శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సూపర్ త్రోతో అలరించాడు. ఈ మ్యాచ్‌లో అయ్యర్.. క్రీజ్‌లో కుదురుకున్న కమిందు మెండిస్‌ను (40) అద్భుతమైన డైరెక్ట్ త్రోతో పెవిలియన్‌కు పంపాడు. ఈ విన్యాసాన్ని చూసిన వారంతా ఔరా అనుకున్నారు. శ్రేయస్ సూపర్ త్రోకు సంబంధించిన వీడియో నెట్టింట షికార్లు చేస్తుంది.
What a direct hit from Shreyas Iyer. 🤯🎯pic.twitter.com/VqZeVfbetk
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రోహిత్ శర్మ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సిరీస్‌లో వరుసగా రెండో ఫిఫ్టీ పూర్తి చేశాడు. రోహిత్ సిక్సర్‌తో హాఫ్ సెంచరీని పూర్తి చేయడం విశేషం.19 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 123/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 118 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో కోహ్లి (14), అక్షర్ పటేల్ (7) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment