IND VS AUS: నిప్పులు చెరిగిన బౌలర్లు.. తొలి రోజు టీమిండియాదే | BGT 2024 IND Vs AUS 1st Test Day 1 Live Score Updates, Highlights And Top News Headlines In Telugu | Sakshi
Sakshi News home page

BGT, IND Vs AUS 1st Test, Day 1 Live Updates: నిప్పులు చెరిగిన బౌలర్లు.. తొలి రోజు టీమిండియాదే

Published Fri, Nov 22 2024 7:52 AM | Last Updated on Fri, Nov 22 2024 3:41 PM

BGT: IND VS AUS 1st Test Day 1 Live Updates And Highlights

IND VS AUS 1st Test Day 1 Live Updates:
ముగిసిన తొలి రోజు ఆట..
పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆతిథ్య జట్టుపై టీమిండియా పై చేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో అలెక్స్‌ క్యారీ(19), మిచెల్‌ స్టార్క్‌(6) పరుగులతో ఉన్నారు.

ఇక భారత బ్యాటర్లు నిరాశపరిచినప్పటికి బౌలర్లు మాత్రం నిప్పులు చెరిగారు. కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రా 4 వికెట్లతో కంగారులను దెబ్బతీయగా.. సిరాజ్‌ రెండు, హర్షిత్‌ రానా ఒక్క వికెట్‌ సాధించారు. అంతకుముందు టీమిండియా కేవలం 150 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్ర ఆటగాడు నితీష్‌ కుమార్‌ రెడ్డి(41) అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడితో వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌(37) మరోసారి విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆసీస్‌ బౌలర్లలో హాజిల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్‌, కమ్మిన్స్‌, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు సాధించారు.

ఏడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
కెప్టెన్‌ కమిన్స్‌ రూపంలో ఆస్ట్రేలియా ఏడో వికెట్‌ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి కమిన్స్‌(3) పెవిలియన్‌ చేరాడు. స్టార్క్‌ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్‌ స్కోరు: 59/7 (24.4). 

ఆరో వికెట్‌ డౌన్‌..
భారత బౌలర్లు నిప్పులు చేరుగుతున్నారు. లబుషేన్‌ రూపంలో ఆస్ట్రేలియా ఆరో వికెట్‌ కోల్పోయింది. రెండు పరుగులు చేసిన లబుషేన్‌.. సిరాజ్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 23 ఓవర్లకు ఆసీస్‌ స్కోరు: 48-6
ఆసీస్‌ ఐదో వికెట్‌ డౌన్‌..
38 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఐదో వికెట్‌ ​కోల్పోయింది. 6 పరుగులు చేసిన మిచెల్‌ మార్ష్‌.. సిరాజ్‌ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి అలెక్స్‌ క్యారీ వచ్చాడు. 18 ఓవర్లకు ఆసీస్‌ స్కోరు: 39-5

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
ఆస్ట్రేలియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ట్రావిస్‌ హెడ్‌.. హర్షిత్‌ రానా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

కష్టాల్లో ఆసీస్‌.. 19 పరుగులకే 3 వికెట్లు డౌన్‌
19 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. బుమ్రా వరుస బంతుల్లో ఉస్మాన్‌ ఖ్వాజా (8), స్టీవ్‌ స్మిత్‌ను (0) ఔట్‌ చేశాడు. 7 ఓవర్ల అనంతరం ఆస్ట్రేలియా స్కోర్‌ 19/3గా ఉంది. ట్రవిస్‌ హెడ్‌, లబూషేన్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
నాథన్‌ మెక్స్వినీ రూపంలో ఆసీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. పెర్త్‌ టెస్టుతో అరంగేట్రం చేసిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. 13 బంతులు ఎదుర్కొని 10 పరుగులు చేయగలిగాడు. బుమ్రా బౌలింగ్‌ బౌల్డ్‌ అయి పెవిలియన్‌ చేరాడు. ఖవాజా , లబుషేన్‌ క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లలో ఆసీస్‌ స్కోరు: 19-1.

150 పరుగులకు ఆలౌటైన టీమిండియా
150 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (41) చివరి వికెట్‌గా వెనురిగాడు. కమిన్స్‌ బౌలింగ్‌లో ఖ్వాజాకు క్యాచ్‌ ఇచ్చి నితీశ్‌ ఔటయ్యాడు. 

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
బుమ్రా రూపంలో టీమిండియా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి బుమ్రా ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌ చేరాడు. సిరాజ్‌ క్రీజులోకి రాగా.. నితీశ్‌ రెడ్డి 35 పరుగులతో ఆడుతున్నాడు.  భారత్‌స్కోరు: 144-9(49)

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
128 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో లబూషేన్‌ క్యాచ్‌ పట్టడంతో హర్షిత్‌ రాణా (7) ఔటయ్యాడు. నితీశ్‌ కుమార్‌కు (27) జతగా బుమ్రా క్రీజ్‌లోకి వచ్చాడు. 

ఏడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. పంత్‌ ఔట్‌
121 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్‌ కోల్పోయింది. కమిన్స్‌ బౌలింగ్‌లో స్టీవ్‌ స్మిత్‌కు క్యాచ్‌ ఇ​చ్చి రిషబ్‌ పంత్‌ (37) ఔటయ్యాడు. నితీశ్‌కుమార్‌ రెడ్డికి (27) జతగా హర్షిత్‌ రాణా క్రీజ్‌లోకి వచ్చాడు.

ఆరో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
73 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది. మిచ్‌ మార్ష్‌ బౌలింగ్‌లో అలెక్స్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి వాషింగ్టన్‌ సుందర్‌ (4) పెవిలియన్‌ బాట పట్టాడు. రిషబ్‌ పంత్‌కు (17) జతగా నితీశ్‌ కుమార్‌ రెడ్డి క్రీజ్‌లోకి వచ్చాడు. 

59 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా
59 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు​ కష్టాల్లో పడిపోయింది టీమిండియా. 59 పరుగుల వద్ద మిచ్‌ మార్ష్‌ బౌలింగ్‌లో లబూషేన్‌కు క్యాచ్‌ ఇచ్చి జురెల్‌ (11) ఔటయ్యాడు. రిషబ్‌ పంత్‌కు (10) జతగా వాషింగ్టన్‌ సుందర్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 
 

కష్టాల్లో టీమిండియా
లంచ్‌ బ్రేక్‌ సమయానికి టీమిండియా స్కోరు: 51/4 (25)
పంత్‌ పది, జురెల్‌ నాలుగు పరుగులతోక్రీజులో ఉన్నారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
47 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో అలెక్స్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి కేఎల్‌ రాహుల్‌ (26) ఔటయ్యాడు. రిషబ్‌ పంత్‌కు (10) జతగా ధృవ్‌ జురెల్‌ క్రీజ్‌లోకి వచ్చాడు.

32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా
32 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో ఉస్మాన్‌ ఖ్వాజాకు క్యాచ్‌ ఇచ్చి విరాట్‌ కోహ్లి (5) ఔటయ్యాడు. 

రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
14 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ అలెక్స్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి దేవ్‌దత్‌ పడిక్కల్‌ డకౌటయ్యాడు. కేఎల్‌ రాహుల్‌కు జతగా విరాట్‌ కోహ్లి క్రీజ్‌లోకి వచ్చాడు.  

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. 5 పరుగుల టీమ్‌ స్కోర్‌ వద్ద యశస్వి జైస్వాల్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో నాథన్‌ మెక్‌స్వీనికి క్యాచ్‌ని జైస్వాల్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌
పెర్త్‌లోని అప్టస్‌ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.  ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హర్షిత్‌ రాణా అరంగేట్రం చేయనున్నారు. ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్‌ నాథన్‌ మెక్‌స్వీని డెబ్యూ చేయనున్నాడు. 

తుది జట్లు..

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ మెక్‌స్వీని, మార్నస్ లబూషేన్‌, స్టీవెన్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ(వికెట​్‌కీపర్‌), పాట్ కమిన్స్(కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్‌వుడ్

భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్‌), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్‌), మహ్మద్ సిరాజ్
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement