శ్రీలంకతో మూడో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడింది. 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటై 110 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దునిత్ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు.
తీక్షణ, వాండర్సే తలో రెండు, అషిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (35), సుందర్ (30), విరాట్ కోహ్లి (20), రియాన్ పరాగ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుసాల్ మెండిస్ (59), కమిందు మెండిస్ (23 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది.
లంక ఇన్నింగ్స్‌లో అసలంక 10, సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో ఓటమితో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండు, మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌పై విజయం సాధించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment