Scott Styris
-
పదేళ్ల పాటు టీమిండియా కెప్టెన్ అతడే.. కానీ!
ముప్పై ఏళ్ల వయసులో టీమిండియాలో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్.. అనతికాలంలోనే ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా ఎదిగాడు. అంతేకాదు.. ఊహించని రీతిలో భారత టీ20 జట్టు కెప్టెన్‌గానూ నియమితుడయ్యాడు. రోహిత్ శర్మ వారసుడిగా.. పూర్తిస్థాయి కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే విజయం అందుకున్నాడు ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్.గొప్ప ఆప్షన్లు లేవు కాబట్టేఅయితే, సూర్య పదవి తాత్కాలికమే అంటున్నాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా బీసీసీఐ అతడిని ఎంచుకోలేదని అభిప్రాయపడ్డాడు. కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు ఇప్పటికిప్పుడు గొప్ప ఆప్షన్లు లేవు కాబట్టే.. సూర్య వైపు మొగ్గుచూపారని పేర్కొన్నాడు. సీనియర్లు రిటైర్ కావడం, హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సమస్యలు సూర్యను కెప్టెన్‌గా నియమించడానికి దోహదం చేశాయని స్టైరిస్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.రెండేళ్లపాటు మాత్రమేఏడాది లేదంటే రెండేళ్లపాటు మాత్రమే సూర్యకుమార్ యాదవ్ టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఉంటాడని స్టైరిస్ అంచనా వేశాడు. అతడి స్థానంలో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ భారత జట్టు పగ్గాలు చేపడతాడని.. అతడిని పూర్తిస్థాయి సారథిగా తీర్చిదిద్దేందుకే సూర్య డిప్యూటీగా నియమించారని పేర్కొన్నాడు. గంభీర్‌కు- భవిష్య కెప్టెన్‌కు మధ్య సూర్య కేవలం ఓ వారథి లాంటివాడు మాత్రమే అని స్టైరిస్ చెప్పుకొచ్చాడు.పదేళ్ల పాటు అతడేటీమిండియా భవిష్య కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాత్రమే అని.. 24 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతాడని స్కాట్ స్టైరిస్ అభిప్రాయపడ్డాడు. అయితే, ఇప్పుడే భారత జట్టు పగ్గాలు చేపట్టేందుకు తగిన అనుభవం అతడికి లేదని.. అందుకే సూర్య రూపంలో తాత్కాలిక ఏర్పాటు చేశారని పేర్కొన్నాడు. ఒకవేళ సూర్య ద్వైపాక్షిక సిరీస్‌లలో టీమిండియాను విజయవంతంగా ముందుకు నడిపిస్తే.. టీ20 ప్రపంచకప్-2026 వరకు అతడే సారథిగా కొనసాగుతాడని స్టైరిస్ అంచనా వేశాడు.భారత క్రికెట్‌ను ఏలుతాడుశుబ్మన్ గిల్ రోజురోజుకు తన ఆటను మెరుగుపరచుకుంటున్నాడని.. అయితే, మూడు ఫార్మాట్లలో నిలకడగా ఆడటం ముఖ్యమని స్టైరిస్ పేర్కొన్నాడు. అలా అయితేనే, వరుస అవకాశాలు దక్కించుకుని కెప్టెన్ రేసులో ముందుంటాడని అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరని.. అయితే, తన దృష్టిలో మాత్రం రానున్న దశాబ్దంలో గిల్ భారత క్రికెట్‌ను ఏలుతాడని స్కాట్ స్టైరిస్ పేర్కొన్నాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఇద్దరూ విజయవంతంగాకాగా రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో 33 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ తొలిసారిగా భారత టీ20 జట్టుకు సారథ్యం వహించాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై, సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియాను విజేతగా నిలిపాడు. తాజాగా రెగ్యులర్ కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే శ్రీలంక టూర్లో భారత్‌కు 2-0తో సిరీస్‌ను అందించాడు. మరోవైపు.. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత జట్టుకు శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించాడు. 4-1తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ గెలిచాడు.చదవండి: ‘ద్రవిడ్ వల్లే కాలేదు.. ఇక్కడ నేనే బాస్ అంటే కుదరదు’ -
అసలు క్రికెటరే కాదు.. ఇంకా: టీమిండియా ఆల్‌రౌండర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు
IPL 2023 CSK Vs KKR: ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్.. ఇప్పటి వరకు ఒకటీ రెండు మినహా మ్యాచ్‌లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన 9 ఇన్నింగ్స్‌లో 110 పరుగులు చేసిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. బౌలర్‌గానూ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. శార్దూల్ ఈ సీజన్లో ఇప్పటి వరకు కేవలం 5 వికెట్లు తీశాడు. కేకేఆర్ తన కోసం వెచ్చించిన రూ. 10. 75 కోట్ల భారీ మొత్తానికి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 3 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసి పర్వాలేదనిపించాడు శార్దూల్. సీఎస్కేతో మ్యాచ్‌లో ఇలా ఇక నితీశ్ రాణా, రింకూ సింగ్ అర్ధ శతకాలతో కదం తొక్కి 18.3 ఓవర్లలోనే విజయం అందించడంతో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్, కామెంటేటర్ స్కాట్ స్టైరిస్ శార్దూల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చెపాక్ వేదికగా ఆదివారం నాటి సీఎస్కే- కేకేఆర్ మ్యాచ్ ఆరంభానికి ముందు జియో సినిమా షోలో స్టైరిస్ మాట్లాడుతూ.. ‘‘శార్దూల్ ఠాకూర్ అసలు ఒక క్రికెటర్‌లాగే అనిపించడం లేదు. అతడిని ఆల్కరౌండర్ అనడం కంటే అరకొర ఆటగాడు(bits-and-pieces cricketer) అని పిలవడం మేలు’’ అంటూ అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ సగం సగమే అన్న అర్థంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు జడ్డూను కాగా 2019లో టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు జడ్డూ సైతం గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఇక ఆసియా కప్-2022 సందర్భంగా వీరి మధ్య మాటలు కలిశాయి. ఇక ఇప్పుడు స్కాట్ స్టైరిస్ టీమిండియా ‘పేస్ ఆల్‌రౌండర్’ శార్దూల్ ఠాకూర్‌ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఐపీఎల్-2023తో బిజీగా ఉన్న శార్దూల్ తదుపరి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సన్నద్ధమవుతాడు. జూన్ 9 నుంచి ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ఈ మెగా ఫైట్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. చదవండి: వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని పనిష్మెంట్.. అంపైర్లతో రాణా అలా.. వైరల్! ఎందుకో ప్రతిదానికీ ఇలా! -
'భవిష్యత్తులో అతడు టీమిండియా కెప్టెన్ కావడం ఖాయం'
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై కివీస్ మాజీ ఆటగాడు స్కాట్ స్టైరిస్ ప్రశంసల జల్లు కురిపించాడు. హార్దిక్ అద్భుతమైన కెప్టెన్సీ నైపుణ్యాలని కలిగి ఉన్నాడని అతడు కొనియాడాడు. అదే విధంగా హార్దిక్ భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ అయినా ఆశ్చర్యపోనక్కరలేదని స్టైరిస్ తెలిపాడు. కాగా ఇప్పటి వరకు మూడు టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియాకు సారథ్యం వహించిన హార్దిక్ అన్ని మ్యాచ్‌ల్లోనూ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు తొలి సారిగా భారత కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్ పాండ్యా చేపట్టాడు. కాగా ఈ సిరీస్‌ను పాండ్యా సారథ్యంలోని భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. అనంతరం విండీస్‌తో ఐదో టీ20కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో.. హార్ధిక్ కెప్టెన్‌గా వ్యవహారించాడు. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా విజయం సాధించింది. అంతకుముందు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు సారథ్యం వహించిన హార్దిక్.. తమ జట్టుకు అరంగేట్ర సీజన్లోనే టైటిల్‌ను అందించాడు. ఇక గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణిస్తున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ అదరగొడుతున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరన్న దానిపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్ పాటు ,హార్ధిక్ పాండ్యా,రిషభ్ పంత్ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో స్టైరిస్ న్యూస్ 18తో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. "ప్రస్తుతం టీ20 క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా ఒకడు. అతడు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్‌ను కలిగి ఉన్నాడు. కాబట్టి అతడు భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ కావడం ఖాయం. కనీసం భారత టీ20 జట్టుకైనా హార్దిక్ సారథ్యం వహించడం మనం చూస్తాం. ఆరు నెలల కిందట అతడికి జట్టులో చోటు దక్కుతుందా లేదా చర్చలు నడిచాయి. కానీ అతడు తనపై వచ్చిన విమర్శలకు తన అద్భుతమైన ఆటతోనే చెక్ పెట్టాడు. ఫుట్ బాల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఏ ఆటగాడైతే వ్యక్తిత్వం, నైపుణ్యం కలిగి ఉంటాడో అతడికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారు. కాబట్టి హార్దిక్ లాంటి ఆటగాడు భవిష్యత్తులో భారత కెప్టెన్సీ బాధ్యతలు చేటపట్టిన మనం ఆశచ్చర్యపోనక్కరలేదు" అని స్టైరిస్ పేర్కొన్నాడు. చదవండి: Ind Vs Zim 2022: మరీ ఇంత బ్యాడ్ లక్ ఏంటి భయ్యా! రాకరాక వచ్చిన అవకాశం..! మరోసారి గాయం.. -
వాళ్లు ఉన్నారుగా! మనకి కేఎల్ రాహుల్ అవసరమా?!: కివీస్ మాజీ క్రికెటర్
KL Rahul-Team India: టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను గత కొంతకాలంగా ఫిట్నెస్ సమస్యలు వేధిస్తున్నాయి. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాల్సిన ఈ కర్ణాటక బ్యాటర్.. గాయం కారణంగా ఆఖరి నిమిషంలో తప్పుకొన్నాడు. ఆ తర్వాత స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ.. వెస్టిండీస్ పర్యటనతో పునరాగమనం చేస్తాడనుకుంటే కోవిడ్-19 బారిన పడ్డాడు. ఇక కరోనా నుంచి కోలుకున్నా ఇంకొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని బీసీసీఐ వైద్య బృందం సూచించడంతో సిరీస్ మొత్తానికి దూరమైన పరిస్థితి. అయితే, ఆసియా కప్-2022 టోర్నీ ఆరంభ సమయానికి అతడు జట్టుతో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రాహుల్ గైర్హాజరీలో రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ తదితరులు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. సాధారణంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే సూర్య.. విండీస్‌తో మూడో టీ20లో అద్భుత అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. తద్వారా తాను ఓపెనర్‌గా కూడా రాణించగలడని నిరూపించుకున్నాడు. నిజంగా మనకు కేఎల్ రాహుల్ అవసరమా? ఈ పరిణామాల నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్.. జట్టులో కేఎల్ రాహుల్ స్థానం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు స్పోర్ట్స్18తో అతడు మాట్లాడుతూ.. ‘‘రాహుల్ గాయపడిన కారణంగా జట్టుకు కొన్నాళ్ల పాటు దూరమయ్యాడు. ఆ సమయంలో సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ రాణించారు. సూర్య అయితే అదరగొట్టాడు. సూర్యకుమార్ యాదవ్(PC: BCCI) వీళ్లు తమ ప్రదర్శనతో సెలక్టర్లకు సవాల్ విసురుతున్నారు. నిజంగా మనకు కేఎల్ రాహుల్ అవసరమా? ఒకవేళ అతడు తిరిగి జట్టులోకి వచ్చినా ఫామ్‌ను కొనసాగిస్తాడా? అన్న సందేహాలు రేకెత్తిస్తున్నారు. నిజానికి రాహుల్ మ్యాచ్‌లు ఆడి చాలా రోజులైంది. ఇలాంటి ప్రశ్నలు తలెత్తేలా అతడే అవకాశం ఇచ్చాడు’’ అని చెప్పుకొచ్చాడు. ఆటగాళ్లు సాధారణంగా తమ స్థానంలో ఇంకొకరికి ఆడే అవకాశం ఇవ్వాలనుకోరు.. కానీ ఇక్కడ రాహుల్ పదే పదే ఇతరులకు ఆ ఛాన్స్ ఇస్తున్నాడని వ్యాఖ్యానించాడు. యువకుల నుంచి తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఫిట్నెస్ కాపాడుకోవాలని సూచించాడు. ఇక టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ సమీపిస్తున్న తరుణంలో ఆసియా కప్-2022 భారత ఆటగాళ్లకు మరింత కీలకంగా మారింది. ఇంగ్లండ్, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లలో రాణించిన ఆటగాళ్లు ఆసియా కప్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకున్నట్లే! ఆగష్టు 27 నుంచి ఆరంభం కానున్న ఈ మెగా ఈవెంట్లో ప్రతిభ నిరూపించుకుంటే.. ప్రపంచకప్ జట్టులోనూ చోటు దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఆసియా కప్ తర్వాత సెప్టెంబరులో టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: Asia Cup 2022: 'గతేడాది పాక్ చేతిలో ఓటమి భారత్‌ను బాగా డ్యామేజ్ చేసింది.. ఈ సారి మాత్రం' -
'జింబాబ్వేపై కోహ్లి సెంచరీ చేసినా.. అతడి ఫామ్‌లో మార్పు రాదు'
టీమిండియా ప్రస్తుతం కరీబియన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. శుక్రవారం(జూలై29) నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో కూడా తమ అధిపత్యం చెలాయించాలని భావిస్తోంది. ఇక విండీస్‌తో టీ20 సిరీస్ అనంతరం టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌లో జింబాబ్వేతో తలపడనుంది. హరారే వేదికగా ఆగస్టు 18న జరగున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. మరోవైపు ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ జరగనుండడంతో జింబాబ్వే పర్యటనకు భారత ద్వితీయ శ్రేణి జట్టు వెళ్లే అవకాశం ఉంది. అయితే విండీస్ పర్యటనకు దూరంగా ఉన్న భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని జింబాబ్వే సిరీస్‌లో భాగం చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కోహ్లి గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జింబాబ్వే పర్యటనకు కోహ్లిని పంపిస్తే ఫామ్‌లోకి వస్తాడని, సెంచరీ కూడా సాధిస్తాడని బీసీసీఐ భావిస్తున్నట్లు సమచారం. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్కాట్ స్టైరిస్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. జింబాబ్వే వంటి జట్టుపై కోహ్లి సెంచరీ చేసినా అతడి ఫామ్‌లో ఎటువంటి మార్పు ఉండదని స్టైరిస్ తెలిపాడు. "జింబాబ్వే పర్యటనకు కోహ్లిని పంపడం వల్ల అతడికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. టీ20 ప్రపంచకప్ సమయానికి కోహ్లి సన్నద్దంగా ఉండేలా టీమిండియా యాజమాన్యం చర్యలు తీసుకుకోవాలి. అయితే చాలా మంది జింబాబ్వేతో సిరీస్‌లో కోహ్లి ఆడాలని భావిస్తున్నారు. అయితే జింబాబ్వే సిరీస్‌లో అతడు ఆడడం వల్ల ఎటువంటి ఊపయోగం లేదు. జింబాబ్వేపై కోహ్లి అలవోకగా సెంచరీ సాధించగలడు. కానీ అతడి ఫామ్‌లో ఎటువంటి మార్పు రాదు. కోహ్లి తన ఫామ్‌ను తిరిగి పొందాలంటే కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలి" అని స్టైరిస్ పేర్కొన్నాడు. చదవండి: SL Vs PAK 2nd Test: ఒకటీ అరా గెలిచి.. ఏదో పొడిచేసినట్లు విర్రవీగడం! పాక్ జట్టుకు.. -
Ind Vs WI: టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే! ఆ ఒక్క బలహీనత అధిగమిస్తే..
టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన కెప్టెన్సీ నైపుణ్యాలను కలిగి ఉన్నాడని కివీస్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ కొనియాడాడు. రోహిత్ శర్మ తర్వాత భారత కెప్టెన్సీ రేసులో అయ్యర్ ఖచ్చితంగా ముందుంటాడని పేర్కొన్నాడు. అయితే, అయ్యర్ షార్ట్ బాల్స్ ఎదుర్కొవడంలో కాస్త ఇబ్బంది పడుతున్నాడని, దానిని అధిగమిస్తే అతడికి తిరుగు ఉండదని అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఏడాది స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో దుమ్ము రేపిన అయ్యర్.. ఆ తర్వాత వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతున్నాడు. అంతేకాదు.. ఐపీఎల్-15 సీజన్లో అంతగా రాణించలేకపోయిన అయ్యర్.. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్‌లోనూ పూర్తిగా నిరిశపరిచాడు. కాగా స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొంటున్న అయ్యర్.. పేసర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులకు తన వికెట్‌ను చేజార్చుకుంటున్నాడు. ఇక విండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్ అయ్యర్‌కు చాలా కీలకమైనది. ఈ సిరీస్‌లో కూడా అయ్యర్ విఫలమైతే జట్టులో తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్టైరిస్ మాట్లాడుతూ.. "అయ్యర్ కెప్టెన్సీ స్కిల్స్ నన్ను ఎంతగానో అకట్టుకున్నాయి. అయ్యర్‌ని భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్‌గా నేను చూడాలనుకుంటున్నాను. అతడొక అద్భుతమైన ఆటగాడు. కొన్ని మ్యాచ్‌ల్లో అతడు విఫలమైనా.. జట్టులో రెగ్యులర్‌గా అవకాశాలు ఇవ్వాలి" అని తెలిపాడు. ఇక అయ్యర్ వీక్నెస్ గురించి మాట్లడాతూ.. "అతడు బ్యాటింగ్ చేసేటప్పుడు బౌలర్లు బౌన్సర్లతో ఎటాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో అయ్యర్ బౌలర్ల ట్రాప్‌లో పడి తన వికెట్‌ను కోల్పోతున్నాడు. కాబట్టి షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనే నైపుణ్యాన్ని శ్రేయాస్ అయ్యర్ పెంచుకోవాల్సి ఉంది. సురేష్ రైనాకి షార్ట్ బాల్ వీక్నెస్ ఉన్నట్టే అయ్యర్ కూడా ఉంది. ఈ బలహీనతను అయ్యర్ అధిగమించలేకపోతున్నాడు. ఆ ఒక్క విషయంలో మెరుగుపడితే అయ్యర్‌కు తిరుగుండదు. మిగతా అన్ని లక్షణాలు అయ్యర్‌లో పుష్కలంగా ఉన్నాయి" అని స్టైరిస్ పేర్కొన్నాడు. చదవండి: WI vs IND 1st ODI: వెస్టిండీస్‌తో భారత్ తొలి పోరు.. ధావన్‌కు జోడీ ఎవరు? -
'స్విచ్‌హిట్ బ్యాన్ చేస్తే ఎక్కువగా సంతోషించేది నేనే'
క్రికెట్లో కవర్‌డ్రైవ్, స్ట్రెయిట్ డ్రైవ్, స్క్వేర్డ్రైవ్, కట్‌షాట్, స్వీప్ షాట్, రివర్స్ స్వీప్, హుక్ షాట్.. ఇవన్నీ సంప్రదాయంగా వస్తున్నవి. ఇంకా చెప్పాలంటే క్రికెట్లో ఎక్కువ మంది బ్యాటర్స్ ఆడే షాట్లు. వీటితో పాటు ఇంకా ఎన్నో కళాత్మక షాట్లు ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో హెలికాప్టర్, స్విచ్‌హిట్ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని హెలికాప్టర్ షాట్ కనిపెడితే.. స్విచ్ హిట్ షాట్‌కు మాత్రం పెట్టింది పేరు ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్. సంప్రదాయ క్రికెట్లో స్విచ్‌హిట్ అనేది కాస్త వినూత్నమైనది.. బౌలర్ బంతి విడుదల చేయగానే బ్యాటర్ తన పొజీషన్‌ను రివర్స్ చేసి ఆడడమే స్విచ్‌హిట్. 2006లో కెవిన్ పీటర్సన్.. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌పై స్విచ్‌హిట్ షాట్‌ను ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ క్రికెటర్లు డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు ఎక్కువ సందర్బాల్లో స్విచ్ హిట్ షాట్లు ఆడారు. అయితే స్విచ్‌హిట్ షాట్‌పై ఐసీసీకి పలుసార్లు ఫిర్యాదులు వెళ్లాయి. స్విచ్‌హిట్ షాట్ ఆడే సమయంలో పొజీషన్‌ను మార్చి.. ఆ షాట్ ఆడడం మిస్ అయితే ఎల్బీడబ్ల్యూ ఇచ్చే అవకాశం ఎందుకు లేదని కొందరు బౌలర్లు ప్రశ్నించారు. ఇటీవలే టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్విచ్‌హిట్ షాట్‌పై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ''బ్యాట్స్‌మెన్ స్విచ్‌హిట్ ఆడడంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ స్విచ్‌హిట్ ఆడే సమయంలో బంతి మిస్ అయితే మాత్రం ఎల్బీగా ఇవ్వాల్సిందే. ఎల్బీ ఎందుకు ఇవ్వకూడదనేది నాకు చెప్పాలి. ఒక బ్యాటర్ బంతి వేయగానే పొజిషన్‌ను మార్చినప్పుడే బంతి వికెట్ల మీదకు వెళ్తుంది. కాబట్టి కచ్చితంగా ఎల్బీడబ్ల్యూకి ఆస్కారం ఉంటుంది.'' అని చెప్పుకొచ్చాడు. కాగా అశ్విన్ చేసిన వ్యాఖ్యలను న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ సమర్థిస్తూనే తప్పులను ఎత్తిచూపాడు. '' అశ్విన్ చేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని సమర్థిస్తున్నా.. అదే సమయంలో కొన్నింటిని తప్పుబడతా. స్విచ్ హిట్ అనేది ఫన్నీగా కనిపిస్తున్నప్పటికి బౌలర్‌కు ఎప్పటికి ప్రమాదకరం. అందుకే స్విచ్హిట్ను పూర్తిగా బ్యాన్ చేస్తే అందరికంటే ఎక్కువగా సంతోషించేది నేనే. బ్యాట్స్‌మన్ తర్వాతి బంతిని స్విచ్ హిట్ ఆడుతాడని ఎవరూ ముందుగా ఊహించరు. క్రికెట్లో మిగతా షాట్స్ అంటే ఎలా కొట్టినా ఆన్‌సైడ్, ఆఫ్‌సైడ్‌లో ఎక్కువగా వెళ్తాయి. కాబట్టి ఫీల్డర్లను ముందుగానే సెట్ చేసుకోవచ్చు. కానీ స్విచ్‌హిట్ విషయంలో ఆ క్లారిటీ లేదు. బౌలింగ్ సైడ్ కెప్టెన్ లేదా బౌలర్ ఫీల్డర్స్‌ను ఎక్కడ ఉంచాలనేది తెలియదు. అందుకే బ్యాటర్స్, బౌలర్స్‌కు ఉపయోగంగా ఉండాలంటే స్విచ్హిట్ను బ్యాన్ చేయాల్సిందే. స్విచ్‌హిట్ లానే కనిపించే రివర్స్ స్వీప్.. రివర్స్ హిట్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి వీటిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. అయితే స్విచ్‌హిట్ ఆడే క్రమంలో బ్యాటర్ తన పొజీషన్‌ను పూర్తిగా మర్చేయడం.. అదే సమయంలో ఆ షాట్ మిస్ అయితే కచ్చితంగా ప్యాడ్లకు తాకుతుంది. ఇక్కడే అశ్విన్ ఎల్బీడబ్ల్యూ ఇవ్వాలని వాదించాడు. కానీ స్విచ్హిట్ను పూర్తిగా బ్యాన్‌చేస్తే ఆ ఇబ్బందే ఉండదు కదా'' అంటూ ముగించాడు. -
స్కాట్ లిస్టు.. అట్టడుగున రాజస్తాన్.. నువ్వు కూడా ఇబ్బంది పెడుతున్నావా!
IPL 2021 Phase 2- Rajasthan Royals: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 రెండో అంచె కోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే యూఏఈ చేరుకున్న ఆటగాళ్లు ప్రాక్టీసులో నిమగ్నమయ్యారు. ఇక ఆదివారం నుంచి ఈ సీజన్ రెండో దశ ఆరంభం కానున్న నేపథ్యంలో టోర్నీ విజేత గురించి మాజీలు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ స్కాట్ స్టైరిస్.. ఐపీఎల్ జట్ల పవర్ ర్యాకింగ్స్ అంటూ ఓ జాబితాను ట్విటర్లో షేర్ చేశాడు. ఎవరు తుదిజట్టులో ఉంటారో, వ్యక్తిగత బలాబలాలు ఏమిటో తెలియకుండానే ఈ లిస్టు ప్రకటిస్తున్నా అంటూ.. అందరూ ఊహించినట్లుగానే ముంబై ఇండియన్స్‌కు జాబితాలో మొదటి స్థానం కట్టబెట్టాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్‌కింగ్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్, కేకేఆర్.. ఆఖరున రాజస్తాన్ రాయల్స్ పేరును చేర్చాడు. ఇక స్కాట్ ట్వీట్‌పై స్పందించిన రాజస్తాన్ రాయల్స్ హిలేరియస్ మీమ్‌తో జవాబిచ్చింది. బాలీవుడ్ మూవీ ‘లవ్ ఆజ్ కల్’ హీరోయిన్ సారా అలీఖాన్ ఫొటోను షేర్ చేస్తూ... ‘‘ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నావా’’ అన్న డైలాగ్‌తో కౌంటర్ ఇచ్చింది. ఈ మీమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్ నాలుగింటిలో ఓడింది. ఇక రెండో అంచెలో భాగంగా సెప్టెంబరు 21న రాజస్తాన్, పంజాబ్ కింగ్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. చదవండి: Sanju Samson: ఈసారి కచ్చితంగా చాంపియన్‌గా నిలవాలి! https://t.co/RU9QAewpGX pic.twitter.com/D2y9Jj8Q0p — Rajasthan Royals (@rajasthanroyals) September 16, 2021 -
ఎందుకు విమర్శించారో నాకైతే అర్థం కాలేదు
ఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవీంద్ర జడేజా ప్రశంసల వర్షం కురిపించాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్. గత కొన్నేళ్లుగా జడేజాపై వస్తున్న విమర్శలకు ఈ ఐపీఎల్లో తన ఆల్‌రౌండ్ షో సమాధానం చెప్పాడని స్టైరిస్ కొనియాడాడు. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన స్టైరిస్.. విదేశీ ఆటగాళ్ల కోణంలో నేను చెబుతున్నా. రవీంద్ర జడేజాపై విమర్శలు ఎందుకు వచ్చాయో నాకైతే అర్థం కాలేదు. అతనొక అసాధారణ క్రికెటర్. టాప్ లెవెల్ ఉన్న ఏ క్రికెటర్‌కు అతను తీసిపోడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఎక్కడైనా జడేజా సత్తాచాటగలడు. ఈ ఐపీఎల్లో అది రుజువైంది. అతని ఫీల్డింగ్ సామర్థం మరొక స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో జడేజా అత్యుత్తమ ఫీల్డర్. నేను జడేజాను బ్యాటింగ్‌లో ప్రమోట్ చేయమని గతేడాది నుంచి చెబుతున్నా. ఈ ఏడాది అతన్ని బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేసింది సీఎస్కే. ఒక కచ్చితమైన బ్యాట్స్‌మన్ జడేజా. పొలార్డ్, హార్దిక్, ఏబీ డివిలియర్స్ స్థాయి క్రికెటర్ జడేజా’ అని ప్రశంసించాడు. -
జాన్సన్‌ను ఆడించి ముంబై తప్పు చేసింది: స్టైరిస్
చెన్నై: ఐపీఎల్లో ఐదు సార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌ను పరాజయంతో ఆరంభించిన సంగతి తెలిసిందే. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరిబంతి వరకు ఇరుజట్ల మధ్య విజయం దోబుచులాడగా.. చివరకు కోహ్లి సేన విజయం దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో జాన్సన్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు వేసిన జాన్సన్ 28 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. అందులో హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో పాటు షాబాజ్ అహ్మద్ వికెట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కివీస్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ మార్కో జాన్సన్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 'ముంబై ఇండియన్స్ తరపున జాన్సన్ మంచి ప్రదర్శనను కనబరిచాడు. మ్యాచ్ మొత్తం మీద చూసుకుంటే రెండు కీలక వికెట్లు తీశాడు. 6 ఫీట్ల పొడవున్న అతను మంచి టైమ్‌లైన్‌తో బౌలింగ్ వేస్తున్నాడు. అలాగే ఆ మ్యాచ్‌లో ఒక బంతిని దాదాపు 143 కిమీ వేగంతో విసిరాడు. అతని హైట్ అతనికి ప్లస్ కావడంతో పాటు మంచి బౌన్స్ రాబట్టే అవకాశం ఉంది. అతనికి ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ చాన్స్ ఇచ్చినా అది సరైనది కాదని నాకు అనిపిస్తుంది. వాస్తవానికి వచ్చే ఏడాది ఐపీఎల్ మెగావేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో మార్కో జాన్సన్‌ను వదులుకునే అవకాశం ఉంది. మంచి ఆటగాళ్లను దక్కించుకునేటప్పుడు జాన్సన్‌ను విడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకే వచ్చే ఏడాదికి వేలంలో అతన్ని రిలీజ్ చేయకుండా రిజర్వ్‌లో ఉంచుకుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. అలా చేస్తే మలింగ లాగే ముంబై ఇండియన్స్‌కు జాన్సన్ కీలక బౌలర్‌గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అని చెప్పుకొచ్చాడు. కాగా నేడు ముంబై ఇండియన్స్ తమ రెండో మ్యాచ్‌లో కేకేఆర్‌ను ఎదుర్కోనుంది. చదవండి: డీకాక్‌ను వేసుకుంటారా.. లిన్‌కే చాన్స్ ఇస్తారా? -
IPL2021: దిగొచ్చిన స్టైరిస్, చెన్నై జట్టుకు క్షమాపణలు
ఐపీఎల్ సీజన్ మొదలయ్యాక ఆటగాళ్లు తమ ఆటతో వార్తల్లో నిలుస్తారు, కానీ ప్రస్తుతం మాత్రం వాళ్లు తమ మాటలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవల చెన్నై జట్టు మాజీ ఆటగాడు, న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ ఐపీఎల్ 2021 ప్రిడిక్షన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఎప్పటిలానే పాయింట్ల పట్టికలో ముంబై మొదటి స్థానంలో ఉంటుందని చెప్పిన, స్టైరిస్.. చెన్నై ఈసారి చివరిలో నిలుస్తుందని పేర్కొన్నాడు. అతని వ్యాఖ్యలపై చెన్నై అభిమానులు, ఆటగాళ్లు హర్ట్ అయ్యారు. స్టైరిస్ ప్రిడిక్షన్‌పై స్పందించిన సీఎస్కే ఫ్రాంచైజీ కౌంటర్ ఎటాక్ చేస్తూ.. తమ మాజీ ఆటగాడికి సీఎస్కేపై కోపం ఎందుకో అనే అర్ధం వచ్చేలా కౌంటర్ ఇచ్చింది. ‘మాజీ మచ్చి.. మాపై ఎందుకు అలా’ అంటూ స్టైరిస్ కోపంతో ఉన్న ఫొటో ఒకదానిని ట్వీట్ చేసింది. చెన్నై ఫ్రాంచైజీ కౌంటర్ నేపథ్యంలో స్టైరీస్ తాజాగా మరో ట్వీట్ చేశాడు. చెన్నైని తక్కువ చేసినందుకు సీఎస్కే యాజమాన్యాన్ని క్షమాపణలు కోరుతున్నట్టు ట్వీట్లో పేర్కొన్నాడు. ‘నన్ను నేను మందలించుకుంటున్నాను’ అని తెలిపాడు. కాగా, దుబాయ్‌లో జరిగిన గత ఐపీఎల్ సీజన్లో చెన్నై జట్టు ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు. చివరలో వరుస విజయాలు సాధించినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో తొలిసారి ప్లే ఆఫ్ చేరకుండానే ఇంటిదారిపట్టింది. ఈక్రమంలోనే ఎంఎస్ ధోని నేతృత్వంలోని సీఎస్కే తాజా ఐపీఎల్లో ఆఖరి స్థానంలోనే నిలుస్తుందని స్కాట్ స్టైరిస్ జోస్యం చెప్పినట్టున్నాడు. ( చదవండి: అతను దూరమవడానికి పుజారా కారణమా! ) I consider myself reprimanded. Super coach @SPFleming7 has already told me off 🤣🤣🤣 pic.twitter.com/T0Sod0t58T — Scott Styris (@scottbstyris) April 4, 2021 -
మా మాజీ మచ్చి.. మాపై ఎందుకు అలా?: సీఎస్కే కౌంటర్
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్లో కూడా ఎంఎస్ ధోని నేతృత్వంలోని సీఎస్కే ఆఖరి స్థానంలోనే నిలుస్తుందంటూ ఆ జట్టు మాజీ ఆటగాడు, న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ జోస్యం చెప్పాడు. కొన్ని రోజుల క్రితం ట్వీటర్ వేదిగా తన ఐపీఎల్ ప్రిడిక్షన్‌ను వెల్లడించాడు. ఇందులో ఆయా జట్ల స్థానాలను ఖరారు చేస్తూ ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా తొలి రెండు స్థానాలను ఇచ్చిన స్టైరిస్.. సీఎస్కేను ఆఖరి స్థానానికి పరిమితం చేశాడు. ఈసారి కూడా సీఎస్కే చివరి స్థానాన్నే సరిపెట్టుకోవాలని పేర్కొన్నాడు. దీనిపై సీఎస్కే ఫ్రాంచైజీ కౌంటర్ ఎటాక్ చేస్తూనే ఉంది. తాజాగా మరొకసారి స్టైరిస్ జోస్యాన్ని ట్వీటర్లోనే రీట్వీట్ చేసి.. తమ మాజీ క్రికెటర్‌కు మాపై కోపం ఎందుకో అనే అర్ధం వచ్చేలా కౌంటర్ ఇచ్చింది. ‘ మాజీ మచ్చి.. మాపై ఎందుకు అలా’ అంటూ స్టైరిస్ తమతో గతంలో ఆడిన ఒక ఫోటోను ట్వీట్ చేసింది. స్టైరిస్ జోస్యం ప్రకారం.. డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరోసారి టైటిల్ నిలబెట్టుకుంటుందని.. ఆ జట్టు ఇప్పుడు అన్ని జట్లకన్నా పటిష్టంగా కనిపిస్తుందని.. అందుకే వారు ఫేవరెట్‌గా మారారని చెప్పాడు. ఇక రెండో స్థానంలో గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎంపిక చేశాడు. ఇక పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్‌కు వచ్చే మిగతా రెండు జట్లని తెలిపాడు. ఇక మరోసారి భారీ అంచనాల నడుమ బరిలోకి దిగుతున్న ఆర్సీబీ ఐదో స్థానానికి పరిమితమవుతుందని జోస్యం చెప్పాడు. కెప్టెన్ మారినా రాజస్తాన్ రాయల్స్ తలరాత మారదని.. అయితే వేలంలో కోట్లు పెట్టి కొన్న క్రిస్ మోరిస్‌తో పాటు జోఫ్రా ఆర్చర్లు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారని.. అయినా ఆ జట్టు ఆరవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని తెలిపాడు. ఏడో స్థానంలో కేకేఆర్, ఎనిమిదో స్థానంలో సీఎస్కేలు ఉంటాయన్నాడు. ఇక్కడ చదవండి: ఆ క్యాచ్‌పై తీవ్ర చర్చ.. మీరు కూడా ఓ లుక్కేయండి వన్డే క్రికెట్లో నయా వరల్డ్ రికార్డు Ex Machi. Why Machi? #Yellove Machi 📸: @IPL pic.twitter.com/Z3gO3eLHyI — Chennai Super Kings (@ChennaiIPL) April 4, 2021 -
'ఈసారి సీఎస్కే ఆఖరి స్థానానికే పరిమితం'
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభం కాకముందే కొందరు మాజీ క్రికెటర్లు ఈసారి టైటిల్ ఫేవరెట్ ఎవరు ఉంటారు.. ఆఖరిస్థానంలో ఎవరు నిలుస్తారు అని ముందే ఒక అంచనాకు వస్తున్నారు. దీనిలో భాగంగానే న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ ట్విటర్ వేదికగా ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. స్టైరిస్ ఐపీఎల్లో ఆడనున్న ఎనిమిది జట్లు ఏ స్థానంలో ఉంటాయో అంచనా వేస్తూపే టైటిల్ కొల్లగొట్టేది ఎవరు.. ఆఖరిస్థానంలో ఉండేది ఎవరో చెప్పుకొచ్చాడు. స్టైరిస్ చెప్పిన ప్రకారం .. డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరోసారి టైటిల్ నిలబెట్టుకుంటుందని.. ఆ జట్టు ఇప్పుడు అన్ని జట్లకన్నా పటిష్టంగా కనిపిస్తుందని.. అందుకే వారు ఫేవరెట్‌గా మారారని చెప్పాడు. ఇక రెండో స్థానంలో గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎంపిక చేశాడు. ఇక పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్‌కు వచ్చే మిగతా రెండు జట్లని తెలిపాడు. ఇక మరోసారి భారీ అంచనాల నడుమ బరిలోకి దిగుతున్న ఆర్సీబీ ఐదో స్థానానికి పరిమితమవుతుందని జోస్యం చెప్పాడు. కెప్టెన్ మారినా రాయల్స్ తలరాత మారదని.. అయితే వేలంలో కోట్లు పెట్టి కొన్న క్రిస్ మోరిస్‌తో పాటు జోఫ్రా ఆర్చర్లు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారని.. అయినా ఆ జట్టు ఆరవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని తెలిపాడు. ఇక ఆల్‌రౌండర్ల బలంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఏడో స్థానంలో ఉంటుందన్నాడు. గతేడాది సీజన్లో ఆరో స్థానంలో నిలిచిన సీఎస్కే ఈసారి ఆఖరి స్థానానికి పరిమితమవుతందని.. ఆ జట్టు ఈసారి తీవ్రంగా నిరాశపరిచే అవకాశాలు ఉన్నాయని స్టైరిస్ చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ 9న ప్రారంభం కానున్న ఐపీఎల్ 14వ సీజన్లో తొలి మ్యాచ్ డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య జరగనుంది. చదవండి: అతను దూరమవడానికి పుజారా కారణమా! IPL 2021: కెప్టెన్‌గా ధోని.. రైనాకు దక్కని చోటు Let's try this WAY TOO EARLY POWER RANKINGS @IPL 2021 1- @mipaltan 2- @DelhiCapitals 3- @PunjabKingsIPL (auction👍) 4- @SunRisers 5- @RCBTweets 6- @rajasthanroyals (Morris fitness/archer back quickly.Maybe ⬆️) 7- @KKRiders (batting worries) 8- @ChennaiIPL Thoughts — Scott Styris (@scottbstyris) April 2, 2021 -
మ్యాక్సీని కొనుగోలు చేస్తే మూల్యం చెల్లించుకున్నట్లే
ముంబై : ఐపీఎల్ 2021కి సంబంధించి మినీ వేలానికి సన్నద్ధమవుతున్న ఫ్రాంచైజీలు ఇప్పటికే రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాతో పాటు రిలీజ్ చేసిన ఆటగాళ్ల లిస్టును ప్రకటించాయి. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కూడా తమ రిటైన్, రిలీజ్ ఆటగాళ్లను ప్రకటించింది. కింగ్స్ ప్రకటించిన రిలీజ్ జాబితాలో ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపున 13 మ్యాచులాడిన మ్యాక్స్‌వెల్ కేవలం 108 పరుగులు మాత్రమే చేసి దారుణ ప్రదర్శన కనబరిచాడు. మ్యాక్స్‌వెల్ వరుసగా విఫలమవుతున్న వేళ మేనేజ్మెంట్ అతనిపై నమ్మకముంచి అవకాశాలు కల్పించినా తన ఆటతీరులో ఏ మాత్రం మార్పు లేదు. దీనికి తోడు మ్యాక్సీ ప్రదర్శనపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. 2019 డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో కింగ్స్ పంజాబ్ రూ. 10.5 కోట్లు పెట్టి మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: పంత్ నిరాశకు లోనయ్యాడు తాజాగా కివీస్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ మ్యాక్స్‌వెల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్టైరిస్ మాట్లాడుతూ.. 'మాక్స్‌వెల్‌కు ఈసారి జరగబోయే ఐపీఎల్ వేలంలో ఆశించినంత ధర రాకపోవచ్చు... కానీ రాణించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రశ్నకు నా సమాధానాన్ని ఒక్క జవాబుతో చెప్పాలనుకుంటున్నా.. ఏ ఆటగాడైనా సరే వేలంలో 10 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోతే.. వాళ్ల తలలకు కొమ్ములు వస్తాయి.. మ్యాక్సీ విషయంలో ఇప్పటికే నిరుపితమైంది. ఒక ఆటగాడి ప్రదర్శనకు వేలంలో ఎక్కువ ధర ఇస్తే బాగుంటుంది.. కానీ అతని అంతర్జాతీయ ఆటతీరు చూసి మాత్రం తీసుకోవద్దని నా సలహా. ఈ విషయం ఫ్రాంచైజీలు తెలుసుకుంటే రానున్న వేలంలో మ్యాక్స్‌వెల్‌ను కనీస మద్దుత ధరకే ఎక్కువ అమ్ముడుపోయే అవకాశాలు ఉంటాయి. నాకు తెలిసి మ్యాక్స్‌వెల్ ఏనాడు ఐపీఎల్లో మంచి ప్రదర్శన కనబరచలేదు. గత ఐదారేళ్లుగా మ్యాక్సీ ఐపీఎల్ ఆడుతున్నా.. 2014 మినహా ఏనాడు చెప్పుకోదగ్గ విధంగా రాణించలేదు. ఒకవేళ ఏ జట్టైనా అతన్ని కొనుగోలు చేసినా .. మ్యాక్సీ మంచి ప్రదర్శన చేయకపోతే ఆయా జట్టు మేనేజ్మెంట్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.' అంటూ అభిప్రాయపడ్డాడు. చదవండి: ‘బాగా ఆడింది వారైతే నాకెందుకు ఆ క్రెడిట్’ -
వారెవ్వా కమిన్స్.. తిట్టినోళ్లే పొగుడుతున్నారు
అబుదాబి : పాట్ కమిన్స్.. గతేడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు. రూ. 15 కోట్లు వెచ్చించి మరీ కేకేఆర్ కమిన్స్‌ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో కమిన్స్ ఘోరమైన ప్రదర్శన చేశాడు. 3ఓవర్లోనే 16 ఎకానమీ రేటుతో 49 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. కమిన్స్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. కోట్లు పెట్టి కొనుక్కుంటే ఇలా ఆడతాడా.. ఒక అంతర్జాతీయ బౌలర్ ఇవ్వాల్సిన ప్రదర్శన ఇది కాదు.. కమిన్స్ మమ్మల్ని దారుణంగా మోసం చేశాడంటూ తీవ్రంగా తప్పుబడుతూ విమర్శలు సంధించారు. అయితే కమిన్స్ ఇవేవి పట్టించుకోకుండా తన ప్రదర్శనతోనే సమాధానం ఇవ్వాలనుకున్నాడు. కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ కూడా కమిన్స్‌కు మద్దతు ఇచ్చాడు. (చదవండి : 'ఒక్క డకౌట్‌తో నేనేం చెడ్డవాడిని కాను') కమిన్స్ తానేంతో విలువైన ఆటగాడినో సన్‌రైజర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనే నిరూపించాడు. ఈసారి పూర్తి కోటా ఓవర్లు వేసిన కమిన్స్ మొత్తం 4ఓవర్లలో ఒక వికెట్ ఇచ్చి 19 పరుగులు ఇచ్చాడు. కమిన్స్ తన ప్రతీ డెలివరీని దాదాపు 140కిమీ వేగంతో అద్భుతంగా సందించాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ ఓపెనర్ బెయిర్ స్టోను క్లీన్‌బౌల్డ్ చేసిన తీరు చూస్తే ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ అనే పేరును సార్థకం చేసుకున్నాడు. నిజానికి గత మ్యాచ్‌లో కమిన్స్ ఓపెనింగ్ బౌలింగ్ చేసే అవకాశం రాలేదు.. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం కెప్టెన్ కార్తీక్ కమిన్స్ మీద ఉన్న నమ్మకంతో ఓపెనింగ్ బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన ప్రదర్శనతో అదరగొట్టాడు. కమిన్స్ ప్రదర్శనతో ముంబైతో మ్యాచ్‌లో తిట్టినవారే ఇప్పుడు వారెవ్వా కమిన్స్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. (చదవండి :కోట్లు పెట్టి కొన్నాం.. ఇలా అయితే ఎలా!) ఈ నేపథ్యంలో కమిన్స్ ప్రదర్శనపై ఆసీస్ మాజీ స్పీడస్టర్ బ్రెట్ లీ పలు విషయాలు వెల్లడించాడు.' కమిన్స్ ఎంత విలువైన ఆటగాడో ఇప్పుడు అర్థమయి ఉంటుంది. 15 కోట్లు పెట్టి కొన్న కేకేఆర్‌కు రానున్న మ్యాచ్‌ల్లో అతను డబుల్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం. లైన్ అండ్ లెంగ్త్‌తో కమిన్స్ వేసిన ప్రతీ డెలివరీ అద్భుతమే అని చెప్పాలి. ముంబైతో మ్యాచ్‌లో పూర్తిగా లయ తప్పిన బౌలింగ్‌తో కనిపించిన అతను సన్‌రైజర్స్ మ్యాచ్‌లో పాత కమిన్స్‌ను చూపెట్టాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడల్లా వికెట్ తీయడంలో కమిన్స్‌కు ఒక ప్రత్యేకత ఉంటుంది. దానిని రానున్న మ్యాచ్‌ల్లో చూడబోతున్నాం. అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు.(చదవండి : కమిన్స్ విఫలం వెనుక కారణం ఇదే) న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్కాట్ స్టైరిస్ కూడా కమిన్స్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. ' కమిన్స్ నిజంగా ఒక క్లాస్ ప్లేయర్. తనను విమర్శించిన వారికి ప్రదర్శనతోనే సమాధానం ఇచ్చాడు. కోట్లు పెట్టి కొన్న కేకేఆర్‌కు న్యాయం చేశాడు. అతను ఫాంలోకి వచ్చాడంటే అవతలి బ్యాట్స్మెన్లకు ఇక చుక్కలే.. రానున్న మ్యాచ్‌ల్లో కమిన్స్‌తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముంబైతో మ్యాచ్‌లో మూడో బౌలర్‌గా బరిలోకి దిగిన కమిన్స్‌ను ఈ మ్యాచ్‌లో మాత్రం ఓపెనింగ్ బౌలర్‌గా దించి కార్తీక్ మంచి పనిచేశాడు. లైన్ అండ్ లెంగ్త్‌తో అతను వేసిన ప్రతీ బంతి వికెట్ల మీదుగానే వెళ్లింది. కమిన్స్ బౌలింగ్‌లో బెయిర్ స్టో అవుటైన తీరు చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుందని' తెలిపాడు. కాగా కేకేఆర్ తన తర్వాతి మ్యాచ్ సెప్టెంబర్ 30(బుధవారం) రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. -
మూడో స్థానంలో రాయుడు ఆడాలి
న్యూఢిల్లీ: ఐపీఎల్ నుంచి అనూహ్యంగా తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ప్రధాన ఆటగాడు సురేశ్ రైనా స్థానాన్ని అంబటి రాయుడుతో భర్తీ చేయాలని న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టయిరిస్ అభిప్రాయపడ్డాడు. సీఎస్కే జట్టులో మూడో స్థానంలో బరిలో దిగేందుకు రాయుడే సరైనవాడని అతను పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా తానైతే అదే పని చేస్తానని ఈ కివీస్ మాజీ ఆల్‌రౌండర్ వ్యాఖ్యానించాడు. ‘రైనా లాంటి క్లాస్ క్రికెటర్‌ను, నిలకడగా రాణించే ఆటగాడిని, మైదానంలో పరుగుల వరద పారించడంతో పాటు ఫీల్డింగ్‌లో ఆకట్టుకునే ప్లేయర్‌ను వెతకడం చాలా కష్టం. చెన్నై జట్టులో నాణ్యమైన ఆటగాళ్లకు కొదవ లేనప్పటికీ మూడో స్థానంలో కుదురుకునే ప్లేయర్‌ను ఎంచుకోవడం ప్రస్తుతానికి సవాలే. రైనాతో పాటు హర్భజన్ కూడా లేకపోవడం జట్టుపై ప్రభావం చూపనుంది. మూడో స్థానంలో రాయుడు సరైన ఎంపిక. రైనా స్థానాన్ని అతను భర్తీ చేయగలడు. దీనితో పాటు టాపార్డర్‌లో ఇద్దరు విదేశీయులతో పాటు యువ రుతురాజ్ గైక్వాడ్‌ను ఆడిస్తే బావుంటుంది. భారీ హిట్టింగ్ చేసే ఆటగాడిని తీసుకున్నా మంచిదే’ అని స్టయిరిస్ వివరించాడు. -
అంతా బూమ్రానే చేశాడు!
తిరువనంతపురం:భారత్ తో జరిగిన వన్డే, ట్వంటీ 20 సిరీస్ లను కోల్పవడానికి ప్రధాన కారణం పేసర్ జస్ఫ్రిత్ బూమ్రానే అంటున్నాడు న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ స్కాట్ స్టైరిస్. ఒకవేళ భారత జట్టులో బూమ్రా లేకపోతే రెండు సిరీస్ లను 2-1 తో న్యూజిలాండ్ గెలిచేదని స్టైరిస్ అభిప్రాయపడ్డాడు. ' మాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ లో బూమ్రా ఆడకుంటే ఫలితం మరొలా ఉండేది. డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా పేరుగాంచిన బూమ్రా.. న్యూజిలాండ్ నుంచి సిరీస్ ను లాగేసుకున్నాడు'అని ఈ సిరీస్ కు వ్యాఖ్యాతగా వ్యహరించిన స్టైరిస్ పేర్కొన్నాడు. టీ 20 సిరీస్ లో బూమ్రా తొమ్మిది వికెట్ల రాణించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ఎంపికయ్యాడు. ఆఖరి ట్వంటీ 20లో తన చివరి రెండు ఓవర్లను పూర్తి చేసే క్రమంలో బూమ్రా 2/9 తో ఆకట్టుకున్నాడు. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా ఆఖరి వన్డేలో భారత్ ఆరు పరుగులతో విజయం సాధించింది. దాంతో సిరీస్ ను 2-1 తో కైవసం చేసుకుంది. ఆ మ్యాచ్ లో బూమ్రా మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. మార్టిన్ గప్టిల్, రాస్ టేలర్, పించ్ హిట్టర్ మిచెల్ సాంట్నార్ వికెట్లను ఖాతాలో వేసుకుని విజయంలో పాలు పంచుకున్నాడు. -
'ధోనిలో నచ్చింది అదే'
న్యూఢిల్లీ:భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ స్కాట్ స్టైరిస్ ప్రశంసలు కురిపించాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్) భాగంగా వ్యాఖ్యాతగా వ్యహరించేందుకు భారత్ కు విచ్చేసిన స్టైరిస్.. ప్రత్యేకంగా ధోనిని కొనియాడాడు. జట్టులో ప్రతీ ఒక్కరి అభిప్రాయాన్ని వినే కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది ధోనినే అని స్టైరిస్ పేర్కొన్నాడు. సాధారణంగా ప్రతీ ఒక్కరీ అభిప్రాయాన్ని వినే కెప్టెన్లు చాలా తక్కువగా ఉంటారని, ధోని మాత్రం అలా కాకుండా ఎవరు ఏమి చెప్పినా ఓపిగ్గా వింటాడన్నాడు. ఆ గ్రూప్ లో అతను చిన్నవాడా, పెద్దవాడా అనే విషయాన్ని ధోని అస్సలు పట్టించుకోకుండా చెప్పే విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాడన్నాడు. అదే ధోనిలో తనకు నచ్చిన లక్షణమని స్టైరిస్ స్పష్టం చేశాడు. ఇక్కడ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ప్లెమింగ్ ను ఉదాహరించాడు. 'ఫ్లెమింగ్, ధోనిలు ఇద్దరూ వేర్వేరుగా ఆలోచిస్తారు. ఫ్లెమింగ్ కేవలం ఇది చేయాలని ఆదేశిస్తాడు. ఫలానాది నీవు చేయాలని మాత్రమే ఫ్లెమింగ్ చెబుతాడు. ధోని అలా కాకుండా ఎవరు ఏమి చెప్పినా వింటాడు. నీవు కేవలం ఐదు గేమ్ లు మాత్రమే ఆడిన 19 ఏళ్ల ఆటగాడివైనా నీ మాట ధోని వింటాడు'అని స్టైరిస్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఐపీఎల్లో ధోనితో కలిసి పంచుకున్న గత జ్ఞాపకాల్ని స్టైరిస్ గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ మ్యాచ్ లు ఆడేటప్పుడు ప్రతీరోజూ అతని గది తలుపులు ఉదయం మూడు గంటల నుంచే ఓపెన్ చేసి ఉండేవన్నాడు. అందుచేత ధోనిని 3ఎ.ఎమ్ కెప్టెన్ గా అభివర్ణించాడు స్టైరిస్.