కేకేఆర్ జట్టుతో శార్దూల్ ఠాకూర్ (PC: IPL)
IPL 2023 CSK Vs KKR: ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్.. ఇప్పటి వరకు ఒకటీ రెండు మినహా మ్యాచ్‌లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన 9 ఇన్నింగ్స్‌లో 110 పరుగులు చేసిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. బౌలర్‌గానూ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు.
శార్దూల్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కేవలం 5 వికెట్లు తీశాడు. కేకేఆర్ తన కోసం వెచ్చించిన రూ. 10. 75 కోట్ల భారీ మొత్తానికి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 3 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసి పర్వాలేదనిపించాడు శార్దూల్.
సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఇలా
ఇక నితీశ్ రాణా, రింకూ సింగ్ అర్ధ శతకాలతో కదం తొక్కి 18.3 ఓవర్లలోనే విజయం అందించడంతో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్, కామెంటేటర్ స్కాట్ స్టైరిస్ శార్దూల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
చెపాక్ వేదికగా ఆదివారం నాటి సీఎస్‌కే- కేకేఆర్ మ్యాచ్ ఆరంభానికి ముందు జియో సినిమా షోలో స్టైరిస్ మాట్లాడుతూ.. ‘‘శార్దూల్ ఠాకూర్ అసలు ఒక క్రికెటర్‌లాగే అనిపించడం లేదు. అతడిని ఆల్‌కరౌండర్ అనడం కంటే అరకొర ఆటగాడు(bits-and-pieces cricketer) అని పిలవడం మేలు’’ అంటూ అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ సగం సగమే అన్న అర్థంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
అప్పుడు జడ్డూను
కాగా 2019లో టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు జడ్డూ సైతం గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఇక ఆసియా కప్-2022 సందర్భంగా వీరి మధ్య మాటలు కలిశాయి.
ఇక ఇప్పుడు స్కాట్ స్టైరిస్ టీమిండియా ‘పేస్ ఆల్‌రౌండర్’ శార్దూల్ ఠాకూర్‌ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఐపీఎల్-2023తో బిజీగా ఉన్న శార్దూల్ తదుపరి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సన్నద్ధమవుతాడు. జూన్ 9 నుంచి ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ఈ మెగా ఫైట్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు.
చదవండి: వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని
పనిష్మెంట్.. అంపైర్లతో రాణా అలా.. వైరల్! ఎందుకో ప్రతిదానికీ ఇలా!
Comments
Please login to add a commentAdd a comment