
IND VS SL 2nd ODI Updates And Highlights: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ను లంక స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే (10-0-33-6) దారుణంగా దెబ్బతీశాడు. వాండర్సేకు అసలంక (6.2-2-20-3) కూడా తోడవ్వడంతో టీమిండియా 208 పరుగులకు (42.2 ఓవర్లలో) ఆలౌటైంది.
ఛేదనలో రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించినప్పటికీ.. భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్‌తో పాటు శుభ్‌మన్ గిల్ (35), అక్షర్ పటేల్ (44) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విరాట్ (14), శివమ్ దూబే (0), శ్రేయస్ అయ్యర్ (7), కేఎల్ రాహుల్ (0) దారుణంగా విఫలమయ్యారు.
ఓటమి దిశగా టీమిండియా
190 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అసలంక బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ (15) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా
అసలంక అద్భుతమైన క్యాచ్ పట్టి అక్షర్ పటేల్‌ను (44) పెవిలియన్‌కు పంపాడు.
వాండర్సే మాయాజాలం
జెఫ్రీ వాండర్సే తన అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో టీమిండియాను ఇరుకున పడేశాడు. ఇప్పటికే నాలుగు వికెట్లు పడగొట్టిన అతను.. స్వల్ప వ్యవధిలో మరో రెండు వికెట్లు కూల్చాడు. శ్రేయస్ అయ్యర్ (7), కేఎల్ రాహుల్ (0) 14 పరుగుల వ్యవధిలో పెవిలియన్ బాట పట్టారు. 26 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 155/6గా ఉంది. అక్షర్ పటేల్ (27), వాషింగ్టన్ సుందర్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే మరో 86 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి.
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కోహ్లి ఔట్
123 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్‌లో విరాట్ కోహ్లి (14) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ (7), శ్రేయస్ (7) క్రీజ్‌లో ఉన్నారు. వాండర్సేకు ఇది నాలుగో వికెట్.
116 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయిన భారత్
116 పరుగుల వద్ద భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ (35), శివమ్ దూబేను (0) వాండర్సే ఒకే ఓవర్‌లో ఔట్ చేశాడు. 19 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 123/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 118 పరుగులు చేయాల్సి ఉంది.
A six over extra cover to bring up his fifty. 🔥
- Rohit Sharma in a crazy touch! pic.twitter.com/hI57R7T7Ik— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
97 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్‌లో నిస్సంక సూపర్ క్యాచ్ పట్టడంతో రోహిత్ శర్మ (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) వెనుదిరిగాడు. 14 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 102/1గా ఉంది. శుభ్‌మన్ గిల్ (31), విరాట్ కోహ్లి (5) క్రీజ్‌లో ఉన్నారు.
సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్
241 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రోహిత్ శర్మ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సిరీస్‌లో వరుసగా రెండో ఫిఫ్టీ పూర్తి చేశాడు. రోహిత్ సిక్సర్‌తో హాఫ్ సెంచరీని పూర్తి చేయడం విశేషం. 10 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 76/0గా ఉంది. రోహిత్‌కు (51) జతగా శుభ్‌మన్ గిల్ (23) క్రీజ్‌లో ఉన్నాడు.
టీమిండియా టార్గెట్ 241
కొలంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి (టాస్ గెలిచి) నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక
208 పరుగుల వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెల్లలగే (39) ఔటయ్యాడు.208 పరుగుల వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెల్లలగే (39) ఔటయ్యాడు.
ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక
136 పరుగుల వద్ద శ్రీలంక మరో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి అసలంక (25) ఔటయ్యాడు.
136 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంక
శ్రీలంక 136 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి జనిత్ లియనాగే (12) ఔటయ్యాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక
111 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి సమరవిక్రమ (14) ఔటయ్యాడు.
వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసిన సుందర్
వాషింగ్టన్ తన స్పెల్ రెండో ఓవర్ చివరి బంతికి, మూడో ఓవర్ తొలి బంతికి వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ చివరి బంతికి ఆవిష్క ఫెర్నాండో (40).. 19వ ఓవర్ తొలి బంతికి కుశాల్ మెండిస్ (30) ఔటయ్యారు. 19 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 80/3గా ఉంది. చరిత్ అసలంక (1), సమరవిక్రమ (0) క్రీజ్‌లో ఉన్నారు.
తొలి బంతికే వికెట్ కోల్పోయిన శ్రీలంక
తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పథుమ్ నిస్సంక ఔటయ్యాడు.
WICKET ON THE FIRST BALL BY MOHAMMAD SIRAJ. 🔥
- Siraj, a beast against Sri Lanka!pic.twitter.com/7i7IeWcsGr— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
కొలొంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), కమిందు మెండిస్, జనిత్ లియానగే, దునిత్ వెల్లలాగే, అకిలా దనంజయ, అసిత ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సే
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్