మూడో వన్డేలోనూ ఓటమి.. సిరీస్‌ కోల్పోయిన భారత్‌ | IND Vs SL 3rd ODI Match Live Score Updates, Highlights And Top Headlines In Telugu | Sakshi
Sakshi News home page

మూడో వన్డేలోనూ ఓటమి.. సిరీస్‌ కోల్పోయిన భారత్‌

Published Wed, Aug 7 2024 2:45 PM | Last Updated on Wed, Aug 7 2024 8:35 PM

IND VS SL 3rd ODI Live Updates And Highlights

శ్రీలంకతో మూడో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడింది. 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో​కి దిగిన భారత్‌ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటైంది. దునిత్‌ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తీక్షణ, వాండర్సే తలో రెండు, అషిత ఫెర్నాండో ఓ వికెట్‌ పడగొట్టారు. భారత బ్యాటర్లలో రోహిత్‌ శర్మ (35), సుందర్‌ (30), విరాట్‌ కోహ్లి (20), రియాన్ పరాగ్‌ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. పథుమ్‌ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుసాల్‌ మెండిస్‌ (59), కమిందు మెండిస్‌ (23 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో అసలంక 10, సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో రియాన్‌ పరాగ్‌ 3, సిరాజ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో భారత్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండు, మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది.

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
138 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. తీక్షణ బౌలింగ్‌లో వాండర్సేకు క్యాచ్‌ ఇచ్చి వాషింగ్టన్‌ సుందర్‌ (30) ఔటయ్యాడు. 

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
101 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్‌లో శివమ్‌ దూబే (9) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 

ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌
100 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్‌ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్‌లో రియాన్‌ పరాగ్‌ (15) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.శివమ్‌ దూబే (9), వాషింగ్టన్‌ సుందర్‌ క్రీజ్‌లో ఉన్నారు.

86 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా
249 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 82 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. దునిత్‌ వెల్లలగే 4 వికెట్లు తీసి టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టాడు. రోహిత్‌ 35, గిల్‌ 6, విరాట్‌ 20, రిషబ్‌ పంత్‌ 6, శ్రేయస్‌ అయ్యర్‌ 8, అక్షర్‌ పటేల్‌ 2 ఔట్‌ కాగా.. రియాన్‌ పరాగ్‌ 10, శివమ్‌ దూబే 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అషిత ఫెర్నాండో, తీక్షణ తలో వికెట్‌ పడగొట్టారు.

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌.. 37 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. అశిత ఫెర్నాండో బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (6) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. మరో ఎండ్‌లో రోహిత్‌ (13 బంతుల్లో 31; 5 ఫోర్లు, సిక్స్‌) చెలరేగి ఆడుతున్నాడు. 

రాణించిన రియాన్‌ పరాగ్‌.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన శ్రీలంక
కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. ఫలితంగా శ్రీలంక నామమాత్రపు స్కోర్‌కే (248/7) పరిమితమైంది. కెరీర్‌లో తొలి వన్డే ఆడుతున్న రియాన్‌ పరాగ్‌ బంతితో రాణించాడు. రియాన్‌ 9 ఓవర్లలో 54 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. 

కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి తలో వికెట్‌ పడగొట్టారు. శివమ్‌ దూబూ నాలుగు ఓవర్లు వేసి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. మహ్మద్‌ సిరాజ్‌ ధారళంగా పరుగులు సమర్పించుకుని ఓ వికెట్‌ తీశాడు. సిరాజ్‌ 9 ఓవర్లలో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు.

తృటిలో సెంచరీ చేజార్చుకున్న అవిష్క
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంకకు ఓపెనర్లు పథుమ్‌ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. అవిష్క నాలుగు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు.

రాణించిన కుసాల్‌ మెండిస్‌
అవిష్క ఫెర్నాండో ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కుసాల్‌ మెండిస్‌ (59) అర్ద సెంచరీతో రాణించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కుసాల​్‌ ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆఖర్లో కమిందు మెండిస్‌ (23 నాటౌట్‌) వేగంగా పరుగులు సాధించడంతో శ్రీలంక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లంక ఇన్నింగ్స్‌లో అసలంక 10, సధీర సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు.

ఏడో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక
235 పరుగుల వద్ద శ్రీలంక ఏడో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి కుసాల్‌ మెండిస్‌ (59) ఔటయ్యాడు. 

మూడు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక
శ్రీలంక మూడు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. 196 పరుగుల వద్ద లియనాగేను (8) వాషింగ్టన్‌ సుందర్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేయగా.. 199 పరుగుల వద్ద వెల్లలగేను (2) రియాన్‌ పరాగ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 45 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్‌ 207/6గా ఉంది. కుసాల్‌ మెండిస్‌ (41), కమిందు మెండిస్‌ (3) క్రీజ్‌లో ఉన్నారు.

నాలుగో వికెట్‌ డౌన్‌
సధీర సమరవిక్రమ సిరాజ్‌ బౌలింగ్‌లో తానెదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. 39 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్‌ 184/4గా ఉంది.

మూడో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక
183 పరుగుల వద్ద శ్రీలంక మూడో వికెట్‌ కోల్పోయింది. రియాన్‌ పరాగ్‌.. అసలంకను (10) ఎల్బీడబ్ల్యూ చేశాడు.

తృటిలో సెంచరీని చేజార్చుకున్న అవిష్క
లంక ఓపెనర్‌ అవిష్క ఫెర్నాండో తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. 96 పరుగుల వద్ద రియాన్‌ పరాగ్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 36 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్‌ 173/2గా ఉంది. కుసాల్‌ మెండిస్‌ (28), అసల​ంక (2) క్రీజ్‌లో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన శ్రీలంక
89 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి నిస్సంక (45) ఔటయ్యాడు. అవిష్క ఫెర్నాండో (43), కుసాల్‌ మెండిస్‌ క్రీజ్‌లో ఉన్నారు.

14 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్‌ 65/0
ఇన్నింగ్స్‌ ఆరంభంలో నత్త నడకలా సాగిన శ్రీలంక బ్యాటింగ్‌ ప్రస్తుతం మెరుగుపడింది. ఆ జట్టు 14 ఓవర్ల అనంతరం వికెట్‌ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో 26, నిస్సంక 38 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

నత్త నడకన సాగుతున్న శ్రీలంక బ్యాటింగ్‌
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న శ్రీలంక నిదానంగా ఆడుతుంది. వారి ఇన్నింగ్స్‌ నత్త నడకు తలపిస్తుంది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 28/0గా ఉంది.  నిస్సంక 19, అవిష్క ఫెర్నాండో 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక
కొలొంబో వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగింది. కేఎల్‌ రాహుల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ స్థానాల్లో రిషబ్‌ పంత్‌, రియాన్‌ పరాగ్‌ తుది జట్టులోకి వచ్చారు. 

మరోవైపు లంక సైతం ఓ మార్పు చేసింది. అఖిల ధనంజయ స్థానంలో మహేశ్‌ తీక్షణ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఈ సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. తొలి వన్డే టైగా ముగియగా.. రెండో వన్డేలో లంక విజయం సాధించింది.

తుది జట్లు..

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్‌), శ్రేయస్ అయ్యర్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

శ్రీలంక: పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్‌కీపర్‌), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్‌), జనిత్ లియానాగే, కమిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement