
టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన కెప్టెన్సీ నైపుణ్యాలను కలిగి ఉన్నాడని కివీస్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ కొనియాడాడు. రోహిత్ శర్మ తర్వాత భారత కెప్టెన్సీ రేసులో అయ్యర్ ఖచ్చితంగా ముందుంటాడని పేర్కొన్నాడు. అయితే, అయ్యర్ షార్ట్ బాల్స్ ఎదుర్కొవడంలో కాస్త ఇబ్బంది పడుతున్నాడని, దానిని అధిగమిస్తే అతడికి తిరుగు ఉండదని అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఏడాది స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో దుమ్ము రేపిన అయ్యర్.. ఆ తర్వాత వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతున్నాడు.
అంతేకాదు.. ఐపీఎల్-15 సీజన్‌లో అంతగా రాణించలేకపోయిన అయ్యర్.. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్‌లోనూ పూర్తిగా నిరిశపరిచాడు. కాగా స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొంటున్న అయ్యర్.. పేసర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులకు తన వికెట్‌ను చేజార్చుకుంటున్నాడు. ఇక విండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్ అయ్యర్‌కు చాలా కీలకమైనది. ఈ సిరీస్‌లో కూడా అయ్యర్ విఫలమైతే జట్టులో తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో స్టైరిస్ మాట్లాడుతూ.. "అయ్యర్ కెప్టెన్సీ స్కిల్స్ నన్ను ఎంతగానో అకట్టుకున్నాయి. అయ్యర్‌ని భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్‌గా నేను చూడాలనుకుంటున్నాను. అతడొక అద్భుతమైన ఆటగాడు. కొన్ని మ్యాచ్‌ల్లో అతడు విఫలమైనా.. జట్టులో రెగ్యులర్‌గా అవకాశాలు ఇవ్వాలి" అని తెలిపాడు. ఇక అయ్యర్ వీక్‌నెస్ గురించి మాట్లడాతూ.. "అతడు బ్యాటింగ్ చేసేటప్పుడు బౌలర్లు బౌన్సర్‌లతో ఎటాక్ చేయడానికి ప్రయత్నిస్తారు.
ఈ క్రమంలో అయ్యర్ బౌలర్ల ట్రాప్‌లో పడి తన వికెట్‌ను కోల్పోతున్నాడు. కాబట్టి షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనే నైపుణ్యాన్ని శ్రేయాస్ అయ్యర్ పెంచుకోవాల్సి ఉంది. సురేష్ రైనాకి షార్ట్ బాల్ వీక్‌నెస్ ఉన్నట్టే అయ్యర్ కూడా ఉంది. ఈ బలహీనతను అయ్యర్ అధిగమించలేకపోతున్నాడు. ఆ ఒక్క విషయంలో మెరుగుపడితే అయ్యర్‌కు తిరుగుండదు. మిగతా అన్ని లక్షణాలు అయ్యర్‌లో పుష్కలంగా ఉన్నాయి" అని స్టైరిస్ పేర్కొన్నాడు.
చదవండి: WI vs IND 1st ODI: వెస్టిండీస్‌తో భారత్ తొలి పోరు.. ధావన్‌కు జోడీ ఎవరు?
Comments
Please login to add a commentAdd a comment