
కొలంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి (టాస్ గెలిచి) నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు.
భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డే టైగా ముగిసిన విషయం తెలిసిందే.