Ind Vs Aus WTC Final 2023: Shardul Thakur Makes A Shocking Comeback In Team India WTC Squad - Sakshi
Sakshi News home page

Ind Vs Aus WTC 2023: టీమిండియా ఆల్‌రౌండర్‌కు బంపరాఫర్‌.. పాపం సూర్యకుమార్‌!

Published Tue, Apr 25 2023 2:03 PM | Last Updated on Tue, Apr 25 2023 2:53 PM

Shardul Thakur makes a SHOCKING comeback in Team India SQUAD WTC - Sakshi

లండన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టులో రెండు అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్‌లో అదరగొడుతున్న వెటరన్‌ ఆటగాడు అజింక్య రహానే సెలక్టర్లు పిలుపునిచ్చారు. గాయం కారణంగా దూరమైన శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో రహానే అవకాశం దక్కింది.

దాదాపు 17 నెలల విరామం తర్వాత రహానేకు భారత జట్టులో చోటు దక్కడం విశేషం. అదే విధంగా ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్‌కు కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌ జట్టులో చోటు దక్కింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు శార్దూల్ ఠాకూర్‌ భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. ఇంగ్లండ్‌ పరిస్థితులు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించనున్న నేపథ్యంలో శార్దూల్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. షమీ, సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, ఉనద్కట్‌తో పాటు అదనపు పేసర్‌గా శార్దూల్ ఉండనున్నాడు.

అదే విధంగా ప్లేయింగ్‌ ఎల్‌వన్‌లో కూడా శార్దూల్ చోటు దక్కే ఛాన్స్‌ ఉంది. ఎందుకంటే శార్దూల్ ఇంగ్లండ్‌ గడ్డపై మంచి రికార్డు ఉంది. గతంతో ఓ ఫోర్‌ వికెట్‌ హాల్‌తో పాటు ఒక హాఫ్‌ సెంచరీ కూడా ఉంది. ఇక ఓవరాల్‌గా భారత్‌ తరపున 8 టెస్టు మ్యాచ్‌లు ఆడిన శార్ధూల్‌.. 27 వికెట్లతో 254 పరుగులు చేశాడు. మరోవైపు బోర్డర్ గవాస్కర్‌ ట్రోఫీతో టెస్టు అరంగేట్రం చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌కు చుక్కదరైంది. తొలుత అయ్యర్‌ స్థానంలో సూర్యకుమార్‌కు చోటు దక్కుతుందని వార్తలు వినిపించినప్పటికీ.. సెలక్టర్లు మాత్రం రహానే వైపు మొగ్గు చూపారు.

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌ 2021-23 ఫైనల్‌కు భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానే, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌, అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, ఉనద్కత్‌
చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు ప్రకటన.. ఐపీఎల్‌ హీరోకు పిలుపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement