బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్‌ విడుదల | India Tour Of Bangladesh 2025 For White Ball Series, Schedule Announced | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్‌ విడుదల

Published Tue, Apr 15 2025 3:04 PM | Last Updated on Tue, Apr 15 2025 3:49 PM

India Tour Of Bangladesh 2025 For White Ball Series, Schedule Announced

ఈ ఏడాది ఆగస్ట్‌లో భారత్‌ క్రికెట్‌ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (ఏప్రిల్‌ 15) ప్రకటించింది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. రెండు వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆగస్ట్‌ 17న వన్డే సిరీస్‌.. 26న టీ20 సిరీస్‌ మొదలవుతాయి.

వన్డే సిరీస్‌ షెడ్యూల్‌..
తొలి వన్డే – ఆదివారం, ఆగస్టు 17, మిర్పూర్‌
రెండో వన్డే – బుధవారం, ఆగస్టు 20, మిర్పూర్‌
మూడో వన్డే – శనివారం, ఆగస్టు 23, చట్టోగ్రామ్‌

టీ20 సిరీస్‌ షెడ్యూల్..
తొలి T20I – మంగళవారం, ఆగస్టు 26, చట్టోగ్రామ్‌ల
రెండో T20I – శుక్రవారం, ఆగస్టు 29, మిర్పూర్‌ల
మూడు T20I – ఆదివారం, ఆగస్టు 31, మిర్పూర్‌

కాగా, భారత క్రికెటర్లంతా ప్రస్తుతం ఐపీఎల్‌ 2025తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది క్యాష్‌ రిచ్‌ లీగ్‌ మే 25న ముగుస్తుంది. అనంతరం భారత్‌ జూన్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్‌ ఐదు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడనుంది.

ఇంగ్లండ్‌లో భారత పర్యటన షెడ్యూల్‌..
తొలి టెస్ట్‌- జూన్‌ 20-24
రెండో టెస్ట్‌- జులై 2-6
మూడో టెస్ట్‌- జులై 10-14
నాలుగో టెస్ట్‌- జులై 23-27
ఐదో టెస్ట్‌- జులై 31-ఆగస్ట్‌ 3

ఈ సిరీస్‌ తర్వాతే భారత్‌ బంగ్లాదేశ్‌ పర్యటనకు బయల్దేరుతుంది.

అనంతరం భారత జట్టు సెప్టెంబర్‌ నెలంతా ఖాళీగా ఉండి అక్టోబర్‌ 2 నుంచి స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడుతుంది.

వెస్టిండీస్‌ సిరీస్‌ షెడ్యూల్‌..
తొలి టెస్ట్‌- అక్టోబర్‌ 2-6 (అహ్మదాబాద్‌)
రెండో టెస్ట్‌- అక్టోబర్‌ 10-14 (కోల్‌కతా)

ఈ సిరీస్‌ తర్వాత భారత్‌ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుంది. ఈ పర్యటనలో భారత్‌ 3 వన్డేలు, 5 టీ20లు జరుగనున్నాయి.

ఆస్ట్రేలియాలో భారత్‌ పర్యటన షెడ్యూల్‌..
అక్టోబర్‌ 19- తొలి వన్డే (డే అండ్‌ నైట్‌)- పెర్త్‌
అక్టోబర్‌ 23- రెండో వన్డే (డే అండ్‌ నైట్‌)- అడిలైడ్‌
అక్టోబర్‌ 25- మూడో వన్డే (డే అండ్‌ నైట్‌)- సిడ్నీ

అక్టోబర్‌ 29- తొలి టీ20- కాన్‌బెర్రా
అక్టోబర్‌ 31- రెండో టీ20- మెల్‌బోర్న్‌
నవంబర్‌ 2- మూడో టీ20- హోబర్ట్‌
నవంబర్‌ 6- నాలుగో టీ20- గోల్డ్‌ కోస్ట్‌
నవంబర్‌ 8- ఐదో టీ20- బ్రిస్బేన్‌

ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత్‌ స్వదేశంలో సౌతాఫ్రికాతో మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ ఆడుతుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా రెండు టెస్ట్‌లు.. మూడు వన్డేలు.. ఐదు టీ20లు ఆడనుంది. 

భారత్‌లో సౌతాఫ్రికా పర్యటన షెడ్యూల్‌..
తొలి టెస్ట్‌- నవంబర్‌ 14-18 (న్యూఢిల్లీ) 
రెండో టెస్ట్‌- నవంబర్‌ 22-26 (గౌహతి)

తొలి వన్డే- నవంబర్‌ 30 (రాంచీ)
రెండో వన్డే- డిసెంబర్‌ 3 (రాయ్‌పూర్‌)
మూడో వన్డే- డిసెంబర్‌ 6 (వైజాగ్‌)

తొలి టీ20- డిసెంబర్‌ 9 (కటక్‌)
రెండో టీ20- డిసెంబర్‌ 11 (ఛండీఘడ్‌)
మూడో టీ20- డిసెంబర్‌ 14 (ధర్మశాల)
నాలుగో టీ20- డిసెంబర్‌ 17 (లక్నో)
ఐదో టీ20- డిసెంబర్‌ 19 (అహ్మదాబాద్‌)
 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement