా ఉన్నాడు. నిజానికి అతడు కదా అసలైన క్యాండిడేట్. కానీ ఓ వ్యక్తి ఏడాదిన్నర తర్వాత పునరాగమనం చేసి ఒక్క మ్యాచ్ ఆడగానే వైస్ కెప్టెన్ అవడం విడ్డూరంగా ఉంది. ఈ విషయంలో సెలక్టర్ల తీరు నాకైతే అర్థం కాలేదు. ఏదో తూతూ మంత్రంగా జట్టును ఎంపిక చేసినట్లు ఉండకూడదు. సెలక్షన్ విషయంలోనూ నిలకడ ఉండాలి’’ అని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు. రోహిత్ డిప్యూటీగా అతడే ఎందుకు? వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో ఎంపిక చేసిన టెస్టు జట్టులో వైస్ కెప్టెన్‌గా అజింక్య రహానేకు స్థానం ఇవ్వడంపై ఘాటు విమర్శలు చేశాడు. అదే విధంగా.. సీనియర్ టెస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా విషయంలో సెలక్టర్ల తీరును విమర్శించాడు. కాగా దాదాపు ఏడాదిన్నరగా జట్టుకు దూరమైన రహానే.. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అద్భుతంగా ఆడాడు. ఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సందర్భంగా జట్టులోకి తిరిగి వచ్చి.. రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 89, 46 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో విండీస్‌తో టెస్టు సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. పుజారా విషయంలో ఏం ఆలోచిస్తున్నారు? మరోవైపు.. పుజారా జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘పుజారాను జట్టులో కొనసాగిస్తారా లేదంటే.. అతడి వారసుడిగా యువ క్రికెటర్లలో ఎవరినైనా తయారు చేస్తారా అన్న విషయంపై ముందుగా స్పష్టతకు రావాలి. పుజారా లాంటి మేటి ఆటగాడిని జట్టు నుంచి తప్పించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అంతేగానీ ఓ సిరీస్‌కు ఎంపిక చేసి.. ఆ వెంటనే తదుపరి సిరీస్‌కు తప్పించడం సరికాదు. అజింక్య రహానే విషయంలోనూ నిలకడ ఉండాలి’’ అని గంగూలీ.. సెలక్టర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా జూలై 12 నుంచి వెస్టిండీస్ పర్యటనతో బిజీకానుంది. వెస్టిండీస్ రెండు టెస్టులకు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులోకి తెలుగు కుర్రాడు! -
టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు! అసలు రహానే ఏం చేశాడని ఆ బాధ్యతలు?
‘‘రవీంద్ర జడేజా గురించి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదో నాకైతే అర్థం కావడం లేదు. టీమిండియాకు మూడు ఫార్మాట్లలోనూ అతడు ప్రధాన ఆటగాడిగా సేవలు అందిస్తున్నాడు. టెస్టుల్లోనూ అతడి రికార్డులు మెరుగ్గా ఉన్నాయి. మరి తదుపరి నాయకుడు ఎవరన్న చర్చ వచ్చినపుడు జడేజా పేరు ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? గిల్ కూడా ఉన్నాడుగా నిజానికి మూడు ఫార్మాట్లలోనూ అతడి స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉన్న ఆటగాడు లేడు. టీమిండియాను ముందుకు నడిపించ గల సత్తా అతడిలో ఉంది. ఒకవేళ జడేజా పేరును పరిశీలనలోకి తీసుకోకపోతే.. శుబ్‌మన్ గిల్ ఉన్నాడు కదా! టీమిండియా భవిష్యత్ ఆశాకిరణమైన గిల్ పేరునైనా పరిగణనలోకి తీసుకోవాలి. నిజానికి యువకుడైన యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లకు చోటివ్వడం బాగుంది. మెల్లమెల్లగా యువ రక్తం ఎక్కిస్తున్నారు. కానీ అజింక్య రహానేను వైస్ కెప్టెన్ చేయడం వెనుక లాజిక్ ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. టెస్టు జట్టులో స్థానం కోల్పోయి మళ్లీ తిరిగి వచ్చిన తర్వాత అతడు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. రహానే ఏం చేశాడు? అందులో అద్భుతంగా రాణించిన మాట వాస్తవమే. అయితే, భవిష్యత్ టీమిండియా నిర్మిస్తున్నపుడు మళ్లీ అజింక్య రహానేనే వైస్ కెప్టెన్‌గా నియమించే బదులు కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వొచ్చు కదా? రోహిత్ శర్మ వారసుడిగా ఎదగగల లక్షణాలు ఉన్న ఆటగాడికి డిప్యూటీగా బాధ్యతలు అప్పగిస్తే బాగుండు’’ అని టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో బీసీసీఐ ఇటీవల టెస్టు, వన్డే జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్లో అదరగొట్టి ఇందులో భాగంగా టెస్టు జట్టులో స్థానం పొందిన అజింక్య రహానే తిరిగి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అద్భుతంగా ఆడిన రహానే.. ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జట్టుకు ఎంపికయ్యాడు. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశం దక్కించుకున్న రహానే దానిని సద్వినియోగం చేసుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 89, 46 పరుగులు చేశాడు. దీంతో సెలక్టర్లు అతడికి మరోసారి కెప్టెన్ డిప్యూటీగా అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సబా కరీం ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా రవీంద్ర జడేజా 2021లో చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు చేపట్టి మధ్యలోనే చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో జట్టును నడిపించలేని జడ్డూకు జాతీయ జట్టు బాధ్యతలు అప్పగించాలని సబా కరీం వ్యాఖ్యానించడంపై క్రికెట్ ప్రేమికుల్లో చర్చ మొదలైంది. వెస్టిండీస్ రెండు టెస్టులకు భారత జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: మాకు భుజాల నొప్పులు.. ధోనికి మెకాలి సమస్య.. అసలే సచిన్ బరువు! అందుకే.. ఈసారి హోరాహోరీ తప్పదు.. ట్రోఫీ ఆ జట్టుదే: భారత మాజీ కెప్టెన్ -
కౌంటీల్లో సెంచరీల మీద సెంచరీలు! అసలు పోరులో తుస్సు! అందుకే..
Cheteshwar Pujara- Ind Vs WI test Series: వెస్టిండీస్‌తో సిరీస్ నేపథ్యంలో టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారాకు మొండిచేయి ఎదురైంది. విండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు. కాగా ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టుతో జట్టులోకి తిరిగి వచ్చిన పుజారా బంగ్లాదేశ్ సిరీస్‌లోనూ ఆడాడు. కౌంటీల్లో సెంచరీల మీద సెంచరీలు ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో భాగమయ్యాడు. ఈ క్రమంలో ఆసీస్‌తో నాలుగు మ్యాచ్‌లలో కలిపి 140 పరుగులు చేయగలిగాడు. అనంతరం ఇంగ్లండ్‌లో కౌంటీల్లో ఆడిన పుజారా ససెక్స్ జట్టు నాయకుడిగా వ్యవహరించాడు. అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ 8 ఇన్నింగ్స్‌లో 3 సెంచరీల సాయంతో.. 545 పరుగులతో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో ఛతేశ్వర్ అదరగొట్టడం ఖాయమని అభిమానులు సంబరపడిపోయారు. కానీ గుజరాత్ బ్యాటర్ వారి ఆశలపై నీళ్లు చల్లాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో తుస్సు ఆస్ట్రేలియాపై మెరుగైన రికార్డు కలిగి ఉన్న పుజారా.. ఓవల్ వేదికగా తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులకు పరిమితమై వైఫల్యం కొనసాగించాడు. దీంతో అతడికి భారీ షాకిచ్చారు టీమిండియా సెలక్టర్లు. విండీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. అదే సమయంలో.. మరో వెటరన్ బ్యాటర్, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆకట్టుకున్న అజింక్య రహానేకు మాత్రం ఈ సిరీస్‌తో మరోసారి వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ దక్కింది. విండీస్‌తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: ఎన్నాళ్లో వేచిన ఉదయం! ఈసారి మా ఆశలు వమ్ము చేయొద్దు ప్లీజ్! అప్పుడు జట్టులో చోటే కరువు.. ఇప్పుడు వైస్ కెప్టెన్‌గా.. నువ్వు సూపర్ ‘హీరో’! ధోని కెప్టెన్సీ అలా ఉంటుంది కాబట్టే! రోహిత్, ద్రవిడ్‌పై అశ్విన్ విసుర్లు! -
అప్పుడు జట్టులో చోటే కరువు.. ఇప్పుడు వైస్ కెప్టెన్‌గా.. నువ్వు సూపర్ ‘హీరో’!
India’s squad for West Indies Tests: టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేకు మంచిరోజులు వచ్చాయి. ఐపీఎల్-2023లో అదరగొట్టిన ఈ మహారాష్ట్ర ఆటగాడు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023 ద్వారా జాతీయ జట్టులో పునరాగమనం చేశాడు. ఒకప్పుడు టీమిండియా వైస్ కెప్టెన్‌గా వెలుగొందిన రహానేకు జట్టులో స్థానమే కరువైన వేళ ఏకంగా ఐసీసీ మెగా పోరులో పాల్గొనే అవకాశం వచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో అదరగొట్టి ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్ దిగిన అతడు తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేశాడు. తద్వారా భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ 46 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో మరోసారి సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు రహానే. అయితే, ఈసారి కేవలం ఆటగాడిగా కాకుండా వైస్ కెప్టెన్ హోదాలో బరిలోకి దిగనున్నాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ డిప్యూటీగా నియమితుడయ్యాడు. ఈ నేపథ్యంలో రహానే అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాడు చిరస్మరణీయ విజయంతో కాగా విరాట్ కోహ్లి గైర్హాజరీలో ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలిపించిన అజింక్య రహానే గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2023 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కొనుగోలు చేయడంతో దశ తిరిగింది. సీఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోని రహానేపై నమ్మకం ఉంచి.. అతడికి వరుస అవకాశాలు ఇచ్చాడు. ఈ క్రమంలో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో 13 బంతుల్లో 27 పరుగులతో రాణించి సీఎస్కేను చాంపియన్‌గా నిలపడంలో సహాయపడ్డాడు. ఐపీఎల్లో దుమ్ములేపాడు! ఇక ఈ ఎడిషన్‌లో మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడిన 35 ఏళ్ల అజింక్య రహానే 326 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 71 నాటౌట్. ఈ నేపథ్యంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికయ్యాడు. ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో తనను తాను నిరూపించుకుని తిరిగి వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చేతిలో ఓటమి పాలై.. వరుసగా రెండోసారి ట్రోఫీ లేకుండానే ఇంటిబాటపట్టింది. ఈ క్రమంలో జూలై 12- ఆగష్టు 13 వరకు వెస్టిండీస్ పర్యటనలో బిజీ కానుంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో ఈ టూర్ మొదలుకానుంది. విండీస్‌తో రెండు టెస్టులకు భారత జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్ The fastest 50 of the season so far and it's from @ajinkyarahane88 💪#MIvCSK #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @ChennaiIPL pic.twitter.com/PZzmJJ999V — JioCinema (@JioCinema) April 8, 2023 -
ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్న రహానే.. విండీస్ నుంచి నేరుగా
టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్య రహానే మరోసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. . కౌంటీ ఛాంపియన్ షిప్ డివిజన్ టూలో లీసెస్టర్‌షైర్ క్రికెట్ క్లబ్‌కు రహానే ప్రాతినిధ్యం వహించనున్నాడు. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ అనంతరం ఇంగ్లండ్‌కు రహానే పయనం కానున్నట్లు తెలుస్తోంది. కాగా దాదాపు ఏడాదిన్నర తర్వాత జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన రహానే.. ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ ఏడాది జనవరిలోనే లీసెస్టర్‌షైర్ క్రికెట్ క్లబ్‌తో రహానే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందంలో భాగంగా 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, రాయల్ లండన్ వన్డే కప్ మొత్తం రహానే ఆడనున్నాడు. కాగా అంతకుముందు 2019 కౌంటీ సీజన్లో హాంప్‌షైర్ తరపున రహానే ఆడాడు. ఇక ఇప్పటికే భారత్ నుంచి ఛతేశ్వర్ పుజారా, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్న సంగతి తెలిసిందే. చదవండి: Virat Kohli: కోహ్లి సంపాదన ఎంతో తెలిస్తే షాక్!.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో! ఎలా సంపాదిస్తున్నాడంటే? -
టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ గా అశ్విన్..!
-
రోహిత్ వద్దు.. వారిద్దరిలో ఒకరని టీమిండియా కెప్టెన్ చేయండి: మాజీ సెలక్టర్
ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి అనంతరం టీమిండియా టెస్టు కెప్టెన్సీపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించి అతడి స్ధానంలో కొత్త సారధిని నియమించాలని పలువురు మాజీలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై భారత మాజీ సెలక్టర్ దేవాంగ్ గాంధీ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. టెస్టుల్లో నుంచి రోహిత్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అర్హత వెటరన్ ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్ ,అజింక్యా రహానెలకు ఉందని దేవాంగ్ గాంధీ అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్లో భారత జట్టును నడిపించే సత్తా రవిచంద్రన్ అశ్విన్‌కు ఉంది. ఒక వేళ అశ్విన్‌కు ఓవర్సీస్లో అంత మంచి ట్రాక్ రికార్డు లేదని భావిస్తే.. రహానే వంటి మరో అద్భుతమైన ఆప్షన్ మీ వద్ద ఉంది. రహానేకు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియా టూర్లో జట్టును ఏ విధంగా నడిపించాడో మనందరీకీ తెలుసు. జట్టుకు చారిత్రాత్మక విజయాలు అందించాడు. కాబట్టి భారత కెప్టెన్సీకి రహానే కూడా మంచి ఎంపిక. అయితే ఒకనొక దశలో రహానే జట్టులో కూడా చోటు కోల్పోయాడు. కానీ అతడు మళ్లీ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. అతడు తన ఫామ్‌ను కొనసాగిస్తాడు అని అశిస్తున్నాను. అదే విధంగా వెటరన్ ఆటగాడు పుజారాకు వెస్టిండీస్ సిరీస్‌లో మరో అవకాశం ఇవ్వాలి. అక్కడ కూడా పుజారా రాణించకపోతే మరో యువ క్రికెటర్‌ను సిద్దం చేసే పనిలో పడాలి" అని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాంధీ పేర్కొన్నాడు. చదవండి: #SureshRaina: ఎల్పీఎల్ చరిత్రలో తొలిసారి వేలం.. కళ్లన్నీ ఆ క్రికెటర్‌పైనే -
రోహిత్‌ను తొలగిస్తే!.. భారత కొత్త టెస్టు కెప్టెన్ ఎవరంటే?
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాను విజేతగా నిలపడంలో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెస్టుల్లో రోహిత్ కెప్టెన్‌గా పనికిరాడని.. అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్‌గా టెస్టు సిరీస్‌లు గెలిచినప్పటికి ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో జట్టును నడిపించడంలో విఫలం కావడంతోనే రోహిత్‌ను తప్పించాలనే డిమాండ్ ఎక్కవగా వినిపిస్తోంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు రోహిత్ శర్మను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తే ప్రత్యామ్నాయం ఎవరనే దానికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు అజింక్యా రహానే. 512 రోజుల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన రహానే అందరికంటే మంచి ప్రదర్శన చేశాడు. అసలు రహానే లేకపోయుంటే డబ్ల్యూటీసీ ఫైనల్ మూడు రోజుల్లోనే ముగిసిపోయేది. తొలి ఇన్నింగ్స్‌లో అతను ఆడిన 89 పరుగుల ఇన్నింగ్స్ టీమిండియా పరువు కాపాడడంతో పాటు మ్యాచ్ ఐదురోజులు జరగడానికి కారణమయ్యాడు. ఇక రోహిత్ స్థానంలో రహానే టీమిండియా టెస్టు కెప్టెన్‌గా సరైనోడని చాలా మంది పేర్కొంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. 2020-21లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. తొలి టెస్టు ఓటమి అనంతరం అప్పటి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నిటీ లీవ్స్ పేరిట స్వదేశానికి వచ్చేశాడు. దీంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న రహానే.. తాత్కాలిక కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. నడిపించడమే కాదు అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు. మెల్బోర్న్ టెస్టులో టీమిండియా గెలవడంలో రహానే పాత్ర కీలకం. కెప్టెన్‌గా అతని తీసుకున్న నిర్ణయాలతో పాటు బ్యాటింగ్‌లో సెంచరీతో మెరవడంతో భారత్ రెండో టెస్టు గెలిచింది. ఇక సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో చారిత్రాత్మక విజయంతో పాటు 2-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో భవిష్యత్తు కెప్టెన్‌గా రహానే పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు రోహిత్ టెస్టు కెప్టెన్‌గా తరచూ విఫలం అవుతుండడంతో అతని స్థానంలో రహానే అయితేనే కరెక్ట్ అని చాలా మంది భావిస్తున్నారు. రహానేలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని.. జట్టు ఓటమి దిశగా ఉన్నప్పుడు సమయస్పూర్తితో వ్యవహరించి మ్యాచ్‌ను గాడిన పెట్టడం రహానేకున్న సమర్థత అని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. ఇప్పుడు కాకపోయినా రోహిత్ తర్వాతి టెస్టు కెప్టెన్ అజింక్యా రహానేనే అవుతాడని అభిమానులు బల్ల గుద్ది చెబుతున్నారు. Ajinkya Rahane's Captaincy Record :- No. Of Matches - 5 Wins - 4 Draw - 1 Loss - 0 👑 Also he led India to the historic series victory against AUS while overcoming a 36 runs all out defeat led by kohli. Petition for BCCI to make Rahane nxt Captain If you want any trophies. pic.twitter.com/tN6qADrzBx — 🄺Ⓐ🅃🄷🄸🅁 1⃣5⃣ (@katthikathir) June 11, 2023 He should be the test captain if they want any kind of good test cricket. Thankyou Ajinkya Rahane. pic.twitter.com/HnpMZ5oLaI — mona (@notafsidekick) June 11, 2023 చదవండి: #RetireRohit: 'కెప్టెన్‌గా దిగిపో.. కాదంటే రిటైర్ అయిపో' WTC Final 2023: 21వ శతాబ్దం మొత్తంలో ఈ ఆసీస్ బౌలర్‌ను మించినోడే లేడు -
WTC Final: ఆదుకుంటారనుకుంటే ఉసూరుమనిపించారు.. ఓటమే తరువాయి..!
వరల్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021 ఫైనల్లో టీమిండియా ఓటమి దాదాపుగా ఖరారైంది. ఈ సీజన్లో కూడా భారత్ టైటిల్ గెలవకుండా రిక్త హస్తాలతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత టీమిండియా సభ్యులు 10 ఏళ్ల భారత ఐసీసీ ట్రోఫీ కలను సాకారం చేస్తారనుకుంటే, దారుణంగా నిరాశపరిచారు. ఆఖరి రోజు కోహ్లి, రహానే అద్భుతం చేసి టీమిండియాకు టైటిల్ అందిస్తారనుకుంటే, ఉసూరుమనిపించారు. కోహ్లి (49) ఆఫ్ స్టంప్ ఆవల వెళ్తున్న బంతిని అనవసరంగా గెలుక్కుని వికెట్ సమర్పించుకుంటే, రహానే (46) తన వంతు ప్రయత్నం చేద్దామనుకుని విఫలమయ్యాడు. మధ్యలో జడేజా (0), శార్దూల్ ఠాకూర్ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఫలితంగా భారత్ 213 పరగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. శ్రీకర్ భరత్ (22) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతనికి జతగా ఉమేశ్ యాదవ్ (0) క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, 444 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది. ఇక టీమిండియాకు ఓటమి మాత్రమే మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 469 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 270/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా... భారత్ 220/7 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. చదవండి: ఆసియా కప్ 2023 విషయంలో పంతం నెగ్గించుకున్న పాకిస్తాన్..! -
'గాయాన్ని సైతం లెక్క చేయని మీ పోరాటం అసమానం'
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియనషిప్ ఫైనల్లో టీమిండియా స్టార్ బ్యటర్లంతా మూకుమ్మడిగా విఫలమైన చోట అజింక్యా రహానే ఒక్కడే పోరాడాడు. లార్డ్ శార్దూల్ ఠాకూర్ సహాయంతో టీమిండియాను ఫాలోఆన్ గండం నుంచి బయటపడేశాడు. 512 రోజుల తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రహానే పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఆసీస్ బౌలర్ల నుంచి బులెట్లా దూసుకొస్తున్న బంతులు రహానేను పలుమార్లు గాయపరిచాయి. అయినా రహానే ఏమాత్రం బెదరకుండా తన ఆటను కొనసాగించాడు. సెంచరీ చేయకపోయినప్పటికి 129 బంతుల్లో 89 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. రహానే చేసిన పోరాటానికైనా టీమిండియా మ్యాచ్ గెలవాలని కోరుకుందాం. ఒకవేళ టీమిండియా ఓడినా రహానే ఇన్నింగ్స్ మాత్రం గుర్తుండిపోతుంది. రహానే స్పూర్తిదాయక ఇన్నింగ్స్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్న వేళ.. అతని భార్య రాధికా దొపోవ్కర్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తన భర్త ఆటతీరుపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా రాసుకొచ్చింది. ''పలుమార్లు వేలికి గాయాలు అయినా స్కాన్ చేయించుకోవడానికి నిరాకరించి పట్టుదలతో బ్యాటింగ్ చేశారు. ఆట పట్ల మీకున్న అంకితభావానికి హ్యాట్సాఫ్. మీ నిస్వార్థత, సంకల్పబలం చాలా గొప్పది.. ఈ రెండింటిని ఒక అంశంలో జోడించి ఇవాళ బ్యాటింగ్ చేసి అందరిలో స్పూర్తి నింపారు. జట్టును గెలిపించడంకోసం మీరు ప్రదర్శించిన స్పిరిట్‌కు గర్విస్తున్నా.. మై రీసైలెంట్ పార్టనర్.. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటా'' అంటూ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Radhika Rahane (@radhika_dhopavkar) కాగా మూడోరోజు ఆట ముగిసిన తర్వాత రహానే మాట్లాడుతూ.. ''ఈరోజు బ్యాటింగ్ చేసిన విధానంపై హ్యాపీగా ఉన్నా. శార్దూల్‌తో కలిసి మంచి భాగస్వామ్యం ఏర్పడడంతో కనీసం 320 నుంచి 330 పరుగులు చేస్తామనుకున్నాం. కానీ అది జరగలేదు. అయితే మా ప్రదర్శన ఇంతటితో ఆగలేదు.. మ్యాచ్ గెలిచేందుకు పోరాడుతాం. నాలుగోరోజు ఉదయం సెషన్ మాకు కీలకం. జడేజా బౌలింగ్ బాగుంది. అతను కీలకంగా మారే అవకాశం ఉంది. సీమ్ బౌలర్స్ కూడా సహకరించే అవకాశం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: రీఎంట్రీలో ఆపద్భాందవుడి పాత్ర.. భారత్ తరపున తొలి బ్యాటర్‌గా -
ఇటువంటి కమ్‌బ్యాక్ ఇప్పటి వరకూ చూడలేదు.. అతడొక అద్భుతం: గంగూలీ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్య రహానే అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర తర్వాత జట్టులోకి వచ్చిన రహానే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లి, రోహిత్, పుజరా వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట.. రహానే తన అద్బుత ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్నాడు. 129 బంతుల్లో 89 పరుగులు చేసిన రహానే.. శార్దూల్ ఠాకూర్ (51)తో కలిసి ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. ఇక రీ ఎంట్రీలో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రహానేపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నప్పటికీ.. రహానే మాత్రం పోరాట పటిమ కనబరిచాడని దాదా కొనియాడాడు. "రహానే 18 నెలల పాటు అతడు టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే రహానే ఈ తరహా ఇన్నింగ్స్ ఆడటం అంత ఈజీ కాదు. అయినప్పటికీ అతడు మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చాలా మంది అతడి కెరీర్ ముగిపోయిందని భావించారు. నిజానికి రహానే కూడా అదే అనుకుని ఉంటాడు. భారత్ క్రికెట్లో ఒక బ్యాటర్ తిరిగి జట్టులో చోటు సంపాదించుకుని తనను తాను నిరూపించుకోవడం అంత సులువు కాదు. రహానే రీ ఎంట్రీ మాత్రం అద్భుతం. గతంలో చాలా మంది ఆటగాళ్లు కొంత కాలం పాటు జట్టుకు దూరంగా ఉండి రీ ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ రహానే వంటి రీ ఎంట్రీ నేను ఇప్పుడు వరకు చూడలేదు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ అతడు మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు అని స్టార్‌స్పోర్ట్స్ షోలో గంగూలీ పేర్కొన్నాడు. చదవండి: WTC Final: మిగతా వారు ఏదో ఒక రకంగా పనికొచ్చారు.. నువ్వేందుకు, దండగ.. ఉమేశ్‌పై ఫ్యాన్స్ ఫైర్ -
512 రోజులు.. కొత్తగా కనిపిస్తున్న రహానే
టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే ఎన్నోసార్లు జట్టుకు ఆపద్బాందవుడయ్యాడు. తన ఇన్నింగ్స్‌లతో ఎన్నోసార్లు టీమిండియాకు విజయాలు అందించాడు. కెరీర్ ఆరంభంలో మూడు ఫార్మాట్లలో ఆడిన రహానే క్రమంగా టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. అయినా సంప్రదాయ ఫార్మాట్లో తన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చాడు. ఎంత బాగా ఆడినా ఏదో ఒక దశలో ఒక బ్యాడ్‌ఫేజ్ అనేది ఉంటుంది. ఆ సమయంలో ఎవరికైనా అన్ని ప్రతికూలంగానే ఉంటాయి. అజింక్యా రహానేకు కూడా ఆ ఇబ్బంది తప్పలేదు. రెండేళ్ల క్రితం సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రహానే ఘోర ప్రదర్శన కనబరిచాడు. అంతే దెబ్బకు టీమిండియాలో చోటు కోల్పోయాడు. జాతీయ జట్టుకు దూరమైనప్పటికి రహానే పెద్దగా బాధపడలేదు. ఏదో ఒకరోజు అవకాశం మళ్లీ తనను వెతుక్కుంటూ వస్తుందని నమ్మాడు. అందుకు తగ్గట్టుగానే దేశవాలీ క్రికెట్ అయిన రంజీ ట్రోపీ సహా మిగతా టోర్నీల్లో పాల్గొని సెంచరీలతో చెలరేగినా రహానేకు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారిపోయింది. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి. ఇంతలో ఐపీఎల్ 2023 సీజన్ వచ్చింది. రహానేను పెద్దగా ఎవరు కొనడానికి ఆసక్తి చూపలేదు. దీంతో సీఎస్కే రూ. 50 లక్షల కనీస ధరకే రహానేను సొంతం చేసుకుంది. అయితే రహానే అప్పటికే పరుగుల దాహంతో ఉన్నాడు. ఆకలి మీద ఉన్న సింహం పంజా విసిరితే ఎలా ఉంటుందో అప్పటికి ఎవరికి తెలియదు. కానీ రహానేను సీఎస్కే కెప్టెన్ ధోని నమ్మాడు. ధోని నమ్మకాన్ని రహానే నిలబెట్టాడు. గతంలో ఐపీఎల్ ఆడినప్పటికి రహానేలో ఇంత వేగవంతమైన ఆట ఎప్పుడు చూసింది లేదు. ఈ సీజన్లో 14 మ్యాచ్‌లాడిన రహానే 172.49 స్ట్రైక్‌రేట్‌తో 326 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో చూపెట్టిన సూపర్ ఫామ్ రహానేను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక చేసింది. అయితే ఐపీఎల్ సమయంలో ఏప్రిల్ 23న మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతూ.. ''ఇది సరిపోదు.. నా బెస్ట్ ఇంకా రావాల్సి ఉంది'' అంటూ కామెంట్ చేశాడు. అలా 512 రోజుల విరామం తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రహానే సరికొత్తగా కనిపించాడు. ఐపీఎల్ తన ఆటతో దూకుడుగా కనిపించిన అదే రహానే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో శాంతంగా కనిపించాడు. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడుతూ కొత్త రహానేను చూపెట్టాడు. ఆసీస్ బౌలర్లు చెలరేగుతున్న వేళ కష్టాల్లో ఉన్న టీమిండియాను గట్టెక్కించే బాధ్యతను తీసుకున్నాడు. వరుసగా వికెట్లు పడుతున్నా తాను మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ వచ్చాడు. తొలుత జడేజాతో కలిసి 70 పరుగులు జోడించిన రహానే.. ఆపై శార్దూల్ ఠాకూర్‌తో కలిసి ఏకంగా 109 పరుగులు జోడించి టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఒక దశలో 200 లోపే చాప చుట్టేస్తుందనుకున్న తరుణంలో శార్దూల్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన రహానే టీమిండియా పరువు కాపాడాడు. చివరికి 129 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 89 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తన బెస్ట్ ఇవ్వాల్సి ఉంది అని చెప్పిన మాటకు కట్టుబడి తన కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన రహానే రెండు వారాల వ్యవధిలోనే అభిమానులకు తనలోని డబుల్ వర్షన్ చూపించాడు. 96 at Durban 118 at Wellington 103 at Lord's 147 at Melbourne 126 at Colombo 108* at Jamaica 81 at Nottingham 112 at Melbourne 89 at Oval The crisis man at Overseas, Rahane. pic.twitter.com/LW52iqOAtH — Johns. (@CricCrazyJohns) June 9, 2023 TAKE A BOW, AJINKYA RAHANE. 89 in 129 balls with 11 fours and a six. An innings to remember on the Test return, what a knock. He made a grand comeback! No words can describe his contribution today. pic.twitter.com/N4QsbvWiVz — Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2023 చదవండి: కష్టమొచ్చిన ప్రతీసారి నేనున్నానంటూ.. నొప్పిని భరిస్తూనే -
కష్టమొచ్చిన ప్రతీసారి నేనున్నానంటూ.. నొప్పిని భరిస్తూనే
టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మరోసారి తన బ్యాటింగ్ విలువను చూపించాడు. ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో లార్డ్ శార్దూల్(#LordShardul) మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. టీమిండియా కష్టాల్లో ఉన్న ప్రతీసారి నేనున్నానంటూ భరోసా ఇస్తున్న శార్దూల్ మరోసారి దానిని నిలబెట్టుకున్నాడు. 2020లో ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన చారిత్రాత్మక టెస్టులో శార్దూల్ హాఫ్ సెంచరీని అంత తొందరగా ఎవరు మరిచిపోరు. ఆ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్, మిడిలార్డర్ కుప్పకూలిన వేళ వారిని సమర్థంగా ఎదుర్కొన్న శార్దూల్.. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ఏడో వికెట్‌కు వందకు పైగా పరుగులు జోడించారు. ఈ క్రమంలో 115 బంతుల్లో 67 పరుగులతో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించడమే గాక 2-1తేడాతో ఆసీస్‌ను సొంత గడ్డపై ఓడించిన చారిత్రక సిరీస్ విజయాన్ని అందుకుంది. మరో విశేషమేమిటంటే ఈ సిరీస్ నుంచి కోహ్లి మధ్యలోనే తప్పుకోవడంతో రహానే కెప్టెన్సీలో టీమిండియా టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఇంగ్లండ్‌తో 2021లో ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ అర్థసెంచరీలు సాధించడమే గాక బౌలింగ్‌లోనూ వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఆసీస్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో మూడోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఐదు పరుగులు చేసిన కేఎస్ భరత్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. రహానే ఒంటరిపోరాటం చేస్తున్నా లాభం లేదు.. ఇంకేముంది.. మరో 40 లేదా 50 పరుగుల్లోపూ టీమిండియా ఆలౌట్ అయిపోతుంది.. ఆస్ట్రేలియా టీమిండియాను ఫాలోఆన్ ఆడించి భారీ విజయం నమోదు చేస్తుంది.. ఇదే మనం చూడబోతున్నాం అంటూ టీమిండియా ఫ్యాన్స్ నిట్టూర్చారు. కానీ అప్పుడు క్రీజులోకి వచ్చాడు ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్. అయితే వచ్చీ రావడంతోనే కమిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆసీస్ పేసర్ల జోరు చూస్తుంటే శార్దూల్‌ను ఔట్ చేయడం పెద్ద కష్టమేమి కాదనుకున్నారు. దీనికి తోడు కమిన్స్ బౌలింగ్‌లో వరుసగా రెండుసార్లు గాయపడ్డాడు. కమిన్స్ వేగంతో విసిరిన బంతులు శార్దూల్ చేతిని టార్గెట్ చేశాయి. అయితే నొప్పిని భరిస్తూనే ఆసీస్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొంటున్నాడు. శార్దూల్ చేసిన 36 పరుగులు టీమిండియా ఇన్నింగ్స్‌కు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా ఒంటరిపోరాటం చేస్తున్న రహానేకు అండగా నిలబడేందుకు ఒక బ్యాటర్ కావాల్సిన సమయంలో శార్దూల్ ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఎక్కువగా రహానేకు స్ట్రైక్ ఇస్తూ మధ్యమధ్యలో తాను పరుగులు చేశాడు. ఇద్దరు కలిసి ఏడో వికెట్‌కు 108 పరుగులు జోడించి అజేయంగా సాగుతున్నారు. లంచ్ విరామ సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. రహానే 89 బ్యాటింగ్, శార్దూల్ 36 పరుగులు బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు. అయితే శార్దూల్ ఆట ఇంకా ముగియలేదు.. మరోసారి హాఫ్ సెంచరీ చేస్తాడా.. లేదంటే ఏకంగా సెంచరీతో మెరుస్తాడా అనేది చూడాలి. -
రీఎంట్రీలో ఆపద్భాందవుడి పాత్ర.. భారత్ తరపున తొలి బ్యాటర్‌గా
టీమిండియా స్టార్ అజింక్యా రహానే టెస్టు పునరాగమనం ఘనంగా చాటుకున్నాడు. దాదాపు 512 రోజుల తర్వాత నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ ద్వారా టెస్టు ఆడుతున్న రహానే అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా కష్టకాలం ఎదుర్కొంటున్న సమయంలో రహానే ఆపద్భాందవుడి పాత్ర పోషిస్తూ సూపర్ ఫిఫ్టీతో మెరిశాడు. ఆసీస్ పేసర్ల దాటికి బ్యాటింగ్ చేయడానికి ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో రహానే 92 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ సాధించాడు. రహానే టెస్టు కెరీర్లో ఇది 26వ అర్థశతకం కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే అజింక్యా రహానే టీమిండియా తరపున డబ్ల్యూటీసీ ఫైనల్లో అర్థసెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 2021లో టీమిండియా కివీస్‌తో తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడినప్పటికి ఆ మ్యాచ్‌లో ఒక్క భారత్ బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ అందుకోలేకపోయాడు. అప్పటి మ్యాచ్‌లోనూ రహానే 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. తాజాగా ఆసీసీతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ టీమిండియా బ్యాటింగ్ లైనప్ కుదేలైనప్పటికి రహానే ఒక్కడే ఒంటరిపోరాటం చేస్తూ టీమిండియాను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవలే ఐపీఎల్ సీఎస్కే తరపున అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రహానే అదే ఫామ్‌ను ఇక్కడా కంటిన్యూ చేయడం సంతోషదాయకం. టి20ల్లో తన వేగవంతమైన ఆటతో అలరించిన రహానే టెస్టులకు వచ్చేసరికి తనలోని టెస్టు స్పెషలిస్ట్‌ను బయటికి తీశాడు. #WATCH | The Oval, London: This has been a pleasant and surprising morning as yesterday we had a very disappointing result. Shardul Thakur is batting very maturely and the result we have now is that they (Rahane and Thakur) have given us a fighting chance. Yesterday it looked… pic.twitter.com/56I8gMWmCz — ANI (@ANI) June 9, 2023 -
అదృష్టమంటే రహానేదే.. అవుటై కూడా బతికిపోయాడు! వీడియో వైరల్
ది ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడిన సంగతి తెలిసిందే. తొలుత బౌలింగ్‌లో విఫలమైన భారత జట్టు.. అనంతరం బ్యాటింగ్‌లో కూడా అదే తీరును కనబరిచింది. రోహిత్ శర్మ(15), విరాట్ కోహ్లి(14), పుజారా(14), గిల్(13) వంటి స్టార్ ఆటగాళ్లు తమ ఆటతీరుతో తీవ్ర నిరాశపరిచారు. ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులోఅజింక్య రహానే(29), కేఎస్ భరత్(5) పరుగులతో ఉన్నారు. దీంతో జట్టును అదుకునే బాధ్యత సీనియర్ ఆటగాడు రహానేపై పడింది. అదృష్టం కలిసొచ్చి.. ఈ మ్యాచ్‌లో అజింక్య రహనేకు అదృష్టం కలిసొచ్చింది. ఈ రెండో రోజు మూడో సెషన్లో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వేసిన ఓ బంతికి రహనే వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ కూడా ఔట్ అని వేలు పైకెత్తడంతో రహానే రివ్యూ కోరాడు. ఇక్కడే అస్సలు ట్విస్టు చోటు చేసుకుంది. రిప్లేలో కమ్మిన్స్ నోబాల్ వేసినట్లు తేలింది. అతడు బంతిని వేసే క్రమంలో ఫ్రంట్ లైట్ దాటేశాడు. దీంతో రహానే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఒక వేళ అది నోబాల్ కాకపోయింటే రహానే కచ్చితంగా పెవిలియన్‌కు చేరాల్సిందే. ఎందుకంటే బంతి స్టంప్స్‌ను హిట్టింగ్ చేస్తున్నట్లు రిప్లేలో కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: WTC Final: ఐపీఎల్లో దుమ్మురేపారు.. ఇక్కడ మాత్రం చేతులెత్తేశారు! అట్లుంటది మనవాళ్ల తోటి pic.twitter.com/23DQZrKiYa — Sanju Here 🤞👻 (@me_sanjureddy) June 8, 2023 -
WTC Final 2023: అజింక్య రహానే అరుదైన రికార్డు..
టెస్టు క్రికెట్లో టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్య రహానే అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 100 క్యాచ్‌లు అందుకున్న ఏడో భారత ఆటగాడిగా రహానే రికార్డులకెక్కాడు. ఆస్ట్రేలియాతో జరగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో పాట్ కమిన్స్ క్యాచ్ పట్టిన రహానే.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ జాబితాలో మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ 209 క్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అదే విధంగా ప్రపంచక్రికెట్లో కూడా ఈ ఘనత సాధించిన లిస్టులో ద్రవిడే తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే (205) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (15), శుభ్‌మన్ గిల్ (13), చతేశ్వర్ పుజారా (14), విరాట్ కోహ్లి (14) దారుణంగా నిరాశపరిచారు. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానే(29), కేఎస్ భరత్(5) పరుగులతో ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైంది. చదవండి: WTC Final: ఆసీస్ బౌలర్ సూపర్ డెలివరీ.. దెబ్బకు గిల్‌కు ప్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్ -
పీకల్లోతు కష్టాల్లో భారత్.. భారం మొత్తం అతడిపైనే! లేదంటే అంతే సంగతి
ఆస్ట్రేలియాతో జరగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా టాపర్డర్ కుప్పకూలింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానే(29), కేఎస్ భరత్(5) పరుగులతో ఉన్నారు. ఇక టాప్ ఆర్డర్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ (15), శుభ్‌మన్ గిల్ (13), చతేశ్వర్ పుజారా (14), విరాట్ కోహ్లి (14) దారుణంగా నిరాశపరిచారు. అయితే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(48) కౌంటర్ అటాక్ చేయడంతో టీమిండియా 150 మార్క్ అయినా దాటగలిగింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌటైంది. 327/3 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. మరో 142 పరుగులు ఆదనంగా చేసి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ శతకాలతో చెలరేగారు. భారం మొత్తం అతడిపైనే.. ఇక 151 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టల్లో పడిన టీమిండియాను గట్టెక్కించే భారమంతా సీనియర్ రహానేపైనే ఉంది. ఇంగ్లండ్ పిచ్‌లపై ఆడిన అనుభవం ఉన్న ఈ వెటరన్ ఆటగాడు కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం మరోసాకి ఏర్పడింది. దాదాపు ఏడాది తర్వాత జట్టులోకి వచ్చిన రహానే.. తన అనుభవాన్ని నిరూపించుకోవడానికి ఇదొక మంచి అవకాశం. మరో బ్యాటర్ భరత్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే బాధ్యతను రహానే తీసుకోవాలి. కనీసం తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులు మార్క్‌ను భారత జట్టు అందుకుంటే.. ఆసీస్‌కు పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాగా ఈ మ్యాచ్‌లో రహానేకు ఇప్పటికే ఓ ఛాన్స్ కూడా లభించింది. 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కమిన్స్ బౌలింగ్‌లో రహానే ఎల్బీడబ్ల్యూ అయినా... అదృష్టవశాత్తూ అది నోబాల్ కావడంతో అతను బతికిపోయాడు. ఈ అవకాశాన్ని రహానే సద్వినియోగపరుచుకుంటాడో లేదో వేచి చూడాలి. చదవండి: WTC Final: వాళ్లకేమో అలా.. మనకెందుకిలా?! -
WTC Final: అతను సెంచరీ కొట్టాడా టీమిండియా గెలిచినట్లే..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లతో జరిగే ప్రత్యేక కార్యక్రమం కూడా అయిపోయింది. కెప్టెన్లు ఇద్దరూ డబ్ల్యూటీసీ గదతో ఫోటో షూట్లో కూడా పాల్గొన్నారు. ఫైనల్‌కు చేరే క్రమంలో ఇరు జట్ల కెప్టెన్లు తమ అనుభవాలను పంచుకున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో తమ ప్రణాళికలు, జట్టు కూర్పు తదితర విషయాలను షేర్ చేసుకున్నారు. అంతిమంగా ఇరు జట్ల కెప్టెన్లు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రేపు (జూన్ 7) మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభంకానుంది. The Captains 👍 The Championship Mace 👌 The Big Battle 💪 All In Readiness for the #WTC23#TeamIndia pic.twitter.com/Ep10vb2aj5 — BCCI (@BCCI) June 6, 2023 ఇదిలా ఉంటే.. ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్‌కు ముందు ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరలవుతుంది. ఈ విషయం ముఖ్యంగా టీమిండియా అభిమానులను తెగ సంతోషానికి గురి చేస్తుంది. అదేంటంటే.. టీమిండియా బ్యాటర్ అజింక్య రహానే టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన ప్రతిసారి టీమిండియా ఓడిపోలేదు. రహానే తన టెస్ట్ కెరీర్లో 12 సెంచరీలు చేయగా.. వాటిలో టీమిండియా 9 మ్యాచ్‌ల్లో గెలుపొంది, 3 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. India never lost a Test match whenever Ajinkya Rahane scored a century. Can the birthday boy repeat it in the World Test Championship final? pic.twitter.com/MJCka7Rnnp — CricTracker (@Cricketracker) June 6, 2023 రహానే సెంచరీ చేసిన గత ఐదు సందర్భాల్లో టీమిండియా ప్రతి మ్యాచ్ గెలుపొందింది. ఈ సెంటిమెంటే ప్రస్తుతం టీమిండియా అభిమానుల సంతోషానికి కారణం. ఐపీఎల్ 2023లో సత్తా చాటి, దాదాపు ఏడాదిన్నర తర్వాత తిరిగి భారత జట్టులోకి వచ్చిన రహానే తన ఐపీఎల్ ఫామ్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్లో కొనసాగించి సెంచరీ చేస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇదే జరిగితే టీమిండియా గెలుపు గ్యారెంటీ అని ధీమాగా ఉన్నారు. రహానే సెంచరీల సెంటిమెంట్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ, గెలుపు తమదేనని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: WTC Final: అంతా సిద్ధం.. ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్ల ఫోటోషూట్ -
Rahane Birthday: ఐపీఎల్ 2023తో బజ్ గేమ్ మొదలుపెట్టిన రహానే
టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే ఇవాళ (జూన్ 6) 35వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా బీసీసీఐ అతనికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. టీమిండియాకు రహానే కాంట్రిబ్యూషన్‌ను అంకెల రూపంలో (192 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 8268 పరుగులు, 15 సెంచరీలు) తెలియజేస్తూ ఓ ట్వీట్ చేసింది. అంతర్జాతీయ క్రికెట్లోకి జింక్స్ రీఎంట్రీ.. వయసు పైబడటం, ఆటలో వేగం లేకపోవడం, ఫామ్ కోల్పోవడం, యువ ఆటగాళ్ల ఎంట్రీతో అవకాశాలు రాకపోవడం వంటి వివిధ కారణాల చేత దాదాపుగా రిటైర్మెంట్ ప్రకటించే స్టేజ్ వరకు వెళ్లిన జింక్స్ (రహానే ముద్దు పేరు).. ఐపీఎల్-2023తో అనూహ్యంగా ఫ్రేమ్‌లోకి వచ్చాడు. ఎవరో గాయపడటంతో సీఎస్కేలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబైకర్.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, ఏకంగా టీమిండియా టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. 1️⃣9️⃣2️⃣ intl. matches 8️⃣2️⃣6️⃣8️⃣ intl. runs 1️⃣5️⃣ intl. centuries 💯 Here's wishing @ajinkyarahane88 a very happy birthday. 🎂👏🏻 #TeamIndia pic.twitter.com/162jbQlk2z — BCCI (@BCCI) June 6, 2023 అంతే కాకుండా కేఎల్ రాహుల్ గాయపడటంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత తుది జట్టులో కూడా చోటు కన్ఫర్మ్ చేసుకున్నాడు. 2022 జనవరిలో సౌతాఫ్రికాలో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన జింక్స్.. దాదాపు ఏడాదిన్నర తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేయనున్నాడు. ఐపీఎల్ 2023లో రహానే 2.0.. ఐపీఎల్ 2023లో ఆడే అవకాశాన్ని అనూహ్య పరిణామాల మధ్య దక్కించుకున్న జింక్స్.. ఈ సీజన్లో తనలోని కొత్త యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. రహానే 2.0గా ఫ్యాన్స్‌ను మెప్పించాడు. జిడ్డు బ్యాటర్ అన్న అపవాదును చెరిపివేస్తూ.. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంతో పాటు తన జట్టులో విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్ మొత్తం ఎదురుదాడే లక్ష్యంగా బరిలోకి దిగిన జింక్స్.. 11 ఇన్నింగ్స్‌ల్లో 172.49 స్ట్రయిక్‌రేట్‌తో 2 అర్ధసెంచరీల సాయంతో 326 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన ఆధారంగానే అతను టెస్ట్ జట్టులో చోటు కొట్టేశాడు. ఐపీఎల్ 2023తో బజ్ గేమ్ మొదలెట్టిన రహానే ఇదే ప్రదర్శనను డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. చదవండి: WTC Final: రోహిత్ శర్మకు గాయం..? టీమిండియా అభిమానుల ఆందోళన -
టీ - 20 అయినా... టెస్ట్ అయినా ఒకటే ఆసీస్ కి రహానే స్వీట్ వార్నింగ్..
-
అదే దూకుడు కొనసాగిస్తా.. టెస్టా, టీ20 మ్యాచ్ అన్నది ఆలోచించను: రహానే
పోర్ట్స్మౌత్: ఇటీవల ఐపీఎల్లో కొనసాగించిన దూకుడునే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లోనూ కనబరుస్తానని సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అన్నాడు. కొన్నాళ్ల విరామం తర్వాత జట్టులోకి రావడం ఆనందంగా ఉందన్నాడు. ప్రాక్టీస్ సెషన్లో తలమునకలైన అతను మాట్లాడుతూ ‘18, 19 నెలల అనంతరం మళ్లీ జట్టులోకి వచ్చాను. గతంలో ఏం జరిగింది. ఇప్పుడేం జరిగిందని అదే పనిగా ఆలోచిస్తూ కూర్చోను. టీమిండియా తరఫున తాజాగా ఆటను ఆరంభిస్తా. మైదానంలో నేనేం చేయగలనో అదే చేస్తాను’ అని రహానే తెలిపాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడటాన్ని చాలా బాగా ఆస్వాదించానన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో చక్కగా బ్యాటింగ్ చేశానని, అంతకుముందు కూడా దేశవాళీ క్రికెట్లోనూ రాణించానని చెప్పుకొచ్చాడు. ‘ఇప్పుడు కూడా అదే మైండ్‌సెట్‌తో ఆడతాను. ఇది టెస్టా... టి20 మ్యాచా అన్నది ఆలోచించను. నా సహజశైలిలో నేను బ్యాటింగ్ చేస్తాను’ అని రహానే అన్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా పటిష్టంగా ఉందన్నాడు. చదవండి: #Ruturaj Gaikwad: ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా యువ ఓపెనర్.. ఫోటోలు వైరల్ -
WTC Final 2023: కోహ్లి కాదు.. ఓవల్‌లో రోహిత్ శర్మనే కింగ్..!
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జూన్ 7-11 మధ్యలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం ఇరు జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. జట్ల బలాబలాలు, విజయావకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయన్న విషయాలు పక్కన పెడితే.. ఓవల్ మైదానంలో ఇరు జట్ల ట్రాక్ రికార్డు ఏమంత బాగోలేదు. ఈ వేదికపై ఆసీస్ ఆడిన 38 మ్యాచ్‌ల్లో ఏడింటిలో విజయం సాధించగా.. భారత జట్టు ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలోనే మాత్రమే గెలుపొందింది. కోహ్లి, పుజారా, రహానేల చెత్త రికార్డు.. ఓవల్‌లో హిట్‌మ్యానే కింగ్ ఓవల్‌లో భారత ఆటగాళ్లు కోహ్లి, రహానే, పుజారాలకు చెత్త రికార్డు ఉంది. ఇక్కడ విరాట్ కోహ్లి ఆడిన 3 మ్యాచ్‌ల్లో 28.16 సగటున కేవలం 169 పరుగులు మాత్రమే చేశాడు. పుజారా ఓవల్‌లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 19.50 సగటున 117 పరుగులు చేశాడు. రహానే ఇక్కడ ఆడిన 3 మ్యాచ్‌ల్లో 9.16 సగటున 55 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాకు అత్యంత కీలకమైన ముగ్గురు ఆటగాళ్లకు ఓవల్‌లో మెరుగైన రికార్డు లేకపోవడం ఫ్యాన్స్‌ను కలవరపెడుతుంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు ఇక్కడ మెరుగైన రికార్డు ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. రోహిత్ శర్మ ఓవల్ మైదానంలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడి 127 పరుగులు చేశాడు. 2021 పర్యటనలో హిట్‌మ్యాన్ సెంచరీ చేశాడు. జడేజా ఇక్కడ 2 మ్యాచ్‌ల్లో 42 సగటున 126 పరుగులు చేసి 11 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా జట్టును కూడా పరిగణలోకి తీసుకుంటే, ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్న ఇరు జట్ల సభ్యుల్లో ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు ఓవల్‌లో మెరుగైన రికార్డు ఉంది. స్టీవ్ స్మిత్ ఇక్కడ రెండు శతకాలు బాదాడు. -
ఫామ్‌లో ఉన్నాడు.. రికార్డులు బద్దలు కొట్టడం కష్టమేమి కాదు
అజింక్యా రహానే కొన్నేళ్లుగా టీమిండియా తరపున టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతూ వచ్చాడు. గతేడాది సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో దారుణ వైఫల్యం తర్వాత రహానే జట్టులో చోటు కోల్పోయాడు. అయితే రహానే పెద్దగా ఏం బాధపడలేదు. ఏదో ఒకరోజు అవకాశం తనను వెతుక్కుంటూ వస్తుందని భావించాడు. అయితే ఐపీఎల్‌ను అందుకు మూలంగా మార్చుకున్నాడు. ఈ సీజన్లో సీఎస్కే తరపున ఆడిన రహానే ఎవరు ఊహించని రీతిలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆరంభంలో ఒకటి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రహానే.. ఆ తర్వాత వరుసగా 14 మ్యాచ్‌లాడి 172.49 స్ట్రైక్‌రేట్‌తో 326 పరుగులు సాధించాడు.ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శన రహానేను తిరిగి టీమిండియా జట్టులోకి ఎంపికయ్యేలా చేసింది. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు తుది జట్టులో చోటు సంపాదించాడు. ఒకప్పుడు రెగ్యులర్ టెస్టు బ్యాటర్ అయిన రహానే శ్రేయాస్ అయ్యర్ గైర్హాజరీతో మరోసారి బ్యాటింగ్‌లో కీలకం కానున్నాడు. ఇక టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య లండన్‌లోని ఓవల్ స్టేడియం వేదికగా జూన్ ఏడు నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. రహానేను ఊరిస్తున్న రికార్డులు.. ఈ నేపథ్యంలోనే రహానే ముందు పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న రహానే ఈ రికార్డులు బద్దలు కొట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇప్పటి వరకు టీమిండియా తరపున 82 టెస్టులాడిన రహానే 4931 పరుగులు చేశాడు. మరో 69 పరుగులు చేస్తే టెస్టు క్రికెట్లో 5వేల పరుగుల మార్క్ అందుకుంటాడు. రహానే ఖాతాలో టెస్టుల్లో 12 సెంచరీలు, 25 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీమిండియా అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న రహానే.. ఇప్పటి వరకు ఆడిన 82 మ్యాచ్‌ల్లో 99 క్యాచ్‌లు పట్టాడు. మరొకటి పడితే వంద క్యాచ్‌లు పూర్తి చేసుకుంటాడు. ఇక రహానే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 12,865 పరుగులు చేశాడు. మరో 135 పరుగులు చేస్తే 13వేల పరుగులు సాధించినట్లవుతుంది. ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన భారత్ ఇప్పుడు మళ్లీ ఆసీస్‌తోనే ఫైనల్ ఆడనుంది. ఈ ఫైనల్ కోసం టీమిండియా మూడు బ్యాచ్‌లుగా లండన్‌కు చేరుకుంది. చివరి బ్యాచ్‌లో అజింక్యా రహానేతో పాటు కేఎస్ భరత్, శుభ్‌మాన్ గిల్, షమీ, రవీంద్ర జడేజాలు వచ్చారు. వీరంతా ఐపీఎల్ ఫైనల్ ఆడిన సీఎస్కే, గుజరాత్ టైటాన్స్‌లో సభ్యులు. మరోవైపు ఐపీఎల్ తర్వాత.. యువ ఆటగాళ్లకు డబ్ల్యూటీసీ ఫైనల్ లో చోటు దక్కింది. తాజా రిపోర్టుల ప్రకారం రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో మరొకరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్‌ను రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంచుకున్నారు. ఎందుకంటే గైక్వాడ్‌కు జూన్ 3న వివాహం జరగబోతుంది. ఈ కారణంగా అతడు భారత జట్టుతో జూన్ 5 తర్వాతే కలవనున్నాడు. దీంతో అతడి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వికి అవకాశం కల్పించారు సెలక్టర్లు. స్టాండ్ బై ప్లేయర్స్ లిస్టులో జైస్వాల్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడనున్నాడు. చదవండి: రోహిత్‌కు కలిసొచ్చిన ఓవల్.. మళ్లీ విజృంభించేనా? -
ధోని.. అతడి సేవలను అస్సలు ఉపయోగించుకోవడం లేదు! ఫైనల్ మాత్రం తనదే!
IPL 2023 Final- CSK vs GT: ‘‘కెప్టెన్ ధోని అతడి సేవలను అస్సలు ఉపయోగించుకోవడం లేదు. బ్యాటింగ్ లేదంటే బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వడం లేదు. నాకు తెలిసి అతడి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించి ఉంటాడు. ఈరోజు అతడిదే అవుతుందనుకుంటున్నా’’ అని టీమిండియా మాజీ బ్యాటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీని ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. 10 ఇన్నింగ్స్ ఆడి కాగా ఐపీఎల్-2023లో మొయిన్ అలీ చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, జట్టులో సీనియర్ అయిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌కు ఈ సీజన్లో పెద్దగా ఆడే అవకాశం రాలేదు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన అతడు 10 ఇన్నింగ్స్ ఆడి 124 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 23. ఇక బౌలింగ్‌పరంగా చూస్తే.. 7.50 ఎకానమీతో 9 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం (మే 28) డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్- చెన్నై ఫైనల్లో తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా సీఎస్కే బ్యాటింగ్ ఆర్డర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. మొయిన్ అలీ- ఎంఎస్ ధోని (PC: IPL) జడ్డూ బ్యాట్‌తో మెరుస్తాడు ‘‘ధోని ఎందుకో మొయిన్ అలీ సేవలను ఉపయోగించుకోవడం లేదు. ఇక జడేజా ఈరోజు బ్యాట్‌తో మెరుస్తాడనుకుంటున్నా. ఎందుకంటే.. అహ్మదాబాద్ పిచ్‌పై అతడి బౌలింగ్ వర్కౌట్ కాకపోవచ్చు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండబోతోందనపిస్తోంది. దూబేను అలా ట్రాప్ చేస్తారు ఇక శివం దూబే స్పిన్ ఆడటంలో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. గత మ్యాచ్‌లో నూర్ అహ్మద్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. కాబట్టి గుజరాత్ టైటాన్స్ ఈసారి కూడా అతడిని ఫాస్ట్ బౌలింగ్‌తో కాకుండా స్పిన్నర్లతో ట్రాప్ చేయడం పక్కా. రహానే నంబర్ 3 మరోవైపు.. అజింక్య రహానే.. చెన్నైలో పెద్దగా ప్రభావం చూపలేదు. చెన్నై వెలుపలే అతడు ఎక్కువగా పరుగులు రాబట్టాడు. రహానే ఇక్కడ కచ్చితంగా రన్స్ సాధిస్తాడనే అనుకుంటున్నా. రహానే మూడో స్థానంలో దిగితే బాగుంటుంది. నిజానికి సీఎస్కే వారి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేపై ఎక్కువగా ఆధారపడుతోంది. రుతు, కాన్వే అద్భుత ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి మహ్మద్ షమీ వీరిద్దరని కచ్చితంగా టార్గెట్ చేస్తాడు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా ఈ సీజన్లో కాన్వే ఇప్పటి వరకు 14 ఇన్నింగ్స్‌లో 625 పరుగులు, రుతురాజ్ 14 ఇన్నింగ్స్ ఆడి 564 పరుగులు సాధించారు. ఇక గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7.30 గంటలకు సీఎస్కే- గుజరాత్ మధ్య టైటిల్ పోరు జరుగనుంది. చదవండి: విరాట్ సర్, ఐయామ్ సారి, మీ కెప్టెన్సీలో ఆడాలని ఉంది.. నవీన్ ఉల్ హక్ రియాక్షన్ సూర్యను చూసి నేర్చుకో.. నాకు దాదా ఆరోజు అలా చెప్పాడు.. తిలక్ నువ్వు కూడా! Wait till you see Cherry’s POV 💛📹#WhistlePodu #Yellove 🦁 @deepak_chahar9 pic.twitter.com/aLsrU6ALxl — Chennai Super Kings (@ChennaiIPL) May 27, 2023 -
ఐపీఎల్ 2023లో అతి పెద్ద సర్ప్రైజ్ ఎవరు..?
ఐపీఎల్ 2023 సీజన్లో కొందరు వెటరన్లు అనూహ్యంగా సత్తా చాటారు. వీరిలో చాలా మంది తమ గతానికి భిన్నంగా రాణించి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కొందరు తమ సహజ శైలికి భిన్నంగా రెచ్చిపోతే.. మరికొందరు తమ యుక్త వయసులో కూడా ప్రదర్శించని దూకుడును ప్రదర్శించి తమ జట్ల విజయాల్లో ప్రధాన పాత్ర పోషించారు. లేటు వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా అద్భుత ప్రదర్శనలు చేసిన ఆ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం. ఈ జాబితాలో ముందుంగా చెప్పుకోవాల్సింది గుజరాత్ పేసర్ మోహిత్ శర్మ పేరు. సరైన అవకాశాలు రాక, చాలాకాలంగా టీమిండియాతో పాటు ఐపీఎల్‌కు కూడా దూరంగా ఉండిన 34 ఏళ్ల మోహిత్‌ను ఈ ఏడాది వేలంలో గుజరాత్ టైటాన్స్ నామమాత్రపు 50 లక్షల ధరకు సొంతం చేసుకుంది. ఈ రైట్ ఆర్మ్ పేసర్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఈ సీజన్లో ఊహించిన దానికి మించి రాణిస్తున్నాడు. 13 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ముంబైతో జరిగిన క్వాలిఫయర్-2లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి కెరీర్ అత్యుత్తమ గణాంకాలు (5/10) నమోదు చేశాడు. ఈ సీజన్‌కు ఇతనే అతి పెద్ద సర్ప్రైజ్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత అజింక్య రహానే.. 35 ఏళ్ల ఈ వెటరన్ బ్యాటర్‌ను సీఎస్కే ఈ ఏడాది వేలంలో కనీస ధర 50 లక్షలకు సొంతం చేసుకుంది. రహానే.. తనకు సరైన అవకాశాలు రావడం లేదన్న కసితో ఆడాడో ఏమో కానీ, అతని శైలికి భిన్నంగా రెచ్చిపోయి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి చెన్నై విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. రహానే ఈ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడి 169.89 స్ట్రయిక్ రేట్‌తో 2 అర్ధసెంచరీల సాయంతో 299 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన కారణంగా అతను టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు. పియుశ్ చావ్లా.. 35 ఏళ్ల ఈ వెటరన్ స్పిన్నర్‌ను ఈ ఏడాది వేలంలో ముంబై ఇండియన్స్ 50 లక్షలకు సొంతం చేసుకుంది. అంతా అయిపోయిందనుకున్న దశలో ఐపీఎల్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పియుశ్.. అంచనాలకు మించి రాణించి, తన 15 ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా 16 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టి, ముంబై క్వాలిఫయర్-2 దశ వరకు చేరడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతను ఐపీఎల్లో అత్యధిక వికెట్లు (179) సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. వీరి తర్వాత చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేసిన వెటరన్లలో ఇషాంత్ శర్మ ఉన్నాడు. 35 ఏళ్ల ఈ వెటరన్ పేసర్‌ను ఈ ఏడాది వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ 50 లక్షలకు సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా క్రికెట్‌కు పూర్తిగా దూరంగా ఉంటున్న ఇషాంత్.. ఈ సీజన్లో అనూహ్యంగా సత్తా చాటాడు. 8 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టి, ఓ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు. ఇషాంత్ కూడా ఈ ఏడాది సర్ప్రైజ్ ఇచ్చిన ప్లేయరే అని చెప్పాలి. పై నలుగురు కాక ఈ ఐపీఎల్ సీజన్లో సర్ప్రైజ్ ప్లేయర్స్ జాబితాలో మరో ముగ్గురు వెటరన్లు ఉన్నారు. గుజరాత్.. విజయ్ శంకర్ (32 ఏళ్లు , 1.4 కోట్లు) (13 మ్యాచ్‌ల్లో 160.11 స్ట్రయిక్ రేట్‌తో 3 అర్ధ సెంచరీల సాయంతో 301 పరుగులు), రాజస్థాన్ రాయల్స్ సందీప్ శర్మ (12 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు), లక్నో అమిత్ మిశ్రా (41 ఏళ్లు, 50 లక్షలు) (7 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు). వీరు సైతం ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పై పేర్కొన్న ఆటగాళ్లలో దాదాపుగా అందరూ 50 లక్షల ధరకు, వివిధ జట్ల పంచన చేరిన వారే. మరి, మిమ్మల్ని ఈ ఏడాది అధికంగా సర్ప్రైజ్ చేసిన వెటరన్ ఆటగాడెవరో కామెంట్ రూపంలో తెలియజేయండి. చదవండి: కీలక మ్యాచ్‌ల్లో రోహిత్ రాణించడం ఎప్పుడు చూడలేదు.. అతనో ఫెయిల్యూర్...! -
WTC Final: టీమిండియా వైస్ కెప్టెన్‌గా అతడే! ద్రవిడ్‌తో కలిసి వాళ్లంతా..
WTC Final 2023: సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారాకు కీలక బాధ్యతలు అప్పజెప్పేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించినట్లు సమాచారం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మకు డిప్యూటీగా పుజారాను నియమించనున్నట్లు తెలుస్తోంది. కాగా మేటి జట్లు టీమిండియా- ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనున్న విషయం తెలిసిందే. రహానే వచ్చేశాడు ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7-11 మధ్య ఈ మెగా ఫైట్‌కు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అయితే, వైస్ కెప్టెన్‌గా మాత్రం ఇంత వరకు ఎవరి పేరును ఖరారు చేయలేదు. ఐపీఎల్-2023లో అద్భుత ప్రదర్శనతో టీమిండియాలో పునరాగమనం చేసిన మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే.. పుజారాలలో ఎవరో ఒకరిని రోహిత్ డిప్యూటీని చేస్తారంటూ చర్చించుకుంటున్నారు క్రికెట్ ప్రేమికులు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘పుజారానే టీమిండియా వైస్ కెప్టెన్‌గా కొనసాగుతాడు. అధికారిక ప్రకటన అప్పుడే అందరికీ ఈ విషయం తెలుసు. కానీ ఇంతవరకు పుజారా నియామకానికి సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. ఐసీసీకి ఫైనల్ జట్టు గురించి వివరాలు సమర్పించే సమయం(మే 23)లో పుజారా పేరును వైస్ కెప్టెన్‌గా మెన్షన్ చేయనున్నారు. ససెక్స్ కెప్టెన్‌గా ఛతేశ్వర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు ఫామ్‌లో ఉండటం టీమిండియాకు కలిసి వచ్చే అంశం’’ అని పేర్కొన్నారు. టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్‌గా పుజారా పేరు ఖరారు కానుందని తెలిపారు. కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సందర్భంగా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన పుజారా.. కౌంటీ క్రికెట్లో ససెక్స్ జట్టుకు నాయకుడిగా ఉన్నాడు. అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా అద్బుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంటున్నాడు. మూడు సెంచరీలతో వరుసగా 115, 35, 18, 13, 151, 136 & 77 పరుగులతో సూపర్ ఫామ్ కనబరిచిన పుజారా.. ససెక్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్‌కు సహచర ఆటగాడిగా ఉండటం విశేషం. ఇన్నాళ్లు ఒకే జట్టుకు ఆడిన వీరిద్దరు డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ సందర్భంగా ఎప్పటిలానే ప్రత్యర్థులుగా మారనున్నారు. కాగా మే 24 నాటికి కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా కీలక ప్లేయర్లు లండన్‌కు చేరుకోనుండగా.. పుజారా కాస్త ఆలస్యంగా జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఐపీఎల్-2023తో బిజీగా ఉన్న.. శార్దూల్ ఠాకూర్(కేకేఆర్), ఉమేశ్ యాదవ్ (కేకేఆర్), ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లు అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ తదితరులు ద్రవిడ్ కలిసి మే 23నే లండన్‌కు పయనం కానున్నట్లు సమాచారం. డబ్ల్యూటీసీ ఫైనల్-2023: బీసీసీఐ ప్రకటించిన జట్టు ఇదే రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్). స్టాండ్ బై ప్లేయర్లు: రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్. చదవండి: లక్షలు పెట్టి కొంటే అద్భుతాలు సృష్టిస్తున్నాడు.. మరి 18 కోట్లు తీసుకున్న నువ్విలా! అభిషేక్ తప్పేం లేదు! వాళ్ల వల్లే ఇలా: టీమిండియా మాజీ క్రికెటర్ ఘాటు విమర్శలు -
రహానే షాక్ తిన్న వేళ.. అంపైర్ ఇంప్రెస్ అయ్యాడు
ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ లలిత్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. బుధవారం సీఎస్కేతో మ్యాచ్‌లో అజింక్యా రహానేను కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ తొలి బంతిని రహానే స్ట్రెయిట్ షాట్ ఆడగా.. బంతి వేగంగా వెళ్లడంతో క్యాచ్ మిస్ అవుతుందని అనుకున్నాం. కానీ లలిత్ యాదవ్ అద్బుతం చేశాడు. ఒకవైపుగా డైవ్‌చేస్తూ కుడిచేత్తో కేవలం వేళ్ల సాయంతోనే అద్బుతంగా అందుకున్నాడు. అయితే ఇక్కడ లలిత్ యాదవ్ దూబేను రనౌట్ చేసే అవకాశం కూడా వచ్చింది. కానీ రహానే క్యాచ్ అందుకున్న లలిత్ ఆ పని చేయలేకపోయాడు. అయితే లలిత్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌కు రహానే షాక్ తినగా.. అంపైర్ క్రిస్ గఫానీ మాత్రం ఇంప్రెస్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. What a Catch by Lalit Yadav 🤯🤯#LalitYadav #CSKvDC pic.twitter.com/WJP6GyPXtl — Cricket Apna l Indian cricket l Bleed Blue 💙🇮🇳 (@cricketapna1) May 10, 2023 -
నిన్న రహానే.. నేడు మరొక స్టార్ ప్లేయర్ కి లండన్ టికెట్
-
జడేజాను ట్రై చేశారు.. కానీ ఏం లాభం? కెప్టెన్‌గా అతడే సరైనోడు: పాక్ దిగ్గజం
IPL 2023- CSK Future Captain: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరులేని చెన్నై సూపర్ కింగ్స్‌ను ఊహించలేం. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నాలుగుసార్లు సీఎస్కేను చాంపియన్‌గా నిలిపిన ఘనత ధోనిది. మరి 41 ఏళ్ల ధోని రిటైరైన తర్వాత చెన్నైని ముందుండి నడిపించే నాయకుడు ఎవరు? సగటు అభిమానితో పాటు క్రీడా విశ్లేషకుల మధ్య కూడా ఈ అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. కెప్టెన్‌గా.. ఆటగాడిగానూ ఫెయిల్ గత సీజన్లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగిస్తే ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త బాధ్యతల వల్ల ఇటు కెప్టెన్‌గా విఫలం కావడంతో పాటు.. అటు ఆటగాడిగా కూడా జడ్డూ ఫెయిలయ్యాడు. దీంతో మళ్లీ ధోని పగ్గాలు అందుకున్నప్పటికీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన సీఎస్కే పద్నాలుగింట కేవలం నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదోస్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023 ధోనికి ఆఖరి సీజన్ అన్న వార్తల నేపథ్యంలో మరోసారి సీఎస్కే కెప్టెన్సీ అంశం తెరమీదకు వచ్చింది. రహానే బెస్ట్ ఆప్షన్ ఈ క్రమంలో పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రం చెన్నై సారథిగా ధోని వారసుడి ఎంపిక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు.. ‘‘ఐపీఎల్-2022లో సీఎస్కే రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా ట్రై చేసింది. దాంతో జట్టుతో పాటు జడ్డూ ప్రదర్శనపై కూడా ఎలాంటి ప్రభావం పడిందో అందరూ చూశారు. మధ్యలోనే మళ్లీ కెప్టెన్‌ను మార్చాల్సి వచ్చింది. నాకు తెలిసి ప్రస్తుతం వాళ్ల ముందు రహానే కంటే మెరుగైన ఆప్షన్ లేదు. అతడు నిలకడైన ఆటతో ముందుకు సాగుతున్నాడు. స్థానిక(భారత) ఆటగాడు కూడా! ఫ్రాంఛైజ్ క్రికెట్లో లోకల్ క్రికెటర్లే కెప్టెన్లుగా రాణించడం చూస్తూనే ఉన్నాం. నిజానికి విదేశీ ఆటగాళ్లను కెప్టెన్లను చేస్తే.. వారు తమ జట్టులో ఉన్న అందరి పేర్లు గుర్తు పెట్టుకోవడం కూడా వారికి కష్టమే. అలాంటిది వాళ్లు జట్టును ఎలా ముందుకు నడిపిస్తారు? ధోని గనుక సీఎస్కే పగ్గాలు వదిలేయాలని భావిస్తే.. నా దృష్టిలో మాత్రం ధోని వారసుడిగా రహానే మాత్రమే సరైనోడు’’ అని స్పోర్ట్స్ కీడాతో వసీం అక్రం వ్యాఖ్యానించాడు. కానీ.. నమ్మకం ఉంటేనే అయితే, డ్రెసింగ్ రూంలో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలీదన్న అక్రం.. రహానేపై ఫ్రాంఛైజీకి నమ్మకం ఉంటేనే ఇలాంటి కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023 సీజన్లో చెన్నై ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో 5 గెలిచింది. దంచికొడుతున్న ఒకప్పటి వైస్ కెప్టెన్ ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు సీఎస్కే తరఫున 7 మ్యాచ్‌లలో ఆరు ఇన్నింగ్స్ ఆడిన అజింక్య రహానే 224 పరుగులు చేశాడు. ఈ ఎడిషన్‌లో తొలి ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేయడం విశేషం. ఇక ఇప్పటిదాకా రహానే అత్యధిక స్కోరు 71(నాటౌట్). కాగా రహానేకు టీమిండియా వైస్ కెప్టెన్‌గా జట్టును నడిపించిన అనుభవం ఉంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటనలో నాటి సారథి విరాట్ కోహ్లి గైర్హాజరీలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలవడంలో రహానేది కీలక పాత్ర. చదవండి: నా సర్వస్వం నువ్వే.. ఎప్పుడూ నీ చేయి వీడను: కోహ్లి ట్వీట్ వైరల్ MI Vs RR: గ్రహణం వీడింది..! అతడు భవిష్యత్ సూపర్‌స్టార్.. నో డౌట్! -
ధోని మాట వింటే అంతే మరి..
-
టీమిండియా ఆల్‌రౌండర్‌కు బంపరాఫర్.. పాపం సూర్యకుమార్!
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టులో రెండు అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్లో అదరగొడుతున్న వెటరన్ ఆటగాడు అజింక్య రహానే సెలక్టర్లు పిలుపునిచ్చారు. గాయం కారణంగా దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో రహానే అవకాశం దక్కింది. దాదాపు 17 నెలల విరామం తర్వాత రహానేకు భారత జట్టులో చోటు దక్కడం విశేషం. అదే విధంగా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు దక్కింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు శార్దూల్ ఠాకూర్ భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. ఇంగ్లండ్ పరిస్థితులు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించనున్న నేపథ్యంలో శార్దూల్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కట్‌తో పాటు అదనపు పేసర్‌గా శార్దూల్ ఉండనున్నాడు. అదే విధంగా ప్లేయింగ్ ఎల్వన్లో కూడా శార్దూల్ చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఎందుకంటే శార్దూల్ ఇంగ్లండ్ గడ్డపై మంచి రికార్డు ఉంది. గతంతో ఓ ఫోర్ వికెట్ హాల్‌తో పాటు ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఇక ఓవరాల్‌గా భారత్ తరపున 8 టెస్టు మ్యాచ్‌లు ఆడిన శార్ధూల్.. 27 వికెట్లతో 254 పరుగులు చేశాడు. మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్టు అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్‌కు చుక్కదరైంది. తొలుత అయ్యర్ స్థానంలో సూర్యకుమార్‌కు చోటు దక్కుతుందని వార్తలు వినిపించినప్పటికీ.. సెలక్టర్లు మాత్రం రహానే వైపు మొగ్గు చూపారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కత్ చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు ప్రకటన.. ఐపీఎల్ హీరోకు పిలుపు -
50 లక్షలు ప్లేయర్ దంచికొడుతుంటే 16 కోట్ల ప్లేయర్ చప్పట్లు కొడుతున్నాడు
-
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు ప్రకటన.. ఐపీఎల్ హీరోకు పిలుపు
లండన్‌లోని ఓవల్ వేదికగా ఈ ఏడాది జూన్ 7 నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం భారత జట్టును ఇవాళ (ఏప్రిల్ 25) ప్రకటించారు. ఇటీవల ఆస్ట్రేలియా ఆడిన జట్టునే దాదాపుగా కొనసాగించిన సెలెక్టర్లు.. ఒక్క అనూహ్య మార్పు చేశారు. గాయపడిన శ్రేయస్ అయ్యర్ స్థానంలో ఐపీఎల్-2023లో ఇరగదీస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేను ఎంపిక చేశారు. కేకేఆర్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు మరో అవకాశం ఇచ్చారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కత్ -
పనికిరాడు అన్నారు ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ కి
-
వాళ్లకు థాంక్స్ చెప్పడం తప్ప ఇంకేం చేయగలను.. నాకు ఫేర్వెల్ ఇచ్చేందుకు: ధోని
IPL 2023 CSK Vs KKR- MS Dhoni Comments: ‘‘పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.. వాళ్ల మద్దతుకు కృతజ్ఞతలు చెప్పడం తప్ప నేను ఇంకేం చేయగలను. వాళ్లలో చాలా మంది తదుపరి మ్యాచ్‌కి కేకేఆర్ జెర్సీలో వస్తారు. ఇప్పుడైతే నాకు ఫేర్వెల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. నా మీద ఇంతలా అభిమానం చూపుతున్నందుకు ప్రేక్షకులకు థాంక్స్’’ అంటూ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని తన అభిమానుల పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ఐపీఎల్-2023లో భాగంగా చెన్నై ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడింది. కోల్‌కతానా లేదంటే చెపాక్! ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు వేలాది మంది ప్రేక్షకులు తరలివచ్చారు. కేకేఆర్‌కు ఇది సొంతమైదానమైనా.. స్టేడియం మొత్తం పసుపు వర్ణంతో నిండిపోవడం విశేషం. టీవీలో మ్యాచ్ వీక్షిస్తున్న వారికి.. ఒక్కసారిగా.. మ్యాచ్ జరుగుతోంది కోల్కతాలోనా లేదంటే చెపాక్లోనా అన్న సందేహం వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. PC: IPL Twitter ప్రేక్షకుల్లో మెజారిటీ మంది సీఎస్కే జెర్సీలు ధరించి.. ‘‘ధోని కోసమే వచ్చాం’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వీరి అభిమానానికి ఉప్పొంగిపోయిన మిస్టర్ కూల్ ధోని మ్యాచ్ అనంతరం అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. రహానే విధ్వంసం ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు నష్టపోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ కాన్వే 56 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్ బ్యాటర్ అజింక్య రహానే 29 బంతుల్లోనే 71 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. శివం దూబే అర్ధ శతకం(50)తో చెలరేగగా.. రహానే ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్ 186 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో 49 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. రహానే ఏం చేయగలడో తెలుసు ఈ క్రమంలో విజయానంతరం ధోని మాట్లాడుతూ.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రహానే సత్తా ఏమిటో తమకు తెలుసని.. అందుకే అతడికి అవకాశాలు ఇస్తున్నట్లు తెలిపాడు. అదే విధంగా యువ ఆటగాళ్లు సైతం అద్భుతంగా రాణిస్తున్నారంటూ తమ బౌలర్లను కొనియాడాడు. చదవండి: మహిపాల్‌ను దూషించిన సిరాజ్! ఇప్పటికే రెండుసార్లు సారీ చెప్పాను.. పర్లేదు భాయ్! ప్రేమ విషయం పేరెంట్స్‌కు చెప్పలేనన్న సచిన్! అంజలి అంతటి త్యాగం చేసిందా? Of scintillating knocks, secret behind the big hits and a match-winning partnership 🔥🔥@ChennaiIPL's resounding win summed up with Shivam Dube & Ajinkya Rahane 2.0 😎 - By @28anand Full Interview 🎥🔽 #TATAIPL | #KKRvCSK https://t.co/3omOYLSPeM pic.twitter.com/rMFBOvwuhC — IndianPremierLeague (@IPL) April 24, 2023 🔥 We are using 'Ridiculous' and 'Rahane' in one sentence... who would have thunk!? 🤯#KKRvCSK #IPLonJioCinema #TATAIPL #IPL2023 | @ajinkyarahane88 pic.twitter.com/zXhhtfIFlv — JioCinema (@JioCinema) April 23, 2023 -
CSK VS KKR: సిక్సర్ల సునామీ.. రికార్డు బద్దలు
ఐపీఎల్-2023లో భాగంగా కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తమ రికార్డును తామే బద్దలు కొట్టుకుంది. ఈ మ్యాచ్‌లో 18 సిక్సర్లు బాదిన సీఎస్కే.. గతంలో తమ పేరిట ఉన్న 17 సిక్సర్ల రికార్డును అధిగమించింది. గతంలో నాలుగుసార్లు 17 సిక్సర్లు బాదిన సీఎస్కే.. నిన్నటి మ్యాచ్‌లో ఎట్టకేలకు ఆ మార్కును దాటింది. ఇదే సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే చివరిసారిగా 17 సిక్సర్లు బాదింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రహానే, శివమ్ దూబే చెరో 5 సిక్సర్లు బాదగా.. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే తలో 3, జడేజా 2 సిక్సర్లు కొట్టాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా ఆర్సీబీ రికార్డుల్లోకెక్కింది. ఈ జట్టు 2013లో పూణే వారియర్స్‌పై 21 సిక్సర్లు బాదింది. 10 సీజన్లు అయిపోవస్తున్నా ఇప్పటికీ ఆ రికార్డు ఆర్సీబీ పేరిటే ఉంది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్కే మరో రికార్డు కూడా సాధించింది. కేకేఆర్‌పై అత్యధిక టీమ్ స్కోర్ (235/4) నమోదు చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌కు ముందు కేకేఆర్‌పై అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ (228/4) పేరిట ఉండేది. ఇదిలా ఉంటే, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 49 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రహానే (29 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబే (21 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), డెవాన్ కాన్వే (40 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (20 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో జేసన్ రాయ్ (26 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడినప్పటికీ కేకేఆర్ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. -
వాళ్లంతా వేస్ట్, రహానేనే బెస్ట్.. టీమిండియాకు ఎంపిక చేయండి..!
కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో విరుచుకుపడిన సీఎస్కే వెటరన్ ఆజింక్య రహానే (29 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు)పై ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ సాగుతుంది. నిన్నటి బీభత్సకరమైన ఇన్నింగ్స్ తర్వాత రహానేపై ఒక్కసారిగా అంచనాలు పెరగడంతో భారత క్రికెట్ అభిమానులంతా అతన్ని టీమిండియాకు ఎంపిక చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. నిలకడ లేని లోకేశ్ రాహుల్‌లు, శ్రేయస్ అయ్యర్లు, ఇషాన్ కిషన్‌లు, సూర్యకుమార్ యాదవ్‌ల కంటే రహానే చాలా బెటరని, అతన్ని టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలోనూ ఆడిస్తే సత్ఫలితాలు ఖాయమని భరోసాగా చెబుతున్నారు. ఒకప్పుడు కేవలం టెస్ట్‌లకే పనికొస్తాడని, ఆతర్వాత ఆ ఫార్మాట్‌కు కూడా పనికిరాడని అగౌరవంగా రహానేను సాగనంపిన సెలెక్టర్లు.. ఈ విషయంలో పునరాలోచన చేయాలని, ప్రస్తుత ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే టీమిండియా మిడిలార్డర్లో రహానే కంటే బెటర్ ఆప్షన్ దొరకదని సూచిస్తున్నారు. నిన్నటి ఇన్నింగ్స్‌లో రహానే ఎన్నో వైవిధ్యభరితమైన షాట్లు ఆడాడని, ఇది అతనిలోని మార్పును స్పష్టంగా సూచిస్తుందని, టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలో రహానేను ఆడించాలంటే ఇంతకంటే ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. టెస్ట్‌ల్లో అతను కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇటీవలికాలంలో అతనెంత రాటుదేలాడో చెప్పడానికి కేకేఆర్‌పై ఆడిన సుడిగాలి ఇన్నింగ్సే నిదర్శనమని అంటున్నారు. ప్రస్తుత ఐపీఎల్లో రహానే స్ట్రయిక్ రేట్ (199.95) అత్యుత్తమమని.. ఈ సీజన్లో సన్‌రైజర్స్‌పై మినహా అతనాడిన ప్రతి మ్యాచ్‌లో చెలరేగి ఆడాడని ఉదహరిస్తున్నారు. రహానేను త్వరలో ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆడిస్తే, టీమిండియా మూడోసారి వరల్డ్‌కప్ సాధించడం తధ్యమని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా రహానే నామస్మరణతో ప్రస్తుతం సోషల్‌మీడియా హోరెత్తిపోతుంది. -
Rahane: ఇప్పుడేం చూశారు.. ముందుంది ముసళ్ల పండుగ, సినిమా చూపిస్తా..!
ఐపీఎల్-2023లో భాగంగా కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 49 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటర్లు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఒకరితో ఒకరు పోటీపడి మరీ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. వెటరన్ ఆటగాడు, టెస్ట్ క్రికెటర్‌గా ముద్రపడ్డ అజింక్య రహానే ఇన్నింగ్స్ (29 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) అయితే వేరే లెవెల్లో ఉంది. టీ20లకు అస్సలు పనికిరాడు అనుకున్న రహానేలో ఇంత ఉందా అని జనాలు అనుకునేలా చేశాడు. అగ్నికి ఆయువు తోడైనట్లు రహానేకు యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే (21 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) తోడయ్యాడు. వీరిద్దరు ఇన్నింగ్స్ చివర్లో ఉగ్రరూపం దాల్చారు. ఆఖర్లో జడేజా (8 బంతుల్లో 18; 2 సిక్సర్లు) సైతం నేనేమైనా తక్కువా అన్న చందంగా 2 సిక్సర్లు బాది తన మార్కు చూపించాడు. అంతకుముందు ఓపెనర్లు డెవాన్ కాన్వే (40 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (20 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఎప్పటిలాగే తమ స్థాయిలో ఇరగదీశారు. మొత్తంగా చెన్నై బ్యాటర్ల సిక్సర్ల సునామీతో, బౌండరీల ప్రవాహంతో మ్యాచ్‌కు వేదిక అయిన ఈడెన్ గార్డెన్స్ తడిసి ముద్దైంది. ధోని సేన నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక స్కోర్‌గా రికార్డైంది. ఛేదనలో కేకేఆర్ ఓ మోస్తరుగా పోరాడినప్పటికీ గెలుపుకు ఆమడు దూరంలోనే నిలిచిపోయింది. జేసన్ రాయ్ (26 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) జూలు విదిల్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఉగ్రరూపం దాల్చిన ఆజింక్య రహానేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అవార్డు ప్రధానోత్సవం సందర్భంగా రచ్చ రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన బ్యాటింగ్‌లో దూకుడు పెరగడంపై స్పందిస్తూ.. ఇప్పుడేం చూశారు.. ముందుంది ముసళ్ల పండుగ, సినిమా చూపిస్తా.. అన్న రేంజ్లో కామెంట్స్ చేశాడు. ధోని భాయ్ నేతృత్వంలోనే నేను రాటుదేలానని, అతను చెప్పింది చేస్తే ఆటోమాటిక్‌గా మనలో ఆటకు తగ్గ మార్పులు వస్తాయని అన్నాడు. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు ఆడిన అన్ని నాక్స్కు ఎంజాయ్ చేశానని, మున్ముందు ఇంకొంత దూకుడు పెంచేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. కాగా, ఈ ఐపీఎల్ సీజన్లో రహానే తన ఆటతీరుకు భిన్నంగా వేగంగా పరుగులు సాధిస్తున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే స్థాయిలో మెరుపులు మెరిపించాడు. ఆ మ్యాచ్‌లో 27 బంతులు ఎదుర్కొన్న అతను.. 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి ఒంతిచేత్తో తన జట్టును గెలిపించాడు. -
రఫ్ఫాడించిన రహానే...
కోల్‌కతా: సాధారణంగా టీవీ బ్రాడ్కాస్టర్లు ఒక ఇన్నింగ్స్ ముగిశాక, లేదంటే మ్యాచ్ పూర్తయ్యాక మొత్తమ్మీద ఐదారు నిమిషాలు హైలైట్స్ చూపిస్తారు. కానీ ఈ మ్యాచ్‌లో అజింక్య రహానే తను ఆడుతున్నంతసేపూ హైలైట్స్ చూపాడు. వన్నె తగ్గిన ఈ వెటరన్ తనలో దంచేసే సత్తా ఇంకా తగ్గలేదని సుడిగాలి ఇన్నింగ్స్ (29 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు)తో నిరూపించాడు. దీంతో చెన్నై సూపర్‌కింగ్స్ 49 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. ముందుగా సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీస్కోరు చేసింది. శివమ్ దూబే (21 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), కాన్వే (40 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా అర్ధ సెంచరీలు చేశారు. కష్టమైన లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులే చేయగలిగింది. జట్టు స్కోరు 1 పరుగుకే ఓపెనర్లు నరైన్ (0), జగదీశన్ (1)లు... కాసేపటికి వెంకటేశ్ (20), నితీశ్ రాణా (27) అవుటవడంతో నైట్‌రైడర్స్ లక్ష్యానికి దూరమైంది. జేసన్ రాయ్ (26 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ షాట్లతో అలరించారు. చెన్నై బౌలర్లలో తుషార్, తీక్షణలకు రెండేసి వికెట్లు దక్కాయి. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (బి) సయశ్ శర్మ 35; కాన్వే (సి) వీస్ (బి) వరుణ్ చక్రవర్తి 56; రహానే (నాటౌట్) 71; శివమ్ దూబే (సి) జేసన్ రాయ్ (బి) ఖెజ్రోలియా 50; జడేజా (సి) రింకూ సింగ్ (బి) ఖెజ్రోలియా 18; ధోని (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 235. వికెట్ల పతనం: 1–73, 2–109, 3–194, 4–232. బౌలింగ్: ఉమేశ్ 3–0–35–0, వీస్ 3–0–38–0, వరుణ్ 4–0–49–1, కుల్వంత్ ఖెజ్రోలియా 3–0–44–2, నరైన్ 2–0–23–0, సుయశ్ శర్మ 4–0–29–1, రసెల్ 1–0–17–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: జగదీశన్ (సి) జడేజా (బి) తుషార్ 1; నరైన్ (బి) ఆకాశ్ సింగ్ 0; వెంకటేశ్ అయ్యర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మొయిన్ అలీ 20; నితీశ్ రాణా (సి) రుతురాజ్ (బి) జడేజా 27; జేసన్ రాయ్ (బి) తీక్షణ 61; రింకూ సింగ్ (నాటౌట్) 53; రసెల్ (సి) శివమ్ దూబే (బి) పతిరణ 9; వీస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) తుషార్ 1; ఉమేశ్ (సి) కాన్వే (బి) తీక్షణ 4; వరుణ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–46, 4–70, 5–135, 6–162, 7–171, 8–180. బౌలింగ్: ఆకాశ్4–0–29–1, తుషార్ 4–0–43–2, తీక్షణ 4–0–32–2, మొయిన్ అలీ 1–0–20–1, జడేజా 3–0–34–1, పతిరణ 4–0–27–1. ఐపీఎల్లో నేడు హైదరాబాద్ vs ఢిల్లీ (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
#AjinkyaRahane: 'కుర్రాళ్లు కూడా దిగదుడుపే.. చెడుగుడు ఆడాడు'
అజింక్యా రహానే.. ఈ పేరు చెప్పగానే ప్రశాంతతకు మారుపేరు.. అని ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్‌తో ఇవాళ ఆడిన మ్యాచ్‌లో రహానే ఆట చూసిన వారెవరైనా తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. అలా సాగింది రహానే ఆటతీరు. ఏమని చెప్పగలం.. ఎంతని చెప్పగలం.. బంతి పడిందే ఆలస్యం బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అసలు ఆడుతుంది రహానేనా లేక ఇంకెవరైనా అనే అనుమానం కూడా కలగక మానదు. అంతలా విధ్వంసం చేసి పారేశాడు. చినుకు చినుకు గాలి వానలా మారి తుఫాను విధ్వంసంతో విరుచుకుపడిందన్నట్లుగా రహానే ఇన్నింగ్స్ సాగింది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో రహానే మొత్తంగా 29 బంతుల్లో 71 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. అయితే తుఫానుకు ముందు ప్రశాంతత అన్నట్లుగా సీఎస్కే ఇన్నింగ్స్ 13 ఓవర్ ముగిసే సరికి రహానే 14 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత నుంచి రహానే విధ్వంసం మొదలైంది. ఓవర్‌కు సిక్సర్ లేదా ఫోర్ అన్నట్లుగా సాగింది అతని ఇన్నింగ్స్. 14 బంతుల్లో 19 పరుగులు చేసిన రహానే.. తాను ఎదుర్కొన్న చివరి 15 బంతుల్లో 60 పరుగులు బాదాడు. దీన్నిబట్లే రహానే విధ్వంసం ఎంతలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో దక్కించుకున్న సీఎస్కేకు అతను రెట్టింపు న్యాయం అందిస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో రహానే తన ముందు కుర్రాళ్లు కూడా దిగదిడుపూ అని నిరూపించాడు. 🔥 We are using 'Ridiculous' and 'Rahane' in one sentence... who would have thunk!? 🤯#KKRvCSK #IPLonJioCinema #TATAIPL #IPL2023 | @ajinkyarahane88 pic.twitter.com/zXhhtfIFlv— JioCinema (@JioCinema) April 23, 2023 -
రహానే అద్భుత విన్యాసం.. వీడియో వైరల్! ఆ 5 పరుగులు సేవ్ చేయకుంటే..
IPL 2023- RCB Vs CSK: అజింక్య రహానే.. టీమిండియా వెటరన్ బ్యాటర్ ఐపీఎల్-2023లో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ తనను విమర్శించిన వాళ్లకు బ్యాట్‌తోనే సమాధానమిస్తున్నాడు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన ఈ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రహానే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసి సత్తా చాటాడు. దంచికొట్టి.. ప్రశంసలు అందుకుంటూ 34 ఏళ్ల వయసులో 19 బంతుల్లోనే 50 పరుగుల మార్కు అందుకున్నాడు. కెప్టెన్ ధోని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక పదహారో ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి రహానే చేసిన పరుగులు 129. అత్యధిక స్కోరు 61. ఆర్సీబీతో మ్యాచ్‌లో రహానే ఇలా బెంగళూరు వేదికగా ఆర్సీబీతో సోమవారం ఆడిన మూడో మ్యాచ్‌లో రహానే 20 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లతో పాటు 2 సిక్సర్లు ఉన్నాయి. బ్యాటింగ్ సంగతి ఇలా ఉంటే.. చిన్నస్వామి స్టేడియంలో రహానే అద్భుత ఫీల్డింగ్‌తో మెరిసిన తీరు హైలైట్‌గా నిలిచింది. మాక్సీ సిక్స్ అనుకున్నాడు.. కానీ ఆర్సీబీ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ధోని బంతిని రవీంద్ర జడేజా చేతికి ఇచ్చాడు. ఓవర్ చివర్లో జడ్డూ వేసిన బంతిని మాక్సీ లాంగాఫ్ దిశగా షాట్ ఆడాడు. సిక్స్ ఖాయమనుకున్న దశలో రహానే అద్భుతం చేశాడు. ఆ 5 పరుగులు సేవ్ చేయకుంటే బంతిని క్యాచ్ పట్టిన రహానే బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. కానీ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. బంతిని వెంటనే బౌండరీ ఇవతలకు విసిరేసి ఐదు పరుగులు సేవ్ చేశాడు. రహానే సూపర్మాన్ విన్యాసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నె 8 పరుగుల స్వల్ప తేడాతో ఆర్సీబీ మీద గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డెత్ ఓవర్లలో రాణించిన సీఎస్కే యువ పేసర్ పతిరణ సహా ఐదు పరుగులు సేవ్ చేసిన రహానేపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న రహానేను టీమిండియా సెలక్టర్లు దృష్టిలో పెట్టుకోవాలని.. రహానే ఆట ఇలాగే కొనసాగితే అతడి రీఎంట్రీ ఖాయమంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వాళ్లిద్దరు ఇంకాసేపు క్రీజులో ఉంటే మేము ఓడిపోయేవాళ్లం.. కానీ: ధోని Ajink-waah🤩 Rahane's 🔝effort on the boundary saves a certain maximum!#RCBvCSK #IPLonJioCinema #TATAIPL #IPL2023 | @ajinkyarahane88 pic.twitter.com/8Q5YzN4nF5 — JioCinema (@JioCinema) April 17, 2023 Thou shall not pass, says Ajinkya Rahane#RCBvCSK | #IPL2023 pic.twitter.com/BY1YbbhD0a — Sportstar (@sportstarweb) April 17, 2023 -
సూర్యకుమార్‌కు నో ఛాన్స్.. రహానేకు బంపరాఫర్!
ఐపీఎల్-2023 సీజన్ ముగిసిన అనంతరం టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. జూన్ 7 నుంచి లండన్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానేకు బంఫరాఫర్ తగిలే అవకాశం ఉంది. గాయం కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో అజింక్యా రహానే జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. అద్భుత ఫామ్‌లో రహానే.. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రహానే దుమ్మురేపుతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 61 పరుగులతో అదరగొట్టిన రహానే.. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో కూడా 31 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలోనే రహానే మళ్లీ జాతీయ జట్టులోకి పిలుపునివ్వాలని భారత సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. అయితే తొలుత అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ సూర్యకుమార్ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా సెలక్టర్లు తమ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో విదేశీ పిచ్‌లపై అనుభవం ఉన్న రహానే వైపు మెగ్గు చూపుతున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. రంజీల్లో దుమ్మురేపిన రహానే.. అదే విధంగా రంజీ సీజన్ 2022-23లో రహానే అదరగొట్టాడు. 7 మ్యాచ్‌లు ఆడిన రహానే 57.63 సగటుతో 634 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, డబుల్ సెంచరీ ఉన్నాయి. ఇక రహానే చివరగా భారత్ తరుపున గతేడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాపై ఆడాడు. చదవండి: IPL 2023: పవర్ హిట్టర్ వచ్చేశాడు! అందరి కళ్లు అతడిపైనే! మామూలుగా ఉండదు! -
ఏంటి అశ్విన్ ప్రతీసారి ఇలా.. రహానే కూడా తక్కువ కాదు! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో వరుసగా మూడు మ్యాచ్‌లో గెలవాలన్న చెన్నై సూపర్ కింగ్స్ ఆశలపై రాజస్తాన్ రాయల్స్ నీళ్లు చల్లింది. బుధవారం చెపాక్ వేదికగా రాజస్తాన్‌తో జరిగిన ఉత్కంఠపోరులో 3 పరుగుల తేడాతో సీఎస్కే ఓటమిపాలైంది. సీఎస్కే కెప్టెన్ ఎంస్ ధోని ఆఖరి వరకు పోరాడనప్పటికీ తన జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఆఖరి ఓవర్లో సీఎస్కే విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా.. సందీప్ శర్మ 19 పరుగులు మాత్రమే చేశాడు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాజస్తాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, సీఎస్కే బ్యాటర్ అజింక్యా రహానేల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? సీఎస్కే ఇన్నింగ్స్ 6 ఓవర్ వేయడానికి రవి చంద్రన్ అశ్విన్ వచ్చాడు. తొలి బంతికి రహానే రెండు పరుగులు సాధించి.. స్ట్రైక్‌ను తనవైపే ఉంచుకున్నాడు. రెండో బంతిని వేసేందుకు సిద్దమైన అశ్విన్.. చివరి క్షణంలో చేతిని తిప్పి బంతిని వేయకుండా ఆపేశాడు. దీంతో రహానే కాస్త అసహనానికి గురయ్యాడు. ఈ క్రమంలో రహానే కూడా అశ్విన్‌కు రివర్స్ పంచ్ ఇచ్చాడు. మూడో బంతిని అశ్విన్ వేసే క్రమంలో రహానే ఒక్క సారిగా క్రీజు నుంచి పక్కకు వెళ్లిపోయాడు. అనంతరం మూడో బంతిని రహానే అద్భుతమైన సిక్స్‌గా మలిచాడు. దీంతో అశ్విన్ ఒక్క సారిగా రహానే వైపు సీరియస్‌గా చూశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు,వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఇది చూసిన నెటిజన్లు.. ఏంటీ అశ్విన్ ప్రతీ సారి ఇలానే చేస్తున్నావు.. రహానే సరైన సమాధానం చెప్పాడంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2023: అదే మా ఓటమిని శాసించింది.. ఆ విషయం నాకు నిజంగా తెలియదు: ధోని pic.twitter.com/TwYAEzv0be — CricDekho (@Hanji_CricDekho) April 12, 2023 WHAT. A. GAME! 👏 👏 Another day, another last-ball finish in #TATAIPL 2023! 😎@sandeep25a holds his nerve as @rajasthanroyals seal a win against #CSK! 👍 👍 Scorecard ▶️ https://t.co/IgV0Ztjhz8#CSKvRR pic.twitter.com/vGgNljKvT6 — IndianPremierLeague (@IPL) April 12, 2023 -
ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం.. RRRపై ప్రశంసల వర్షం
ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత రవీంద్ర జడేజా బంతితో (4-0-20-3) ఇరగదీయగా.. ఆతర్వాత బ్యాటింగ్‌లో వెటరన్ రహానే (27 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రహానేకు రుతురాజ్ (36 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) జతకలవడంతో సీఎస్కే 18.1 ఓవర్ల సునాయాసంగా లక్ష్యాన్ని (158) ఛేదించింది. ఈ మ్యాచ్‌లో రహానే విధ్వంసక ఇన్నింగ్స్‌కు, రవీంద్రుడి మాయాజాలానికి, రుతురాజ్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌కు విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ ముగ్గురిని RRR (ఇటీవల ఆస్కార్ గెలిచుకున్న తెలుగు సినిమా)తో పోలుస్తూ ఆకాశానికెత్తుతున్నారు. సీఎస్కే అభిమానులైతే ఆనందంతో ఉబ్బితబ్బుబ్బి పోయి తమ స్టార్ త్రయంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరేమో మరో R (రాయుడు)ను కూడా RRRకు యాడ్ చేస్తూ ఆకాశానికెత్తుతున్నారు. ఓ పక్క సీఎస్కే అభిమానులు ముంబైపై గెలుపుతో సంబురాలు చేసుకుంటుంటే, మధ్యలో ఆర్సీబీ ఫ్యాన్స్ జోక్యం చేసుకుంటున్నారు. ఏప్రిల్ 17న KGF (కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్) సీఎస్కేను మింగేస్తుందని రెచ్చగొట్టే కామెంట్లు చేస్తున్నారు. KGF దెబ్బకు RRR తట్టుకోలేదని కయ్యానికి కాలు దవ్వుతున్నారు. మొత్తానికి ఐపీఎల్లో మూడు బలమైన జట్ల మధ్య జరుగుతున్న స్టార్ వార్తో సోషల్‌మీడియా హోరెత్తిపోతుంది. -
చరిత్ర సృష్టించిన రహానే.. 11 ఏళ్ల ధోని రికార్డు బద్దలు!
టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే ఐపీఎల్-2023ను ఘనంగా ఆరంభించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రహానే సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. తన ఐపీఎల్ కెరీర్లోనే సీఎస్కే తరపున తొలి మ్యాచ్ ఆడిన రహానే అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రహానే 7 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 61 పరుగులు చేశాడు. అయితే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను కేవలం 19 బంతుల్లోనే అందుకున్నాడు. తద్వారా పలు అరుదైన రికార్డులను రహానే తన పేరిట లిఖించుకున్నాడు. రహానే సాధించిన రికార్డులు ఇవే.. ఐపీఎల్-2023లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఆటగాడిగా రహానే రికార్డులకెక్కాడు. అదే విధంగా ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన రెండో ఆటగాడిగా మొయిన్ అలీతో కలసి రహానే నిలిచాడు. ఈ క్రమంలో 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన సీఎస్కే కెప్టెన్ ఎంస్ ధోని రికార్డును రహానే బ్రేక్ చేశాడు. ఐపీఎల్-2012 సీజన్లో ముంబై ఇండియన్స్‌పై ధోని కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో ధోని 11 ఏళ్ల రికార్డును రహానే బద్దలు కొట్టాడు. ఇక ఓవరాల్‌గా సీఎస్కే తరపున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు.. ఆ జట్టు మాజీ ఆటగాడు సురేష్ రైనా పేరిట ఉంది. ఐపీఎల్- 2014 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్(పంజాబ్ కింగ్స్)పై రైనా కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం నమోదు చేశాడు. చదవండి: Ajinkya Rahane: బీసీసీఐ అవసరములేదని పొమ్మంది.. ఆ కసిమొత్తం ఇక్కడ చూపించేశాడు! -
బీసీసీఐ అవసరములేదని పొమ్మంది.. ఆ కసిమొత్తం ఇక్కడ చూపించేశాడు!
టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్యా రహానే అంటే టీ20లకు పనికిరాడు, టెస్టు క్రికెట్ మాత్రమే ఆడగలడు అన్న అపోహాలు అందరిలో ఉండేవి. అయితే రహానే ఒక్క ఇన్నింగ్స్‌తో అందరి ఊహలను తలకిందులు చేశాడు. ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజింక్యా రహానే విధ్వంసం సృష్టించాడు. సీఎస్కే ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రహానే ప్రత్యర్ది బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడు ఫోర్లు, సిక్స్‌లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో రహానే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను కేవలం 19 బంతుల్లోనే అందుకున్నాడు. దీంతో ఈ ఏడాది సీజన్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన ఆటగాడిగా రహానే రికార్డులకెక్కాడు. ఇక ఓవరాల్‌గా కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రహానే 7 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 61 పరుగులు చేశాడు కాగా గతేడాది సీజన్లో కేకేఆర్ ప్రాతినిథ్యం వహించిన రహానేను.. ఐపీఎల్-2023కు ముందు కోల్‌కతా ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. అయితే వేలంలోకి వచ్చిన రహానే తొలి రెండు రౌండ్లలో అమ్ముడుపోని రహానేను ఆఖరికి సీఎస్కే రూ.50లక్షలకు కొనుగోలు చేసింది. కాగా సీఎస్కే తరపున ఆడిన తొలి మ్యాచ్‌లోనే అతడు అదరగొట్టాడు. జట్టులో చోటే కాదు.. బీసీసీఐ కాంట్రాక్ట్ కూడా కాగా రహానే గత కొంతకాలంగా భారత జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన అతడిని సెలక్టర్లు పక్కన పెట్టారు. గతేడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో చివరగా అతడు టీమిండియా తరపున ఆడాడు. అయితే జట్టులో చోటు మాత్రమే కాకుండా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా రహానే కోల్పోయాడు. 2023-24 వార్షిక సంవత్సరం గాను బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో రహానే పేరులేదు. అయితే సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన కసితోనే ముంబైపై రహానే విధ్వంసం సృష్టించాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. చదవండి: IPL 2023- Rahane: 34 ఏళ్ల వయస్సులో విధ్వంసం.. ఒకే ఓవర్లో 23 పరుగులు! వీడియో వైరల్ -
34 ఏళ్ల వయస్సులో విధ్వంసం.. ఒకే ఓవర్లో 23 పరుగులు! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం సాధించింది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సీఎస్కే గెలుపొందింది. 158 పరుగుల లక్ష్యంతో దిగిన సీఎస్కే 18.1 ఓవర్లలో కేవలం 3వికెట్లు మాత్రమే కోల్పోయి అలోవకగా ఛేదించింది. రహానే విధ్వంసం.. ఈ రన్ ఛేజింగ్‌లో సీఎస్కే ఆటగాడు, టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్యా రహానే విధ్వంసం సృష్టించాడు. కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రహానే 7 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 61 పరుగులు చేశాడు. రహానే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను కేవలం 19 బంతుల్లోనే అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది సీజన్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రహానే నిలిచాడు. ఇక సీఎస్కే ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన అర్షద్ ఖాన్‌కు రహానే చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్ల సాయంతో ఏకంగా 23 పరుగులను రహానే పిండుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 34 ఏళ్ల వయస్సులో ఇటువంటి అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రహానే సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్12న రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. చదవండి: #Ajinkya Rahane: శాంతంగా కనిపించే రహానే ఉగ్రరూపం.. సీజన్లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ IPL 2023: ఏంటి బ్రో ఇది.. 17 కోట్లు తీసుకున్నావు! ఈ చెత్త ఆటకేనా? The fastest 50 of the season so far and it's from @ajinkyarahane88 💪#MIvCSK #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @ChennaiIPL pic.twitter.com/PZzmJJ999V — JioCinema (@JioCinema) April 8, 2023 -
రహానేకు ధోని ఏం చెప్పి పంపించాడో తెలుసా?
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, సీఎస్కే మధ్య జరిగిన మ్యాచ్‌లో హీరో ఎవరని అడిగితే వినిపించే పేరు అజింక్యా రహానేదే. ముంబై ఇండియన్స్ చేసిన 158 పరుగులు అనేది కాపాడుకోగలిగిన లక్ష్యమే. కానీ ఇవాల రహానే చేసిన విధ్వంసానికి ముంబై విధించిన లక్ష్యం చిన్నదైపోయింది. ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే రహానేలో ఇంత ఫైర్ దాగుందా అన్నట్లుగా ఆడిన అతను పెను సంచలనమే చేశాడు. బంతి పడిందే ఆలస్యం బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న రహానే పనిలో పనిగా సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 19 బంతుల్లోనే అర్థశతకం మార్క్ అందుకున్న రహానే జోరు చూస్తే సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ 27 బంతుల్లో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితేనేం అప్పటికే తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ముంబై నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతూ ధోని బ్యాటింగ్‌కు ముందు తనకు ఏం చెప్పి పంపించాడో రివీల్ చేయడం ఆసక్తి కలిగించింది. రహానే మాట్లాడుతూ.. ''ఈరోజు ఆటను బాగా ఎంజాయ్ చేశాను. టాస్కు కొద్ది నిమిషాల ముందే నేను తుది జట్టులో ఉన్నట్లు తెలిసింది. మొయిన్ అలీ ఈ మ్యాచ్ ఆడడం లేదని.. అతని స్థానంలో నువ్వు ఆడుతున్నావని కోచ్ ప్లెమింగ్ చెప్పాడు. ఆడింది రంజీ ట్రోపీ అయినప్పటికి ఈ సీజన్లో మంచి బ్యాటింగ్ ప్రదర్శన చేశాను. ఇవాళ్టి మ్యాచ్‌లో దానిని కొనసాగిలంచాలనుకున్నా. ఇక మహీ బాయ్ నేను బ్యాటింగ్ రావడానికి ముందు ఒకటే చెప్పాడు. ''బాగా ప్రిపేర్ అవ్వు.. నీపై ఉన్న నమ్మకంతో బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపిస్తున్నా.. వెళ్లి ఆటను ఎంజాయ్ చెయ్యు.. ఒత్తిడిని మాత్రం దరి చేరనీయకు.. మేమంతా నీకు సపోర్ట్‌గా ఉన్నాం.. ఈరోజు ఆట నీది.. బాగా ఆడు'' అని చెప్పినట్లు రహానే పేర్కొన్నాడు. The fastest 50 of the season so far and it's from @ajinkyarahane88 💪#MIvCSK #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @ChennaiIPL pic.twitter.com/PZzmJJ999V — JioCinema (@JioCinema) April 8, 2023 చదవండి: శాంతంగా కనిపించే రహానే ఉగ్రరూపం.. సీజన్లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ -
శాంతంగా కనిపించే రహానే ఉగ్రరూపం.. సీజన్లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ
టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే పేరు చెప్పగానే ప్రశాంతతకు మారుపేరు అని టక్కున చెప్పేస్తుంటాం. రహానే కూడా అలానే కనిపిస్తుంటాడు. మ్యాచ్‌లో అయినా.. మ్యాచ్ బయట అయినా అతను ఒకే విధంగా వివాదాలకు దూరంగా ఉంటాడు. అలాంటి రహానే ఇవాళ మాత్రం తనలో దాగున్న ఉగ్రరూపాన్ని బయటపెట్టాడు. అసలు ఆడుతుంది రహానేనా లేక ఇంకెవరైనా అన్నట్లుగా సాగిన బ్యాటింగ్ దెబ్బకు ఐపీఎల్ 16వ సీజన్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదైంది. శనివారం ముంబై ఇండియన్స్, సీఎస్కే మధ్య జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించిన రహానే ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. బంతి పడిందే ఆలస్యం బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న రహానే సీజన్లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీని అందుకున్నాడు. కాగా జాస్ బట్లర్, శార్దూల్ ఠాకూర్లు ఈ సీజన్లో 20 బంతుల్లో అర్థశతకం మార్క్‌ను అందుకోగా.. తాజాగా వీరిద్దరిని అధిగమించిన రహానే సీజన్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని తన పేరిట లిఖించుకున్నాడు. ఇక అర్షద్ ఖాన్ వేసిన 4వ ఓవర్లో రహానేకు పూనకం వచ్చిందా అన్నట్లుగా చెలరేగాడు. ఒక సిక్స్, నాలుగు ఫోర్ల సాయంతో 23 పరుగులు పిండుకున్నాడు. ఇక సీఎస్కే తరపున ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన రెండో ఆటగాడిగా రహానే నిలిచాడు. రహానే కంటే ముందు సురేశ్ రైనా(16 బంతుల్లో) తొలి స్థానంలో ఉన్నాడు. మొయిన్ అలీ కూడా 19 బంతుల్లోనే అర్థశతకం సాధించి రహానేతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉండగా.. ఇక ధోని, అంబటి రాయుడులు 20 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నారు. ఇక ముంబై ఇండియన్స్‌పై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన మూడో ఆటగాడిగా రహానే నిలిచాడు. తొలి స్థానంలో పాట్ కమిన్స్(14 బంతుల్లో), రిషబ్ పంత్(18 బంతుల్లో) రెండో స్థానంలో ఉన్నాడు. The fastest 50 of the season so far and it's from @ajinkyarahane88 💪#MIvCSK #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @ChennaiIPL pic.twitter.com/PZzmJJ999V — JioCinema (@JioCinema) April 8, 2023 చదవండి: అక్కడుంది జడ్డూ.. బంతి మిస్సయ్యే చాన్స్ లేదు -
ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ శాంసన్
ఐపీఎల్ 2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 5) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఓ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ సాయంతో 42 పరుగులు చేసిన సంజూ.. 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అజింక్య రహానే పేరిట ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్‌టైమ్ టాప్ రన్ స్కోరర్ రికార్డును అధిగమించాడు. నిన్నటి మ్యాచ్‌లో చేసిన 42 పరుగులు కలుపుకుని సంజూ ఇప్పటివరకు ఆర్ఆర్ తరఫున 3138 పరుగులు చేయగా.. రహానే 3098 పరుగులు చేశాడు. ఆర్ఆర్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సంజూ, రహానే తర్వాతి స్థానాల్లో షేన్ వాట్సన్ (2474), జోస్ బట్లర్ (2377) ఉన్నారు. ఐపీఎల్లో ఓ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక పరుగుల రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. కోహ్లి.. ఆర్సీబీ తరఫున 224 మ్యాచ్‌ల్లో 129.50 స్ట్రయిక్ రేట్‌తో 6706 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సింగిల్ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి తర్వాత సురేశ్ రైనా, రోహిత్ శర్మ, ఏబీడీ, ధోని, డేవిడ్ వార్నర్, పోలార్డ్, క్రిస్ గేల్, గంభీర్, రహానే ఉన్నారు. ఇదిలా ఉంటే, పంజాబ్ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 5 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ప్రభ్‌సిమ్రన్ (60), కెప్టెన్ శిఖర్ ధవన్ (86 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేయగా, ఛేదనలో తడబడిన ఆర్ఆర్ కోటా ఓవర్లు పూర్తియ్యే సరికి 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసి, లక్ష్యానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది. లక్ష్యఛేదనలో 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి విజయంపై ఆశలు వదులుకున్న రాజస్థాన్‌ను హెట్‌మైర్ (18 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్సర్లు), ఇంపాక్ట్ ప్లేయర్ ధ్రువ్ జురెల్ (15 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఆటతో గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆఖరి ఓవర్లో విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. కర్రన్ తెలివైన బౌలింగ్‌తో రాజస్థాన్ గెలుపును అడ్డుకున్నాడు. -
IPL 2023: ఆరోజే ధోని ఆఖరి ఐపీఎల్ మ్యాచ్?! స్టోక్స్‌తో పాటు రేసులో వారిద్దరి పేర్లు
IPL 2023- MS Dhoni: మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు బ్యాడ్‌న్యూస్! ధోని ఆఖరి ఐపీఎల్ మ్యాచ్‌కు తేదీ దాదాపు ఫిక్స్ అయిపోయినట్లే! అయితే, అందుకు వేదిక చెన్నై లేదంటే మరెక్కడనైనా అన్న విషయంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఏడాది తలా చివరి ఐపీఎల్ ఆడబోతున్నాడన్న వార్త వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్ అధికారి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఐపీఎల్-2023లోనే చివరిసారిగా ధోనిని మైదానంలో చూసే అవకాశం ఉందని సదరు అధికారి పేర్కొన్నారు. మాకు సాడ్ న్యూస్ ‘‘అవును.. ఆటగాడిగా ఎంఎస్‌కు ఇదే ఆఖరి ఐపీఎల్. ఇప్పటివరకైతే మాకు తెలిసిన సమాచారం ఇదే. ఇది పూర్తిగా ధోని సొంత నిర్ణయం. అయితే, ఇప్పటివరకైతే అధికారికంగా మేనేజ్మెంట్తో తన రిటైర్మెంట్ గురించి ధోని చర్చించలేదు. ఏదేమైనా చెన్నైలో మ్యాచ్‌లు జరుగనుండటంతో సీఎస్కే ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కానీ.. ధోని ఫైనల్ సీజన్ ఇదే కావడం వారితో పాటు మా అందరికీ విచారకర విషయం’’ అని ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో ఆ ఆధికారి వ్యాఖ్యానించారు. ఆరోజు ఫైనల్ క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్-2023 ఎడిషన్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 31 నుంచి మే 28 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ల మధ్య అహ్మదాబాద్‌లో జరిగే తొలి పోరుతో ఐపీఎల్–16 ప్రారంభం కానుంది. ఇక ఫైనల్ మే 28న జరుగనుంది. కేకేఆర్ లేదంటే.. ఈ నేపథ్యంలో ఒకవేళ చెన్నై మెరుగైన ప్రదర్శనతో ఫైనల్ చేరితో ధోనికి అదే ఆఖరి మ్యాచ్ అవుతుంది. ప్లే ఆఫ్స్ కూడా చేరనట్లయితే.. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మే 14న కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆడే మ్యాచ్ చివరిది కానుంది. తదుపరి కెప్టెన్? చెన్నైని నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిపిన ధోని వారసుడిగా ఎవరు వస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. గత సీజన్లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగించగా అతడు మధ్యలోనే వదిలేయడంతో.. ధోనినే మళ్లీ కెప్టెన్సీ చేపట్టాడు. స్టోక్స్‌తో పాటు వారిద్దరి పేర్లు అయితే, ఈసారి వేలంలో ఇంగ్లండ్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ను కొనుగోలు చేసిన సీఎస్కే ధోని తర్వాత అతడిని కెప్టెన్‌ను చేసే అవకాశం ఉంది. అయితే, కెప్టెన్సీ రేసులో టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, వెటరన్ ప్లేయర్ అజింక్య రహానే పేర్లు కూడా వినిపించడం విశేషం. దేశీ క్రికెటర్ల చేతికి సీఎస్కే పగ్గాలు అప్పగించాలనుకుంటే వీరు మంచి ఆప్షన్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రహానేకు టీమిండియా వైస్ కెప్టెన్‌గా, తాత్కాలిక కెప్టెన్‌గా అనుభవం ఉండగా.. రుతు దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్ర సారథిగా ఉన్నాడు. చదవండి: IND vs AUS: చెత్త అంపైరింగ్.. కళ్లు కనిపించడం లేదా! కోహ్లిది నాటౌట్.. నో అంటున్నా.. IND VS AUS 2nd Test Day 2: అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు -
ఏమైపోయావు; రెండేళ్ల క్రితం హీరో.. ఇప్పుడు జీరో
Ajinkya Rahane.. 2020-21లో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై సృష్టించిన చరిత్ర ఎవరు మరిచిపోలేరు. అజింక్యా రహానే సారధ్యంలో యువకులతో నిండిన జట్టు నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో నెగ్గి అతిగొప్ప విజయాన్ని నమోదు చేసింది. అప్పటి రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి గైర్హాజరీ.. సీనియర్లు లేకపోవడంతో అసలు జట్టు ఏ మేరకు పోరాడుతుందోనన్న సందేహం కూడా తలెత్తింది. కానీ అజింక్యా రహానే కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించి టీమిండియాకు చారిత్రక విజయం కట్టబెట్టాడు. తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం తర్వాత మెల్బోర్న్లో భారత్ గెలవడం.. ఆపై సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా కుర్రాళ్ల అసమాన పోరాటంతో మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం.. గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో చారిత్రక విజయం సాధించడంతో పాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో రహానే పేరు మార్మోగిపోయింది. భవిష్యత్తు కెప్టెన్ దొరికేశాడంటూ ఆకాశానికెత్తారు. కట్‌చేస్తే.. మళ్లీ రెండేళ్ల తర్వాత ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చింది. అదే బోర్డర్-గావస్కర్ ట్రోఫీ. కానీ రెండేళ్ల క్రితం చరిత్ర సృష్టించిన జట్టును నడిపించిన రహానే ఇప్పుడు జట్టులో లేడు. ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన రహానే ప్రస్తుతం రంజీ క్రికెట్లో బిజీగా ఉన్నాడు. మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నప్పటికి రహానేకు మళ్లీ జాతీయ జట్టు నుంచి పిలుపు రాలేదు. దీని వెనుక ఒక కారణం ఉంది. శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ లాంటి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కీలకంగా ఎదిగే ప్రయత్నంలో ఉన్నారు. కొన్నేళ్లపాటు పుజారాతో పాటు అజింక్యా రహానేకు టీమిండియా టెస్టు జట్టులో కచ్చితంగా స్థానం ఉండేది. మధ్యలో పుజారా, రహానేలు ఇద్దరు ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం కోల్పోయారు. పుజారా కౌంటీల్లో ఆడి వరుస శతకాలతో అలరించి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ పుజారా కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టకున్నాడు. కానీ రహానే పరిస్థితి కాస్త రివర్స్‌గా ఉంది. బ్యాటింగ్‌లో కొన్ని మంచి ప్రదర్శనలు చేసినప్పటికి పుజారాల స్థిరమైన ఇన్నింగ్స్‌లు ఆడడంలో చతికిలపడ్డాడు. రెండేళ్ల క్రితం రహానే సారధ్యంలో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ విజయం అందుకోగానే పొగడ్తలతో ముంచెత్తారు. ఇక రహానే స్థానానికి ఢోకా లేదని అంతా భావించారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని మరోసారి నిరూపితమైంది. రెండేళ్ల క్రితం ఆసీస్ గడ్డపై హీరోగా నిలిచిన రహానే రెండేళ్ల తర్వాత జీరోగా మిగిలిపోయాడు. ఫామ్‌లో లేక జట్టులో చోటు కోల్పోయిన రహానేను తలుచుకున్న టీమిండియా అభిమానులు.. ''రెండేళ్ల క్రితం ఆసీస్ గడ్డపై కెప్టెన్‌గా చరిత్ర సృష్టించి హీరో అయ్యావు.. ఇప్పుడు మాత్రం జీరో అయ్యావు.. ఏమైపోయావు రహానే'' అంటూ తెగ బాధపడుతున్నారు. ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌ల తర్వాత పుజారా, రహానేల ద్వయానికి మంచి పేరొచ్చింది. టెస్టు స్పెషలిస్ట్‌గా పుజారా ముద్ర వేయించుకున్నప్పటికి.. రహానే మాత్రం కెరీర్ ఆరంభంలో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత రహానే కూడా క్రమంగా టెస్టులకే పరిమితమయ్యాడు. మిడిలార్డర్లో కోహ్లి, పుజారాలతో కలిసి ఎన్నో విలువైన భాగస్వామ్యాలు నిర్మించిన రహానే పలు మ్యాచ్‌ల్లో టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 34 ఏళ్ల వయసున్న రహానే ఇక జట్టులోకి రావడం కష్టమే అనిపిస్తుంది. అయితే బ్యాటింగ్‌లో అదరగొట్టి మునుపటి ఫామ్‌ను అందుకున్నా మహా అయితే మరో రెండేళ్లు మాత్రం ఆడగలడేమో. ఇక టీమిండియా తరపున రహానే 82 టెస్టుల్లో 4931 పరుగులు, 90 వన్డేల్లో 2962 పరుగులు సాధించాడు. చదవండి: 'ఓరి మీ వేశాలో.. కాస్త ఎక్కువైనట్టుంది!' అలా సెలెక్టర్ అయ్యాడో లేదో రిటైర్మెంట్ ఇచ్చాడు -
43 ఏళ్లలో తొలిసారి.. ముంబై జట్టుకు ఘోర అవమానం
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో ఢిల్లీ జట్టు తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. 41సార్లు రంజీ చాంపియన్‌గా నిలిచిన ముంబైని ఢిల్లీ జట్టు 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 43 ఏళ్లలో ముంబై జట్టుపై ఢిల్లీకిదే తొలి విజయం కావడం విశేషం. తాజా మ్యాచ్‌తో కలిపి ఢిల్లీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లకు గానూ మూడింటిని డ్రా చేసుకొని.. రెండింటిలో ఓటమిపాలైంది. తాజాగా ముంబైపై విజయంతో సీజన్లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 88 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో ముంబై, ఢిల్లీ చేతిలో ఓడిపోవడం ఇది రెండోసారి మాత్రమే. గ్రూప్-బిలో ఉన్న ఢిల్లీ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌట్ కాగా.. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఢిల్లీకి 76 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 170 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఢిల్లీ ముందు 97 పరుగుల స్వల్ప టార్గెట్ ఉండడంతో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ముంబై తరపున సర్ఫరాజ్ ఖాన్ ఒక్కడే మెరుగ్గా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన సర్ఫరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం డకౌట్ అయ్యాడు.ముంబై కెప్టెన్ అజింక్యా రహానే సహా ఓపెనర్ పృథ్వీ షాలు మ్యాచ్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఢిల్లీ బ్యాటర్ వైభవ్ రవాల్ నిలిచాడు. Delhi successfully chase down the target in the fourth innings and complete a clinical 8️⃣-wicket win over Mumbai 👏👏#RanjiTrophy | #DELvMUM | @mastercardindia pic.twitter.com/NCyK8kn9zU — BCCI Domestic (@BCCIdomestic) January 20, 2023 చదవండి: స్లో ఓవర్ రేట్.. టీమిండియాకు పడింది దెబ్బ కౌంటీల్లో ఆడనున్న స్మిత్! ద్రోహులు అంటూ ఫైర్! తప్పేముంది? -
తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్న రహానే
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో ముంబై కెప్టెన్, టీమిండియా ఆటగాడు ఆజింక్య రహానే సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే ఓ డబుల్ సెంచరీ (హైదరాబాద్‌పై 204 పరుగులు) నమోదు చేసిన రహానే.. తాజాగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో తృటిలో మరో డబుల్ సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో 302 బంతులను ఎదుర్కొన్న రహానే 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 191 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఎండ్‌లో ఓపెనర్ పృథ్వీ షా రికార్డు స్థాయిలో 379 పరుగులు చేయడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 687 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో ముషీర్ ఖాన్ (42). అర్మాన్ జాఫర్ (27), సర్ఫరాజ్ ఖాన్ (28 నాటౌట్) సైతం ఓ మోస్తరు స్కోర్లు సాధించారు. అస్సాం బౌలర్లలో రియాన్ పరాగ్ 2 వికెట్లు పడగొట్టగా.. ముక్తర్ హుస్సేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం 28 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. ఓపెనర్ శుభమ్ మండల్ (40) మోహిత్ అవస్తి బౌలింగ్‌లో ప్రసాద్ పవార్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. మరో ఓపెనర్ రాహుల్ హజారికా (42), రిషవ్ దాస్ (15) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా.. అస్సాం, ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 587 పరుగులు వెనుకపడి ఉంది. -
రెండో డబుల్ సెంచరీ.. టీమిండియాలో చోటు ఖాయం! పుజారాలా నువ్వు కూడా!
Ranji Trophy 2022-23 Mumbai vs Hyderabad: భారత క్రికెటర్, ముంబై జట్టు కెప్టెన్ అజింక్య రహానే డబుల్ సెంచరీతో మెరిశాడు. రంజీ ట్రోఫీ 2022-23లో భాగంగా హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ద్విశతకం బాదాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 261 బంతులు ఎదుర్కొన్న ఈ ముంబై సారథి.. 26 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 204 పరుగులు సాధించాడు. కాగా ముంబై- హైదరాబాద్ మధ్య డిసెంబరు 20న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వేదికగా టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆదిలోనే వికెట్ కోల్పోయింది. తేలిపోయిన హైదరాబాద్ బౌలర్లు ఓపెనర్ పృథ్వీ షా 19 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే, మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 162 పరుగులతో చెలరేగగా.. వన్‌డౌన్‌లో వచ్చిన టీమిండియా టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్ 80 బంతుల్లోనే 90 పరుగులు సాధించాడు. సూర్య అవుటైన తర్వాత రెండో రోజు ఆటలో భాగంగా యశస్వి, సర్ఫరాజ్(నాటౌట్)తో కలిసి రహానే భారీ భాగస్వామ్యాలు నమోదు చేశాడు. ఈ క్రమంలో బుధవారం 204 పరుగుల వద్ద త్యాగరాజన్ బౌలింగ్‌లో రహానే అవుటయ్యాడు. భారీ స్కోరు ఇక యశస్వి సెంచరీ, రహానే ద్విశతకానికి తోడు సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో కదం తొక్కుతుండటంతో రెండో రోజు రెండో సెషన్లో 124 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ముంబై 636 పరుగుల భారీ స్కోరు చేసింది. టీమిండియాలో చోటు ఖాయం! కాగా ఈ ఏడాది దేశవాళీ క్రికెట్లో రహానేకు ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. సెప్టెంబరులో దులీప్ ట్రోఫీలో భాగంగా వెస్ట్‌జోన్ తరఫున బరిలోకి దిగిన రహానే.. నార్త్ జోన్‌తో మ్యాచ్‌లో 207 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియాలో పునరాగమనం కోసం ఎదురు చూస్తున్న రహానే ఈ మేరకు అద్భుతంగా రాణించడం పట్ల అతడి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే టోర్నీ ఆసాంతం మెరుగైన ప్రదర్శన కనబరిస్తే పుజారా మాదిరి ఈ మాజీ వైస్ కెప్టెన్ కూడా ప్రధాన జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమంటున్నారు. కాగా రహానే చివరిసారిగా దక్షిణాఫ్రికా టూర్లో టీమిండియా తరఫున ఆడాడు. చదవండి: Babar Azam: ఒక్క మాటతో రమీజ్ రాజా నోరు మూయించిన బాబర్! అది సాధ్యం కాదు.. ప్రతి వాడూ.. Ajinkya Rahane gets his Double Century #RanjiTrophy pic.twitter.com/tnP98uiPqd — Jigar Mehta (@jigsactin) December 21, 2022 -
వచ్చీ రాగానే మొదలెట్టేశాడు.. సూర్యకుమార్ ఊచకోత కొనసాగింపు
Ranji Trophy 2022-23: బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లకుండా కొద్ది రోజులు విరామం తీసుకున్న టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా హైదరాబాద్‌తో ఇవాళ (డిసెంబర్ 20) మొదలైన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగాడు. వచ్చీ రాగానే తన మార్క్ నాటుకొట్టుడును ప్రారంభించిన స్కై.. మునుపటి ఫామ్‌ను కొనసాగిస్తూ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 80 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్ సాయంతో 90 పరుగులు చేశాడు. 112.50 స్ట్రయిక్ రేట్‌తో హైదరాబాద్ బౌలర్లను ఎడాపెడా వాయించిన మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్.. 10 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (162), కెప్టెన్ అజింక్య రహానే (108 నాటౌట్)లు శతకాలతో చెలరేగడంతో 75 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 396 పరుగుల భారీ స్కోర్ చేసింది. రహానేకు జతగా సర్ఫరాజ్ ఖాన్ (10) క్రీజ్‌లో ఉన్నాడు. హైదరాబాద్ బౌలర్లలో శశాంక్ 2 వికెట్లు పడగొట్టగా, కార్తీకేయ ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై.. ఆంధ్రప్రదేశ్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందగా.. హైదరాబాద్ తమిళనాడు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. -
కీలక ఇన్నింగ్స్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్.. ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత ముంబై
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2022 విజేతగా ముంబై జట్టు నిలిచింది. ఇవాళ (నవంబర్ 6) జరిగిన ఫైనల్లో ముంబై.. హిమాచల్‌ప్రదేశ్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించి తొలిసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ (31 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడగా, తనుష్ కోటియన్ తొలుత బౌలింగ్‌లో (3/15, 5 బంతుల్లో 9 నాటౌట్; సిక్స్), ఆతర్వాత బ్యాటింగ్‌లో ఉత్కంఠ సమయంలో సిక్సర్ కొట్టి ముంబైని గెలిపించాడు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై.. తనుష్ కోటియన్, మోహిత్ అవస్థి (3/15), అమన్ హకీం ఖాన్ (1/24), శివమ్ దూబే (1/16) బంతితో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఏకాంత్ సేన్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబై ఆరంభంలోనే తడబడినప్పటికీ.. యశస్వి జైస్వాల్ (27), శ్రేయస్ అయ్యర్ (34), సర్ఫరాజ్ ఖాన్ ఓ మోస్తరుగా రాణించి ముంబైని విజేతగా నిలిపారు. 12 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన సమయంలో సర్ఫరాజ్ ఖాన్ 2 ఫోర్లు, సిక్సర్ బాది జట్టును గెలుపు ట్రాక్‌లో పెట్టాడు. ఆఖరి ఓవర్లో ముంబై గెలుపుకు 8 పరుగులు అవసరం కాగా.. తనుష్ కోటియన్.. రిషి ధవన్ వేసిన మూడో బంతికి సిక్పర్ బాది ముంబై చాన్నాళ్ల కలను సాకారం చేశాడు. -
డబుల్ సెంచరీతో చెలరేగిన అజింక్య రహానే...
చెన్నై: భారత టెస్టు జట్టులో కోల్పోయిన స్థానాన్ని మళ్లీ సాధించాలని పట్టుదలగా ఉన్న అజింక్య రహానే దేశవాళీ సీజన్‌ను ఘనంగా ప్రారంభించాడు. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో వెస్ట్‌జోన్ బ్యాటర్ రహానే (264 బంతుల్లో 207 బ్యాటింగ్; 18 ఫోర్లు, 6 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. అతనికి తోడు యశస్వి జైస్వాల్ (321 బంతుల్లో 228; 22 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా ద్విశతకం బాదడం విశేషం. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సరికి వెస్ట్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 590 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా (121 బంతుల్లో 113; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా శతకం సాధించాడు. బలమైన వెస్ట్‌జోన్ బ్యాటింగ్ లైనప్ ముందు అనామక జట్టుగా నార్త్ ఈస్ట్ తేలిపోయింది. చదవండి: Asia Cup 2022: పాక్‌కు షాకిచ్చిన శ్రీలంక.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం -
రోహిత్ దూరమైతే!.. టీమిండియాను నడిపించేది ఎవరు?
ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్ తగిలింది. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో కరోనా పాజిటివ్‌గా తేలాడు. దీంతో వారం పాటు రోహిత్ ఐసోలేషన్‌లో ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే జూలై 1న ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న టెస్టు మ్యాచ్‌కు రోహిత్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ దూరమైతే జట్టును నడిపించేది ఎవరనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. కోహ్లి లేదా పంత్.. కాదనుకుంటే రహానే? వాస్తవానికి కెప్టెన్ దూరమైతే జట్టును వైస్ కెప్టెన్ నడిపించడం ఆనవాయితీ. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు రోహిత్ కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. అయితే రాహుల్ గజ్జల్లో గాయంతో ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత బీసీసీఐ కూడా ప్రత్యేకంగా వైస్ కెప్టెన్ ఎవరనేది వెల్లడించలేదు. అనుభవం దృష్యా కోహ్లి లేదా పంత్‌లలో ఎవరు ఒకరు జట్టును నడిపించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇంతకముందు టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి నుంచే రోహిత్ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌లో కోహ్లి నేతృత్వంలోని టీమిండియా సూపర్ ప్రదర్శనతో అదరగొట్టింది. 2-1తో ఆధిక్యంలో ఉన్న దశలో కరోనా వైరస్ కారణంగా ఐదో టెస్టు వాయిదా పడింది. తాజా పర్యటనలో ఆ ఐదో టెస్టును ఏకైక టెస్టుగా మార్చి మళ్లీ నిర్వహిస్తున్నారు. అప్పటి జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కోహ్లికి మరోసారి అవకాశం ఉంది. అయితే కోహ్లి దీనికి అంగీకరిస్తాడా లేదా అనేది వేచి చూడాలి. అలా కాకుండా పంత్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించే యోచనలోనూ బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియాను విజయవంతగా నడిపించాడు. అది టి20... అందునా యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సమస్య రాలేదు. కానీ ఇక్కడేమో టెస్టు జట్టు.. పైగా జట్టులో పంత్ కన్నా సీనియర్లు ఉండడంతో జట్టును సమర్థంగా నడిపించగలడా అనే సందేహాలు వస్తున్నాయి. వీరిద్దరు కాదనుకుంటే రహానేకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశము లేకపోలేదు. రోహిత్ శర్మకు నెగెటివ్ వస్తే.. తాజాగా రోహిత్ శర్మకు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో కరోనా పాజిటివ్ అని వచ్చింది. ర్యాపిడ్ టెస్టులో ఒక్కోసారి తప్పుడు రిపోర్ట్స్ వస్తుంటాయి. అందుకే రోహిత్ శర్మకు ఆర్టీపీసీఆర్ టెస్టు కూడా నిర్వహించారు. దీని ఫలితం మరికొద్ది గంటల్లో రానుంది. ఒకవేళ నెగెటివ్ వస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఇంగ్లండ్‌తో టెస్టుకు రోహిత్ సారధ్యం వహిస్తాడు. అలా కాకుండా పాజిటివ్ వస్తే మాత్రం వారం రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సి వస్తుంది. చదవండి: కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు.. స్కోర్: 364/9 టీమిండియాకు భారీ షాక్.. రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్..! -
'థాంక్యూ రహానే.. కోహ్లిని రనౌట్ చేయకుంటే గెలిచేవాళ్లం కాదు'
2020 ఏడాది చివర్లో బోర్డర్-గావస్కర్ సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ను భారత్ ఓటమితో ప్రారంభించింది. కోహ్లి సారధ్యంలో డే నైట్ టెస్టు ఆడిన టీమిండియా అడిలైడ్‌లో బొక్కా బోర్లా పడింది. 36 పరుగులకే ఆలౌటై టెస్టు క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డును నమోదు చేసింది. ఆ తర్వాత కోహ్లి పెటర్నిటి సెలవులపై స్వదేశానికి వెళ్లిపోవడంతో రహానేకు బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత భారత్ 2-1తో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. సీనియర్లు లేకుండా, కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమైనా ఆస్ట్రేలియాను గబ్బా టెస్టులో ఓడించి, 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది టీమిండియా. భారత క్రికెట్ చరిత్రలో ఈ సిరీస్ విజయం చాలా ప్రత్యేకమైనదిగా చిరస్థాయిగా మిగిలిపోయింది. తాజాగా వూట్ అనే ప్లాట్‌ఫామ్.. ఆస్ట్రేలియా-భారత్ సిరీస్‌ను‘బందో మే త దమ్’ అనే డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కించింది. ఈ డాక్యుమెంటరీలో సిరీస్‌లో ఆటగాళ్ల అనుభవాలు, విశేషాలను పంచుకుంది. తాజాగా అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అడిలైడ్ టెస్టులో రహానే.. కోహ్లిని రనౌట్ చేసిన విషయాన్ని మరొకసారి గుర్తుచేశాడు. ‘విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 20-30 పరుగుల వద్ద ఉన్నప్పుడు అనుకుంటా... లైటింగ్ పోయింది. ఫ్లడ్ లైట్స్ వెలుతురులో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అయితే విరాట్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ కొనసాగించాడు. కోహ్లీ ఎక్కువ సేపు క్రీజులో ఉంటే మాకు నష్టం జరిగేదే. మ్యాచ్ గడిచేకొద్దీ విరాట్ కోహ్లీ క్రీజులో కుదురుకుపోతున్నాడు. మరో ఎండ్‌లో రహానే కూడా బాగా ఆడుతున్నాడు. ఇద్దరూ కలిసి చక్కగా ఇన్నింగ్స్ నిర్మిస్తున్నారు. లక్కీగా రహానే, కోహ్లీని రనౌట్ చేశాడు. మా వరకూ అదే గేమ్ ఛేజింగ్ మూమెంట్. అప్పటిదాకా మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోతుందనే భయపడ్డాం. అయితే కోహ్లీ అవుట్ అయ్యాక మాలో నమ్మకం పెరిగింది..ఎందుకంటే విరాట్ కోహ్లీ బెస్ట్ ప్లేయర్. అతన్ని అవుట్ చేస్తే మిగిలిన వారిని ఇబ్బంది పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అనుకున్నట్టే కోహ్లీ అవుట్ అయ్యాక మ్యాచ్ మా చేతుల్లోకి వచ్చేసింది... ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే...’ అంటూ ‘బందో మే త దమ్’ అనే డాక్యుమెంటరీలో కామెంట్ చేశాడు ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అయితే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకి ఆలౌట్ కావడంతో.. భారత జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల ఆధిక్యం దక్కింది. ఆధిక్యం సాధించామనే సంతోషం టీమిండియాకు ఎక్కువసేపు నిలవలేదు. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 45 నిమిషాల్లోనే కుప్పకూలింది. 21.2 ఓవర్లలో 36 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మహ్మద్ షమీ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరడంతో 36/9 వద్ద టీమిండియా రెండో ఇన్నింగ్స్ తెరపడింది. It’s finally here!🏏 20 players, 4 Tests, 2 of cricket’s best teams, 1 mind-blowing story! Come & witness the Baap of all Fightbacks & the blood, sweat and tears that went into achieving it. Watch Neeraj Pandey’s Bandon Mein Tha Dum, streaming now on Voot Select. pic.twitter.com/8YeCMfrTVf — Voot (@justvoot) June 16, 2022 చదవండి: క్రికెట్లో ఇలాంటి అద్భుతాలు అరుదుగా.. 134 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన పృథ్వీ షా Shaheen Afridi: పాక్ బౌలర్‌కు ఖరీదైన కారు గిఫ్ట్‌గా.. ఒక్కదానికే! -
రహానే స్థానంలో అరంగేట్రం.. డబుల్ సెంచరీతో కొత్త చరిత్ర
రంజీ క్రికెట్ అంటే దేశవాలీలో ఎనలేని క్రేజ్. ఎందుకంటే టీమిండియాలోకి రావాలంటే ఏ ఆటగాడైనా తన ఆటేంటో రంజీల్లో రుచి చూపించాల్సిందే. ఇప్పుడంటే ఐపీఎల్ లాంటి లీగ్స్ వల్ల యువ క్రికెటర్లు ఎందరో వస్తున్నారు కానీ.. ఒకప్పుడు రంజీ ట్రోపీయే ఎందరో ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చింది. తాజాగా రంజీ ట్రోపీలో భాగంగా ముంబై, ఉత్తరాఖండ్ మధ్య రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పృథ్వీ షా(21), యశస్వి జైశ్వాల్(35)లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అప్పుడు క్రీజులోకి వచ్చాడు సువేద్ పార్కర్.. పేరు కొత్తగా వింటున్నప్పటికి రహానే స్థానంలో ముంబై తరపున రంజీ ట్రోపీలో అరంగేట్రం చేశాడు. గాయంతో దూరమైన రహానే విలువ తెలియకుండా బ్యాటింగ్ కొనసాగించిన సువేద్ పార్కర్ డెబ్యూ మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. దురదృష్టవశాత్తూ రనౌట్ అయిన సువేద్ పార్కర్.. తాను ఔటయ్యే వరకు నిలకడైన ఆటతీరుతో అదరగొట్టాడు. 447 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్సర్లతో 252 పరుగులు చేశాడు. రంజీల్లో ముంబై తరపున అరంగేట్రం మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా సువేద్ పార్కర్ చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు ముంబై ప్రస్తుత కోచ్ అమోల్ మజుందార్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ముంబై తరపున 1993-94 రంజీ సీజన్లో హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో 260 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు. తాజాగా ఆ రికార్డును సువేద్ పార్కర్ బ్రేక్ చేశాడు. ఇక సువేద్ పార్కర్ దాటికి ముంబై తొలి ఇన్నింగ్స్‌ను వికెట్ల నష్టానికి 647 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సువేద్తో పాటు సర్ఫరాజ్ ఖాన్ 153, ఆర్మాన్ జాఫర్ 60 పరుగులతో రాణించారు. చివర్లో షామ్స్ ములాని 59 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక గాయంతో రహానే రంజీ ట్రోపీకి దూరమైన సంగతి తెలిసిందే. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మూడు, నాలుగు వారాలు రహానే రెస్ట్ అవసరం ఉంది. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ఇక సువేద్ పార్కర్ 2001 ఏప్రిల్ 6న ముంబైలో జన్మించాడు. చదవండి: Sarfaraz Khan: అదరగొట్టిన సర్ఫరాజ్.. ట్రిపుల్ సెంచరీ, 2 డబుల్ సెంచరీలు, 3 సెంచరీలు! -
Ajinkya Rahane: తక్కువగా అంచనా వేశారు.. కానీ: సెహ్వాగ్
Happy Birthday Ajinkya Rahane: టీమిండియా బ్యాటర్ అజింక్య రహానే సోమవారం 34వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్ల నుంచి ఈ మహారాష్ట్ర ఆటగాడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న రహానే.. ఆస్ట్రేలియా పర్యటనలో.. కోహ్లి గైర్హాజరీలో క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌ను గెలిపించిన తీరును ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి. నాడు అవమానకర ఓటమి నుంచి పడిలేచిన కెరటంలా! గతేడాది(2020-21) ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపై కంగారూలను మట్టికరిపించి 2-1 తేడాతో గెలిచి టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. అడిలైడ్ పింక్‌బాల్ టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ అయి తీవ్ర విమర్శల పాలైన భారత జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. పితృత్వ సెలవు కోసం అప్పటి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశానికి పయమనమ్యాడు. అదే సమయంలో కీలక బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ గాయాల బారిన పడి జట్టు దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో మెల్బోర్న్ టెస్టు నేపథ్యంలో సారథిగా బాధ్యతలు చేపట్టిన రహానే.. రహానే జట్టును ముందుకు నడిపించాడు. అతడి కెప్టెన్సీలో టీమిండియా మెల్బోర్న్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించడం సమా సిడ్నీ టెస్టును డ్రా చేసుకుంది. అంతేగాక నాలుగో టెస్టులో 3 వికెట్ల తేడాతో సంచలన విజయం నమోదు చేసి సిరీస్‌ను చేజిక్కించుకుంది. కాగా ఈ చారిత్రక విజయం త్వరలోనే బిగ్స్క్రీన్పై డాక్యుమెంట్ రూపంలో కనువిందు చేయనుంది. తక్కువగా అంచనా వేశారు.. కానీ ఈ నేపథ్యంలో భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రహానెను కొనియాడుతూ బర్త్‌డే విషెస్ తెలిపాడు. ‘‘తక్కువగా అంచనా వేయబడ్డ ఎంతో మంది క్రికెటర్లలో తనూ ఒకడు. విదేశంలో టెస్టు సిరీస్ గెలిచి భారత్‌ను ముందుకు నడిపిన సారథి.. పుట్టినరోజు శుభాకాంక్షలు అజింక్య రహానే. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఆ దేవుడు నీకు శక్తినివ్వాలి’’ అని ట్వీట్ చేశాడు. ఇక రహానే సహచర ఆటగాడు, నయావాల్ ఛతేశ్వర్ పుజారా.. ‘‘హ్యాపీ బర్త్‌డే బ్రదర్.. నీకు మరిన్ని విజయాలు లభించాలి’’ అని ఆకాంక్షించాడు. అదే విధంగా బీసీసీఐ.. ‘‘192 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 8268 అంతర్జాతీయ పరుగులు.. రహానేకు పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అని ట్విటర్ వేదికగా విషెస్ తెలిపింది. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా రహానేను విష్ చేశారు. చదవండి👉🏾Joe Root: వామ్మో.. ఇదేంటి? రూట్ నీకు చేతబడి తెలుసా? అదేం కాదు బ్రో.. వైరల్! చదవండి👉🏾Kohli- Rohit- Rahul: పేరు ఉంటే సరిపోదు.. అందుకు తగ్గట్టు ఆడాలి: భారత దిగ్గజం ఘాటు విమర్శలు When everything was against them, they stood tall and showed the world their true grit, strength and determination. Witness the story of the greatest fightback. The story behind India’s biggest triumph in Test history.#BandonMeinThaDum - The fight for India’s pride. pic.twitter.com/T6ilpxIbgH — Voot Select (@VootSelect) June 1, 2022 -
‘రెండు నెలల్లో కోలుకుంటా’
తొడ కండరాల గాయంతో ఆటకు దూరమైన భారత క్రికెటర్ అజింక్య రహానే 6–8 వారాల్లోగా కోలుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో కోల్‌కతా తరఫున ఆడుతూ రహానే గాయపడ్డాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో పది రోజుల పాటు తన రీహాబిలిటేషన్ జరిగిందని, గాయం తీవ్రత ప్రస్తుతం తగ్గిందని అతను అన్నాడు. రహానే సారథ్యంలో ఆస్ట్రేలియాపై సాధించిన గత టెస్టు సిరీస్ విజయంపై రూపొందించిన డాక్యుమెంటరీలో తన మెల్బోర్న్ టెస్టు సెంచరీని అతను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. -
బిగ్స్క్రీన్పై చారిత్రక టెస్టు సిరీస్.. రోమాలు నిక్కబొడుచుకునేలా ట్రైలర్
భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో మైలురాళ్లు దాగున్నాయి. ఐసీసీ ట్రోపీలు గెలవడంతో పాటు పలు చారిత్రక సిరీస్‌ల్లో విజయాలు సాధించిన కోట్ల మంది అభిమానుల గుండెలు ఉప్పొంగేలా చేసింది. 1983లో ఐసీసీ టోర్నీ అయిన వరల్డ్‌కప్ గెలవడం ఒక చరిత్ర. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ డెవిల్స్ లార్డ్స్ బాల్కనీలో నుంచొని వరల్డ్‌కప్ అందుకుంటే మన నరాల్లో దేశభక్తి పొంగిపోయింది. అప్పటి వరల్డ్‌కప్ విజయాన్ని దేశంలో ప్రజలు పెద్ద పండుగగా నిర్వహించుకున్నారు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్లో ఒక పెను సంచలనం. అతన్ని భారతీయులు ఒక క్రికెట్‌గాడ్‌గా అభివర్ణించారు. ఇక 2007 టి20 ప్రపంచకప్‌ను యువ రక్తంతో నిండిన జట్టు సొంతం చేసుకోవడం.. 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ధోని ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ దేశానికి రెండోసారి వరల్డ్‌కప్ అందించిన సంఘటన భారత్ క్రికెట్ బతికున్నంతవరకు నిలిచిపోతుంది. ఆ తర్వాత 2013లో చాంపియన్స్ ట్రోపీ, 2019లో వరల్డ్‌కప్ సెమీఫైనల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే ఇవన్నీ ఐసీసీ మేజర్ టోర్నమెంట్లు. వీటికున్న క్రేజ్ వేరుగా ఉంటుంది. సాధారణంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లను ప్రజలు పట్టించుకోరు. కానీ 2020-21లో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గావస్కర్ ట్రోపీని 2-1తో కైవసం చేసుకోవడం భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. భారత్ క్రికెట్ గురించి ఇకపై ఎప్పుడు మాట్లాడినా ఈ సిరీస్‌కు గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిందే.. కాదు చర్చించుకునేలా చేసింది. తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని ఆస్ట్రేలియా తో టెస్టు సిరీస్ నిరూపించింది. 2018-19లోనూ టీమిండియా ఆసీస్ గడ్డపై ట్రోపీ గెలిచినప్పటికి.. దానిని దీనితో పోల్చలేం. ఎందుకంటే ఈ సిరీస్‌ను భారత్ ఓటమితో ప్రారంభించింది. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్‌బాల్ టెస్టులో 36 పరుగులకే ఆలౌటై అవమానకర రీతిలో ఓడిపోయింది. కోహ్లి కెప్టెన్సీలో ఆడిన తొలి టెస్టు టీమిండియాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ తర్వాత కోహ్లి పెటర్నిటీ సెలవుపై స్వదేశం వెళ్లడం.. బుమ్రా, షమీలు గాయాలతో ఇబ్బంది పడడంతో ఒక్కసారిగా టీమిండియాకు కష్టాలు చుట్టుముట్టాయి. ఈ పరిస్థితులో రహానే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఓటమితో దెబ్బతిన్న జట్టును తన నాయకత్వ పటిమతో రహానే తిరిగి నిలబెట్టాడు. అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి అనంతరం, రహానే సారధ్యంలో టీమిండియా మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 1-1తో సిరీస్‌ను సమం చేసింది. అనంతరం సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్ట్ డ్రా కాగా, సిరీస్ డిసైడర్ అయిన కీలక నాలుగో టెస్ట్‌లో టీమిండియా 3 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసి 4 టెస్ట్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. గబ్బాలో ఓటమెరుగని ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించిన టీమిండియా అద్భుత విజయంతో సిరీస్‌ను ముగించింది. వాస్తవానికి ఓటమి దెబ్బలు తిని మళ్లీ గెలుపు ఎలా దక్కించుకోవాలో టీమిండియాను చూస్తే అర్థమవుతుంది. అందుకే ఈ చారిత్రక సిరీస్‌ను బిగ్స్క్రీన్పై డాకుమెంట్ రూపంలో చూపించాలనుకున్నాడు దర్శకుడు నీరజ్ పాండే. నీరజ్ పాండే.. స్పెషల్ 26, బేబీ, ఎంఎస్ ధోని లాంటి మంచి అభిరుచి ఉన్న సినిమాలకు దర్శకత్వం వహించాడు. మాములుగానే తన సినిమాలో భావోద్వేగాలను తారాస్థాయిలో చూపించే ఈ దర్శకుడు.. ఇలాంటి దానిని మాములుగా వదలిపెడతాడా.. సందేహం లేదు. తాజాగా డాక్యమెంటరీకి సంబంధించిన ట్రైలర్‌ను జూన్ 1న(బుధవారం) ఆ సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన అజింక్యా రహానే, సిరాజ్, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారాలు విడుదల చేశారు. నీరజ్ పాండే 'బంధన్ మే తా ధమ్' పేరుతో సిరీస్‌ను నిర్మించాడు. సిరీస్‌లో జరిగిన సంఘటనలను ఒక అంశాలుగా తీసుకొచ్చి.. మధ్యమధ్యలో రహానే,సిరాజ్‌లు తమ అనుభవాలను పంచుకునేలా ఆసక్తికరంగా ట్రైలర్‌ను కట్‌చేశారు. మొత్తానికి రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్న ట్రైలర్‌ను మించి డాక్యుమెంట్ ఉండబోతుందని అర్థమవుతుంది. కాగా జూన్ 16 నుంచి ఓటీటీ ఫ్లాట్‌ప్లామ్ అయిన వూట్ సెలెక్ట్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. చదవండి: Liam Livingstone: బౌలర్లు అయిపోయారు.. పనిచేసేవాళ్లను కూడా వదిలిపెట్టవా! Happy Birthday Dinesh Karthik: దినేశ్ కార్తిక్.. ఫెయిల్యూర్ మ్యారేజ్ టూ సక్సెస్ఫుల్ లవ్‌స్టోరీ When everything was against them, they stood tall and showed the world their true grit, strength and determination. Witness the story of the greatest fightback. The story behind India’s biggest triumph in Test history.#BandonMeinThaDum - The fight for India’s pride. pic.twitter.com/T6ilpxIbgH — Voot Select (@VootSelect) June 1, 2022 -
IPL 2022: మనం కచ్చితంగా ప్లే ఆఫ్స్‌నకు వెళ్తాం... కోల్‌కతాలో..
IPL 2022 Playoffs: ‘‘మైదానం లోపల, వెలుపలా.. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. క్రికెటర్‌గా ఎంతో నేర్చుకున్నా. జీవితం గురించి మరింతగా తెలుసుకున్నా. నా సహచర ఆటగాళ్లందరికీ థాంక్స్! నాకు మద్దతుగా నిలిచిన సహాయక సిబ్బంది, వెంకీ సర్! మేనేజ్మెంట్లోని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’’ అంటూ టీమిండియా సీనియర్ ఆటగాడు, కోల్‌కత్ నైట్‌రైడర్స్ క్రికెటర్ అజింక్య రహానే ఉద్వేగానికి లోనయ్యాడు. వచ్చే ఏడాది నూతనోత్సాహంతో తిరిగి వస్తానని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ అజింక్య రహానేను కోటి రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆడిన 7 మ్యాచ్‌లలో అతడు కేవలం 133 పరుగులు సాధించాడు. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా అతడు గాయపడిన విషయం తెలిసిందే. కండరాల నొప్పితో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో సెండాఫ్ సమయంలో.. జట్టుతో తనకున్న అనుబంధాన్ని రహానే గుర్తుచేసుకున్నాడు. అదే విధంగా కేకేఆర్ కచ్చితంగా ప్లే ఆఫ్స్‌నకు చేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది మళ్లీ అందరినీ కలుస్తానంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘మన జట్టు తదుపరి మ్యాచ్‌లో తప్పకుండా రాణిస్తుంది. ప్లే ఆఫ్స్ కోసం మనం కోల్‌కతా వెళ్తాం’’ అని రహానే వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కేకేఆర్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కోల్‌కతా ఆరింట గెలిచి 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. శ్రేయస్ బృందం ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో భారీ తేడాతో గెలుపొందాలి. చదవండి👉🏾Kane Williamson: ఇంకెంత కాలం విలియమ్సన్‌ను భరిస్తారు.. తుది జట్టు నుంచి తప్పించండి! చదవండి👉🏾Hardik Pandya: ‘వై దిస్ కొలవరి’.. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న గుజరాత్ ఆటగాళ్లు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); 🚨 𝐎𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥 𝐀𝐧𝐧𝐨𝐮𝐧𝐜𝐞𝐦𝐞𝐧𝐭 Ajinkya Rahane is going to miss the remaining games of #IPL2022 due to a hamstring injury. Wish you a speedy recovery, @ajinkyarahane88. The Knights camp will miss you 💜#AmiKKR #IPL2022 pic.twitter.com/aHDYmkE2f0 — KolkataKnightRiders (@KKRiders) May 17, 2022