
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి.
ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా వెటరన్, కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ చరిత్రలోనే మూడు ఫ్రాంచైజీలకు సారథిగా వ్యవహరించిన తొలి భారత ఆటగాడిగా రహానే రికార్డులకెక్కనున్నాడు.
కేకేఆర్ ఫ్రాంచైజీ ఇటీవలే తమ కెప్టెన్‌గా రహానేను ఎంపిక చేసింది. రహానే కేకేఆర్‌ను గతేడాది ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ స్ధానాన్ని భర్తీ చేయనున్నాడు. అదేవిదంగా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కోల్‌కతా జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
మూడోసారి..
రహానే తొలిసారిగా 2017 ఐపీఎల్ సీజన్‌లో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ (RPS) జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఓ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ గైర్హజారీలో పూణే జట్టును రహానే నడిపించాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2018లో రాజస్థాన్ రాయల్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన రహానే.. స్మిత్‌పై ఏడాది పాటు నిషేధం విధించడంతో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.
తర్వాతి ఐపీఎల్-2019లో హాఫ్ సీజన్ వరకు ఆర్ఆర్ జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే స్మిత్ తిరిగి రావడంతో కెప్టెన్సీ నుంచి రహానే తప్పుకున్నాడు. 2019 ప్రపంచ కప్‌కు సిద్ధం కావడానికి స్మిత్ తన స్వదేశానికి వెళ్లిపోవడంతో రహానే మళ్లీ రాజస్తాన్ రాయల్స్ బాధ్యతలు చేపట్టాడు.
ఆ తర్వాతి సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్,చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రహానే ఆటగాడిగానే కొనసాగాడు. ఐపీఎల్-2025లో మెగా వేలంలో రహానేను కేవలం రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి రౌండ్‌లో అమ్ముడుపోని రహానే ఆఖరి రౌండ్‌లో కేకేఆర్ సొంతం చేసుకుంది.
చదవండి: PAK vs NZ: మళ్లీ అదే కథ.. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
Comments
Please login to add a commentAdd a comment