ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి అనంతరం టీమిండియా టెస్టు కెప్టెన్సీపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించి అతడి స్ధానంలో కొత్త సారధిని నియమించాలని పలువురు మాజీలు డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఇదే విషయంపై భారత మాజీ సెలక్టర్ దేవాంగ్ గాంధీ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. టెస్టుల్లో నుంచి రోహిత్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అర్హత వెటరన్ ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్ ,అజింక్యా రహానెలకు ఉందని దేవాంగ్ గాంధీ అభిప్రాయపడ్డాడు.
టెస్టు క్రికెట్‌లో భారత జట్టును నడిపించే సత్తా రవిచంద్రన్ అశ్విన్‌కు ఉంది. ఒక వేళ అశ్విన్‌కు ఓవర్సీస్‌లో అంత మంచి ట్రాక్ రికార్డు లేదని భావిస్తే.. రహానే వంటి మరో అద్భుతమైన ఆప్షన్ మీ వద్ద ఉంది. రహానేకు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియా టూర్‌లో జట్టును ఏ విధంగా నడిపించాడో మనందరీకీ తెలుసు.
జట్టుకు చారిత్రాత్మక విజయాలు అందించాడు. కాబట్టి భారత కెప్టెన్సీకి రహానే కూడా మంచి ఎంపిక. అయితే ఒకనొక దశలో రహానే జట్టులో కూడా చోటు కోల్పోయాడు. కానీ అతడు మళ్లీ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. అతడు తన ఫామ్‌ను కొనసాగిస్తాడు అని అశిస్తున్నాను.
అదే విధంగా వెటరన్ ఆటగాడు పుజారాకు వెస్టిండీస్ సిరీస్‌లో మరో అవకాశం ఇవ్వాలి. అక్కడ కూడా పుజారా రాణించకపోతే మరో యువ క్రికెటర్‌ను సిద్దం చేసే పనిలో పడాలి" అని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాంధీ పేర్కొన్నాడు.
చదవండి: #SureshRaina: ఎల్‌పీఎల్ చరిత్రలో తొలిసారి వేలం.. కళ్లన్నీ ఆ క్రికెటర్‌పైనే
Comments
Please login to add a commentAdd a comment